Sri Devi Bhagavatam-1
Chapters
అథ వింశో%ధ్యాయః ఋషయ ఊచుః : శకస్తు పరమాం సిద్ధి మాస్తవా న్దేవసత్తమః | కిం చకార తతో వ్యాస స్తన్నోబ్రూహి సవిస్తరమ్.
1 సూతః : శిష్యా వ్యాసస్య యే%ప్యాస న్వేదాభ్యాస పరాయణాః | అజ్ఞా మాదాయ తేసర్వే గతాః పూర్వం మహీతలే.
2 ఆసితో దేవలశ్చైవ వైశంపాయన ఏవచ | జైమినిశ్చ సుమంతుశ్చ గతాః సర్వే తపోధనాః
3 తా నేతాన్ వీక్ష్య పుత్రం చ లోకాంతరిత మవ్యుత | వ్యాసఃశోక సమాక్రాంతో గమనాయాకరో న్మతిమ్.
4 సస్మార మనసా వ్యాస స్తాం నిషాద సుతాం శుభామ్ | మాతరం జాహ్నవీ తీరే ముక్తాం శోకసమన్వితామ్.
5 స్మృత్వా సత్యవతీం వ్యాస స్త్యక్త్వా తం పర్వతోత్తమమ్ | ఆజగామ మహాతేజా జన్మస్థానం స్వకం మునిః 6 ద్వీపం ప్రాప్యాథ పప్రచ్ఛ క్వ గతా సా వరాననా | నిషాదా స్తే సమాచఖ్యు ర్దత్తా రాజ్ఞే తు కన్యకా. 7 దాశరాజో%పి సంపూజ్య వ్యాసం ప్రీతి పురస్పరమ్ | స్వాగతేనాభి సత్కకృత్య ప్రోవాచ విహితాంజలిః. 8 దాశరాజః: అద్యమే సఫలం జన్మ పావితం నః కులం మునే| దేవానా మపి దుద్దర్వం యజ్ఞాతం తవ దర్శనమ్ 9 యదర్థ మాగతో%సి త్వ తద్బ్రూహి ద్విజసత్తమ | ఆపి దారా ధనం పుత్రా స్త్వదాయత్త మిదం విభో. 10 సరస్వత్యా స్తటేరమ్యే చకారాశ్రమ మండలమ్ | వ్యాస స్తపః సమాయుక్త స్తత్రై వాస సమూహితః. 11 సత్యవత్యాః సుతౌ జాతౌ శంతనో రమిత ద్యుతేః | మత్వా తౌ భ్రాతరౌ వ్యాసః సుఖమాప వనే స్థితః. 12 ఇరువదవ అధ్యాయము వ్యాసుని కార్యాచరణము ఋషులిట్లనిరి: దేవసత్తముడగు శుకుడా ప్రకారముగ పరమసిద్ధిని బొందిన మీదట వ్యాసుడేమి చేసెను? అదంతయును మాకు తేటతెల్ల మొనరింపుము. సూతుడిట్లనియె : వేదాభ్యాస పరాయణులగు శిష్యులందఱును అసితుడు దేవలుడు వైశంపాయనుడు జైమిని సుమంతుడు మున్నగు తపోధనులెల్లరు వ్యాసు ననుమతిగైకొని ఆతని వీడి వెళ్ళిరి. శుకుడు పరమ గతి చెందెను. అంత మహాత్ముడు వ్యాసుడు తనకు సత్సాంగత్యము లేమిచే తాను వేరొకచో నేగదలచెను. ఆతడపుడు గంగాతీరమున పరాశరునిచేత విడువబడి శోకించుచుండిన తన తల్లియగు నిషాదకన్యను నెమ్మదిలో దలంచెను. అట్లు వ్యాసుడు సత్యవతిని దలంచి యాపర్వతము వీడి తన జన్మస్థానమున కేగెను. అచ్చో వ్యాసుడొక ద్వీపముజేరి సత్యవతిని గూర్చి యడుగగ నామె శంతనున కీయబడినదని నిషాదులనిరి. దాశరాజు వ్యాసునకు స్వాగతము బలికి ప్రీతితో బూజించి సత్కరించి దోసిలొగ్గి యిట్లు నుడివెను: ఓ మునివరా! నేడు గదా నా జన్మము సార్థకమైనది. కులము పవిత్రమైనది. అమర దుర్లభ##మైన నీ దర్శనభాగ్యము నేటికి నాకు ప్రాప్తించినది. నీ రాకకు కారణమేమో తెలుపుము. ఈ నా భార్య బిడ్డలు - సంపద - అంతయును నీ యధీనమే. ఆ మాటలకు సంతసిల్లి వ్యాసుడచ్చోట సరస్వతీ నదీతీరమున చక్కని యాశ్రమ మేర్పరచుకొని తపమొనర్చుచు ధీరుడై యచ్చట కాలము గడుపుచుండెను. మహావిక్రముడగు శంతనునివలన సత్యవతి కిరువురు సుతులు గలిగిరని విని వ్యాసుడానందమంది యచటనే యుండెను. చిత్రాంగదః ప్రథమజో రూపవాన్ శత్రుతాపనః | బభూవ నృపతేః పుత్త్రః సర్వలక్షణ సంయుతః. 13 విచిత్రవీర్య నామా%సౌ ద్వితీయః సమజాయత | సో%పి సర్వగుణోపేతః శంతనోః సుఖవర్ధనః. 14 గాంగేయః ప్రథమ స్తస్య మహావీరో బలాధికః | తత్రైవ తౌ సుతౌ జాతౌ సత్యవత్యాం మహాబలౌ. 15 శంతను స్తాన్సుతా న్వీక్ష్య సర్వలక్షణ సంయుతాన్ | అమం స్తాజయ్య మాత్మానం దేవాదీనాం మహామనాః. 16 అథ కాలేన కియతా శంతనుః కాల పర్యయాత్ | తత్యాజ దేహం దర్మాత్మా దేహీ జీర్ణ మివాంబరమ్. 17 కాలధర్మం గతే రాజ్ఞి భీష్మ శ్చక్రే విధానతః | ప్రేత కార్యాణి సర్వాణి దానాని వివిధాని చ. 18 చిత్రాంగదం తతో రాజ్యే స్థాపయామాస వీర్యవాన్ | స్వయం నకృతవా వ్రాజ్యం తస్మా ద్దేవవ్రతో%భవత్. 19 చిత్రాంగదస్తు వీర్యేణ ప్రమత్తః పరదుఃఖదః | బభూవ బలవా న్వీరః సత్యవ త్యాత్మబః శుచిః 20 అథైకదా మహాబాహు ః సైన్యేన మహతా వృతః | ప్రచచార వనోద్దేశా న్పశ్య న్వధ్యా న్మృగా న్రురూన్. 21 చిత్రాంగదస్తు గంధర్వో దృష్ట్వా దృష్ట్వా తం మార్గగం నృపమ్ | ఉత్తతా రాంతికం భూమే ర్విమాన వర మాస్థితః. 22 తత్రాభూచ్ఛ మహాయుద్ధం తయోః సదృశ వీర్యయోః | కురుక్షేత్రే మహాస్థానే త్రీణి వర్షాణి తాపసాః 23 ఇంద్రలోక మవాపాశు గంధర్వేణ మతో రణ | భీష్మః శ్రుత్వా చకారాశు తస్యౌ ర్ధ్వదైహికం తదా 24 గాంగేయః కృతశోకస్తు మంత్రిభిః పరివారితః | స్వపుత్రం రాజ్యగం దృష్ట్వా పుత్రశోక హతాపిచ. 25 మంత్రిభి ర్భోదితా పశ్చా ద్గురుభిశ్చ మహాత్మభిః | స్వపుత్రం రాజ్యగం దృష్ట్వా పుత్రశోక హతా%పి చ. 26 సత్యవ త్యతిసంతుష్టా బభూవ వరవర్ణినీ | వ్యాసో%పి భ్రాతరం శ్రుత్వా రాజానం ముదితో%భవత్. 27 ¸°వనం పరమం ప్రాప్తః సత్యవత్యాః సుతః శుభః చకార చింతాం భీష్మో%పి వివాహార్థం కనీయసః. 28 ఆ యిరువురిలో పెద్దవాడు చిత్రాంగదుడు. అతడు సర్వలక్షణలక్షితుడు-శత్రుతాపనుడు. రెండవవాడు విచిత్ర వీర్యుడు. అతడు సద్గుణోపేతుడు. తండ్రికి సుఖము చేకూర్చువాడు. వీరిరువురికంటె పూర్వమే శంతనునకు మహావీరుడు పరాక్రమవంతుడగు గాంగేయుదుద్భవించెను. ఆ శంతనునివలననే సత్యవతియందీ యిరువురు జన్మించిరి. శంతనుండు సర్వలక్షణలక్షితులగు తనయులను బడసి దేవతలకు సైతము తా నజేయుడని తలంచెను. కొంతకాలము గడచినంతనే చినిగిన వస్త్రమును విడుచునట్లు కాలపరిపాకమున శంతనుడు తన తనువును విడిచెను. భీష్ముడు శంతనునకు యథావిధిగ సకల ప్రేతకార్యములను దానధర్మముల నాచరించెను. దేవవ్రతుడని ప్రసిద్ధుడైన భీష్ముడు తాను రాజ్యము చేయక చిత్రాంగదునకు పట్టముగట్టెను. ఆ సత్యవతీ సుతుడగు పరంతపుడు శుచి మహావీర్యుడు చిత్రాంగదుడును ఒకనాడు సేనల వెంటబెట్టుకొని వధ్యరురు మృగాదులను జూచుచు నడవిలో దిరుగుచుండెను. అపుడు దివ్యవిమానముపై చిత్రాంగదుడను గంధర్వుడు వనమందు సంచరించు చిత్రాంగదునిగని యతని చెంత దిగెను. ఆ సమబలశాలురకప్పుడు ఘోర రణము సంఘటిల్లెను. వారికి కురుక్షేత్రమున మూడేండ్లపా టేకధాటిగ రణము సాగెను. అందు చిత్రాంగదరాజు చిత్రాంగద గంధర్వుని చేతిలో మడిసి వీరస్వర్గమలంకరించెను. అది వినిన భీష్ముడు వెంటనే యతనికై యుత్తర క్రియలు జరిపెను. చిత్రాంగదుని మృతికై శోకించు భీష్ముని మంత్రులూరడించిరి. పిదప విచిత్రవీర్యుడు రాజయ్యెను. తనయునికై విలపించు సత్యవతిని మంత్రులు గురువులు నోదార్చి శోకముడిపిరి. సత్యవతి యూరడిల్లెను. వ్యాసుడును తన సోదరుడు విచిత్రవీర్యుడు రాజయ్యెను గదాయని సంతసించెను. ¸°వనముననున్న విచిత్రవీర్యునకు వివాహము సేయ భీష్ముడు సంకల్పించెను. కాశిరాజసుతా స్తిస్రః సర్వలక్షణ సంయుతాః | తేన రాజ్ఞా వివాహార్థం స్థాపితాశ్చ స్వయంవరే. 29 రాజానో రాజపుత్రాశ్ఛ సమాహుతాః సహస్రశః | ఇచ్చా స్వయంవరార్థం వై పూజ్యమానాః సమాగతాః. 30 తత్ర భీష్మో మహాతేజా స్తాజహార బలేన వై | నిర్మథ్య రాజకం సర్వం రథే నై కేన వీర్యవాన్. 31 న జిత్వా పార్థివా న్సర్వాం స్తా శ్చాదాయ మహారథః | బాహువీర్యేణ తేజస్వీ హ్యాససాద గజాహ్వయమ్. 32 మాతృవ ద్భగినీవచ్చ పుత్రీవ చ్చింతయ న్కిల | తిస్ర ః సమానయామాస కన్యకా వామలోచనాః. 33 సత్యవత్యై నివేద్యాశు ద్విజా నాహూయ సత్వరః | దైవజ్ఞా న్వేదవిదుషః వర్యపృచ్ఛ చ్ఛుభం దినమ్. 34 కృత్వా వివాహసంభారం యదా వై భ్రాతరంనిజమ్ | విచిత్రవీర్యం ధర్మిష్ఠం వివాహయతి తా యదా. 35 తదా జ్యేష్ఠా%ప్యువా చేదం కన్యకా జాహ్నవీసుతమ్ | లజ్జమానా%సితాపాంగీ తిసృణాం చారులోచనా. 36 గంగపుత్ర కురుశ్రేష్ఠ దర్మజ్ఞ కులదీపక | మయా స్వయంవరే శాల్వో వృత్తో%స్తి మనసా నృపః. 37 వృతా%హం తేన రాజ్ఞావై చిత్తే ప్రేమ సమాకులే | యథా యోగ్యం కురుష్వాద్య కులస్యాస్య పరంతప. 38 తేనాహం వృతపూర్వా%స్మి త్వం చ ధర్మభృతాం వరః | బలవా నసి గాంగేయ యథేచ్ఛసి తథా కురు. 39 సర్వలక్షణశోభితలగు కాశీరాజ పుత్రికలు మువ్వురు గలరు. వారి తండ్రి వారి వివాహమునకై స్వయంవరము చాటించెను. వేలాదిమంది రాజులు రాజకుమారులు స్వయంవరమునకు పిలువబడి సత్కరింపబడిరి. అపుడు మహావీరుడు మహారథుడగు భీష్ముడరదమెక్కిచని యక్కడి రాజుల యుక్కడగించి తన తేజస్విత భుజబలము నల్గురిలో ప్రదర్శించి భూపతులకు తలవంపులు గల్గించి యారాకుమార్తెలను బలిమితో గొనివచ్చెను. ధీరుడగు భీష్ముడా వామలోచనలను సొంతతల్లిగ-అక్కగ-కూతురుగ భావించికొని వచ్చి సత్యవతికి వారి నప్పగించి వేదవిదులు దైవజ్ఞులునగు ద్విజులనురావించి వివాహ శుభలగ్నము వారినడిగి తెలిసికొని తన సోదరుడు విచిత్రవీర్యునకు పెండ్లి చేయుటకు వివాహమంగళ ప్రయత్నములు జరుపుచుండెను. అంతలో నా కన్నెలలో బెద్దది గంగా తనయున కిట్లు పలికెను: 'ఓ కురుశ్రేష్ఠా ! నేనింతకు మునుపే సాల్వరాజును మనసార వరించితిని. ఆ భూపతియు నాపై నరురక్తుడైయుండెను. నేను ముందే యితరులచేత మనసార వరింపబడినదానను. నీవు బలశాలివి. కనుక నీవు నీ మదికి తోచినట్లు చేయుము. సూతః : ఏవ ముక్త స్తయాతత్ర కన్యయా కురునందనః | అపృచ్ఛ ద్బాహ్మ్రణాస్వృద్ధాన్మాతరంసచివాంస్తథా. 40 సర్వేషాం మత మాజ్జాయ గాంగేయో ధర్మవిత్తమః | గచ్ఛేతి కన్యకాం ప్రాహ యథారుచి వరాననే. 41 విసర్జితా%థ సా తేన గతా శాల్వనికేతనమ్ | ఉవాచ తం వరారోహా రాజానం మనసేప్సితమ్. 42 వినిర్ముక్తా%స్మి భీష్మేన త్వన్మనస్కేతి ధర్మతః | ఆగతా%స్మి మహారాజ గృహాణద్య కరం మమ. 43 ధర్మపత్నీ తవా త్యంతం భవామి నృపసత్తమ | చింతితో%సి మయా పూర్వం త్వయా%హం నాత్ర సంశయః. 44 శాల్వః : గృహీతా త్వం వరారోహే భీష్మేణ వశ్యతో మమ | రథే సంస్థాపితా తేనే నగ్రహీష్యే కరం తవ. 45 పరోచ్ఛిష్టాం చ కఃకన్యాం గృహ్ణాతి మతిమా న్యతః | అతో%హం న గ్రహీష్యామి త్యక్తాం భీష్మేణ మాతృవత్. 46 సూతుడిట్లనియె: ఇట్లా కన్యపలుకగ భీష్ముడామె విషయమును తన తల్లి మంత్రి పురోహితుల ముందుంచి వారితో సంప్రతించి గాంగేయుడా కన్నియతో నీ యిష్టమున్నచోటికేగుమని చెప్పెను. అంత నా మగువ సాల్వుని సరసకు జని యతనితో నిట్లు పలుకసాగెను: ఓ నరపతీ! నేను నీపై ననురక్తనని ఎ రిగి భీష్ముడు నన్ను విడిచిపుచ్చెను. నిన్ను చేరిన నన్ను చేపట్టుము. ఓ నృపసత్తమా! నీకు నే నత్యంతము ధర్మపత్నిని. నీవును మునుపు నన్నట్లే తలచితివి. సాల్వుడిట్లు పలికెను: ఓ వరారోహా! ఆనాడు భీష్ముడు నా కన్నలుముందే నిన్ను పట్టుకొని రథముపై కూర్చుండ బెట్టుకొనెను. కాన నింక నేను నిన్ను చేపట్టుట కల్ల. పరోచ్ఛిష్టయగు కన్య నే మతిమతుండు చేరపట్టును? భీష్ముడు వదలిన నిన్ను తల్లిగదలంచి నేను నీ కేలు పట్టను. రుదతీ విలపంతీ సా త్యక్తా తేన మహాత్మనా | పున ర్భీష్మం సమాగత్య రుదతీ చేద మబ్రవీత్. 47 శాల్వో ముక్తాం త్వయా వీర నగృహ్ణాతి గృహాణ మామ్ | ధర్మజ్ఞో%సి మహాభాగ మరిష్యా మ్యన్యథా హ్యహమ్. 48 భీష్మః : అన్యచిత్తాం కథం త్వాంవై గృహ్ణామి వరవర్ణిని | పితరం స్వం వరారోహే వ్రజ శీఘ్రం నిరాకులా. 49 తథోక్తా సా తు భీష్మేణ జగామ వనమేవ హి | తప శ్చకార విజనే తీర్థే పరమపావనే. 50 ద్వే భార్యే చాతిరూపాఢ్యే తస్యరాజ్ఞో బభూవతుః | అంబాలికా చాంబికా చ కాశిరాజసుతే శుభే. 51 రాజా విచిత్రవీర్యో%సౌ తాభ్యాం సహ మహాబలః | రేమే నానావిహారైశ్చ గృహే చోపవనే తథా. 52 వర్షాణి నవ రాజేంద్రః కుర్వ న్క్రీడాం మనోరమామ్ | ప్రాపాసౌ మరణం భూయో గృహీతో రాజయక్ష్మణా. 53 మృతే పుత్రే% తి దుఃఖార్తా జాతా సత్యవతీ తదా | కారయామాస పుత్యస్య ప్రేతకార్యాణి మంత్రిభిః. 54 భీష్మ మాహ తదైకాంతే వచనం చాతిదుఃఖితా | రాజ్యం కురు మహాభాగ | పితు స్తే శంతనోః సుతః. 55 భ్రాతుర్భార్యం గృహాణ త్వం వంశం చ పరిరక్షయ | యథా న నాశ మాయాతి యయాతే ర్వంశ ఇత్యుత. 56 భీష్మః : ప్రతిజ్ఞా మే శ్రుతా మాతః పిత్రర్థే యామయాకృతా | నాహంరాజ్యంకరిష్యామినచాహందారసంగ్రహమ్. 57 సూతః : తదా చింతాతురా జాతా కథం వంశో భ##వే దితి | నాలసాద్ధి సుఖం మహ్యం సముత్పన్నే హ్యరాజకే. 58 గాంగేయ స్తా మూవాచేదం మా చింతాం కురు భామిని | పుత్రం విచిత్రవీర్యస్య క్షేత్రజం చోపపాదయ. 59 కులీనం ద్విజ మాహుయ వధ్వా సహ నియోజయ | నాత్ర దోషో%స్తి వేదే%పి కులరక్షావిధౌ కిల. 60 పౌత్రం చైవం సముత్పాద్య రాజ్యం దేహి శుచిస్మితే | అహం చ పాలయిష్యామి తస్య శాసన మేవ హి. 61 అపుడా కన్నియ సాల్వునిచేత వదలబడి కన్నీరుమున్నీరుగ నేడ్చుచు మరల భీష్ముని జేరవచ్చి యతని కిట్లు పలికెను : 'నేను నీచేత వదలబడితిని. కనుక సాల్వుడును మరల నన్ను చేపట్టుటలేదు. నీవు గొప్ప ధర్మవిదుడవు. నన్ను నీవే స్వీకరింపుము. లేనిచో నీముందు ప్రాణములు తీసికొందును.' భీష్ముడిట్లనియె : 'ఓ వరవర్ణినీ ! నీ మది వేరొకనియందు దగుల్కొనియున్నది. నిన్నెట్లు గ్రహింతును? నీవు నీ పుట్టింటి కేగుము.' భీష్ముడా మాట యనగనే యామె వనములకేగి పవిత్రతీర్థములం దొంటరిగ తపమొనర్ప దొడగెను. మిగిలిన కాశిరాజసుతలు రూపవతులు - అంబ అంబాలిక యనబడు వారలు ఇరువురు విచిత్రవీర్యుని భార్యలైరి. ఆ మహాబలుడగు విచిత్రవీర్యుడు వారిని గూడి సెజ్జలందు పూసెజ్జలందు తమకమున తొమ్మిదేండ్లు క్రీడించుచు విమరించుచుండి రాజయక్ష్మరోగముతో కాలధర్మ మందెను. తన కొడుకు మరణించగ సత్యవతి దుఃఖముతో ఆతనికి మంత్రులచే నంత్యక్రియలు జరిపించినది. ఆమె యొకనాడు విలపించుచు భీష్మునితో నొంటరిగ నిట్లనియెనుః 'ఓ మహాభాగా! నీవును శంతనుని సుతుడవే గద! కనుక రాజ్యభారము వహించుము. నీ తమ్మునిభార్యలను చేపట్టి వంశము నిలువబెట్టుము. ఆ యయాతి వంశమడుగంటకుండునట్టు లొనరింపుము.' భీష్ముడిట్లనియె: 'తల్లీ! మా తండ్రితో నేను మునుపొనరించిన ప్రతిన నీవు విన్నదే గదా! నేను రాజ్యము చేయను. పెండ్లి చేసికొనను.' సూతుడిట్లనియె: ఆ మాటలకు సత్యవతి 'ఈ వంశమిక నిలబడుటెట్లొకో? ఆలసించిన దేశములో నరాజకము ప్రబలును. అపుడు నా మది కింక శాంతియే యుండదు.' అని యామె చింతాకులితయై వగచినది. అపుడు గాంగేయు డామెతో నిట్లు పలికెనుః ' ఓయమ్మా, చింతిల్లకుము. విచిత్రవీర్యునకు క్షేత్రజపుత్త్రుడు గల్గు నట్లొనరింపుము. ఒక కులీనుడగు నుత్తమబ్రాహ్మణుని రావించి నీ కోడండ్ర నతనితో గలుపుము. ఇందు దోషము లేదు. ఇట్లు వంశము నిలువబెట్టుకొనవచ్చునని నిగమములు వాక్రుచ్చినవి. అపుడు నీ మనుమని రాజుగజేసి నేనతని శాసనమున రాజ్యము చక్కబెట్టుదును.' తుచ్ఛ్రుత్వా వచనం తస్య కానీనం స్వసుతం మునిమ్ | జగామ మనసా వ్యాసం ద్వైపాయన మకల్మషమ్. 62 స్మృతమాత్ర స్తతో వ్యాస ఆజగామ స తాపసః | కృత్వా ప్రణామం మాత్రే%థ సంస్థితో దీప్తిమా న్మునిః. 63 భీష్మేణ పూజితః కామం సత్యవత్యా చ మానితః | తస్థౌ తత్ర మహాతేజా విదూమో%గ్ని రివాపరః. 64 త మువాచ మునిం మాతా పుత్ర ముత్పాద యాధునా | క్షేత్రే విచిత్రవీర్యస్య సుందరం తవ వీర్యజమ్ 65 వ్యాసః శ్రుత్వా వచో మాతు రాప్త వాక్య మమన్యత | ఓ మిత్యుక్త్వా స్థిత స్తత్ర ఋతుకాల మచింతయత్. 66 అంబికా చ యదా స్నాతా నారీ ఋతుమతీ తదా | సంగం ప్రాప్య మునేః పుత్త్ర మసూతాం ధం మహాబలమ్. 67 జన్మాం ధం చ సుతం వీక్ష్య దుఃఖితా సత్యవ త్యపి | ద్వితీయాం చ వధూ మహ పుత్ర ముత్పాద యాశువై. 68 ఋతుకాలే%థ సంప్రాప్తే వ్యాసేన సహ సంగతా | తథా చాంబాలికా రాత్రౌ గర్భం నారీ దధార సా. 69 సో%పి పాండుః సుతో జాతో రాజ్యయోగ్యో న సమ్మతః | పుత్రార్థే ప్రేరయామాన వర్షాంతే చ పున ర్వధూమ్. 70 ఆహుయ చ తతో వ్యాసం సంప్రార్థ్య మునిసత్తమమ్ | ప్రేషయామాస రాత్రౌ సా శయనాగార ముత్తమమ్. 71 న గతా చ వధూ స్తత్ర; ప్రేష్యా సంప్రేషితా తయా | తస్యాం చ విదురో జాతో దాస్యాం ధర్మాంశతః శుభః. 72 ఏవం వ్యాసేన తేపుత్రా ధృతరాష్ట్రాదయ స్త్రయః | ఉత్పాదితా మహావీరా వంశరక్షణ హేతవే. 73 ఏతద్వః సర్వ మాఖ్యాతం తస్య వంశసముద్భనమ్ | వ్యాసేన రక్షితో వంశో భ్రాతృ ధర్మవి దా%నఘాః. 74 (వేదా ష్టేందు క్షితిమితైః సార్ధెః శ్లోకైసవిస్తరమ్ | దేవీభాగవత స్యాస్య ప్రథమ స్కంధ ఈరితః). 75 ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ%ష్టాదశసాహస్య్రాం సంహితాయాం ప్రథమస్కంధే వింశో%ధ్యాయః. భీష్ముని మాటలు విని యామె తన కానీననందనుడు కలుషరహితుడునగు వ్యాసుని నెమ్మదిలో దలంచినది. తన తల్లి తలచినంతలోనే వ్యాసతాపసు డేతెంచి యామెకు చేయెత్తి మ్రొక్కి యామె చెంత బ్రహ్మజ్యోతులు విరజిమ్మ నిలుచుండెను. వ్యాసుడపుడు భీష్మునిచేత బూజితుడై సత్యవతిచేత మర్యాదలందుకొని పొగలేని యగ్నిజ్వాల పగిది వెలుగుచుండెను. సత్యవతి వ్యాసునితో 'నీ మహావీర్యమువలన విచిత్రవీర్యుని భార్యలందు చక్కని కుమారుల నుత్పన్నుల చేయు' మని చెప్పెను. వ్యాసుడు తన తల్లిమాట మేరమీర కామె మాట నాప్తవాక్యముగనెంచి యట్లయగుత మని పలికి ఋతుకాలమున కెదురు చూచుచుండెను. అంత నొకనా డంబిక ఋతుస్నాతయై మునివరుని పొందిక కేగినది. కాని కన్నులు మూసికొని మునివరునితో సంగమమందెను. ఫలితముగ గ్రుడ్డివాడు జన్మించెను. పుట్టుగ్రుడ్డియగు కుమారుడు పుట్టుటవలన సత్యవతి మిగులు దుఃఖించెను. అపుడామె తన రెండవ కోడలినిగూడ వ్యాసునివలన పుత్రుని బడయుమని ప్రేరించినది. అంతనొకనాడంబాలికయును ఋతుస్నానయై వ్యాసమునిని గూడెను. ఫలితముగ నామెయదే రేయి గర్భము దాల్చెను. ఆ యంబాలికకు పుట్టిన బాలుడు పాండువర్ణమున నుండెను. అతడేలుబడికి తగడు. కనుక సత్యవతి తన కోడలి నొకయేడాది తరువాత మరల నొక పుత్త్రుని గనుమని ప్రోత్సహించినది. సత్యవతి మరల వ్యాసముని నాహ్వానించినది. సత్యవతిచేత పంపబడిన వధువు వ్యాసుని మహోజ్జ్వలతేజముముందు నిలువద్రొక్కుకొని యుండలేక తన దాసిని గదిలో కంపినది. ఆమె వ్యాసుని పొందిన పొందికకు ఫలితముగ నొక కొడుకును గనెను. అతడే విదురుడు. ఈ ప్రకారముగ వ్యాసుని యనుగ్రహమున ధృతరాష్ట్రాదులు మువ్వురు కురువంశము నిలువబెట్ట జన్మించిరి. సోదరధర్మము దెలిసిన శ్రీ వ్యాసమహర్షి వలన నీ విధముగ కురువంశము నిలువబెట్టబడినది. ఓ యనుఘులారా! మీకీ ప్రకారముగ శ్రీవ్యాసుని వంశోత్పత్తి చరిత్ర సంపూర్ణముగ నభివర్ణింపబడినది. ఇది శ్రీదేవీ భాగవతమందలి ప్రథమ స్కంధ మందలి ఇరువదవ యధ్యాయము పదునొకండు వందల యెనుబదినాల్గు శ్లోకములుగల దేవీభాగవత ప్రథమస్కంధము సమాప్తము.