Sri Devi Bhagavatam-1
Chapters
అథ నవమో%ధ్యాయః పరీక్షిదువాచ: కామార్తః స ముని ర్గత్వా రురుస్సుప్తోనిజాశ్రమే | పితా పప్రచ్ఛదీనం తం కిం రురోవిమానఅసి.
1 స త మహాతికామార్తః స్థూల కేశస్య చా %%శ్రమే | కన్యా ప్రమద్వరా నామ సా మే భార్యా భ##వే దితి.
2 స గత్వా ప్రమతి స్తూర్ణం స్థూలకేశం మహామునిమ్ | ప్రసాద్య సుముఖం కృత్వా యయాచే తాం వరాననామ్. 3 దదౌ వాచం స్థూలకేశః ప్రదాస్వామి శుభే%హని | వివాహార్థం చ సంభారం రచయామాసతు ర్వనే. 4 ప్రమతిః స్థూల కేశశ్చ వివాహార్థం సముద్యతౌ | బభూవతు ర్మహాత్యానౌ సమీపస్థౌ తపోవనే. 5 తస్యి న్నవసరే కన్యా రమమాణా గృహంగజే | ప్రసుప్తం పన్నగం పాదే నా స్పృశ చ్చారులోచనా. 6 దష్టా తు పన్నగేనాథ సా మమార వరాంగనా | కోలాహాల స్తదా జాతో మృతాం దృష్ట్వా ప్రమద్వరామ్. 7 మిళితా మునయః సర్వేచుక్రుశుః శోకసంయుతాః | భూమౌ తాం పతితాం దృష్ట్వా పితా తస్యాతిదుఃఖితః. 8 రురోద విగతప్రాణాం దీప్యమానాం సుతేజనా | రురుః శ్రుత్వా తదా%%క్రంద న్దర్శనార్థం సమాగతః. 9 తొమ్మిదవ అధ్యాయము రురుముని తన ప్రియురాలిని బ్రతికించుకొనుట పరీక్షిత్తిట్లనియె : రురుముని కామార్తుడై తన యాశ్రమములో నుండెను. అపుడతని తండ్రి 'రురూ! ఏమో దిగులుతో నుంటివే'మని యడిగెను. రురువు 'అయ్యా! స్థూలకేశు నాశ్రమమందు ప్రమద్వరయను తగిన కన్య గలదు. నాకామెను భార్యగ జేయవలయు' నని తండ్రితో బలికెను. ప్రమతి వెంటనే స్థూలకేశు నాశ్రమముజేరి యామునిని తనవానిగ సుముఖునిగ జేసికొని యతని కన్యను తన కుమారునకు నిమ్మని యడిగెను. ఒక మంచి మూర్తమున నా కన్యను మీ చేతిలో బెట్టుదునని స్థూలకేతుడు ప్రమతికి మాట యిచ్చెను. వనమునందు పెండ్లికై శుభసంభారములు సమకూర్చెను. ఆ తపోవనమున నట్లు వారిరువురును పెండ్లి జరుపుటకు సముద్యుతులైరి. అదే సమయమున ఆ చారులోచనయగు కన్య తన యింటి మొగసాలలో నిదురించుచుండగ నామె కాలి నొకపాము కాటు వేసెను. దాన నా చారులోచన విగతప్రాణయయ్యెను. ప్రమద్వర మరణించుట గాంచగనే యచట పెద్దగ యేడుపు పెడబొబ్బలు సాగినవి. మునులందఱు చుట్టును గుమిగూడి శోకించుచుండిరి. తన కూతునుగాంచి యామె తండ్రి ప్రాణాలు పోయినప్పటికిని మొగాన కాంతిరేఖ సన్నగిల్లక నేలపై పడియున్న యామెపైబడి వలవల యేడువసాగెను. ఆ యేడ్పు విని రురువు నచటి కేగెను. దదర్శ పతితాం తత్ర సజీనామివ కామినీమ్ | రుదంతం స్థూలకేశం చ దృష్ట్వా%న్యా నృషిసత్తమాన్. 10 రురుః స్థానా ద్బహిర్గత్వా రురోద విరహాకులః | అహోదైవేన సర్పో%యం ప్రేషితః పరమాద్భుతః. 11 మమ శర్మ విఘాతాయ దుఃఖహేతు రయం కిల | కిం కరోమి క్వ గచ్ఛామి మృతా మే ప్రాణవల్లభా. 12 న వై జీవితు మిచ్ఛామి వియుక్తః ప్రియయా %నయా | నాలింగితా వరారోహా న మయా చుంబితాముఖే. 13 న పాణిగ్రహణం ప్రాప్తం మందభాగ్యేన సర్వథా | లాజహోమ స్తథా చాగ్నౌ న కృత స్త్వనయా సహ. 14 మానుష్యం ధిగిదం కామం గచ్ఛం త్వద్య మమాసవః | దుఃఖితస్య నా వా మృత్యు ర్వాంఛితః సముపైతి హి. 15 సుఖం తర్హి కథం దివ్య మాప్యతే భువి వాంఛితమ్ | ప్రపతామి హ్రదే ఘోరే పావకే ప్రపతా మ్యహమ్. 16 విషమద్మి గలే పాశం కృత్వా ప్రాణాం స్త్యజా మ్యహమ్ | విలపై#్యవం రురుస్తత్ర విచార్య మనసా పునః. 17 ఉపాయం చితయామాస స్థిత స్తస్మి న్నదీతటే | మరనా త్కిం ఫలం మే స్యా దాత్మహత్యా దురత్యయా. 18 దుఃఖితశ్చ పితా మే స్యా జ్జననీ చాతిదుఃఖితా | దైవస్తుష్టో భ##వే త్కామం దృష్ట్వా మాం త్యక్తజీవితమ్. 19 సర్వః ప్రముదితశ్చ స్యా న్మతయే నాత్రసంశయః | ఉపకారః ప్రియాయాః కః పరలోకే భ##వేదపి. 20 మృతే మయ్యాత్మఘాతేన విరహాత్పీడితే% పి చ | పరలోకే ప్రియా సా%పి న మే స్యా దాత్మఘాతినః. 21 ఏతదర్థం మృతే దోషా మయి నైవామృతే పునః | విమృశ్యైవం రురు స్తత్ర స్నాత్వా%%చమ్య శుచిః స్థితః. 22 అబ్రవీ ద్వచనం కృత్వా జలం పాణా వసౌ మునిః | యన్మయా సుకృతం కించి త్కృతం దేవార్చనాదికమ్. 23 గురవః పూజితా భక్త్యా హుతం జప్తం తపః కృతమ్ | అధీతా స్త్వఖిలా వేదా గాయత్రీ సంస్కృతా యది. 24 రవి రారాధిత స్తేన సంజీవతు దుమ ప్రియా | యది జీవే న్న మే కాంతా త్యజే ప్రాణా సహం తతః. 25 సజీవవలెనే పడియున్న ఆ కామినియగు ప్రమద్వరను ఏడ్చుచున్న స్థూలకేశుని నచట మూగిన ఇతర ఋషిసత్తములనుగాంచి ఆ తావునుండి రురువు బయటకువచ్చి విరహాకులుడై ఇట్లు బోరున నేడ్చెను : 'అక్కట ! దైవముచే నీపాము వింతగ పంపబడినదే! ఇది నా సుఖవిఘాతమునకు దుఃఖమునకును హేతువయ్యె గదా! నా ప్రాణవల్లభ మరణించెను. ఇకనేమి చేయుదు? ఎక్కడకని పోదును? ఈ నా ప్రియారాలు లేక జీవింపగోరికలేదు. ఈ వరారోహను నేను కౌగిలించుకొనలేదు. ముద్దు పెట్టుకొననే లేదు. మందభాగ్యుడను నేనామె పాణిని గ్రహించలేదు. ఈమెను గూడి యగ్నిలో లాజహోమము వేల్చనైతిని. ఈ మానవజన్మము వ్యర్థమైనది. ఇత్తరి నా యసువులు పోయిన బాగుగ నుండును. దుఃఖితుడు పాపియగు వాడెంత కోరుకొన్నను వానికి చావురాదు. ఇంక నాకీ నేలపై దివ్యసుఖవాంఛ లెట్లు తీరును? కనుక నేనిపుడు భీకరమై లోతైన మడుగులోపడికాని నిప్పులో దుమికికాని ప్రాణముల త్యజింతును. ఇంత విషము మ్రింగియో మెడ కురిపోసికొనియో చనిపోదును' అని యిట్లు రురువు వాపోవుచునదీతటమున గూర్చుండి తన మదిలో నిట్లాలోచించసాగెను: 'ఘోరమైన యాత్మవధ చేసికొని చచ్చిన ఫలితమేమి? నా చావునకు నా తల్లిదండ్రులే దుఃఖింతురు. ప్రాణములు వదలిన నన్నుగాంచి దైవము మాత్రము హర్షము వెలిపుచ్చును. నా చావునకు తక్కిన వారందరు సంతసింతురు. నేను చచ్చి మాత్రమా పరలోకమున నా ప్రియకు చేయగల్గిన యుపకారమేమి? ఇట నీమె విరహవేదనమున నే నాత్మ వధము చేసికొన్నచో పరలోకమున నామె నాకు ప్రియురాలగునని నమ్మకమేమి? ఇందువలన నేను చనిపోయిన దోషము గల్గునుగాని చావకున్న నే దోషమును గల్గదు.' అని చక్కగ విచారించి రురువపుడు స్నాన మాచరించి యాచమించి శుచియై దోసిలినిండ నీరు తీసికొన 'నా వలన నేదేని సుకృతముగాని దేవతార్చనగాని జరిగియున్న యెడల - నేను నా గురువులను భక్తితో బూజించితినేని - నేను జపతపోహోమములు జరిపినవాడనేని - వేదములు చక్కగ నధ్యయనము చేసితినేని - గాయత్ర్యనుష్ఠానము నన్ను సంస్కరించియుండెనేని - సూర్యుడు నాచేత నారాధింపబడెనేని నా ప్రియురాలిపుడే మరల జీవించుగావుత ! ఒకవేళ నా కాంత బ్రతుకదేని నేనుగూడ నామెతోబాటు ప్రాణములు వదలుదును.' ఇత్యుక్త్వా తజ్జలం భూమౌ చిక్షేపారాధ్య దేవతాః | రాజోవాచ: ఏవం విలపత స్తస్య భార్యయా దుఃఖితస్యచ. 26 దేవదూత స్తదా%ఖ్యేత్యవాక్యమాహరురుం తతః | దేవదూతః : మాకార్షీః సాహసం బ్రహ్మన్కంథంజీవేస్మృతాప్రియా. 27 గతాయు రేషా సుశ్రోణీ గంధర్వాప్సరసోః సుతా | అన్యాం కామయ చార్వంగీం మృతేయం చావివాహితా. 28 కిం రోదిషి సుదుర్బుద్ధేః కా ప్రీతి స్తే%నయా సహ | రురు రువాచ : దేవదూత న చాన్యాం వై పరిష్యా మ్యహ మంగనామ్. 29 యది జీవే న్న జీవేద్వా మర్తవ్యం చాధునామాయ | రాజోవార: విదిత్వేతిమఠం తస్యదేవదూతోముదా%న్వితః. 30 ఉవాచ వచనం తథ్యం సత్యం చాతిమనోహరమ్ | ఉపాయం శృణు విప్రేంద్ర విమితం యత్సురైః పురా. 31 ఆయుషో%ర్థప్రదానేన జీవయాశుప్రమద్వరామ్ | రురురువాచ: ఆయుషో%ర్థం ప్రయచ్ఛామికన్యాయైనా త్రసంశయః. 32 అద్య ప్రత్యావృతాప్రాణా ప్రోత్తిష్ఠతు మమ ప్రియా | విశ్వావసు స్తతా తత్ర విమానేన సమాగతః. 33 జ్ఞాత్వా పుత్రీం మృతాం చాశు స్వర్గలోకా త్ప్రమద్వరామ్ | తతో గంధర్వరాజశ్చ దేవదూతశ్చ సత్తమః. 34 ధర్మరాజ ముపేత్యేదం వచనం ప్రత్యభాషతామ్ | ధర్మరాజ రురోః పత్నీ సుతా విశ్వావసో స్తథా. 35 మృతా ప్రమద్వరా కన్యా దష్టా సర్పేణ చాధునా | సా రురో రాయుషో%ర్ధేన మర్తుకామస్య సూర్జజజ 36 సముత్తిష్ఠతు తన్వంగీ వ్రతచర్యా ప్రభావతః | ధర్మః | విశ్వావసుసుతాం కన్యాం దేవదూత యదీచ్ఛసి. 37 ఉత్తిష్ఠ త్వాయుషో%ర్ధేన రురుం గత్వా త్వ మర్పయ| రాజా: ఏవ ముక్తస్తతో గత్వా జీవయిత్వా ప్రమద్వరామ్. 38 రురోః సమర్పయామాస దేవదూత స్త్వరాన్వితః | తతః శుభే%హ్ని విదినా రురుణా%పి వివాహితా. 39 అని పలికి దేవతల నారాధించి యా జలము నతడు భూమిపై జల్లెను. ఇట్లు రురువు తన భార్యకై మిక్కిలిగ శోకించుచుండ నొక దేవదూత రురువుకడ కరుగుదెంచి యతనితో నిట్లనెను: 'బ్రాహ్మణా! అతి సాహసము వలదు. చనిపోయిన నీ ప్రియురాలు తిరిగి యెట్లు బ్రతుకగలదు? ఈ ప్రమద్వర గంధర్వాప్సరసల కూతురు. అవివాహితగ మరణించినది. కాన వేరొక సుందరాంగిని కామింపుము. ఈమెకై దుర్బుద్ధివై రోదింతువేల? ఈమెపై నీకింత ప్రీతి యెందులకు? రురువిట్లనియె: 'ఓ దేవదూతా! నే నితర స్త్రీని వరింపజాలను. ఈమె బ్రతుకనిచో నే నిప్పుడే యిక్కడనే ప్రాణములు వీడుదును.' రురువు పట్టుదలకు దేవదూత ప్రమోదమందెను. ఆ దేవదూత మనోహరమైన సత్యవాక్కులతో నిట్లనెను: బ్రాహ్మణోత్తమా! పూర్వము దేవతలచే విధింపబడిన యొక యుపాయము గలదు. దానిని జెప్పుదును. వినుము: నీ యర్ధాయువునిచ్చి నీ ప్రమద్వరను బ్రతికించుకొనుము. 'నేను నిస్సందేహముగ నా సగమాయువు నా ప్రియురాలి కొఱకిత్తును. నా ప్రియ యీక్షణమే బ్రతికి లేచుగాత' మని రురువనెను. అంతలో విశ్వావసువు తన పుత్త్రి మరణవార్తవిని స్వర్గమునుండి దిగి వచ్చెను. అపుడా విశ్వావసువును దేవదూతయు ధర్మదేవతకడకరిగి యిట్లనిరి: 'ధర్మదేవా! ఈ ప్రమద్వర విశ్వావసుని కూతురు. రురుని ప్రియురాలు. పాముకాటుచే మరణించినది. ఈమె కొరకు రురువు చావునకును సిద్ధపడి తన యాయువులోని సగము భాగ మీయదలచెను. కనుక రురుని వ్రతాచరణ ప్రభావమున ప్రమద్వర మరల జీవించుగా వుత్ర!' ధర్ముడిట్లనియె: దేవదూతా! ఆ విశ్వావసుని కూతురు బ్రతుకవలయునన్నచో రురువుయొక్క సగమాయువుగొని యామెను బ్రతికించుము. ధర్మదేవుని మాటలువిని దేవదూత ప్రమద్వరను పునర్జీవితురాలనుజేసి సత్వరమే యామెను రురున కప్పగించెను. తరువాత నొక శుభదినమున మంచి ముహూర్తమున రురువు విధానము ననుసరించి యామెను పెండ్లాడెను. ఇత్థం చోపాయయోగేన మృతా%ప్యుజ్జీవితా తదా | ఉపాయస్తు ప్రకర్తవ్యః సర్వథా శాస్త్రసమ్మతః. 40 మణిమంత్రౌషధీభిశ్చ విధివ త్ప్రాణరక్షణ | ఇత్యుక్త్వా సచివా న్రాజా కల్పయిత్వా సురక్షకాన్. 41 కారయిత్వా%థ ప్రసాదం సప్తభూమిక ముత్తమమ్ | ఆరురోహోత్తరాసూనుః సచివైః సహ తతణమ్. 42 మణిమంత్రధరాః శూరాః స్థాపితా స్తత్ర రక్షణ | ప్రేషయామాస భూపాలో మునిం గౌరముఖం తతః. 43 ప్రసాదార్థం సేవకస్యక్షమస్వేతి పునః పునః | బ్రాహ్మణా న్సిద్ధమంత్రజ్ఞా నక్షణార్థ మితస్తతః. 44 మంత్రిపుత్రః స్థిత స్తత్ర స్థాపయామాస దంతినః | న కశ్చి దారుహే త్తత్ర ప్రాసాదే చాతిరక్షితే. 45 వాతో%పి న చరే త్తత్రప్రవేశో వినివార్యతే | భక్ష్యభోజ్యాదికం రాజా తత్రస్థవ్చ చకార సః. 46 స్నానసంధ్యాదికం కర్మ తత్రైవ వినివర్త్యచ | రాజకార్యాణి సర్వాణి తత్రస్థ శ్చాకరో న్నృపః. 47 మంత్రిభిః సహ సమ్మంత్య్ర గణయ న్దివసానపి | కశ్చిచ్చ కశ్యపో నామ బ్రాహ్మణో మంత్రిసత్తమః. 48 శుశ్రావ చ తథా శాపం ప్రాప్తం రాజ్ఞా మహాత్మనా | స దనార్జీ ద్విజవ్రేష్ఠః కశ్యపఃసమచింతయత్ 49 ప్రజామి తత్ యత్రాస్తే శప్తో రాజా ద్విజేన హ | ఇతి కృత్వా మతిం విప్రః స్వగృహా న్నిః సృతః పథి. 50 కశ్యపో మంత్రవి ద్విద్వా న్ధనార్థీ మునిసత్తమః. 51 ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ ద్వితీయస్కంధే నవమో%ధ్యాయః ఆ విధముగ మరణించి యామె మరల జీవించెను. కావున సర్వవిధముల మఱిమంత్రౌషధులచే ప్రాణ రక్షణము తప్పక చేసికొనుటవంటి శాస్త్రసమ్మతమైన యుపాయము చేసికొనదగి యున్నది. అని పరీక్షిత్తు తన మంత్రులను తనకు రక్షకులనుగా నియోగించి ఏడంతస్తుల ఉత్తమమగు మేడను నిర్మింపజేసి తన సచివులతో కూడా నా మేడ వెంటనే ఆరోహించెను. అందు మణిమంత్రధరులగు శూరులను రక్షకులుగ నియమించెను. నీ సేవకుడనగు నా తప్పిదమును మన్నించుమని తన పక్షమున నేగి మరల మరల నతనిని వేడి ప్రసన్నుని జేసికొనుటకై రాజు గౌరముఖుడను మునిని తన్ను శపించిన మునియాశ్రమమునకు పంపెను. సిద్ధమంత్రజ్ఞులగు బ్రాహ్మణుల నాత్మరక్షణ కేర్పాటు చేసికొనెను. సురక్షితమైన ఆ మేడ నెవ్వడు నెక్కకుండునట్లొక మంత్రి కుమారుడచటనుండి మేడ చుట్టును కొన్ని యేనుగులను నిలువబెట్టెను. ఆ మేడలోనికి గాలిగూడ చొచ్చుట కవకాశము లేకుండెను. ఎవరును లోన ప్రవేశించకుండ నివారింపబడుచుండిరి. రాజు లోననుండియే స్నానసంధ్యాదికృత్యములు నిర్వర్తించుచు భక్ష్యభోజ్యాదు లారగించుచు రాచకార్యములు చక్కపెట్టుచుండెను. అట్లు పరీక్షిత్తు మంత్రులతో మంతనములాడుచు దినములు లెక్కపెట్టుకొనుచుండెను. అంతలో మంత్రవిదులలో ఉత్తముడగు కశ్యపుడు అను బ్రాహ్మణుడు మహాత్ముడగు రాజునకు శాపము గలుగుటవిని అతనికి చావు తప్పించి డబ్బు గడించుకొనగోరి రాజున్న చోటి కేగుదునని తలంచి శపింపబడిన రాజున్న చోటికి వెళ్ళుటకు తన యింటినుండి బయలుదేరెను. ఆ కశ్యపుడు గొప్ప మంత్రవిదుడు విద్వాంసుడు మునిసత్తముడు ధనార్థి. ఇది శ్రీదేవీ భాగవతమందలి ద్వితీయ స్కంధమందు నవమాధ్యాయము.