Sri Devi Bhagavatam-1
Chapters
అథ ద్వాదశో%ధ్యాయః సూతః : తచ్ఛ్రుత్వా వచనం తస్య వ్యాస స్సత్యవతీసుతః | ఉవాచ వచనం తత్ర సభాయాంనృపతిం చతమ్.
1 వ్యాసః : శృణు రాజ న్ప్రవక్ష్యామిపురాణం గుహ్యమద్భుతమ్ | పుణ్యం భాగవతం నామం నానాఖ్యానయుతంశివమ్. 2 అధ్యాపితం మయా పూర్వం శుకాయాత్మసుతాయ వై | శ్రావయామి నృపత్వాం హి రహస్యం పరమం మమ. 3 ధర్మార్థకామమోక్షాణాం కారణం శ్రవణా త్కిల | శుభదం సుఖదం నిత్యం సర్వాగమసముద్ధృతమ్. 4 జనమేజయః : ఆస్తికో%యం సుతఃకస్యవిఘ్నార్థం కథామాగతః | ప్రయోజనం కిం మతోస్యసర్పాణాంరక్షణప్రభో! 5 కథయైత న్మహాభాగ విస్తరేణ కథానకమ్ | పురాణం చ తథా సర్వం విస్తరా ద్వద సువ్రత. 6 వ్యాసః : జరత్కారుర్ముని శ్శాంతో న చకార గృహాశ్రమమ్ | తేన దృష్టా వనే గర్తేలంబమానా స్ప్వపూర్వజాః. 7 తత స్త మాహు ః కురు పుత్ర దారా న్యథా చ న ః స్యాత్పరమా హి తృప్తిః | స్వర్గే ప్రజామః ఖలు దుఃఖముక్తా వయం సదాచారయుతే సుతే వై. 8 స తనువాచాథ లభే సమానా మయాచితాం చాతివశానుగాం చ | తదా గృహారంభ మహం కరోమి బ్రవీమి తథ్యం మమ పూర్వజా వై. 9 ఇత్యుక్త్వా తా న్జరత్కారు ర్గత స్తీర్థా న్ప్రతి ద్విజః | తదైవ పన్నగా శ్శప్తా మంత్రాగ్నౌ నిపతం త్వితి. 10 పండ్రెండవ అధ్యాయము ఆస్తీకమహాముని జన్మవృత్తాంతము సూతుడిట్లనెను : జనమేజయుని మాటలు విని వ్యాసుడు పేరోలగమునందు రాజుతో నిట్లనెను : రాజా ! పుణ్యము శివము రహస్యమునైన శ్రీదేవీ భాగవత పురాణమును తొల్లి నా కుమారుడగు శుకునిచే చదివించితిని. నేను రచించిన ఆ పరమరహస్య రచన మిపుడు నీకు వినిపింతును, వినుము. అది పెక్కు కథలతో రసభరితమై యలరారుచున్నది. ధర్మార్థ కామమోక్షములకు కాణాచి. సకల వేదముల రసాయనము. దానిని వినుటవలన నిత్యశుభములు సుఖములు చేకూరును. ఆంత జనమేజయుడు ఈ యాస్తీకు డెవరి పుత్త్రుడు ? ఇతడు యాగవిఘ్న ము చేయుట కేలవచ్చెను? సర్పరక్షణమున నీతని కేమి లాభము గల్గును? అదియంతయు దెలిపి పిదప శ్రీదేవీ పురాణ కథానకమంతయు నాకు విశదముగ దెలుపుము అనెను. వ్యాసుడిట్లనెను: 'తొలుత జరత్కారుడను శాంతుడగుముని గార్హస్థ్యము స్వీకరింపలేదు. అందువలన నతని పూర్వజులు పెద్దగుంటలో వ్రేలాడుచుండిరి. వారిని గాంచి జరత్కారువు దానికి కారణ మడుగగ 'పుత్త్రా ! నీవు పెండ్లి యాడినచో మే మీ యిక్కటులబాసి తృప్తిజెంది స్వర్గమేగుదుము. నీవు సదాచారివి గమ్ము' అని వారనిరి. పూర్వజులారా! నాతో సమానమైన నామము గలిగి యనుకూలయైన కన్య నేను కోరకయే లభించినచో నామెను తప్పక పెండ్లియాడి గృహస్థ జీవితము సాగింతును' అని వారితో పలికి జరత్కారుడు తీర్థాటనమున కేగెను. కశ్యపస్య మునేః పత్న్యౌ కద్రూశ్చ వినతా తథా | దృష్ట్వా%%దిత్యరతే చాశ్వమూచతుశ్చ పరస్పరమ్. 11 తం దృష్ట్వా చ తదా క్రదూ ర్వినతామిదమ బ్రవీత్ | కింవర్ణో%యం హయోభ##ద్రేః సత్యం ప్రబ్రూహిమాచిరమ్. 12 వినతోవాచ: శ్వేత ఏవాశ్వరాజో%యం కిం వాత్వం మన్యసేశుభే | బ్రూహివర్ణం త్వమప్యస్యతతస్తువిపణావహే. 13 కద్రూః : కృష్ణవర్ణ మహం మన్యే హయ మేనం శుచిస్మితే | ఏహి సార్థం మయాదిత్యం దాసీభావాయ భామిని. 14 సూతః : కద్రూశ్చ స్వసుతానాహసర్వాన్సర్పాన్‌వశేస్థితాన్ | వాలాన్ శ్యామాన్ప్రకుర్వంతు యావతో%శ్వశరీరకే. 15 నేతి కేచన తత్రాహు స్తా నథాసౌ శశావ హ | జనమేజయస్య యజ్ఞే వై గమిష్యథ హుతాశనమ్. 16 అన్యే చక్రుర్హయం సర్పాః కర్బురం వర్ణభోగకై ః | వేష్టయిత్వా%స్య పుచ్ఛం తు మాతుః ప్రియచికీర్షయా. 17 భగిన్యౌ చ సుసంయుక్తే గత్వా దదృశతు ర్హయం | కర్బురం తం హయం దృష్ట్వా వినతా చాతిదుఃఖితా. 18 తదా%%జగామ గురుడః సుత స్తస్యా మహాబలః | స దృష్ట్వా మాతరం దీనా మపృచ్చ త్పన్నగావనః. 19 మాతః కథం సుదీన%సి రుదితేవ విభాసి మే | జీవమానే మయి సుతే తథా%న్యే రవిసారథౌ. 20 దుఃఖితో%సి తతో వాం ధిక్ జీవితం చారులోచన | కిం జాతేన సుతేనాథ యది మాతా సుదుఃఖితా. 21 శంస మే కారణం మాతః కరోమి విగతజ్వరామ్ | వినతోవాచః: సపత్న్యాదాస్యహం పుత్ర ! కిం బ్రవీమివృథాక్షతా | వహమాం సాబ్రవీద్యచ్ఛతేనాస్మిదుఃఖితాసుత. 22 గరుడః : వహిష్యే%హంత్రకిలయత్రసాగంతుముత్సుకా | మాశోకంకురుకల్యాణి! నిశ్చింతాంత్వాంకరోమ్యహమ్. 23 వ్యాసః ఇత్యుక్తా సా గతా పార్మ్వం కద్రోశ్చ వినతా తదా. 24 అదే సమయమున నాగము నగ్నిలో బడుడని వారి తల్లి శపించెను. అదెట్లన - కశ్యప మహర్షికి కద్రూవినతలను నిర్వురు భార్యలుండిరి. వారొకమారు సూర్యుని రథాశ్వమును చూచి పరస్పర మిట్లు భాషించుకొనిరి: మొదట కద్రువ : 'ఆ గుఱ్ఱము వర్ణమేమో త్వరగ దెలుపుము' వినత : ఆ గుఱ్ఱము తెల్లగనున్నది. నీవే రంగుగలదని తలతువో తెలుపుము. అపు డిద్దఱము పందెము వేసికొందము. కద్రువ : శుచిస్మితా! అది నల్లని వర్ణము గలది. మనలో నెవరిమాట తప్పగునో వారు రెండవవారిని దాస్యము చేయవలయును. పిమ్మట కద్రువ తన మాట జనదాటని పాములతో 'మీరు గుఱ్ఱము తోకకు చుట్టుకొని దానిని నల్లనిదిగ జేయుడు' అనెను. కొన్ని పాములు తమ తల్లికి ప్రియము సేయు తలంపుతో తమ నల్ల పడగలతో గుఱ్ఱముతోక చుట్టును చుట్టుకొని దానిని నల్లగ జేసినవి. తన మాట విననివారిని జనమేజయుని సర్పయాగమున కాహుతి గండని కద్రువ శపించెను. అపుడక్కసెల్లెండ్రిద్దఱును గలిసి వెళ్ళి మఱల గుఱ్ఱమును గాంచిరి. వారి కపుడది నల్లగ దోచెను. అపుడు వినత మిక్కిలి పరితపించినది. వినత కుమారుడు గరుటామంతుడు. మహాసత్త్వుడు. అతడు తన తల్లి దైన్యమును గని 'జననీ! ఆ సూర్యసారథి - నేను - మే విర్వుర మింకను బ్రతికియుండగ నీ వింతగ దీనముగ నుండగనేల? ఓ తల్లీ! మా కనులముందు మము కడుపు పంటగ కన్న నీవు కంటతడిబెట్టుకొన్న మా జీవితాలు వ్యర్థములు గద! తల్లి కడగండ్ల పాలయినచో నామె సుతుడు బ్రతికి యేమి లాభము? కావున నీ దైన్యకారణము దెల్పుము. వెంటనే నీ దుఃఖము తొలగింపజేతును' అని పలికెను. అన వినత 'కుమారా! నేను నా సవతికి దాసినై బాధ పడుచున్నాను. ఇంకేమి చెప్పవలయును? ఇంతేకాక తన నచ్చినచోటి కామె తన్ను నన్ను మోసికొని పొమ్మనుచున్నది' అనెను. గరుడుడును 'అమ్మా! ఆమె యెటు పోదలచిన నే నామెను గొనిపోవుదును. నీవు శోక ముడుగుము. నిన్ను నిశ్చింతురాలిని జేతునని వినతను కద్రువ చెంత కంపెను. దాసీభావ మపాకర్తుం గరుడో%పి మహాబలః | ఉవాహ తాం సపుత్రాం వై సింధోః పారం జగామ హ. 25 గత్వా తాం గురుడః ప్రాహ బ్రూహి దూత ర్నమోస్తు తే | కథం ముచ్యేత మే మాతా దాసీభావా దసంశయమ్. 26 అమృతం దేవలోకా త్త్వం బలా దానీయ మే సుతామ్ | సర్సయ సుతా%ద్యాశు మాతరం మోచ యబలామ్. 27 వ్యాసః : ఇత్యుక్తః ప్రయ¸°శీఘ్రమింద్రలోకం మహాబలః | కృత్వా యుద్ధం జహారాశుసుధాకుంభంఖగోత్తమః. 28 సమానీయామృతం మాత్రే వైనతేయః సమార్పయత్ | మోచితా వినతా తేన దాసీభావా దసంశయమ్. 29 అమృతం సంజహారేంద్రః స్నాతుం సర్పా యదాగతాః | దాసీభావా ద్వినిర్ముక్తా వినతా విపతే ర్బలాత్. 30 తత్రాస్తీర్ణాఃకుశాసై#్తస్తు లీఢాః పన్నగనాయకైః | ద్విజిహ్వాస్తే సుసంపన్నాః కుశాగ్రస్పర్శమాత్రతః. 31 మాత్రా శప్తాశ్చ యే నాగా వాసుకి ప్రముఖాః శుచా | బ్రహ్మాణం వరణం గత్వా తే హోచు శ్శాపజం భయమ్. 32 గరుత్మంతుండు తన తల్లికి దాస్యముక్తి గల్గించదలచి కద్రువను నామె పుత్త్రులను సముద్రతీరమునకు మోసికొని పోయి కద్రువకు నమస్కరించి 'ఓయమ్మా! మాయమ్మ దాసత్వమునుండి యెట్లు విమోచనము బొందునో నిజము తెలుపు' మనెను. కద్రువ 'నీవు దేవలోకమేగి నీ బలము చూపి యమృతము తెచ్చి మా కర్పించుము. నీ తల్లిని దాస్యమునుండి విడిపించుకొనుము' అనెను. ఆ మాటలు విని గరుత్మంతుడు వేగముగ నింద్రలోక మేగి యచ్చటివారితో బోరి యమృతకలశము గ్రహించి తెచ్చి తన తల్లి కీయగా వినత తన బానిసతనమునుండి విడుదల బొందెను. ఇట్లు వినత తన బిడ్డ యగు పక్షిరాజు సమర్థతచే దాస్యముక్తయై దుఃఖభారము దించుకొనెను. ఇట్లు గరుడుడును తల్లి గౌరవము నిలువబెట్టెను. నాగములు స్నానము చేయుట కేగిన యదను గనిపెట్టి యింద్రు డమృతభాండ మెత్తుకొనిపోయెను. పాములు వచ్చి దర్భలకంటుకొన్న సుధ నాస్వాదించుటకు కుశాగ్రములు నాకినందున వాని నాల్కలు రెండుగ చీలి నాటినుండి అవి ద్విజిహ్వములైనవి. మున్ను తల్లిచే శపింపబడిన వాసుకి మున్నగు పన్నగములు హిరణ్యగర్భుని శరణువేడి తమ శాపభీతి చెప్పుకొన - తానాహ భగవాన్ బ్రహ్మా జరత్కారు ర్మహామునిః | వాసుకే ర్భగినీం తసై#్మ ఆర్పయధ్వం సనామికామ్. 33 తస్యాం యో జాయతే పుత్రః స వస్త్రాతా భవిష్యతి | ఆస్తీక ఇతి నామ్నా %సౌ భవితా నాత్ర సంశయః. 34 వాసుకి స్తు తదాకర్ణ్య వచనం బ్రహ్మణ శ్శివమ్ | వనం గత్వా సుతాం తసై#్మ దదౌ వినయపూర్వకమ్. 35 సమానాం తాం మునిర్జాత్వాజరత్కారు రువాచ తమ్ | అప్రియం మే యదాకుర్యాత్తగా తాం సంత్యజామ్యహమ్. 36 వాగ్బంధం తాదృశం కృత్వాముని ర్జగ్రాహ తాం స్వయమ్ | దత్వాచ వాసుకిః కామం భవనం స్వం జగామహ. 37 కృత్వా పర్ణకుటీం శుభ్రాం జరత్కారు ర్మహావనే | తయా సహ సుఖం ప్రాప రమమాణః పరంతప. 38 ఏకదా భోజనం కృత్వా సుప్తో%సౌ మునిసత్తమః | భగినీ వాసుకై స్తత్ర సంస్థితా వరవర్ణినీ. 39 న సంబోధయితవ్యోహం త్వయా కాంతే కథంచన | ఇత్వుక్త్వా తు గతో నిద్రాం ముని స్తాం సుదతీ తదా. 40 ధాత వానితో 'జరత్కారు డను ముని గలడు. మీ రతని పేరుగల నాగకన్య నా ముని కుమారున కర్పింపుడు. వారికి బుట్టినవాడు మీ క్లేశములు గట్టెక్కించగలడు. అత డాస్తీక నామమున బరగును. ఇది నిజము' అని పలికి వారికి ధైర్యము చెప్పెను. బ్రహ్మివాక్కులు విని వాసుకి వనమునకు తిరిగి వచ్చి తన జరత్కారువను సోదరి నా జరత్కారు మునికి వినయముగ నప్పగించెను. అతడు తనతో సమనామరూపములుగల దానిగ జరత్కారువు ఎఱిగెను. ఆమె తన కప్రియము చేసినచో నామెను విడిచిపుత్తునని పలికి ఆ యొడంబడికతో ముని యామెను చేపట్టెను. వాసుకి యామె నతని కప్పగించి తన యింటి కేగెను. అంత జరత్కారు డా మహావనమందు పర్ణకుటీర మేర్పరచుకొని అందు జరత్కారువను పత్నితో నానందించసాగెను. ఒకనా డా ముని భోజనము చేసి నిద్రించెను. అపుడు జరత్కారు వతని చెంతనే యుండెను. ముని 'తన్నెట్టి పరిస్థితిలోను మేలుకొలుపవద్ద'ని భార్యతో జెప్పి నిదురించెను. అంతలో సూర్యు డస్తగిరి కేగెను. సంధ్యా వందన సమయ మయ్యెను. రవి రస్తగిరం పాప్తః సంధ్యాకాల ఉవస్థితే | కిం కరోమి న మేశాంతి స్త్యజే న్మాం బోధితః పునః. 41 ధర్మలోపభయా ద్భీతా జరత్కారు రచింతయత్ | నో చే త్ప్రబోధయామ్యేనం సంధ్యాకాలోవృథా వ్రజేత్. 42 ధర్మనాశా ద్వరంత్యాగస్తథాపి మరణం ధ్రువమ్ | దర్మహాని ర్నరాణాం హి నరకాయ భ##వే త్పునః. 43 ఇతి సంచింత్య సా బాలా తం మునింప్రత్యబోధయత్ | సంధ్యాకాలోపి సంజాత ఉత్తిష్ఠోత్తిష్ట సువ్రత. 44 ఉత్థితో%సౌ మునిం కోపాత్తామువాచ వ్రజామ్యహమ్ | త్వం తు భ్రాతృగృహం యాహి నిద్రావిచ్చేదకారిణ. 45 వేపమానా%బ్రవీద్వాక్యమిత్యుక్తో మునివా తదా | భ్రాత్రా దత్తా తదర్థం తత్ కథం స్యాదమితవ్రభా. 46 మునిః ప్రాహ జరత్కారుం తదస్తీతి నిరాకులః | గతా సా మునినా త్యక్తా వాసుకే స్సదనం తదా. 47 వృష్టా భ్రాత్రా%బ్రవీద్వాక్యం యథోక్తం పతినా తదా | అస్తీత్యుక్త్వా చ హిత్వామాంగతో%సౌమునిసత్తమః. 48 వాసుకిస్తు తదాకర్ణ్య సత్యవాజ్ముని రిత్యుత | విశ్వాసం చ పరం కృత్వా భగినీం తాం సమాశ్రయత్. 49 అపుడామె తనలో 'ఇపుడు లేపినచో నన్ను తప్పక విడిచిపెట్టును. ఇపుడేమి చేతును? నాకిక శాంతి లేదు. మేల్కొల్పనిచో సంధ్యాకాలము దాటిపోవును' అని యామె ధర్మలోపమునకు భీతి జెందినది. ధర్మచ్యుతికంటె నతడు త్యజించుట మేలు. దానికంటె నా చావు మేలు. నరులకు ధర్మహానిచేత నరకము గల్గును, అని తలచి తుద కామె 'సువ్రతా! సంధ్యా సమయము సమీపించినది. ఇక మేలుకొను' మని తన పతిని మేలుకొలిపెను. అతడు లేచి కోపనుడై' ఇక నీవు నీ సోదరునింటి కేగుము. నా నిద్రాభంగ మొనర్చితివి. నా దారిని నేను పోదు'ననెను. అంతనామె భయపడుచు మునితో 'ఓమహామతీ! నా సోదరుడు నన్ను నీకు దేనికై సమర్పించెనో యదెట్లు సంభవించు'నన నత డామెతో (ఆస్తి) ఉన్నదిలెమ్మని పలికెను. ఆమె మునిచే వదలబడి వాసుకి యిల్లుజేరి తన సోదరుడుగగ నామె తన పతి (ఆస్తి) కలదని తన్ను వీడి తావెళ్ళెనని చెప్పెను. ఆమె మాటలు విని యా ముని సత్యవాది యని తలచి వాసుకి తన సోదరి నాశ్రయించియుండెను. తతః కాలేన కియతా జాతో%సౌ మునిబాలకః | ఆస్తీక ఇతి నామ్నాసౌ విఖ్యాతః కురుసత్తమ. 50 తేనాయం రక్షితో యజ్ఞ స్తవ పార్థివసత్తమ | భ్రాతృపక్షస్య రక్షార్థం మునివా భావితాత్మనా. 51 భవ్యం కృతం మహారాజ మానితో %యం త్వయా మునిః | యాయావరకులో త్పన్నో వాసుకే ర్భగినీసుతః. 52 స్వస్తితే%స్తు మహాబాహో భారతం సకలం శ్రుతమ్ | దానాని బహుదత్తాని పూజితా మునయ స్తథా. 53 కృతేన సుకృతేనాపి న పితా స్వర్గతిం గతః | పావితం న కులం కృత్స్నం త్వయా భూపతిసత్తమ. 54 దేవ్యా శ్చాయతనం భూప విస్తీర్ణం కురు భక్తితః | యేన వై సకలా సిద్ధి స్తవ స్యా జ్జనమేజయ. 55 పూజితా వరయా భక్త్యా శివా సకలదా సదా | కులవృద్ధిం కరోత్యేవ రాజ్యం చ సుస్థిరం సదా. 56 దేవీమఖం విధానేన కృత్వా పార్థివసత్తమ | శ్రీమద్భాగవతం నామ పురాణం పరమం శృణు. 57 కొంతకాలము తరువాత నామె కొక బాలుడు జన్మించెను. అతడే ఆస్తీకనామమున వన్నె కెక్కెను. అట్టి యితనిచే నిపుడీ యాగము నిలిపివేయబడుచున్నది. విజ్ఞానియగు ఆ ముని తన తల్లి పక్షము వారి నిట్లు సంరక్షించెను. వాసుకి సోదరికి బుట్టిన యాస్తీకుని నీవు చక్కగ సత్కరించితివి. ఓ మహారాజా! నీవు చాల గణనీయమైన పని చేసితివి. నీకు మేలు గలుగుత! సకల భారతము వింటిని. మునులను బూజించి వారికి భూరిదానము లొసంగితివి. జనమేజయనరపతీ! ఇంతటి పుణ్యమునగూడ నీకు శాంతి నీ తండ్రికి స్వర్గతి లభించలేదు. నీ వంశమంతయును పావనము గాలేదు. కావున శ్రీజగదంబికాదేవికి వేవేగభక్తి శ్రద్ధలతో దివ్యమందిరము నిర్మింపజేయుము. నీవు సకల శివ ప్రదాయినిని మహాదేవిని నిండు భక్తితో బూజింపుము. దానిచే నీకు సమస్తము సిద్ధించగలదు. ఆ విశ్వమాత నీకు రాజ్యసంపదలిచ్చి ధ్రువముగ నిన్నభి''వర్ధిల్ల జేయును. త్వామహం శ్రావయిష్యామి కథాం పరమపావనీమ్ | సంసారతారిణీం దివ్యాం నానారసమాహృతామ్. 58 తే సభాగ్యాః కృతప్రజ్ఞా ధన్యాస్తే నృపసత్తమ | యేసాం చిత్తే సదా దేవీ వసతి ప్రేమసంకులే. 59 న శ్రోతవ్యం పరం చాస్మా త్పురాణా ద్విద్యతే భువి | నారాధ్యం విద్యతే రాజన్ దేవీ పాదాంబుజా దృతే. 60 సుదుఃఖితా స్తే దృవ్యంతే భువి భారత భారతే | నారాధితా మహామాయా యైర్జనైశ్చ సదాంబికా. 61 బ్రహ్మాదయ స్సురాస్సర్వే యదారాధనతత్పరాః | వర్తంతే సర్వదా రాజన్ తాం న సేవేత కోజనః. 62 య ఇదం శృణుయాన్ని త్యం సర్వా న్కామాన వాప్నుయాత్ | భగవత్యా సమాఖ్యాతం విష్ణవే యదనుత్తమమ్. 63 తేన శ్రుతేన తే రాజన్ చిత్తే శాంతి ర్భవిష్యతి | పితౄణాం చాక్షయః సర్వః పురాణ శ్రవణా ద్భవేత్. 64 ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ ద్వితీయస్కందే శ్రోత్పప్రవక్తృసంయోగో నామ ద్వాదశో%ధ్యాయః. (ద్వావింశత్యధిక సంఖ్యైః పద్యై స్సప్తశ##తై శ్శుఖైః | శ్రీమద్వ్యాసముఖోద్గీతైర్ద్వితీయః స్కంధ ఈరితః.) సమాప్తోయం ద్వితీయస్కంధః. శ్రీదేవీ యజ్ఞము విధివిధానముగ నాచరించి శ్రీదేవీ భాగవత పురాణ సంశ్రవణ మొనరింపుము. అది-ఆకథ పరమపావనము-సంసారోత్తారకము-దివ్యము-నానారస సమాహారరూపము-వినిపింతును. తత్పరభావమున నాలకింపుము. ఈ పరమ దేవీపురాణముగాక వినదగినది మరొక్కటి లేదు. ఆమె పావనచరణకమలములు దప్ప భజింపదగినవి మరేవియు లేవు. ఎవరి ప్రేమసంకుల హృదయముల నాదేవి ఎల్లపుడును వసించునో వారే ధన్యజీవులు. వారే సౌభాగ్యవంతులు. వారే స్థితప్రజ్ఞులు. ఓ భారతా! ఈ పవిత్రభారత కర్మభూమిలో నా జగదంబికను సమారాధింపని మూఢులే కడగండ్లకు గురియగుదురు. బ్రహ్మాదిదేవత లెల్లరే త్రిమూర్తిరూపయగు దేవిని సంసేవించుటలో తత్పరులై నిత్యము వర్తింతురో - ఆ తల్లిని తెలిసిన వాడెవ్వడు భక్తిమీర సేవింపకుండును! పూర్వ మా భగవతి శ్రీమహావిష్ణువున కీ భాగవతము వినిపించినది. అట్టి దీని నెవడు వినునో వాని యభీష్టములు తీరును. ఈ పుణ్యపురాణ శ్రవణ పుణ్యమున నీకు చిత్తశాంతి గలిగి తీరును. నీ పితరు లక్షయ పుణ్యలోకములు జేరుదురు. ఇది శ్రీదేవీ భాగవతమందలి ద్వితీయ స్కంధమున పండ్రెండవ యధ్యాయము. ఇట్లు వ్యాసముఖమున నేడువందల యిరువదిరెండు శ్లోకములతో జెప్పబడిన శ్రీదేవీ భాగవత ద్వితీయ స్కంధము సంపూర్ణము. v v v