Sri Devi Bhagavatam-1
Chapters
అథ వింశో%ధ్యాయః జనమేజయః : సంశయో%యం మహానత్ర జాతమాత్రః శిశుస్తథా | ముక్తః కేన గృహీతో%సావేకాకీ విజనేవనే.
1 కా గతి స్తస్య బాలస్య జాతా సత్యవతీ సుత | వ్యాఘ్రసంహాదిభి ర్హిం సై#్ర ర్గృహీతోనాతి బాలకః. 2 వ్యాసః : లక్ష్మీ నారాయణౌ తస్మాత్థ్సా నాచ్చ చలితౌ యదా | తదైవ తత్ర చంపాఖ్యః ప్రాప్తో విద్యాధరః కిల,
3 విమానవరం మరూఢః కామిన్యాసహితో నృప | మదనాలసయా కామం క్రీడమానో యదృచ్ఛయా.
4 విలోక్య తం శిశుం భూమావేకాకిన మనుత్తమమ్ | దేవపుత్ర ప్రతీకాశం రమమాణం యథాసుఖమ్.
5 విమానాత్తరసోత్తీర్య చంపకస్తం శిశుం జవాత్ | జగ్రాహ చ ముదం ప్రాప నిధిం ప్రాప్యయథా%ధనః.
6 గృహీత్వా చంపకః ప్రాదాద్దేవ్యైతం మదనోపమమ్ | మదనాలసాయై తం బాలం జాతమాత్రం మనోహరమ్.
7 సా గృహీత్వా శిశుం ప్రేవ్ణూ సరోమాంచా సవిస్మయా | సుఖం చుచుంబ బాలస్య కృత్వాతు హృదయే భృశమ్.
8 ఆలింగిత శ్చుంబిత శ్చ తయా%సౌ ప్రీతిపూర్వకమ్ | ఉత్సంగేచ కృత స్తన్వ్యా పుత్రభావేన భారత
9 కృత్వా%ంకే తౌ సమారూఢౌ విమానం దంపతీ ముదా | పతిం పప్రచ్ఛ చార్వంగీ ప్రహస్వ మదనాలసా.
10 కస్యాయం బాలకః కాంత త్యక్తః కేన చ కాననే | పుత్త్రో%యం మమ దైవేన దత్త స్త్ర్యంబక పాణినా.
11 చంపక ఉవాచ : ప్రియే గత్వా%ద్య పృచ్ఛేయం శక్రం సర్వజ్ఞమాశువై | దేవో వా దానవో వా%పి గంధర్వో వా శిశుః కిల.
12 తేనాజ్ఞ ప్తః కరిష్యామి పుత్రం ప్రాప్తం వనాదముమ్ | అపృష్ట్వానైవ కర్తవ్యం కార్యం కించిన్మయాధ్రువమ్.
13 ఇత్యుక్త్వా తాం గృహీత్వాతం విమానేనాథ చంపకః | య¸° శక్రపురం తూర్ణం హర్షేణోత్ఫుల్లలోచనః.
14 ఇరువదవ యధ్యాయము ఏకవీరుని జన్మ వృత్తాంతము జనమేజయు డిట్లనెను : వ్యాసమహర్షీ ! నాకొక పెద్ద సందేహము గల్గుచున్నది. దానిని దీర్చుము. ఆ బాలుడట్లు పుట్టిన పిదప నిర్జన ప్రదేశమున నొంటిగ విడువబడెను గదా! అతనిని తిరిగి యెవరు తీసికొనిరి? ఆ యర్భకుని గతి యేమయ్యెను? అతడు వ్యాఘ్ర సింహాది క్రూర జంతువుల బారికి చిక్కలేదు గదా? వ్యాసుడిట్లనెను : అట్లు శ్రీలక్ష్మీనారాయణులా బాలునచట విడిచి వెళ్ళిన పిమ్మట చంపకుడను విద్యాధరుడచ్చోటి కేగుదెంచెను. అతడు మదనాలసయను తన మదపతిని గూడి యథేచ్ఛముగ విమానముపై క్రీడల మునిగి తేలుచుండెను. అతడంతలో భూమిపై నొంటిగ సుఖముగ నాడుకొనుచు - దేవపుత్రుని బోలిన యొక శిశువును గాంచెను. చంపకుడు వెంటనే విమానము దిగి శిశువు నెత్తుకొని పేదవాడు పెన్నిధిని గాంచినట్లు పరమానందమొందెను. అతడు సద్యోజాతుడు సుమనోహరుడు మారసుకుమారుడునైన బాలునిగొని మదనాలసకిచ్చెను. ఆమె ప్రేమతో బాలునెత్తుకొని గుండె గగుర్పొడువ నెడదకు హత్తుకొని యతని చిన్నారి ముద్దుల మోము ముద్దిడుకొనెను. అటులామె బాలుని తన యక్కున జేర్చి ముద్దాడి వాత్సల్యముతో పుత్రభావమున నతని వొడిలో కూర్చుండబెట్టుకొనెను. వారు విమానమెక్కి బాలుని తొడపై నిడుకొనిరి. అపుడు మదనాలస నవ్వి తన పతికిట్లనెను : కాంతుడా! ఈ బాలకుడెవనివాడు? ఈ వనమున నితని నెవరు వదలిరి? నీ కితడు శివుడు తన చేతితో ప్రసాదించిన పుత్రదానమని తోచుచున్నది. చంపకు డిట్లనెను : ప్రియా! మనమిపుడు వెంటనే సర్వజ్ఞుడగు ఇంద్రు నడుగుదము. ఇతడు దేవ - దానవ - గంధర్వులలో నెవడో కావలయు. మన మింద్రుని యానతి వడసి దొరకిన యితనిని పుత్రునిగ స్వీకరింతుము. అతని నడుగక చేయుట నాకు మంచిదిగా దోచదు అని చంపకుడు భార్యతో బాలునెత్తుకొని త్వరితముగ నింద్రపురి కేగెను. ప్రణమ్య పాదయోః ప్రీత్యా చంపక స్తు శచీపతిమ్ | నివేద్య బాలకం ప్రాహ కృతాంజలి పుటః స్థితః. 15 దేవదేవ మయాలబ్ధ స్తీర్థే పరమపావనే | కాళిందీ తమసా సంగే బాలకో%యం స్మర ప్రభః. 16 కస్యాయం బాలకః కాంత కథం త్యక్తః శచీపతే | ఆజ్ఞా చేత్తవ దేవేశ | కుర్వే%హం బాలకం సుతమ్. 17 అతీవ సుందరో బాలః ప్రియాయా వల్లభః సుతః కృత్రిమ స్తు సుతః ప్రోక్తో ధర్మశాస్త్రేషు సర్వథా. 18 ఇంద్ర ఉవాచ : పుత్రో%యం వాసుదేవస్య వాజిరూపధరస్యహ | హైహయో%యం మహాభాగ లక్ష్మ్యాం జాతః పరంతపః 19 ఉత్పాదితో భగవతా కార్యార్థం కిల బాలకః | దాతుం నృపతయే నూనం యయాతి తనయాయ చ. 20 హరిణా ప్రేరితః సో%ద్య రాజా పరమధార్మికః | ఆగమిష్యతి పుత్రార్థం తీర్థే తస్మి న్మనోరమే. 21 తావత్త్వం గచ్ఛ తత్రైవ గృహీత్వా బాలకం శుభమ్ | యావన్నయాతి నృపతి ర్గ్రహీతుం హరిణరితః. 22 గత్వా తత్ర విముంచైనం ఏలంబం మాకృథా వర | అధృష్ట్వా బాలకం రాజా దుఃఃతశ్చ భవిష్యతి. 23 తస్మాచ్చంపక ముంచైనం రాజా ప్రాప్నోతు పుత్రకమ్ | ఏకవీరేతి నామ్నా%యం ఖ్యాతః స్యాత్పృథి వీతలే. 24 ఇతి తస్య వచః శ్రుత్వా చంపక స్త్వరయా%న్వితః | జగామ పుత్రమాదాయ స్థలే తస్మి న్మహీపతే. 25 ముమోచ బాలకం తత్రయత్ర పూర్వ స్థితోహ్యభూత్ | ఆరుహ్య స్వవిమానంతు య¸°స్వాశ్రమమండలమ్. 26 తదైవ కమలాకాంతో లక్ష్మ్యా సహ జగద్గురుః | విమానవర మారూఢో జగామ నృపతిం ప్రతి. 27 దృష్ట స్తదా తేన నృపేణ విష్ణుః సముత్తరం స్తత్ర విమాన ముఖ్యాత్ | జహర్ష రాజా హరిదర్శనేన పపాత భూమౌ ఖలు దండవచ్చ. 28 అచట చంపకు డింద్రుని పాదములపైబడి లేచి బాలునింద్రుని కిచ్చి చేతులు జోడించి యిట్లనెను : దేవదేవా! ఈ మార సుందరుడగు కుమారుడు పరమపావన తీర్థమగు కాళిందీ తమసల సంగమమున నాకు దైవ యోగమున దొరకెను. శచీపతీ! దేవేశా! ఈ పిల్లవా డెవనివాడు? ఎవరిచే విడువబడెను? నీ యానతియైనచో నితనిని సుతునిగ స్వీకరింపగలను. ఈ చిన్నారి బాలుడు నా ప్రియురాలికి ముద్దుగనున్నాడు. ధర్మశాస్త్రములందు కృత్రిమ పుత్రుని బడయవచ్చునని కదలదు గదా! ఇంద్రు డిట్లనెను : మహాత్మా! ఈ బాలుడు హయరూపములు దాల్చిన లక్ష్మీనారాయణుల హృదయానందమువలన నుద్భవించెను. ఇతనిని హైహయుడందురు. యయాతి కుమారుడగు తుర్వసున కిచ్చుటకు భగవంతు డీ దక్షుడగు బాలుని గనెను. తుర్వసుడు పరమధార్మికుడగు రాజు. అతడు హరి ప్రేరితుడై పుత్రార్థియై యీ పవిత్ర తీర్థమునకు రాగలడు. అతడు హరి ప్రేరణచే నచటికి వచ్చు లోపల నీవీ చక్కని బాలుని గొని యచటి కేగుము. అచటి కేగి నీవితని నక్కడ నుంచుము. నీవు జాగు సేసినచో రాజు బాలకు నచట గానక దుఃఃంపగలడు. చంపకా! నీ వితనిని అట వదలిపెట్టుము. ఆ రాజీ పుత్రుని గ్రహించును. ఇతడు భూమిపై నేకవీర నామమున వాసి కెక్కగలడు అను నింద్రుని మాటలు విని చంపకుడు ముద్దులపట్టిని దీసికొని త్వరగ నచ్చోటికి వెళ్ళెను. ఆ బాలుడు మున్నున్నచోట నతనిని వదలి చంపకుడు విమానమెక్కి తనదారిని తాను వెళ్ళెను. అంతలో జగద్గురువగు లక్ష్మీపతి లక్ష్మిని గూడి విమానమెక్కి రాజున్నచోటి కరిగెను. హరి రాజునుగాంచి విమానము దిగెను. రాజును హరిని సందర్శించి సంతోషించి దండ ప్రణామము లాచరించెను. ఉత్తిష్ఠ వత్సేతి హరిః పతంత మాశ్వాసయ ద్భూమిగతం స్వభక్తమ్ | సో%ప్యుత్సుకో వాసుదేవం పురఃస్థం తుష్టాన భక్త్యాముఖరీకృతో%థ 29 దేవాధిదేవాఃలలోకనాధే కృపానిదే లోకగురో రమేశ | మందస్య మే తే కిల దర్శనం యత్సుదుర్లభం యోగిజనై రలభ్యమ్. 30 యే నిః స్పృహాస్తే విషయై రపేతా స్తేషాం త్వదీయం ఖలు దర్శనం స్యాత్ | ఆశాపరో%హం భగవన్ననంత యోగ్యో న తే దర్శనే దేవదేవ. 31 ఇతి స్తుత స్తేన నృపేణ విష్ణు స్తమాహ వాక్యేన సుధామయేన | వృణీష్వరాజ న్మనసే ప్సితం తే దదామి తుష్ట స్తపసా తవేతి. 32 తతో నృప స్తం ప్రణి పత్య పాదయోః ప్రోవాచ విష్ణు పురతః స్థితం చ | తప స్తు తప్తం హి మయాసుతార్థే పుత్రం దదస్వాత్మ సమం మురారే. 33 శ్రుత్వా నృప ప్రార్థిత మాదిదేవ స్తమాహ రాజాన మమోఘవాక్యమ్ | యయాతి సూనోవ్రజతత్ర తీర్థే కళింద కన్యాతమసా ప్రసంగే. 34 మయా%ద్య పుత్ర స్తు యథేప్సిత స్తే తత్రైవ ముక్తో%స్త్య మిత ప్రభావః. లక్ష్మ్యాః ప్రసూతో మమ వీర్యజ శ్చ కృతస్త వార్థే%థ గృహాణరాజన్. 35 శ్రుత్వా హరే ర్వాక్య మతీవ మృష్టం సంతుష్ట చిత్తః ప్రబభూవ రాజా | హరిస్తు దత్త్వేతి వరం జగామ వైకుంఠలోకం రమయాయుతశ్చ. 36 గతే హరౌ సో%థ యయాతి సూనుర్యయావనుదాత రథేనరాజా | ప్రేమాన్విత స్తత్ర సుతో%స్తి యత్ర వచో నిశ##మ్యేతి జనార్దనస్య. 37 సతత్రగత్వా%తి మనోహరం తం దదర్శ బాం భువి ఖేలమానమ్ | ముఖే నివేశ్యైకకరేణ కృత్వా శ్లక్షం పదాంగుష్ఠ మనన్యసత్త్వః. 38 తం వీక్ష్య పుత్రం మదనస్వరూపం నారాయణాంశం కమలా ప్రసూతమ్ | హరి ప్రభావం హరివర్మనా మా హర్ష ప్రపుల్లానన పంకజో%భూత్. 39 గృహ్ణ స్సువేగా త్కరపంకజాభ్యాం బభూవ ప్రేమార్ణవ మగ్నదేహః | మూర్ధన్యుపాఘ్రాయ ముదా%న్వితో%సౌ ననందరాజా సుతమాలిలింగ. 40 ముఖం సమీక్ష్యాతి మనోహరం తమువాచ నేత్రాంబు నిరుద్ధ కంఠః | దత్తో%సి దేవేన జనార్దానేన మాత్రా హి పుత్రా మమ దుఃఖభీతేః. 41 తప్తం మయా పుత్ర తప స్తవార్థే సుదుష్కరం వర్షశతం చ పూర్ణమ్ | తే నైవ తుష్ఠేన రమా ప్రియేణ దత్తో%సి సంసారసుఖోదయాయ. 42 మాతా రమా త్వాం తనుజం మదర్థే త్యక్త్వాగతా సాహరిణా సమేతా | ధన్యాతుసా యా ప్రహసంత మంకే కృత్వాసుతంత్వాం ముదితాననా స్యాత్. 43 అట్లు నేలపై పడిన భక్తుని వత్సా ! లే లెమ్మని హరి యతని నూరడించి లేపెను. అతడును లేచి పరమానందముతో తన ముందున్న హరిని ప్రియవాక్కులతో నీ విధముగ సంస్తుతించెను : 'ఓ దేవాధిదేవా! అఃలలోకనాథా! లోక గురూ! రమేశా! వరమయోగులకును పరమ దుర్లభ##మైన నీ దివ్యదర్శన మీజడున కొసంగితివి. నీ దివ్యదర్శనము విషయలోలతలేని నిష్కాములకే సాధ్యము. దేవదేవా! నే నా శాపాశబద్దుడను. నేను నీ దర్శనమునకు దగనివాడను అని రాజు సంస్తుతించగ విష్ణువమృతవాక్కులు గురియుచు నతని కిట్లనెను : 'రాజా! నీ తపమునకు మెచ్చితిని. నీ యభిమతము చెప్పుము. తప్ప కీడేర్పగలను.' అంత రాజు తన యెట్టయెదుట వెలుగొందుచున్న విష్ణుని పదపద్మములపై బడి మురారీ! నేను సంతానమునకు తపించితిని. కనుక స్వాత్మసముడగు పుత్రుని ప్రసాదింపు'మని వేడుకొనెను. రాజు ప్రార్థన విని యాదిదేవుడతని కమోఘవాక్కుల నిట్లనెను : ఓ యయాతి పుత్త్రా! నీవు తమసాకాళిందుల సంగమస్థలి కరుగుము. నీ కోరికను దగిన ప్రభావశాలియగు పుత్రుని నే నచట నుంచితిని. అతడు నా మహావీర్యమున లక్ష్మియందు నీకొర కుద్భవించెను. అతనిని గ్రహింపుము అను హరి వరవాక్కులకు రాజు సంతుష్టాత్ముడయ్యెను. హరియు నతనికి వరమిచ్చి లచ్చితో వైకుంఠపుర మరిగెను. మాధవుడేగిన పిమ్మట యయాతి సుతుడు ప్రేమమీర జనార్దనుని మాట చొప్పున పుత్రుడున్నచోటికి వడిగల రథముపై నేగెను. అతడచటికేగి బొటనవ్రేలు నోటనిడుకొని యాడుకొనుచున్న చిన్నారి బాలుని కన్నులార గాంచెను. రాజు హరుని ప్రభావమున లక్ష్మీనారాయణులకు గల్గిన మదనసుందరుడగు పుత్రుని గాంచెను. అపుడతని మోము దమ్మి సంతసమున విప్పారెను. రాజు వెంటనే యతనిని తన కరమలముల నెత్తుకొని వాత్సల్యము పొంగులు వార నతని శిరంబుమూర్కొని మోదముతో గుండెకు హత్తుకొనెను. రాజు బాలుని ముద్దులు గారు మోమందము తిలకించి డగ్గుత్తికతో నిట్టులనియెను : నాకు లక్ష్మీనారాయణుల దయవలన నీ బాలుడు గల్గెను. నాకిక పున్నామనరక భయము లేదు. పుత్రా! నేను నూఱండ్లు తపమొనర్పగా రమాపతి సంతసించి నా వంశవృద్ధికై నిన్ను నాకు ప్రసాదించెను. నీ తల్లి కేవలము లక్ష్మీదేవి. ఆమె నిన్ను నాకు వదలి హరితో వెళ్ళెను. నిన్ను గుండెలకు హత్తుకొని సంతసించు తల్లి యెంతటి ధన్యురాలో కదా! త్వమేవ సంసార సముద్ర నౌకా రూపః కృతః పుత్రః లక్ష్మీధరేణ | ఇత్యేవ ముక్త్వా నృపతిః సుతంతం ముదాసమాదాయ య¸°గృహాయ. 44 పురీ సమీపే నృప మాగతం తమాకర్ణ్య సర్వే సచివాస్తు రాజ్ఞః | యయుః సమీపం నృపతేశ్చ లోకాః సోపాయనాస్తే సపురోహితాశ్చ 45 బందీజనా గాయనకాశ్చ సూతాః సమాయయుః సమ్ముఖమాశు రాజ్ఞః | నృపః పురం ప్రాప్య పురః సమాగతంజనం సమాశ్వాస్య వాక్యైశ్చ దృష్ట్యా. 46 సంపూజితః పౌరజనేన రాజా వివేశ పుత్రేణయుతో నగర్యామ్ | మార్గేషు లాజైః కుసుమైః సమంతాద్వికీర్యమాణో నృపతిర్జగామ. 47 గృహం సమృద్ధం సచివైః సమేతః సుతం సమాదాయ ముదా కరాభ్యామ్ | రాజ్ఞ్యై దదౌ చాథ సుతం మనోజ్ఞం సద్యః ప్రసూతం చ మనోభవాభమ్. 48 రాజ్ఞీ గృహీత్వా%భినవం తనూజం పప్రచ్ఛ రాజాన మనిందితా సా | రాజ న్కుత శ్చైష సుతః సుజన్మా ప్రాప్తస్త్వయా మన్మథతుల్య రూపః. 49 కేనైష దత్తః కథయాశు కాంత చేతో మదీయం ప్రహృతం సుతేన | నృపస్త దోవాచ ముదా%న్వితో%సౌ ప్రియే రమేశేన సుతో%పి మహ్యమ్. 50 లోలాక్షి దత్తః కమలా సముత్థో జనార్దాంశో%య మహీన సత్త్వః | సాతం గృహీత్వా ముదమాప రాజ్ఞీ రాజా చకారోత్సవ మద్భుతం చ. 51 దదై చ దానం కిల యాచకేభ్యోగీతాని వాద్యాని బహూని నేదుః | కృత్వోత్సవం భూపతి రాత్మ జస్య నామైకవీరేతి చకార విశ్రుతమ్. 52 సుఖం చ సంప్రాప్యముదా%న్వితో%సౌ ననంద దేవాధిపతుల్య వీర్యః | పుత్రం హరే రూపగుణాను రూపం సంప్రాప్య వంశస్య ఋణాశ్చ ముక్తః 53 ఇతి సకల సురాణా మీశ్వరేణార్పితంతం సకల గుణగణాఢ్యం పుత్రమాసాద్యరాజా | వివిధ సుఖవినోదైర్భార్యయా సేవ్యమానో వ్యహరత నిజగేహే శక్రతుల్య ప్రతాపః 54 ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ షష్ఠస్కంధే వింశో%ధ్యాయః. అని రాజు ముదముతో కొడుకు నెత్తుకొని తన యింటి కేగుచుండెను. రాజు తన నగరు ప్రవేశించుట విని మంత్రి పురోహితులు ప్రజలు పెక్కు కానుకలు గొని రాజున కెదురేగిరి. వందిమాగధులు గాయకులు సూతులును రాజును కొండాడిరి. రాజు వారి నందఱిని చల్లని చూపులతో మాటలతో సత్కరించెను. పౌరులు రాజును ఘనముగా సమ్మానించిరి. వారెల్లెడల మార్గమున సమములు సేసలు జల్లిరి. ఈ విధముగ రాజు తన కుమారునితో నిల్లు చేరెను. అట్లు రాజు సచివులతో నింటికేగి సద్యోజనితుడు మారసుకుమారుడు నగు కుమారుని రాణి చేతులలో నుంచెను. ఆ చిర్నగవుల జాబిల్లి నెత్తుకొని రాణి రాజుతో నిట్లనెను : 'రాజా! మన్మథుని మించిన యీ యందాల బాలుడు నీకెక్కడ లభించెను? ఇతనిని నీకెవరిచ్చిరో త్వరగ జెప్పుము. ఈ పొన్నారి సుతుడు నా మదికానందము గల్గించుచున్నాడు' రాజిట్లనెను : ప్రేయసీ ! ఈ తనయుని నాకు శ్రీహరి ప్రసాదించెను. చపలాక్షీ! ఇతడు మహాసత్వుడు. జనార్దనాంశమున లక్ష్మికి జనించినవాడు అన విని యామె సంతసించెను. రాజు గొప్పగ పుత్రోత్సవము జరిపించెను. యాచకులకు భూరిదానము లొసంగెను. వాద్యగీతములు మిక్కిలి మ్రోగెను. అట్లు మహోత్సవము జరుపుకొని రా జతని కేకవీరుడను ప్రసిద్ధనామ మొసంగెను. ఇంద్రవీర్యుడగు రాజు హరి రూపగుణములు గల సుతుని బడసి ప్రమోదమంది ఋణవిముక్తుడయ్యెను. అతని వంశము వర్ధిల్లెను. ఇట్లు సకల సురపతి యగు హరివలన సకల గుణగణములు గల సుతునిబడసి ప్రమోదమంది ఋణముక్తుడయ్యెను. అతని వంశము వర్ధిల్లెను. ఇట్లు సకల సురపతియగు హరి వలన సకల గుణగణములు గల తనయుని బడసి తన సతి పరిచర్యలు చేయుచుండగ నింద్రవీర్యము గల రాజు సుఖముండెను. ఇది శ్రీమద్దేవి భాగవతమందలి షష్ఠ స్కంధమం దేకవీరుని జన్మ వృత్తాంతమను నిరువదవ యధ్యాయము.