Sri Devi Bhagavatam-1
Chapters
అథ షడ్వింశో%ధ్యాయః వ్యాస ఉవాచ : ఇతి మేవచనంశ్రుత్వానారదః పరమార్థవిత్ | మామాహచస్మితంకృత్వా పృచ్ఛంతంమోహకారణమ్.
1 నారద ఉవాచ : పారాశర్య పురాణజ్ఞ పృచ్ఛసి సునిశ్చయమ్ | సంసారే%స్మి న్వినా మోహం కో%పినాస్తి శరీరవాన్.
2 బ్రహ్మా విష్ణు స్తథా రుద్రః సనకః కపిల స్తథా | మాయయా వేష్టితాః సర్వే భ్రమంతి భవవర్త్మని. 3 జ్ఞానినం మాం జనోవేత్తి భ్రాంతో%హం సర్వలోకవతృ శరణు మే పూర్వవృత్తాంతం ప్రబ్రవీమి సునిశ్చితమ్. 4 దుఃఖం మయా యథా పూర్వమనుభూతం మహత్తరమ్ | స్వకృతేన చ మోహేన భార్యార్థే వాసవీసుత. 5 ఏకదా పర్వతా శ్చా%హం దేవలోకాన్మమీతలమ్ | ప్రాప్తో విలోకనార్థాయ భారతం ఖండముత్తమమ్. 6 భ్రమంతౌ సమితా పుర్వ్యాం పశ్యంతౌ తీర్థమండలమ్ | పావనాని చ స్థానాని మునీనా మాశ్రమాన్ శుభాన్. 7 శపథం దేవలోకాత్తు కృత్వా పూర్వం పరస్పరమ్ | చలితౌ సమయే చేమం సమ్మంత్ర్య నిశ్చయేనవై. 8 చిత్తవృత్తి వక్తావ్యా యాదృశీ యస్య జాయతే శుభా వా%ప్య శుభావాశు భాని%పి న గోప్తవ్యా కదాచన. 9 భోజనేచ్ఛా ధనేచ్ఛా%పి రతీచ్ఛానాభ##వేదపి | యాదృశీయస్య చిత్తే తు కథనీయా పరస్పరమ్. 10 ఇత్యావాం సమయం కృత్వా స్వర్గాద్భూలోకమాగతౌ | ఏకచిత్తౌ మునీభూతౌ విచరంతౌ యథేచ్ఛయా. 11 ఏవం భ్రమంతౌ లోకే%స్మి న్గ్రీష్మాంతే సముపాగతే | సంజయస్య పురం రమ్యం సంప్రాప్తౌ నృపతేః పునః. 12 తేన సంపూజితౌ భక్త్యా రాజ్ఞా సమ్మానితౌ భృశమ్ | స్థితౌ తత్రగృహే తస్య చాతుర్మాస్యం మహాత్మనః. 13 వార్షికా శ్చతురోమాసా దుర్గమాః పథి సర్వదా | తస్మా దేకత్ర విబుధైః స్థాతవ్య మితి నిశ్చయః. 14 ఇరువది ఆరవ యధ్యాయము నారదుడు స్వవృత్తాంతము తెల్పుట అను నా మాటలాలకించి పరమార్థవిదుడగు నారదుడు మోహకారణమడుగుచున్న నన్ను జూచి చిర్నగవునగి నాతో నిట్లు పలికెను : పారాశర్యా! పురాణవేత్తా! మోహమునకు మూలకారణము నన్నేల యడుగుదువు? ఈ ప్రపంచమున మోహవశుడుగాని జీవుడెవ్వడును లేడు, బ్రహ్మ విష్ణురుద్రులును సనక కపిలాదులును మాయకులోనై యీ సంసార మార్గమున పల్మారులు గ్రుమ్మరుచుందురు. నన్ను లోకులు జ్ఞానిగ దలంతురు. కాని నేనును ప్రాకృతునివలెన భ్రాంతచిత్తుడనే. నా మొదటి మోహవృత్తాంతము చెప్పుదును వినుము. వ్యాసమునీశా! నేను తొల్లి భార్యను గూర్చిన స్వయంకృతమైన మోహము జంజా టములో కొట్టుమిట్టాడి తీరని దుఃఖము లనుభవించితిని. మున్నొకప్పుడు పర్వతుడు నేను పవిత్రభారత ఖండమును గాంచు తలంపున దివినుండి భువికి దిగివచ్చితిమి. మేమిర్వురము పావనములు శుభములు నగు పుణ్యతీర్థములు మున్యాశ్రమములు సందర్శించుచు ఈ కర్మభూమియెల్ల పర్యటించుచుంటిమి. మేము భూతలమున తిరుగుటకు మునుపు దేవలోకమునందు మాలో మేము కొన్ని నేమము లేర్పరచుకొంటిమి. మాలో నెవరికైన మంచిదైన చెడుదైన ఎట్టి భావమైన గల్గినచో దానిని దాచక రెండవ వారికి వెల్లడించవలయును. రతి - భోజనము - ధనము - వీనిలో దేనియందు కోర్కి పుట్టినను దానిని తప్ప కింకొకరికి చెప్పవలయును. మేము ఇట్లు కట్టుబాటులు చేసికొని దివినుండి భువికేతెంచి యొకేమనస్సుతో ముని వృత్తితో నెల్లెడల నిచ్చవచ్చినట్లు తిరుగుచుంటిమి. అట్లు మేము భూలోకమున సంచరించుచుండగ నంతలో వర్షాకాలము సమీపించెను. మేము సంజయుడను రాజుయొక్క సుందరనగరము జేరితిమి. ఆ రాజు మమ్ము భక్తితో బూజించి సత్కరించెను మేమామహాత్ము నింట నాల్గు నెలలుంటిమి. వానకాలము నాల్గునెలలు త్రోవ సుగమముగ నుండదు. కనుక నపుడు పండితులొక్క చోటనే యుండవలయును. అష్టౌ మాసాం స్తు ప్రవసే త్సదా కార్యవశాద్ద్విజః | వర్షాకాలే న గంతవ్యం ప్రవాసే సుఖమిచ్ఛతా. 15 ఇతి సంచింత్య మనసా సంజయస్య గృహే తదా | సంస్థితౌ మానితౌ రాజ్ఞా కృతాతిథ్యౌ మహాత్మనా. 16 దమయంతీతి విఖ్యాతా తస్య పుత్రీ మహీపతేః | ఆజ్ఞప్తా పరిచర్యార్థం సుదతీ సుందరీ భృశమ్. 17 వివేకజ్ఞా విశాలాక్షి రాజపుత్రీ కృతోద్యమా | సేవనం సర్వకాలే చ వ్యదధాదుభయోరపి. 18 స్నానార్థ ముదకం కాలే భోజనం మృష్టమాయతమ్ | సుఖవాసం తథాచాన్యం యదిష్టం తద్దదాతి సా. 19 మనోభిలషితాన్కామా నుభయో రపి కన్యకా | వ్యజనాసనశయ్యాదీ న్వాంఛితా నప్యకల్పయత్. 20 ఏవం సం సేవ్యమానౌ తు స్థితౌ రాజ్ఞో గృహే కిల | వేదాధ్యయన సంశీలా వావాం వేదవ్రతే రతౌ. 21 అహం వీణా కరే కృత్వా సాధయిత్వా స్వరోత్తమమ్ | గాయత్రం సామ సుస్వాదమగాం కర్ణరసాయనమ్. 22 రాజ పుత్రీ తు తచ్ఛ్రుత్వా సామగానం మనోహరమ్ | బభూవ మయి రాగాఢ్యా ప్రీతి యుక్తా విశారదా. 23 దినే దినే%నురాగో%స్యా మయి వృద్ధింగతః వరః | మమాపి ప్రీతి యుక్తాయాం మనోజాతం స్పృహాపరమ్. 24 మమ తస్య చ సా కన్యా భోజనాదిషు కర్హిచిత్ | అకరో దంతరం కించి త్సేవాభేదం రసాన్వితా. 25 స్నానా యోష్ణజలం మహ్యం పర్వతాయ చ శీతలమ్ | దధి మహ్యం తథా తక్రం పర్వతాయాప్యకల్బయత్. 26 శయనాస్తరణం శుభ్రం మదర్థే పర్యకల్పయత్ | ప్రీత్యా పరమయా యద్వ త్పర్వతాయ న తాదృశమ్. 27 విలోకయతి మాం ప్రేవ్ణూ సుందరీ న చ పర్వతమ్ | తతో%స్యా స్తా దృశం దృష్ట్వా పర్వతః ప్రేమకారణమ్. 28 విప్రుడెనిమిది నెలలవఱకంతట తిరుగవచ్చును. కాని వానకాలము నాల్గునెలలు మాత్రము సుఖము గోరువాడెచ్చటికిని గదలగూడదు. ఇట్లు మేము నిశ్చయించుకొని సంజయునింటనుండి యా మహాత్మునిచేత నాతిథ్య సత్కారములు పడయుచుంటిమి. ఆ రాజునకు 'దమయంతి' యనునొక గారాపు చక్కని చుక్క గలదు. రాజా యందాల సుదతిని మా యిర్వురి సేవలందు లగ్నయై యుండెడిది. ఆ పడతి మాకు సముచితకాలమునకు స్నానమునకు వేన్నీళ్లు తినుటకు భక్ష్య భోజ్యములు తాంబూలము నింక మాకేది ఇష్టమైన నది ముచ్చటగ దెచ్చుచుండెను. ఆ కన్నియ మా యిర్వురికి విసనకఱ్ఱలు సుఖాసనములు కమ్మని పూసెజ్జలు మున్నగు కామ్యవస్తువులన్నియు సమకూర్చుచుండెను. అట్లు మేము రాజప్రాసాదమునందు రాజమర్యాదలందుకొనుచు వేదవ్రతులమై వేదాధ్యయన శీలురమై యుంటిమి. నేను చేత వీణియబూని మేలైన స్వరరాగములీను సామగానము చెవులపండువుగ గానము చేయుంచుంటిని. ఆ కోమలి సంగీతజ్ఞురాలు. ఆమె నా తేనెకన్న తియ్యనగు సామగానమాలించి నాయందెక్కడలేని మక్కువతో బద్ధానురాగయయ్యెను. ఆమె నాపై చూపు ప్రేమభావాలు పెరిగి పెరిగి రాగానబడెను. ఆనాటినుండి కన్నెపడుచు భోజన భాజనములు సమకూర్చుటలో నాకు పర్వతునకు నడుమ భేదభావము జూపుచుండెను. ఆమె నాకు స్నానమునకు వేన్నీళ్ళు పర్వతునకు చన్నీళ్ళు నాకు తెల్లని గడ్డ పెరుగు పర్వతునకు నీళ్ళ చల్ల వేర్పాటుతో నేర్పాటు చేయుచుండెను. ఆ మగువ నాకు వలపుచిల్కరించిన కమ్మని పూలసెజ్జ గూర్చెను. అతని కట్టిది లేదు. ఆ వాలుగంటి కన్నుసన్నల నన్నోరచూపుల జూచుచుండెను. పర్వతునట్లు చూడకుండెను. నాయందామెకు గల యనురాగ కారణమును పర్తతుడర్థము చేసికొనెను. మనసా చింతయా మాస కి మేతదితి విస్మితః | పప్రచ్ఛ మాం రహః సమ్య గ్ర్బూహి నారద సర్వథా. 29 రాజ పుత్రీ త్వయి ప్రేమ కరోతి ముదితా భృశమ్ | దదాతి భక్ష్య భోజ్యాని స్నేహయుక్తా సమంతతః. 30 న తథా మయి భేదో%త్ర సందేహం జనయత్యసౌ | మన్యతే త్వాం పతిం కర్తుం సర్వథా సంజయాత్మజా. 31 తవా%పి తా దృశం భావం జానామి లక్షణౖరహమ్ | నేత్రవక్రవికారైశ్చ జ్ఞాయతే ప్రీతి కారణమ్. 32 సత్యం వద న తే మిథ్యా వక్తవ్యం వచనం మునే | స్వర్గతః సమయం కృత్వా చలితై సంస్మరాధునా. 33 నారద ఉవాచ : పృష్టో%హం పర్వతేనేదం కారణంతు హఠాద్యదా | తదా%హం హ్రీ సమాక్రాంతుః సంజాతశ్చా బ్రువం పునః. 34 పర్వతైషా విశాలాక్షీ పతిం మాం కర్తు ముద్యతా | మ మాపి మానసో భావో వర్తతే%స్యాం విశేషతః. 35 తచ్ఛ్రుత్వా వచనం సత్యం పర్వతః కోపసంయుతః | మామువాచ ముని ర్వాక్యం ధి గ్ధిగితి పునః పునః. 36 ప్రథమం శపథా న్కృత్వా వంచితో%మంత్వయాయతః | భవ వానర వక్త్ర స్త్వంశాపాశ్చ మమ మిత్రధ్రుక్. 37 ఇతి శప్త స్తు తేనాహం కుపితేన మహాత్మనా | సహసా హ్యభవం క్రూరః శాఖామృగముఖ స్తదా. 38 మయా%పి న కృతా తస్మిన్ క్షమా తు భగినీ సుతే | సౌ%పి శప్తో%తి కోపాద్వై మా స్వర్గేతేగతిః కిల. 39 స్వల్పే%పరాధే యస్మాన్మాం శప్తవానసి పర్వత | తస్మాత్తవాపి మందాత్మ స్మృత్యులోకే స్థితిః కిల. 40 పర్వత స్తు గత స్తస్మాన్నరాద్విమనా భృశమ్ | అహంవానర వక్త్రస్తు సంజాత స్తతనాదపి. 41 దృష్ట్వా మాం వానరం క్రూరం రాజపుత్రీ విలక్షణా | విమనా%తీవ సంజాతా వీణాశ్రవణ లాలసా. 42 వ్యాస ఉవాచ : తతః కిమభవ ద్ర్బహ్మన్కథం శాపాన్ని వర్తితః | మానుషాస్యః పునర్జాతో భవాన్ర్బూహి యథావిధి. 43 పర్వతః క్వగతో భూయః సంగమో యువయో రభూత్ | కదా కుత్రకథం సర్వం విస్తరేణ వదస్వహ. 44 పర్వతుడు నింతలో నిదేమాయని యాలోచించి నాతోనొక నాడొంటి - 9 నిట్టులనియెను : 'నారదా! నీ వెల్ల భంగుల నున్నదున్నట్లు పల్కుము. ఆని రాచపట్టి స్నేహ భావమున నీకు భోక్ష్య భోజ్యములు సమకూర్చు చున్నదే కాని యామె నాకిట్లు తినబెట్టదు. ఇట్టి భేదము వలన నాకేదో సందేహము గల్గుచున్నది. ఆమె నిన్ను తప్పక తన వానిగ జేసికొనునని తలంతును. కనుసైగలు ఇతర లక్షణములు చూడచూడగ నామెయందున నీ మనస్సు తగుల్కొనెనని నాకు దోచుచున్నది. మునివర్యా! మనము స్వర్గము వెడలునప్పుడు కొన్ని నియమము లేర్పరచుకొంటిమి. ఇప్పుడు వట్టి మాటలు కట్టిపెట్టి నిజము పల్కుము'' అని పర్వతుడు నన్ను కారణమడుగగ నేను మిక్కలి సిగ్గిలి యతని కిట్లంటిని : పర్వతా! ఈ విశాల కామాక్షి నన్ను పతిగ జేసికొనదలచి యున్నది. నా మనస్సునందలి భావము కూడ విశేషముగ నామెయందు నిలిచియున్నది. అను నా నిక్కమగు వాక్కులాలించి పర్వతుడు కోపముతో పల్మరు నాతో నిట్లనెను : నారదా! నీకు ధిక్కారము ధిక్కారము. మిత్ర ద్రోహీ! మొదట శపథము చేసి పిదప నన్ను మోసగించితివే! నా శాపమున నీవు కోతిమొగము గలాడ వగుదువు గాత! అని కూపితుడగు ప్వతుడు వపింపగనే నేను వికారము గల కోతి మొగముగలాడనైతిని. అతడు నా సోదరి కొడుకు. ఐన నేనది లెక్కింపక కోపముతో నీకు స్వర్గమేగు శక్తి నశించుగాక అని శపించితిని. పర్వతా! ఈ కొద్ది తప్పునకు నీవు నన్ను శపించితివి. ఓ మందాత్మా! దానివలన నీకిక మృత్యులోకమే నివాసమగు గాక! ఆ పిదప పర్వతుడు చలించిన మనస్సుతో నగరు వెడలెను. నేనదే క్షణముగ కోతిమొగము గలవాడనైతిని. నా వీణారాగము వినటలో మక్కువగల చతుర రాజకుమారి యానాటినుండి నన్ను కుటిల వానరునిగ జూచి వికల మనస్కురాలయ్యెను. నేను (వ్యాసముని) ఇట్లంటిని : నారదా! పిమ్మట నీ శాపమెట్లు తొలగెను. నీకు పిదప నరముఖమెట్లు ప్రాప్తించెనో తెలుపుము. ఆ పర్వతుడెచటి కేగెను? ఆ పిమ్మట మీ యిర్వురి కలయిక యెచట నెపుడు జరిగెనో విపులముగ దెలుపుము. నారద ఉవాచ : కింబ్రవీమి మహాభాగ మాయాయాశ్చరితం మహత్ | దుఃఃతో%హం భృశం తత్ర పర్వతే రుషితే గతే. 45 పునః సేవాపరా%త్యర్థం రాజపుత్రీ మమాభవత్ | గతే%థ పర్వతే కామం స్థిత స్తత్రైవ సద్మని. 46 అహందుఃఖాన్వితో దీనస్తథావానరవన్ముఖః | విశేషేణతు చింతార్తః కిం మే స్యాదితి చింతయన్. 47 సంజయో%థ సుతాందృష్ట్వా కించిత్ర్ప కట¸°వనామ్ | వివాహార్థే రాజసుతా మ పృచ్ఛ త్సచివంతదా. 48 వివాహకాలః సంప్రాప్తః సుతాయా మమ సాంప్రతమ్ | యోగ్యం పరం మమ బ్రూహిరాజపుత్రం సుసమ్మతమ్. 49 రూపౌదార్య గుణౖర్యుక్తం శూరం సుకుల సంభవమ్ | వివాహం విధివ త్పుత్ర్యాః కరోమి కిల సాంప్రతమ్. 50 ప్రధాన స్త్వబ్రవీద్రాజన్ రాజపుత్రా హ్యనేకశః | వర్తంతే భువి పుత్య్రాస్తే యోగ్యాః సర్వగుణాన్వితాః. 51 యస్మి న్రుచిస్తే రాజేంద్ర తమాహూయ నృపాత్మజమ్ | దేహి కన్యాం ధనం భూరి హస్త్యశ్వరథసంయుతమ్. 52 నారద ఉవాచ : పితుశ్చికీర్షితంజ్ఞాత్వాదమయంతీ తదానృపమ్ | ధాత్ర్యాముఖేనవాక్యజ్ఞాతమువాచ రహః స్థితమ్. 53 ధాత్రువాచ : దమయంతీ మహారాజ పుత్రీ తే మామథాబ్రవీత్ | పితరం బ్రూహిధాత్రేయి! వచనాన్మే సుఖాన్వితమ్. 54 మయా వృతో%యం మేధావీ నారదో మహతీయుతః | వాదమోహితాయా కామం నా%న్యః కో%పి ప్రియామమ. 55 కురు మే వాంఛితం తాత వివాహం మునినా సహ | నాన్యం వరిష్యే ధర్మజ్ఞా నారదం తు పతిం వినా. 56 మగ్నామం నాదసిం ధౌ వై నక్రహీనే రసాత్మకే | అపారే సుఖ సంపూర్ణే తిమింగల వివర్జితే. 57 ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ షష్ఠస్కంధే షడ్వింశో%ధ్యాయః. అనగా నాతో నారదుడిట్లనెను : మహాత్మా! మహాహాయా శక్తి విచిత్ర చరిత్రమేమని చెప్పుదును? పర్వతుడట్లు కోపముతో వెళ్ళిన పిమ్మట నతడెన్నియో కష్టాలు పడెను. ఆ రాకుమారి మరల నా పరిచర్యలో మునిగిపోయెను. పర్వతుడు వెళ్ళినప్పటికి నేనదే యింటనుంటిని. అట్లు నేను వానరముఖముతో దుఃఖార్తుడనై దీనుడనై యుండి యిక ముందేమి మాయ జరుగనోయని వెతజెందుచుంటిని. సంజయరాజు తన కూతునకు పెండ్లి వయస్సు వచ్చుట గని యామె వివాహమునకై మంత్రితో నిట్లు సంప్రతించెనుః ''ఇపుడు నా కుమార్తెకు పెండ్లికి దగిన యీడు వచ్చెను. కనుక నొకచక్కని రూపవంతుని తెలుపుము. ఉదారుడు గుణవంతుడు శూరుడు కులీనుడునగు వరునితో నా కూతునకు యథావిధిగ పెండ్లి చేతును. అట్టి వరుని దెలుపుము.'' మంత్రి యిట్లనెను : రాజా! అన్ని విధముల నీ కూతునకు దగిన సుగుణములు గల చక్కని రాకుమారులీ భూమిపై పెక్కురు గలరు. ఏ రాచపట్టి తగిన వరుడని మీరు భావింతురో యతని నాహ్వానించి గజాశ్వరరథములతో సత్కరించి కన్యాదానము చేయుము. (నారదుడిట్లనెను) అపుడు దమయంతి దాసివలన తన తండ్రి యభిప్రాయమెఱింగి దాసి వలన తన కోర్కి తన తండ్రి కిట్లు వెల్లడి చేసెను. దాసి యిట్లనెను : 'మహారాజ! నీ కూతురగు దమయంతి యొంటరిగ నున్న నా తండ్రితో నా మాటగ నిట్లు చెప్పుమని నాతో చెప్పెను. నేను నారదుని మహతీనాదమునకు సమ్మోహితనైతిని. నేను నారదుని మనసార ప్రేమించితిని. నే నితరు నెవ్వరిని వివాహము గాను. ధర్మజ్ఞా! నా పెండ్లి యా మునివరునితోడనే జరిపింపుము. ఆ నారదుని తప్ప నేను మరెవ్వరిని పతిగ వరింపను. నేను నాదకళాభరితము సరసము పరిపూర్ణము బ్రహ్మానందమయమునైన నారదుని నాదసముద్రమున మునిగితిని. అది అపారము ఆనందపూర్ణము. దానిలో మొసళ్ళు తిమింగిలములు లేవు. ఇది శ్రీమద్దేవీ భాగవతమందలి షష్ఠ స్కంధమందు నారదుడు స్వ వృత్తాంతము తెల్పుటయను నిరువదియారవ యధ్యాయము.