Sri Devi Bhagavatam-1
Chapters
అథ ద్వావింశో%ధ్యాయః యశోవత్యువాచ : ప్రాతరుత్థాయ తన్వంగీ చలితా చ సఖీయుతా | చామరై ర్వీజ్యమానా సా రక్షితగా బహురక్షిభిః.
1 సాయుధై శ్చాతిసన్న ద్ధైః సహితా వరవర్ణినీ | క్రీడార్థ మత్ర రాజేంద్ర ! సంప్రాప్తా నలినీం శుభామ్.
2 అహ మప్యనయా సార్థం గంగాతీరే సమాగతా | అప్సరోభిః సమేతా చ కమలైః క్రీడమానయా.
3 ఏకావళీ తథా చాహం జాతే క్రీడాపరే యదా | సహసైవ తదా%%యాతో దానవో బలసంయుతః. 4 కాలకేతు రితిఖ్యాతో రాక్షసైర్బహుభి ర్యుతః | పరిఘాసిగదాచాప బాణతోమరపాణిభిః. 5 దృష్టా చైకావళీ తేన రూప¸°వనశాలినీ | ద్వితీయా కామపత్నీవ క్రీడమానా సుపంకజైః. 6 మయోక్తైకావళీ రాజ న్కో%యం దైత్యః సమాగతః | గచ్ఛావో రక్షపాలానాం మధ్యే పంకజలోచనే. 7 విమృశ్యైవం సఖీ చాహం త్వరయైవ గతే భయాత్ | మధ్యే వై సైనికానాం తు సాయుధానాం నృపాత్మజ. 8 కాలకేతు స్తు తాం దృష్ట్వా మోహినీం మదనాతురః | గదా గుర్వీం గృహీత్వా తు ధావమానః సమాగతః. 9 రక్షకా న్దూరతః కృత్వా జగ్రాహాంబుజలోచనామ్ | త్రస్తాం వేపథు సంయుక్తాం క్రందమానాం కృశోదరీమ్. 10 తిష్ఠ తిష్ఠేతి భాషంతో రక్షకా స్తం మహాబలమ్ | ప్రతిషిధ్య తు సంగ్రామం చక్రు ర్విస్మయ కారకమ్. 11 ఇరువది రెండవ అధ్యాయము ఏకావళి చరిత్ర యశోవతి యిట్లనెను : ఆ రమణీమణి తనకు చెలియలు వింజామరలుగొని వీచుచుండగ వారితో బయలుదేరెను. ఆమె కిరువైపుల రక్షపాలభటులుండిరి. వారు సాయుధులై సన్నద్ధులై యామెను పరిరక్షించుట కామెవెంట వచ్చిరి. అటులనామె వన విహారమున కీ కమలవనముచెంత చేరెను. నేను సైత మామె వెంబడి గంగాతీరమేగితిని. మేమెల్లరమును క్రీడాకమలములు గైకొని యచ్చరలతో నాటాడుచుంటిమి. ఆ యేకావళియు నేనును క్రీడా వినోదముల మునిగియుండగ నొక బలశాలియగు రాక్షసుడచ్చటికి వచ్చెను. వానిని కాలకేతుడందురు. అతడు పెక్కు రాక్షసులను గూడి గదా%సి - చాప - బాణ - తోమర - పరఘలను దాల్చి యుండెను. రూప¸°వనమదము నిండి రెండవ రతి వలె నొప్పుచు కమలములతో నాడుకొనుచున్న యేకావళిని వాడు చూచెను. రాజా! నేనపు డేకావళితో నిట్లంటిని : ఓ పద్మాక్షి! వీడెవడో క్రూరరాక్షసునివలె నున్నాడు. ఇపుడు మనము రక్షపాలురమధ్య కేగుదము. అని మేమిర్వురమట్లు నిశ్చయించుకొని సత్వరమగు సాయుధులగు సైనికుల నడమకేగితిమి. ఆ కాలకేతుడు మోహనాంగియగు నేకావళినిగాంచి మదనాతురుడై పెద్ద గదగొని పరుగుపరుగున వచ్చెను. వాడు రక్షకులను తరిమి భయకంపితయై దురపిల్లుచున్న తలోదరిని పిట్టుకొనెను. అంత నేనామెను విడిచి నన్ను పట్టుకొనుమంటిని. ఐన నా దానవుడు వినక కామోద్రేకముతో నామెను తీసికొని వెళ్ళెను. అంతట రక్షకులు నిలునిలుమని పలుకుచు ఆ బలశాలిని నిలిపి వానితో వింతగా పోరు సాగాంచిరి. తస్యాపి రాక్షసాః క్రూరాః సర్వతః శస్త్రపాణయః | యుయుధూ రక్షకైః సార్ధం స్వామికార్యే కృతోద్యమాః. 12 సంగ్రామ స్తు తదా జాతః కాలకేతో స్తథా రణ | నిహత్య రక్షకా న్సర్వా న్గృహీత్వైనం మహాబలః. 13 యుక్తో రాక్షససైన్యేన నిర్జగామ పురం ప్రతి | వీక్ష్య తాం రుదతీ బాలాం గృహీతాం దానవేన తు. 14 పృష్ఠతో%హం గతా తత్ర యత్ర నీతా సఖీ మమ | విక్రోశంతీ యథా సా మాం పశ్యేదితి పదానుగా. 15 సా%పి మామాగతాం వీక్ష్య కించిత్స్వ స్థా%భవత్తదా | గతా%హం తత్సమీపే తు తామాభాష్య పునః పునః. 16 సా మాం ప్రాప్యాతి దుఃఖార్తా స్తంభ##స్వేద సమాకులా | కంఠే గృహీత్వా మాం భూప! రురోద భృశదుఃఃతా. 17 స మామాహు కాలకేతుః ప్రీతిపూర్వ మిదంవచః | సమాశ్వాసయ భీతా త్వం సఖీం చంచలలోచనామ్. 18 ప్రాప్తం మామద్య నగరం దేవలోకసమం ప్రియే | దాసో%స్మి తవ రత్యా హి కస్మాత్ర్కందసి కాతరా. 19 కథయైతాం సఖీం తే%ద్య స్వస్థాభవసులోచనే | ఇత్యుక్త్వా మాం సఖీపార్శ్వే సమారోప్య రథోత్తమే. 20 జగామ తరసా దుష్టః పురే స్వస్య మనోహరే | సైన్యేన మహతా యుక్తః ప్రపుల్లవదనాంబుజః. 21 ఏకావళీ తథా మాం చ సంస్థాప్య ధవళేగృహే | రాక్షసా న్గృహరక్షర్థాం కల్పయామాస కోటిశః. 22 ద్వితీయే దివసే సో%థ మామువాచ రహో నృపః | ప్రబోధమ సఖీం బాలాం శోచంతీం విరహాతురామ్. 23 పత్నీ మే భవ సుశ్రోణి | సుఖం భుంక్ష్వ యథే ప్సితమ్ | రాజ్యం త్వదీయం చంద్రాస్యే సేవకో%హం సదా తవ. 24 అపుడు వాని రాక్షససేనలు శస్త్రములు దాల్చి స్వామికార్యము నెరవేర్చుటకు రక్షపాలురతో బోరిరి. కాలకేతువు సైతము పోరాడి రక్షపాలురను చంపి యామెనుగొని యేగెను. అతనివెంట రాక్షస సేనలు నడిచెను. ఆ రాక్షసుడట్లు విలపించుచున్న బాలను గొని తన పురి కరిగెను. నేను నామెను వెన్నంటి యేడ్చుచామె పోయిన యెడకేగితిని. ఆమె తనవెంటవచ్చు నన్ను గాంచి తన మనస్సు కుదుటపఱచుకొనెను. ఆమెను బిగ్గరగ పిల్చుచు నేనామె చెంతకేగితిని. ఆమె నన్నుగాంచి దుఃఖార్తయై నివ్వెఱపడెను. 'నీ చెలి మిక్కిలి భయపడినది. ఆ చపలాక్షిని నీవైన ఊరడింపుము. నా నగరము దేవలోకము బోలును. నేను నీకు ప్రేమతో దాసుడనగుదును. ఇంక కాతరభావముతో నేల విలపింతువు?' అని చెప్పి నీ చెలిని స్వస్థురాలిని గమ్మనుము!' అని పలికి వాడు నన్ను రథముపై నా చెలిచెంత కూర్చుండ నియమించెను. అట్లా దుష్టుడు గొప్పసేనతో ప్రసన్నముఖ కమలముతో తన సుందరపురము ప్రవేశించెను. అట నతడేకావళిని నన్ను తన మేడలో నుంచి పెక్కురు రక్కసులను గృహరక్షణకేర్పరచెను. మఱునాడతడు నాతోడ మరల రహస్యముగ నిట్లనెను. 'నీ చెలి విరహాతురయై విలపించుచున్నది. ఆమె నోదార్చుము. ఓ చంద్రాననా! ఈ రాజ్యము నీది. నేను నీ దాసుడను. నీవు నాకు భార్యవై కోరిన సుఖములనుభవింపుము ! అని నా మాటలామెతో చెప్పుమని పలికెను. పునరుక్తం మయా వాక్యం శ్రుత్వా తద్భాషితం ఖరమ్ | నా%హం క్షమా%ప్రియం వక్తు త్వమేనాం కథయే ప్రభో. 25 ఇత్యుక్తే వచనే దుష్టో మదన క్షత మానసః | ఉవాచ వచనా దేనాం సఖీం క్షామోదరీం ప్రియమ్. 26 కృశోదరి ! త్వయా మంత్రో నిక్షిప్తో%స్తి మమోపరి | తేన మే హృదయం కాంతే ! హృతం తే వశతాం గతమ్. 27 తేనాహం తవ దాసో%ద్య కృతో%స్మితి వినిశ్చయః | భజ మాం కామబాణన పీడితం వివశం భృశమ్. 28 ¸°వనం యాతి రంభోరు చంచలం దుర్లభం తథా | సఫలం కురు కల్యాణి ! పతిం మాం పరిరభ్య చ. 29 ఏకావళ్యువాచ : పిత్రా%హం కల్పితా పూర్వం దాతుం రాజసుతాయవై | హైహయస్తు మహాభాగ స మయా మనసా వృతః. 30 కథ మన్యం భ##జే కాంతం త్యక్త్వా ధర్మం సనాతనమ్ | కన్యాధర్మం విహయాద్య వేత్సి శాస్త్రవినిశ్చయమ్. 31 యసై#్మ దద్యా త్పితా కామం కన్యా తం పతిమాప్ను యాత్ | పరతంత్రా సదా కన్యా న స్వాతంత్ర్యం కదాచన. 32 ఇత్యుక్తో%పి తయా పాపీ విరరామ న మోహితః | న ముమోచ విశాలాక్షీం మాంచ పార్మ్యస్థితాం తథా. 33 పాతాళ వివరే తస్య పురం పరమ సంకటే | రక్షసై రక్షితం దుర్గం మండితం పరిఖావృతమ్. 34 తత్ర తిష్ఠతి దుఃఖార్తా సఖీ మే ప్రాణ వల్లభా | తేనాహం విరహేణాత్ర రారటీమి సుదుఃఃతా. 35 ఏకవీర ఉవాచ : కథం త్వ మత్ సంప్రాప్తా పురాత్తస్య దురాత్మనః | విస్మయో మే మహానత్ర తత్త్వం బ్రూహి వరాననే. 36 త్వయా చ కథితం వాక్యం సందిగ్ధం భాతి భామిని | హైహయార్థే కల్పితా సా పిత్రేతి మమ సాంప్రతమ్. 37 వాని మాటలు విని నే నతని కిట్లంటిని : 'ఓ ప్రభూ! నేనామెతోనిట్టి యప్రియములు పలుకజాలను. ఆమెతో నీవే సొంతముగ మాటాడుము.' అని నేను పలుకగ మదనపీడితుడగు రాక్షసుడతివినయముతో తలోదరియగు నా చెలియ కిట్లనియెను : ఓ కృశోదరీ! నా మీద వశీకరణ మంత్రమేమైన ప్రయోగించితివా! నా యెడద దోచుకొని నీ వశము చేసికొంటివి. నీవు నన్ను నీ దాసునిగ జేసికొంటివని తలంతును. తీవ్ర కామపీడితుడను. వివశుడను. నన్ను భజింపుము. రంభోరూ! ఈ జవ్వన మతి చంచలము. దుర్లభము. నన్ను పతిగ నెంచి కౌగిలించుకొని దానిని సఫలమొనరింపుము. ఏకావళి యిట్లనెను : నేను మునుపే హైహయుడను రా కొమరునకు మా తండ్రిచేత నీయబడితిని. ఆ వీరుని నేను మనసార ప్రేమించితిని. నీవు శాస్త్ర నిర్ణయమెఱింగినవాడవు. సనాతనమైన కన్యాధర్మము విడనాడి యితరుని పతిగ నెట్లు సేవింపగలను? తన తండ్రి తన్నెవని కిచ్చునో యతనినే పతిగ కన్య భావించును. కన్యక యెప్పుడును పరతంత్రయేగాని స్వతంత్రకాదు కదా'! అని యామె యెంత చెప్పినప్పటికిని మోహితుడగు పాపాత్ముడు వినిపించుకొనలేదు. వాడా విశాలాక్షిని నామె చెంతనున్న నన్ను వదలలేదు. వాని పురము పాతాళ రంధ్రము లోపల సంకటస్థలమున గలదు. ఆ దుర్గమును రక్షకులు కాపాడుచున్నారు. దానిచుట్టు నగడ్త గలదు. అచ్చట ప్రాణప్రియురాలగు నా చెలియ గలదు. ఇచ్చట నామె వియోగమున దుఃఖార్తనై నేను గ్రుమ్మరుచున్నాను. ఏకవీరుడిట్లనెను : ఓ వరాననా! నీవా దుష్టుని పురమునుండి యెట్లు బైటపడి రాగల్గితివి? నాకిది వింతగనున్నది. నిజము పలుకుము. ఓ భామినీ ! ఆమె తండ్రియామెను హైహయుని కిచ్చెననుమాట నా మదికి నమ్మకము గల్గించుటలేదు. హైహయో నామ రాజా%హం నాన్యో%స్తి పృథివీపతిః | మదర్థే కథితా సా కిం సఖీ తవ సులోచనా. 38 ఏత న్మే సంశయం సుభ్రు చ్ఛేత్తు మర్హసి భామిని | అహం తా మానయిష్యామి తం హత్వా రాక్షసాధమమ్. 39 స్థానం దర్శయ మే తస్య యది జానాసి సువ్రతే | రాజ్ఞే నివేదితం కిం వా తత్పిత్రే చాతిదుఃఃతా. 40 యసై#్యషా వల్లభా పుత్రీ న కిం జానాతి తాం హృతమ్ | నోద్యమః కిం కృతస్తేన తతో మోచన హేతవే. 41 బందీకృతాం సుతాం జ్ఞాత్వా కథం తిష్ఠతి సుస్థిరః | అసమర్థో నృపః కిం వా కారణం బ్రూహి సత్వరమ్. 42 త్వయా మేప%హృతం చేతో గుణా నుక్త్వా హ్యమానుషాన్ | సఖ్యాః పంకజపత్రాక్షి ! కృతః కామవశో భృశమ్. 43 కదా పశ్యామి తాం కాంతాం మోచయిత్వా%తి సంకటాత్ | ఇతి మే హృదయం చాద్య కరోత్యతి మనోరథమ్. 44 బ్రూహి మే గమనోపాయం పురే తస్యాతి దుర్గమే | కథం త్వ మగతా తస్మా త్సంకటా దత్ర తద్వద. 45 యశోవత్యువాచ : బాలభావా న్మయా మంత్రో భగవత్యా విశాంపతే | ప్రాప్తో%స్తి బ్రాహ్మణా త్సిద్దా త్సబీజధ్యాన పూర్వకః. 46 తత్రావస్థితయా రాజ న్మయా చిత్తే విచారితమ్ | ఆరాధయామి సతతం చండికాం చండవిక్రమామ్. 47 సా దేవీ సేవితా కామం బంధమోక్షం కరిష్యతి | భక్తానుకంపినీ శక్తిః సమర్థా సర్వసాధనే. 48 యా విశ్వం సృజతే శక్త్యా పాలయత్యేవ సా పునః | కల్పాంతే సంహార త్యేవ నిరాకారా నిరాశ్రయా. 49 ఇతి సంచింత్య మనసా దేవీం విశ్వేశ్వరీం శివామ్ | ధ్యాత్వా రక్తాంబరాం సౌమ్యం సురక్తనయనాం హృది. 50 సంస్మృత్య మనసా రూపం మంత్రజాప్యపరాభవమ్ | ఉపాసితా మయా దేవీ మాస మేకం సమాధినా. 51 ఆ హైహయరాజును నేనే. ఇంకొకడు కాడు. సులోచనయగు నీ చెలియ నాకిఱకే యేల యుద్దేశింపబడినది? భామినీ! ఈ నా సందేహము తొలగింపుము. నేనా రక్షసాధముని చంపి నీ సఃని తేగలను. సువ్రతా! నీకు తెలిసినచో నాకామె యుండుచోటు తెలుపుము. ఆ దుఃఖార్తను గుఱించి యామె తండ్రి కెవరును జెప్పనేలేదా? తన యనుంగు కూతురు బంధితురాలగుట తెలిసియు నతడేల మిన్నకుండెను? అతడింత చేతకానివాడా! నా కీకారణములన్నియు తెల్పుము. కమలాక్షీ! నాతో నీ చెలియలోని మానవాతీత గుణములు వర్ణించుట వలన నా మనసు హరింపబడి కామునిబారి కగ్గమైనది. ఆ కాంతనెప్పుడు గాంతునో? ఆమె నీ సంకటము నుండి యెన్నడు ముక్తురాలిని జేతునా అని నా యెడద ఉవ్విళ్ళూరుచున్నది. ఆ చొఱరాని పురమున కరుగు నుపాయము తెలుపుము. ఆతని చెఱనుండి నీవెట్లు తప్పించుకొని బైటపడితివో తెలుపుము. యశోవతి యిట్లనెను : ''రాజా! నేను నా చిన్నతనము నందొక సిద్ధ బ్రాహ్మణుని నుండి బీజము, ధ్యానముగల శ్రీభగవతీ దేవీమంత్రము గైకొంటిని. నేనక్కడ నివసించుచు చండవిక్రమయగు చండికను సంతతమారాధింపవలయునని మదిదలంచితిని. సర్వార్థ ప్రదాయిని భక్తానుగ్రహరూపిణియగు శ్రీపరాశక్తిని సంసేవించినచో బంధములనుండి ముక్తిగాంచవచ్చును. శ్రీజగన్మాత నిరాకార - నిరాశ్రయ అయ్యు నాతల్లి తన దివ్యశక్తులతో నీ విశ్వమును పుట్టించి పెంచి గిట్టింపగలదు అని నేను నెమ్మది నెంచి హృదయపీఠికపై నయన రక్తాంబర - సౌమ్య - శివునిరాణి యగు శ్రీత్రిభువనేశ్వరీ దేవిని ధ్యానించితిని. నేనా దివ్యమంగళమూర్తిని లోన నిల్పుకొని సంస్మరించుచు నామె మంత్రరాజమును విడువక జపింప బూనుకొంటిని. స్వప్నే మమ సమాయాతా భక్తి భావేన తోషితా | మామాహాహృతయా వాచా కిం సుప్తా%సీతి చండికా. 52 ఉత్తిష్ఠ యాహి తరసా గంగాతీరం మనోహరమ్ | ఆగమిష్యతి తత్రాసౌ హైహయా నృపపుంగ వః. 53 ఏకవీరో మహాబాహుః సర్వశత్రువిమర్దనః | దత్తాత్రేయేణ మన్మంత్రో మహావిద్యాభిధః పరః. 54 దత్తోసై#్మ సో%పి సతతం మమూపాస్తే%తి భక్తితః | మయ్యాసక్తమతి ర్నిత్యం మమ పూజాపరాయణః. 55 మామేవ సర్వభూతేషు ధ్యాయ న్నాస్తే చ మత్పరః | స తే దుఃఖవినాశం వై కరిష్యతి మహామతిః. 56 మాసుతో విహ రంస్తత్ర తవ త్రాతా భవిష్యతి | హత్వా తం రాక్షసం ఘోరం మోచయిష్యతి మానినీమ్. 57 ఏకావళీ మేకవీరః సర్వ శాస్త్రవిశారదః | పశ్చా త్సైవ పతిః కార్య స్త్వయా రాజసుతః శుభః. 58 ఇత్యుక్త్వా%ంతర్దధే దేవీ ప్రబుద్ధా%హం తదైవ హి | కథితం స్వప్న వృత్తాంతం దేవ్యా శ్చారాధనం తథా. 59 ప్రసన్నవదనా జాతా శ్రుత్వా సా కమలేక్షణా | విశేషేణ చ సంతుష్టా మామువాచ శుచిస్మితా. 60 గచ్ఛ తత్ర త్వరాయుక్తా కురు కార్యం మమ ప్రియే | సత్యవాక్యా భగవతీ సా%%వాం మోక్షం విధాస్యతి. 61 ఇత్ఞాప్తా తయా చాహం సఖ్యా వై ప్రేమయుక్తయా | మత్వోపసరణం యుక్తం తస్మా త్థ్సానా త్తదా నృప. 62 చాలితా%హం తతః శీఘ్రం మహాదేవీ ప్రసాదతః | మార్గజ్ఞానం శీఘ్రగతి ర్మయా ప్రాప్తా నృపాత్మజ. 63 ఇత్యేత త్కథితం సర్వకారణం మమ దుఃఖజమ్ | కస్త్వం కస్య సుతశ్చేతి వద వీరయథా తథా. 64 ఇతి శ్రీ దేవీభాగవతే మహాపురాణ షష్ఠస్కంధే ద్వావింశో%ధ్యాయః. శ్రీ జగదంబ నా భక్తికి మెచ్చి స్వప్నమున సాక్షాత్కరించి యమృతవాక్కులతో నాతో నిట్లనియెను : నీ వింకను నిద్రించుచున్నవా? లేలెమ్ము. వేవేగ మనోహరమైన గంగాతీరము జేరుము. అచటికి హైహయుడను రాజవరుడు రాగలడు. అతని పేరేకవీరుడు. అతడు మహాబలుడు. సర్వశత్రు సంహారకుడు. శత్రులకు చిచ్చఱపిడుగు. అతనికి దత్తాత్రేయముని మహావిద్యయనబడు నా మంత్రమును ప్రసాదించెను. ఆ మంత్రముబొంది నిరంతరమతడు నా యందు మనస్సు నిలిపి నా పూజయందు తత్పరుడై పరాభక్తితో నన్నే యుపాసించుచుండెను. అతడు మచ్చిత్తుడు. మద్గతప్రాణుడు. మత్పరముడు. ఎల్లభూత కోటిలో నారూపుగాంచి ధ్యానించును. ఆ మహనీయుడు మీకు గల్గిన విపత్తు తొలగింప సమర్థుడు. అతడు విహరించుచు గంగాతటము జేరగలడు. అతడా ఘోర రాక్షసుని నిలువున చంపి యా మానవతిని విడిపించగలడు. ఆ పిమ్మట సకలశాస్త్రాపారంగతుడగు నేకవీర రాకుమారు నేకావళి పతిగ గ్రహించునట్లు నీవు యత్నింపుము అని పలికి శ్రీదేవి యంతర్ధానమందెను. నేను దిగ్గున మేల్కొని నా దేవ్యారాధనమును స్వప్న వృత్తాంతమును గూర్చి నా చెలికి తెలిపితిని. నా సః యదంతయు విని ప్రసన్నవదనముతో చిర్నగవుతో నాతో నిట్లనెను : చెలియా! నీ విపుడే సత్వరముగ నచటికేగుము. నా కార్యము సాధింపుము. సత్యవాణి గల భగవతి మనలను తప్పక ముక్తురాండ్రను చేయగలదు. రాజా! అట్లు నా ప్రియురాలగు చెలియాజ్ఞాపింపగ నచటి నుండి వెడలుట మంచిదనుకొని నేనిచటకు వచ్చితిని. నే నామ మహాదేవి దయాప్రభావమున దేవి ప్రేరణచే బయలు దేరితిని. నాకు శీఘ్రముగ మేలుబాట గనిపించెను. వీరవర్యా! ఇట్లు నీకు మా దుఃఖకారణమమంతయు వెల్లడించితిని. ఇంకిపుడు నీ వెవరవో - యెవరి నందనుడవో నాకు నిజముగ దెల్పుము. ఇది శ్రీ మద్దేవీ భాగవతమందలి షష్ఠస్కంధమం దేకావళిచరిత్రమను నిరువదిరెండవ యధ్యాయము.