Sri Devi Bhagavatam-1
Chapters
అథ ఏకోనవింశోధ్యాయః సందేహో%యం మహారాజ వర్తతే హృదయే మమ | మాయామధ్యే వర్తమానః స కథం నిఃస్పృహో భ##వేత్
1 శాస్త్రజ్ఞానం చ సంప్రాప్య నిత్యానిత్య విచారణమ్ | త్యజ్యతే న మనోమోహం స కథం ముచ్యతే నరః.
2 అంతర్గతం తమస్ చ్ఛేత్తుం శాస్త్రా ద్బోదోహి న క్షమః | యథా న నశ్యతి తమః కృతయా దీపవార్తయా. 3 అద్రోహః సర్వభూతేషు కర్తవ్యః సర్వదా బుధైః | స కథం రాజశార్దూల గృహాస్థస్య భ##వే త్తథా. 4 విత్తైషణా న తే శాంతా తథా రాజ్యసుభైషణా | జయైషణా చ సంగ్రామే జివన్ముక్తః కథం భ##వేత్. 5 చౌరేషు చౌరబుద్ధి స్తే సాధుబుద్ధిస్తు తాపసే | స్వపరత్వం తవా ప్యస్తి విదేహ స్త్వం కథం నృప. 6 కటుతీక్ణ కషాయావ్లు రసాన్వేత్సి శుభాశుభాన్ | శుభేషు రమతే చిత్తం నాశుభేషు తథా నశుభేషు తథా నృప. 7 జాగ్ర త్స్వప్న స్సుఘప్తిశ్చ తవ రాజ న్భవంతి హి | అవస్థాస్తు యథాకాలం తురీయా తు కథం నృప. 8 పదా త్యవ్వ రథేభాశ్చ సర్వేవై వశగా మమ | స్వామ్యహం చైవ సర్వేషాం మన్య సే త్వం న మన్యసే. 9 మిష్టమత్సి సదా రాజ న్ముదితో విమాన స్తథా | మూలాయాం చ తథా సర్పే సమ దృక్క్వ నృపోత్తమ. 10 విముక్తస్తు భ##వే ద్రాజ న్సమ లోష్టాశ్మ కాంచనః | ఏకాత్మ బుద్ధిః సర్వత్ర హితకృ త్సర్వజంతుషు. 11 న మే%ద్య రమతే చిత్తం గృహదారాదిషు క్వచిత్ | ఏకాకీ నిఃస్పృహో%త్యర్థం చరేయ మితి మే నుతిః. 12 నిఃసంగో నిర్మమః శాతః పత్రమూలఫలాశనః | మృగవ ద్విచరిష్యామి నిర్ద్వంద్వో నిష్పరిగ్రహః. 13 పందొమ్మిదవ అధ్యాయము శ్రీ శుకుని వైవాహికజీవనము శ్రీ శుకుడిట్లనియె: ''ఓ మహాశయా! ఈ మాయామోహములో కొట్టుమిట్టాడు నరుడు నిష్కము డెట్లగును? అను సందేహమింకను నన్ను కలత పెట్టుచున్నది. శాస్త్రజ్ఞానము నిత్యానిత్యవివేకము గలిగియున్నప్పటికిని చిత్తము మోహభ్రాంతిని వదలజాలదు. ఇక నరుడు విముక్తుడగుటెట్లు? అట్టడుగున పేరుకొన్న తమమును శాస్త్రజ్ఞానము తొలగింపజాలదు. దీపమను మాట పల్కినంతనే యెక్కడైన పెంజీకట్లు పాయునా? రాజా! విబుధులెన్నడును సర్వభూతములకు ద్రోహము తలపెట్టరు. వాని పొట్టపై కొట్టరు. అట్టి చక్కని చల్లని నెచ్చెలిమి గృహస్థున కెట్లు గల్గును? మిమ్మింకను రాజ్యసుఖాసక్తి పదవ్యామోహము ధనదాహము విజయకాంక్ష వదలలేదు గద? మీకిక జీవన్ముక్తి యెట్లు చేకూరును? నీకు చోరులందు చోరత్వబుద్ధి తాపసులందు సాధుతాబుద్ధి గలదు గదా? ఇట్టి స్వపరబేదములు గూడు కట్టుకొని యున్నంతవఱకు విదేహుడ వెట్లగుదువు? తీపి పులుపు ఉప్పు కారము వేడిమి మున్నగు రుచులందలి మంచిచెడ్డలు నీవు గ్రహింపగవు గదా! వీనియందలి మంచి పదార్థమునకు నీ మది యుప్పొంగును. చెడ్డకు క్రుంగును. ఆయా కాలములందు నీకును మెలకువ-కల-నిద్దుర మున్నగు నవస్థలు గల్గుచుండును గదా! ఇంక నీకు తురీయావస్థ గల్గుటెట్లు? అన్ని రథగజతురగపదాతి బలములు నా వశమున గలవు. వానికి నే నధిపతిని అని నీవు తలంతువా? తలంపనా? నీవు రుచించు పదార్థములనే తిందువు; సంతసింతువు; వ్యాకుల పడుదువు. అట్టి నీకు పాము పూలమాల- ఈ రెంటిలో సమబుద్ధి యెట్లుండును. కేవలము మన్ను-శిల-బంగారము-వీనియందు సమబుద్ధి గలవాడే ముక్తుడు; సర్వసముడు; సర్వభూతహితుడు; భూతదయాళువు; సర్వాత్మభూతుడు; సర్వభూతహితకరుడు. నా చిత్తమిల్లు పెండ్లములందు తగుల్కొనుటలేదు. నేను స్థితప్రజ్ఞుడనై యేకాంతములో పరబ్రహ్మమున జరింపవలయునన్నదే నా దృఢనిశ్చయము. నిస్సంగుడను నిర్మముడను నిష్పరిగ్రహుడను నిర్ద్వంద్వుడనై మృగముమాడ్కి నాకులలములు ఫలమూలములే తినుచు దిరుగవలయుననియే నా చిర వాంఛితము. కిం మే గృహేణ విత్తేన భార్యయా చ సురూపయా | విరాగమనసః కామం గుణాతీతస్య పార్థివ. 14 చింతసే వివిధాకారం నానారాగ సమాకులమ్ | దంభో %యం కిల తే భాతి విముక్తో%స్మీతి భాషసే. 15 కదాచి చ్ఛత్రుజా చింతా ధనజా చ కదా చన | కదా చి త్సైన్యజా చింతా నిశ్చింతో%సి కదా నృప. 16 వైఖానసా యే మునయో మితాహారాఃశ్రిత వ్రతాః | తే%పి ముహ్యంతి సంసారే జానంతో%పి హ్యసత్యరామ్. 17 తవ వంశసముత్థానాం విదేహా ఇతిభూపతే! కుటిలం నామ జానీహి నాన్యథేతి కదా చన. 18 విద్యాధరో యథా మూర్ఖో జన్మాంధస్తు దివాకరః | లక్ష్మీధరో దరిద్రశ్చ నామ తేసాం నిరర్థకమ్. 19 తవవంశోద్భవా యే యే శ్రుతాః పూర్వే మయా నృపాః |విదేహా ఇతి విఖ్యాతా నామతః కర్మతో నతే. 20 నిమి నామా%భవ ద్రాజా పూర్వం తప కులే నృప | యజ్ఞార్థం స తు రాజర్షి ర్వసిష్ఠం స్వగురుం మునిమ్. 21 నిమంత్రయామాస తదా త మువాచ నృపం మునిః | నిమంత్రితో%స్మి యజ్ఞార్థం దేవేంద్రేణాదునా కిల. 22 కృత్వా తస్య మఖం పూర్ణం కరిష్యామి తవాపి వై | తావ త్కురుష్వ రాజేంద్ర సంభారంతు శ##నైఃశ##నైః. 23 ఇత్యుక్త్వా నిర్య¸° సో%థ మహేంద్రయజనే మునిః | నిమి రన్యం గురుం కృత్వా చకార మఖ ముత్తమమ్. 24 తచ్ఛ్రుత్వా కుపితో%త్యర్థం వసిష్ఠో నృపతిం పునః | శవాప చ పత త్వద్య దేహ స్తే గురులోపక. 25 రాజా%పి తం శశాపాథ తవాపి చ పత త్వయమ్ | అన్యోన్యశాపా త్పతితౌ తా వేవ చ మయా శ్రుతమ్. 26 విదేహేన చ రాజేంద్ర కథం శప్తో గురుః స్వయమ్ | వినోద ఇవ మే చిత్తే విభాతి నృపసత్తమ. 27 ఓ పార్థివా! నేను గుణములకందనివాడను. నా హృది వైరాగ్యకాంతులతో నిర్మలముగ నున్నది. నాకిక ధనరాసులతో నిండ్లతో మమతలతో బంధించు పెండ్లముతో నేమి ప్రయోజనము? పెక్కు రాగసంకులములగు వివిధాకారముల నెదలో భావించుచునే నీవు ముక్తుడనైతినని తలంతువు. కాని యదంతమును వట్టి డంబాచారమేయని నాకు దోచుచున్నది. నీ కొకప్పుడు ధనచింత మరొక్కప్పుడు శత్రుచింత వేరొకప్పుడు సైన్యచింత గల్గుచుండును గద| ఇంక నీవు నిశ్చింతుడవై యెప్పుడుందువు? మితాహారులు-జితక్రోధులు-నియతవ్రతులునగు వైఖానసమునులు గూడ ఈ సంసారము మిథ్యయని తలంచియు నిందేదో యనుభవించవలసినది గలదని యిందే తగుల్కొందురు. నీ వంశజుల కెల్లరకు విదేహనామము గలదు. ఆ పేరు కుటిలమైనది. అది మీకు తగినది కాదు. మూఢునకు విద్యాధరుడని చీకునకు దివాకరుడని కటికదరిద్రునకు శ్రీనివాసుడని పేరులు పెట్టబడును. కాని యవన్నియు వారికి సార్థకములుగావు గదా! నీ పూర్వజులకు విదేహులను పేరున్నట్లు నేను మున్ను వింటిని. ఆ పేరు నామమాత్రమేగాని కర్మవలన గల్గినది మాత్రముగాదు. తొల్లి మీ కులమున నిమియను రాజుండెను. ఆతడు యాగము చేయదలచి తన కులగురువును బ్రహ్మర్షియునగు వసిష్ఠుని అందులకై ఆహ్వానించగా వసిస్ఠుడు 'నేను ఇంతకు పూర్వుమే యింద్రునిచే నొక యాగమున కాహ్వానింపబడితివి. అతని పని పూర్ణముగావించి తిరిగి నీ యాగమునకు వత్తును. అందులకు వలయు సాధనసామగ్రులు మెలమెల్లగ సమకూర్చుకొనుచుండును' అని పలికెను. వసిష్ఠుడు మహేంద్రుని యాగమునకు వెడలెను. ఇచట నిమియు వేరొక మునిని గురువుగనుంచి జన్నమునకు బూనుకొనెను. అది విని కోపించి వసిష్ఠుడు ఓరీ గురుద్రోహీ! నీ దేహము పతితమగుగాకని నిమిని శపించెను. నీ మేను పడిపోవుగాక! అని నిమిగూడ మునిని శపించెను. ఇట్లిర్వురు నొండొరుల శపించుకొని పతితులైరని నేను మునుపు వింటిని. ఆ రాజు విదేహుడే యైనచో గురువట్టులేల శపించుచు? ఇంతకిదంతయును నా మదికి వింతగ దోచుచున్నది. జనకః : సత్యముక్తం త్వయా నాత్ర మిథ్యా కించి దిదం మతమ్ | తథా పి%శృణు విప్రేంద్ర గురుర్మమసుపూజితః. 28 పితుః సంగం పరిత్యజ్య త్వం వనం గంతు మిచ్ఛసి | మృగైఃసహ సుసంబంధో భవితా తే నసంశయః. 29 మహాభూతాని సర్వత్ర నిఃసంగః క్వ భవిష్యతి | ఆహారార్థం సదా చింతా నిశ్చింతః స్యాః కథం మునే. 30 దండాజిన కృతా చింతా యథా తవ వనే%పిచ | తథైవ రాజ్య చింతా మే చింతావా నసి వా న వా. 31 వికల్పోపహత స్త్వం వైదూరదేశ ముపాగతః | న మే వికల్ప సందేహో నిర్వకల్పో%స్మి సర్వథా. 32 సుఖం స్వపిమి విప్రాహం సుఖం భుంజామి సర్వదా | న బద్ధో%స్మీతి బుద్ధ్యా%హం సర్వథైవ సుకీ మునే. 33 త్వం తు దుఃఖీ సదైవాసి బద్ధో%హ మితి శంకయా | ఇతి శంకాం పరిత్యజ సుఖీ భవ సమాహితః. 34 దేహో%యం మమబంధో%యంన మమేతి చ ముక్తతా తథా దనం గృహం రాజ్యం న మమేతి చ నిశ్చయః. 35 సూతః : తచ్ఛ్రుత్వా వచనం తస్య శుకః ప్రీతమనా%భవత్ | ఆపృచ్ఛ్యతం జగామావువ్యాసస్యాశ్రమముత్తమమ్. 36 ఆగచ్ఛంతం సుతం దృష్ట్యా వ్యాసో%పి సుఖ మాప్తవాన్ | ఆలిం గ్యాఘ్రాయ మూర్ధానం పప్రచ్ఛ కుశలం పునః. 37 స్థిత స్తత్రాశ్రమే రమ్యే పితుః పార్మ్వే సమాహితః | వేదాధ్యయన సంపన్నః సర్వశాస్త్ర విశారదః. 38 జనకస్య దశాం దృష్ట్యా రాజ్యస్థస్య మహాత్మనః | స నిర్వృతిం పరాం ప్రాప్య పితురాశ్రమ సంస్థితః. 39 పితౄణాం సుభగా కన్యా పీవరీ నామ సుందరీ | శుక శ్చకార పత్నీం తాం యోగమార్గ స్థితో%పి హి. 40 స తస్యాం జనయామాస పుత్రాం వ్చతుర ఏవ హి | కృష్ణం గౌరప్రభం చైవ భూరిందేవ శ్రుతం తథా. 41 కన్యాం కీర్తిం సముత్పాద్య వ్యాసపుత్రః ప్రతాపవాన్ | దదౌ విభ్రాజ పుత్రాయ త్వణుహాయ మహాత్మనే. 42 అణుహస్య సుతః శ్రీమా న్బ్రహ్మదత్తః ప్రతావవాన్ | బ్రహ్మజ్ఞః పృథివీ పాలః శుకకన్యా సముద్భః. 43 కాలేన కియతా తత్ర నారద స్యోపదేశతః | జ్ఞానం పరమకం ప్రాప్య యోగమార్గ మనుత్తమమ్. 44 పుత్రే రాజ్యం నిధా యాథ గతో బదరికాశ్రమమ్ | మాయా బీజోపదేశేన తస్యజ్ఞానం నిరర్గళమ్. 45 జనకుడిట్లనియె: ఓ శుకమునీ! నీవు పల్కినదంతయును యథార్థమే. ఇందసత్యములేదు. ఐనను నా గురువు చెప్పినది వినుము. నీవు నీ తండ్రితోడి సంబంధము విడనాడి యెక్కడికో కాఱడవులకేగదలతువు. కాని యక్కడను నీకు మృగసంబంధముండును. ఇందు సందేహము లేదు. ఆ పంచమహాభూతములెల్లడల వ్యాపించియుండునే| నీకచటగూడ నాహారచింత తప్పదు. దండాజినముల చింతయుడును. అట్లే నాకిచట రాజ్యచింతయు నుండును. దూరదేశముల నుండి వచ్చుటచే నీ చిత్తము వికలమై యున్నది. నేనిచట నే వికల్పములకును సంశయములకును దూరమందుందును. నేను సుఖముగా భుజింతును. హాయిగా నిదురింతును. బద్ధుడనుగాను, స్వతంత్రుడనను తెలివి వెలుగుచేత సంతతము సుఖముందును. నేను బద్ధుడనను శంకచే నీవింత దురపిల్లుచున్నావు. కాన నికనైన నిట్టి యనుమానము మాని స్థిరమతివై సుఖముండుము నేను దేహమను-బద్ధుడను. అనుకొన్నంతకాలము నీకు ముక్తి హుళక్కి. నేనీ ధనరాసులు భవనాలు రాజ్యము నావికావను తలంపున సుఖముందును. సూతుడిట్లనియె: ఆ జనకుని హితవచనము లాలకించి శుకుడు సంప్రీతమనంబుతో రాజు ననుమతి బడసి తిరిగి తన తండ్రియాశ్రమ మేగెను. తిరిగి వచ్చిన నందనునిగాంచి వ్యాసుడమితానందమందెను. గుండెకు హత్తుకొని శిరము మూర్కొని సేమమడిగెను. ఆ పవిత్రాశ్రమమందు శుకుడు తన తండ్రితోడ వేదాధ్యయనముచేసి సర్వశాస్త్ర పారంగతుడయ్యెను. రాజ్యమేలుచున్నను నిరహంకృతితో నిర్మమత్వముతో సమదృష్టితో వెలుగొందు జనకునిగాంచి శుకుడు తన తండ్రి యింటనే యుండెను. అతడు యోగమార్గగామి. ఐనను పితరుల కన్నియను పీవరియను నామెను భార్యగ నంగీకరించెను. ఆమెయందు నల్వురు పుత్త్రులను బడసెను. వారు కృష్ణుడు గౌరప్రభుడు భూరి దేవశ్రుతుడన బరగిరి. మహావీర్యుడగు శుకుడు మరల కీర్తియను కూతును బడసి ఆమెను విభ్రాజసుతుడగు అణుహునకిచ్చి పెండ్లి చేసెను. అణుహుని తనయుడు శ్రీమంతుడగు బ్రహ్మదత్తుడు. అతడు మహాప్రతాపి. శుకకన్యకు గలిగిన అతడు బ్రహ్మజ్ఞానముగల రాజయ్యెను. అతడు కొన్నాళ్లకు నారదోపదేశమున యోగమార్గమవలంబించి తన కుమారునకు రాజ్య మప్పగించి బదిరికాశ్రమముజేరి అచట మాయా బీజోపదేశమంది పరిపూర్ణ బ్రహ్మజ్ఞానియయ్యెను. నారదస్య ప్రసాదేన జాతం సద్యో విముక్తిదమ్ | కైలాసశిఖరే రమ్యే త్యక్త్వా సంగం పితుః శుకః. 46 ధ్యాన మాస్థాయ విపులం స్థితః సంగ పరాజ్ముఖః | ఉత్పపాత గిరేః శృంగా త్సిద్ధిం చ పరమాం గతః. 47 ఆకాశగో మహాతేజా విరరాజ యథా రవిః | గిరేః శృంగం ద్విధా జాతం శుకస్యోత్పతనే తదా. 48 ఉత్పాతా బహవో జాతాః శుకశ్చాకాశగో%భవత్ | అంతరిక్షే యథావాయుః స్తూయమాన స్సురర్షిభిః. 49 తేజసా%తివిరాజన్వై ద్వితీయ ఇవభాస్కరః | వ్యాసస్తు విరహా క్రాంతఃక్రంద న్పుత్రేతి చాసకృత్. 50 గిరేః శృంగే గత స్తత్ర శుకో యత్ర స్థితో%భవత్ | క్రందమానం తదా దీనం వ్యాసం మత్వా శ్రమాకులమ్. 51 సర్వభూతగతః సాక్షీ ప్రతిశబద్దమభూ త్తదా | తత్రా ద్యాపి గిరేః శృంగే ప్రతిశబద్దః స్ఫుటో%భవత్. 52 రుదంతం తం సమాలక్ష్య వ్యాసం శోకసమన్వితమ్ | పుత్ర పుత్రేతి భాషంతం విరహేణ పరిప్లుతమ్. 53 శివ స్తత్ర సమాగత్య పారావర్య మబోధయత్ | వ్యాస శోకం మాకురు త్వం పుత్ర స్తే యోగవిత్తమః 54 పరమాం గతి మాపన్నో దుర్లభాం చాకృ తాత్మభిః | తస్య శోకో న కర్తవ్య స్త్వయా%శోకం విజానతా. 55 కీర్తి స్తే విపులా జాతా తేన పుత్రేణ చానఘ | వ్యాసః : న శోకో యాతి దేవేశ కింకరోమి జగత్పతే. 56 అతృప్తే లోచనే మే%ద్యపుత్రదర్శనలాలసే | మహాదేవః : ఛాయాంద్రక్ష్యసిపుత్రస్యపార్శ్వస్థాం సుమనోహరామ్. 57 తాం వీక్ష్య మునిశార్దూల శోకంజహి పరంతప | సూతః : తదా దదర్శ వ్యాసస్తు ఛాయం పుత్రస్య సుప్రభామ్ 58 దత్వా వరం హర స్తసై#్మ తత్రై వాంతరధీయత | అంతర్హితే మహాదేవే వ్యాసః స్వాశ్రమ మభ్యగాత్. 59 శుకస్య విరహే ణాపితప్తః పరమదుఃఖితః | 60 ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ ప్రథమస్కంధే ఏకోనవింశో%ధ్యాయః శుకుడును నారదుని యనుగ్రహమున తన తండ్రి సంగతి వదలి ముక్తిప్రదమగు కైలాస శిఖరము చేరెను. ఆ చోట నతడు సర్వసంగపరిత్యాగియై నిర్వికల్ప సమాధిలో మునింగి సిద్ధాత్మస్వరూపుడై యాగిరిశిఖరమునుండి యూర్ధ్వమున కెగిరెను. వెంటనే గిరిశిఖరము రెండు వ్రయ్యలయ్యెను. అత డాకాశవీధిలో రెండవ భాస్కరుని బోలి దివ్యతేజమున ప్రకాశించెను. శుకుడు నింగికెగయగనే యిట పెక్కులుత్పాతములు సంభవించెను. అంతరిక్షమందలి వాయువును సురర్షులు ప్రశంసించునటులే శ్రీశుకుని మునులు సన్నుతించిరి. ఆ విధముగ సర్వభూతాత్మకుడు గగనసీమలో రెండవ భాస్కరునివలె బ్రహ్మజ్యోతులతో తేజరిల్లుచుండెను. ఇట వ్యాసుడు పుత్త్రవియోగము భరించలేక పుత్రా పుత్రాయని దెసలు మార్మ్రోగ బిట్టాక్రోశించెను. ఆ శుకుడు తపమాచరించిన గిరిశిఖరములందు అతిదీనుడై శోకించు వ్యాసునిగని సర్వభూతమయుడు సర్వసాక్షియగు పరమాత్మ వ్యాసునకు ప్రతిధ్వనితో మారు పలికెను. ఆ గిరిశిఖరములపై నేటికిని ఆ ప్రతిధ్వని స్పష్టముగ వినబడుచుండును. పుత్త్రవిరహమున పరిప్లుతుడై పుత్ర! పుత్త్ర! యని శోకమున మునిగిన వ్యాసుని చెంతకు పరమశివు డేతించి యతని నిట్లు ప్రబోధించెను: ఓ వ్యాసమునీ! శోకింపకుము. నీ నందనుడు యోగవిత్తముడు. అతడకృతాత్ములకు దుర్లభ##మైన పరమగతిని జేరెను. బ్రహ్మజ్ఞానివగు నీవతనికై బెంగపెట్టుకొనకుము. నీ పుత్త్రునివలన నీకు చిరయశము గల్గినది. వ్యాసుడిట్లనియె: మహాదేవా! నేనేమి చేతును? ఎంతకు నా శోకమాగుట లేదు. నా కన్ను లింకను పుత్త్రదర్శనమునకే పరితపించుచు ఎదరు తెన్నులు చూచున్నవి. శివుడిట్లనియె: అటులైన నీప్రక్కనే నీకతని చక్కటి నీడ నిత్తెము పొడగట్టుచుండును. ఆ నీడను చూచుకొని శోకము విడుపుము. సూతుడిట్లనియె: అంత వ్యాసుడు తన తనయుని కాంతిమంతమైన నీడ గాంచెను. వామదేవుడా విధముగ వరమిచ్చి యచ్చోట నంతర్ధానమందెను. పిమ్మట వ్యాసుడు నిజాశ్రమమున కేగెను. ఐనను వ్యాసుడు తీరని పుత్త్రవియోగభారమున దుఃఖితుడై తపించెను. ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి ప్రథమస్కందమందలి పందొమ్మిదవ యధ్యాయము