Sri Devi Bhagavatam-1
Chapters
అథ పంచదశో%ధ్యాయః శ్రీశుక ఉవాచ : నాహంగృహంక రిష్యామిదుఃఖదంసర్వదాపితః వాగురాసదృశం నిత్యం బంధనం సర్వదేహినామ్.
1 ధనచింతాతురాణాం హి క్వ సుఖం తాత దృశ్యతే | స్వజనైఃఖలు పీడ్యంతే నిర్ధనా లోలుపా జనాః.
2 ఇంద్రో%పి న సుఖీ తాదృగ్యాదృశో భిక్షు నిఃస్పృహః | కో %న్యఃస్యా దిహసంసారే త్రిలోకీ విభ##వే సతి.
3 తపంతం తాపసం దృష్ట్వా మఘవా దుఃఖితో%భవత్ | విఘ్నా న్బహువిధా నస్య కరోతి చ దిపస్పతిః.
4 బ్రహ్మా%పి న సుఖీ విష్ణు ర్లక్ష్మీం ప్రాప్య మనోరమామ్ | భేదం ప్రాప్నోతి సతతం సంగ్రామై రసురైః సహ.
5 కరోతి విపులా నృత్నాం స్తప శ్చరతి దుశ్చరమ్ | రమాపతి రపి శ్రీమాన్ కస్యాస్తి విపులం సుఖమ్.
6 శంకరో%పి సదా దుఃఖీ భవత్యేవ చ వేద్మ్యహమ్ | తపవ్చర్యాం ప్రకుర్వాణో దైత్య యుద్ధకరః సదా.
7 కదాచి న్న సుఖీ శేతే దనవా నపి లోలుపః | నిర్ధనస్తు కథం తాత సుఖం ప్రాప్నోతి మానవః.
8 జానన్నపి మహాభాగ పుత్రం మాంవీర్యసంభవమ్ | నియోక్ష్యసి మహాఘోరే సంసారే దుఃఖదే సదా. 9 జన్మదుఃఖం జరాదుఃఖం దుఃఖం చ మరణ తథా | గర్భవాసే పునర్దుఃఖం విష్ఠామూత్రమయే పితః. 10 పదునైదవ అధ్యాయము శ్రీశుకుని వైరాగ్య ప్రభావము శ్రీకుడి డిట్లు పలికెను: తండ్రీ! ఎల్లభంగుల దుఃఖమూలమైన గృహస్థాశ్రమమును నేను స్వీకరింపజాలను. వలత్రాళ్లవలె నిది దేహుల కురివంటిది. ధనాశాపీడితు లాత్మసుఖమునకు నోచుకొనరు. లేనివాడు పేరాసగలవాడు తన కుటుంబము వారిచేతనే బాధింపబడును. ఏ కోర్కెలునులేని బిచ్చగాడు పొందు సహజ సుఖము నింద్రుడు సైతమందజాలడు. త్రైలోక్యభోగ్యములు బొందినప్పటికి ప్రాణులు సుఖింపజాలరు. దేవేంద్రుడంతటివాడే తపించు తాపసులనుగాంచి దుఃఖితుడై యీసున వారికి బహుభంగుల భంగములు గల్గించుచుండును బ్రహ్మయు నిత్యానందరహితుడే. శ్రీహరియును తన మనోహారిణి యగు శ్రీ మహాలక్ష్మిని చేపట్టినప్పటికిని రక్కసుల యక్కడగించుచు మాటిమాటికి ఖేదపడుచుండను. ఆ శ్రీమంతుడగు విష్ణువెన్నియో యిక్కట్టులకు గురియై కఠిన తపమాచరించెను. శ్రీపతియే యిట్లుండ నిక సామాన్యుల గతి యెట్లుండును? రుద్రుడు సతతము తపము చేయుచు రాక్షసులను చెండాడుచునుండును. అతడును పాపమెన్నియో వెతలకు గురి యగు చుండును. కలవానికి భయమున కంటినిండుగ కూర్కురాదు. ఇక లేనివాడులేనవాడే గద! వాడు సుఖమునకు మొదలే నోచుకొనలేదు. నీ కౌరసపుత్త్రుడనగు నన్నే నీవీ ఘోరనరకతుల్య సంసారమందే మునుగుమని యేల నియోగింతువు? ఎల్ల ప్రాణులకు మాటిమాటికి జన్మదుఃఖము జరాదుఃఖము మరణదుఃఖము మలమూత్రమయమగు గర్భవాసమున దుఃఖము గల్గుచుండును. తస్మా దతిశయం దుఃఖం తృష్ణాలోభసముద్భవమ్ | యాచ్నాయాం పరమం దుఃఖం మరణా దపి మానద. 11 ప్రతిగ్రహ ధనా విప్ర న బుద్ధిబలజీవనాః | పరాశా పరమం దుఃఖం మరణం చ దినే దినే. 12 పఠిత్వా సకలా న్వేదాం ఛాస్త్రాణి చ సమం తతః | గత్వా చ ధనినాం కార్యా స్తుతిః సర్వాత్మనా బుధైః. 13 ఏకోదరస్య కా చింతా పత్రమూలఫలాదిఖిః | యేనకేనా ప్యుపాయేన సంతుష్ట్యా చ ప్రపూర్యతే. 14 భార్యా పుత్రా స్తథా పౌత్రాః కుటుంబే విపులే సతి | పూరణార్థం మహద్దుఃఖం క్వ సుఖం పిత రద్భుతమ్. 15 యోగశాస్త్రం వద మమ జ్ఞానశాస్త్రం సుఖాకరమ్ | కర్మకాండే%ఖిలే తాత న రమే%హం కదాచన. 16 వద కర్మక్షయోపాయం ప్రారబ్ధం సంచితం తథా | వర్తమానం యదా నశ్యే త్త్రివిధం కర్మమూలజమ్. 17 జలూకేవ సదా నారీ రుధిరం పిబతీతి వై | మూర్ఖస్తు న విజానాతి మోహితో భావచేష్టితైః. 18 భోగై ర్వీర్యం దనం పూర్ణం మనః కుటిలభాషణౖః | కాంతా హరతి సర్వస్వం కః స్తేనస్తాదృశో% పరః. 19 నిద్రాసుఖవినాశార్థం మూర్ఖస్తు దారసంగ్రహమ్ | కరోతి వంచితో దాత్రా దుఃఖాయ న సుఖాయ చ. 20 మహాలోభిత్వమును దురాశయు దుఃఖము చేటు. యాచన మరణదుఃఖముకంటెను చేటును బాధాకరమునైనది. విప్రులు ప్రతి గ్రహమువలననే తమ జీవితములు వెళ్లబుత్తురు. వారు బుద్ధిబలముగల జీవులుగారు. పరాశ పరమదుఃఖము. అది దిన మొక గండమువంటిది. ఎల్ల వేదశాస్త్రార్థములను చక్కగ తుదిముట్ట చదివిన పండితప్రకాండులే ధనమదాంధుల పజ్జచేరి వారిని పెక్కు రీతుల పై కెత్తుచు పొట్టపోసికొందురు. ఈ జానెడు చిఱుతపొట్టకింత చింత యెందులకు? దీనిని ఫలాదులతో ఆకులములతో నేదేనుపాయముతో నింపి తనపవచ్చును. తండ్రీ ! భార్యవలన కొడుకులును వారివలన మనుమండ్రును పుట్టుదురు. కుటుంబపు భారము పెద్దదగును. వారి పోషణభారము దుఃఖభారమగును. ఇక నాత్మసౌఖ్య మెక్కడిది? ఓ తండ్రీ! కావుననే భేదాలు మాయామోహాలు పుణ్యపాపాలు లేని పరిపూర్ణము సత్యవస్తునిష్ఠము నగు బ్రహ్మకాండను యోగ శాస్త్రమును గుఱించి నాకు దెలుపుము. విభేదాలు పుట్టించునట్టి కర్మ బాహుళ్యమందు నా మదియెన్నడును చొరకున్నది. కర్మలు ప్రారబ్ధము సంచితము వర్తమానమునని మువ్విధములు గద! అది సమూలముగ క్షయించు తెఱంగెఱింగింపుము. జవరాలు జలగమాదిరి నరజాతి వీర్యమంతయును పీల్చిపిప్పి చేయును. ఆ వలపులాడి వన్నె చిన్నెలకు మత్తచిత్తుడైన నరుడీ విషయము నెఱుగనేలేడు. స్త్రీలు భోగములతో ధన వీర్యములను కుటిలవచనములతో మనస్సును మరింతురు. అట్టి స్త్రీ నెవడుకోరును? మూర్ఖుడే భార్యను చేపట్టును. సౌఖ్యము బోగొట్టుకొనును. ఫలితముగ మిగులునది దుఃఖమేకాని సుఖముగాదు. ఇట్లు మూర్ఖుడు విధిలీలకు మోసపోవును. సూత ఉవాచ : ఏవంవిధా నివాక్యానిశ్రుత్వావ్యాసఃవుకస్యచ | సంప్రాపమహతీంచింతాంకింకరోమీత్యసంశయమ్. 21 తస్య సుస్రుపు రశ్రూణి లోచనా ద్దుఃఖజాని చ | వేపథు శ్చ శరీరే%భూ ద్గానిం ప్రాప మనస్థతా. 22 శోచంతం పితరం దృష్వా దీనం శోకపరిప్లుతమ్ | ఉవాచ పితరం వ్యాసం విస్మయోత్పుల్ల లోచనః. 23 అహో మాయాబలం చోగ్రం యన్మోహయతి పండితమ్ | వేదాంతస్య చ కర్తారం సర్వజ్ఞం వేదసమ్మితమ్. 24 న జానే కా చ సా మాయా కిం స్విత్సా%తీవ దుష్కరా | యా మోహయతి విద్వాంసం వ్యాసం సత్యవతీ సుతమ్ 25 పురాణాం చ వక్తా చ నిర్మాతా భారతస్య చ | విభాగ కర్తా వేదానాం సో%పి మోహ ముపాగతః. 26 తాం యామి శరణం దేవీం యా మెహయతి వై జగత్ | బ్రహ్మ విష్ణు హరాదీంశ్చ కథా%న్యేషాం చ కృదృశీ. 27 కో% ప్యస్తి త్రిషు లోకేషు యో న ముహ్యతి మాయయా | య న్మోహం గమితాః పూర్వే బ్రహ్మ విష్ణు హరాదయః. 28 అహో బల మహో వీర్యం దేవ్యాః ఖలు వినిర్మితమ్ | మాయయైవ వశం నీతః సర్వజ్ఞ ఈశ్వరః ప్రభుః. 29 విష్ణ్వంశ సంభవో వ్యాస ఇతి పౌరాణికా జగుః | సో%పి మోహార్ణవే మగ్నో భగ్నపోతో వణిగ్యథా. 30 అశ్రుపాతం కరో త్యద్య వివశః ప్రాకృతో యథా | అహో మాయాబలం చైత ద్దుస్త్యజం పండితై రపి. 31 కో%యం కో%హం కథం చేహ కీదృశో%యం భ్రమః కిల | పంచభూతాత్మకే దేహే పితా పుత్రేతి వాసనా. 32 బలిస్ఠా ఖలు మాయేయం మయినా మపి మోహినీ | యయా%భి భూతః కృష్ణో%పి కరోతి రుదనం ద్విజః. సూతుడిట్లనియె : అని శుకుడు విరాగియై పలుకు ఈ పలుకులు విని వ్యాసుడు చింతాగ్రస్తుడై యిపుడేమి చేతునని తలపోయసాగెను. వ్యాసుని కన్గొలకులు దుఃఖముచే చెమర్చెను. నెమ్మేను గడగడలాడెను. మనస్సు గ్లానమయ్యెను. ఇట్లతి దీనముగ శోకాతురుడై వెతలబొగులు వ్యాసునకు వింతగదుర విప్పాదిన నేత్రములతో శుకుడిట్లు పలుక దొడగెను: ఆహా! ఈ మాయ యెంత బలవత్తరమైనది! ఇది వేదాంతకారుడు వేదసమ్మతుడు వేదవిదుడునైన పండితోత్తమునిగూడ మోహింపజేయుచున్నదే! ఆ మాయ సత్యవతీసుతుడు విద్వాంసుడునైన వ్యాసునకుగూడ మోహము గల్గించుచున్నది. కనుక మాయ దుస్త్యజ. ఆ మాయ రూపెట్టిదో యెతవారికిని దెలియరాదు. వేదవిభాగకర్త విపులపురాణవక్త భారత గ్రంథ నిర్మాతయగు వ్యాసుని సైతము మోహభ్రాంతి యావరించెనే! కావున నే యద్భుతశక్తి యీ ముజ్జగములను పెనుభ్రమలో ముంచెత్తునో యే యత్కృష్టశక్తి బ్రహ్మవిష్ణుహరులను సైతము మోహపెట్టునో నేనా పరాశక్తినిపుడు శరణు వేడుచున్నాను. ఆ శక్తిచే అంతటివారే మోహితులుగా నితరు లెంతటివారలు? ఆ మహాద్భుతమాయాశక్తి బ్రహ్మవిష్ణుమహేశ్వరులనే మోహింపజేసినది. ఆ మహాశక్తికి వారే తలలు వంచిరి. ఇక నాశక్తి భ్రమలో పడనివాడే లేడు. ఆహా! ఆ సర్వశక్తి వీర్యపటిమ యెంతన వలయును! ఆ శక్తి తేజోబలమెంతని చెప్పగలము!! ఆ శక్తులు మహాద్భుతశక్తులు. ఇంత యేల? సర్వజ్ఞుడగు శంకరుడే శక్తియుక్తుడు గానిచో నేమియు చేయజాలడు గద! వ్యాసుడు విష్ణ్వంశసంజాతుడని పౌరాణికులు నుడువుదురు. మరి యంతటివాడే భగ్ననౌకలోని వ్యాపారివలె మోహసాగరమందు మునిగిపోయెనే! ఈ సమయమందే వ్యాసుడే ప్రాకృతమనుజుని పగిది వివశుడై కన్నీరొలుక బోయుచున్నాడు. పండితులు సైతము మాయాబలమునుండి విముక్తులు కాజాలరు. నేనెవరను? ఇతడెవరు? ఈ వీడనిభ్రమ యెక్కడిది? ఈ తండ్రికొడుకుల వాసనల సంబంధ మీ పాంచ భౌతిక దేహమునకు మాత్రమే యుండును. ఈ మాయశక్తి యెంతయో బలవత్తరమైనది. ఇది మాయికులను సైతము తన మాయలో ముంచివేయును. వ్యాసుడంతటి వాడే నేడు మాయామోహునకు వశుడై పలవరించుచున్నాడు. సూత : తాం నత్వా మనసా దేవీం సర్వకారణ కారణామ్ | జననీం సర్వదేవానాం బ్రహ్మాదీనాం తథేశ్వరీమ్. 34 పితరం ప్రాహ దీనం తం శోకార్ణవ పరిప్లుతమ్ | అరణీ సంభవో వ్యాసం హేతుమ ద్వచనం శుభమ్. 35 పారాశర్య మహాభాగ సర్వేషాం బోధదః స్వయమ్ | కిం శోకం కురుషే స్వామి న్యథా%జ్ఞః ప్రాకృతో నరః. 36 అద్యాహం తన పుత్రో%స్మి న జానే పూర్వజన్మని | కో%హం కస్త్వం మహాభాగ విభ్రమో %యం మహాత్మని. 37 కురు ధైర్యం ప్రబుధ్య స్వ మా విషాదే మనః కృథా ! | మోహజాల మిమం మత్వా ముంచ శోకం మహామతే. 38 క్షుధా నివృత్తి ర్భక్ష్యేణ న పుత్రదర్శనేన చ | పిపాసా జలపానేన యాతి నైవాత్మజేక్షణాత్. 39 ఘ్రాణం సుఖం సుగందేన కర్ణజం శ్రవణన చ | స్త్రీసుఖం తు స్త్రియా నూనం పుత్రో%హం కింకరోమి తే. 40 అజీగర్తేన పుత్రో%పి హరిశ్చంద్రాయ భూభుజే | పశుకామాయ యజ్ఞార్ధే యజ్ఞార్థే దత్తో మౌల్యేన సర్వథా. 41 సుఖానాం సాధనం ద్రవ్యం ధనా త్సుఖసముచ్చయః | దన మర్జయ లోభ శ్చే త్పుత్రో%హం కింకరో మ్యహమ్. 42 మాం ప్రబోధయ బుద్ధ్యా త్వం దైవజ్ఞో%సి మహామతే | యథా ముచ్యేయ మత్యంతం గర్భవాస భయా న్మునే. 43 దుర్లభం మానుషం జన్మ కర్మభూమా విహా నఘ | తత్రాపి బ్రాహ్మణత్వం వై దుర్లభం చోత్తమే కులే. 44 బద్ధో%హ మితి మే బుద్ధి ర్నాపసర్పతి చిత్తతః | సంసారవాసనాజాలే నివిష్టా వృద్ధగామినీ. 45 సూతు డిట్లనియెను : అంతట శుకుడు సకల దేవతలకే మాతృ దేవతయు బ్రహ్మాదుల కీశ్వరియు సకల కారణ కారణయునగు దేవిని నెమ్మదిలో భావించి నమస్కరించెను. పిదప నరణి సంజాతుడగు శుకుడు మోహసాగరమున మునింగిన తన తండ్రి వ్యాసునకు సహేతుకములుగ బ్రహ్మవాక్కులు ఇటులు పలికెను : ఓ మహామనీషీ ! ఎల్లరకు నీవే తెలియజెప్పువాడివే! నీవే యిప్పుడొక సామాన్యుని పగిది విషాదమునంద నేల! ఇపుడు మాత్రమే నేను నీ కుమారుడను. వెనుకటి జన్మలో నీవెవరవో నేనెవరనో యెఱుగము. సర్వాత్మదృష్టితో చూడగా దండ్రికొడుకుల సంబంధము భ్రమ మాత్రమే యగును. ఆత్మధైర్యము బొందుము. సావధానుడవు గమ్ము. డెందమందు దౌర్బల్యమందకుము. ఇదంతయును మోహజాలమని గుర్తెఱుంగుము. వైక్లబ్యమందకుము. తినుటవలన నాకలి చల్లారును. త్రాగుటవలన దప్పిక తీరును. కాని పుత్త్రదర్శనమున నాకలి దప్పికలు తీరవు. నెత్తావి వలన ఘ్రాణతర్పణము గల్గును. మంచి వినికిడిచే చెవికింపగును. స్త్రీ వలన కామసుఖము లభించును. నేను నీ కొమరుడనే. ఐన నా వలన నీకేమి సుఖము గలదు? పూర్వ మజీగర్తుడు తన కొమరుని హరిశ్చంద్రునకు యాగపశువుగ వెలకమ్మెను. ద్రవ్య మెల్లసుఖములకు సాధనము. ఈ ధనమువలన సుఖములు గల్గును. నీకు స్వార్థబుద్ధిగలదేని డబ్బు సంపాదించుము. నేను నీ కొమరుడనే. ఐన నా వలన నీకేమి సుఖము గలదు! నీవు దైవజ్ఞుడవు. కావున నన్ను స్థిత ప్రజ్ఞుని చేయుము. నన్నీ గర్భవాసనరకమునుండి విముక్తుని జేయుము. ఇది కర్మభూమి. ఇట మనుజ జన్మ కడుంగడు దుర్లభము. అందు నుత్తమకులమున బ్రహ్మతత్త్వ మెఱింగిన బ్రాహ్మణుడై జన్మించుట యెంతెంతో దుర్లభము. నేను వేరు - బ్రహ్మము వేరు అను భేదభావమున బద్ధుడనైతిని. నన్నీ భేదబుద్ధి వీడుట లేదు. ఇట్టి సంసారవాసన ముసలితనమందును వదలక అంటిపెట్టుకొనియే యుండును. సూత ఉవాచ : ఇత్యుక్తస్తు తదా వ్యాసః పుత్రేణా మితబుద్ధినా | వ్రత్య్యు వాచ శుకంశాంతం చతుర్థాశ్రమమానసమ్. 46 పఠ పుత్ర మహాభాగ మయా భాగవతం కృతమ్ | శుభం న చాతివిస్తీర్ణం పురాణం బ్రహ్మసమ్మితమ్. 47 స్కంధా ద్వాదశ తత్రైవ పంచలక్షణ సంయుతమ్ | సర్వేషాం చ పురాణానాం భూషణం మమ సమ్మతమ్. 48 సదస ద్జానవిజ్ఞానం శ్రుతమాత్రేణ జాయతే | యేన భాగవతే నేహ తత్పఠ త్వం ఘహామతే | 49 వటపత్రే శయానాయ విష్ణవే బాలరూపిణ | కేనాస్మి బాలబావేన నిర్మితో%హం చిదాత్మనా. 50 కిమర్థం కేన ద్రవ్యేణ కథం జానామి చాఖిలమ్ | ఇత్యేవం చింత్యమానాయ ముకుందాయ మహాత్మనే. 51 శ్లోకార్థేన తయా ప్రో క్తం భగవ త్యా%ఖిలార్థదమ్ | సర్వం ఖల్విద మేవాహం నాన్య దస్తి సనాతనమ్. 52 తద్వచో విష్ణునా పూర్వం సంవిజ్ఞాతం మన స్యపి | కేనోక్తా వాగియం సత్యా చింతయామాస చేతసా. 53 కథం వేద్మి ప్రవక్తారం స్త్రీపుంసౌ వా నపుంసకమ్ | ఇతి చింతాం ప్రపన్నేన ధృతం భాగవతం హృది. 54 పునఃపునః కృతో చ్చార స్తస్మిన్నేవాస్త చేతసా | వటపత్రేశయానః స న్న భూచ్చింతా సమన్వితః. 55 సూతు డిట్లనియె : ఈవిధముగ సర్వకర్మ సంన్యాసమునే చిత్తమందిచ్చగించు శాంతుడగు శుకుని వ్యాసుడిట్లు ప్రబోధించెను: మహాభాగ! నీవు నా వ్రాసిన శ్రీ మహాభాగవతము చదువుము. ఆ పురాణము బ్రహ్మసమ్మితము. అనతి విస్తృతము. అది పండ్రెండు స్కంధములతో పంచలక్షణములతో సకల పురాణముల కలంకార ప్రాయమై అలరారుచున్నది. అది నా మదికెంతయో ప్రియమైనది. ఆ భాగవతమొక్కసారి విన్న మాత్రమున సదసద్వివేకము ప్రత్యక్ష జ్ఞానము విజ్ఞానము గల్గును. కావున నీవు దానిని శ్రద్ధగ చదువుము. పూర్వము పాలసంద్రముపై పటప్రతముమీద పరుండియున్న బాలరూపుడగు శ్రీవిష్ణువు తనలో నేనే సచ్చిదానందరూపముచేత నీ బాలరూపమందితిని. నేనే నిత్యవస్తువువలన నీ రీతిగ జన్మించితిని. ఈ సర్వవిశ్వము నేనెట్లు దెలిసికొనగలను? అని తలంచెను. అంతలోనే దయామయియగు భగవతి సకలార్థసాధకమైన వాక్యమును శ్లోకార్థమున నిట్లు పలికెను : 'ఈ కనంబడు జగమంతయు నేనే; పూర్ణఘనానందమున నిండియున్నాను. నాకన్న మిన్నయగు సనాతన వస్తువు మరేదియును లేదు.' విష్ణువు నెమ్మదిలో ఈ ధ్వని యెవరిదో ! ఈ పలికినది నరుడా? నారియా? పేడియా? నేనెట్లు గుర్తించగలనని విచారించెను. ఆ శ్లోకార్థరూపమగు భాగవతమునే అతడు తన యెడదలో మననము చేయదొడగెను. ఆ బాలుడా వటపత్రమందే పరుండి మాటిమాటికి నా దేవి పలికిన వాక్యార్థము విషయమును తన హృదిలో నాలోచించు చుండెను. తదా శాంతా భగవతీ ప్రాదురాస చతుర్భుజా | శంఖ చక్ర గదా పద్మ వరాయుధ ధరా శివా. 56 దివ్యాంబరాధరా దేవీ దివ్య భూషణ భూషితా | సంయుతా సదృశీభిశ్చ సఖీఖిః స్వవిభూతిభిః. 57 ప్రాదు ర్బ భూవ తస్యాగ్రే విష్ణో రమితతేజసః మందహాసం ప్రయుంజానా మహాలక్ష్మీః శుభాననా. 58 తాం తథా సంస్థితాం దృష్ట్యా హృదయే కమలే క్షణః | విస్మితః సలిలేతస్మిన్ని రాధారాంమనోరమామ్. 59 రతి ర్భూతి స్తథా బుద్ధి ర్మతిః కీర్తిః స్మృతి ర్దృతిః | శ్రద్ధా మేధా స్వధా స్వాహా క్షుధానిద్రా దయాగతిః. 60 తుష్టిః పుష్టిః క్షమా లజ్జా జృంభా తంద్రా చ శక్తయః | సంస్థితాః సర్వతః పార్మ్వేమహాదేవ్యాః పృథక్‌పృథక్. 61 వరాయుధ ధరాః సర్వా నానాభూషణ భూషితాః | మందారమాలా కలితా ముక్తాహార విరాజితాః. 62 తాం దృష్ట్వా తాశ్చ సంవీక్ష్య తస్మి న్నే కార్ణవే జలే | విస్మయా విష్ట హృదయః సంబభూవ జనార్దనః. 63 చింతయామాస సర్వాత్మా దృష్ట మాయో%తివిస్మితః | కుతోభూతాః స్త్రియః సర్వాః కుతో %హం వటతల్పగః. 64 అస్మిన్నే కార్ణవే ఘోరే న్యగ్రోధః కథ ముత్థితః | కేనాహం స్థాపితో%స్మ్యత్ర శిశుం కృత్వా శుభాకృతిః. 65 మమేయం జననీ నో వా మాయా వాకా%పి దుర్ఘటా ! దర్శనం కేనచి త్త్వద్య దత్తం వా కేన హేతునా. 66 కిం మయా చా త్ర వక్తవ్యం గంతవ్యం వా న వా క్వచిత్ | మౌన మాస్థాయ తిష్ఠేయంబాలభావా దతంద్రితః. 67 ఇతి శ్రీదేవిభాగవతే మహాపురాణ ప్రథమస్కంధే పంచదశో%ధ్యాయః. అంతట నా భగవతీ దేవి విష్ణునకు ప్రత్యక్షమయ్యెను. ఆ దేవి శంఖము చక్రము గద పద్మము వరాయుధములు దాల్చి తేజరిల్లు సత్యస్వరూపిణి. చతుర్భుజ. దివ్యాంబరధారణి-దివ్యభూషణ భూషిత-తన దివ్యవిభూతులను బోలిన నెచ్చెలులతో గూడి అచ్చెరువుగ నుండెను. ఆ దేవి తన ప్రసన్న వదనమున చిరునగవుసిరులు చిందులాడగ శ్రీమహలక్ష్మీరూపముతో తేజోనిధియగు విష్ణుని సన్నిధిని ప్రత్యక్షమైనది. సూతు డిట్లనియె : ఆ మున్నీటియందు నిరాధారయై కలుములీను కమలను మనోరమను శ్రీవిష్ణువు తన హృదయకమలము నిండుగ దర్శించి విప్పారిన నయనకమలములతో నొప్పారెను. అపుడు రతి భూతి బుద్ధి మతి కీర్తి స్మృతి ధృతి శ్రద్ధ మేధ స్వధ స్వాహా క్షుధ నిద్ర దయ గతి పుష్టి తుష్టి జృంభ తంద్ర క్షమ లజ్జ మున్నగు దివ్యశక్తులా శ్రీమహారాజ్ఞికి నల్గడలం జేరి ప్రేమ నివాళు లర్పించుచుండిరి. వారిలో ప్రతి యొక్కరును దివ్యవరాయుధములు నానా దివ్యభూషలు మందారమాలికలు జాతిముత్యాలహారాలు దాల్చి దివ్యశోభలు వెలార్చుచుండిరి. మహాసాగర మధ్యమం దా దివ్యాంగనలను కలయ వీక్షించిన జనార్దనుని డెందమాశ్చర్యపులకితమయ్యెను. ఆ విశ్వభూతాత్మకూడా మహామాయకచ్చెరువంది యిట్లు తలంపసాగెను: ''ఈ యందచందాలు విరజిమ్ము కాంతలెక్కడి వారలొకో! ఈ మఱ్ఱియాకు సెజ్జపై నున్న నేనెక్కడి వాడనో! ఇది అంతుపంతులేని మహాజలరాశియే. ఇందీ మహావటవృక్షమునకు కారణమేది? నేనెవరి మూలమున నిటుల ముద్దులుగారు బాలుడనై యుంటిని? ఈ దేవి నాకు జననియా! లేక దురంతమైన మాయయా!! ఏ కారణమున పుణ్యవిశేషమున నా కీమె దర్శనభాగ్యము చేకురినదో! నేనిపుడేమి పలుకవలయును? ఎట కేగవలయును? బాలభావముననే యప్రమత్తుడనై మౌనభాషతో నుండవలయునా?'' ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణ మందలి ప్రథమస్కంధమందలి పంచదశధ్యాయము