Sri Devi Bhagavatam-1
Chapters
అథ ద్వితీయో
శ్రీసూత ఉవాచ :
ధన్యో%హమతి భాగ్యో%హం పాలితో%హం మహాత్మభిః | యత్పృష్టం సుమహత్పుణ్వం పురాణం వేద విశ్రుతమ్. 1
తదహం సంప్రవక్ష్యామి సర్వశ్రుత్యర్థ సమ్మతమ్ | రహస్యం సర్వశాస్త్రాణా మాగమానా మనుత్తమమ్. 2
నత్వా తత్పద పంకజం సులలితం ముక్తిప్రదం యోగినామ్
బ్రహ్మాద్యైరపి సేవితం స్తుతిపరై ర్ధ్యేయం మునీంద్రైః సదా |
వక్ష్యామ్యద్య సవిస్తరం బహురసం శ్రీమత్పురాణోత్తమమ్ |
భక్త్యా సర్వరసాలయం భగవతీనామ్నా ప్రసిద్ధం ద్విజాః ! 3
యా విద్యేత్యభిధీయతే శ్రుతిపథే శక్తిః సదా%%ద్యా పరా
సర్వజ్ఞా భవబంధ ఛిత్తినిపుణా సర్వాశ##యే సంస్థితా |
దుర్జేయా సుదురాత్మభిశ్చ మునిభి ర్ధ్యానాస్పదం ప్రాపితా |
ప్రత్యక్షా భవతీహ సా భగవతీ సిద్ధిప్రదా స్యా త్సదా. 4
సృష్ట్వా%ఖిలం జగదిదం సదసత్స్వరూపం | శక్త్యా స్వయా త్రిగుణయా పరిపాతి విశ్వమ్|
సంహృత్య కల్ప సమయే రమతే తథైకా | తాం సర్వ విశ్వజననీం మనసా స్మరామి. 5
బ్రహ్మా సృజత్యఖిల మేత దితి ప్రసిద్ధం | పౌరాణికైశ్చ కథితం ఖలు వేదవిద్భిః |
విష్ణోస్తు నాభికమలే కిల తస్య జన్మ | తై రుక్తమేవ సృజతే న హి స స్వతంత్రః 6
విష్ణుస్తు శేషశయనే స్వపితీతి కాలే | తన్నాభిపద్మ ముకులే ఖలు తస్య జన్మ |
ఆధారతాం కిల గతో%త్ర సహస్ర మౌళిః | సం బోధ్యతాం స భగవాన్ హి కథం మురారిః 7
ఏకార్ణవస్య సలిలం రసరూపమేవ | పాత్రం వినా న హి రసస్థితి ర స్తి కచ్చిత్ |
యా సర్వభూత విషయే కిల శక్తిరూపా | తాం సర్వభూత జననీం శరణం గతో%స్మి. 8
యోగ నిద్రామీలితాక్షం విష్ణుం దృష్ట్యాంబుజే స్థితః | అజ స్తుష్టావ యాం దేవీం తా మహం శరణం వ్రజే. 9
తాం ధ్యాత్వా సగుణాం మాయాం ముక్తిదాం నిర్గుణాం తథా! వక్ష్యే పురాణ మఖిలం శృణ్వంతు మునయస్త్విహ. 10
పురాణ ముత్తమం పుణ్యం శ్రీమద్భాగవతాభిధమ్| అష్టాదశసహస్రాణి శ్లోకాస్తత్ర తు సంస్కృతాః. 11
రెండవ అధ్యాయము
శ్రీ దేవీభాగవత మందలి స్కంధముల వివరణము
శ్రీ సూతుడిట్లనియెను : ఇచ్చట నున్న మహాత్ములు వేదమువలె ప్రసిద్ధమును మహా పుణ్యప్రదమునైన శ్రీ దేవీభాగవత పురాణము విషయమన నన్ను ప్రశ్నించిరి. అందుచే నేనెంతయు ధన్యుడను సదృష్టవంతుడను పవిత్రుడను నైతిని. కావున నేనిపుడు సర్వ వేదార్థ సమ్మితమును సకల శాస్త్రములందు నాగమములందు నుత్తమమైనదియు రహస్యమైనదియు నగు దేవీ పురాణమును చెప్పుదును, ఓ ద్విజోత్తములారా! పరమ యోగులకు ముక్తి నొసంగునదియు బ్రహ్మాదులచేత సేవింపబడునదియు స్తుతిపరులగు ముని ప్రవరులచే నెల్లపుడు ధ్యానింపబడ దగినదియు సుకుమారమునగు శ్రీ మదఖిలాండేశ్వరియగు శ్రీ లలితాదేవి పద పద్మముల కభివందనం బాచరించి నవరసభరితము పురాణ శ్రేష్ఠమును శ్రీదేవి పేరుతో ప్రసిద్ధమునగు శ్రీ మద్దేవీ భాగవత మహాపురాణమును పరమభక్తితో నిపుడు రసోదంచితముగ మీకు చక్కగ వివరింతును. ఎల్ల వేదమార్గములందు ఆదిశక్తిగా ఆత్మవిద్యగా పరాశక్తిగా సంసారపాశ విచ్ఛేదినిగా సకలహృదయనివాసినిగా దుష్టుల కలవిగానిదై శిష్టమునుల నిశ్చల ధ్యానమున దెలియబడునది కామదాయిని యై తనరారు శ్రీ రాజరాజేశ్వరి మాకు ప్రత్యక్షమై సిద్ధులను చేకూర్చుగాత! తన త్రిగుణాత్మకమైన మాయాశక్తిచేత నీ సకల చరాచర ప్రపంచములను సృజించి పెంచి ప్రళయ కాలమున సంహరించుచు లీలావినోదము సలుపుచున్న సర్వవిశ్వమాతను మనసార నెదలో సంస్మరింతును. ఈ కనంబడు జగంబునెల్ల బ్రహ్మయే సృజించెనను నుడి లోకమున వ్యాప్తిలో నున్నది. వేదవిదులు పురాణవేత్తలు నీ విషయము నిట్లే చెప్పుచున్నారు. కాని యా బ్రహ్మయు విష్ణుని నాభికమలమునుండియే జన్మించెను. అతడా విష్ణుని ప్రేరణ చేతనే విశ్వసృష్టికి గడంగెను. కనుక బ్రహ్మయును స్వష్టికార్యమున పరాధీనుడే. ప్రళయకాలమున విష్ణువు శేషశయ్యపై పవ్వళించగా నతని బొడ్డుతమ్మినుండి నలువ యుద్భవించెను. ఆ విష్ణువున కాధారము వేయిపడగల శేషఫణియని మన మెఱుగుదుము. కనుక విష్ణువే విశ్వసృష్టి కాధారమని యెట్లు చెప్పగలము? ఆ మహాసాగర మందలి జలము రసమయమైనది. ఆ రస మేయాధారమును లేక నిలువజాలదు. మాయాశక్తి స్వరూపిణియగు విశ్వజననియే యా జలముల కాధారభూతురాలు. నేనా విశ్వకారణయగు తల్లినే శరణు వేడుకొనుచున్నాను. యోగనిద్రలోనున్న విష్ణునిగాంచి నలువ యే దయామయిని ప్రస్తుతించి యామెను ప్రసన్నురాలినిగ జేసికొనెనో యా దయామృత తరంగిణిని నేను శరణు పొందుచున్నాను. ఆ సగుణ నిర్గుణ స్వరూపిణి మాయామయి ముక్తిప్రదాయిని యగు తల్లినే ధ్యానించి సంపూర్ణ దేవీభాగవత మహాపురాణమును మీకు వచింతును. మునులారా! మీర లది కడుశ్రద్ధగ వినుడుః
స్కంధా ద్వాదశ చైవాత్ర కృష్ణేన విహితాః శుభాః| త్రిశతంపూర్ణమధ్యాయా అష్టాదశయుతాః స్మృతాః. 12
వింశతిః ప్రథమేతత్ర ద్వితీయే ద్వాదశైవతు | త్రింశ##చ్చైవ తృతీయే తు చతుర్థే పంచవింశతిః. 13
పంచత్రింశత్తథా% ధ్యాయాః పంచమే పరికీర్తితాః| ఏకత్రింశత్తథా షష్ఠే చత్వారింశచ్చ సప్తమే. 14
అష్టమే తత్త్వ సంఖ్యాశ్చ పంచాశన్నవమే తథా | త్రయోదశ తు సంప్రోక్తా దశ##మే మునినా కిల. 15
తథా చైకాదశస్కంధే చతుర్వింశతి రీరితాః | చతుర్దశైవ చాధ్యాయా ద్వాదశే మునిసత్తమాః. 16
ఏవం సంఖ్యా సమాఖ్యాతా పురాణ% స్మి న్మహాత్మనా| అష్టాదశ సహస్రీయా సంఖ్యా చ పరికీర్తితా. 17
సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ | వంశాను చరితంచైవ పురాణం పంచలక్షణమ్. 18
నిర్గుణా యా సదా నిత్యా వ్యాపికా% వికృతా శివా| యోగగమ్యా% ఖిలాధారా తురీయా యా చ సంస్థితా. 19
తస్యాస్తు సాత్త్వికీ శక్తీ రాజసీ తామసీ తథా| మహాలక్ష్మీః సరస్వతీ మహాకాళీతి తాః స్త్రియః. 20
తాసాం తిసౄణాం శక్తీనాం దేహాంగీకారలక్షణః| సృష్ట్యర్థం చ సమాఖ్యాతః సర్గః శాస్త్ర విశారదైః 21
హరిద్రుహిణరుద్రాణాం సముత్పత్తి స్తతః స్మృతా| పాలనోత్పత్తినాశార్థం ప్రతిసర్గః స్మృతో హి సః. 22
సోమసూర్యోద్భవానాం చ రాజ్ఞాం వంశప్రకీర్తనమ్| హిరణ్యకశిప్వాదీనాం వంశాస్తే పరికీర్తి తాః 23
స్వాయంభువ ముఖానాం చ మనూనాం పరివర్ణనమ్| కాలసంఖ్యా తథా తేషాం తత్తన్మన్వంతరాణి చ. 24
తేషాం వంశానుకథనం వంశానుచరితం స్మృతమ్ | పంచలక్షణయుక్తాని భవంతి ముని సత్తమాః. 25
సపాదలక్షంచ తథా భారతం మునినా కృతమ్ | ఇతిహాస ఇతి ప్రోక్తం పంచమం వేదసమ్మితమ్. 26
శౌనక ఉవాచ :
కాని తాని పురాణాని బ్రూహి సూత సవిస్తరమ్ | కతిసంఖ్యాని సర్వజ్ఞ ! శ్రోతుకామా వయం త్విహ. 27
ఈ శ్రీదేవీభాగవత మహాపురాణము పుణ్యకరమైనది. ఉత్తమోత్తమమైనది. ఇందు పదునెనిమిదివేల శ్లోకములు గలవు. పండ్రెండు స్కంధములు మూడువందల పదునెనిమిది యధ్యాయములు గలవు. దీనిని శ్రీ వ్యాసభగవానుడు ప్రవచించి ప్రకాశింపచేసెను. ఈ శ్రీదేవీభాగవత పురాణము నందు ప్రథమ స్కంధమున ఇరువది రెండవస్కంధమున పండ్రెండు మూడవస్కంధమున ముప్పది నాల్గవస్కంధమున నిరువదియైదు ఐదవస్కంధమున ముప్పదియైదు ఆఱవస్కంధమున ముప్పదియొకటి ఏడవస్కంధమున నలువది ఎనిమిదవస్కంధమున నిరువదినాలుగు తొమ్మిదవస్కంధమున నేబది పదియవస్కంధమున పదుమూడు పదునొకండవస్కంధమున నిరువదినాలుగు ద్వాదశస్కంధమందు పదునాలుగు అధ్యాయములు గలవు. ఈ మహాపురాణము పదునెనిమిదివేల శ్లోకములు గలదిగా శ్రీవ్యాసమహామునిచే రచింపబడెను. ఇది సర్గము ప్రతిసర్గము వంశము మన్వంతరము వంశానుచరితమునను నైదు లక్షణములతో తనరారుచున్నది. ఆ పరాభట్టారికయే నిత్య నిర్గుణ నిర్వికల్ప శివస్వరూపిణి విశ్వాధార యోగగమ్య తురీయ. అనగా సాత్త్విక రాజస తామస శక్తిత్రయము కంటె విశిష్టమగు పరబ్రహ్మరూపిణి. ఆ విశ్వవ్యాపిని యొక్క సాత్త్వికరాజస తామస శక్తులే శ్రీమహాలక్ష్మి శ్రీమహా సరస్వతి శ్రీమహాకాళి యను స్త్రీ త్రితయ స్వరూపమున చెన్నొందు చున్నవి. ఆ మూడు శక్తులే యీ సృష్టికి నిమిత్తమై దివ్యదేహములు దాల్చును. అట్టి రూపములు దాల్చు లక్షణమునే శాస్త్రకోవిదులు సర్గమని పేర్కొందురు. ఆ ముత్తెఱంగులగు శక్తుల కారణముననే విష్ణు బ్రహ్మ మహేశు లుద్భవించిరి. వీరివలననే సృష్టి పాలన లయములు నిరంతరముగ జరుగు చుండును. ఈ మూర్తి త్రయోద్భవ వృత్తాంతమునే ప్రతిసర్గ మందురు. సూర్య చంద్రవంశజులైన రాజుల వంశచరితమును హిరణ్యకశ్యపాదుల చరిత్రమును దెలుపు లక్షణమునకు వంశమనిపేరు. స్వాయంభువుడు మొదలగు మనువుల వంశములను వారి జీవితకాల పరిమాణములను అభివర్ణించుట మన్వంతరమనంబడును. ఆ మనువేల వంశకథల గూర్చి తెలుపుట వంశానుచరిత మనంబరగును. ఇవియే పురాణములయందుండవలసిన పంచలక్షణములు. తొల్లి శ్రీ వ్యాస మహాముని శ్రీ మహాభారతేతిహాసమును విరచించెను. అది వేదసారము పంచమ వేదము నని ప్రసిద్ధిగాంచినది. అందు నూటయిరువది యైదువేల శ్లోకము లొప్పుచుండును.
కలికాలవిభీతాః స్మో నైమిశారణ్యవాసినః | బ్రహ్మణా త్ర సమాదిష్టాశ్చక్రం దత్వా మనోమయమ్. 28
కథితం తేన నః సర్వా న్గచ్ఛం త్వేతస్య పృష్ఠతః | నేమిః సంశీర్యతే యత్ర స దేశః పావనః స్మృతః. 29
కలేస్తత్ర ప్రవేశో న కదాచి త్సంభవిష్యతి | తావ త్తిష్ఠంతు తత్రైవ యావత్సత్యయుగం పునః. 30
తచ్ఛ్రుత్వా వచనం తస్య గృహీత్వా తత్కథానకమ్ | చాలయన్నిర్గతస్తూర్ణం సర్వదేశ దిదృక్షయా. 31
ప్రీత్యాత్రచాలయంశ్చక్రం నేమిః శీర్ణో%త్ర పశ్యతః | తేనేదంనైమిశం ప్రోక్తం క్షేత్రం పరమపావనమ్. 32
కలిప్రవేశోనైవాత్ర తస్మా త్థ్సానం కృతం మయా | మునిభిః సిద్ధసంఘైశ్చ కలిభీతైర్మహాత్మభిః. 33
పశుహీనాఃకృతా యజ్ఞాః పురోడాశాదిభిః కిల | కాలాతివాహనం కార్యం యావత్సత్యముగాగమః. 34
భాగ్యయోగేన సంప్రాప్తః సూత త్వం చాత్ర సర్వథా | కథయాద్య పురాణంహి పావనం బ్రహ్మసమ్మితమ్. 35
సూత| శుశూష్రవః సర్వే వక్తా త్వం మతిమానథ| నిర్వ్యాపారా వయం నూనమేకచిత్తా స్తథైవచ. 36
త్వం సూత! భవ! దీర్ఘాయుస్తాపత్రయవివర్జితః | కథయాద్య పురాణం హి పుణ్యం భాగవతం శివమ్. 37
యత్రధర్మార్థకామానాం వర్ణనం విధిపూర్వకమ్ | విద్యాం ప్రాప్య తథా మోక్షః కథితో మునినా కిల. 38
ద్వైపాయనేన మునినా కథతితం యచ్చ పావనమ్ | న తృప్యామో వయం స్తూత కథాం శ్రుత్వా మనోరమామ్. 39
సకల గుణగణానా మేక పాత్రం పవిత్ర మఖిల భువన మాతుర్నాట్యవద్య ద్విచిత్రమ్|
నిఖిల మల గణానాం నాశకృత్కామకందం ప్రకటయ భగవత్యా నామయుక్తం పురాణమ్. 40
ఇతి శ్రీ దేవీభాగవతే మహాపురాణ ప్రథమస్కంధే ద్వితీయోధ్యాయః.
శౌనకు లిట్లనిరి ః ఓ సూత మహామునీ! నీవు సర్వజ్ఞుడవు. ఆ పురాణములన్నియునెన్ని? వాని పేరులేమి? వాని నన్నిటిని వినగోరుచున్నారము. మాకు వానిని వివరించి తెల్పుము. కలికాలమువలని భయమున మేమీ నైమిశారణ్యమందు నివసించుచున్నాము. ఇది పావనక్షేత్రము. మునుపు బ్రహ్మ తన మనోమయ చక్రమును మా కొసంగి యిట్లనియెను: మీరీ చక్రము వెంట నరుగుడు. ఈ చక్రపునేమి - బండి కంటికమ్మి - యెచ్చోట జారిపడునో యచ్చోటు పవిత్రమైనదని యెఱుంగుడు. ఆ చోట కలిప్రవేశము జరుగనేరదని తెలిసికొనుడు. సత్యయుగము మరల వచ్చువఱకు మీరలా పవిత్ర క్షేత్రమందే యుండుడు. మేమా బ్రహ్మవాక్కులు విని సకల లోకములు చూడ ఆ చక్రము త్రిప్పుచు దాని వెంటనే యరిగితిమి. అది తిరిగి తిరిగి యిచ్చోటికి వచ్చెను. వెంటనే ఆ బండి కంటికమ్మి చూచుచుండగనే యిచ్చోట పడెను. చక్రనేమి శీర్ణమై పడిన స్థలమగుటచే నీ క్షేత్రము నైమిశమని ప్రసిద్ధి కాంచినది. ఇది పరమపావనమైన పుణ్యక్షేత్రము. ఈ పావన స్థలమున కలిప్రవేశము జరుగజాలదు. ఈ కారణముననే మహాత్ములు సిద్ధులు మునులు మేమును కలిభయపీడితులమై యిచ్చోటనే నివాసమేర్పరచుకొంటిమి. సత్యయుగము సమీపించు వరకు మేమిచ్చోటనే పశుహింస లేని పురోడాశాది యాగము లొనరించుచు మా జీవితకాలము గడపుకొందుము. సూతముని సత్తమా ! మా పూర్వ పుణ్యవిశేషమున నీవిచ్చటి కరుగుదెంచితివి. మాకు బ్రహ్మ సమ్మితము పరమపావనము నగు పురాణము నీవు వినిపింపుము. నీవు ధీశాలివి. మహావక్తవు. మేము ఇతర విషయ చింతమాని యేకాగ్ర చిత్తమున పురాణము విన నుత్సహించుచున్నవారము. పవిత్రము నిత్య కళ్యాణప్రదము వేదసమ్మతమునగు ఆ దేవీ భాగవత పురాణము మాకు వినిపించి నీవు తాపత్రయములు లేక దీర్ఘాయుష్కుడవై జీవింపుము. ఆ వ్యాసమహర్షి ధర్మార్థకామ మోక్షములగూర్చియును మహావిద్యను గుఱించియు నా పురాణమందు పరి వర్ణించెను. అట్టిదానిని మాకు వినిపింపుము. ఆ మునీంద్రుడు చెప్పిన సుమనోహరము పరమ పావనము రసభరితమునగు కథలెంతవిన్నను మాకు తనవితీరుటలేదు. సకల సద్గుణములకు పాత్రమైనదియు పవిత్రమైనదియు శ్రీ జగన్మాతయొక్క లీలానాట్యములతో విచిత్రమైనదియు సమస్త పాపరాసులను పటాపంచలు చేయునదియు నెల్లకోర్కులీడేర్చునదియునైన శ్రీభగవతి యను దేవి పేరబరగు శ్రీ దేవీమహాభాగవతమును మాకు దయతో వివరింపుము.
ఇది శ్రీ దేవీభాగవతమునందలి ప్రథమ స్కంధములోని ద్వితీయాధ్యాయము.