Sri Devi Bhagavatam-1
Chapters
అథ ద్వితీయో%ధ్యాయః సూతః : ఏకదా తీర్థయాత్రాయాం వ్రజ న్పారాశరో మునిః | ఆజగామ మహాతేజాః కాళింద్యా స్తటముత్తమమ్
1 నిషాద మాహ ధర్మాత్మా కుర్వంతం భోజనం తదా | ప్రాపయస్వ పరం పారం కాళింద్యా ఉడుపేన మామ్.
2 దాశః శ్రుత్వా మునే ర్వాక్యం కుర్వాణో భోజనం తటే | ఉవాచ తాం సుతాంబాలాంమత్స్యగంధాం మనోరమామ్
3 ఉడుపేన మునిం బాలే పరం పారం నయస్వ హ | గంతుకామో%స్తి ధర్మాత్మా తాపసో%యం శుచిస్మితే. 4 ఇత్యుక్తా సా తదా పిత్రా మత్స్యగంధా%థ వాసవీ | ఉడుపే ముని మాసీనం సంవాహయతి భామినీ. 5 వ్రజ న్సూర్యసుతాతోయే భావిత్వా ద్దైవయోగతః | కామార్తస్తు ముని ర్జాతో దృష్ట్వా తాం చారురోచనామ్. 6 గ్రహీతుకామః స ముని ర్దృష్ట్వా వ్యంజిత ¸°వనామ్ | దక్షిణన కరేణౖనా మనస్పృశ ద్దక్షిణ కరే. 7 త మువా చాసితాపాంగీ స్మితపూర్వ మిదం వచః | కులస్య సదృశ్యం వః కిం శ్రుతస్య తపసశ్చ కిమ్. 8 త్వం వై వసిష్ఠదాయాదః కులశీలసమన్వితః | కిం చికీర్షసి ధర్మజ్ఞ మన్మథేన ప్రపీడితః. 9 దుర్లభం మానుషం జన్మ భువి బ్రాహ్మణసత్తమ | తత్రాపి దుర్లభం మన్యే బ్రాహ్మణత్వం విశేషతః. 10 కులేన శీలేన తథా శ్రుతేన ద్విజోత్తమ స్త్వం కిల ధర్మవిచ్చ | అనార్యభావం కథ మాగతో%సి విప్రేంద్ర మాం వీక్ష్య చ మీనగంథామ్ 11 మదీయే శరీరే ద్విజామోఘబుద్ధే శుభం కిం సమాలోక్య పాణిం గ్రహీతుమ్! సమీపం సమాయాసి కామాతుర స్త్వం కథ నాభిజానాసి ధర్మం స్వకీయమ్. 12 అహో మందబుద్ధి ర్ద్విజో%యం గ్రహీష్యన్ జలే మధ్య ఏవాద్య మాం వై; గృహీత్వా| మనో వ్యాకులం పంచబాణాతివిద్ధం న కో %పీహ శక్తః ప్రతీపం హి కర్తుమ్. 13 ఇతి సంచింత్య సా బాలా త మువాచ మహామునిమ్ | ధైర్యం కురు మహాభాగ పరం పారం నయామి వై. 14 రెండవ అధ్యాయము శ్రీ వ్యాసమహర్షి జన్మవృత్తాంతము పూర్వ మొకప్పుడు మహాతేజుడగు పరాశర మహాముని సర్వతీర్థ యాత్రలు సంసేవించుచు యమునా తీరమున కేతెంచెను. అచటనొక నిషాదుడు భోజనము చేయుచుండెను. ముని తయనిని గని నన్ను నీ పడవలో నదియావలి గట్టునకు జేర్చుమనెను. నదీతీరమందు భుజించు నిషాదు డా ముని మాటలు విని తన కూతురగు మత్స్యగంధతో ఈ ముని తపోవీర్యుడు కడుంగడు ధర్మశీలి. ఇత డీ నది దాటగోరుచున్నాడు. వేగమే నీవితనినీ తెప్పపై నెక్కించుకొని యవ్వలి దరికి జేర్చుము అని పలికెను. వాసవి (ఉపరిచర వసు రాజపుత్రి) యగు మత్స్యగంధ తన తండ్రి మాట ననుసరించి ముని ప్రవరుని తన పడవలోని కెక్కించుకొని ముందునకు సాగుచుండెను. దైవయోగమున పరాశరముని ఆ చారులోచనను చూచి కామార్తుడై యామెను చేపట్టదలచి తన దక్షిణ హస్తముతో నా కోమలి కైదమ్మి పట్టుకొనెను. అప్పుడా ముదిత వలపుల నవ్వొలయ సిగ్గుల నిగ్గులు పెదవులపై చిందులాడుఓ మునిప్రవరా! నన్ను చేపట్టుట నీకు నీ కొలమునకు నీ తపమునకు నీ శాస్త్రమునకు దగునే! నీవు పవిత్ర వశిష్ఠ వంశజుడవే! కులశీల సంపన్నుడవే! ధర్మజ్ఞుడవే! అట్టి నీవే కామావిష్టుడవగుట తగునా? ఈ లోకమందు మనుజ జన్మము కడు దుర్లభము. అందును బ్రాహ్మణుడై పుట్టుట మిక్కిలి దుర్లభమని తలంతును. ఓ బ్రాహ్మణా! కులము శీలము శాస్త్రము బట్టి చూడగ నీవు ఉత్తముడవు; ధర్మవిదుడవు. అట్టి నీవెక్కడ? ఈ చేపల కంపుదానను నేనెక్కడ? నన్ను తొలిసారిగ జూచినంతలోన నీకీయనార్య భావమెట్లు గలిగెను? ఈ నా మేనిలోనే శుభమును చవిచూడదలచి నన్నే మనసార చేపట్టదలచితివి? ఆహా! అంతేకాదు. నీవిపుడు కామాతురుడవై నా సమీపమునకే వచ్చుచున్నావు. నీ స్వధర్మము మఱచినావు. ఈ పవిత్రుడగు బ్రాహ్మణుడేమి! ఈతని యీ మందబుద్ధియేమి! ఈ నీటి నడుమనే ఇతడు నన్ను పట్టుచున్నాడు. కామాతురుడగు ఈతని మనస్సును వారించు వారెవ్వరును నిచట లేరు'' అని పలుకుచు ఆమె, అయ్యా! ఇంకను కొంచె మింద్రియములను కట్టివేయుము. నిన్నాదరికి జేర్చనిమ్ము అని మహా మునితో తీయగ పలికెను. సూతః: పరాశరస్తు తచ్ఛ్రుత్వా వచనం హితపూర్వకమ్ | కరం త్యక్త్వా స్థిత స్తత్ర సింధొః పారం గతః పునః మత్స్యగంధాం ప్రజగ్రాహ మునిః కామాతుర స్తదా | వేపమానా తు సా కన్యా త మువాచ పురః స్థితమ్. 16 దుర్గంధా%హం మునిశ్రేష్ఠ కథం త్వం నోపశంకసే | సమాన రూపయోః కామసంయోగస్తు సుఖావహః 17 ఇత్యుక్తేన తు సా కన్యా క్షణమాత్రేణ భామినీ| కృతా యోజనగంధా తు సురూపా చ వరాననా. 18 మృగనాభిసుగంధాం తాం కాంతాం జనమనోహరామ్ | జగ్రాహ దక్షిణ పాణౌ ముని ర్మన్మథపీడితః 19 గ్రహీతుకామం తం ప్రాహ నామ్నా సత్యవతీ శుభా| మునే! పశ్యతి లోకో%యం పితా చైవ తటస్థితః 20 పశుధర్మో న మే ప్రీతిం జనయ త్యతిదారుణః ప్రతీక్షస్వ మునిశ్రేష్ఠ యావ ద్భవతి యామినీ. 21 రాత్రౌ వ్యవాయ ఉద్దిష్టో దివా న మనుజస్య హి| దివాసంగే మహా న్దోషః పశ్యంతి కిల మానవాః. 22 కామం యచ్చ మహాబుద్దే లోకనిందా దురాసదా| తచ్ఛ్రుత్వా వచనం తస్యా యుక్త ముక్త ముదారధీః 23 సూతుడిట్లనియెను: మదికింపైన ఆమె పలుకు లాలకించి మునిపుంగవు డా పట్టిన పట్టు కొంచెము సడలించెను. నది నెట్టులో దాటెను. వెంటనే ముని వరుడు మన్మథ భావనల కోపలేక మత్స్యగంధను మరల తన బాహు మూలములలో జిక్కించుకొనెను. ఆమె వణకుచు ముని కిట్టుల పలికెను. ఓ మునినాథా! నానుండి వెడలు దుర్గంధము నీకు రోత పుట్టించుట లేదా? జంటపడుచుల కూడిక సమమైన వయో రూపవంతులలో సరిగ జరిగిననే సంతృప్తికరముగ నుండును అని యా లేమ పల్కుటయే తడవుగా ముని యనుగ్రహమున నామె యోజనగంధగ ముద్దరాలుగ నందగత్తియగ మారి మరులూరించు ననురాగవతిగ మారెను. ఆమెను వెంటనే కస్తూరి పరిమళాలు విరజిమ్మెడి మేని క్రొత్తదనమున నిగ్గులు దేర్చి ముని తన దక్షిణ హస్తముతో నామె కడిచేయి పట్టుకొనెను. అపుడామె మునికిట్లు పలికెను. ముని వల్లభా! మన ఈ స్థితిని లోకము చూచును. తీరమందున్న నా తండ్రియు గాంచును. పశు ధర్మము దారుణమైనది. నాకది ప్రీతి గొల్పదు. కనుక మసక చీకటి పడుదనుక మదిని కొంచెము చిక్కబట్టుకొనుము. ఈ కలయిక నరులకు రేలగాని పగలు గూడదు గదా? దివా మైథున మతి దోషమని పెద్దలు దలంతురు. దీని వలన లోకము మనలను వ్రేలెత్తి చూపును' అను యుక్తియుక్తములైన యామె హిత వచనము లుదారుడగు మహాముని చెవులార వినెను. నీహారం కల్పయామాస శీఘ్రం పుణ్యబలేన వై| నీహారే చ సముత్పన్నే తటే%తితమసా యుతే. 24 కామినీ తం మునిం ప్రాహ మృదుపూర్వ మిదం వచః | కన్యా%హం ద్విజశార్దూల భుక్త్వా గంతా%థ కామతః 25 అమోఘవీర్య స్త్వం బ్రహ్మ న్కా గతి ర్మే భ##వే దితి| పితరం కిం బ్రవీమ్యద్య సగర్భా చేద్భవా మ్యహమ్. 26 త్వం గమిష్యసి భుక్త్వామాం కింకరోమి వదస్వతత్| పరాశరః కాంతే%ద్యమత్ప్రియంకృత్వాకన్యైవత్వంభవిష్యసి. 27 వృణీష్వ చ వరం భీరు యం త్వ మిచ్ఛసి భామిని| సత్యవతీః యథామేపితరౌ లోకేన జానీతోహిమానద. 28 కన్యావ్రతం న మే హన్యా త్తథా కురు ద్విజోత్తమ| పుత్రశ్చ త్వత్సమః కామం భ##వే దద్భుతవీర్యవాన్. 29 గంధో2యం సర్వదా మే స్యాద్యౌవనంచనవంనవమ్| పరాశరః శృణుసుందరిపుత్ర స్తేవిష్ణ్వంశసంభవః శుచిః 30 భవిష్యతి చ విఖ్యాత సై#్త్రలోక్యే వరవర్ణిని| కేనచి త్కారణ నాహం జాతః కామాతుర స్త్వయి 31 కదా%పి చ న సమ్మోహో భూతపూర్వో వరాననే| దృష్ట్వా చాప్సరసాం రూపంసదా%హం ధైర్యమావహమ్. 32 దైవయోగేన వీక్ష్యత్వాం కామస్య వశగో%భవమ్| త త్కించిత్కారణం విద్ధి దైవం హి దురతి కమమ్. 33 దృష్ట్వా2హం చాతి దుర్గంధాం త్వాం కథం మోహ మాప్నుయామ్ | పురాణకర్తా పుత్రతస్తే వరాననే. 34 వేదవి ద్భాగకర్తా చ ఖ్యాతశ్చ భువనత్రయే| సూతః ఇత్యుక్త్వాం తాం వశం యాతాం భుక్త్వా సమ మునిసత్తమః 35 జగామ తరసా స్నాత్వా కాళిందీసలిలే మునిః సా%పి సత్యవతీ జాతా సద్యోగర్భవతీ సతీ. 36 అంత సమర్థుడగు మునీంద్రుడు తన పుణ్య ప్రభావమున వేగిరమే మంచుగల్పించెను. ఆ తటమంతయు పొగ మంచు నిండెను. ఆ మంచుపొగ పెంజీకటులో యన దట్టమయ్యెను. పిమ్మట నామె మృదువుగ నిట్లనియెను: ''ఓ మునివర్యా! నేను కన్నియను. నీ యిచ్చ మెచ్చునట్లు నన్ననుభవించి నీవు వెళ్ళుదువు. నీవు అమోఘవీర్యవంతుడవు. నేను గర్భవతినైనచో నాకింకేది దిక్కు? నా తండ్రి కేమని చెప్పుకొందును? నా గతి యేమి గావలయును?' పరాశరుడిట్లనియెను. ఓ కాంతా! నీవు నా మనసులోని కోర్కి తనివార తీర్చినను నీవు కన్నియగనే యుందువు. కనుక నేదేని కోరుకొనుము. వరమిత్తును. సత్యవతి యిట్లనియెను: లోకముగాని నా తల్లిదండ్రులుగాని యెఱుగని విధముగ నీ కార్యము చక్కబెట్టుము. కన్నెఱికము చెడకుండునట్లుగ ననుగ్రహించుము. నీవద్భుత వీర్యుడవు. నీవంటి పుత్రుడు నాకు గలుగు నట్లనుగ్రహించుము. నామేనెల్లవేళల సుగంధము విరజిమ్ముచుండవలయును. నేను నిత్య¸°వనమున నుండవలయును. పరాశరుడిట్లనియెను. ఓ సుందరీ! నీకు పరమపవిత్రుడు విష్ణ్వంశ సంభూతుడునగు సుపుత్రుడు జన్మించనున్నాడు. అతడు ముజ్జగములందును ప్రసిద్ధిగాంచును. ఏదో తెలియని దైవకారణమున నీయందు నా మనసు సంలగ్నమైనది. ఇంతకు మున్ను నేనెన్నడును మోహమున మునిగి యెఱుగను. అచ్చరల మెఱుగుమెచ్చులు గాంచియును వారిని నే నేనాడు కన్నెత్తియైనను జూడలేదు. ఇపుడు దైవయోగమున నిన్ను గన్నంతనే కామవశుడనైతిని. దీని కేదో తెలియని కారణమున్నదని నమ్ముము. దైవము మాత్రము దాటరానిది. అతి దుర్గంధవతివగు నిన్నుగని నేనేల వలచితి నందువేమో; వినుము. ఈ శుభముహూర్తమందే మహాపురాణకర్తయగు పుత్త్రుడు నీకు జన్మించగలడు, ఆ మహాత్ముడు వేదములు విభజించును. ముల్లోకములందు వన్నె వాసి గాంచును.' సూతుడిట్లనియె: ఈ విధముగ తనకు వశ##మైన యామెను యనుభవించి యమునాజలములందు అతి శీఘ్రముగ విడిచిపోయెను. ఆ సత్యవతి యదే మూర్తమున గర్భవతి యయ్యెను. సుషువే యమునాద్వీపే పుత్రం కామ మి వాపరమ్| జాతమాత్రస్తు తేజస్వీ తా మువాచ స్వమాతరమ్. 37 తపస్యేవ మనః కృత్వా వివిశే చాతివీర్యవాన్| గచ్చ మాత ర్యథాకామం గచ్ఛామ్యహ మతః పరమ్ 38 తపః కర్తుం మహాభాగే దర్శయిష్యామి వై స్మృతః | మాత ర్యదా భ##వే త్కార్యం తవ కించి దనుత్తమమ్. 39 స్మర్తవ్యో2హం తదా శీఘ్ర మాగమిష్యామి భామిని| స్వస్తి తే%స్తు గమిష్యామి త్యక్త్వా చింతాం సుఖం వస 40 ఇత్యుక్త్వా నిర్య¸° వ్యాసః సా%పి పిత్రంతికం గతా| ద్వీపే న్యస్త స్తయా బాల స్తస్మాద్ద్వైపాయనో%భవత్ 41 జాతమాత్రో జగామాశు వృద్ధిం విష్ణ్వంశయోగతః| తీర్థే తీర్థే కృతస్నాన శ్చకార తప ఉత్తమమ్. 42 ఏవం ద్వైపాయనో జజ్ఞే సత్యవత్యాం పరాశరాత్| చకార వేదశాఖాశ్చ ప్రాప్తం జ్ఞాత్వా కలే ర్యుగమ్. 43 వేద విస్తారకరణా ద్వ్యాసనామా%భవ న్మునిః| పురాణసంహితా శ్చక్రే మహాభారత ముత్తమమ్. 44 శిష్యా నధ్యాపయామాస వేదా న్కృత్వా విభాగశః | సుమంతుం జైమినిం పైలం వైశంపాయన మేవచ? 45 అసితం దేవలం చైవ శుకం చైవ స్వ మాత్మజమ్| సూతః ఏతచ్చ కథితం సర్వం కారణం మునిసత్తమాః 46 యమునా తీరమున రెండవ మన్మథునివలె వెలుగొందుచున్న సద్యోజాతుడగు పుత్రుని గనెను. ఆ పుట్టిన మహా తేజస్వి తన తల్లితో నిట్లు పలికెను. నా మనస్సు తపము చేయుటకే నిశ్చితమై యున్నది. తల్లీ! నీ యిష్టమున్నచోటికి నీ వేగుము. నేను తపమాచరింప నరుగుదును. నావలన నీకేదేని పని యున్నచో నన్ను స్మరించుము. శీఘ్రమేవచ్చి నిన్ను సందర్శింతును. నీవు దిగులు మాని సుఖముండుము.' అని వ్యాసుడు తపమున కేగెను. ఆమెయు తన తండ్రికడ కరిగెను. ఆమె తన పుత్త్రునొక దీవిపై నుంచినందున నతినికి ద్వైపాయనుడను పేరు వచ్చెను. అతడు విష్ణ్వంశ సంజాతుడగుట వలన పుట్టిననాటినుండి దినదిన ప్రవర్ధమానుడయ్యెను. అతడు ప్రతి తీర్థమందు గ్రుంకుచు తపమొనరించుచుండెను. ఈ విధముగ పరాశరమహర్షి వలన సత్యవతికి ద్వైపాయను డుద్భవిల్లెను. అతడు కలియుగము రాగానే వేద విభజన మొనరించి వేదవ్యాసుడని వాసికెక్కెను. శ్రీ మహాభారతేతిహాసమును పురాణ సంహితలును ప్రవచించెను. అతడా వేద విభాగములను తన ముఖ్యశిష్యులగు సుమంతుడు జైమిని పైలుడు వైశంపాయనుడు అసితుడు దేవలుడు శుకుడు మున్నగువారలచే అధ్యయనము చేయించెను. సూతుడిట్లనియెను : ఈ విధముగ మీకన్నియు సకారణముగ దెలిపితిని. సత్యవత్యాః సుతస్యాపి సముతృత్తి స్తథా శుభా| సంశయో%త్ర న కర్తవ్యః సంభ##వే మునిసత్తమాః. 47 మహతాం చరితే చైవ గుణా గ్రాహ్యా మునే రితి| కారణాచ్చ సముత్పత్తిః సత్యవత్యా ఝషోదరే. 48 పరాశ##రేణ సంయోగః పునః శంతనునా తథా| అన్యథాతు మునే శ్చిత్తం కథం కామాకులం భ##వేత్. 49 అనార్యజుష్టం ధర్మజ్ఞః కృతవా న్స కథం మునిః| సకారణయ ముత్పత్తిః కథితా%%శ్చర్యకారిణీ. 50 శ్రుత్వా పాపాశ్చ నిర్ముక్తో నరో భవతి సర్వథా| య ఏత చ్ఛుభ మాఖ్యానం శృణోతి శ్రుతిమా న్నరః. 51 న దుర్గతి మావాప్నోతి సుఖీ భవతి సర్వదా. 52 ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ ద్వితీయస్కంధే ద్వితీయో%ధ్యాయః ఇది సత్యవతీ తనయుడగు శ్రీవ్యాసుని జన్మవృత్తాంతము. ఇటులు మహాత్ముల చరిత్రల కారణములు సుగుణములు గ్రహింపదగినవి. దైవకారణము వలన చేప కడుపునుండి సత్యవతి జన్మించినది. తొలుతనే సత్యవతికి పరాశరమునితో సంయోగము సంభవించెను. ఆ పిదపనే యామెను శంతనుడు పరిగ్రహించెను. కనుకనే పరాశరుని మది యామెయందు మొట్టమొదటనే లగ్నమైనది. ఆ ధర్మాత్ముడగు పరాశరు డార్యులకు దగని పని యేల యొనర్చును? కనుక నీయాఖ్యానక మాశ్చర్యకరము సకారణమునైనది. పుణ్యప్రదమైన యీ శుభాఖ్యానకము విన్న మతిమంతుడు పాపరహితుడగును. అతడు దుర్గతి జెందక నిత్యసౌఖ్యములందును. ఇది శ్రీదేవీ భాగవతమందలి ద్వితీయస్కంధమందలి ద్వితీయాధ్యాయము.