Sri Devi Bhagavatam-1
Chapters
అథ సప్తవింశో%ధ్యాయః నారదః : తత్పుత్ర్యావచనం శ్రుత్వారాజాధాత్రీముఖాత్తతః | భార్యాం ప్రోవాచకై కేయీం సమీపస్థాం సులోచనామ్. యదుక్తం వచనం కాంతే ధాత్ర్యా తత్తు త్వయా శ్రుతమ్ | వృతోయం నారదః కామం మునిర్వానరవక్త్రభాక్.
2 కిమిదం చింతితం పుత్ర్యా బుద్ధిమీనం విచేష్టితమ్ | కథ మసై#్మ మయా దేయా కన్యాహరిముఖాయసా.
3 క్వాసౌ భిక్షుః కురూపః క్వ దమయంతీ మమాత్మజా | విపరీత మిదం కార్యం న విధేయం కదాచన.
4 తామేకాంతే ససుఖ2శాంతే నివారయ హఠాత్సుతామ్ | యుక్త్యా మునిరతాం ముగ్ధాం శాస్త్ర వృద్ధానుసారయా.
5 ఇతి భర్తృ వచః శ్రుత్వా జననీ తా మథా బ్రవీత్ | క్వ తే రూపం మునిః క్వాసౌ వానరాస్యో%ధనః పునః. 6 కథం మోహమవాప్తా%సి భిక్షుకే చతురా పునః | లతా కోమలదేహా త్వం భస్మరూక్షతను స్త్వయమ్. 7 వార్తావానర వక్త్రేణ కథం యుక్తా తవానఘే | కా ప్రీతిః కుత్సితే పుంసి భవిష్యతి శుచిస్మితే. 8 వరస్తే రాజపుత్రో%స్తు మాకురు త్వం వృథాశఠమ్ | పితా తే దుఃఖ మాప్నోతి శ్రుత్వా ధాత్రీ ముఖాద్వచః. 9 లగ్నాం బుబూలవృక్షేణ కోమలాం మాలతీలతామ్ | దృష్ట్వా కస్య మనః బేదం చతురస్య న గచ్ఛతి. 10 దాసేరకాయ తాంబూలీ దలాని కోమాని కః | దదాతి భక్షనార్థాయ మూర్ఖో%పి ధరణీతలే. 11 వీక్ష్య త్వాం కరసంలగ్నాం నారదస్య సమీపతః | వినాహే వర్తమానే తు కస్చచేతో న దహ్యతి. 12 కు ముఖేన సమం వార్తా న రుచిం జనయ త్యతః | ఆ మృతే స్తు కథం కాలః క్షపితవ్య స్త్వయా%మునా. 13 నారద ఉవాచ : ఇతి మాతుర్వచః శ్రుత్వాదమయంతీభృశాతురా | మాతరం ప్రాహతన్వంగీమయిసాకృతనిశ్చయా. 14 ఇరువది ఏడవ యధ్యాయము నారదుని వివాహము నారదుడిట్లనెను : రాజు దాసినోట తన కూతు భావము లెఱిగెను. అతడు తన చెంత కమలనయనములతో కైకేయియను బార్యతో నిట్లనెను : ఓ కాంతా! దాసి పల్కిన పల్కులు నీవును వింటివి గదా! ఆ కోతి మొగపు నారదుని మన కూతురు కోరి వరించినదట. మన కూతురెంత తెలివిమాలిన పని తలపెట్టినదో చే మనము నల్గురిలో తల యెత్తుకొని తిరుగలేకున్నాము. ఆ కోతిమొగము వానికి నా కన్నె నెట్లు కట్టబెట్టగలను? ఆ బిచ్చగాడు - కురూపి - జడదారి యెక్కడ! నా యందా దమయంతి యెక్కడ! ఇట్టి శాస్త్ర విపరీత కార్య మెప్పుడును చేయరాదు. నీ కూతరు కడు ముద్దరాలు. ఆమె నొంటరిగ పిలిచి చెప్పి చూడము. శాస్త్ర - వృద్ధ - సమ్మత వచనములతో నుపాయముతో వారింపుము. అను తన పతి మాటలు విని కైకేయి తన కూతునకిట్లనెను : నీ యింత మిసమిసలాడు సురూప మెక్కడ! ఆ పేదకోతి మొగము వాడెక్కడ! నీవింతటి నెఱజాణవు గదా! ఆ బిచ్చగాని నెట్లు వలచితివే! నీవు తీగె మేనుగల విరిబోడివి. అతడు బూదితో మొరటువారిని మొద్దు. నీ కా కోతిమొగము వానితో సరససల్లాపము లెట్లు సాగునే! ఆ రోతు పుట్టు సన్యాసి మొగముపై నెందుకే నీకింత వలపు. నీ వొక చక్కని రాజపుత్రుని వరింపుము. నీ కంత మొండిపట్టు తగదు. నీ తండి నీవన్న మాటలు దాసినోటవిని యెంతయో కుములుచున్నాడు. తుమ్మచెట్టుచుట్టు మెత్తని మాలతీలత పెనవేసికొనుట జూచిన యే సహృదయుని మనస్సు బాధపడదు? ఈ నేలపై నెంతటి మూర్ఖుడైన తీయని కమ్మతమ్ములము నొంటెనోటి కందించునట్లే. వివాహ శుభ##వేళలో నీ చేయి నారదుని చేయి గలియుటగని యెవని మది యుస్సురనదు! మోమందములేని మగనిని పల్కరించుటకు నీ మనసెట్లొప్పునే! ఇక నీముందు జీవితమంతయు నతని ముందెట్లు గడుపుదువే? అను తన తల్లి హితములాలించి తనుమధ్యయగు దమయంతి నాయందే లగ్నమైన మనస్సుతో కాతరభావముతో తల్లితో నిట్లనెను : కిం ముఖేన చ రూపేణ మూర్ఖస్యచ ధనేన కిమ్ | కిం రాజ్యేనా విదగ్ధస్య చ రసమార్గావిదో%స్య చ. 15 హరిణో%పి వనే ధన్యా యా నాదేన విమోహితాః ప్రాణా న్ర్పయచ్ఛంతి ధిజ్ మూర్ఖాన్మానుషాన్భువి. 16 నారదో వేత్తియాం విద్యాం మాతః సప్తస్వరాత్మికామ్ | తృతీయః కో%పి నో వేద శివాదన్యః పుమాన్కిల. 17 మూర్ఖేణసహ సంవాసో మరణం తతణ | రూప వాన్ధవాం స్త్యాజ్యో గుణమీనో నరః సదా. 18 ధిజ్ మైత్రీం మూర్ఖభూపాలే వృథా గర్వసమన్వితే | గుణజ్ఞే భిక్షుకే శ్రేస్ఠా వచనాత్సుఖాదాయినీ. 19 సర్వజ్ఞో గ్రామవిత్కామం మూర్ఛనా జ్ఞానభేదభాక్ | దుర్లభం పురుషశ్చాష్టరసజ్ఞో దుర్బలో%పి వూ. 20 యథా నయతి కైలాసం గంగా చైవ సరస్వతీ | తథా నయతి కైలాసం సర్వజ్ఞాన విశారదః. 21 స్వరమానం తు యోవేద సదేవో మానుసో%పిసన్ | సప్తభేదం నయోవేద స పశుః సురరాడపి. 22 మూర్ఛనాతాన మార్గంతు శ్రుత్వామోదం నయాతియః | సపశుః సర్వథా జ్ఞేయా హరిణాః పశవో నహి. 23 వరం విషధరః సర్పః శ్రుత్వానాదం మనోహరమ్ | అశ్రోత్రో%పి ముదంయాతి ధిక్సకర్ణాం శ్చ మానవాన్. 24 బాలో%పి సుస్వరం గేయం శ్రుత్వా ముదిత మానసః | జాయతే కింతు యే వృద్ధా న జానంతి ధిగస్తతాన్. 25 పితా మే కిం న జానాతి నారదస్య గుణా న్బహూన్ | ద్వితీయః సామగో నాస్తి త్రషులోకేషు తత్పము. 26 తస్మా దసౌ మయా నూనం వృతః పూర్వం సమాగతామ్ | పశ్చా చ్ఛాపవశాజ్జాతో వానరో%సౌగుణాకరః. 27 కిన్నరా న ప్రియాః కస్య భవంతి తురగాననాః | గానవిద్యా సమాయుక్తాః కిం ముఖేన వరేణ హ. 28 అమ్మా! ఎవడు చతురత తెలియడో యట్టి మూర్ఖునకు గొప్ప రూపము ధనము సుముఖముండి యేమి? లేకేమి? మాతా! : మంజులనాదరాగమునకు లేళ్ళు సైతము పరవశతనంది ప్రాణులు వదలుకొనును. అవి కడు ధన్యములు. ఈ నేలపై మూర్ఖులు వట్టి పనికిమాలిన వారు. తల్లీ! ఈ నారదుడు సప్తస్వరముల గానమాధురిని చక్కగ నెఱింగినవాడు. పరమశివుడు తక్కనితరుని కింత సంగీతస్వర జ్ఞానములేదు. మోజకునితోడి చెలికారము క్షణక్షణము మరణము గల్గుచుండును. సరసగుణహీను డెంతటి రూపధనములు గలవాడైనను వానిని వదలవలయును. వివేకము గోల్పోయి కన్ను మిన్ను గానని మూర్ఖరాజుతో నేస్తము పనికిమాలినది. గుణజ్ఞుడు బిచ్చగాడైనను నెయ్యము తీయనైనది. వాని తీపి మాటలవలన నెడదకు పరమశాంతి చేకూరును. సప్త స్వరజ్ఞానము - ఆరోహణావరోహణ జ్ఞానము - రాగాధి విజ్ఞానము నెఱింగిన యష్టవిధరజ్ఞుఔఔం - డెంత దుర్బలుడైనను సబలుడే. గంగా సరస్వతీ నదులు తమలో మునిగినవానిని తమ మహిమతో కైలాసము చేర్చును. అట్లు సర్వజ్ఞాన విశారదుడు శ్రోతలకు కైలాసానందము గల్గించగలడు. స్వరతాల లయరాగము లెఱింగినవాడు నరుడైనను దేవుడే. స్వరభేద మెరుగనివాడు దేవుడైనను పశుతుల్యుడే. సంగీతములోని తీయని బాణిని తానమార్గము నారోహణాదులను విని ప్రమోదమందని వానినెల్ల భంగుల పశువుగ నెన్నవలయును. కాని, హరిణములను పశువులుగ నెన్నజనదు. విషధరములగు ఫణులు చెవులు లేనివైనను మనోజ్ఞనాదమునకు తన్మయత్వమొందును. కాని, చెవులున్న నరులు వానికంటె తక్కువవారు. శిశువు సైతము సుస్వరముగల పాట విని కేరింతలు గొట్టును. కాని, జగము లుఱ్ఱూతలూగించు రాగాల డోలయగు సంగీత మెఱుగని వృద్ధులు వ్యర్థులు. నారదునిలోని మేలి గుణములు నా తండ్రికి తెలియనివా! ఈ ముల్లోకములందు నతని కెనయగు సామగాయనుడు వేరొక్కడును లేదు గదా! కావుననే నేనా కళాభిజ్ఞుని మొదట నా పతిగ నెమ్మది వరించితిని. ఆ గుణాకారున కటు పిమ్మట శాపవశమున కోతి మొగము ప్రాప్తించెను. కిన్నరు లశ్వముఖులు. గాన విద్యలో నేర్పరులు. వారెవరికి ప్రియులు గారు? మంచి మొగముతో నేమి పని? పితరం బ్రూహి మేమాతర్వృతో%యం మునిసత్తమః | తస్మాత్త్వమాగ్రహం త్యక్త్వా దేహి తసై#్మచమాంముదా. 29 నారద ఉవాచ : ఇతి పుత్య్రా వచః శ్రుత్వా రాజ్ఞీ రాజ్ఞే న్యవేదయత్ | ఆగ్రహం సుందరీ జ్ఞాత్వా సుతాయా నారదే మునౌ. 30 వివాహం కురు రాజేంద్ర ! దమయంత్యాః శుభే దినే | మునినా స చ సర్వజ్ఞో వృతో%సౌ మనసా%నయా. 31 నారద ఉవాచ : ఇతి సంచోదితో రాజ్ఞ్యా సంజయః | పృథివీపతిః | చకార విధివత్సర్వం విధిం వైవాహికం తతః. 32 ఏవం దారగ్రహం కృత్వా వానరాస్యః పరంతప | స్థిత స్తత్రైవ మనసా దహ్యమానేన చాన్వహమ్. 33 యదా%గచ్ఛ ద్రాజసుతా సేవార్థం మమ సన్నిధౌ | అభవం దుఃఖసంతప్త స్తదా%హం వానారాననః. 34 దమయంతీ తు మాం వీక్ష్య ప్రపుల్లవదనాంబుజా | శోకం వానరవక్త్రత్వా న్న చకార కదాచన. 35 ఏవం గచ్ఛతి కాలేతు సహసా పర్వతో మునిః | కుర్వం స్తీర్థా న్యనేకాని ద్రష్టుం మాం సముపాగతః. 36 మయా%తిమానితః ప్రేవ్ణూ పూజితశ్చయథావిధి | ఆసీన ఆసనే దివ్యే వీక్ష్య మాం దుఃఃతోహ్యభూత్. 37 కృతదారం వానరాస్యం దీనం చింతాతురం భృశమ్ | దయా వా న్మామువాచేదం పర్వతో మాతులం కృశమ్. 38 మయా నారద కోపాత్త్వం శప్తో%సి మునిసత్తమ | నిష్కృతిం తస్య శాపస్య కరోమ్యద్య నిశామయ. 39 భవ త్వం చారు వదనో మమ పుణ్యన నారద | దృష్ట్వా రాజసుతాం చిత్తే కృపాజాతా మమా%ధునా. 40 నారదః: మయా%పి ప్రవణం చిత్తం కృత్వా శ్రుత్వా%స్యభాషితమ్ | అనుగ్రహః కృతః సద్య స్తస్య శాపస్య తత్‌క్షణాత్. 41 భాగినేయ తవాప్య స్తు గమనం సురసద్మని | శాపస్యానుగ్రహః కామం కృతో%యం పర్వతాధునా. 42 అమ్మా! నే నా మునిప్రవరుని మనసార వరించితిని. కనుక పట్టుదల వదలి మొదముతో నన్నా ముని కిమ్మని నా తండ్రితో నీవు చెప్పుము. నారదు డిట్లనెను : ఇట్లు తన కూతురు నారదునందే బద్ధానురాగయై యుండుటగని యామె మాటలు విని రాణి రాజుతో నిట్లనెను : రాజేంద్రా! ఒక శుభముమూర్తమున మునితో దమయంతీ వివాహము జరిపించుము. ఆ రసజ్ఞు నామె యెపుడో మదిలో వరించినదట అని రాణి పలుకగ సంజయరాజు పత్నీ ప్రేరితుడై వివాహ విధులు యధావిధానముగ జరిపించెను. అట్లు వానర ముఖముగల నేను పెండ్లి చేసికొని నిత్యము మంటలు చెలరేగు మనస్సుతో నచ్చట నెట్టులో యుంటిని. ఆ రాజపుత్రి నా సేవకు నన్ను సమీపించునపుడు నేను నా కోతిమొగము దలచుకొని మిక్కిలి కుమిలి కృశించిపోవుచుంటిని. కాని, దమయంతి మాత్రము నా కోతిముఖము చూచియు నిట్టూర్పక విప్పారిన తమ్మి మోముతో నొప్పారు చుండెను. అట్లు పెక్కు దినములు గడచెను. పిదప పర్వతముని పెక్కు తీర్థములాడియాడి నన్ను చూచుట కేతెంచెను. నే నతనిని ప్రేమతో పూజించి సత్కరించితిని. నే నొసంగిన ఉన్నతాసనమున కూర్చున్న తరువాత అతడు నన్ను చూచి దుఃఃతుడయ్యెను. నేనతని మేనమామను. నేను కోతిమొగముతో నున్నను పెండ్లి చేసికొని దీనుడనై కృశుడనై చింతాతురుడనై యుండుటగని నాపై నతనికి జాలిగల్గి యిట్లనెను. 'నారద మునివరా! తెలియని కోపముతో నిన్ను శపించితిని. శాప మోక్షణము దెల్పుదును. వినుము. ఆ రాజపుత్రికను చూడగనే నా మదిలో నామెపై దయ పొంగులు పారినది. కనుక నా పుణ్యబలమున నీ మోమందముగ నొప్పుగాక!' పర్వతుని మాటలు వినగనే నా మనస్సు సైతము చెమ్మగిల్లినది. వెంటనే నే నిచ్చిన శాపము ద్రిప్పదలచి యిట్లంటిని : ఓయీ మేనల్లుడా! పర్వతమునీ! ఇపుడు నీ శాపమోచనము గల్గించితిని. ఇక నీకు స్వర్గమేగు శక్తి గల్గుగాక ! నారదః : జాతో%హం చారువదనో వచనాత్తస్య పశ్యతః | రాజపుత్రీ తు సంతుష్టా మాతరం ప్రాహ సత్వరమ్. 43 మాతస్తే సుముఖో జాతో జామాతాచ మహాద్యుతిః | వచనా త్పర్వతస్యాద్య ముక్తశాపో మునేరభూత్. 44 తచ్ఛ్రుత్వా వచనం రాజ్ఞ్యా కథితం తత్రం రాజని | య¸° ద్రష్టుం ముని తత్ర సంజయః ప్రీతిమాంస్తదా. 45 ధనం సమర్పితం రాజ్ఞ్య సంతుష్టేన తదా మహత్ | మహ్యం చ భాగినేయాయ పారిబర్హం మహాత్మనా. 46 ఏతత్తే సర్వం మాఖ్యాతం వర్తనం మత్పరాతనమ్ | మాయాయా బలమహాత్మ్యం హ్యనుభూతం యథా మయా. 47 సంసారే%స్మి న్మహాభాగ మాయాగుణకృతే%కృతే | తనుభృత్తు సుఖీ నా స్తి న భూతో న భవిష్యతి. 48 కామక్రోధౌ తథా లోభో మత్సరో మమతా తథా | అహంకారో మదః కేన జితాః సర్వే మహాబలాః. 49 సత్త్వం రజస్తమశ్చైవ గుణా స్త్రయ ఇమే కిల | కారణం ప్రాణినాం దేహసంభ##వే సర్వథా మునే. 50 కస్మిం శ్చి త్సమయే వ్యాస వనే%హం విష్ణునా సహ | గచ్ఛ న్హాస్యవినోదేన స్త్రీభావం గమితః క్షణాత్. 51 రాజపత్నీత్వ మాపన్నో మాయాబల విమోహతః | పుత్రాః ప్రసూతా బహవో గేహే తస్య నృపస్య హ. 52 వ్యాసః : సంశయో%యం మహాన్సాధోశ్రుత్వా తే వచనం కిల | కథం నారీత్వ మాపన్నస్త్వంమునేజ్ఞానవాన్భృశమ్. 53 కథం చ పురుషో జాతో బ్రూహి సర్వ మశేషతః | కథం పుత్రా స్త్వయాజాతాః కస్య రాజ్ఞో గృహే%ఞ్జసా. 54 ఏత దాఖ్యాహి చరితం మాయాయా మహాదద్భుతమ్ | మోహితం చ యయా సర్వమిదం స్థావరజంగమమ్. 55 న తృప్తి మధి గచ్ఛామి శృణ్వం స్తవ కథా మృతమ్ | సర్వగ్రంథార్థ తత్త్వం చ సర్వసంశయనాశనమ్. 56 ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ షష్ఠ స్కంధే సప్తవిశో%ధ్యాయః. పర్వతుని మాట మాత్రమున నెల్లరు చూచుచుండగనే నా ముఖమందముగ పొదటు మీరెను. రాకుమారి సంతోషముతో వేగమే యీ సంగతి తన తల్లి కిట్లు తెల్పెను : తల్లీ! పర్వతముని దయవలన నీ యల్లునకు శాపము దీరెను. అతని ముఖము పూర్వమువలె కళలు విరజిమ్ముచున్నది. అను కూతు మాటలు విని రాణి రాజుతో చెప్పెను. అంత సంజయుడు నెమ్మితో నా మునిని (నన్ను-నారదుని) దర్శింపనరిగెను. అపుడు మహాత్ముడగు రాజు హర్షముతో నాకు పర్వతునకు పెక్కు ధనరాసులు కానుకగా నిచ్చెను. ఇట్లు నేను సొంతముగ ననుభవించిన మాయాశక్తి మహత్తంతయు పురాణకథగ నీకు వివరించితిని. మహాత్మా! ఈ ప్రపంచమున నింద్రజాలమువంటి మాయామోహమువలన సుఃంచిన - సుఃంచుచున్న - సుఃంపగల మానవుడెవ్వడును లేదు. కామ - క్రోధ - లోభ - మోహ - మద - మత్సరములు మమతాహంకారములు తీవ్రశక్తిగలవి. వాని ముందెంతటి వాడును తలవంచవలసినదే. మునీ! సత్వము - రజము - తమము - అను మూడు గుణశక్తు లెల్లప్రాణుల దేహధారణకు మూలకందములు. నే నొకప్పుడు శ్రీవిష్ణుమూర్తితో హాస్యవినోదములు జరుపుచు నొక వనమున సంచరించుచుంటిని. ఆనాడు నేను క్షణములో నాడుదాననైతిని. నేను మాయామోహితుడనై యొక రాజపత్నినై రాజునింట పెక్కురు కొడుకుల గటంటిని. అని నారదు డన వ్యాసుడిల్లనెను : నారదా! నీవొక స్త్రీవైతివను మాట నాలో సంశయము రగుల్కొల్పుచున్నది. నీవు జ్ఞానివి గదా ! ఎట్లు స్త్రీగ మారితివి? నీ వే రాజు నింట కొడుకుల గంటివి? తిరిగి యెట్లు పురుషుడవైతివి? ఈ చరాచరజగముల బ్రదుకు లే మాయాశక్తిచేత మోహితములో యా మాయాశక్తి బలవత్తర చరిత్ర వినవలతును. శ్రీమాతృదేవి దివ్య కథాసుధారసము సకల గ్రంథార్థసారము సర్వసంశయ నాశకము. అట్టి దేవి చరిత మెంతగ చెవుల పండువుగ గ్రోలినను తనివితీరుట లేదు. ఇది శ్రీమద్దేవీ భాగవతమందలి షష్ఠ స్కంధమందు నారదుడు మాయావశుడగుటయను ఇరువది ఏడవ యధ్యాయము.