Sri Devi Bhagavatam-1
Chapters
అథ ద్వితీయో%ధ్యాయః వ్యాసః : యత్త్వయాచ మహాబాహో పృష్టో%హం కురుసత్తమ | త్రాన్ప్రశ్నాన్నారదఃప్రాహ మయాపృష్టోమునీశ్వరః.
1 నారధః : వ్యాస కింతే బ్రవీమ్యద్య పురా%యం సంశయోమమ | ఉత్పన్నో హృదయే%త్యర్థం సందేహా సారపీడితః.
2 గత్వా%హం పితరంస్థానే బ్రహ్మాణమమితౌజసమ్ | అపృచ్ఛం యత్త్వయా పృష్టం వ్యాసా%ద్యప్రశ్నముత్తమమ్.
3 పితః కుతః సముత్పన్నం బ్రహ్మాండ మఖిలం విభోః భవత్కృతేన వా సమ్య క్కింవా విష్ణుకృతం త్విదమ్ ?
4 రుద్రకృతం వా విశ్వాత్మన్ బ్రూహి సత్యం జగత్పతే | ఆరాధనీయః కఃకామం సర్వోత్కష్టక్చకః ప్రభుః.
5 తత్సర్వం వదమేబ్రహ్మ న్సందేహాం శ్చింధి చానఘ! నిమగ్నో హ్యస్మిసంసారే దుఃఖరూపే%నృతోపమే.
6 సందేహాం దోళితంచేతో నప్రశాశ్యతి కుత్రచిత్ | నతీర్థేషు న దేవేషు సాధనే ష్వితరేషు చ.
7 అవిజ్ఞాయ పరంతత్త్వం కుతఃశాంతిః పరంతప | వికీర్ణం బహుధా చిత్తం నకుత్రస్థిరతాంవ్రజేత్.
8 కం స్మరామి యజే కంవాకం వ్రజా మ్యర్చయామికమ్ | స్తౌమికం నాభిజానామి దేవం సర్వేశ్వ రేశ్వరమ్.
9 తతోమాం ప్రత్యువాచేదం బ్రహ్మాలోక పితామహః | మయా సత్యవతీ సూనో! కృతే ప్రశ్నే సుదుస్తరే.
10 రెండవ అధ్యాయము శ్రీ త్రిభువనేశ్వరీదేవీ ప్రాభవము వ్యాసభట్టారకు డిట్లనియె : కురుసత్తమా! నీవు నన్నడిగిన ప్రశ్నమునే నేను తొల్లి నారదమహర్షి నడిగితిని. అతడు నాకిట్లు సమాధానము చెప్పెను: వ్యాసమునీ! నీ కేమని తెల్పుదును? ఒకప్పుడు నా మదిలో నేనుగూడ నీకు గల్గిన తీరని బాధనే పడితిని. అంతట నేనును మహాతేజస్వియు నా తండ్రియు నగు బ్రహ్మకడకేగి అతనిని నీ వడిగినటులే ఇట్లు ప్రశ్నించితిని - విభూ! ఈ బ్రహ్మాండమంతయు నెవరి మహాశక్తివలన సముత్పన్నమైనది? ఇదంతయు నీవే సృజించితివా? కాక విష్ణువు నిర్మించెనా? కానిచో రుద్రుడు కల్పించెనా? నా కారాధనీయుడగు సర్వశ్రేష్ఠ ప్రభువెవరు? నిక్కముగ వచియింపుము. నేను దుఃఖపూరితమైన యీ యసత్యసంసారమున మునిగిపోవుచున్నాను. కనుక నా యీ సందేహము తీర్చి యంతయు నున్న దున్నట్లు యాథార్థ్యము దెలుపుము. ఈ సందియము నా చిత్తమందు గూడుకట్టుకొని యున్నది. దీనివలన నా యెడదకు శాంతి లభించుటలేదు. ఏ దేవతలమీదకు - తీర్థములమీదకుగాని యితర సాధనములపైకిగాని నా మనస్సు పోవుటలేదు. నే నీ పరమతత్త్వ మెఱుగనంతవఱకు నా మదికి శాంతి చేకూరదు. నా మది పలుతావులలో చిక్కుకొని దేనియందును నిలుకడ చెందుటలేదు. నా కా సర్వేశ్వరు డెవరో తెలియుటలేదు. కనుక నే నెవరినని స్మరింతును - స్తుతింతును - యజింతును - అర్చింతును - శరణందుదును? సత్యవతీసుతా! నేనిట్టి కఠినమైన ప్రశ్న వేయగా లోకపితామహుడగు బ్రహ్మ నాకిట్లు ప్రతివచన మొసంగెను: బ్రహ్మోవాచ: కింబ్రవీమిసుతాద్యాహం దుర్బోధం ప్రశ్నముత్తమమ్ | త్వయాశక్యం మహాభాగవిష్ణోరపిసునిశ్చయాత్.
11 రాగీకో%పి న జానాతి సంసారే%స్మి న్మహామతే | విరక్తశ్చ విజానాతి నిరీహో యోవిమత్సరః.
12 ఏకార్ణవే పురాజాతే నష్టే స్థావరంజంగమే | భూతమాత్రే సముత్పన్నే సంజజ్ఞే కమలాదహమ్.
13 నాపశ్యం తరణిం సోమం న పృక్షాన్న చ పర్వతాన్ | కర్ణికాయాం సమావిష్ట శ్చింతా మకరవంతదా.
14 కస్మాదహం సముద్భూతః సలిలే%స్మి న్మహార్ణవే | కోమే త్రాతాప్రభుఃకర్తా సంహర్తా వా యుగాత్యయే.
15 న చ భూర్విద్యతే సృష్టా యదాధారం జలంత్విదమ్ | పంకజం కథముత్పన్నం ప్రసిద్ధం రూఢియోగయోః.
16 పశ్చామ్య ద్యాస్య పంకంతం మూలం వై పంకజస్యచ | భవిష్యతి ధరాతత్రమూలం నాస్త్యత్రసంశయః.
17 ఉత్తరం సలిలే తత్ర యావద్వర్ష సహస్రకమ్ | అన్వేషమాణో ధరణీం నావాపం తాంయదా తదా.
18 తపస్తపేతి చాకావే వాగభూదశరీరిణీ ! | తతోమయా తపస్తప్తం పద్మేవర్ష సహస్రకమ్.
19 సృజేతి పునరుద్భూతా వాణీ తత్ర శ్రుతా మయా | విమూఢో%హం తదాకర్ణ్య కం సృజామి కరోమి కిమ్. 20 తదా దైత్యా వతిప్రాప్తౌ దారుణౌ మధుకైటభౌ | తాభ్యాం విభీషితశ్చాహం యుద్ధాయ మకరాలయే. 21 తతో%హం నాల మాలంబ్య వారిమధ్య మవాతరమ్ | తదా తత్ర మయా దృష్టః పురుషః పరమాద్భతః. 22 వత్సా! నీ కెట్లు దెల్పుదును? నీ వడిగిన ప్రశ్నము కడు దుస్తరమైనది. ఆ విష్ణువు సైతము దీని కిదమిత్థమని సమాధాన మీయజాలడు. విరాగి నిష్కామి విమత్సరుడు స్వాత్మవంతుడునైనవాడేకాని ఈ జగములందు రాగి కామియైన వాడెవ్వడును దీని సమాధాన మెరుగజాలడు. పూర్వ మీ స్థావరజంగమాత్మకమైన సృష్టియంతయు నశించి జలమయమయ్యెను. అంత పంచభూతములు తన్మాత్రలు గల్గినవి. నేనొక కమలమునుండి యుద్భవించితిని. అపుడు నాకు సూర్యుడు కాని చంద్రుడు కాని యొక చెట్టుగాని గుట్టకాని యేమియు కనిపించలేదు. ఆ తమ్మిదుద్దులో నుండి నే నీ రీతిగ నాలోచనలో మునిగితిని: ఈ మహాసాగరజలమందు నే నెవరివలన జన్మించితిని. నాకు కర్త భర్త యుగాంతమందలి సంహర్త యెవరు? ఈ విశాల జలరాశి కాధారమైన భూమియు గనిపించుటలేదు. ఈ మహాపద్మ మెట్లు పుట్టినదో తెలియుటలేదు. నే నిపుడీ కమలము మూలముగందును. అక్కడ ఈ యంతులేని నీటికి మూలమైన భూమి నిస్సందేహముగ గోచరించును. అట్లు తలచి నేను పద్మమునుండి లోనికి దిగి యంతుదెలియని నీటిలోపల వేయేండ్లు వెదకితిని. కాని, నేను భూమిపొడ గాంచలేదు. అంతలో గగనసీమనుండి తప-తపయను నశరీరవాణి నా చెవుల బడెను. అపుడు నేను పద్మమం దొక వేయేండ్లు తప మాచరించితిని. పిమ్మట సృష్టి సల్పుమని శబ్దము నా చెవుల బడెను. అది విని నేను మూఢుడనై, యెవని సృష్టింతును? ఏమి చేతునని యాలోచనలలో పడితిని. అపుడు మధుకైటభులను ఘోర రాక్షసులు నాకు కనిపించిరి. వారు నాతో బోరుటకు వచ్చిరని తెలిసికొని నేను భయపడితిని. నే నపుడా కమలనాళము ద్వారమున నీటిలో నడిమికి వచ్చితిని. అచ్చట నొక పరమాద్భుతశక్తిగల దివ్యపురుషుడు నాకు గనిపించెను. మేఘశ్యామశరీరస్తు పీతవాసా శ్చతుర్భుజః | శేషశాయీ జగన్నాథో వనమాలా విభూషితః. 23 శంఖచక్రగదాపద్మాద్యాయుధైః సువిరాజితః | తమద్రాక్షం మహావిష్ణుం శేషపర్యంకశాయినమ్. 24 యోగనిద్రాసమాక్రాంత మవిస్పందిన మచ్యుతమ్ | శయానం తం సమాలోక్య భోగిభోగోపరి స్థితమ్. 25 చింతా మామాద్భుతా జాతా కిం కరోమీతి నారద | మయా స్మృతా తదా దేవీ స్తుతా నిద్రాస్వరూపిణీ. 26 దేహా న్నిర్గత్య సా దేవీ గగనే సంస్థితా శివా | అవితర్క్యశరీరా సా దివ్యాభరణమండితా. 27 విష్ణో ర్దేహం విహాయాశు విరరాజు నభఃస్థితా | ఉదతిష్ఠ దమేయాత్మా తయా ముక్తో జనార్దనః. 28 పంచవర్షసహస్రాణి కృతవా న్యుద్ధ ముత్తమమ్ | తదా విలోకితౌ దైత్యౌ హరిణా వినిపాతితౌ. 29 ఉత్సంగం విపులం కృత్వా తత్రైవ నిహతౌ చ తౌ | రుద్ర స్తత్రైవ సంప్రాప్తో యత్రా%%వాం సంస్థితావుభౌ. 30 త్రిభిః సంవీక్షితా%స్మాభిః స్వస్థా దేవీ మనోహరా | సంస్తుతా పరమా శక్తి రువాచాస్మా నవస్థితాన్. 31 కృపావలోకనైః కృత్వా పావనై ర్ముదితా నథ | దేవ్యువాచ: కాజేశాః స్వాని కార్యాణి కురుధ్వం సమతంద్రితాః. 32 సృష్టిస్థితివిశిష్టాని హతా వేతౌ మహాసురౌ | కృత్వా స్వాని నికేతాని వసధ్వం విగతజ్వరాః. 33 ప్రజా శ్చతుర్విధాఃసర్వాఃసృజధ్వంస్వవిభూతిభిః | బ్రహ్మోవాచ: తచ్ఛ్రుత్వావచనంతస్యాః పేశలంసుఖదంమృదు. 34 ఆ పురుషోత్తముడు నిర్మల నీలమేఘశ్యామలుడు - సుందరకోమలాంగుడు - పీతాంబరుడు - వనవనమాలికాలంకృతుడు - జగన్నాథుడు. శ్రీ శంఖము-చక్రము-గద-పద్మములతో శోభిల్లు చతుర్భుజుడు. పాపఱని పాన్పున పవ్వళించిన స్వామి. ఇట్టి శ్రీవిష్ణువు నాకు దర్శనభాగ్య మొసంగెను. ఆ మహాత్భుడు యోగనిద్రలో నిశ్చలముగ పరుండియుండెను. అట్లు శేషతల్పముపై శయనించిన యచ్యుతుని నేను కనులకరవుదీర గాంచితిని. నారదా! నే నిపుడేమి చేయవలయునా యను చింత నా కపుడు గల్గినది. నే నపుడు నిద్రా దేవతను స్మరించితిని. అంత నా శివస్వరూపయగు దేవి విష్ణుని శరీరము వదలి లేచి యంతరిక్షమున కెగసెను. ఆ దేవి విశ్వభూషణ కాంతులతో మేని కాంతులు గలియుటచే దివ్యసుందరియై యొప్పారినది. అట్లు నిద్రాదేవి హరి తనువునుండి నింగిపై వెలుగొందినంతనే జనార్దనుడు నిద్దుర చాలించి మేలుకొనెను. అపు డాపరమాత్ముడు మధుకైటభులతో నైదువేలేండ్లు పోరెను. తుదకా యిర్వురు రక్కసులు హరి చేతిలో తుదముట్టిరి. ఆ హరియొక్క విపులమైన తొడలపై వారీల్గిరి. పిమ్మట మే మిరువుర మున్నతావునకు శివు డేగుదెంచెను. అంతలో నా సుమనోహారిణి దివ్యదేవి మా మువ్వురకు తన దివ్యదర్శనభాగ్య మొసంగినది. ఆమెను మేము సంస్తుతింప దొడగితిమి. అందుల కా పరమశక్తి మా యెడల సుప్రసన్నయైనది. ఆ దేవి తన ద్వికటాక్షవీక్షణములతో మమ్ము తరింపజేయుచు నిట్లు పలికెను: 'ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా! మీరు మీ మీ కార్యములు నెరవేర్చుడు. ఇంక మీరు మీ మీ నివాసము లేర్పరచుకొని నిశ్చింతగ చతురతతతో సృష్టి స్థితి సంహారము లొనరింపుడు. మీరు మీ మీ దివ్యవిభూతులతో నేర్పుమీర ప్రజలను నాల్గువిధములుగ సృజింపుడు, అను దేవియొక్క చల్లని సుకము గల్గించు నమృతము లొలుకు పలుకులు వింటిమి. అబ్రూమ తా మశక్తాః స్మః కథం కుర్మ స్త్విమాః ప్రజాః న మహీ వితతా మాతః సర్వత్ర వితతం జలమ్. 35 న భూతాని గుణాశ్చాపి తన్మాత్రా ణీంద్రియాణి చ | తదాకర్ణ్య వచో%స్మాకం శివా జాతా స్మితానవా. 36 ఝటిత్యేవాగతం తత్ర విమానం గగనా చ్ఛుభమ్ | సోవాచాస్మిన్సురాః కామం విశధ్వం గతసాధ్వసాః. 37 విమానే బ్రహ్మవిష్ణ్వీశా దర్శయా మ్యద్య చాద్భుతమ్ | తన్నిశమ్య వచ స్తస్యా ఓమిత్యుక్త్వా పునర్వయమ్. 38 సమారుహ్యోపవిష్టాః స్మో విమానే రత్నమండితే | ముక్తాదామసుసంవీతే కింకిణీజాలశబ్దితే. 39 సురసద్మనిభే రమ్యే త్రయ స్తత్రావిశంకితాః | సోపవిష్టాం స్తతో దృష్ట్వా దేవ్యస్మా న్విజితేంద్రియాన్. 40 స్వశక్త్యా తద్విమానం వై నోదయామాస చాంబరే. 41 ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ%ష్టాదశసాహస్య్రాం సంహితాయాం తృతీయస్కంధే ద్వితీయో%ధ్యాయః. మేమా దేవి కిట్లంటిమి: 'ఓ తల్లీ! మే మశక్తులము. ప్రజాసృష్టి యెట్లొనర్పగలము? ఇదంతయును నీటిమయమే గదా! నేల కంటికే కనబడుటలేదు. ఇచట మాకు భూతములు తన్మాత్రలు నింద్రియగుణము లేవియు గనబడుటలేదు.' ఈ మా మాటలు విని యాదేవి చల్లని నవ్వులు చిందుమొగముతో తేజరిల్లెను. అంతలో నాకాశమునుండి యొక దివ్య విమానము మా ముందునకు వచ్చెను. అపుడు 'త్రిమూర్తులారా! మీరు నిర్భయముగ దీనిలోని కెక్కుడు. మీ కత్యద్భుతమైన దృశ్యము జూపింతును.' అని దేవి మాతో బలికెను. మే మా దేవి వాక్కులు విని యొప్పుకొని కింకిణీ ఝళంఝళలతో రవళించుచు ముత్యాలహారాలతో నలరుచు దేవేంద్రభవనమువలెనున్న విమాన మెక్కి కూర్చుంటిమి. జితేంద్రియులమగు మేము సుఖాసీనులమగుటగాంచి దేవి స్వశక్తితో విమానము నాకాశవీథిలో నడిపింపసాగెను. ఇది శ్రీదేవీ భాగవతమందలి తృతీయ స్కంధమందు ద్వితీయాధ్యాయము.