Sri Devi Bhagavatam-1
Chapters
అథ తృతీయో%ధ్యాయః ఋషయఊచుః: ఉత్పత్తి స్తు త్వయా ప్రోక్తా వ్యాసస్యామితతేజసః| సత్యవత్యాస్తథా సూతవిస్తరేణత్వయా%నఘ.
1 తథా%ప్యేకస్తు సందేహ శ్చిత్తే%స్మాకం సుసంస్థితః| న వివర్తతి ధర్మజ్ఞ! కథితేన త్వయా%నఘు.
2 మాతా వ్యాసస్య యా ప్రోక్తా నామ్నా సత్యవతీ శుభా! సా కథం నృపతిం ప్రాప్తా శంతనుం ధర్మవిత్తమమ్.
3 నిషాదపుత్రీం స కథం వృతవా న్నృపతిః స్వయమ్| ధర్మిష్ఠః పౌరవో రాజా కులహీనా మసంవృతామ్.
4 శంతనోః ప్రథమా పత్నీ కాహ్యభూత్కథయాధునా| భీష్మః పుత్రో%థ మేధావీవసోరంశః కథం పునః
5 త్వయా ప్రోక్తం పురా సూత రాజా చిత్రాంగదః కృతః | సత్యవత్యాః సుతో వరో భీష్మేణామిత తేజసా.
6 చిత్రాంగదే హతే వీరే కృత స్తదనుజ స్తథా| విచిత్ర వీర్యనామా%సౌ సత్యవత్యాః సుతో నృపః
7 జ్యేష్ఠే భీష్మే స్థితే పూర్వం ధర్మిష్ఠే రూపవ్యతపి| కృతవా న్స కథం రాజ్యం స్థాపిత స్తేన జానతా.
8 మృతే విచిత్రవీర్యే తు సత్యవ త్యతిదుఃఃతా| వధూభ్యాం గోలకౌ పుత్రౌ జనయామాస సా కథమ్.
9 కథం రాజ్యం న భీష్మాయ దదౌ సా వర్ణినీ| న కృతస్తు కథం తేన వీరేణ దారసంగ్రహః
10 అధర్మస్తు కృతః కస్మా ద్వ్యాసే నామిత తేజసా| జ్యేష్ఠేన భ్రాతృభార్యాయాం పుత్రా వుత్పాదితా వితి?
11 పురాణకర్తా ధర్మాత్మా స కథం కృతవా న్మునిః | సేవనం పరదారాణాం భ్రాతుశ్చైవ విశేషతః
12 జుగుప్సిత మిదం కర్మ స కథం కృతవా న్మునిః? శిష్టాచారః కథం సూత వేదానుమితికారకః?
13 వ్యాసశిష్యో%సి మేధావిన్ సందేహం ఛేత్తు మర్హసి| శ్రోతుకామా వయం సర్వే ధర్మక్షేత్రే కృతక్షణాః.
14 ఋషులిట్లనిరి : సూతమునీశా! సత్యవతి యొక్కయు మహాతేజశ్శాలియగు వ్యాసుని యొక్కయు జన్మములను గూర్చి చక్కగ వక్కాణించితివి. కాని మీరెంత చెప్పినను మా చిత్తములనుండి యొక సందియమెంతకును తొలగుటలేదు. వ్యాసుని తల్లి సత్యవతియని నుడివితివి. ఆమె మరల ధర్మవిదుడగు శంతను మహారాజు నెట్లు బొందినది? ఆ శంతను మహారాజు పురువంశ నరపతి; ధర్మిష్ఠుడు; అట్టివాడే మంచి కులము వృత్తిలేని యొక బోయవాని కూతురు నెట్లు వరించెను? ఆ శంతనుని మొదటి భార్య యెవరు? మేధావి యగు భీష్ముడు వసువంశమున నెట్లు జన్మించెను? మాకివన్నియును స్పష్టముగ నిపుడు తెలుపుము. భీష్ముడు సత్యవతీ సుతుడనియు మహావీరుడనియు చిత్రాంగదుని రాజుగ జేసినవాడనియును మున్ను నీవు దెల్పితివి. చిత్రాంగదుడు మరణింపగ నతని తమ్ముడు సత్యవతీ సుతుడగు విచిత్రవీర్యుడు రాజయ్యెను. కాని ధర్మిష్ఠుడు జ్యేష్ఠుడు బలిష్ఠుడునగు భీష్ముడుండగ విచిత్ర వీర్యుడెట్లు రాజుగ జేయబడెను? సత్యవతి తన సుతులు చనిపోగా బిట్టు పలవరించి తన కోడండ్రను గోళక పుత్త్రులను గనునట్టు లెట్టుల ప్రేరేపించెను? ఆ సత్యవతి భీష్మునకు రాజ్యమేల యొసగలేదు? ఆ మహాధీరుడేల పెండ్లి చేసుకొనలేదు? పెద్దవాడు మహాతేజస్వియగు వ్యాసుడు తన తమ్ముల భార్యలయందు సంతానమెట్లు గనెను? ఆ ధర్మమూర్తి యిట్టి యధర్మమున కెట్లు పూనుకొనెను? మహా పురాణకర్తయు ధర్మాత్ముడు నగు వ్యాసుడు పర భార్యలందు - నందులో తమ్ముల భార్యల నే విధముగ ననుభవించెను? ఆ మహాత్ము డిట్టి నింద్యమగు పనినెట్లు తలపెట్టెను? వేదసమ్మతునకిది శిష్టాచార మగునా? నీవు వ్యాసుని శిష్యుడవు. నీవే మా యీ శంక దీర్పజాలుదువు. మేమీ పుణ్యధర్మక్షేత్రమున సర్వముత్సాహముతో వినగోరుచున్నారము. సూతః : ఇక్ష్వాకువంశప్రభవో మహాభిష ఇతి స్మృతః| సత్యవా న్ధర్మశీలశ్చ చక్రవర్తీ నృపోత్తమః
15 అశ్వమేధ సహస్రేణ వాజపేయశ##తేన చ| తోషయామాస దేవేంద్ర స్వర్గం ప్రాప మహామతిః
16 ఏకదా బ్రహ్మసదనం గతో రాజా మాహాభిషః | సురాః సర్వే సమాజగ్ముః సేవనార్థం ప్రజాపతిమ్.
17 గంగా మహానదీ తత్ర సంస్థితా సేవితుం విభుమ్| తస్యా వాసః సముద్ధూతం మారుతేన తరస్వినా
18 అధోముఖాః సురాః సర్వే న విలోక్యైవ తాం స్థితాః | రాజా మహాభిష స్తాం తు నిశ్శంకః సమపశ్యత.
19 సా%పి తం ప్రేమసంయుక్తం నృపం జ్ఞాతవతీ నదీ| దృష్ట్వా తౌ ప్రేమసంయుక్తౌ నిర్లజ్జౌ కామమోహితౌ.
20 బ్రహ్మా చుకోప తౌ తూర్ణం శశాప చ రుషాన్వితః | మర్త్య లోకేషు భూపాల జన్మ ప్రాప్య పున ర్దివమ్.
21 పుణ్యన మహతా%%విష్ట స్త్వ మవాప్స్యసి సర్వథా| గంగాం తథోక్తవా న్బ్రహ్మా వీక్ష్య ప్రేమవతీం నృపే.
22 సూతుడిట్లనియెను: మును పిక్ష్వాకు వంశమున మహాభిషుడను చక్రవర్తి జన్మించెను. అతడు సత్యవంతుడు ధర్మశీలి. అతడు వేయి యశ్వమేధములు నూఱు వాజపేయములు వెలయంగ నొనరించి యింద్రుని ప్రసన్నునిజేసి స్వర్గసీమ నలంకరించెను. ఒకనా డా మహాభిషుడు బ్రహ్మసభ కేగెను. ఆత్తఱి నచట ప్రజాపతిని సేవించుకొనుటకు దేవతలెల్లరు విచ్చేసిరి. అచ్చటికి గంగాదేవియును బ్రహ్మ కొలువునకు వచ్చినది. అప్పుడొక పెనుగాలివాటున నామెమీది వస్త్రము తటాలున మీదికి లేచినది. దేవతలెల్ల రామె దిక్కు చూడక తలలు వంచుకొనిరి. కాని మహాభిషుడు మాత్ర మామెలోని రాగవిలసనముల నదేపనిగ కన్నెత్తి తేరిపార చూచుచుండెను. గంగయు నతడు తనయం దనురాగవంతుడయ్యెనని కనిపెట్టెను. వారు రాగ మత్తులగుట బ్రహ్మ గ్రహించి రోషావేశమున కోపించి రాజునిట్లు శపించెను: నీవు మనుష్యలోకమున రాజుగ పుట్టుదువు గాక! నీవు మరల నీ పుణ్యబలమున నెల్లవిధముల నాకలోక మేతెంతువు.' అని, ఈ రాజునం దనురాగవతివగుట వలన నేలపై పుట్టు'మని గంగను కూడ నతడు శపించెను. విమనస్కౌ తు తౌ తూర్ణం నిఃసృతౌ బ్రహ్మణో%oతికాత్స నృప శ్చింతయిత్వా%థ భూలోకే ధర్మతత్పరాన్.
23 ప్రతీపం చింతయామాస పితరం పురువంశజమ్| ఏతస్మి న్సమయే చాష్టౌ వసవః స్త్రీసమన్వితాః
24 వసిష్ఠస్యా%%శ్రమం ప్రాప్తా రమమాణా యదృచ్ఛయా| పృథ్వాదీనాం వసూనాం చ మధ్యే కో%పి వసూత్తమః 25 ద్యౌర్నామా తస్య భార్యా%థ నందినీం గాం దదర్శహ| దృష్ట్వా పతిం సా పప్రచ్ఛ క స్యేయం ధేను రుత్తమా.
26 ద్యౌ స్తా మాహ వసిష్ఠస్య గౌరియం శృణు సుందరి| దుగ్ధ మస్యాః పిబే ద్యస్తు నారీ వా పురుషో%థవా
27 అయుతాయు ర్భవే న్నూనం సదైవా%గత¸°వనః| తచ్ఛ్రుత్వా సుందరీ ప్రాహ మృత్యులోకే%స్తి మే సఖీ. 28 ఉశీనరస్య రాజర్షేః పుత్త్రీ పరమశోభనాత స్యా హేతో ర్మహాభాగ సవత్సాం గాం పయస్వినీమ్.
29 ఆనయ స్వా%%శ్రమ శ్రేష్ఠం నందినీం కామదాం శుభామ్| యావదస్యాః పయః పీత్వా సఖీ మమ సదైవ హి.
30 మానుషేషు భ##వే దేకా జరారోగవివర్జితా| తచ్ఛ్రుత్వా వచనం తస్యా ద్యౌ ర్జహార చ నందినీమ్.
31 అవమాన్య మునిం దాంతం పృథ్వాద్వైః సహితో%నఘుః| హృతాయా మథ నందిన్యాం వసిష్ఠస్తు మహాతపాః
32 అంత వారిరువురు నెడదలు కలగుండు పడగ బ్రహ్మను వీడ్కొని బయలుదేరిరి. అత డీ భువిపైని ధర్మతత్పురులగు రాజులున్నచో టరయుచుండెను. అంతలో నతనికి పురువంశజుండగు ప్రతీపుడు దోచెను. అత డతనికి తనయుడుగా దలచెను. అష్ఠవసువులదే సమయమున మక్కువ మీర తమ తమ భార్యలంగూడినవారై వారు వసిష్టాశ్రమమందు తమ భార్యలంజేరి విహార వినోదశ్రీల నోలలాడుచుండిరి. పృథువు మున్నగు వసువులలో నుత్తమ వసువొకడుగలడు. అతని పేరు ద్యో. అతని భార్య నందినీ ధేనువును గాంచి తన పతితో నీ యుత్తమ ధేనువెవ్వరిదని యడిగెను. అతడామెతో నిట్లనియెను. ఓ సుందరీ! వినుము, ఇది వసిష్ఠుని గోరత్నము. దీని పాలు పురుషుడుగాని స్త్రీగాని త్రాగినచో వారు పదివేలేండ్లు తరుగని చెఱగని నిండు జవ్వనమున నురకలు వేతురు.' అనునతనితో నామె యిట్లు పలికెను. ఈ నరలోకమందు నాకొక చెలిమి కత్తియ గలదు. ఆమె ఉశీనర రాజర్షిపుత్రి. మిక్కిలి శోభనగాత్రి. ఆమె కొఱకు పాలుగల్గిన నందిధేనువును దూడను గొనిరమ్ము. ఈ నందిని పవిత్రమైనది. కోర్కెలు దీర్చునది. నా చెలికత్తె యీ గోవుపాలు త్రాగును. ఆమె జరారోగములు లేక చిరము మనగలదు.' ఆను నామె మాటలు విని ద్యో పృథువు మున్నగు వసువులను వెంటబెట్టుకొని మునిని గణింపక నందిని నపహరించెను. ఆజగామా%%శ్రమపదం ఫలా న్యాదాయ సత్వరః నాపశ్యత యదా ధేనుం సవత్సాం స్వాశ్రమే మునిః.
33 మృగయామాస తేజస్వీ గహ్వరేషు వనేష్వపి| నాసాదితా యదా ధేను శ్చుకోపాతిశయం మునిః.
34 వారుణిశ్చాపి విజ్ఞాయ ధ్యానేన వసుభిర్హృతామ్| వసుభి ర్మే హృతా ధేను ర్యస్మా న్యా మవమాన్య వై.
35 తస్మా త్సర్వే జనిష్యంతి మానుషేషు న సంశయః | ఏవం శశాప ధర్మాతామ వసూం స్తా న్వారుణిః స్వయమ్
36 శ్రుత్వా విమనసః సర్వే ప్రయయు ర్దుఃఃతాశ్చ తే| శప్తాః స్మ ఇతి జానంత ఋషిం త ముపచక్రముః
37 ప్రసాదయంత స్తమృషిం వసవః శరణం గతాః | ముని స్తానాహ ధర్మాత్మా వసూ న్దీనా న్పురః స్థితాన్.
38 అనుసంవత్సరం సర్వే శాపమోక్ష మవాప్స్యథ| యేనేయం విహృతా ధేను ర్నందినీ మమ వత్సలా.
39 తస్మా ద్ద్యౌ ర్మానుషే దేహే దీరంకాల వసిష్యతి| తే శప్తాః పథి గచ్ఛంతీం గంగాం దృష్ట్వా సరిద్వరామ్.
40 ఊచుస్తాం ప్రణతాః సర్వే శప్తాం చింతాతురాం నదీమ్| భవిష్యామో వయం దేవి కథం దేవాః సుధాశనాః
41 మానుషాణం చ జఠరే చింతేయం మహతీ హి నః| తస్మాత్త్వం మానుషీ భూత్వా జనయాస్మా న్సరిద్వరే.
42 శంతనుర్నామ రాజర్షిస్తస్య భార్యా భవానఘే| జాతాన్ జాతాన్ జలే చాస్మా న్నిక్షిపస్వ సురాపగే.
43 ఏవం శాపవినిర్మోక్షో భవితా నాత్రసంశయుః| తథేత్యుక్తాశ్చ తే సర్వే జగ్ము ర్లోకం స్వకం పునః.
44 అంతలో మహాతాపసుడగు వసిష్ఠ మహాముని సత్వరమే ఫలాదులుగొని నిజాశ్రమ మేతెంచెను. అతనికి తన యాశ్రమమందు సవత్సయగు ధేనువు గనిపించలేదు. ఆ ముని దానికై వనములు గుహలు కలయ వెదకెను. కాని యది యెంతకు గనిపించలేదు. అందులకా ముని యెదలో కోపాగ్ని ప్రజ్వరిల్లెను. ఆ మహాముని ధ్యానయోగమున మునింగి తన గోవును వసువు లపహరించిరని యెఱింగెను. వారు నన్ను సరకు సేయక నా గోవును నాలేనితఱి నపహరించిరి. కాన వసువులందఱు మానవులుగ జన్మింతురుగాక. ఇందు ఏమియు సందియము లేదని వసిష్ఠుడు వసువులను శపించెను. వసిష్ఠ మహామునిచేత శప్తులమైతిమని వసువు లెఱిగి దుఃఃంచి ముని సన్నిధి కేగిరి. వారు మునిని సంతసింపజేయుచు నతనికి శరణాగతులైరి. అట్లు మొగాన నెత్తుటిబొట్టులేక దీనాతిదీనముగ తన ముందు పడియున్న వసువులనుగని ముని ఇట్లు పలికెను: మీరు ఒక్కొక్క సంవత్సరము వ్యవధానముతో నొకరి రువాత నొకరుగ వెంటనే జన్మించి మరణింపగలరు. కాని నా సవత్స ధేనువును దొంగిలించిన వసువు నరలోకమున చాలకాలము వసించును. ఇట్లు వసువులు శపింపబడి వెళ్ళుచుండగ త్రోవలో వారికి నదీమతల్లి గంగాదేవి కనిపించెను. గంగయును శపింపబడి విలపించుచుండెను. వసువులామెకు ప్రణమిల్లి యిట్లనిరి : ఓ దేవీ! మేమమృతాశనులముగదా! మానవగర్భమెందెట్లు జన్మింపనోదుము? నరుల కడుపున పుట్టుటకు మాకు విచారమున నున్నది. కావున నో గంగామాతా! నీవు స్త్రీ రూపము దాల్చి మాకు జన్మములు ప్రసాదించుము. శంతనుడను రాజు గలడు. నీవతనికి భార్యవుగమ్ము. మమ్ము పుట్టినవానిని పుట్టినట్టుల గంగ పొట్టన పెట్టుము. అట్లొనరించిన మాకు శాపముక్తి గల్గును. ఇది నిజము. ఆమె యట్ల యగుతమని మాట యీయగ వారు తమ లోకముల కేగిరి. గంగా%పి నిర్గతా దేవీ చింత్యమానా పునఃపునః| మహాభిషో నృపో జాతః ప్రతీపస్య సుత స్తదా.
45 శంతనుర్నామ రాజర్షి ర్ధర్మాత్మా సత్యసంగరః| ప్రతీపస్తు స్తుతిం చక్రే సూర్యస్యామిత తేజసః.
46 తదా చ సలిలా త్తస్మా న్నిఃసృతా వరవర్ణినీ| దక్షిణం శాలసంకాశ మూరుంభేజే శుభాననా.
47 అంకే స్థితాం స్త్రియం చాప మా%పృష్ట్వా కిం వరాననే| మమోరా వాస్థితా%సి త్వం కిమర్థం దక్షిణ శుభే.
48 సా తమాహ వరారోహా యదర్థం రాజసత్తమ| స్థి తా%స్మ్యంకే కురుశ్రేష్ఠ కామయానాం భజస్వ మామ్.
49 తా మవోచ దథో రాజా రూప¸°వనశాలినీమ్| నాహం పరస్త్రీయం కామా ద్గచ్ఛేయం వరవర్ణినీమ్.
50 స్థితా దక్షిణ మూరుం మే త్వ మాశ్లిష్య చ భామిని| అపత్యానాం స్నుషాణాం చ స్తానం విద్ధి శుచిస్మితే.
51 స్నుషా మే భవ కళ్యాణి జాతే పుత్రే%తివాంఛితే| భవిష్యతి చ మే పుత్ర స్తవ పుణ్యా న్న సంశయః
52 తథేత్యుక్త్వా గతా సావై కామినీ దివ్య దర్శనా| రాజా చాపి గృహం ప్రాప్త శ్చింతయం స్తాం స్త్రియం పునః
53 గంగయు మాటిమాటికి చింతించుచుడెను. ఆ మహాభిషుడు ప్రతీపునికి కుమారుడుగ జన్మించెను. అతడే శంతనుడనబడిన రాజర్షి - ధర్మాత్ముడు - సత్యసంగరుడు. పూర్వము ప్రతీపుడు సూర్యుని వరేణ్యమగు జ్యోతిని గూర్చి స్తోత్రము చేసెను. అప్పుడు గంగాజలమునుండి వరవర్ణిని శుభాననయగు స్త్రీ బయటి కేతెంచినవచ్చి ప్రతీపుని సాలతరువు వంటి కుడితొడపై గూరుచుండెను. రాజు నా యనుమతిలేకయే నా కుడితొడమీద గూరుచుంటివేమని తన యంకముపై నున్న యువిదతో ననియెను. ఓ కురుశ్రేష్ఠ! నా హృదయమున నీ పై ననురాగము కలదు. నీవమిత వీర్యుడవు. నీవు నన్ననుభవింపవేడెద. అందులకే నిన్ను జేరితిని. అపుడు రాజు రూప¸°వనసంపన్నయగు నా మదవతి కిట్లనియెను: నేను పరస్త్రీలను కన్నెత్తియైనను జూడనివాడను. నీవు నా కుడితొడను సమాశ్రయించి గూరుచుంటిని. అది కొడుకులకు కోడండ్రకు మాత్రమే తగినదని యెఱుంగుము. కావున నో కళ్యాణీ! నాకు పుత్త్రుడు గల్గిన మీదట నా కోడలవుగమ్ము. నీ పుణ్యముననైన నాకు పుత్త్రుడుదయించుననుటలో ననుమానము లేదు అన అటులే కానిమ్మని దివ్యదృష్టిగల యాకామిని యరిగెను. రాజుగూడ యా లలననే తలచుచు తన భవనమున కేగెను. తతః కాలేన కియతా జాతే పుత్రే వయస్విని| వనం జిగమిషూ రాజా పుత్రం వృత్తాంత మూచివాన్.
54 వృత్తాంతం కథయిత్వా తు పున రూచే సుతమ్| యది ప్రాయాతి సా బాలా త్వాం వనే చారుహాసినీ.
55 కామయానా వరారోహా తాం భ##జేథా మనోరమామ్ | న ప్రష్టవ్యా త్వయా కా%సి మన్నియోగా న్నరాధిప.
56 ధర్మపత్నీం చ తాం కృత్వా భవితా త్వం సుఖీ కిల| సూతః ఏవం సందివ్య తం పుత్రం భూపతిః ప్రీతమానసః.
57 దత్వా రాజ్యశ్రియం సర్వాం వనం రాజావిశేశ హ| తత్రాపి చ తపస్తప్త్వా సమారాధ్య పరాంబికామ్.
58 జగామ స్వర్గం రాజా%సౌ దేహం త్యక్త్వా స్వతేజసా| రాజ్యం ప్రాప మహాతేజాః శంతనుః సార్వభౌమికమ్.
59 ప్రజాం వై పాలయామాస ధర్మదండో మహీపతిః
60 ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ ద్వితీయస్కంధే తృతీయో%ధ్యాయః అంత కొంతకాలమున కారాజునకు పుత్త్రుడుగల్గి యుక్తవయస్కుడయ్యెను. అతడు వేట కడవికేగదలచెను. అపుడు రాజు తన కొమరున కానాటి స్త్రీ వృత్తాంతమంతయు దెలిపెను. అంతయు దెలిపి మరల నిట్లనియెను: ఒకవేళ నా చారుహాసిని వరారోహయగు బాల నిన్ను దరిజేర రావచ్చును. అపుడు నీవు ఆ మనోరమయగు యువతిని భార్యగ స్వీకరింపుము, అంతేకాని యామెను నీవెవ్వతెవని మాత్ర మడుగకుము. ఇది నా యానతి. నీవామెనే ధర్మపత్నిగ జేకొని సుఖము బొందుము' అని తన పుత్త్రున కాదేశించి ప్రతీపుడు ప్రీతిజెందెను. పిమ్మట ప్రతీపుడు తన రాజ్యభారమెల్ల తన సుతునకప్పగించి తాను వనముల కరిగి శ్రీ పరాభట్టారికను నెదలో సమారాధించెను. ఆ రాజు తన తపోబలమున తనువును చాలించి స్వర్గసీమ నలంకరించెను. అతంట మహాతేజస్వియగు శంతనుడు సార్వభౌముడయ్యెను. ఆ శంతను మహారాజు వీడని ధర్మముతో దండనీతితో ప్రజలను కన్నబిడ్డలవలె పరిపాలించెను. ఇది శ్రీదేవీ భాగవతమందలి ద్వితీయస్కంధమున తృతీయాధ్యాయము.