Sri Devi Bhagavatam-1
Chapters
అథ చతుర్థో%ధ్యాయః బ్రహ్మోవాచ: ఇత్యుక్త్వాభగవాన్విష్ణుః పునరాహజనార్దనః | వయం గచ్ఛేమపార్శ్వే%స్యాః ప్రణమంతః పునఃపునః.
1 సేయం వరా మహామాయా దాస్య త్యేషా వరాన్హి నః | స్తువామః సిన్నిధిం ప్రాప్య నిర్భయా శ్చరణాంతికే.
2 యది నో వారయిష్యంతి ద్వారస్థాః పరిచారకాః | పఠిష్యామశ్చ తత్రస్థాః స్తుతిం దేవ్యాః సమాహితాః.
3 బ్రహ్మోవాచ: ఇత్యుక్తే హరిణా వాక్యే సుప్రహృష్టౌ సుసంస్థితై | జాతౌ ప్రముదితౌకామం నికటే గమనాయచ.
4 ఓమిత్యుక్త్వా హరిం సర్వే విమానా త్త్వరితా స్త్రయః | ఉత్తీర్య నిర్గతా ద్వారి శంకమానా మనస్యలమ్.
5 ద్వారస్థాన్ వీక్ష్య తాన్సర్వాన్ దేవీ భగవతీ తదా | స్మితం కృత్వా చకారాశు తాం స్త్రీన్ స్త్రీరూపధారిణః.
6 వయం యువతయో జాతాః సురూపా శ్చారుభూషణాః | విస్మయం పరమం ప్రాప్తా గతా స్తత్సన్నిధిం పునః. 7 సా దృష్ట్వా నః స్థితాం స్తత్ర స్త్రీరూపాః శ్చరణాంతికే | వ్యలోకయత చార్వంగీ ప్రేమసంపూర్ణయా దృశా. 8 ప్రణమ్య తాం మహాదేవీం పురతః సంస్థితా వయమ్ | పరస్పరం లోకయంతః స్త్రీరుపా శ్చారుభూషణాః. 9 పాదపీఠం ప్రేక్షమాణా నానామణివిభూషితమ్ | సూర్యకోటిప్రతీకాశం స్థితా స్తత్ర వయం త్రయః. 10 నాలుగవ అధ్యాయము శ్రీదేవిని శ్రీవిష్ణువు సంస్తుతించుట బ్రహ్మ యిట్లనియె: ఆ జనార్దనుడు మరల నీ విధముగ నుద్బోధించెను. 'మన మెల్లరమిపు డీ దేవి సన్నిధి కరిగి యా తల్లి పదపద్మముమీద పదేపదే మన తల లుంచుదము. ఈ మహామాయ మన కోరిన కోరిక లెల్ల తీర్చగలదు. మన మీ దేవి సమక్షమునకేగి నిశ్చింతగ నామెను సన్నుతించుదము. ఒకవేళ ద్వారపాలురు మనల నడ్డగించినచో మన మచటనే నిలుచుండి తదేకచిత్తముతో శ్రీమహాదేవీ స్తోత్రము పఠించుదము.' ఈ ప్రకారముగ విష్ణువు పలికినమీదట మేమందఱము హర్షము వెలిపుచ్చి ఆ జగదంబ సన్నిధానమున కేగదలంచితిమి. మేము విమానము దిగి శంకించుచునే దేవిద్వారము చెంత కేగితిమి. మేము ద్వారము ముందునకు జేరగనే దేవి మమ్ము చూచి చిరునగవు నగి మమ్ము స్త్రీ రూపిణులుగ మార్చెను. మేమంతట సురూపములతో చెలగు చక్కని పడుచుకన్నెలమైతిమి. మా రూపములు చూచుకొని మాలో మే మాశ్చర్య మందుచు శ్రీదేవి సమక్షమున కేగి ఆ యతిలోకసుందరాంగి పదకమలముల మ్రోల స్త్రీరూపములతోనే మేము నిలుచుంటిమి. ఆ దేవి మమ్ము ప్రేమపూర్ణమైన చూపులతో గాంచెను. స్త్రీ రూపిణులమగు మే మా మహాదేవికి భక్తిప్రపత్తులతో వినయాంజలు లర్పించి ఒకరి మొగము లొకరము చూచుకొంటిమి. ఆ శ్రీదేవి పాదపీఠము నానా మణిగణ విభూషితము సూర్యకోటి ప్రతీకాశమునై కాంతులు విరజిమ్ముచుండెను. మే మా మణిపీఠమును నేత్రపర్వముగ దర్శించుచు కైమోడ్చి నిలుచుంటిమి. కాశ్చి ద్రక్తాంబరా స్తత్ర సహచర్యః సహస్రశః | కాశ్చి న్నీలాంబరా నార్య స్థథా పీతాంబరాః శుభాః. 11 దేవ్యః సర్వాః శుభాకారాః విచిత్రాంబరభూషణాః | విరేజుః పార్శ్వతస్తస్యాః పరిచర్యాపరాః కిల. 12 జగుశ్చ ననృతు శ్చాన్యాః పర్యుపాసత తాః స్త్రియః | వీణామారుతవాద్యాని వాదయంత్యో ముదాన్వితాః. 13 శృణు నారద వక్ష్యామి యద్దృష్టం తత్ర చాద్భుతమ్ | నఖదర్పణమధ్యే వై దేవ్యా శ్చరణపంకజే. 14 బ్రహ్మాండమఖిలం సర్వం తత్ర స్థావరంజంగమమ్ | అహం విష్ణుశ్చ రుద్రశ్చ వాయు రగ్ని ర్యమో రవిః. 15 వరుణః శీతగు స్త్వష్టా కుబేరః పాకశాసనః | పర్వతాః సాగరా నద్యో గంధర్వాప్సరసస్తథా. 16 విశ్వావసు శ్చిత్రకేతుః శ్వేత శ్చిత్రాంగద స్తథా | నారద స్తుంబురుశ్చైవ హాహాహూహూ స్తథైవ చ. 17 అశ్వినౌ వసవః సాధ్యాః సిద్ధాశ్చ పితర స్తథా | నాగాః శేషాదయః సర్వే కిన్న రోరగరాక్షసాః. 18 వైకుంఠో బ్రహ్మలోకశ్చకైలాసః పర్వతోత్తమః | సర్వం తదఖిలం దృష్టం నఖమధ్యస్థితం చన. 19 మజ్జన్మపంకజం తత్ర స్థితో%హం చతురాననః | శేషశాయీ జగన్నాథ స్తథాచ మ ధుకైటభౌ. 20 శ్రీభగవానువాచ: ఏవం దృష్టం మయా తత్ర పాదపద్మనఖేస్తితమ్ | విస్మితో%హం తతోవీక్ష్యకిమేతదితిశంకితః. 21 విష్ణుశ్చ విస్మయావిష్టః శంకరశ్చ తథా స్థితః | తాం తదా మేనిరే దేవీం వయం విశ్వస్య మాతరమ్. 22 తతో వర్షశతం పూర్ణం వ్యతిక్రాంతం ప్రపశ్యతః | సుధామయే శివే ద్వీపే విహారం వివిధం తదా. 23 సఖ్య ఇవ తదా తత్ర మేనిరే%స్మా నవస్థితాన్ | దేవ్యః ప్రముదితాకారా నానాభరణమండితాః. 24 వయమ ప్యతిరమ్యత్వా ద్బభూవిమ విమోహితాః | ప్రహృష్టమనసః సర్వే%వశ్యన్భావా న్మనోరమాన్. 25 ఆ దేవి సన్నిధానమునందు దేవి చెలికత్తియలు వేనకువేలు గలరు. వారిలో గొందఱు రక్తాంబరములు కొందరు పీతాంబరములు దాల్చిరి. ఆ జ్యోతిర్మయులగు దేవతలెల్లరు విచిత్ర వస్త్రభూషణములు దాల్చి శోభలు వెలార్చుచు ఆ శ్రీమాతను జేరి సంసేవించుచుండిరి. కొందఱు నర్తించుచుండిరి. ఇంక కొందఱు దేవి నుపాసించుచుండిరి. ఇతరుల హృదయములు పులకరింప మధురముగ వీణలు మీటిరి. వేణువులూదిరి. ఓ దేవర్షీ! ఇంతయేల? అచట మేముగన్న మహాద్భుతము వక్కాణింతును వినుము. ఆ విశ్వజనని పదకమలములందలి నఖములనెడి చరణములలో చరాచరమైన బ్రహ్మాండములు విష్ణువు రుద్రుడు నేను రవి వహ్ని యముడు వాయువు వరుణుడు కుబేరుడు ఇంద్రుడు మున్నగు దిక్పతులు పర్వతాలు సాగరాలు నదులు అప్సరసలు విశ్వావసువు చిత్రకేతువు శ్వేతుడు చిత్రాంగదుడు నారద తుంబురులు అశ్వినులు వసువులు సిద్ధులు సాధ్యులు పితరులు శేషాదినాగులు కిన్నరులు రాక్షసులు బ్రహ్మలోకము వైకుంఠము పర్వతోత్తమమైన కైలాసము సమస్తము ప్రతిబింబించుచుండెను. నేను నా జన్మకారణమగు మహా పద్మమును ఆ పద్మమందున్న బ్రహ్మను శేషశాయి యగు శ్రీహరిని మధుకైటభులను గంటిని. ఇట్లా జగదంబ పదకమలముల కొనగోళ్ల వెల్గులందు సర్వవిశ్వముగని యెంతకు నంతుపట్టనివింతతో నే నాశ్చర్యమందితిని. శివవిష్ణువులును విస్మయ భరితులైరి. మేమంత నాదేవిని విశ్వమాతగ నొక్కుమ్మడిగ నంగీకరించితిమి. ఆ ప్రకారముగ నా యమృత కాంతులీను ద్వీపమందు మేము స్వేచ్ఛగ విహరించితిమి. ఆ దేవి మహనీయత గనుటలో మాకు నూరేండ్లు నిండెను. అచట మేలిమి సొమ్ములతో జిగజిగమని మెఱయుచు ప్రమోదమందుచున్న దేవాంగనలు మమ్ము తమ చెలికత్తియలుగ చూచుకొనిరి. మేమును వారి యందచందములకు లీలావిలాస వినోదములకు విభ్రాంతులమై సంతసిల్లి లోలోన వారి దివ్యభావములు దలపోయుచుంటిమి. ఏకదా తాం మహాదేవీం దేవీం శ్రీభువనేశ్వరీమ్ |తుష్టావ భగవా న్విష్ణు ర్యువతీభావసంస్థితః. 26 శ్రీభగవానువాచ : నమోదేవ్యై ప్రకృత్యై చ విధాత్య్రై సతతం నమః | కల్యాణ్యౖ కామదాయై చ వృద్ధ్యై సిద్ధ్యైనమోనమః. 27 సచ్చిదానందరూపిణ్యౖ సంసారారణమే నమః | పంచకృత్యవిధాత్య్రై తేభువనేశ్యై నమోనమః. 28 సర్వాధిష్ఠానరూపాయై కూటస్థాయై నమోనమః | అర్ధమాత్రార్థభూతాయై నమోనమః 29 జ్ఞాతం మయా%ఖిలమిదం త్వయి సన్నివిష్టం | త్వత్తో%స్య సంభవలయావపి మాత రద్య | శక్తిశ్చ తే%స్య కరణ వితతప్రభావా | జ్ఞాతా%ధునా సకలలోకమయీతినూనమ్. 30 విస్తార్య సర్వ మఖిలం సదసద్వికారమ్ సందర్శయ స్యవికలా పురుషాయ కాలే | తత్త్వైశ్చ షోడశభి రేవచ సప్తభిశ్చ భాసీంద్రజాలమివ నః కిల రంజనాయ. 31 న త్వామృతే కిమపి వస్తుగతంవిభాతి వ్యాపై#్యవ సర్వమఖిలం త్వమవస్థితా%సి | శక్తింవినా వ్యవహృతౌ పురుషో%ప్యశక్తో బంభణ్యతే జనని బుద్ధిమతా జనేన. 32 ప్రీణాతి విశ్వమఖిలం సతతం ప్రభావైః సై#్వస్తేజసా చ సకలం ప్రకటీకరోషి | అత్స్యేవదేవి తరసాకిల కల్పకాలే కో వేద దేవి చరితం తవ వైభవస్య. 33 త్రాతా వయం జనని తే మధుకైటభాభ్యామ్ లోకాశ్చ తే సువితతాః ఖలు దర్శితావః | నీతాః సుఖస్య భవనే పరమాం చ కోటిమ్ యద్దర్శనం తవ భవాని మహాప్రభావమ్. 34 నాహం భవో న చ విరించి వివేద మాతః కో%న్యో హి వేత్తి చరితం తవ దుర్విభావ్యమ్ | కానీహ సంతి భువనాని మహాప్రభావే హ్యస్మి న్భవాని చరితే రచనాకలాపే. 35 అప్పుడొకసారి స్త్రీ రూపమందున్న శ్రీ విష్ణువా శ్రీ త్రిభువనేశ్వరీదేవిని గూర్చి యిట్లు మహాద్భుతముగ స్తోత్రము చేయదొడగెను: శ్రీదేవికి ప్రకృతి విధాత్రి అమృతత్వ రూప కల్యాణి కామద వృద్ధి-సిద్ధి-శ్రీ సచ్చిదానంద స్వరూపిణి సంసారారణి పంచకృత్య విధాత్రి త్రిభువనేశి అగు దేవికి నమస్సులు. సర్వాధిష్ఠాన స్వరూప కూటస్థ అర్ధమాత్రార్థ రూప హృల్లేఖ అగు దేవికి వినయాంజలులు సమర్పింతును. జనయిత్రీ! ఈ విశ్వబ్రహ్మాండములు నీయందుండి యుద్భవించి నీవలన నెలవైయుండి మరల నీయందే లయమగునని నే నెఱింగితిని. ఇవి అన్నియు చేయు విధాత ప్రభావము నీ శక్తికే కలదనియు సకల లోకమయి వనియు నెరింగితిని. ఆకాశ వాయువులు నీ సద్రూపములు అమూర్తములు. అగ్ని జల భూములు నీ యసద్రూపములు మూర్తములు. వీనినన్నిటిని నీవు జీవరూపుడైన పురుషునకు తగిన సమయమున జూపింతువు. నీవు మా సంతోషమునకు పదారు సాంఖ్యతత్త్వములను నేడు మహదాదులను కల్పింతువు. ఇదంతయు నీ యింద్రజాలమని మాకు భాసించుచున్నది. నీ యనుగ్రహశక్తి లేనిచో నెంత వస్తువైనను చలింపదు. నీ చైతన్య శక్తియే యెల్ల పదార్థములందు నిండి నిబిడీకృతమై యున్నది. నీ శక్తిలేనిచో పురుషుడుగూడ శక్తిరహితుడే యగునని ధీమంతులు వచింతురు. నీవేనీ చైతన్య ప్రభావమున విశ్వమంతటిని ప్రకాశ శక్తితో నింపుదువు. నీ విశ్వాత్మ తేజముతో సమస్తమును వెల్లడి చేయుదువు. కల్పాంతమందీ విశ్వము నంతమొందింతువు. ఇట్టి నీ యద్భుత చరిత్ర వైభవమెవ్వడెఱుగగలడు? జననీ ! భవానీ ! అలనాడు మధుకైటభుల బారినుండి మమ్ము బ్రోచితిని. మాకు దయతో నీ విశాల దివ్యలోకములు జూపితివి. మమ్ము దివ్యానంద ధామములకు జేర్చితివి. నీ దివ్యదర్శనము మహా ప్రభావసంపన్నమైనది. తల్లీ! బ్రహ్మయు శివుడును నేనును నీ దుర్విభావ్యమైన పవిత్రచరిత్రము తెలిసికొనలేకున్నాము. ఇంక సామాన్యుడేమి తెలిసికొనగలడు? నీ విశ్వరచనా కళా కలాపమునందెన్నెన్ని భువనాలు రవణిల్లుచున్నవో చెప్పగలవాడెవ్వడు? అస్మాభి రత్రభువనే హరిరన్యఏవ దృష్టఃశివః కమలజః ప్రథితప్రభావః | అన్యేషు దేవి భువనేషు న సంతి కింతే కింవిద్య దేవి వితతం తవ సుప్రభావమ్. 36 యాచే%ంబతే%ంఘ్రికమలం ప్రణిపత్య కామం చిత్తే సదా వసతు రూప మిదం తవైతత్ | నామాపి వక్త్రకుమారే సతతం తవైవ సందర్శనం తవపదాంబుజయోః సదైవ. 37 భృత్యో%యమస్తి సతతం మయి భావనీయం త్వాం స్వామినీతి మనసా నను చింతయామి | ఏషా%%వయో రవిరతా కిల దేవి భూయా ద్వ్యాప్తిః సదైవ జననీ సుతయో రివార్యే. 38 త్వం వేత్సి సర్వమఖిలం భువనప్రపంచమ్ సర్వజ్ఞతా పరిసమాప్తి నితాంతభూమిః | కిం పామరేణ జగదంబ నివేదనీయమ్ యద్యుక్తమాచర భవాని తవేంగితం స్యాత్. 39 బ్రహ్మా సృజ త్యవతి విష్ణు రుమాపతిశ్చ సంహారకారక ఇయంతు జనే ప్రసిద్ధిః | కిం సత్యమేతదపి దేవి తవేచ్ఛయా వై కర్తుం క్షమా వయ మజే తవ శక్తియుక్తాః. 40 ధాత్రీధరాధరసుతే నజగద్బిభర్తి ఆధారశక్తిరఖిలం తవవై బిభర్తి | సూర్యో%పి భాతి వరదే ప్రభయా యుతస్తే త్వం సర్వమేతదఖిలం విరజా విభాసి. 41 మే మీ భువనమునందు ప్రసిద్ధ ప్రభావములుగల హరిహరబ్రహ్మలను గంటిమి. ఈ త్రిమూర్తు లితర లోకాలలో గూడ నుందురా యేమి? మనోవాక్కుల కందని నీ విచిత్ర ప్రతిభా ప్రభావ సంపదలు మా కేనాటికి నంతుజిక్కుటలేదు. ఈ మా దీనులదొకే యొక విన్నపము అవధరింపుము. ఆనందనిలయమగు నీ దివ్యమంగళ విగ్రహము మా హృదయ పీఠములందు నిచ్చలు నివాళులందుకొననిమ్ము. నీ హ్రీంకారతారక నామామృతము తనివితీర మా నాల్కలపై నిత్యము ప్రవహింపనిమ్ము. నన్ను నీ దాసునిగ భావించుము. నిన్ను నా స్వామినిగ నేలికగ నెమ్మదిలో నిత్యము దలంతును. ఇట్టి తల్లికొడుకుల ప్రేమలు తెగకుండనిమ్ము. మమ్ము నీ కన్నబిడ్డలవోలె గాపాడుము. జగన్మాతా! ఈ యెల్లభువనముల రహస్యము నీకే తెలియును. నీవు సర్వజ్ఞవు. సర్వము నీయందే పరిసమాప్తమగును. నేను వట్టి పామరుడను. నీకు చెప్పగలవాడను గాను. నీవు మాకేది యుక్తమని తోచునో దానినే యొనరింపుము. బ్రహ్మ యీ లోకాలను పుట్టించును, విష్ణువు బ్రోచును, రుద్రుడు సంహరించునను నానుడి జగములందు ప్రసిద్ధమై యున్నది. ఇదంతయు నిజమేనా? ఏది యేమైన మేము మాత్రము నీ దివ్యశక్తితో యుక్తులమై నీ యిష్టప్రకారము వ్యవహరించువారము. పార్వతీ! ఈ సమస్తమును భూమి మోయుటలేదు. నీ ఆధారశక్తియే సర్వభారమును మోయుచున్నది. ఆ సూర్యుడుగూడ నీ స్వయంప్రకాశము గ్రహించియే జగములు వెలిగించుచున్నాడు. ఇటులెల్లవేళల నెల్లెడల నీవే నిర్మల రూపమున ప్రతిభాసించుచున్నావు. బ్రహ్మా%హమీశ్వరవరః కిల తే ప్రభావాత్ సర్వే వయం జనియుతా న యదా తు నిత్యాః | కో%న్యే సురాః శతమఖప్రముఖాశ్చ నిత్యా నిత్యా త్వమేవ జననీ ప్రకృతిః పురాణా. 42 త్వంచే ద్భవాని దయసే పురుషం పురాణమ్ జానే%హ మద్య తవ సన్నిధిగః సదైవ | నోచే దహం విభురనాది రనీహ ఈశో విశ్వాత్మ ధీరితి తమఃప్రకృతిః సదైవ. 43 విద్యా త్వమేవ నను బుద్ధిమతాం నరాణామ్ శక్తిస్త్వమేవ కిల శక్తిమతాం సదైవ | త్వం కీర్తికాంతి కమలామల తుష్టిరూపా ముక్తిప్రదా విరతిరేవ మనుష్యలోకే. 44 గాయత్య్రసి ప్రథమవేదకళా త్వమేవ స్వాహా స్వధా భగవతీ సుగుణా%ర్ధమాత్రా | ఆమ్నాయ ఏవ విహితో నిగమో భవత్యా సంజీవనాయ సతతం సురపూర్వజానామ్. 45 మోక్షార్థమేవ రచయస్యఖిలం ప్రపంచమ్ తేషాం గతాః ఖలు యతో నను జీవభావమ్ | అంశా అనాదినిధనస్య కిలానఘస్య పూర్ణార్ణవస్య వితతాహి యథాతరంగాః. 46 జీవో యదాతు పరివేత్తి తవైవకృత్యమ్ త్వం సంహరస్యఖిల మేతదితి ప్రసిద్ధమ్ | నాట్యం నటేన రచితం వితథేంతరంగే కార్యే కృతే కృతే విరమసే ప్రథితప్రభావా. 47 త్రాతా త్వమేవ మమ మోహమయా ద్భవాబ్ధేః త్వామంబికే సతతమేమి మహా ర్తిదేచ | రాగాదిభి ర్విరచితే వితథే కిలాంతే మామేవ పాహి బహుదుఃఖకరే చకాలే. 48 నమోదేవి మహావిద్యే నమామి చరణౌతవ సదాజ్ఞాన ప్రకాశం మే దేహి సర్వార్థదే శివే. 49 ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ%ష్టా దశసాహస్య్రాం సంహితాయాం తృతీయస్కంధే చతుర్థో%ధ్యాయః. ఓ జననీ! బ్రహ్మ శివుడు నేను నీ సత్ప్రభావమువలన నీ దయవలన జన్మించితిమి. మే మనిత్యులము. ఇక శతక్రతువగు నింద్రాదులు నిత్యు లెట్లగుదురు? నీవే సత్యవు; నిత్యవు; పురాణ ప్రకృతివి. శాశ్వతవు. నీవే పురాణపురుషుని కనికరింతువను సంగతి యిన్నాళ్లు నీ సామీప్యమున నండుటవలన గ్రహింపగలిగితిని. తెలియని ప్రతివాడును నన్నే విభుడని యాద్యుడని యీశుడని నిరీహుడని విశ్వాత్ముడని తలచి యహంకారమయమైన తమఃప్రకృతి గలవాడగును. పండితుల యందలి విద్య శక్తిమంతులయందలి శక్తి మనుజలోకమందలి కీర్తి-కాంతి-తుష్టి నీవే. ముక్తిప్రదవు కమలవు విశ్రాంతి ప్రదాయినివి నీవే. వేదమాతయగు గాయత్త్రి అర్ధమాత్ర స్వాహా స్వధా భగవతియగు సగుణనీవే. దేవతలు మొదలగు జీవుల బ్రతుకుదెరువునకు నీవే వాదాలు నిర్మించితివి. ఎల్లజీవులు నీ యనుగ్రహమునకు పాత్రులై తరించుటకే నీ వీ ప్రపంచములను లీలగ సృజింతువు. అనాదినిధనుడు అనఘుడు పరిపూర్ణుడునైన పరమాత్మయొక్క యంగమే యీ జీవాత్మ. ఈ సకలమును తుదకు నీవే యంతమొందింతువని నీ మహామహిమ నెఱింగిన జీవుడు శాంతుడగును. చమత్కారమయమైన నాటకమం దొక నటుడాడి యాడి తుదకు విశ్రమించును. ఈ జీవులందఱు నటులే చివరకు నీ చెంతనే విశ్రమింతురు. ఈ కాలము సుఖదుఃఖములతో దాగుడుమూత లాడును. ఈ దుఃఖదాయకమైన కాలమునుండి మోహసాగరమునుండి మమ్ము వెన్నంటి గాపాడుము. తల్లీ! మేము నీ శ్రీచరణములకు శరణార్థులము. మహావిద్యా! శివస్వరూపా! సర్వార్థప్రదాయినీ! దేవాధిదేవీ! నీ పదకమలములమీద మా తలలుంతుము. మమ్మీ మోహసాగర మీద నిమ్ము. నీ విజ్ఞానమను వెలుగుబాట చూపుము. మము బ్రోచు భారము నీదే! ఇది శ్రీదేవీ భాగవతమందలి తృతీయ స్కంధమున నాల్గవ యధ్యాయము.