Sri Devi Bhagavatam-1
Chapters
అథ పంచమో%ధ్యాయః బ్రహ్మోవాచ : ఇత్యుక్త్వా విరతే విష్ణౌ దేవదేవే జనార్దనే | ఉవాచ శంకరః శర్వః ప్రణతః పురతః స్థితః.
1 శివ ఉవాచ : యది హరిస్తవదేవి విభావజ స్తదను పద్మజఏవ తవోద్భవః | కిమహమత్ర తవాపి నసద్గుణః సకలలోకవిధ! చతురాశివే.
2 త్వమసి భూః సలిలం పవనస్తథా ఖమపి వహ్నిగుణశ్చ తథా పునః | జనని తాని పునః కరణాని చ త్వమసి బుద్ధిమనో%ప్యథాహంకృతిః. నచవిదంతి వదంతిచ యే%న్యథా హరిహరాజకృతం నిఖిలంజగత్ | 3 తవకృతా స్త్రయఏవ సదైవతే విరచయంతి జగత్సచరాచరమ్. 4 అవనివాయుఖవహ్నిజలాదిభిః సవిషయైఃసగుణౖశ్చ జగద్భవెత్ | యదితదా కథమద్య చ తత్స్ఫుటం ప్రభవతీతి తవాంబ కళామృతే. 5 భవసి సర్వమిదం సచరాచరం త్వమజవిష్ణుశివాకృతి కల్పితమ్ | వివిధవేషవిలాసకుతూహలై ర్విరమసే రమసే%ంబ యథారుచి. 6 సకలలోకసిసృక్షు రహం హరిః కమలభూశ్చ భవామ యదాంబికే | తవ పదాంబుజ పాంసుపరిగ్రహం సమధిగమ్య తదా నను చక్రిమ. 7 యది దయార్ద్రమనా నస%దాంబికే కథమిదం బహుధా విహితం జగత్ | సచివభూపతి భృత్యజనావృతం బహుధ నై రధనైశ్చ సమాకులమ్. 9 తమ గుణాస్త్రయ ఏవ సదాక్షమాః ప్రకటనావన సంహరణషు వై | హరిహరద్రుహిణాశ్చ క్రమాత్త్వయా విరచితా స్త్రిజగతాం కిల కారణమ్.10 పరిచితాని మయా హరిణా తథా కమలజేన విమానగతేన వై | పథిగతైర్భువనాని కృతాని వా కథయ కేన భవాని ననానిచ. 11 సృజసి పాసి జగజ్జగదంబికే స్వకలయా కియదచ్ఛసి నాశితుమ్ | రమయసే స్వపతిం పురుషం సదా తవగతిం నహి విద్మ వయం శివే. 12 ఐదవ అధ్యాయము శ్రీదేవిని శివబ్రహ్మలు ప్రస్తుతించుట బ్రహ్మ యిట్లనియె: అని యీ ప్రకారముగ దేవదేవుడగు విష్ణువు జగదంబను సంస్తుతించి విరమించిన పిమ్మట శర్వుడగు శంకరు డా తల్లి మ్రోల చేతుల జోడించి యిట్లు నుతించెను: సకలలోకవిధాన నిపుణవగు ఓ శివా! బ్రహ్మయు విష్ణువును నీ సత్ప్రభావము వలననే జన్మించి సగుణరూపుడ నైతిని. విశ్వజననీ! నీవే భూమి నీరు అగ్ని వాయువు ఆకాశము జ్ఞానేంద్రియములు కర్మేంద్రియంబులు మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అన్నియును నీవే. తల్లీ! తెలియనివారు బ్రహ్మవిష్ణుమహేశులే యీ జగములనెల్ల రచించిరందురు. కాని, యది సరిగాదు. నిజముగ నీ ముమ్మూర్తులను పుట్టించినది నీవే కదా తల్లీ! నీ దయామృతశక్తివలననే వారీ జగములను నిర్మింపజాలుదురు. ఈ చరాచర జగములెల్ల పంచతన్మాత్రలు త్రిగుణములు నింగి గాలి యగ్ని నీరు నేల అను పంచభూతములతో మాత్రమే సృజింపబడుచున్నవందుమా? అది సరిగాదు. మరేమన - వానిలో నీ చైతన్యజ్యోతి లేనిచో వానికి జీవన తత్త్వము గలుగ నేరదు. హరిహర బ్రహ్మలు నీ దయచేతనే యీ చరాచర జగములు నిర్మించిరి. అందు నీవు బహు నామరూపములలో నీ నచ్చిన వేషము దాల్చి భూతములతో స్వేచ్ఛగ రమింతువు. విరమింతువు. లోకైక జననీ! హరిహరబ్రహ్మ లీ లోకాలను సృష్ట చేయదలచి నీ పదపద్మము లందలి ప్రేమ మధు కణములు గ్రోలుదురు. పిదప వారీ సర్వమును చిత్రవిచిత్రగతుల నిర్మింపజాలుదురు. తల్లీ! నీవు నిత్యసత్యస్వరూపపు దయామృతలహరివి! మఱి హరిని సత్వగుణునిగ బ్రహ్మను రజోగుణయుతునిగ నన్ను తమోగుణిగ నిట్లు భిన్నరూపులనుగ నేల సృజించితివి? అమ్మా! నీ బుద్ధి విషమముగ నున్నదని తలతుము. కానిచో నీ జగములను రాజు మంత్రి సేవకులు ధని దరిద్రుడు నను వై విధ్యముతో నేల సృజింతువు! నీ సత్వరజస్తమోగుణములచే హరి విధి శివులు సృజింపబడిరి. వారు పాలన సృష్టి సంహారము లొనరింతురు. ఈ ముజ్జగములకు వారు కారణభూతులు. హరిహరబ్రహ్మలమగు మేము నీ దివ్యవిమానమున బయనించునపుడు మార్గమధ్యమున మే మనంతపుణ్యలోకములు గంటిమి. అవి నిత్యసవ్యములుగ నున్నవి. వాని నెవ్వరు నిర్మించిరో మాకు దయతో తెలియబలుకుము. నీవు నీ యమృతకళలతో నెల్ల భువనములను బుట్టించి పెంచి త్రుంపదలతువు. నీవాత్మ పతితో పూర్ణసంయోగ మంది నిత్యానంద మనుభవింతువు. మాకు మాత్రము నీ దివ్యమార్గము లెట్టివో బోధపడుట లేదు. జనని దేహి పదాంబుజసేవనం యువతిభావగతా నపి నః సదా | పురుషతా మధిగమ్య పదాంబుజా ద్విరహితాః క్వలభేమ సుఖం స్ఫుటమ్. 13 న రుచిరాస్తి మమాంబ పదాంబుజమ్ తవ విహాయ శివే భువనేష్వలమ్ | నివసింతుం నరదేహ మవాప్యచ త్రిభువనస్య పతిత్వ మవాప్య వై. 14 సుదతి నాస్తి మనాగపి మేరతి ర్యువతిభావ మవాప్య తవాంతికే | పురుషతా క్వసుఖాయ భవత్యలం తవపదం న యదీక్షణగోచరః. 15 త్రిభువనేషు భవత్వియ మంబికే మమ సదై వహి కీర్తి రనావిలా | యువతిభావ మవాప్య పదాంబుజం పరిచితం తవ సంసృతినాశనమ్. 16 భువి విహాయ తావాంతిక సేవనం కివ వాంఛతి రాజ్యకంటకమ్ | త్రుటి రసౌ కిల యాతి యుగాత్మతాం న నికటం యది తే%ంఘ్రిసరోరుహమ్. 17 తపసి యే నిరతా మునయో%మలా స్తవ విహాయ పదాంబుజపూజనమ్ | జనని తే విధినా కిల వంచితాః పరిభవో విభ##వే పరికల్పితః. 18 నతపసానదమేనసమాధినాచతథావిహితైఃక్రతుభిర్యథా | తవపదాబ్జపరాగని షేవణాద్భవతిముక్తిరజేభవసాగరాత్. 19 మే మాడుదనమున నున్నవారము. మాకు నీ చరణ కమల ములందలి భక్తి ప్రసాదమిమ్ము. పురుషుడైనను నీ పదాంబుజంబులు నిక్కము భజింపని వాడు నిత్యసుఖములకు నోచుకొనడు. ఈ జగములందు నా మనస్సు నీ పదపద్మ సేవకు తప్ప మరెచ్చటికిని బోదు. నేను పురుషత్వమందినను త్రిభువనాధిపత్య మందినను నీ పదకమలములు పాసి యుండుటుకు నా మనసొప్పుటలేదు. నీ పాదపద్మముల సన్నిధినుండగ నా కెట్టి కొఱతయులేదు. నీ పదపద్మములు నా కన్నుల కెల్లవేళల గనబడుచున్న నదే పదివేలు-నేను పురుషత్వమును గోరుకొనను. యువతిగ నున్న నేను నీ చరణకమలము లాశ్రయించినచో నాకీ ముల్లోకములందు శాశ్వతయశము చేకురును! భవబంధములు తెగును! ఈ భూమిపై నీ పదసన్నిధి సౌభాగ్యమును గాలదన్ని నిష్కంటకమైన రాజ్యము గోరుకొను వాడెవ్వడు? ఒకవేళ నెవడేని నీ పదాంబుజములను తూలనాడినచో వాడు యుగములవఱకు జన్మ పరంపర లెత్తవలసిన వాడే యగును. ఏ మునులు నీ పదకమల మందలి భక్తి వదలి నిర్మలతప మొనరింతురో వారుగూడ విధివంచితు లగుదురు. ఏలన-వారు త్రిగుణమయులు. నీ సదమలభక్తిలేమిచే వారు ముక్తికి దూరులగుదురు. ముక్తిలక్ష్మి తపమునగాని దమమునగాని సమాధిచేగాని యాగాదులవలనగాని సాధ్యముగాదు. నీ పదజలములం దాత్యంతిక భక్తి యున్నప్పుడే మోక్షము కరతలామలక మగును. కురుదయాం దయ సేయది దేవిమాం కథయ మంత్ర మనావిల మద్భుతమ్ | సమభవం ప్రజవ న్సుఖితోహ్యయమ్ సువిశదం చ నవార్ణ మనుత్తమమ్. 20 ప్రథమజన్మని చాధిగతో మయా తదధునా నవిభాతి నవాక్షరః | కథయ మాంమనుమద్య భవార్ణవా జ్జనని తారయ తారయతారకే. 21 బ్రహ్మోవాచః: ఇత్యుక్తాసా తదాదేవీ శివేనాద్భుతతేజసా | ఉచ్చచారాంబికా మంత్రం ప్రస్ఫుటం చ నవాక్షరమ్. 22 తంగృహీత్వా మహాదేవః పరాంముద మవాపహ | ప్రణమ్య చరణౌ దేవ్యా స్తత్త్రైవావస్థితః శివః. 23 జప న్నవాక్షరం మంత్రం కామదం మోక్షదం తథా | బీజయుక్తం శుభోచ్చారం స్తస్థివాం స్తదా. 24 తం తథా%వస్థితం దృష్ట్వా శంకరం లోకశంకరమ్ | అవోచంతాం మహామాయాం సంస్థితో%హం పదాంతికే. 25 నవేదా స్త్వామేవం కలయితు మిహాన న్నపటవో యతస్తే నోచుస్త్వాం సకలజనధాత్రీ మవికలామ్ | స్వాహాభూతా దేవీ సకలమఖహోమేషు విహితా తదా త్వం సర్వజ్ఞా జనని ఖలు జాతా త్రిభువనే. 26 కర్తా%హం ప్రకరోమి సర్వమఖిలం బ్రహ్మాండ మత్యద్భుతమ్ కో%న్యో%స్తీహ చరాచరే త్రిభువనే మత్తః సమర్థః పుమాన్ | ధన్యో%స్మ్యత్ర న సంశయఃకిల యదా బ్రహ్మా%స్మి లోకాతిగో మగ్నో%హం భవసాగరే ప్రవితతే గర్వాభివేశాదితి. 27 అద్యాహం తవపాదపంకజ పరాగాదానగర్వేణ వై | ధన్యో%స్మీతి యథార్థవాదనిపుణో జాతః ప్రసాదాచ్చతే. యాచేత్వాంభవభీతినాశచతురాంముక్తిప్రదాంచేశ్వరీమ్|హిత్వామోహకృతం మహాతినిగడంత్వద్భక్తి యుక్తంకురు. 28 అతో%హంచ జాతో విముక్తః కథంస్యాం సరోజా దమేయా త్త్వదావిష్కృతాద్వై | తవాజ్ఞాకరః కింకరో%స్మీతి నూనం శివే! పాహి మాం మోహమగ్నం భవాబ్ధౌ. 29 నజానంతి యేమానవా స్తేవదంతి ప్రభుం మాం తవాద్యం చరిత్రం పవిత్రమ్ | యజంతీహ యేయాజకాః స్వర్గకామా నతే తే ప్రభావం విదంత్యేవ కామమ్. 30 ఓ సర్వ మంత్రాత్మికా! నా యెదలో నీ దయామృతరేణువు కొంత చిందింపదలచినచో నుత్తమము పావనము నగు నీ నవార్ణ మంత్ర రాజము నాకు ప్రసాదింపుము. నేను దానిని నిత్యము జపింతును. ఆత్మ చింతన సుఖమున నిత్యమోలలాడుదును. భవతారిణీ! జననీ! పూర్వజన్మమున నేను నవాక్షర మంత్ర మెఱింగితిని. కాని, యిపుడు నాకది స్ఫురించుట లేదు కనుక, నీభవార్ణవము దాటుటకు ఆ నవార్ణ మంత్ర ముపదేశింపుము. బ్రహ్మ యిట్లనియె : ఈ ప్రకారముగ మహాతేజస్కుడగు శివుడు పలుకగనే కరుణామయిదేవి శివునకు నావాక్షర మంత్రము స్పష్టమున నుపదేశించెను. శివుడు దేవివలన నవాక్షర మంత్రము స్వీకరించి యమితానందభరితుడై దేవీ పాదపద్మములకు వినయాంజలులు ఘటించి యచ్చోగూరుచుండెను. ఆ మంత్రము కామమోక్షప్రదము. దానిని బీజాక్షరములతో దీకగ చక్కగ శివుడు జపించుచు వెలుగొందుచుండెను. అట్లు లోకశంకరుడగు శంకరుడు మంత్రప్రభావమున శోభిల్లుటగని నేనును మహామాయా సన్నిధికేగి యామెతో నిట్లంటివి! ఓ జనయిత్రి! లోకధాత్రి! వేదములుగూడ నిన్ను గుఱించి సమగ్రముగ నభివర్ణింపనోపవు. ఓ యజ్ఞరూపిణి! నీవు యాగము లందు వేల్చునపుడు స్వాహానామమున పిలువబడుదువు. ఈ త్రిభువనములందు నీ వొక్కతెవే సర్వజ్ఞురాలవు! ఈ వింతలు గొల్పు ముల్లోకములకు నేను కర్తను. ఈ చరాచర జగములందు నాకంటె నితరుడెవ్వడును సమర్థుడు లేడు. నేనే కడు ధన్యుడను. సర్వశ్రేష్ఠుడనని గర్వాతిరేకమున దలచుచు నీ సంసార జలధిలో మునుకలు వేయుచున్నాను. ఓ ముక్తిప్రదాయినీ! భయనివారిణీ! ఈశ్వరీ! నేడు నీ సుప్రసాదమున నీ పదపద్మ సన్నిధి జేరిన నే నెంతయో ధన్యుడనని గర్వపడుచున్నాను. నాలోని మోహము గడియదీసి వెలుగుబాట జూపించుము అని నిను సవినయముగ వేడుకొనుచున్నాను. కావున నోమాతా! నీ చరణకమల ప్రభావమున నా మదినిండ శాంతికాంతులు నిండినవి. ఓ శివంకరి! ఇంక నీ యాన జవదాటను. నీ కింకరుడను. మోహ జలధిలో మునిగిన నన్ను గాపాడుము! నీ మహనీయ పవిత్ర చరిత్ర నెఱుంగని మూర్ఖులు నన్ను ప్రభువని తలంతురు. యాజకులు స్వర్గముగోరి యాగములు చేతురు. త్వయా నిర్మితో%హం విధిత్వే విహారం వికర్తుం చతుర్థా విధాయాదిసర్గమ్ | అహంవేద్మి కో%న్యో వివేదాదిమాయే క్షమస్వాపరాధం త్వహంకారజం మే. 31 శ్రమంయే%ష్టధా యోగమార్గే ప్రవృత్తాః ప్రకుర్వంతి మూఢాః సమాధౌ స్థితావై | నజానంతి తే నామమోక్షప్రదంవా సముచ్చారితం జాతు మాతర్మిషేణ. 32 విచారేపరే తత్త్వసాంఖ్యా విధానే పదే మోహితా నామతే సంవిహాయ | నకింతే విమూఢా భవాబ్ధౌ భవాని త్వమేనాసి సంసారముక్తి ప్రదావై. 33 పరం తత్త్వవిజ్ఞాన మాద్యైర్జ నైర్యై రజేచానుభూతం త్యజంత్యేవ తేకిమ్ | నిమేషార్ధమాత్రం పవిత్రం చరిత్రమ్ శివాచాంబికా శక్తిరీశేతి నామ. 34 నకింత్వం సమర్థా%సి విశ్వం విధాతుం దృశైవాశు సర్వం చతుర్ధా విభక్తమ్ | వినోదార్థమేవం విధింమాం విధాయ దిసర్గే కిలేదం కరోషీతి కామమ్. 35 హరింపాలకః కింత్వయా%సౌ మధోర్వా తథా కైటభాద్రక్షితః సింధుమధ్యే | హరః సంహృతః కింత్వయా%సౌ నకాలే కథంమే భ్రువో ర్మధ్యదేశా త్సజాతః. 36 కిలాద్యా%సి శక్తి స్త్వమేకా భవాని! స్వతంత్రైః సమసై#్త రతో బోధితా%సి. 37 త్వయా సంయుతో%హం వికర్తుం యమర్థో హరిస్త్రాతుమంబ త్వయాసంయుతశ్చ | హరః సంప్రహర్తుం త్వయైవేహయుక్తః క్షమా నాద్య సర్వే త్వయా విప్రయుక్తాః 38 యథా%హం హరిః శంకరః కిం తథాన్యే నజాతా నసంతీహ నోహ%భవిష్యన్ | నముహ్యంతి కే%స్మిం స్తవాత్యంతచిత్తే వినోదే వివాదాస్పదే%ల్పాశయానామ్. 39 ఆదిదేవీ! నాలుగు వర్ణములుగల ప్రజలను బుట్టింపుమని నీవు నన్ను జ్యేష్ఠునిగ బ్రహ్మగ నేర్పరచితివి. కాని, నా కంటె నితరుడెవ్వడు గలడను నహంకారముతో కన్ను మిన్ను గానకున్నాను. నా యపరాధము క్షమించుము! అష్టవిధయోగమార్గములలో శ్రమించి సమాధినిష్ఠులైనవారు సైతము నీ నామ మహిమ నెఱుగలేరు. కాని నీ దివ్యనామము కపటముగ బల్కినను సరే, అది ముక్తికి సోపానమగును. సాంఖ్యులు నీ దివ్యనామము పరిత్యజించి మూఢులై వర్తిల్లుదురు. అట్టి వారిని భవవారిధి నుండి దాటించి యుమృతత్వ మొసగుతల్లివి నీవే. ఆద్యులగు హరి హరులను గొల్చినను నీ పరమతత్వ మెఱింగినవారు నీ నామ మహిమ నెఱుంగగలరు. వారు నిన్ను మహాశక్తీ శివా ఈశ్వరీ అంబికా యని నీ దివ్యనామమును నిమిషమైన వదలక జపించుచుందురు. విశ్వజననీ! నీ కటాక్ష వీక్షణము మాత్రనే నీ వీ నలు తెఱుంగుల నున్న జగములను నిర్మింపజాలుదువు. ఐనను నన్ను సృజించి నాచేత సృష్టి విదింపజేయుట చూడగ నిదంతయు నీ వినోదలీలగ భాసించుచున్నది. శ్రీహరి విశ్వపాలకుడు. అతడు జలధి మధ్యమున నుండగ మధుకైటభ దానవుల బారినుండి యాహరిని బ్రోచిన తల్లివి నీవే. ఆ శివుడును నీ చేత హరింపబడి మరల ప్రళయాంతమున నీ కనుబొమల నడుమనుండి యుద్భవించును. ఓ విశ్వమాత! నీ పావన జన్మమునకు మూలమేదో మేమింతవఱకు కనివిని యెఱుగము. ఓ భవాని! నీ వొక్కతెవే యాద్య శక్తివి. సర్వతంత్ర స్వతంత్రవని మేము నిన్ను సంబోధింతుము. నీ శక్తి తోడున్ననే హరి విశ్వరక్షణమును రుద్రుడు సంహారమును నేను సృష్టిని చేయగల్గుచున్నాము. నీ చైతన్య శక్తి తోడులేనిచో నెంతటివాడైన నేమియు జేయజాలడు. హరి శివుడు నేనువలెత్రిమూర్తులు మరెవ్వరేనిగలరా? పూర్వముండిరా? ఇదంతయు సత్తు, అసత్తను వితర్కమును మూఢమతులే యొనరింతురు. అకర్తా గుణస్పష్ట ఏవాద్య దేవో నిరీహో%నుపాధిః సదైవాకలశ్చ | తథా%పీశ్వర స్తే వితీర్ణంవినోదం సుసంపశ్యతీ త్యాహురేవం విధిజ్ఞాః. 40 దృష్ట్వా%దృష్ట విభేదే%స్మి న్ప్రాక్త్వత్తోవై పుమాన్పరః | నాన్యః కో%పి తృతీయో%స్తి ప్రమేయే సువిచారితే. 41 నమిథ్యా వేదవాక్యంవై కల్పనీయం కదాచన | విరోధో%యం యయా%త్యంతం హృదయేతు విశంకితః. 42 ఏకమేవాద్వితీయం యద్బ్రహ్మ వేదా వదంతివై | సాకింత్వం వా%ప్యసౌ వాకిం సందేహం వినివర్తయ. 43 నిఃసంశయం నమే చేతః ప్రభవ త్యవిశంకితమ్ | ద్విత్వైకత్వవిచారే%స్మి న్నిమగ్నం క్షుల్లకం మనః. 44 స్వముఖేనాపి సందేహం ఛేతు మర్హసి మామకమ్ | పుణ్యయోగాచ్చమే ప్రాప్తా సంగతి స్తవ పాదయోః. 45 పుమానసి త్వంస్త్రీ వా%సివద విస్తరతో మమ | జ్ఞాత్వా%హం పరమాం శక్తిం ముక్తః స్యాం భవసాగరాత్. 46 ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ%ష్టాదశసాహస్య్రాం సంహితాయాం తృతీయస్కంధే పంచమో%ధ్యాయః నీ యీ విచిత్రలీలా వినోదముల నాద్యదేవుడు నిర్గుణుడు నిర్వికల్పుడు నిరుపాధికుడు విశ్వేశ్వరుడునగు విశ్వుడే యవలోకింపగలడని విధిజ్ఞులు పలుకుచుందురు. చరాచర భేదములుగల యీ రేడు లోకములందు నీ కంటె నన్యుడెవ్వడును లేడు. వేదవాక్కెప్పుడును రిత్తగ బలుకదు. అదియ ద్వైతమునే వక్కాణించును. కాని నేడు నా యెదలో ద్వైతము భాసించుచున్నది. ద్వైతము వేద విరుద్ధము. దీనిని గూర్చి నాకు సంశయము గల్గుచున్నది. ఒకటియే. రెండవ వస్తువు లేదు అని వేదము లుద్ఘోషించును. నీవట్టి బ్రహ్మవా? లేక ఆదిశక్తివా? నా యీ సందియ ముడుపుము. నాది క్షుద్రబుద్ధి. నీ వాస్తవికత నెఱుంగ లేక నా మది కొట్టుమిట్టాడుచున్నది. నా యీ తీరని సంశయము సంప్రాప్తించినది. తల్లీ! నీవు నిజముగ పురుషుడవా? యువతివా?! నా కింతకు నిజము పలుకుము. పరాశక్తివగు నీ దయకు పాత్రుడనై నేనీ మహా మాయాసాగరమునుండి విముక్తుడనగుదును. ఇది శ్రీదేవీభాగవతమందలి తృతీయస్కంధమందు పంచమాధ్యాయము.