Sri Devi Bhagavatam-1
Chapters
అథ తృతీయో%ధ్యాయః బ్రహ్మోవాచ: విమానం త న్మనోవేగం యత్ర స్థానాంతరుగతమ్ | న జలం తత్రపశ్యామోవిస్మితాఃస్మోవయంతదా.
1 వృక్షాః సర్వఫలా రమ్యాః కోకిలారావమండితాః | మహీ మహీధరాః కామం వనా న్యుపవనాని చ.
2 నార్యశ్చ పురుషాశ్చైవ పశవశ్చ సరిద్వరాః | వాప్యః కుపా స్తడాగాశ్ఛ పల్వలాని చ నిర్ఝరాః.
3 పురతో నగరం రమ్యం దివ్యప్రాకారమండితమ్ | యజ్ఞాశాలాసమాయుక్తం నానాహర్మ్వవిరాజితమ్.
4 ప్రత్యభిజ్ఞా తదా జాతా%ప్యస్మాకం ప్రేక్ష తత్పురమ్ | స్వర్గో%య మితికేనాసౌనిర్మితో%స్తి తదా%ద్భుతమ్.
5 రాజానం దేవసంకాశం వ్రజంతం మృగయాం వనే | అస్మాభిః సంస్థితా దృష్టా విమానోపరి చాంబికా.
6 క్షణా చ్చచాల గగనే విమానం పవనేరితమ్ | ముహూర్తా ద్వా తతః ప్రాప్తం దేశే చాన్యే మనోహరే.
7 మూడవ అధ్యాయము త్రిమూర్తులు త్రిమూర్తులను గని విస్మయమందుట బ్రహ్మ యిట్లనియె: ఆ దివ్యవిమానము మనోవేగమున మరొక చోటి కేగినది. మా కచట నీరు కనిపింపలేదు. అందులకు మే మాశ్చర్యము జెందితిమి. ఆ ప్రదేశమందంతట పర్వతములు మధుర ఫలభరితములై కోకిలల కుహూకుహు రాగములుగల వృక్షము శోభలతో నొనరు వనోపవనములు-స్త్రీ పురుషులు పశుసంపదలు పసిడిపంటలు నదీనదములు సెలయేళ్లు వాపీకూప తటాకములు నీటి చిలుపలు యాగశాలలు ఎత్తైన ప్రాకారములు పలు సుందరభవనాలు గల్గి కలకలలాడు నగరములు నిండి కన్నులపసండువుగ నుండును. మే మా దివ్యనగరమునుంగాంచి యిది స్వర్గసీమ గాబోలు! ఇంత మహాద్భుతముగ దీని నెవరు నిర్మించిరో కదా? ఆహా! ఏమి వింత! అనుకొని పరమాశ్చర్య మందితిమి. అంతలో నచ్చట వేటాడుచు విహరించుచు ఇంద్రుని బోలు ఆ నగరపు రాజును విమానముపై తేజరిల్లు జగదంబికయు కనబడిరి. ఆ విమాన మొక్క మూర్తమాత్రమున వేగమున మరొక మనోహరప్రదేశమున కరిగెను. నందనం చ వనం తత్ర దృష్ట మస్మాభి రుత్తమమ | పారిజాతతరుచ్ఛాయాం సంశ్రితా సురభిః స్థితా. 8 చతుర్దంతో గజ స్తస్యాః సమీపే సమవస్తితః | తత్రాప్సరసాం బృందాని మేనకా ప్రభృతీని చ. 9 క్రీడంతి వివిధై ర్భావై ర్గాననృత్యసమన్వితైః | గంధర్వాః శతశ స్తత్ర యక్షా విద్యాధరా స్తథా. 10 మందారవాటికామధ్యే గాయంతి చ రమంతి చ | దృష్టః శతక్రతు స్తత్ర పౌలోమ్యా సహితః. ప్రభుః. 11 వయం తు విస్మితా శ్చాస్మ దృష్ట్వా త్రైవిష్టపం తదా | యాదఃపతిం ఉబేరం చ యమం సూర్యం విభావసుమ్. 12 విలోక్య విస్మితా శ్చాస్మవయం తత్ర సురా న్థ్సితాన్ | తదా వినిర్గతో రాజా పురా త్తస్మా త్సుమండితాత్. 13 దేవరాజ ఇవాక్షోభ్యో నరవాహ్యా వనౌ స్థితః | విమానస్థా వయం తచ్చ చచాల తరసా గతమ్. 14 బ్రహ్మలోకం తదాదివ్యం సర్వదేవనమస్కృతమ్ | తత్ర బ్రహ్మాణ మాలోక్య విస్మితౌ హరకేశవౌ. 15 సభాయాం తత్ర వేదాశ్చ సర్వే సాంగాః స్వరూపిణః | సాగరాః సరితశ్త్చవ పర్వతాః పన్నగోరగాః. 16 మా బూచతు శ్చతుర్వక్త్రకో%యం బ్రహ్మా సనాతనః | తా వవోచ మహం నైవ జానే సృష్టిపతిం పతిమ్. 17 కో%హం కో%యం కిమర్థం వా భ్రమో%యం మమ చేశ్వరౌ | క్షణా దథ విమానం తచ్చచాలాశుమనోజవమ్. 18 అచట మేము నందనవనమును నందులో చల్లని పారిజాతపు నీడ చలువలో సుఖించు కామదేనువును గాంచితిమి. దానికి సమీపమందు నాల్గుదంతములుగల మహాగజము గలదు. అచ్చట మేనక మున్నగు నచ్చరలు రాగ తాళ మధుర బావములతో నాట్యమాడుచుండిరి. గంధర్వ విద్యాధరులు నందన వన వాటికలో గుమిగూడి గానములతో ఆనందపరవశులై యుండిరి. ఇంద్రాణీ సహితముగ నింద్రుడు మాకు గనబడెను. రవి యమ వరుణ కుబేరులు నచట నుండిరి. మే మచట నటు లాసురలనుగాంచి విస్మయమందితిమి. అంతలో ఆ నగరపు రాజు దేవరాజువలె అక్షోభ్యుడగు నరవాహనముగల పల్లకిలో నెక్కి బయలువెడలెను. మా విమాన మటులు మాతోకూడ మహావేగమున మరల ముందుకు సాగి సర్వదేవ నమస్కృతమగు బ్రహ్మలోకమును జేరెను. అచట కమలాసనుడగు బ్రహ్మనుగని శివకేశవులు చోద్యమందిరి. ఆ బ్రహ్మసభలో వేదములు సాంగములుగ రూపుదాల్చి వెలుగొందుచుండెను. అచ్చో దివ్యసాగరమును నదీపర్వతములును మాకు నయనానందము గల్గించినవి. అంత శివకేశవు లీ క్రొత్త బ్రహ్మ యెవరని నన్నడిగిరి. నేను రెండవ సృష్టికర్త నెరుంగనంటిని. ఇతడెవరో! నేనెవరనో! ఇదంతయు నాకే మాత్రము దోచుటలేదు' అని నేనను నంతలో మా విమానము మనోవేగముగ ముందునకు సాగెను. కైలాసశిఖరే ప్రాప్తం రమ్యే యక్షగణాన్వితే | మందారవాటికారమ్యే కీరకోకిలకూజితే. 19 వీణామురజవాద్యైశ్చ నాదితే సుఖదే శివే | యదా ప్రాప్తం విమానం త త్తదైవ సదనా చ్ఛుభాత్. 20 నిర్గతో భగవాన్ శంభు ర్వృషారూఢ స్త్రిలోచనః | పంచాననో దశభుజః కృతసోమార్ధశేఖరః. 21 వ్యాఘ్ర చర్మపరీధానో గజచర్మోత్తరీయకః | పార్షిరక్షౌ మహావీరౌ గజానన షడాననౌ. 22 శివేన సహ పుత్రౌ ద్వౌ వ్రజమానై విరేజతుః | నందిప్రబృతయః సర్వే గుణపాశ్చ వరాశ్చ తే. 23 జయశబ్దం ప్రయుంజానా వ్రజంతి శివపృష్ఠగాః | తం వీక్ష్య శంకరం చాన్యం విస్మితా స్తత్ర నారద. 24 మాతృభిః సంశయావిష్టస్తత్రాహంన్యవసంమునే | క్షణాత్తస్మాద్గిరేః శృగాద్విమానం వాతంరహసా. 25 వైకుంఠసదనం ప్రాప్తం రమారమణమందిరమ్ | అసంభావ్యా విభూతిశ్చ తత్ర దృష్టా మయా సుత. 26 వినిష్మియే తదా విష్ణు ర్దృష్ట్వా తత్పుర ముత్తమమ్ | సదనాగ్రే య¸° తావ ద్ధరిః కమలలోచనః. 27 అతసీకుసుమాభాసః పీతవాసా శ్చతుర్భుజః | ద్విజరాజాధిరూఢశ్ఛ దివ్యాభరణభూషితః. 28 వీణ్యమాన స్తదాలక్ష్మ్యా కామిన్యా చామరైః శుబైః | తం వీక్ష్య విస్మితాః సర్వే వయం విష్ణుం సనాతనమ్. 29 అట్లు మా విమానము సాగిసాగి కైలాసగిరి జేరెను. అచట యక్షగణములు జేరి శివుని భక్తిమీర గొల్చుచుండిరి. కీరకోకిలములు మధుర గానముల నలరొందు మందారవనములును నట గలవు. పరమశివుడు వీణామురజ వాద్యములనుండి వెడలు చల్లని మధురరాగములను చెవులపండువుగ వినుచుండెను. ఆ శివుడు మా విమానమునుగని కైలాసమును వదలి పెట్టెను. ఆ రీతిగ నెలతాలుపు పంచాననుడు దశభుజుడు ముక్కంటి వృషవాహనుడునగు శంభుభగవానుడు కైలాసము నుండి బయటికి వెడలెను. ఆ సాంబసదాశివుడు మొలయందు పులితోలును పైని నేనుగు తోలుత్తరీయమును దాల్చియుండెను. ఆ పురాణదంపతుల కిరుప్రక్కల మహావీరులగు గణపతి కుమారు లుండిరి. అట్లు నంది మున్నగు గణశ్రేష్ఠములు తన కూర్మి తనయులు తన్ను గొలువ శివుడు బయలుదేరెను. ఆ శివగణములు శివుని వెంటజేరి హరహర మహాదేవశంభో యని నినాదములు సేయుచుండెను. ఆ యభినవ శంకరుని గాంచి మేము విస్తుపోతిమి. ఆ శివుడు మాతృకలను గూడియుండెను. పిదప మా విమాన రాజము క్షణములో గాలివాలున ముందుకు దూసికొని పోయినది. శ్రీరమారమణుని మందిరమైన వైకుంఠధామము జేరినది. అచట మేమెన్నడును కనివిని యెరుగని పెక్కులు దివ్యవిభూతులు కనులార గాంచితిమి. మే మా రమణీయమైన పురముగాంచి విస్మయానందము లందితిమి. మా విమానము మఱికొంతముందున కేగెను. అచట రాజీవనయనుడు పీతాంబరుడు అగిసె పూశోభనలరువాడు చతుర్భుజుడు గరుడవాహనుడు దివ్యభూషణభూషితుడు చామరములు చేతదాల్చి చల్లగ మెల్లగ వీచుచున్న రమాకాంతతోగూడి రాజిల్లువాడునగు హరిని మేము మా భాగ్యముకొలది సందర్శించితిమి. ఆ సనాతనుని వైకుంఠునిగనిన మా యాశ్చర్యమునకు మేర లేకుండెను. పరస్పరం నిరీక్షంతః స్థితా స్తస్మి స్వరాసనే | తత శ్చచాల తరసా విమానం వాతరంహసా. 30 సుధాసముద్రః సంప్రాప్తో మిష్టవారిమహోర్మిమాన్ | యాదోగణసమాకీర్ణ శ్చలద్వీచివిరాజితః. 31 మందారపారిజాతాద్యైః పాదపై రతిశోభితః | నానాస్తరణసంయుక్తో నానాచిత్రవిచిత్రితః. 32 ముక్తాదామపరిక్లిష్టో నానాదామవిరాజితః | అశోకవకులాఖ్యైశ్చ వృక్షైః కురవకాదిభిః. 33 సంవృతః సర్వతః సౌమ్యైః కేతకీచంపకై ర్వృతః | కోకిలారావసంఘుష్టో దివ్యగంధసమన్వితః. 34 ద్విరేఫాతిరణత్కారై రంజితః పరమాద్భుతః | తస్మిన్ ద్వీపే శివాకారః పర్యంకః సుమనోహరః. 35 రత్నాశిఖచితో%త్యర్థం నానారత్న విరాజితః | దృష్టో%స్మాభి ర్విమానస్థై ర్దూరతః పరిమండితః. 36 నానాస్తరణసంపన్న ఇంద్రచాపసమన్వితః | పర్యంకప్రవరే తస్మి న్ను పవిష్టా వరాంగనా. 37 రక్తమాల్యాంబరధరా రక్తగంధానులేపనా | సురక్తినయనా కాంతా విద్యుత్కోటిసమప్రభా. 38 సుచారువదనా రక్తదంతచ్ఛదవిరాజితా | రమాకోట్యధికా కాంత్యా సూర్యబింబనిభా%ఖిలా. 39 వరపాశాంకుశాభీష్టధరా శ్రీభువనేశ్వరీ | అదృష్టపూర్వా సా దృష్టా సుందరీ స్మితభూషణా. 40 అపుడు మా యాసనములందు కూర్చుండి మే మొకరి మొగా లొకరము వింతగ జూచుకొంటిమి. అంతలో నొక పెనుగాలి వాలున మా విమానము మఱికొంత ముందునకు సాగెను. అంతలో మేము పలువిధముల జలచరములతో నువ్వెత్తుగ లేచు కెరటములతో డెంద ముప్పొంగజేయు నమృతసాగరము చూచితిమి. దాని నడుమ మందార పారిజాతాది తరువులు చిత్రవిచిత్ర వస్తువులు పెక్కాసనములు-మేలుజాతి ముత్తియముల హారాలు అశోకవకుళకురవక తరువులు - నలుగడల ఘుమఘుమలాడుచు కనులపండువు సేయుచున్న మొగలి సంపెంగ మున్నగు పూలచెట్లు కోయిలల కుహూకుహూరావ మధిరిమలు-గండుతుమ్మెదల ఝంకారములు గల్గి తనరారు నొక్కదీవి గలదు. ఆ దీవియందు శివాకారమున చెలువొందు మంచ మొకటి సుమనోహరముగ నున్నది. అది నవరత్నకాంతులతో పొదుగబడెను. మేము దూరమందుండియే దాని శోభ కన్నులనిండ తిలకించితిమి. దానిపై నాసనములు పెక్కులు గలవు. ఆ పర్యంక మింద్రచాపము భాతిగ చిత్రశోభలతో నలరుచుండెను. అందొక పరమలావణ్యవతి యగు దివ్యాంగన సుఖాసీనయై యొప్పారుచుండెను. ఆ జగదేకసుందరి రక్తమాల్యాంబరధర రక్తగంధానులేపన కోట్ల మెరుపుకాంతులతో మిరుమిట్లు గొల్పుచుండెను. ఎఱ్ఱజీఱల కనుదమ్మలు గలది, కోట్ల పసిండిచాయల మిసిమివన్నె గలది, రవి బింబములను వెన్నుదన్నుకాంతి గలది. చారు వదన రక్తదంత విరాజిత-లావణ్యసీమ. పాశాంకుశములదాల్చి వరదాభయ ముద్రలతో వాత్సల్యము గురియు తల్లి, చిరుతనవ్వు వెన్నెలలు కనుగొలంకుల ముని పెదవుల చిందులాడునది, అపూర్వసుందరి ఐన శ్రీత్రిభువనేశ్వరీదేవి విరాజిల్లుచుండెను. హ్రీంకారజపనిష్ఠా తు పక్షిబృందై ర్ని షేవితా | అరుణా కరుణామూర్తిః కుమారీ నవ¸°వనా. 41 సర్వశృంగారవేషాఢ్యా మందస్మిత ముఖాంబుజా | ఉద్యత్పీనకుచద్వంద్వనిర్జితాంభోభకుట్మలా. 42 నానామణిగణాకీర్ణ భూషణౖ రుపశోభితా | కనకాంగద కేయూర కిరీట పరిశోభితా. 43 కన చ్ఛ్రీచక్రతాటంక విటంక వదనాంబుజా | హృల్లేఖాభువనేశీతినామజాపపరాయణౖః. 44 సఖీబృందైః స్తుతా నిత్యం భువనేశీ మహేశ్వరీ | హృల్లేఖాద్యాభి రమరకన్యాభిః పరివేష్టితా. 45 అనంగకుసుమాద్యాభి ర్దేవీభిః పరివేష్టితా | దేవీషట్కోణమధ్యస్థ యంత్రరాజోపరిస్థితా. 46 దృష్ట్వా తాం విస్మితాః సర్వే వయం తత్ర స్థితా%భవన్ | కేయం కాంత చ కిం నామనజానీమో%త్రసంస్థితా. 47 సహస్రనయనారామా సహస్రకరసంయుతా | సహస్రవదనా రమ్యా భాతి దూరా దసంశయమ్. 48 నాప్సరా నాపి గంధర్వీ నేయం దేవాంగనా కిల | ఇతి సంశయమాపన్నా స్తత్ర నారద సంస్థితాః. 49 ఆ నవ¸°వన దివ్యాంగన తన నవ్వు రాజిల్లెడు మోమునుండి దయామృతము గురియుచుండెను. ఆ దేవిచుట్టును జేరి హ్రీంకార జపనిష్ఠలో మేనులు మరచిన పక్షిబృందములు దేవిని జపించుచుండెను. ఎల్ల రసరాజము లామె సింగారములో చోటు చేసికొన్నవి. ఆమె చిగురునవ్వుల మోహనకాంతుల ముఖకమలముతో బలు తమ్మి మొగ్గలను త్రోసిరాజను గబ్బివట్రువ గుబ్బలతో నొప్పుచుండెను. పెక్కు మేలైన జాతిమణుల సొమ్ములతో బంగారపు కేయూరాంగద కిరీటములతో ధగధగలాడుచుండెను. ఆమె ముఖకమలము శ్రీచక్రము విధముగ నున్న తాటంకవిటంకములతో చెన్నొందుచుండెను. 'జయహో! హృల్లేఖ! శ్రీభువనేశి' యని దేవి చెలియలు ఆమెను స్తుతించుచు దేవీజప పరాయణులై యుండిరి. ఆ దేవి భువనేశ్వరి మహేశ్వరి హృల్లేఖ మొదలుగాగల దేవకన్యలతో కొలువు తీర్చియుండెను. ఆ కొలువులో ననంగ కుసుమాది దేవతలును గలరు. ఇట్లా దేవి షట్కోణమధ్యమున నలరు యంత్రరాజమున నలరుచుండెను. మేమా దేవిని దర్శించి, ఈమె యెవరో? ఈమె శుభనామ మెద్దియో తెలియుట లేదేయని పరమ విస్మయమందితిమి. ఈమె వేయికనుల దయామృతలహరి - వేయికేలుదమ్ముల వరదాయిని - వేయివదనాల సుప్రసాదచంద్రిక యని దూరమందుండియే మాకామె దోచుచుండెను. ఈమె యచ్చరగాని గంధర్వకన్యగాని దేవాంగనకాని కాదు. కాని, ఈ పరదైవ మెవ్వరై యుండునోయని తెలిసికొననేరక మేము సంశయములో కొట్టుమిట్టాడుచుంటిమి. తవా%సౌ భగవా న్విష్ణు ర్దృష్ట్వా తాం చారుహాసినీమ్ | ఉవా చాంబాం స్వవిజ్ఞానా త్కృత్వా మనసి నిశ్చయమ్ 50 ఏషా భగవతీ దేవీ సర్వేషాం కారణం హి నః | మహావిద్యా మహామాయా పూర్ణా ప్రకృతి రవ్యయా. 51 దుర్జే యా%ల్పధియాం దేవీయోగగమ్యా దురాశయా | ఇచ్ఛా పరాత్మనః కామం నిత్యానిత్యస్వరూపిణీ. 52 దురారాధ్యా%ల్పభాగైశ్చ దేవీ విశ్వేశ్వరీ శివా | వేదగర్భా విశాలాక్షి సర్వేషా మాది రీశ్వరీ. 53 ఏషా సంహృత్య సకలం విశ్వం క్రీడతి సంక్షయే | లింగాని సర్వజీవానాం స్వశరీరే నివేశ్చ చ. 54 సర్వబీజమయీ హ్యేషా రాజతే సాంప్రతం సురౌ | విభూతయః స్థితాః పార్మ్వే పశ్యతాం కోటిశః క్రమాత్. 55 దివ్యాభరణభూషాఢ్యా దివ్యగంధానులేపనాః | పరిచర్యాపరాః సర్వాః పశ్యతాం బ్రహ్మశంకరౌ. 56 ధన్యా వయం మహాభాగాః కృతకృత్యాః స్మ సాంప్రతమ్ | యదత్రదర్శనం ప్రాప్తాభగవత్యాః స్వయం త్విదమ్. 57 తప స్తప్తం పురా యత్నా త్తస్యేదం ఫల ముత్తమమ్ | అన్యథా దర్శనం కుత్ర భ##వే దస్మాక మాదరాత్. 58 పశ్యంతి పుణ్యపుంజా యే యే వదాన్యా స్తపస్వినః | రాగిణోనైవ పశ్యంతి దేవీం భగవతీం శివామ్. 59 అంతలో విష్ణుభగవానుడు రవిజ్ఞాన శక్తితో నాచారుహాసినిని జగదంబగ మదినెఱింగి యిట్టనియెను: ఈ భగవతి దేవియే మన కందఱకు తరణభూతురాలు. మహావిద్య; మహామాయ; పరిపూర్ణ; మూలప్రకృతి; అవ్యయ. ఈమె కొంచెపు బుద్ధులవారికి మదికెక్కనిది. యోగగమ్య. పరమాత్ముని యిచ్ఛాశక్తి. నిత్యానిత్యస్వరూపిణి. ఈమె శివస్వరూపిణి; భాగ్యహీనులచేత గొలువబడనిది. విశ్వేశ్వరి వేదగర్భ విశాలాక్షి సర్వాది పరమేశ్వరి సనాతని. ఈ మహాశక్తి ప్రళయకాలము నందు సకల విశ్వమును బరిమార్చి యెల్లజీవుల వాసనలను దనలో విలీన మొనరించుకొని క్రీడించుచుండును. సురలారా! సర్వబీజస్వరూపిణి యీమెయే. ఈమె దివ్య సన్నిధానములో ననంత విభూతులు రూపొంది సొంపు పెంపొందుచున్నవి. చూడుడు, ఓ శివబ్రహ్మలారా! చూడుడు. ఇచ్చటివారెల్లరు మేనుల దివ్యచందనములలందుకొని మేలిమిబంగరు సొమ్ములు దాలిచి ప్రేమభక్తులు వెల్లివిరియగ నీ జగన్మాతకు పరిచర్యలు సలుపుచున్నవారు. నేడు మన మిచ్చోట జగద్ధితయగు శ్రీభగవతిని సందర్శించి ధన్యజీవులము కృతకృత్యులము మహాసౌభాగ్యవంతులము నైతిమి. మనము పూనికతో నేనాడే పుణ్యము చేసికొంటిమో యే తప మాచరించితిమో దాని ఫలితముగ మన కీనాడు శ్రీమాతృదేవి దివ్యదర్శనము లభించినది. త్యాగధనులు పుణ్యభాగులు తపస్సంపన్నులు దానరతులునైన మహాత్ములే యీ భవ్యాత్మ నవలోకింపగలరు. కాని, రాగులు మూఢులు ప్రమత్తులు నా శివాభగవతి నేనాటికిని గాంచనేరరు. మూలప్రకృతి రేవైషా సదా పురుష సంగతా | బ్రహ్మాండం దర్శయ త్యేషా కృత్వా వై పరమాత్మనే. 60 ద్రష్టా%సౌ దృశ్య మఖిలం బ్రహ్మాండం దేవతా స్సురౌ | తసై#్యషా కారణం సర్వా మాయా సర్వేశ్వరీ శివా. 61 క్వాహం వా క్వ సురాః సర్వే రమాద్యాః సురయోషితః | లక్షాంశేన తులా మస్యా న భవామః కథంచన. 62 సైషా వరాంగనా నామ యా దృష్టా వై మహార్ణవే | బాలభావే మహాదేవీ డోలయంతీవ మాం ముదా. 63 శయానం వటపత్రే చ పర్యంకే సుస్థిరే దృఢే | పాదాంగుష్ఠం కరే కృత్వా నివేశ్య ముఖపంకజే. 64 లేలిహంతం చ క్రీడంత మనేకై ర్బాలచేష్టితైః | రమమాణం కోమలాంగం వటపత్రపుటే స్థితమ్. 65 గాయంతీ డోలయంతీ చ బాలభావ న్మయి స్థితే | సేయం సునిశ్చితం జ్ఞానం జాతం మే దర్శనా దివ. 66 కామం నో జననీ సైషా శృణు తం ప్రవదామ్యహమ్ | అనుభూతే మయా పూర్వం ప్రత్యభిజ్ఞా సముత్థితా. 67 ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ అష్టాదశసాహస్య్రాం సంహితాయాం తృతీయస్కంధే తృతీయో%ధ్యాయః. ఈమెయే ప్రకృతులకన్నిటికిని మూలప్రకృతి. ఈ ప్రకృతి జనని పురుషసంగతిజేసి పరమేశ్వర ప్రీతికొఱ కీ బ్రహ్మాండములను సృజించి వెల్లడించుచుండును. దేవతలారా! ఈ కనబడు బ్రహ్మాండ మంతయును దృశ్యము. ఈ మాయాదేవియే ద్రష్ట్రి. ఈమెయే విశ్వయోని సర్వేశ్వరి సర్వమాయ పరమశివాత్మిక. ఈ విశ్వమాత యెక్కడ? మన మెక్కడ? లక్ష్మి మొదలుగాగల దేవకాంతల యంద మీమె యందములోని లక్షాంశమునకు సరిపోలవు. ఆనాడు మహాసాగరమునందు మనకు దర్శన మొసంగిన జ్యోతిఃస్వరూప మీ విశ్వజననియే. ఆ మహాదేవియే మనలను బాలురనుజేసి యాడించుచు వినోదించుచున్నది. మున్ను నేను వటపత్త్రపు పానుపుపై పరుండి నా పదారవిందమును కరారవిందముతో ముఖారవిందమున నుంచుకొని ఆ వ్రేలిరసము జుబ్బట్లాడగ జీకుచు కోమలాంగుడనై పెక్కులు బాలక్రీడలు సాగించితిని. అట్టి నాలో నీ జగన్మాతయే చేరి నన్నాడించుచు లాలిజోలలు పాడుచునుండెనని నే డీ మేనుగాంచినతోడనే నా మదికి నిశ్చయజ్ఞానము స్ఫురించెను. నా పలుకులు విశ్వసింపుడు. మనల గన్నతల్లి యీమెయే. నేను పూర్వ మనుభవించిన జ్ఞాన మిపుడు తిరిగి గుర్తునకు వచ్చినది. ఇది శ్రీదేవి భాగవతమందలి తృతీయ స్కంధమందు తృతీయాధ్యాయము.