Sri Devi Bhagavatam-1
Chapters
అథ ఏకోనత్రింశో%ధ్యాయః నారదః : ఇత్యుక్తో%హంతదాతేన రాజ్ఞాతాలధ్వజేన చ | విమృశ్య మనసా%త్యర్థం తమువాచ విశాం పతే.
1 రాజన్నాహం విజానామి పుత్రీం కస్యేతి నిశ్చయమ్ | పితరౌ క్వ చ మే కేన స్థాపితా చ సరోవరే.
2 కిం కరోమి క్వగచ్ఛామి కథం మే సుకృతంభ##వేత్ | నిరాధార%స్మి రాజేంద్ర చింతయామి చికీర్షితమ్. 3 దైవమేవ పరం రాజ న్నా స్త్యత్ర పౌరుషం మమ | ధర్మజ్ఞో%సి మహీపాల యథేచ్ఛసి తథా కురు. 4 తవాధీనా%స్మ్యహం భూప నమే కో%ప్యస్తి పాలకః | న పితా నచ మాతాచన స్థానం న చ బాంధవాః. 5 ఇత్యుక్తో%సౌ మయా రాజా బభూవ మదనాతురః | మాం నిరీక్ష్య విశాలాక్షీం సేవకా నిత్యువాచ హ. 6 నర యాన మానయధ్వం చతుర్వాహ్యం మనోహరమ్ | ఆరోహణార్థ మస్యాస్తు కౌశేయాంబరవేష్టితమ్. 7 మృద్వాస్తరణ సంయుక్తం ముక్తాజాల విభూషితమ్ | చతురస్రం విశాలం చ సువర్ణరచితం శుభమ్. 8 తస్య తద్వచనం శ్రుత్వా భృత్యాః సత్వరగామినః | ఆనిన్యుః శిబికాం దివ్యాం మదర్ధే వస్త్రవేష్టితమ్. 9 ఆరూఢా%హం తథా తస్యాం తస్య ప్రియ చికీర్షయా | ముదితో%సౌ గృహే నీత్వా మాం తథా పృథివీపతిః. 10 వివాహ విధినా రాజా శుభే లగ్నే శుభే దినే | ఉపయేమే చ మాం తత్ర హుతభు క్సన్నిధౌ తతః. 11 తస్యాహం వల్లభా జాతా ప్రాణభ్యో%పి గరీయసీ | సౌభాగ్య సుందరీ త్యేవం నామ తత్ర కృతం మమ. 12 రమమాణో మాయా సార్ధం సుఖ మాప మహీపతిః | నానాభోగవిలాసై శ్చ కామశాస్త్రోదితై స్తథా. 13 ఇరువదితొమ్మిదవ యధ్యాయము మాయా ప్రభావము - నారద వృత్తాంతము నారదు డిట్లనెను : వ్యాసమహర్షీ! అట్లు తాలధ్వజరాజు పలుకగ నేను నెమ్మది నంతయు నాలోచించుకొని యతని కిట్లంటిని : భూపతీ! నేనెవరి కూతురనో! నా తలిదండ్రు లెవరో! ఈ కొలకులో నన్నెవ రుంచిరో యథార్ధము నాకే తెలియదు. నరపతీ! నేనిపుడింకేమి చేతును? ఇంకెక్కడి కేగుదును! దిక్కుమాలిన దాననైతిని. నాకు ముందు మేలెట్లు జరుగునా యని చింతించుచున్నాను. మహీపాలా! రమణీప్రియా! దైవము బలవత్తరమైనది. పౌరుషము పనికిమాలినది. నీవు ధర్మజ్ఞుడవు. నన్ను నీ మది కింపగునట్టు లేమైన చేసికొమ్ము. వద్దనను. నాకిపుడు తల్లి - తండ్రి - బంధువు - పోషకుడు - నాథుడు - నాయను వాడెవ్వడును లేడు. ఏకాంతను. కాంతను అని నేను నెయ్యము తియ్యము దోప పల్కితిని. అంత నా రాజులో పట్టరాని మదనావేశము ముంచుకొని వచ్చెను. అతడు తన సేవకుల కిట్లనెను : ఈ వరారోహ యారోహించుటకు నలుగురు మోయు చక్కని పల్లకి తెండు. అందు మెత్తని పట్టు వస్త్రములు వేయవలయును. అది మెత్తని పడక గావలయును. పల్లకి చతురస్రముగ సువిశాలముగ సువర్ణమయమై యుండవలయును అను రాజు వాక్కులు వినగనే సేవకులు వేగముగ వెళ్ళి నా కొఱకు వస్త్రము గప్పిన బంగారు పల్లకి తెచ్చిరి. నేను రాజునకు ప్రియుముగూర్చు తలపుతో నందు గూర్చంటిని. రాజు మోదభరితుడై నన్ను తన యింటికి గొనిపోయెను. ఆ రాజొక శుభదినమున శుభలగ్నమున నన్ను పాణిగ్రహణము చేసికొనెను. ఆ పెండ్లి విధిప్రకార మగ్ని సన్నిధిలో జరిగెను. నే నతనికి ప్రాణములకన్న మిన్నగ ప్రియురాలనైతిని. అతడు నాకు సౌభాగ్యసుందరియను క్రొత్త పేరు పెట్టెను. ఆ రాజు కామశాస్త్రమునందు చెప్పిన చొప్పున పెక్కు భోగవిలాసములతో నాతో క్రీడించుచు సుఖము నందెను. అతడు రేబవళ్ళు కామకళయం దాసక్తుడై రాచకార్యము లందేమరుపాటు జెంది కాలగతి గుర్తింపకుండెను. రాజకార్యాణి సంత్యజ్య క్రీడాసక్తో దివానిశమ్ | నా సౌ వివేద గచ్ఛంతం కాలం కామకలారతః. 14 ఉద్యానేషు చ రమ్యేషు వాపీషు చ గృహేషు చ | హర్మ్యేషు వరశైలేషు దీర్ఘికాసు వరాసు చ. 15 వారుణీ మదమత్తో%సౌ విహారన్కాననే శుభే | విసృజ్య సర్వ కార్యాణి దదధీనో బభూవ హ. 16 వ్యాసాహం తేన సంసక్తా క్రీడా రసవశీకృతా | స్మృతవాన్పూర్వ దేహం న పుంభావం ముని జన్మ చ. 17 మమైవాయం పతి ర్యోషా%హం పత్నీషు ప్రియా సతీ | పట్టరాజ్ఞీ విలాసజ్ఞా సఫలం జీవితం మమ. 18 ఇతి చింతయతీ తస్మి న్ర్పేమబద్ధా దివానిశమ్ | క్రీడాసక్తా సుఖే లుబ్ధా తం స్థితా వశవర్తినీ. 19 విస్మృతం బ్రహ్మ విజ్ఞానం బ్రహ్మజ్ఞానం చ శాశ్వతమ్ | ధర్మశాస్త్ర పరిజ్ఞానం తదా సక్తమనాః స్థితా. 20 ఏవం విహరత స్తత్ర వర్షాణి ద్వాదశైవ తు | గతాని క్షణవత్కామ క్రీడా సక్తస్యమే మునే. 21 జాతా గర్భవతీ చాహం ముదం ప్రాపనృప స్తదా | కారయామాస విధివ ద్గర్భసంస్కారకర్మ చ. 22 అపృచ్ఛద్దోహదం రాజా ప్రీణయన్మాం పునః పునః | నాబ్రువం లజ్జమానాహం నృపం ప్రీతమనా భృశమ్. 23 సంపూర్ణే దశ##మే మాసి పుత్రో జాత స్తతో మమ | శుభే%హ్ని గ్రహణక్షత్ర లగ్నతారాబలాన్వితే. 24 బభూవ నృపతే ర్గేహే పుత్రజన్మ మహోత్సవః | రాజా పరమ సంతుష్టో బభూవ సుతజన్మతః. 25 సూతకాంతే సుతం వీక్ష్య రాజా ముదమవాపహ | అహం భూమిపతే శ్చాసం ప్రియా భార్యా పరంతపః. 26 ఆ కామకళాకోవిదుడు రమ్యహర్మ్యములందు నుద్యానముల వలపునెత్తావులందు డిగ్గియలందు వరశైలములందును నన్ను దనిపి తనిసెను. అతడు వనములందును నన్ను విడనాడక భోగించెను. అతడు సురాపానమత్తుడై నాతోడ విహరించుచు నెల్లపనులు విడనాడి నాకు వశుడయ్యెను. అతని గూడిన క్రీడారసమునకు లోబడి నా మొదటి మేను పురుషత్వము మునిజన్మము మఱిచితిని. అతడే నా పతి. నేనే యతని ప్రియభార్యలందు పట్టమహిషిని. విలాసవతిని. నా బ్రదుకు కడుధన్యము అని నేను దలపోయుచు రేయనక పగలనక యతని ప్రేమకు కట్టువడి సుఖప్రాప్తికొఱకతనికి వశురాలనై క్రీడలలో మునిగి తేలుచుంటిని. నా చిత్తమతనియందే చిక్కుకొని యుండెను. అపుడు నేను బ్రహ్మజ్ఞానము విజ్ఞానము ధర్మశాస్త్ర పరిజ్ఞానము పూర్తిగ మఱచితిని. మునీ! ఇట్లు కామక్రీడాసక్తనైనా యిచ్చ చొప్పున విహరించుచుండగ పదిరెండేండ్లొక్క క్షణమువలె గడచిపోయెను. అంతలోన నేను గర్భము ధరించితిని. రాజు సంతోషించి యధావిధిగ నాకు గర్భసంస్కారక్రియలు జరిపించెను. రాజు నాకు గల్గు కోర్కు లెట్టివో మాటిమాటికి నన్నడుగుచుండెను. అపుడు నేను సిగ్గు పడుచుంటిని. దానికి రాజెంతయో మోదమందుచుండెను. పదవనెలలో నొక శుభదినమున గ్రహలగ్న తారాబలములు మంచిగ నుండగ కొమరుడు గల్గెను. పుత్రజననమున రాజు పరమానంద భరితుడయ్యెను. భవనములో పుత్రజనన మహోత్సవము జరిపించెను. పరంతపా! సూతకము తీరిన పిమ్మట రాజు పుత్రముఖ మవలోకించి యుత్సాహ మందెను. నేను రాజునకు పూర్వమువలె ప్రియభార్యనైయుంటిని. తతో వర్షద్వయాంతే వై పున ర్గర్భో మయా ధృతః | ద్వితీయ స్తు సుతో జాతః సర్వలక్షణ సంయుతః. 27 సుధన్వేతి సుతస్యాథ నామ చక్రే నృప స్తదా | వీరవర్మేతి జ్యేష్ఠస్య బ్రాహ్మణౖః ప్రేరిత స్త్వయమ్. 28 ఏవం ద్వాదశ పుత్రా శ్చ ప్రసూతా భూపసమ్మతాః | మోహితో%హం తదా తేషాం ప్రీత్యాపాలన లాలనే. 29 పునరష్టసుతాఃకాలే కాలే జాతాః సురూపిణః | గార్హస్థ్యం మే తతః పూర్ణంసంపన్నం సుఖసాధనమ్. 30 తేషాం దారక్రియాః కాలే కృతారాజ్ఞా యథోచితాః | స్నుషాభిశ్చ తథాపుత్రైః పరివారో మహానభూత్. 31 తతః పౌత్రాది సంభూతా స్తే%పి క్రీడారసాన్వితాః | ఆసన్నానారసోపేతా మోహవృద్ధికరా భృశమ్. 32 కదా చిత్సుఖమైశ్వర్యం కదాచి ద్దుఃఖ మద్భుతమ్ | పుత్రేషు రోగజనితం దేహసంతాపకారమ్. 33 పరస్పరం కదా చిత్తు విరోధో%భూత్సుదారుణః | పుత్రాణాం వా వధూనాం చ తేన సంతాపసంభవః. 34 సుఖ దుఃఖాత్మకే ఘోరే మిథ్యాచారకరే భృశమ్ | సంకల్పజనితే క్షుద్రే మగ్నో%హం మునిసత్తమ. 35 విస్మృతం పూర్వవిజ్ఞానం శాస్త్రజ్ఞానం తథాగతమ్ | యోషాభావే విలీనో%హం గృహకార్యేషు సర్వథా. 36 అహంకార స్తు సంజాతో భృశం మోహవివర్ధకః | ఏతే మే బలినః పుత్రాః స్నుషాః స్వకుల సంభవాః. 37 ఏతే పుత్రాః సుసన్నద్ధాః క్రీడంతి మమ వేశ్మసు | ధన్యా%హం ఖలునారీణాం సంసారే%స్మి న్నహోభృశమ్. 38 ఆ పిదప రెండేడ్లకు నాకు మఱల గర్భము నిలిచెను. అంత సర్వలక్షణములతో శోభిల్లు రెండవ కుమారుడు నాకు జన్మించెను. అతనికి రాజు సుధన్వుడను పేరుపెట్టెను. బ్రాహ్మణులు పెద్దవానికి వీరవర్మయని పేరు పెట్టిరి. ఈ ప్రకారముగ నేను రాజువలన పండ్రెండు మంది కుమారులను గంటిని. వారి ముద్దముచ్చటలలో లాలనపాలనలో నానందమందుచుంటిని. ఆ పిమ్మట వరుసగా నెనిమిది మంది మరల జన్మించిరి. ఇట్లు నా గృహస్థ జీవితము సుఖసాధనములతో నిండి తామరతంపరగ నొప్పెసగెను. రాజు వారందఱికి సకాలమున వివాహవిధు లొనరించెను. ఇట్లు నా కుటుంబము కొడుకులతో కోడండ్రతో కళకళలాడుచుండెను. అటు పిదప నాకు పెక్కురు మనుమలు గల్గిరి. వారు పెక్కు విధముల నాటలాడుచుండగ గాంచి నా మనస్సు మోహములో మునిగిపోవుచుండెను. ఒక్కొక్కప్పుడు నేను సుఖసంపదలందుచుంటిని. నేను మఱొకప్పుడు పుత్రుల రోగములవలన దుఃఖములు గల్గుటచే కృశించుచుంటిని. అప్పుడప్పుడు నా కొడుకులలో కోడండ్రలో కొట్లాటలు సాగుచుండెను. ఆ దారుణము చూచి నేనెంతయో కుందుచుంటిని. మునివరా! ఇట్టి కోర్కుల మూలముగ గల్గిన సుఖదుఃఖములుగల సంసార సాగరములో గూలితిని. నా పూర్వజ్ఞానము శాస్త్రవిజ్ఞానము నశించెను. అన్ని విధములగు నింటి పనులందు నేనే యజమానురాలనను తలపుతో నుంటిని. అపుడు నాలో మోహకమైన గర్వము మిన్నుముట్టెను. వీరందరు నా బలగము. వీరు నాక్న కొడుకులు. వీరు నా కోడండ్రు. నా వంశాభివృద్ధికరులు. నా కొడుకులు నేర్పుతో నా యింట నాడుకొందురు. ఆహా! ఈ ప్రపంచమందలి స్త్రీజాతిలో నేను ధన్యురాలను గదా! అనుకొంటినే కాని నేను పూర్వము నారదుడను. నన్ను వైష్ణవమాయ మోసగించెను' అని నేనెన్నడును మనస్సులో తలంచనేలేదు. రాజపత్నీ శుభాచారా బహుపుత్రా పతివ్రతా | ధన్యా%హం కిల సంసారే కృష్ణైవం మోహితస్త్వహమ్. 40 అథ కశ్చిన్నృపః కామం దూరదేశాధిపో మహాన్ | అరాతిభావ మాపన్నః పతినాసహ మానద. 41 కృత్వా సైన్యసమాయోగం రథైశ్చ వారణౖర్యుతమ్ | ఆజగామ కాన్యకుబ్జే పురే యుద్ధ మంచితయత్. 42 వేష్టితం నగరం తేన రాజ్ఞా సైన్యయుతేన చ | మమ పుత్రాశ్చ పౌత్రాశ్చ నిర్గతా నగరా త్తదా. 43 సంగ్రామ స్తుముల స్తత్ర కృతసై#్తసేన పుత్రకైః | హతా రణ సుతాః సర్వే వైరిణా కాలయోగతః. 44 రాజా భగ్న స్తు సంగ్రామా దాగతః స్వగృహం పునః | శ్రుతం మయా మృతాః పుత్రాః సంగ్రామే భృశదారుణ. 45 స హత్వా మే సుతా న్పౌత్రా న్గతో రాజా బలాన్వితః | క్రందమానా హ్యహం తత్ర గతా సమరమండలే. 46 దృష్ట్వా తా న్పతితాన్పుత్రా న్పౌత్రాంశ్చ దుఃఖపీడితా | విలలాపాహ మాయుష్మన్ శోకసాగరసంప్లవే. 47 హా పుత్రాః క్వ గతా మే%ద్య హా హతాస్మి దురాత్మనా | దైవేనాతి బలిష్ఠేన దుర్వారే ణాతి పాపినా. 48 ఏతస్మి న్నంతరే తత్ర భగవాన్మధుసూదనః | కృత్వా రూపం ద్విజస్యాగా ద్వృద్ధః పరమశోభనః. 49 సువాసా వేదవిత్కామం మత్సమీపం సమాగతాః | ముమువాచాతిదీనాం స క్రందమానాం రణాజిరే. 50 బ్రాహ్మణ ఉవాచ : కిం విషీదసి తన్వంగి భ్రమో%యం ప్రకటీకృతః | మోహేన కోకిలాలాపే పతిపుత్ర గృహాత్మకే. 51 కా తం కస్యాః సుతాః కే%మీ చింతయా%%త్మగతిం పరామ్ | ఉత్తిష్ఠ రోదనం త్యక్త్వా స్వస్థా భవ సులోచనే. 52 స్నానం చ తిలదానం చ పుత్రాణాం కురు కామిని | పరలోక గతానాం చ మర్యాదారక్షణాయ వై. 53 వ్యాసమునీ! నేను రాజపత్నిని. సదాచారను. ప్రజావతిని. పతివ్రతను. ధన్యురాలనని యీ మాయాసంసారమున బడి మోహభ్రాంతిలో మునిగితిని. అటు తర్వాత నొక పరదేశపు రాజు నా పతితో వైర మూనెను. అతడు రథగజములతో సేనలు గూర్చుకొని కయ్యమునకు కాలుదువ్వి కన్యాకుబ్జపురమునకు తరలి వచ్చెను. నగరము శత్రు సేనలతో ముట్టడింపబడెను. అపుడు నా కొడుకులు మనుమలు నగరము వెల్వడిరి. శత్రునకు నా కొడుకులకు నడుమ ఘోరయుద్ధము సంఘటిల్లెను. అందు విధి వైపరీత్యమున నా కొడుకులందఱు వైరి చేతులలో మడిసిరి. రాజు భగ్నహృదయుడై రణమునుండి యింటికి వెనుదిరిగి వచ్చెను. దారుణరణమున నా కొడుకులెల్లరు నశించిరని వింటిని. శత్రురాజు నా సుతులను మనుమలను చంపి వెళ్ళిపోయెను. నేనపుడు వలవల విలపించుచు సమరభూమికి వెళ్ళితిని. ఆయుష్మంతుడా! నా వారెల్లఱు హతులగుటగని శోక సాగరమును మునిగి గుండె చెఱువుగ బిట్టు వాపోతిని. ఓ నా కన్న కొడుకులారా ! మీరంద ఱమైతిరి? నేటికి నే నీ పాపిష్ఠ దైవము చేతలో వంచింపండితిని గదా! అని యేడ్చితిని. అంతట నచ్చటికి మధుసూదనభగవానుడొక వృద్ధబ్రాహ్మణ వేషముతో తేజరిల్లు చేతెంచెను. అతడు పవిత్ర వస్త్రములు దాల్చి వేద ఘోషతో నాచెంత కేతెంచెను. నేను దీనముగ యుద్ధభూమిలో పలవించుటగని యతడు నా కిట్లనెను : ఓ తన్వంగీ! కలకంఠ కంఠీ! నీవు పతి-పుత్ర-గృహముల మోహభ్రాంతిలో మునిగినదానవువలె దోచుచున్నావు. ఏల యేడ్చెదవు? సులోచనా! ఇంక నేనెవరను? ఈ నాసుతులెవరు? నా గతి యేమి? అని విచారించుకొని రోదనము మాని లెమ్ము. స్వస్థవుగమ్ము. కామినీ! ఇపుడు నీవు పరలోక గతులైన నీ పుత్రులకై విధిప్రకారముగ స్నానముచేసి తిలతర్పణము లాచరింపుము. కర్తవ్యం సర్వథా తీర్థే స్నానం తు న గృహే క్వచిత్ | మృతానాం కిల బంధూనాం ధర్మశాస్త్రస్య నిర్ణయః. 54 నారదః : ఇత్యుక్త్వా తేన విప్రేణ వృద్ధేన ప్రతిబోధితా | ఉత్థితా%హం నృపేణాథ యుక్తా బంధుభి రావృతా. 55 అగ్రతో ద్విజరూపేణ భగవా న్భూతభావనః | చలితా%హం తతస్తూర్ణం తీర్ధం పరమపావనమ్. 56 హరిర్మాం కృపయా తత్ర పుం తీర్థే సరసి ప్రభుః | నీత్వా%హ భగవాన్విష్ణు ర్ద్విజరూపీ జనార్దనః. 57 స్నానం కురు తటాకే%స్మి న్పావనే గజగామిని | త్యజ శోకం క్రియాకాలః పుత్రాణాం చ నిరర్ధకః. 58 కోటిశ##స్తే మృతాః పుత్రా జన్మజన్మ సముద్భవాః | పితరః పతయ శ్చైవ భ్రాతరో జామయస్తథా. 59 కేషాం దుఃఖం త్వయా కార్యం భ్రమే%స్మి న్మానసోద్భవే | వితథే స్వప్న సదృశే తపదే దేహినా మిహ. 60 నారదః : ఇతి తస్య వచః శ్రుత్వా తీర్థే పురుష సంజ్ఞకే | ప్రవిష్టా స్నాతుకామా%హం ప్రేరితా తత్ర విష్ణునా. 61 మజ్జనా దేవ తీర్థేషు పుమాన్ జాతః క్షణాదపి | హరి ర్వీణాం కరే కృత్వా స్థిత స్తీరే స్వదేహవాన్. 62 ఉన్మజ్జ్య చ మయా తీరే దృష్టః కమలలోచనః | ప్రత్యభిజ్ఞా తదా జాతా మమ చిత్తే ద్విజోత్తమ. 63 సంచింతితం మయా తత్ర నారదో%హ మిహాగతః | హరిణా సహ స్త్రీభావం ప్రాప్తో మాయావిమోహితః. 64 ఇతి చింతాపర శ్చాహం యదా జాత స్తదాహరిః | మా మాహ నారదాగచ్ఛ కిం కరోషి జలే స్థితః. 65 విస్మితో%హం తదా స్మృత్వా స్త్రీభావం దారుణం భృశమ్ | పునః పురుషభావశ్చ సంపన్నః కేన హేతునా. 66 ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ షష్ఠస్కంధే ఏకోనత్రింశో%ధ్యయః. మృతుల బంధువులెప్పుడైన తీర్థములందే క్రుంకవలయునుకాని యింట స్నానమాడరాదని ధర్మశాస్త్రములు వక్కాణించును అను ముదుసలి విప్రుని బోధములకు ప్రబోధమొంది నేను - నా రాజు-నా బంధువులు-కండ్లు తెఱచితిమి. ముందుగ బ్రాహ్మణ రూపము దాల్చిన భూతభావనుడగు భగవానుడు నడుచు చుండగ నతనివెంట నేను పరమ పావన తీర్థమున కేగుదెంచితిని. శ్రీహరి నన్ను పుంతీర్థమను పుణ్యసరోవరమునకు జేర్చి నాతో నిట్లనెను : ఓ గజగామినీ! పనికి మాలిన శోకముడుగుము. ఈ తటాకమున మునుగుము. నీ పుత్రుల కూర్ధ్వ కర్మలు చేయు సమయ మాసన్నమైనది. జన్మజన్మలనుండి కోటానుకోట్ల కొడుకులు - తండ్రులు - పతులు - సోదరులు - అల్లుండ్రు - మఱందఱో పుట్టిగిట్టిరి. ఈ మాయ సంసారము కోర్కుల వలన పుట్టినది - కలవంటిది - వట్టి భ్రమవంటిది. జీవులకు మోహతాపములు గల్గించును. ఇట్టి కపట సంసారమున నింకెవరి కొఱకేడ్చెదవు? అని పలుకు అతని హితములాలించి నేను విష్ణు ప్రేరితనై స్నానమాడదలచి పుంతీర్థమున దిగితిని. ఆ పుణ్యజలములందు మునిగిన వెంటనే నేను పురుషుడనైతిని. శ్రీహరి నా వీణ చేబూని తీరమున నిజరూపమున ప్రకాశించుచుండెను. ద్విజవరా! నేను మునిగి లేవగనే తీరమున కమలాక్షుని వీక్షించితిని. అంత నా చిత్తమందు పూర్వజ్ఞానము గల్గెను. నేను నారదుడను - ఇక్కడికి నేతెంచి మాయామోహితుడనైతినని తలంచితిని. అంతలోననే నారదా! రారమ్ము నీట నేమి చేయుచున్నావు? అని హరి యనెను. నేను దుర్భరమైన స్త్రీభావము వదలి పురుషరూప మేకారణమున బొందితినా యని యచ్చెరు వందితిని. ఇది శ్రీదేవి భాగవతమంది షష్ఠస్కంధమందు ఇరువది తొమ్మిదవ అధ్యాయము.