Sri Devi Bhagavatam-1
Chapters
అథ అష్టావింశో%ధ్యాయః నారదః : నిశామయ మునిశ్రేష్ఠ గదతో మమ సత్కథామ్ | మాయాబలం సుదుర్జే యం మునిభి ర్యోగవిత్తమైః.
1 మాయయా మోహితం సర్వం జగత్థ్సావరజంగమమ్ | బ్రహ్మాది స్తంబపర్యంత మజయా దుర్విభావ్యయా.
2 కదాచిత్సత్యలోకాద్వై శ్వేతద్వీపే మనోహరే | గతో%హం దర్శనాకాంక్షీ హరే రద్భుతకర్మణః.
3 వాదయ న్మహతీం వీణాం స్వరతాన విభూషితామ్ | గాయత్రం గాయమానస్తు సామ సప్తస్వరాన్వితమ్.
4 దృష్టో మయా దేవదేవ శ్చక్రపాణి ర్గదాధరః | కౌస్తుభోద్భాసితోరస్కో మేఘశ్యా మశ్చతుర్భుజః.
5 పీతాంబరపరీధానో ముకుటాంగదరాజితః | లక్ష్యాసహ విలాసిన్యా క్రీడమానో ముదా యుతః.
6 వీక్ష్య మాం కమలా దేవీ గతా%ంతర్ధాన మంతికాత్ | సర్వలక్షణ సంపన్నా సర్వభూషణభూషితా.
7 నారీణాం ప్రవరా కాంతా రూప¸°వన గర్వితా | సుప్రియా వాసుదేవస్య వరచామీకరప్రభా.
8 అంతర్గృహం గతాం దృష్ట్వా సింధుజాం వ్యంజనాన్వితామ్ | మయా పృష్టో దేవదేవో వనమాలి జగత్ర్పభుః.
9 భగవన్దేవదేవేశ పద్మనాభ సురారిహన్ | కథం చ మా గతా దృష్ట్వా మా మాగచ్ఛంత మంతికాత్.
10 నాహం విటో న వా ధూర్త స్తాపసోహం జగద్గురో | జితేంద్రియో జితక్రోధో జితమాయో జనార్దన.
11 నారద ఉవాచ : నిశమ్య వచనం కించి ద్గర్వయుక్తం జనార్దనః | ఉవాచ మా స్మితం కృత్వా వీణా వన్మధురాం గిరమ్.
12 నారదైవంవిధా నీతి ర్న స్థాతవ్యం కదాచన | పతిం వినా%న్య సాన్నిధ్యే కస్య చి ద్యోషయా క్వచిత్.
13 ఇరువదియెనిమిదవ యధ్యాయము నారదుడు మాయావశుడగుట నారదు డిట్లనెను : మునివరా ! శ్రీదేవీ సత్కథామృతము తేటపరతును. సావధానముగ నాలింపుము. యోగవిదులగు మునులకు సైతము మాయాప్రభావము బోధపడదు. బ్రహ్మ మొదలుకొని గడ్డిపోచవఱకుగల చరాచర ప్రపంచమంతయు మాయాశక్తి విజృంభణమే. మాయ అచింత్యము. జయింపరానిది. నేనొకప్పు డత్యద్భుత కార్యకుశలుడగు హరిని దర్శించుటకు సత్యలోకమునుండి మనోహరమైన శ్వేతద్వీపమున కేగితిని. అపుడు నేను లయతానముల నలరు మహతి వీణియు మీటుచు సప్తస్వరములతో సామగాన మాలపించుచుంటిని. నే నచట విష్ణుని దర్శించితిని. ఆ శ్రీహరి నీలమేఘశ్యామలకోమలాంగుడు - చతుర్భాహువు - ఉరమున రాజిల్లు కౌస్తుభకాంతులవాడు - చక్రగదాధరుడు - దేవదేవుడు. దేవతా సార్వభౌముడు - పీతాంబరుడు - సువర్ణమకుటాంగదవిరాజితుడు - విలాసవతియగు శ్రీలక్ష్మితో నానందశ్రీలతో క్రీడించుచుండగ నేను దర్శించితిని. అత్తఱి సర్వశుభలక్షణసంపన్న - సకల భూషణ భూషితయగు లక్ష్మీదేవి నన్ను చూచి లోపలి మందిరమున కరిగెను. ఆ నారీశిరోమణి రూప¸°వనగర్విత - కాంత - హరిప్రియ - నడయాడు సువర్ణముతోసప్రభ. అట్లు సువ్యక్తములగు శోభనాంగములుగల లక్ష్మి లోనికేగుట గని నేను వనమాలి - జగత్ర్పభువగు దేవదేవోత్తమునితో నిట్లంటిని : 'ఓ దేవదేవేశా! పద్మనాభా! భగవానుడా! లోకైకమాత నా రాకగని యేల లోని కరిగెను? జనార్దనా! జగద్విభూ! నేను జారుడను - ధూర్తుడను గాను. జితేంద్రియుడను జితక్రోధుడను జితమాయుడను గదా! అను నా గరువంపు మాటలు విని జనార్దనుడు చిర్నవ్వుతో వీణ పలికినట్లు తీయగ నిట్లు పలికెను : నారదా! ఏ స్త్రీయైనను తన పతిచెంత దక్క నితరు నొద్ద నెప్పుడు నెక్కడ నుండరాదనుట లోకమర్యాద గదా! మాయాసుదుర్జయా విద్వ న్యోగి భిర్జితమారుతైః | సాంఖ్యవిద్భిర్ని రాహారై స్తాపసైశ్చ జితేంద్రియః.
14 దేవైశ్చ మునిశార్దుల యత్త్వయోక్తం వచో%ధునా | జితమాయో%స్మి గీతజ్ఞ నైవం వాచ్యం కదాచన.
15 నాహం శివో న వా బ్రహ్మ జేతుం తాం ప్రభవో%ప్యజామ్ | మునయః సనకాద్యాశ్చ క స్త్వం కే%న్యే క్షమాజయే.16 దేవదేహం నృదేహంనా తిర్యగ్దేహ మథాపినా | బిభృయాద్యః శరీరం చ స కథం తాం జయే దజామ్. 17 త్రియుతస్తాం కథం మాయాం జేతుః శక్తః పుమాన్భవేత్ | వేదవిద్యోగ విద్వా%పి సర్వజ్ఞో విజితేంద్రియః. 18 కాలో%పి తస్యారూపం హి రూపహీనః స్వరూపకృత్ | తద్వశేవర్తతే దేహీ విద్యాన్మూర్ఖో%థ మధ్యమః. 19 కాలః కరోతి ధర్మజ్ఞ కదాచి ద్వికలం పునః | స్వభావాత్కర్మతోవా%పి దుర్జేయం తస్య చేష్టితమ్. 20 నారద ఉవాచ : ఇత్యుక్త్వా విరతో విష్ణు రహం విస్మయమానసః | తమబ్రువం జగన్నాథం వాసుదేవం సనాతనమ్. 21 రమాపతే ! కథం రూపా మాయా సా కీదృశీ పునః | కియద్బలా క్వసంస్థానా కిమాధారా వదస్వ మే. 22 ద్రష్టుకామో%స్మి తాం మాయం దర్శయాశు మహీధర | జ్ఞాతుమిచ్ఛామి తాం సమ్య క్ర్పసాదం కురు మాపతే. 23 విష్ణురువాచ : త్రిగుణా సా%ఃలాధారా సర్వజ్ఞా సర్వసమ్మతా | అజేయా%నేకరూపాచ సర్వం వ్యాస్య స్థితాజగత్. 24 దిదృక్షా యది తే చిత్తే నారదారోహణం కురు | గరుడే మత్సమేతో%ద్య గచ్ఛావో%న్యత్ర సంప్రతమ్. 25 దర్శయిష్యామి తే మాయాం దుర్జయా మమితాత్మభిః | దృష్ట్వాతాం బ్రహ్మపుత్రత్వం విషాదే మామనః కృథాః. 26 ఇత్యుక్త్వా దేవదేవో మా సస్మార వినతాసుతమ్ | స్మృతమాత్రస్తు గరుడ స్తదాగాద్ధరిసన్నిధౌ. 27 ఈ పలురూపుల మాయను సనకాదిమునులు యోగులు జితేంద్రియులు సాంఖ్యులు నిరాహారులు ప్రాణాయామపరులైనను తెలిసికొనజాలరు. మునివరా! రసజ్ఞా! మాయా దేవతలకు సైత మగమ్యము. నేను జితమాయుడనని పల్కిన మాట మరెప్పుడు నెక్కడ బల్కకుము. బ్రహ్మ - నేను - శివుడు - సైతము గెలువరాని మాయను గెలువ నోపము. ఇక నీవు పరులు నన నెంతటివారు? దేవ - నర - తిర్యగ్జాతుల తనువులు దాల్చినవారు జయింపరాని మాయ నెట్లు జయింపగలరు? వేదవిదుడు - యోగి - సర్వజ్ఞుడు - జితేంద్రియుడు నైనావాడైనను త్రిగుణబద్ధుడైనంత వఱకు మాయను గెల్వనేరడు. కాలము రూపము కాని రూపము గలది. కాలమును మాయా స్వరూపమే. ఒక పండితు డేమి - మధ్యముడేమి మూర్ఖుడేమి - ప్రతివాడును మాయవలలో జిక్కికొనవలసినదే. కాలము దలచుకొన్నచో తన సహజస్వభావా కర్మలచేత ధర్మజ్జుని సైతము వికలునిగ జేయును. కనుక కాలము చేత లెంతవానికిని తెలియరావు అని పలికి విష్ణువు మిన్నకుండెను. నే నాశ్చర్యముతో వాసుదేవుడు సనాతనుడునగు జగన్నాథునితో నిట్లంటిని : రమాపతీ! మాయ యొక్క నిజస్వరూపమేది? దాని శక్తి యెంత? దాని యునికి యెక్కడ? దాని కాధార మేది? దాని స్వభావ మెట్టిది? నాకు తెలుపుము. మాపతీ! భూధరా! మాయను చూడవలతును. దానిని తెలిసికొనగోరుచున్నాను. దయచేసి మాయాచరిత్ర నాకు తెలుపుము అంటిని. విష్ణు విట్లనెను : మాయ త్రిగుణములు - అఃలాధర - సర్వజ్ఞ - సర్వసమ్మత - బహురూప - అజేయ - జగమంతట నిండారి తాండవించును. నారదా! నీకు మాయను గను కుతుక మున్నచో నాతో గరుడు నెక్కుము మన మిద్దఱ మిపుడు వేఱొకచోటి కేగుదము. ఓ బ్రహ్మపుత్రా! జితాత్ములకును దెలియరాని మాయా మహిమ నీకు చూపగలను. దానిని బొంది నీవు మదిలో విచారింపకుము అని హరి నాతో పలికి మదిలో గరుత్మంతుని దలంచెను. అంతలోనే గరుడుడు హరి సన్నిధిలో వచ్చి వ్రాలెను. ఆగతం గరుడం వీక్ష్య ఆరురోహ జనార్దనః | సమారోప్యచ మాం పృష్ఠే గమనాయ కృతాదరః. 28 చలితో వినతాపుత్రో వైకుంఠా ద్వాయువేగవాన్ | ప్రేరితో యత్ర కృష్ణేన గంతుకామేన కాననమ్. 29 మహావనాని దివ్యని సరాంసి సరిత స్తథా | పురా గ్రామాకరాదీంశ్చ ఖేతఖర్వటగోవ్రజాన్. 30 మునినామాశ్రమా న్రమ్యా న్వాపీశ్చ సుమనోహరాః | పల్వలాని విశాలాని హ్రదాన్పంకజ భూషితాన్. 31 మృగాణాం చ వరాహాణాం బృందాన్యప్యవలోక్యచ | గతా వావాంకాన్య కుబ్జ సమీపం గరుడాసనౌ. 32 యత్ర రమ్యం సరో దివ్యం దృష్టం పంకజమండితమ్ | హంసకారండవాకీర్ణం చక్రవాకోప శోభితమ్. 33 నానావర్ణైః ప్రపుల్లై శ్చ పంకజై రుపరంజితమ్ | శుచి మిష్టజలం భృంగయూథ నాదవిరాజితమ్. 34 మామాహ భగవా న్వీక్ష్వ తటాకం పరమాద్భుతమ్ | స్పర్ధకం చోదధేః క్షీరం మిష్టం వారి విశేషతః. 35 శ్రీభగవానువాచ : పశ్యనారదగంభీరం సరః సారసనాదితమ్ | సర్వత్ర పంకజచ్ఛన్నం స్వచ్ఛ నీరప్రపూరితమ్. 36 అత్రస్నాత్వా గమిష్యావః కాన్యకుబ్జ పురోత్తమమ్ | ఇత్యుక్త్వా గరుడాదాశు మాముత్తార్య వ్యతారయత్. 37 విహస్య భగవాం స్తత్ర జగ్రాహ మమతర్జనీమ్ | స్తువన్సరోవరం భూయస్తీరేమా మనయత్ర్పభుః. 38 విశ్రమ్యతటభాగే తు స్నిగ్ధచ్చాయే మనోహరే | మామువాచ మునే ! స్నానం కురు త్వం విమలేజలే. 39 పశ్చాదహం కరిష్యామి తటాకే%స్మి న్సుపావనే - సాధూనామివ చేతాంసి బలాని నిర్మలానిచ. 40 హరి గరుడుని రాక గని నన్నాదరముతో దానిపై నెక్కించి తాను నధిష్ఠించెను. గరుత్మంతుడు హరిప్రేరితుడై వాయు వేగమున తరలి హరి పోదలచిన వనమున కేగెను. అట్లు మేము గరుడు నెక్కి మహా వనములు దివ్య సరస్సులు నదులు పురములు గ్రామములు జనపదములు గొల్లపల్లెలు మునుల పావనాశ్రమములు వాపీకూపములు విశాలములైన నీటి పడియలు కమలకముల కాసారములు జింకల పందుల గుంపులు చూచి కన్యాకుబ్జము దాపున కేగితిమి. అట మేము హంస కారండవ చక్రవాకములతో కమలములతో నలరారు రమణీయమైన సరస్సు గాంచితిమి. ఆ తీయని విమల సలిలములందు పలువన్నెల విరయబూచిన కమలమ్ములచుట్టు గండుతుమ్మెదల గుంపులు చెవుల కింపుగ ఝంకారములు చేయుచున్నవి. ఆ కొలను సముద్రమోయన నొప్పుచున్నది. దానిని గని హరి నాతో నిట్లనెను : 'నారదా! చూడుము. ఈ తమ్మికొలను తుమ్మెదల మారుమ్రోతలచే రమ్యగంభీరముగ నున్నది. ఈ కొలని నిండ కమలములు విరిసినవి! నీరు స్వచ్ఛముగ న్నుది! మనము దీనిలో గ్రుంకి కన్యాకుబ్జపుర మేగుదము' అని పలికి హరి నన్ను గరుత్మంతుని మీది నుండి దింపి తానును దిగెను. అంతట హరి ముసి ముసిగ నగుచు నా చూపుడువ్రేలు పట్టుకొని సరస్సును గొనియాడుచు నన్ను కొలని కెలంకునకు గొనిపోయెను. అట మేము దట్టమైన చల్లని చెట్ల నీడలలో కొంత సేద దీర్చుకొంటిమి. అపుడు హరి యిట్లనెను : 'నీ వీ జలమున తానమాడుము. ఈ నీరు స్వచ్ఛమైనది. ఈ సలిలము సాధులచిత్తమువలె నిర్మలమైనది. నీ పిదప నేను నీ పావన తటాకమున గ్రుంకు లాడుదును. సురభీణి పరాగై స్తుపంకజానాం విశేషత | ఇత్యుక్తో%హం భగవతా ముక్త్వా వీణాం మృగజినమ్. 41 స్నానాయ కృతధీస్తీరే గతః ప్రేమసమన్వితః | పాదౌ ప్రక్షాళ్య హస్తౌచ శిఖాం బద్ధ్వా కుశగ్రహమ్. 42 కృత్వా%%చమ్య శు చిస్తోయే స్నాతవాసస్మి తజ్జలే | యదా తస్మిన్ జలే రమ్యే స్నాతో%హం పశ్యతో హరేః. 43 విహాయ పౌరుషం రూపం ప్రాప్తః స్త్రీత్వ మనుత్తమమ్ | హరిర్గృహీత్వా వీణాంమే తథా కృష్ణాజినం శుభమ్. 44 ఆరుహ్య గగనం తూర్ణం జగామ స్వగృహం క్షణాత్ | తతో%హం స్త్రీత్వమాపన్నశ్చారుభూషణ భూషితః. 45 తత్‌క్షణా న్మనసో జాతః పూర్వ దేహస్య విస్మృతిః | విస్మృతో%సౌ జగన్నాథో మహతీ విస్మృతా పునః. 46 సంప్రాప్య మోహినీ రూపం తటాకా న్నిర్గతో బహిః | అపశ్యం నలినీజుష్టం సరస్త ద్విమలోదకమ్. 47 కిమేతదితి మనసా%కరవం విస్మయం ముహుః | ఏవం చింతయమానస్య నారీరూపధరస్య మే. 48 సహసా దృక్పథం ప్రాప్త స్తత్ర తాలధ్వజో నృపః | గజాశ్వరథబృందైశ్చ సంవృతో రథసంస్థితః. 49 యువా భూషణ సంవీతో దేహవానివ మన్మథః | వీక్ష్య మాం భూపతి స్తత్ర దివ్యభూషణ భూషితామ్. 50 రాకాచంద్రముఖీం యోషాం విస్మయం పరమం గతః | పప్రచ్ఛ కా%సి కల్యాణి! కస్య పుత్రీ సురస్యవా. 51 మానుషస్య చ వా కాంతే గంధర్వస్యోరగస్య చ | ఏకాకినీ కథం బాలా రూప¸°వన భూషితా. 52 వివాహితా%థ కన్యావా సత్యం వద సులోచనే | కిం పశ్యసి సకేశాంతే తటాకే%స్మి న్సుమధ్యమే. 53 చికీర్షితం పికాలాపే బ్రూహి మన్మథ మోహిని | భుంక్ష్వ భోగాన్మరాలాక్షి మయా సహ కృశోదరి ! వాంఛితా న్మనసా నూనం కృత్వా మాం పతి ముత్తమమ్. 54 ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ షష్ఠస్కంధే%ష్టావింశో%ధ్యాయః. ఈ నీరు కమల పరాగములతో పరిమళలహరులు విరజిమ్ముచున్నది' అని హరి యనగ నేను స్నానమాడ నిశ్చయించుకొని వీణియ జింకచర్మము తీసి నెయ్యముతో నీటిచెంతకేగి కాలుసేతులు కడుగుకొని జుట్టు ముడివేసికొని దర్భలు చేబూనితిని. ఆచమించి పవిత్రజలమున స్నానమాడితిని. నేను మునుగునపుడు శ్రీహరి నావంక జూచుచుండెను. నేనింతలోనే పురుషరూపముపాసి సుందర స్త్రీరూపమున నొప్పితిని. విష్ణువు నా వీణను జింకచర్మమును తాను గ్రహించెను. గరుడవాహనుడు గరుడు నెక్కి త్వరితముగ గగన మార్గమున తన వైకుంఠ మేగెను. నేను పలుసొమ్ములుగని చక్కని రమణిగ సొబగు వహించితిని. ఆ మఱుక్షణమునుండి నాకు పూర్వదేహస్మృతిగాని జగన్నాథుని జ్ఞాపకముగాని వీణా విజ్ఞానముగాని లేకుండెను. నేనట్లు మోహినీరూపమంది తటాకము వెల్వడి కమలముల నలరుచు విమలజలములగల కొలకును పరికించు చుంటివి. ఇంతలో నింత వింత యేమి? నా కీ నారి రూపేమి? అని నేను మాటిమాటికి విచారపడుచుంటిని. అంతలో గజాశ్వరథములు తోడు నడుచుచుండగ నరదమెక్కి వచ్చుచున్న తాలధ్వజుడను రాజు కంటికింపుగ నాకంటబడెను. ఆ రాజు మారునకు మాఱు రూపుగ నవయువకుడై దివ్యభూషణ భూషితుడై విరాజిల్లు చుండెను. అతడు భూషణ భూషితనగు నన్ను జూచెను. ఆ రాజచంద్రుడు చంద్రుముఃనగు నన్ను క్రిందుమీదుల చూచి పరమవిస్మయమంది నాతో నిట్లు పలికెను : ఓ కల్యాణీ! నీవెవతెవు? ఎవరి కూతురవు? నీవు దేవతా స్త్రీవా? మానవభామినివా! గంధర్వకన్యవా! నాగకన్యకవా! ఆహా! ఏమి యీ రూపలావణ్యము! ఈ రూప¸°వనములతో అలంకృతవగు నీ వొంటిగ నుంటివేల? నీకు పెండ్లియైనదా? కన్నెవా? నిజము పలుకుము? సుకేశీ! సుమధ్యా! చారులోచనా! ఇచట నేదో వెదుకుచున్నావే! మదనమోహినీ! పికస్వరా! నీ కోరికి యేమో తెలుపుము. తలోదరీ! రాయంచ నడలదానా! నన్ను నీ సొంతము చేసికొని మదిలోని కోర్కులు తీర భోగములనుభవించుము. ఇది శ్రీదేవి భాగవతమందలి షష్ఠ స్కంధమందు నారదుడు మాయావశుడగుటయను ఇరువది ఎనిమిదవ అధ్యాయము.