Sri Devi Bhagavatam-1
Chapters
అథ దశయో%ధ్యాయః సూతః : తస్మిన్నే వదినే నామ్నాతక్షకస్తం నృపోత్తమమ్ | శప్తం జ్ఞాత్వాగృహాత్తూర్ణం నిఃసృతం పురుషోత్తమః.
1 వృద్ధబ్రాహ్మణవేషేణ తక్షకః పథి నిర్గతః | ఆపశ్య త్కశ్యపం మార్గే వ్రజంతం నృపతిం ప్రతి.
2 త మపృచ్చ త్పన్న గో%సౌ బ్రాహ్మణం మంత్రవాదినమ్ | క్వ భవాం స్త్వరితో యాతి కిం చ కార్యం చికీర్షతి.
3 కశ్యపః : పరీక్షితం నృవశ్రేష్ఠం తక్షకశ్చ ప్రధక్ష్యతి | తత్రాహం త్వరితో యామి నృపం కర్తు మపజ్వరమ్.
4 మంత్రో%స్తి మమ విపేంద్ర విషనాశకరః కిల| జివయిష్యా మ్యహం తం వై జీవితవ్యే%ధునా కిల.
5 తక్షకః : అహం స పన్న గోబ్రహ్మం స్తం దక్ష్యామి మహీవతిమ్ | నివర్తన శక్తస్త్వంమయా దష్టంచికిత్సితుమ్.
6 కశ్యపః : అహం దష్టం త్వయాసర్ప నృపం శప్తంద్విజేన వై | జీవయిష్యా మ్యసందేహం కామం మంత్రబలేనవై. 7 తక్షకః: యది త్వం జీవితుం యాసిమయాదష్టం నృపోత్తమమ్ | మంత్రశక్తిబలం విప్ర దర్వయత్వం మమానఘ. 8 ధక్ష్యామ్యేనం చ న్య గ్రోధం విషదంష్ట్రాభిరద్యవై | కశ్యపః : జీవయిష్యే త్వయాదష్టం దగ్ధంవాపన్న గోత్తమః 9 పదవ అధ్యాయము పరీక్షిత్తు విప్రశాపమున మరణించుట సూతుడిట్లనియెను: కశ్యపుడు అట్లు బయలుదేరిననాడే పురుషోత్తముడగు తక్షకుడును పరీక్షిత్తు శపింపబడెనని విని తన యింటినుండి బయలుదేరి వృద్ధబ్రాహ్మణ వేషమున పోవుకు రాజు సన్నిధి కేగుచుండిన ఆ బ్రాహ్మణునితో త్రోవలో తారసిల్లెను. తక్షకుడు ఆ మంత్రవిదుడగు విప్రుని 'నీ వెవ్వడవు? ఇంత వేగిర మెక్కడి కేగుచున్నావు? నీ పని యేమి? నీ తలంపేమి? అని యడుగగా' తక్షకుడు పరీక్షిత్తును గాటువేయునట. నే నారాజును మరల బ్రతికించుట కింత త్వరతగ్ర వెళ్ళుచున్నాను. విప్రా! నా దగ్గఱ విషహరమగు మంత్రమున్నది. ఆయువు బాగుగ నున్నచో నే నతనిని కచ్చితముగ బ్రతికించగలను' అని కశ్యపు డనెను. 'ద్విజవరా! ఆ తక్షకుడను నేనే. నేనే యా రాజును కాటువేయువాడను. నా విషపు కాటును చికిత్సించి బ్రతికించుట నీ తరముగాదు. అని తక్షకుడన 'ఆ శప్తుడైన రాజును నీవు నీ కోఱలతో కాటు వేయుము. నేను నా మంత్రశక్తితో మరల బ్రతికింతును. ఇందే మాత్రము సందేహములేదు.' అని కశ్యపుడు వచించెను. 'అనఘా! నేను కాటు వేసిన రాజును మరల బ్రతికింపగలవేని తొలుత నీ మంత్రశక్తి చూపుము ఏదీ చూతము. ఇదిగో ఇపుడే యీ మఱ్ఱిచెట్టును నా విసపు కోఱలచే గాటువేతును. దీనిని బ్రతికించుము చూతము' తన తక్షకునితో నీవా చెట్టును కాటువేసి మొత్తము బూది చేసినను సరే; నేను మరల దానికి ప్రాణము పోయగలనని కశ్యపుడు పలికెను. సూతః : అదశ త్పన్నగో వృక్షం భస్మసాచ్ఛ చకార తమ్ | ఉవాచ కశ్యవం భూయో జీవయైనం ద్విజోత్తమః 10 దృష్ట్యా భస్మీకృతం వృక్షం పన్నగేన విషాగ్నినా | సర్వం భస్మ సమాహృత్య కశ్యపో వాక్య మబ్రవీత్. 11 వశ్య మంత్రబలం మే%ద్య న్యగ్రోధం పన్నగోత్తమ | జీవయామ్యద్య వృక్షం వై వవ్యతస్తే మహావిష. 12 ఇత్యుక్త్వా జలమాదాయ కశ్యపో మంత్రవిత్తమః | సిషేచ భస్మరాశిం తం మంత్రతేనైవ వారిణా. 13 తద్వారిసేచనా జ్ఞాతో న్యగ్రోధః పూర్వవ చ్ఛుభః | విస్మయం తక్షకః ప్రాప్తో దృష్ట్వా తవ జీవితం నగమ్. 14 త మహ కశ్యపం నాగః కిమర్థం తే పరిశ్రమః | సంపాదయామి తం కామం బ్రూహి బాడవ | వాంఛితమ్. 15 వెంటనే తక్షకు డాచెట్టును తన విషజ్వాలలతో గాల్చి బూదిసేసి 'ఓ విప్రా! దీనిని బ్రతికించి నీ మంత్ర ప్రభావము చూపు' మని కశ్యపునితో నన బూదినంతటిని ప్రోగుచేసి ' ఓ నాగరాజా! విషదరా! నేనిపు డీ మఱ్ఱిచెట్టును నీకండ్లముందే నా మంత్రశక్తితో మరల బ్రతికింతును. చూతువుగాని నా శక్తి' అని మంత్రవిదుడగు కశ్యపుడు తన చేతిలోనికి జలము తీసి కొని మంత్రించి యా మంత్రజలమును భస్మరాశిపై చల్లెను. మంత్ర పూతమగు జలము తగులగనే బూడిద పచ్చనిచెట్టుగ మారెను. ఆ చెట్టు ఎప్పటియట్టులనుండుట గని తక్షకుడు విస్తుపోయెను. అపుడు తక్షకుడు కశ్యపునితో 'నీ వింత శ్రమ యేల జెందుచున్నావు? నీ మానోవాంఛితమేమి? తెలుపుము. దానిని నేను సమకూర్తును.' అనెను. కశ్యపః : విత్తార్థీ నృపతిం మత్వా శప్తం పన్నగ నిఃసృతః | గృహాదహం చోపకర్తుం విద్యయా నృపసత్తమమ్. 16 తక్షకః ! విత్తం గృహాణ విప్రేంద్ర యావదిచ్ఛసిపార్థివాత్ | దదామిస్వగృహం యాహిసకామో%హంభవామ్మతః. 17 సూత:ః తచ్ఛ్రుత్వా వచనం తస్య కశ్యపః పరమార్థవిత్ | చింతయామాస మనసా కిం కరోమి పునః పునః 18 ధనం గృహీత్వా స్వగృహం ప్రయామి యద్యహం పునః | భవిష్యతి న మే కీర్త ర్లోకేలోభసమాశ్రయాత్. 19 జీవితే%థ నృప| శేష్ఠ్రే కీర్తిః స్యా దచలా మమ | ధనప్రాప్తిశ్చ బహుధా భ##వే త్పుణ్యం చ జీవనాత్. 20 రక్షణీయం యశః కామం ధిగ్ధనం యశసా వినా ! సర్వస్వం రఘుణా పూర్వుం దత్తం విప్రాయ కీర్తయే. 21 హరిశ్చంద్రేణ కర్ణేన కీర్త్యర్థం బహువిస్తరమ్ | ఉపేక్షేయం కథం భూవం దహ్యమానం విషాగ్నినా. 22 జీవితే %ద్య మయా రాజ్ఞి సుఖం సర్వజనస్య చ | అరాజకే ప్రజానోశో భవితా నాత్ర సంశయః. 23 ప్రజానాశస్య పాపం మే భవిష్యతి మృతే నృపే | అపకీర్తిశ్చ లోకేషు దనలోభా ద్భవిష్యతి. 24 ఇతి సంచింత్య మనసా ధ్యానం కృత్వా స కశ్యపః | గతాయుషం చ నృపతిం జ్ఞాతవా న్భుద్ధిమత్తరః. 25 ఆసన్నమృత్యుం రాజానం జ్ఞాత్వా ధ్యానేన కశ్యపః | గృహం య¸° స ధర్మాత్మా ధన మాదాయ తక్షకాత్. 26 అనగా కశ్యపుడు 'ఓ పాపఱడా! నేను ధనార్థిని. రాజు శపింపబడెనని విని వచ్చితిని. నా విద్యను ప్రదర్శించి నృపసత్తముని బ్రదికించి ధనము బడయదలచితిని.' తక్షకుడు అనెను : ఓ విప్రేంద్రా ! ఆ రాజు నుండి నీవు కోరునంత ధనము నే నేనిత్తును. తీసికొని నీ యింటి కేగుము. దీనివలన మన యిరువుర కోరికలను దీరును. అని తక్షకుడు విప్రునితో పలికెను. పరమార్ఖ విదుడగు కశ్యపు డతని మాటలు విని యిపుడేమి చేతునా యని మాటి మాటికిట్టు లాలోచించెను: 'నేనొకవేళ లోభమునకు దాసుడనై డబ్బు తిని నా యింటికేగినచో నాకీ లోకమున కీర్తి గలుగదు. అట్లుగాక నా వలన రాజు జీవించెనేని నాకు శాశ్వతకీర్తిచేకూరును. దీనివలన ధనప్రాప్తి - పుణ్యలాభము - రెండును గల్గును. కనుక కీర్తినే సంపాదించుట మంచిది. కీర్తిలేని ధనమేల? అది వ్యర్థము. మునుపు రఘమహారాజు యశోధనమునకై తన దనమంతయు నొక బ్రాహ్మణునకు సమర్పించెను. హరిశ్చంద్ర కర్ణులును చెడని యశము గడించిరి. విషాగ్నిచే కాలిచచ్చు రాజును గని యెట్లూరకుండను? నా మూలమున రాజు జీవించినచో జనులకందఱకును క్షేమము సమకూరును. కానిచో దేశమున నరాజకము ప్రబలి సర్వనాశమగు ననుటలో సందియములేదు. రాజు చనిపోవగ ప్రజానాశము గల్గును. ఆ పాపము నన్ను చుట్టుకొనును. ఈ ధనలోభమున నాకు తీరని యపకీర్తియు గల్గును.' అని తలంచి ధీశాలియు ధర్మాత్ముడనగు ఆ కశ్యపుడు ధ్యానములో మునింగి రాజు మరణించనున్నట్లు గ్రహించెను. తక్షకునివలన ధనముగొని తన యింటి కేగెను. నివర్త్య కశ్యపం సర్పః సప్తమే దివసే నృపమ్ | హంతుకామో జగామాశు నగరం నాగసాహ్వయమ్. 27 శుశ్రావ నగరస్యాంతే ప్రాసాదస్థం పరీక్షితమ్ | మఱిమంత్రౌషధైః కామం రక్ష్యమాణ మతంద్రితమ్. 28 చింతావిష్ట స్తదా నాగో విప్రశాపభయాకులః | చింతయామాస యోగేన ప్రవిశేయం గృహం కథమ్. 29 వంచయామి కథం చైనం రాజానం పాపకారిణమ్ | విప్రశాపా ద్ధతం మూఢం విప్రపీడాకరం శఠమ్. 30 పాండవానాం కులే జాతః కో%పి నైతాదృశో భ##వేత్ | తాపసస్య గలే యేనమృతః సర్పో నివేశితః. 31 కృత్వా విగర్హితం కర్మ జాన న్కాలగతిం నృపః | రక్షకా న్భవనే కృత్వా ప్రాసాద మభిగమ్యచ. 32 మృత్యుం వంచయతే రాజా వర్తతే%ద్య నిరాకులః | తం కథం ధక్షయిష్యామి విప్రవాక్యేన చోదితః. 33 న జానాతి చ మందాత్మా మరణ హ్యనివర్తనమ్ | తేనాసౌ రక్షకా న్ధ్పాప్య సౌధారూఢ్యో%ద్య మోదతే. 34 యది వై విహితో మృత్యు ర్దైవేనామితతేజసా | స కథం పరివర్తేత కృతై ర్యత్నైస్తు కోటిభిః. 35 పాండవస్య చా దాయాదో జాన న్మృత్యుం గతం నృవః | జీవనే మతి మాస్థాయ స్థితః స్థానే నిరాకులః. 36 దానపుణ్యాదికం రాజా కర్తు మర్హతి సర్వథా | ధర్మేణ హన్యతే వ్యాధి ర్యేనా %%యుః శాశ్వతం భ##వేత్. 37 నో చే న్మృత్యువిధిం కృత్వా స్నానదానాదికాః క్రియాః | మరణం స్వర్గలోకాయ నరకాయాన్యథా భ##వేత్. 38 ద్విజపీడాకృతం పాపం పృథగ్వా %స్య చ భూపతేః | విప్రశాప స్తథా ఘోర ఆసన్నే మరణ కిల. 39 న కో%పి బ్రాహ్మణః పార్శ్వే య ఏనం ప్రతిబోధయేత్ | వేధసా విహితో మృత్యు రనివార్యస్తు సర్వథా. 40 ఈ విధముగ తక్షకుడు కశ్యపు నతని యింటి మొగము పట్టించి పిదప రాజును చంపుటకై యత డేడవనాటికి హస్తిపురి కేగెను. తక్షకు డాపురముజేరి పరీక్షిత్తు పై మేడపై మణిమంత్రౌషధులచేత రక్షింపబడుచున్నాడని విని యిట్లాలోచించెను: రాజును చంపకున్నచో నాకు విప్రశాపము గలుగునను భయము గలదు. నే నీ మేడలోని కేయోగమున జేర గలను? ఈ రాజు విప్రశాపహతుడు; ముని పీడాకరుడు; పాపి; శఠుడు. నే నితని నెటుల వంచింపగలను? ఈ నాటివఱకీ పాండవుల కులమున నొక ముని మెడలో చచ్చిన పామును వేసిన వాడు పుట్టనేలేదు. ఈ రాజు నింద్యమైన పని చేసెను. ఇతనికి కాలగతి తెలియనదిగాదు. ఐనను నాత్మరక్షకుల నియోగించి చివరి మేడలో దాగుకొనియున్నాడు. ఇతడు మృత్యువునే మోసగింపదలచుచు నిశ్చింతగనున్నాడు. నేనొక విప్రునిచేత ప్రేరింపబడితిని. ఇప్పుడితనిని కాటువేయు నుపాయమేది? పాప మారాజు మందమతితో చావు తప్పనిదని తెలియక కాబోలు తన చుట్టును రక్షకుల నిలుపుకొని మేడపై ప్రమోదించున్నాడు. ఒకవేళ బలీయమైన దైవమువలన చావు నిశ్చితమైనచో కోటి ప్రయత్నములు చేసినను ఫలితము సున్న. చావు తప్పింపరాదు. ఇతడు పాండవుల గొప్ప వంశములో బుట్టియు చావుగతి నెఱిగియు జీవితాశ వదలుటలేదు. పైగ నెంత నిశ్చింతగ నున్నాడు! ఈ మంచితరుణమున రాజు దానధర్మము లాచరించుకొనుట మంచిది. ధర్మమువలన వ్యాధి తొలగును. చిరాయువును గల్గును. కానిచో చావు తప్పదనుకొని స్నానదానాదిక్రియలు జరిపి స్వర్గ మేగుటకు మేను చాలించుట మఱియు మంచిది. ఇట్లు పున్నెము కూడబెట్టుకొననిచో నరకము తప్పదు. ఒక బ్రాహ్మణుని యూరకే పీడించిన పాపము' విప్రుని ఘోరశాపము అను నీ రెంటివలనను నితనికి మృత్యువు సన్నిహితమైనది. ఇప్పుడితని నోదార్చుట కొక్క విప్రుడైన లేడు. విధి విధించిన చావునకు తిరుగులేదు. ఇతి సంచింత్య సర్పో% సౌ స్వా న్నాగాన్నికటే స్థితాన్ | కృత్వాతాపసవేషాం స్తాప్ప్రాహిణోత్సుభుజంగమాన్. 41 ఫలమూలాదికర గృహ్య రాజ్ఞే నాగో%థ తక్షకః | స్వయం చ కీటరూపేణ ఫలమధ్యే ససార హ. 42 నిర్గతాస్తే తదా నాగాః ఫలా న్యాదాయ సత్వరాః | తే రాజభవనం ప్రాప్య స్థితాః ప్రాసాదసన్నిధౌ. 43 రక్షకా స్తావసా న్దృష్ట్వా పప్రచ్చు స్త చ్చికీర్షతమ్ | ఊచు స్తే భూపతిం ద్రష్టుం ప్రాప్తాః స్మో%ద్య తపోవనాత్. 44 అభిమన్యుసుతం వీరం కులార్కం చారుదర్శనమ్ | పరివర్ధయితుం ప్రాప్తా మంత్రై రాథర్వణౖ స్తథా. 45 నివేదయధ్వం రాజానం దర్శనార్థాగతా న్మునీన్ | కృత్వా%భిషేకా న్యాస్యామో దత్త్వా మిష్టఫలానిచ. 46 భారతానాం కులే క్వా పి న దృష్టా ద్వారరక్షకాః | న శ్రుతం తాపసానాం త రాజ్ఞో%సందర్శనం కిల. 47 ఆరోహామో వయం తత్ర రాజా పరీక్షితః | ఆశీర్భి ర్వర్థయిత్వైనం దత్తాజ్ఞాః ప్రవ్రజామహే. 48 తక్షకుడు ఇట్లాలోచించి తన చెంతనున్న నాగులను తాపసమేషములు ధరింపజేసి రాజుకడ కంపెను. పిమ్మట తక్షకుడు తానును రాజుకొఱకు మంచి ఫలామూలాదులు గొనివచ్చెను. తానందలి ఒక పండులో చిన్న పురుగు రూపున దూరి యుండెను. సత్వరమే నాగులెల్లరు తాపసులై ఫలములుగొని వెడలి రాజభవనముజేరి మేడచెంత నిలుచుండ ఆ తాపసులనుగని 'మీ కార్యమే' మని భటులు వారి నడిగిరి. ''మేము రాజదర్శనార్థము తపోవనమునుండి యరుదెంచితిమి. కులదీపకుడు చారుదర్శనుడునగు పరీక్షిత్తు నాథర్వణమంత్రములతో దీవింపవచ్చినవారము. రాజుతో తమ దర్శనమునకు మును లేతెంచిరని తెలుపుడు. రాజు నభిషేకించి పిదప తీయని ఫలములిచ్చి మేమేగుదుము. భరతకులమున ద్వారపాలకులుండుట తాపసులకు రాజధర్మము లభింపకుండుట మేమింతవఱకు కనివిని యెఱుగము. పరీక్షిత్తున్న చోటికేగి యతని నాశీస్సులతో వర్ధిల్లజేసి, యతనినుండి సెలవు గైకొని వెళ్ళుదుము'' అని తాపసులు వచించిరి. సూత ఉవాచ : ఇత్యాకర్ణ్య వచస్తేషాం తాపసానాంతు రక్షకాః | ప్రత్యూచు స్తాన్ద్విజా న్మత్వా నిదేశం భూపతేర్యథా. 49 నాద్య వో దర్శనం విప్ర! రాజ్ఞః నోమతిః | శ్వః సర్వతాపసై రత్ర త్వాగంతవ్యం నృపాలయే. 50 ఆనారోహస్తు ప్రాసాదో విప్రాణాం మునిసత్తమా | విప్రశాపభయా ద్రాజ్ఞా విహితో%స్తి నసంశయః. 51 తదోచు స్తానథో విప్రాః ఫలమూలజలానిచ | విప్రాశిషశ్చ రాజ్ఞే%థే గ్రాహయంతు సురక్షకాః. 52 తేగత్వా నృపతిం ప్రోచు స్తాపసా నాగతాన్జనాః | రాజోవాచా%%నయధ్వంవై ఫలమూలాదికంచ యత్. 53 పృచ్ఛధ్వం తాపసా న్కార్యం ప్రాతరాగమనం పునః | ప్రణామం కథయద్వం మే నాద్య సందర్శనం మమ. 54 తేగత్వా%థ సమాదాయ ఫలమూలాదికం చ యత్ | రాజ్ఞే సమర్పయామాసు ర్బహుమాన్ పురఃసరమ్. 55 గతేషు తేషు నాగేషు విప్రవేషావృతేషు చ | ఫలాన్యాదాయ రాజా%సౌ సచివా నిదమబ్రవీత్. 56 సుహృదో భక్షయంత్వద్య ఫలాన్యేతాని సర్వశః | అద్మ్యహం చైక మేతద్వై ఫలం విప్రార్బితం మహత్. 57 ఇత్యుక్త్వా తత్ఫలం దత్వా సుహృద్భ్య శ్చోత్తరా సుతః | కరే కృత్వా ఫలం పక్వం దదార నృపతిః స్వయమ్. 58 ఆ మాటలు విని వారిని విప్రులుగ నెఱింగి రక్షకులు విప్రులారా! నేడు రాజదర్శనముగాదు. రేపు ఉదయమున నెల్ల తాపసులు రాజభవనముకు రండు. విప్రశాపభయమున రాజు రక్షితుడై యున్నాడు. ఇపుడీ మేడపై కెక్కుట తగదు. మా మాట నిజము. అని రక్షకులు వారికి రాజాదేశమును వినిపించిరి. భటులారా రక్షకులారా! మా ఫలమూలములు నాశీస్సులు స్వీకరింపవలయునని రాజునకు మా మాటగ జెప్పుడని మునులు మరల రక్షకులతో ననగా భటులేగి రాజునకు తాపసుల రాకను వారి మాటలను తెల్పిరి. 'వారి ఫలమూలాదులు తెండు. వారి రాకకు కారణ మడుగుడు. ఆ తాపసులకు నా ప్రణామములని జెప్పుడు. వారిని రేపుదయమున రమ్మనుడు. నేడు నా దర్శనము గాదని చెప్పు'డని రాజ భటుల నాదేశించెను. వెంటనే భటులు వెళ్ళి మునుల ఫలమూలాదులు తీసికొని సాదారముగ కానుకగ వానిని రాజునకు సమర్పించిరి. విప్రవేషధారులగు నాగులు వెళ్ళిన పిదప ఫలములు తీసికొని రాజు తన మంత్రులతో ఓ సుహృత్తులారా! ఈ పండు మీరు భక్షింపుడు. నేనుగూడ విప్రులొసంగిన వాని నుండి యొక ఫల మారగింతును అని తన ప్రియజనులకు పండ్లొసగి తానొక పండు చీల్చి చూచెను. విదారితం ఫలం రాజ్ఞా తత్ర క్రిమి రభూ దణుః | స కృష్ణనయన స్తామ్రో దృష్టో భూపతినా స్వయమ్. 59 తందృష్ట్వా నృపతిః ప్రాహ సచివా న్విస్మితానథ | అస్త మభ్యేతి సవితా విషాదద్య నమే భయమ్. 60 అంగీకరోమి తంశాపం కృమికో మాం దశత్వయమ్ | ఏవముక్త్వా స జేంద్రో గ్రీవాయాం సంస్యవేశయత్ 61 అస్తం యాతే దివానాథే ధృతః కంఠే%థ కీటకః | తక్షకస్తు తదా జాతః కలరూపో భయానకః. 62 రాజా సంవేష్టిత స్తేన దష్టశ్చాపి మహీపతిః | మంత్రిణో విస్మయం ప్రాప్తా రురుదు ర్భృశదుఃఖితాః. 63 ఘోరరూపమహిం వీక్ష్య దుద్రువుస్తే భయార్దితాః | చుక్రుశూ రక్షకాః సర్వే హాహాకారో మహానభూత్. 64 వేష్టితో భోగిభోగేన వినష్టబహుపైరుషః | నోవాచ నృపతిః కించి న్నచచాలోత్తరాసుతః. 65 ఉత్థితా%గ్ని శిఖా ఘోరా విషజా తక్షకాననాత్ | ప్రజజ్వాల నృవం త్వాశు గత ప్రాణం చకార హ. 66 హృత్వా%% శు జీవితం రాజ్ఞ స్తక్షకో గగనేగతః | జగద్దగ్ధంతు కుర్వాణాం దదృశు స్తం. జనా ఇహ. 67 స వపాత గతప్రాణో రాజా దగ్ధఇవ ద్రుమః | చుక్రుశుశ్చ జనాః సర్వే మృతం దృష్ణ్వా నరాధివమ్. 68 ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ ద్వితీయస్కంధే దశమో%ధ్యాయః. దానిలో నల్లనికన్నులు తామ్రవర్ణముగల యొక చిన్నపురుగు రాజు కంటబడెను. దానినిగని మంత్రులును విస్మితులైరి. అపుడు వారితో రాజు 'ఇపుడు సూర్యు డస్తమించును. ఇక తక్షక విషమునకు నేను ధయపడనేల? నేనిపు డమోఘ విప్రశాప మంగీకరింతును. ఈ పురుగు నన్ను కరచుగాక!' అని రాజు దానిని తన కంఠమున నిలుపుకొనెను. రవి యస్తమించువేళకు రాజు తన మెడకు తగిలించుకొనిన కీటకము గ్రక్కున భయంకర కాలరూపడగు తక్షకుడుగానయి రాజు మెడచుట్టును చుట్టుకొని కాటువేసెను. మంత్రులెల్లరును విస్మితులై మిక్కిలి దురపిల్లిరి. ఆ ఘోరరూపముగల నాగరాజునుగని యెల్లరును భయపడి పరుగెత్తిరి. రక్షకులు గొల్లున నేడ్చిరి. పెల్లుగ హాహాకారములు మిన్ను ముట్టెను. పరీక్షిత్తా విధముగ పాము పడగచేత జుట్టబడి పౌరుషముసెడి కదలక మాటాడలేక పడిపోయెను. తక్షకుని విషాగ్ని జ్వాలలు చెలరేగినవి. అవి రాజును గాల్చి నిలువున ప్రాణాలు తీసినవి. తక్షకుడట్లు రాజు ప్రాణములు తీసి వినువీధి కెగిరెను. అతడు తన మాటలచే జగములచే కాల్చునేమో యని చూపఱకు తోచెను. రాజు కాలిపడిన చెట్టువలె ప్రాణాలు వదలి నేలగూలెను. జనులందఱు మృతుడయిన రాజునుగాంచి ఎట్టు విలపించిరి. ఇది శ్రీదేవీ భాగవతమందలి ద్వితీయ స్కంధమున దశమాధ్యాయము.