Sri Devi Bhagavatam-1
Chapters
అథ త్రింశో%ధ్యాయః నారదః : మాం దృష్ట్వా నారదం విప్రం విస్మితో%సౌ మహీపతిః | క్వగతా మమ భార్యా సా కుతో%యం మునిసత్తమః.
1 విలలాప నృప స్తత్ర హా ప్రియేతి ముహూర్ముహుః | క్వగతా మాం పరిత్యజ్య విలపంతం విమోగినమ్.
2 వినా త్వాం విపులశ్రోణి | వృథా మే జీవితం గృహమ్ | రాజ్యం కమలపత్రాక్షి కిం కరోమి శుచిస్మితే. 3 న ప్రాణా మే బహి ర్యాంతి విరహేణ తవాధునా | గతో వై ప్రీతిధర్మ స్తు త్వా మృతే ప్రాణధారణాత్.
4 విలపామి విశాలాక్షి దేహి ప్రత్యుత్తరం ప్రియమ్ | క్వ గతా సా మయి ప్రీతి ర్యా%భూ త్ర్పథమ సంగమే.
5 విమగ్నా కిం జలే సుభ్రూ ర్భక్షితా మత్స్య కచ్ఛపైః | గృహీతా వరుణనాశు మమ దౌర్భాగ్యయోగతః.
6 ధన్యా సుచారుసర్వాంగి యా త్వం పుత్రైః సమాగతా | అకృత్రిమ స్తు పుత్రేషు స్నేహస్తే%మృతభాషిణి. 7 న యుక్త మధునా యన్మాం విహాయ త్రిదివం గతా | విలపంతం పతిం దీనం పుత్రస్నేహేన యంత్రితా.
8 ఉభయం మే గతం కాంతే పుత్రా స్త్వం ప్రాణవల్లభా | తథా%పి మరణం నాస్తి దుఃఃతస్య భృశం ప్రియే.
9 కిం కరోమి క్వ గచ్ఛామి రామో నాస్తి మహీతలే | రామావిరహజం దుఃఖం జానాతి రఘునందనః.
10 విధినా నిష్ఠురేణాత్ర విపరీతం కృతం భువి | దంపత్యోర్మరణం భిన్నం సర్వథా సమచింతయోః.
11 ఉపకార స్తు నారీణాం మునిభి ర్విహతః కిల | యదుక్తం ధర్మశాస్త్రేషు జ్వలనం పతినా సహ.
12 ఏవం విలపమానం తం రాజానం భగవా న్హరిః | నివారయామాస తదా వచనై ర్యుక్తియోజితైః.
13 ª«sVVxmsöµR…ª«s ¸R…Vµ³yù¸R…Vª«sVV ª«sW¸R…W úxms˳ت«sª«sVV c ƒyLRiµR… ª«sX»yòLi»R½ª«sVV నారదుడిట్లనెను : మునీశా! ఆ తర్వాత తాలధ్వజరాజు నన్ను నారదునిగ నెఱింగి తన భార్య యెక్కడి కేగెనో! ఇదేమి వింత యని యబ్బురమందెను. రాజిట్లు వాపోవసాగెను : హా నా ప్రియా! నీ విరహాగ్నిలో కుములుచున్నాను. నన్ను విడనాడి నీవెక్కడి కేగితివి? హా విపులశ్రోణీ! హా కమలాక్షీ! హా శుచిస్మితా! నీవులేని నా బ్రదుకు వ్యర్థము. అంధకారమయము. నే నింకేమి చేతును? నీ వియోగ భారమున నా ప్రాణములు సైతము వెళ్ళిపోవు. నీవులేని బ్రదుకు బ్రదుకుగాదు. ప్రయోజనము లేదు. నా ప్రేమమున ధర్మము నష్టమైనటులే సుమా! హా విశాలాక్షీ! నీకై యింతగ రోదిల్లుచున్నాను. ప్రియముగ నాతో మాఱుపలుకవేమి? ఆ నాటి మన హృదయాల ప్రేమగీతి యేమయ్యెను? హా సుందరీ! నీవు నీట మునిగిపోతివో? నిన్ను చేపలు తాబేళ్ళు మ్రింగెనో? కాక నా దౌర్భాగ్యముకొలది వరుణుడు నిన్ను లేవనెత్తుకొని పోయెనో? హా! అమృత భాషిణీ! హా సుందరీ! నీకు పుత్రుల యెడల గల వాత్సల్యముబట్టి నీవును వారివెంట నరిగితివో? నీవెంత ధన్యురాలవు! నీవు పుత్రవాత్సల్యమునకు బద్ధురాలవు. నేను నీ పతిని - విలపించుచున్నాను. నన్ను వదలి దివికేగుట నీకు తగదు. హా ప్రియా! నేనిపుడు రెండందాల నష్టపోతిని. నా పుత్రులు పోయిరి - నా ప్రాణవల్లభవు నీవును పోతివి. ఐనను దుఃఃతుడనగు నాకు చావు రాకున్నదేమి? రఘునందనుడగు శ్రీరామునకు స్త్రీ వియోగదుఃఖములోని బాధ తెలియును. ఆ రాముడిప్పుడు లేడే! నేనింకెక్కడి కేగుదును? ఎవరితో చెప్పుకొందును? మనమీడు జోడు భావాలుగల దంపతులము. ఐనను నీ మరణము భిన్నవిధముగ జరిగినదే! క్రూరవిధి మనకెంతటి విపరీత మొనర్చెనుగదా! భార్య పతితో సహ గమనము చేయవచ్చునని మునులు ధర్మశాస్త్రములందు చెప్పి స్త్రీలకుపకారము చేసిరి. కాని, పురుషుడు స్త్రీతో సహగమించుట చెప్పలేదేమి? అని రాజు దురపిల్లుచుండగా భాగవానుడగు హరి యుక్తి యుక్తములగు వచనములతో నతని నిట్టు లోదార్చెను: శ్రీ భగవానువాచ: కిం విషీదసి రాజేంద్ర క్వగతా తే ప్రియాంగనా | న శ్రుతం కిం త్వయా శాస్త్రం న కృతోవా బుధాశ్రయః. 14 కా సా కస్త్వం క్వసంయోగో వియోగః కీదృశస్తవ | ప్రవాహరూప సంసారే నృణాం నౌ తరతా మివ. 15 గృహే గచ్ఛ నృపశ్రేష్ఠ వృథా తే రుదితేన కిమ్ | సంయోగశ్చ వియోగశ్చ దైవాధీనౌ సదా నృణామ్. 16 అనయా సహ తే రాజ న్సంయోగ స్త్విహ సందృతః | భుక్తా త్వయా విశాలాక్షీ సుందరీ తను మధ్యమా. 17 న దృష్టౌ పితరా వస్యా స్త్వయా ప్రాప్తా సరోవరే | కాకతాళీ ప్రసంగేన యాద్భూతం తత్తథా గతమ్. 18 మా శోకం కురు రాజేంద్ర కాలో హి దురతి క్రమః | కాలయోగం సమాసాద్య భుంక్ష్వ భోగా న్గృహే యథా. 19 యథా%%గతా గతా సాతు తథైవ వరవర్ణినీ | యథా పూర్వం తథా తత్ర గచ్ఛ కార్యం కురు ప్రభో. 20 రుదితేన తవాద్యైవ నాగమిష్యతి కామినీ | వృథా శోచసి పృథ్వీశ యోగయుక్తో భవధునా. 21 భోగః కాలవశా దేతి తత్రైవ ప్రతియాతి చ | నాత్ర శోక స్తు కర్తవ్యో నిష్ఫలే భవవర్త్మని. 22 నైకత్ర సుఖసంయోగ స్తు నైకతః | ఘటికాయంత్రవ త్కామం భ్రమణం సుఖదుఃఖయోః. 23 మనః కృత్వా స్థిరం భూప కురు రాజ్యం యథాసుఖమ్ | అథవా న్యస్య దాయాదే వనం సేవయ సాంప్రతమ్. 24 దుర్లభో మానుషో దేహః ప్రాణినాం క్షణభంగురః | తస్మిన్ ప్రాప్తేతు కర్తవ్యం సర్వదైవాత్మసాధనమ్. 25 జిహ్వోపస్థరసో రాజ న్పశు యోనిషు వర్త | జ్ఞానం మానుషదేహే వై నాన్యాసు చ కు యోనిషు. 26 తస్మా ద్గచ్ఛ గృహం త్యక్త్వా శోకం కాంతా సముద్భవమ్ | మా యేయం భగవత్యాస్తు యయా సమ్మోహితం జగత్. 27 రాజా! ఏల యేడ్చెదవు? నీ ప్రియురాలెక్కడికి పోయెను? నీవు పెద్దల సాంగత్యము చేయలేదా? శాస్త్రములయిన వినలేదా! ఆమె యెవతె? నీవెవరు? మీ యీ సంయోగము లెటువంటివి? సాగరమున నావలో ప్రయాణించు జనులు కలసి విడిపోదురు. అటులే యీ కపట సంసారమున ప్రాణులు పాయుచు గూడుచుందురు. రాజా! ఇక నీ యేడుపు చాలించి నీ యింటి మొగము పట్టుము. ప్రాణుల సంయోగ వియోగములు దైవాధీనములు. నాకామెతో సంయోగ మిచ్చటనే జరిగినది. మరల నా విశాలాక్షియగు సుందరిని నీవిచటనే పోగొట్టుకొంటివి. ఆమె తలిదండ్రు లెవరో నీకు తెలియదు! ఆమె నీకు కాకతాళీయముగ కొలనిలో లభించినది. ఆమె యెట్లు వచ్చెనో యట్లు అదృశ్యమయ్యెను. రాజేంద్రా! శోకింపకుము. కాలము దాటరానిది. ఇంక నింటికేగి వెనుకటి వలె కాలయోగమున భోగములనుభవింపుము. ఆ వరవర్ణిని యెట్లు వచ్చెనో యట్లే వెళ్ళిపోయెను. నీవిక తొంటివలె నీ రాచకార్యములు చక్కబెట్టుము. నీ వెంత యేడ్చినను నీ భార్య తిరిగి రాదుగదా! ఇంకూరక యేడ్వనేల? ఇపుడు యోగ మవలంబింపుము. ఈ భోగభాగ్యములు కాలవశమున గలిగి తిరిగి వెళ్ళిపోవును. ఈ సంసార మార్గము నిష్ఫలమైనది. శోకముడుగుము. ఒకేచోట సుఖముల కలయికగాని దుఃఖముల కలయికగాని జరుగదు. ఈ సుఖదుఃఖములు నీరుతోడు యంత్రమువంటివి. అని నిత్యము పరిభ్రమించు చుండును. ఇక శ్రద్ధగ చక్కగ నీ రాజ్యమేలుకొనుము. లేదా, నీ రాజ్యము దాయాదుల కొప్పగించి యిపుడే వనముల కేగుము. ఈ మానవ జన్మము కడు దుర్లభ##మైనది. ఎల్లరికి క్షణభంగురమైనది. మనుజుడై పుట్టిన ప్రతివాడు తప్పక ఆత్మ విచారము చేసి తీరవలయును. పశువులకు సైతము జిహ్వోపస్థల చాపల్యముండి తీరును. ఆత్మజ్ఞాన మొక్క మానవులలోనే వెలుగొందును. నీచ జన్మలకది దుర్లభము. కనుక కాంత మూలమున గల్గిన శోకము బాయము. ఇంటికేగుము. ఇదంతయు శ్రీభగవతీ దేవి మాయా విలాసమే. ఈ జగమంతయును మాయాశక్తిచేత సమ్మోహితమై మాయగ నుండును. నారద ఉవాచ : ఇత్యుక్తో హరిణా రాజా ప్రణమ్య కమలాపతిమ్ | కృత్వా స్నానవిధిం సమ్య గ్జగామ నిజమందిరమ్. 28 దత్వా రాజ్యం స్వపౌత్రాయ ప్రాప్య నిర్వేద మద్భుతమ్ | వనం జగామ భూపాల స్తత్త్వజ్ఞాన మవాప చ. 29 గతే రాజ న్యహం వీక్ష్య భగవంత మధోక్షజన్ | త మబ్రువం జగన్నాథం హసంతం మాం పునః పునః. 30 వంచితో%హం త్వయా దేవ జ్ఞాతం మాయా బలం మహత్ | స్మరామి చరితం సర్వం స్త్రీ దేహే యత్కృతం మయా. 31 బ్రూహి మే దేవదేవేశ ప్రవిష్టో%హం సరోవరే | విగతం పూర్వం విజ్ఞానం స్నానా దేవ కతం హరే. 32 యోషి ద్దేహం సమాసాద్య మోహితో%హం జగద్గురో | పతిం ప్రాప్య నృపశ్రేష్ఠ పౌలోమీ వాసవం యథా. 33 మన స్త దేవ తచ్ఛిత్తం దేహః స చ పురాతనః | లింగం తదేవ దేవేశ స్మృతేర్నాశః కథం హరే! 34 విస్మయో%యం మహాన్మే%త్ర జ్ఞాననాశం ప్రతి ప్రభో | కథయాద్య రమాకాంత కారణం పరమం చ యత్. 35 నారీ దేహం మయా ప్రాప్య భుక్తా భోగా హ్యనే కశః | సురాపానం కృతం నిత్య విధి హీనం చ భోజనమ్. 36 మయా తదేవ న జ్ఞాతం నారదో%హ మితి స్ఫుటమ్ | జానా మ్యద్య యథా సర్వం వివక్తం న తథా తదా. 37 విష్ణురువాచ : పశ్య నారద మాయావీ విలాసో%యం మహామతే | దేహేషు సర్వజంతూనాం దశాభేదా హ్యనేకశః. 38 జాగ్రత్స్వప్నం సుషుప్తి శ్చ తురీయా దేహినాం దశా | తథా దేహాంతరే ప్రాప్తే సందేహః కీదృశః పునః. 39 సుప్తో నరో న జానాతి న శృణోతి వహత్యపి | పునః ప్రబుద్ధో జానాతి సర్వం జ్ఞాన మశేషతః. 40 నిద్రయా చాల్యతే చిత్తం భవంతి స్వప్న సంభవాః | నానావిధా మనోభేదా మనోభావా హ్యానేకశః. 41 గజో మాం హంతు మాయాతి న శక్తో%స్మి పలాయనే | కిం కరోమి న మే స్థానం యత్ర గచ్ఛామి సత్వరః. 42 ఇట్లు హరి యనునయింపగ రాజు విష్ణునకు ప్రణమిల్లి స్నాన మొనరించి నిజమందిరమున కేగెను. అతడు తన మనుమలకు రాజ్యభార మప్పగించి తీవ్ర వైరాగ్యముతో వనములకేగి తత్త్వజ్ఞాన మొందెను. ఆ తర్వాత అధోక్షజుడగు జగన్నాథుడు మాటిమాటికి ముసిముసి నగవులు నగుచుండగ నే నతనితో నిట్లంటివి : నీవు నన్ను వంచించితివి. మాయాబలము చాల శక్తిమంతమైనదని నా కిపుడర్థమైనది. నేను స్త్రీగ నున్నప్పుడు చేసిన పనులన్నియు నాకొక్కొక్కటిగ నిపుడు జ్ఞప్తికి వచ్చుచున్నవి. నే నా సరోవరమునందు మునిగి స్నానమాడిన పిమ్మట నా పూర్వజ్ఞాన మేల నశించెనో తెలుపుము. జగద్గురూ! నేను స్త్రీ రూపము దాల్చి శచి యింద్రుని బడసినట్లు భర్తను బడసి మోహసముద్రమున మునిగితిని. నా మనస్సు చిత్తము దేహము లక్షణమున వెనుకటివే కదా! మఱి నాకు పూర్వస్మృతి యేల లోపించెను? రమకాంతా! నాకు పూర్వజ్ఞానము లేకపోవుట వింతగ నున్నది. దాని కారణమేమో నాకు తెలుపుము. నే నాడుదాననై పెక్కు భోగము లనుభవించితిని. నిత్యము మద్యము సేవించితిని. నిత్యానుష్ఠానము లేకయె తినరాని కూడు తింటిని. ఇపుడప్పటి వన్నియు దెలిసినవి. అపుడు నేను నారదుడనని స్పష్టముగ తెలియకపోయెను. అన విప్రుడి విట్లనెను : నారదా! మహామతీ! చూడుము. ఇదంతయును మాయా శక్తి లీలావిలాసము సుమా! ఎల్లప్రాణుల దేహములందలి దశలు పెక్కురీతుల సాగుచుండును. ఎల్లజీవుల కీదేహమునందు జాగ్రత్త - స్వప్నము - నిద్ర - తురీయమను నాల్గు దశలు గల్గుచుండును అట్లే యివి మఱొక దేహమందును గల్గుచుండును. ఇది నిస్సంశయము. నిదురించిన ప్రాణి యేమియు నెరుగడు - వినడు - పలుకడు. మేలుకొనిన పిమ్మట నెల్లవిషయములు తెలిసికొనగలడు. నిద్రలో చిత్తము చలించును. కలలో మనస్సులో పెక్కు రీతుల పెక్కు భావములు గల్గును. కలలో నేనుగును జూచి ఇది నన్ను చంపవచ్చుచున్నది. నేను పరుగెత్తలేకున్నాను. ఏమి చేతును? ఇపు డెట కేగుదు' నను తలపులు గల్గును. మృతం పితామహం స్వప్నే పశ్యతి స్వగృహగతమ్ | సంయోగ స్తేన వార్తా చ భోజనం సహ మన్యతే. 43 ప్రబుద్ధం ఖలు జానాతి స్వప్నే దృష్టం సుఖాసుఖమ్ | స్మృత్వా సర్వం జనేభ్యస్తు విస్తరా త్ర్పవదత్యపి. 44 స్వప్నేకో%పి న జానాతి భ్రమో%య మితి నిశ్చయః | తథా తథైవ విభవో మాయాయా దుర్గమః కిల. 45 నాహం నారద జానామి పారం పరమదురటమ్ | గుణానాం కిల మాయాయా నైవ శంభు ర్న పద్మజః. 46 కో%న్యో జ్ఞాతుం సమర్థో%భూ న్మానతో మందధీః పునః | మాయాగుణపరిజ్ఞానం న కస్యాపి భ##వేదిహ. 47 గుణత్రయకృతం సర్వం జగత్థ్సావరజంగమమ్ | వినా గుణౖర్న సంసారో వర్తతే కించిదప్యదః. 48 అహం సత్త్వప్రధానో%స్మి రజస్తమ సమన్వితః | న కదాచిత్త్రిభి ర్హీనో భవామి భువనేశ్వరః. 49 తథా బ్రహ్మా పితా తే%త్ర రజోముఖ్యః ప్రకీర్తితః | తమః సత్త్వసమాయుక్తో న తాభ్యా ముజ్ఝితః కిల. 50 శివస్తథా తమోముఖ్యో రజః సత్త్వసమావృతః | గుణత్రయవిహీనస్తు నైవ కో%పి మయా శ్రుతః. 51 తస్మా న్మోహో న కర్తవ్యః సంసారే%స్మి న్మునీశ్వర | మాయావినిర్మితే%సారే%పారే పరమ దురటే. 52 దృష్టామయాత్వయా%ద్యైవ భుక్తాభోగాహ్యానేకశః | కిం పృచ్ఛసి మహాభాగ తస్యాశ్చరిత మద్భుతమ్. 53 ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ షష్ఠస్కంధే త్రింశో%ధ్యాయః. ఎప్పుడో చనిపోయిన తన తాత తన యింటికి వచ్చినట్లు నతనినిగాంచి మాటాడి యతని సరసను భోజనము చేసి నట్లును కల రావచ్చును. మేలు కాంచినవాడు తన కలలో గాంచిన సుఖదుఃఖము లెఱుగగలడు. అతడు కలలోనివన్ని తలంచి జనులకు విప్పి చెప్పగలడు. కల గనుచున్నవాడు దానిని భ్రమగ దలంపడు. అటులే యీ మాయాసంసారము మాయా సంపదయంతయు నొక కల. భ్రమ మాత్రమే. దాటరానిది. ఓ నారదా! ఈ మాయాగుణములు దుర్గములు. బ్రహ్మగాని నేను గాని శివుడుగాని మాయా ప్రభవ మెఱుగజాలము. ఇంక మందమతియగువాడు మాయ నెట్లెఱుగ గలడు? ఈ మాయా స్వభావ మెంతటివానికిని తెలియబడదు. ఈ చరాచర ప్రపంచమంతయును త్రిగుణములు లేనిచో మాయా సంసారమే లేదు. నామటుకు నేను సత్వగుణప్రధానుడను గదా! ఐనను నాలో నప్పుడప్పుడు రజస్తమస్సులు వెఱ్ఱి తలలెత్తును. నేను త్రిగుణములను మించిన భువనేశ్వరుడ నెన్నడు గాజాలకపోతిని. నీ తండ్రియు నటులే రజోగుణప్రధానుడు. ఐనను సత్వతమస్సులతని యందును గలవు. అత డీ మూటిని దాటిన వాడు మాత్రముకాడు. అట్లే శివుడు తమః ప్రధానుడు. ఐన నతనిలోను సత్వరజస్సులు నిండుగ నున్నవి. కనుక గుణత్రయములులేని పురుషోత్తము డెవ్వడును లేడు. కనుక దేవర్షీ! ఈ సంసారము వట్టి మాయా నిర్మితము-సారహీనము-అపారము-దుస్తరము-మోహజనకము-దీనిలో దేనియందును మోహ మెట్టివానికిని తగదు సుమా! మహాత్మా! ఆ మాయ మెట్టిదో నీవిపుడే చవిచూచితివి గదా! పెక్కు భోగముల లనుభవించితివి గదా! ఇక మహా మాయాదేవి యొక్క విచిత్ర చరిత్ర నన్నేల యడిగెదవు? ఇది శ్రీదేవి భాగవతమందలి షష్ఠస్కంధమందు నారదుడు మాయామోహితుడగుటయను ముప్పదవ యధ్యాయము.