Sri Devi Bhagavatam-1
Chapters
అథ షష్ఠోధ్యాయః బ్రహ్మా : ఇతిపృష్టా మహాదూవీ విపచావపతూప చ | ఉవాచ వచనం శ్లక్ణ మాద్యా భగవతీ హి సా.
1 దేవీ:సదైకత్వంనభేదో%స్తిసర్వదైవమమాస్యచ|యో%సౌసా%హమహంయో%సౌభేదోస్తిమతివిభ్రమాత్.
2 ఆవయో రంతరం సూక్ష్మం యోవేద మతిమాన్హిసః | విముక్తః సతు సంసారా న్ముచ్యతే నాత్ర సంభయః.
3 ఏకమేవాద్వితీయం వై బ్రహ్మ నిత్యం సనాతనమ్ | ద్వైతభావం పునర్యాతి కాల ఉత్పత్తి సంజ్ఞకే.
4 యథా దీప స్తథోపాధే ర్యోగా త్సంజాయతే ద్విధా | ఛాయేవాదర్శ మధ్యే వా ప్రతిబింబం తథా%%వయోః.
5 భేద ఉత్పత్తికాలేవై సర్గార్థం ప్రభవత్యజ | దృశ్యాదృశ్య విభేదో%యం ద్వైవిధ్యే సతి సర్వథా.
6 నాహం స్త్రీ నపుమాంశ్చాహం నక్లీబం సర్గసంక్షయే | సర్గేసతి విభేదః స్యా త్కల్పితో%యం ధియా పునః.
7 అహం బుద్ధి రహం శ్రీశ్చ ధృతిఃకీర్తి ః స్మృతి స్తథా | శ్రద్ధా మేధా దయా లజ్జా క్షుధాతృష్ణా తథా క్షమా.
8 కాంతిఃశాంతిః పిపాసాచ నిద్రాతంద్రా జరా%జరా | విద్యా%విద్యా స్పృహావాంఛా శక్తిశ్చాశక్తిరేవచ.
9 వసా మజ్ఞా చత్వక్చాహం వృష్టిర్వాగనృతా ఋతా | పరా మధ్యాచపశ్యంతీ నాడ్యో%హం వివిధాశ్చ యాః. 10 కింనాహం పశ్యసంసారే మద్వియుక్తం కిమస్తిహి | సర్వమేవాహ మిత్యేవం నిశ్చయం విద్ధిపద్మజ! 11 ఏతైర్మే నిశ్చితైరూపై ర్విహీనం కింవదస్వ మే | తస్మాదహం విధే చాస్మి న్సర్గేవై వితతా%భవమ్. 12 ఆఱవ అధ్యాయము బ్రహ్మ యిట్లనియె: నే నీ ప్రకారమున సవినయముగ ప్రశ్నింపగ మహామాయాదేవి భగవతి మధురభాషలతో నాతో నిట్లు పలికెను: ఓ బ్రహ్మా! వాస్తవమున సద్వస్తు వొక్కటియే కలదు. అదే బ్రహ్మము. రెండవది లేదు. ఆ బ్రహ్మమే నేను. నేనే బ్రహ్మము. మతి విభ్రాంతివలన శక్తిమంతులకు భేదమున్నట్లు గన్నట్టును. అది సరికాదు. కాని మా యిరువురి భేదమతి సూక్ష్మతమమై తెలియరాకుండును. దాని నెఱింగిన స్థితప్రజ్ఞుడే దుస్తర సంసరణమును తేలికగ దాటగలుగును. ఇందు సందియము లేదు. బ్రహ్మ మేకము. అద్వితీయము. నిత్య భావమును పొందును. ఒకే దీపకాంతి యుపాధి భేదములతో ననేక విధములుగ నొప్పును. ఒకే ముఖము పలు విధముల యద్దాలలో పలురీతుల ప్రతిబింబించును. అదే తీరున మేము విశ్వరూపములు దాల్తుము. ప్రపంచమంతయు ప్రళయ సమయమున మాయలో లయమగును. అది సృష్ఠికాలమున మరల భిన్నభిన్నముగ పొడగట్టును. ఈ భేదము దృశ్యమునను నిరు తెఱగులుగ నుండును. నాకు ప్రళయకాలమున స్త్రీ పున్నపుంసక భేదము లుండవు. మరల సృష్టి సమయమందీ వై విధ్యము గోచరించును. ఈ భేదమంతయును బుద్ధిచే గల్పింపబడినదే. ఈ వ్యక్తమగుచున్న ధృతి స్మృతి శ్రద్ధ బుద్ధి మేధ దయ కీర్తి శ్రీ క్షమ లజ్జ క్షుధ తృష్ణ క్షమ కాంతి శాంతి పిపాస నిద్ర తంద్రజం అజర విద్య అవిద్య స్పృహ వాంఛ శక్తి అశక్తి మజ్జ చర్మము వర్షము వాక్కు సత్యము అసత్యము పర పశ్యంతి మధ్యమ వైఖరి మున్నగునవియు వివిధ నాడులును నేనే. ఈ జగములం దణువణువున నేనే వెలసియున్న దేవతను. నేను లేని వస్తువే లేదు. ఇది నిజమని చక్కగ నెఱుంగుము. అన్ని రూపములు నా శక్తి స్వరూపములే. నా యీ శక్తికి భిన్నముగ నేదే నున్నదేమో చెప్పుము. నా శక్తిచేతనత్వమే యీ సృష్టియం దంతటను వ్యాపించియున్నది. నూనం సర్వేషు దేవేషు నానానామధరా హ్యహమ్ | భవామి శక్తిరూపేణ కరోమిచ పరాక్రమమ్! 13 గౌరీమ్రాహ్మీ తథారౌద్రీ వారాహీ వైష్ణవీ శివా | వారునీ చాథకౌబేరీ నారసింహీచ వా సవీ. 14 ఉత్పన్నేషు సమస్తేషు కార్యేషు ప్రవిశామి తాన్ | కరోమి సర్వకార్యాణి నిమిత్తంతం విధాయవై. 15 జలేశీతం తథావహ్నా వౌష్ణ్యం జ్యోతి ర్దివాకరే | నిశానాథే హిమాకామం ప్రభవామి యథా తథా. 16 మయాత్యక్తం విధే! నూనం స్పందితుం నక్షమం భ##వేత్ | జీవిజాతంచ సంసారే నిశ్చయో%యం బ్రువే త్వయి. 17 అశక్తః శంకరో హంతుం దైత్యాన్కిల మయోజ్ఝితః | శక్తిహీనం నరంబ్రూతే లోకశ్చైవాతి దుర్బలమ్. 18 రుద్రహీనం విష్ణుహీనం నవదంతి జనాఃకిల | శక్తిహీనం యథాసర్వే ప్రవదంతి నరాధమమ్. 19 పతితః స్ఖలితో భీతః శాంతః శత్రువశం గతః | అశక్తః ప్రోచ్యతే లోకే నారుద్రః కోపి కథ్యతే. 20 తద్విద్ధి కారణం శక్తి ర్యయాత్వం చ సిసృక్షసి | భవితాచ యదాయుక్తః శక్త్యా కర్తా తదా%భిలమ్. 21 తథా హరి స్తథా శంభు స్తథేంద్రో%థ విభావసుః | శశీసూర్యో యమస్త్వష్టా వరుణః పవన స్తథా. 22 ఎల్లదేవతలందు నే నొక్కతెను పెక్కు నామ రూపముల నలరుచుందును. నేను శక్తి రూపముదాల్చి నా విక్రమము జూపుదును. బ్రాహ్మి వైష్ణవి రౌద్రి గౌరి శివ నారసింహి వాసవి వారుణి కౌబేరి మొదలుగాగల రూపములన్నియు నావే. సకల కార్యములుత్పన్నముగాగ నేను వానిలో ప్రవేశింతును. ఆ కారణమున నీ కార్యములన్నింటిని నేనే చేయింతును. నీటియందలి చల్లదనము అగ్నియందలి వేడిమి సూర్యుని యందలి ప్రకాశము చందురు నందలి చల్లని వెన్నెల నేనయి యొప్పుచున్నాను. నా శక్తి తోడులేనిచో బ్రహ్మ యణువంతగూడ కదలజాలడు. ఇక ప్రాణులమాట చెప్పనేల? ఇదంతయు నిజమని నీతో పలుకుచున్నాను. ఆ శివునియందు శక్తిలేనిచో నతడు దనుజులను దునుమాడ జాలడు. ఈ భూమిపై శక్తిరహితుని లోకులు చవట యందురు. అట్టి చవటను వీడు విష్ణుహీనుడనికాని రుద్రహీనుడనికాని లోకులు పలుకరు. మరేమన వీడు శక్తిహీనడని తెగ తెగడుదురు. పతితుడు స్ఖలితుడు భీతుడు శాంతుడు శత్రువశుడు నగువానిని జనము శక్తిహీనుడనునుగాని రుద్రహీనుడనరు. ఇంతకు నీ సృష్టికంతటికిని మూలకారణము శక్తియని యెఱుంగుము. నీవును శక్తియుక్తుడవైననాడే సృష్టికార్యము చేయజాలుదువు. అదేవిధముగ హరి శివుడు ఇంద్రుడు రవి చంద్రుడు అగ్ని వరుణుడు వాయువు యముడు శక్తిసంపన్నులై యెప్పుచున్నారు. ధరా స్థిరా తదాధర్తుం శక్తియుక్తా యదాభ##వేత్ | అన్యథౄ చేదశక్తి స్యాత్పరమాణోశ్చ ధారణ. 23 తథా శేష స్తథాకూర్మో యే%న్యేసర్వేచ దిగ్గజాః | మద్యుక్తావై సమర్థాశ్చ స్వానికార్యాణి సాధితుమ్. 24 జలం పిబామి సకలం సంహరామి విభావసుమ్ | పవనం స్తంభయామ్యద్య యదిచ్ఛామి తథా%చరమ్ 25 తత్త్వానాంచైవ సర్వేషాం కదా%పి కమలోద్భవః అసతాం భావసందేహః కర్తవ్యోన కదాచన. 26 కదాచి త్ప్రాగభావః స్యాత్ ప్రధ్వంసాభావ ఏవనా | మృత్పిండేషు కపాలేషు ఘటాభావో యథాతథా. 27 అద్యాత పృథివీనాస్తి క్వగతేతి వాచరణ | సంజాతా ఇతి విజ్ఞేయా అస్యాస్తు పరమాణవః. 28 శాశ్వతం క్షణికం శూన్యం నిత్యానిత్యం సకర్తృకమ్ | అహంకారాగ్రిమం చైవసప్తభేదై ర్వివక్షితమ్. 29 గృహాణాజ! మహత్తత్త్వ మహంకార స్తదుద్భవః | తతః సర్వాణి భూతాని రచయస్వ యథాపురా. 30 వ్రజంతు స్వానిధిష్ణ్యాని విరచ్యాని వసంతువః | స్వానిస్వాని చ కార్యాణి కుర్వంతు దైవభావితాః. 31 గృహాణమాం విధే! శక్తింసురూపాం చారుహాసినీమ్ | మహాసరస్వతీం నామ్నా రజోగుణ యుతాం వరామ్. 32 శ్వేతాంబరధరాం దివ్యాం దివ్యభూషణ భూషితామ్ | వరాసన సమారూఢాం క్రీడార్థం సహచారిణీమ్. 33 ఏషా సహచరీ నిత్యం భవిష్యతి వరాంగనా | మా%వమంస్థా విభూతిం మేమత్వా పూజ్యతమాం ప్రియామ్. 34 గచ్ఛత్వ మనయాసార్థం సత్యలోకం బతాశువై | బీజా చ్చతుర్విధం సర్వం సముత్పాదయ సాంప్రతమ్. 35 లింగకోశాశ్చ జీవై సై#్తః సహితాః కర్మభి స్తథా | వర్తంతే సంస్థితాః కాలే తాన్కురు త్వం యథాపురా. 36 ఈ భూమిలో గొప్ప ధారణశక్తి గలదు. కాననే ధరణి సర్వమును మోయుచున్నది. కానిచో భూమి యొకచిన్న రేణువునుగూడ మోయజాలదు. అట్లే మహాశేషుడు కూర్మము దిగ్గజములు మున్నగువాని యందలి భరించు శక్తి నాదే. ఆ శక్తి వలననే వారు సర్వము భరించి సర్వకార్యములు సాధింప సమర్థులగుచున్నారు. నేను నీరుగ్రోలినచో నెంతటి పెనుమంటలైన చల్లారిపోవును. నేనే తలచుకొన్నచో గాలినెక్కడికక్కడ స్తంభింప జేయగలను. కావున దైవతత్త్వమువలన సత్తులుగ భావించి యెన్నడును సందేహింపరాదు. ఏ వస్తువునకైన ప్రాగభావము ప్రధ్వంసాభావము గలుగవచ్చును. ఎట్లన మట్టిముద్దయందు కుండ ఘటరూపముగనబడదు. ఇపుడిచట భూమిలేదు. ఈ భూమి యెచట గలదని విచారింపగ నది పరమాణురూపమున నెచటనో కలదని తెలిసికొనవలయును. ఈ జగము శాశ్వతము క్షణికము శూన్యము నిత్యము అహంకారయుతమునను సప్త భేదములతో నుండును. పరమేష్ఠీ! ఇపుడు నీవీ మహత్తత్త్వము స్వీకరింపుము. దీనినుండి యహంకారముత్పన్నమగును. దానివలన వెనుకటివలె సర్వభూతసృష్టి కొనసాగింపుము. ఇపుడు మీరు మీమీ లోకములు నిర్మించుకొని యందు సుఖనివాసము చేయుడు. మీమీ కార్యములను యథాయోగ్యమున దైవ ప్రేరితముగ కొనసాగింపుడు. నీవీ మహాసరస్వతీ శక్తిని పరిగ్రహింపుము. ఈమె సురూప- రజోగుణాత్మిక - చారుమృదుహాసిని. శుభవస్త్రాన్విత దివ్యసంస్కృతభూషణ వరాసనాసీన. ఈమె నీ సహధర్మచారిణియై నీ విలాసములందు నీకు చేదోడు వాదోడుగ నుండగలదు. ఈమె నావాగ్విభూతి. ఈమె నెన్నడు నవమానింపకుము. సరసధ్వనిగ విశ్వమాన్యగ విశ్వపూజ్యగ విశ్వప్రియగ భావింపుము. నీవీమెనుగూడి సత్యలోకమేగుము. సర్వవిధముల ప్రజల నందుండి సృజింపుము. జీవులందరును తమతమ కర్మానుసారముగ కారణరూపముననుందురు. తమతమ వెనుకటి కర్మలతో లింగకోశమునందున్న జీవులను తగినకాలమునందు మునుపటివలెనే మరల సృజింపుము. కాలకర్మ స్వభావాద్యైః సకలంజగత్ | స్వభావ స్వగుణౖ ర్యుక్తం పూర్వ త్సచరాచరమ్. 37 మాననీయ స్త్వయా విష్ణుః పూజనీయశ్చ సర్వదా | సత్త్వగుణ ప్రధానత్వా దధికః సర్వతః సదా. 38 యదాయదాహి కార్యంవో భవిష్యతి దురత్యయమ్ | కరిష్యతి పృథివ్యాంవై అవతారం తదాహరిః. 39 తిర్యగ్యోనా వథాన్యత్ర మానుషీం తను మాశ్రితః | దానవానాం వినాశంవై కరిష్యతి జనార్దనః. 40 భవో%యంతే సహాయశ్చ భవిష్యతి మహాబలః | సముత్పాద్య సురాన్సర్వా న్విహరస్వయథాసుఖమ్. 41 బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యా నానాయజ్ఞైః సదక్షిణౖః | యజిష్యంతి విధానేన సర్వాన్వః సుసమాహితాః. 42 మన్నా మోచ్చారణా త్స ర్వే మఖేషు సకలేషుచ | సదా తృప్తాశ్చ సంతుష్టా భవిష్యధ్వం సురాఃకిల. 43 శివశ్చ మాననీయావై సర్వథా యత్తమోగుణః | యజ్ఞకార్యేషు సర్వేషు పూజనీయః ప్రయత్నతః. 44 యదాపునః సురాణాంవై భయం దైత్యా ద్భవిష్యతి | శక్తయో మే తదోత్పన్నా హరిష్యంతి సువిగ్రహాః. 45 వారాహీ వైష్ణవీ గౌరీ నారసింహీ సదాశివా | ఏతాశ్చాన్యాశ్చ కార్యాణి కురుత్వం కమలోద్భవ! 46 నవాక్షర మిమంమంత్రం బీజధ్యాన యుతం సదా | జపన్సర్వాణి కార్యాణి కురుత్వం కమలోద్భవ! 47 మంత్రాణా ముత్తమో%యం వై త్వంజానీహి మహామతే ! హృదయేతే సదాధార్యః సర్వకామార్థసిద్ధయేజ. 48 అన్ని జీవులను వాని స్వభావము-కాలము-కర్మమునకు దగినట్లుగా పూర్వమువలె మరల సృష్టించుము. ఈరీతి నీరేడులోకములను విరచించుము. శ్రీమహావిష్ణువు సత్వగుణ ప్రధానుడు. అందువలన నతడు నీకంటె శ్రేష్ఠుడు. నీకెల్ల వేళల మాననీయుడు పూజనీయుడునగును. నీవు దుస్తరకార్యము లొనరించినప్పుడెల్ల హరి ధర్మసంరక్షణ కవతరించును. అ జనార్దనుడు నరతిద్యగ్యోనులందు జన్మించి దానవులను వినాశమొనరించుచు సాధువులకు పరితోష మొనరించుచుండును. మహాబలశాలి యగు శివుడు నీకు తోడుగనుండును. అపుడు నీవీసకల ప్రపంచములను సృజియించి స్వేచ్చగా విహరింపుము. బ్రాహ్మణక్షత్రియ వైశ్యులు విధివిధానముగ సమభావముతో భూరిదాన దక్షిణలతో మీ యాగములొనరింతురు. దేవతలు యాగములందమృత మధురమైన నా నామ జపమొనరించుచు సంతుష్టలైయుందురు. సోముడగు పరమశివుడు తమోగుణ ప్రధానుడు. అతడెల్ల యాగములందు పూజ్యుడు మాన్యుడునగుచు మహారుద్రాభిషేకములందుకొనుచుండును. దేవతలకు దైత్యులవలన నుపద్రవములు సంభవించునపుడెల్ల నా దివ్యశక్తులెల్లెడల నుత్పన్నములై సురలకు భయము బాపి యసురుల పీచమడంచును. వారాహి నారసింహి వైష్ణవి గౌరి సదాశివ మున్నగువారు నా శక్తి స్వరూపిణులు, లోకాతీత కార్యము, లొనరింపజాలుదురు. ప్రణవాత్మకమైన నా గుహ్య నవాక్షరమంత్రమును సబీజముగ ధ్యానయుతముగ నిరంతరము జపించుచు నీ పనులన్నియు చక్కబెట్టుకొనుచుండుము. ఈ మంత్రరాజము సర్వమనోరథములు నెరవేర్పగలదు. దీనిని చక్కగ నేమఱుపాటులేక హృదయంబున నిలుపుకొనుము. ఇత్యుక్త్వా మాంజగన్మాతా హరింప్రాహ శుచిస్మితా | వ్రజ గృహాణమాం మహాలక్ష్మీం మనోహరామ్. 49 సదా వక్షఃస్థలే స్థానే భవితా నాత్ర సంశయః | క్రీడార్థంతే మయాదత్తా శక్విః సర్వార్థదా శివా. 50 త్వయేయం నావమంతవ్యామాననీయా చ సర్వదా | లక్ష్మీనారాయణాఖ్యో%యం యోగోవై విహితో మయా. 51 జీవనార్థం కృతాయజ్ఞా దేవానాం సర్వథా మయా | అవిరోధేన సంగేన వర్తితవ్యం త్రిభిఃసదా. 52 త్వంచ వేధాః శివస్త్వేతే దేవా మద్గుణసంభవాః | మాన్యాః పూజ్యాశ్చ సర్వేషాం భవిష్యంతి నసంశయః. 53 యేవిభేదం కరిష్యంతి మానవా మూఢచేతసః | నిరయం తే గమిష్యంతి విభేదా న్నాత్రంశయః. 54 యోహరిః సశివః సాక్షా ద్యఃశివః సస్వయం హరిః | ఏతయో ర్భేదమాతిష్ఠ న్నరకాయ భ##వేన్నరః. 55 తథైవ ద్రుహిణో జ్ఞేయో నాత్రకార్యా విచారణా | అపరో గుణభేదో%స్తి శృణు విష్ణో! బ్రవీమితే. 56 ముఖ్యాః సత్త్వగుణా స్తే%స్తు పరమాత్మ విచింతనే | గౌణత్వే%పి పరౌ ఖ్యాతౌ రజోగుణ తమోగుణౌ 57 లక్ష్మాసహ వికారేషు నానాభేదేషు సర్వదా | రజోగుణయుతో భూత్వా విహరస్వానయాసహ. 58 వాగ్బీజం కామబీజంచ మాయాబీజం తృతీయకమ్ | మంత్రో%యం త్వంరమాకాంత! మద్దతః పరమార్థదః. 59 గృహీత్వాజప తంనిత్యం విహరస్వ యథాసుఖమ్ | నతే మృత్యుంభయం విష్ణో నకాలప్రభవం భయమ్. 60 అని యిట్లు జగనాత్మ బ్రహ్మతో బలికి పిదప లేతనగవున సుధలు చిందగ హరితో నిట్లు పలికెను: ఓ విష్ణూ! నీ వీ మనోహరయగు రమాదేవిని గైకొని చనుము. ఈ యమ నీ వక్షఃస్థలమును నివాసముగ జేసికొని వసించును. ఈమె సిరిసంపదలకు పెన్నిధి. నీ విలాసార్థ మీ కల్యాణిని నీ కొసంగితిని. ఈమె లోకాలకు దీపాంకుర. ఈమెను నీ వేనాడును దూలనాడకుము. మన్నించి గారవింపుము. నేను మీ కిట్లు యోగము విధించితిని. దీనికి తిరుగులేదు. దేవతల మనుగడకు యజ్ఞములు విధించితిని. మీలో మీరలు పోట్లాటలు మాని క్షమతాసమతలతో వర్తింపుడు. నీవు సదాశివుడు బ్రహ్మయును నా స్వాంశవలన జన్మించితిరి. మీర లెల్లవారలచేత మాననీయులై నిత్యపూజ లందుకొందురు. ఇందు ఆవంతయు సందియము లేదు. మీ మువ్వురి యెడలను భేదము పాలించు మూఢమతులు నరకముల పాలగుదురు. ఇది ముమ్మాటికి నిజము. శివుడే స్వయముగ విష్ణువు. విష్ణువే స్వయముగ శివుడు. వీరికి భేదము గలదను వారు నిశ్చితముగ నరకయాతన లందగలరు. బ్రహ్మను సైత మిటులే యభేదభావమున గాంచవలయును. హరీ! ఇంక గుణభేదములయందలి యంతరము చెప్పుదును వినుము. ఆ పరమాత్మను తన యెదలో జింతించుటకు సత్త్వగుణము కావలయును. నీకు రజస్తమస్సులు ప్రధానమైనవి గావు. పలు వికారములు భేదములు గలిగినప్పుడు రజోగుణముతో ఈ లక్ష్మితోగూడి వర్తింపుము. వాగ్బీజము మాయాబీజము కామబీజమునను త్రిబీజములుగల మంత్రము సకలార్థప్రదాయకము. దీనిని నీకు ప్రసాదించితిని. ఈ దివ్యప్రణవ మంత్రమును గ్రహించి పాటించి నియమించి జపించుము. యథాసుఖముగ సంచరింపుము. నీ కిక మృత్యుభయముగాని కాలభీతికాని కలుగనేరదు. యావదేష విహారోమే భవిష్యతి సునిశ్చయః | సంహరిస్యా మ్యహం సర్వం యదా విశ్వం చరాచరమ్. 61 భవంతో%పి తదానూనం మయిలీనా భవిష్యథ | స్మర్తవ్యో%యం సదామంత్రః కామదో మోక్షద స్తథా. 62 ఉద్గీథేనచ సంయుక్తః కర్తవ్యః శుభ మిచ్ఛతా | కోరయిత్వా%థ వైకుంఠం వస్తవ్యం పురుషోత్తమ! 63 విహరస్వ యథాకామం చింతయన్మాం సనాతనీమ్ | బ్రహ్మా: ఇత్యుక్త్వా వాసుదేవం సాత్రిగుణా ప్రకృతిః పరా. 64 నిర్గుణా శంకరం దేవమవోచ దమృతం వచః | దేవీ : గృహాణ హర గౌరీం త్వం మహాకాళీం మనోహరామ్. 65 కైలాసం కారయిత్వాచ విహరస్వయథాసుఖమ్ | ముఖ్యస్తమోగుణస్తే%స్తు గౌణౌ సత్వరజోగుణొ. 66 విహరాసుర నాశార్థం రజోగుణ తమోగుణౌ | తప స్తప్తుం తథాకర్తుం స్మరణం పరమాత్మనః. 67 శర్వఃసత్త్వగుణః శాంతో గ్రహీతవ్యః సదానఘ! సర్వథా త్రిగుణా యూయం సృష్టిస్థిత్యంతద కారకాః. 68 ఏభిర్విహీనం సంసారే వస్తు నైవాత్ర కుత్రచిత్ | వస్తుమాత్రంతు యద్దశ్యం సంసారే త్రిగుణం హితత్. 69 దృశ్యంచ నిర్గుణం లోకే నభూతం నభవిష్యతి | నిర్గుణః పరమాత్మా%సౌ నతుదృశ్యః కదాచన. 70 సగుణా నిర్గుణా చాహం సమయే శంకరోత్తమా | సదాహం కారణం శంభో! నచ కార్యం కదాచన. 71 సగుణా కారణత్వాద్వై నిర్గుణా పురుషాంతికే | మహత్తత్త్వ మహంకారో గుణాః శబ్దాదయ స్తథా. 72 కార్యకారణరూపేణ సంసారంతే త్వహర్నిశం | సదుద్భూత స్త్వహంకార స్తేనాహం కారణం శివా. 73 నే నీ మాయాశక్తితో విహరించు నంతకాలము జగము లుండును. తుద కీ చరాచరవిశ్వము నాయందు లయ మందును. ఆనాడు మీరును నాయందే లయమందుదురు. అంతదనుక కామదము ముక్తిప్రదమునైన నా యీ రహస్యమంత్రమును నిత్యము జపించుచుండుము. శుభములు బడయగోరువా డీ మంత్రమునకు పణవము జేర్చి జపింపవలయును. నీ వింక వైకుంఠము నిర్మించుకొని యందు సుఖనివాస మొనరించుచుండుము. సనాతన భగవతినగు నన్నును చింతించుచు సై#్వరవిహారము సల్పుము. అని త్రిగుణ ప్రకృతి యగు పరాభట్టారికా దేవి వాసుదేవునితో బలికె నని బ్రహ్మ పలికెను. పిదప ఆ నిర్గుణ స్వరూప శంకర భగవానునితో నమృతము గురియుచు నిట్లు పలికెను: ఓ మహాదేవ! హర! నీ వీ సర్వశక్తిమయి శ్రీమహాకాళియగు గౌరిని జేపట్టుము. నీవు కైలాసము నిర్మించుకొని యందుస్వేచ్ఛగ సంచరింపుము. నీకు తమోగుణము ప్రధానము-సత్వరజస్సులప్రధానములుగ నుండును. నీ రజస్తమోగుణములచేత రాక్షసవంశ నాశమగును. ఆ పరమాత్ముని నిత్యము సంస్మరించుటకు జాగరూకతతో తమ మొనరించుము. నీవు శాంతభావమున సత్త్వగుణుడవై శర్వరూపము నాశ్రయించి యుందువు. ఇట్లు మీరు మువ్వురును త్రిగుణులై సృష్టి స్థితి సంహారము లొనరింపుడు. జగముల కన్నిటికి త్రిగుణములే మూలస్తంభములు. ఈ ప్రపంచమున ప్రతి వస్తువు త్రిగుణమయమై యొప్పెసగును. ఈ సారహీనమైన ప్రపంచమందు నిర్గుణతత్వమును నేను జూచితి నన్నవాడుగాని చూచువాడుగాని చూడగలవాడుగాని లేడు. నిర్గుణ మా పరమాత్మయే. అతడు దృక్కేకాని దృశ్యతత్త్వము కాడు. శంకరా! నేను సృష్టి కాలమున సగుణను-లయమున నిర్గుణనై వెలుగొందుదును. నే నెప్పుడును కారణరూపమున నుందునుగాని కార్యరూపమున నుండను. నేను కారణరూపమున నిర్గుణను. పరమ పురుషు నానందసంగమంబునందు సగుణనై యుందును. మహత్తత్త్వము - అహంకారము - శబ్దాదిగుణములు - కార్యకారణ రూపములు ననువానితో జేరి నేను రేబవళ్ళు వ్యవహరింతును. నేను సదుద్భూతమైన యహంకార స్వరూపను. కాన సర్వకారణురాలను - శివరూపను. అహంకారశ్చ మే కార్యం త్రిగుణో%సౌ ప్రతిష్ఠితః | అహంకారా న్మహత్తత్తవం బుద్ధిఃసా పరికీర్తితా. 74 మహత్తత్త్వంహి కార్యంస్యా దహంకారోహి కారణమ్ | తన్మాత్రాణి త్వహంకారా దుత్పద్యంతే సదైవహి. 75 కారణం పంచభూతానాం తాని సర్వసముద్భవే | కర్మేంద్రియాణి పంచైవ పంచజ్ఞానేంద్రియాణిచ. 76 మహాభూతాని పంచైవ మనఃషోడశ మేవచ! కార్యంచ కారణం చైవ గణో%యంషోడశాత్మకః. 77 పరమాత్మా పుమానాద్యో నకార్యం నచ కారణమ్ | ఏవం సముద్భవః శంభో సర్వేషా మాదిసంభ##వే. 78 సంక్షేపేణ మయాప్రోక్త స్తవ తత్ర సముద్భవః | వ్రజత్వద్య విమానేన కార్యార్థం మమసత్తమాః! 79 స్మరణా ద్దర్శనం తుభ్యం దాస్యే%హం విషమేస్థితే | స్మర్తవ్యా%హం సదా దేవాః పరమాత్మా సనాతనః. 80 ఉభయోః స్మరణాదేవ కార్యసిద్ధి రసంశయమ్ | బ్రహ్మా: ఇత్యుక్త్వా విససర్జాస్మా న్దత్త్వా శక్తీః సుసంస్కృతాన్. 81 విష్ణవే%థ మహాలక్ష్మీం మహాకాళీం శివాయచ | మహాసరస్వతీం మహ్యం స్థానాత్తస్మా ద్విసర్జితాః. 82 స్థలాంతరం సమాసాద్య తేజాతాః పురుషావయమ్ | చింతయంతః స్వరూపం తత్ప్రభావం పరమాద్భుతమ్. 83 విమానంత త్సమాసాద్య సంరూఢా స్తత్రవై త్రయః | నద్వీపో%సౌ నసాదేవీ సుధాసింధు స్తథైవచ. 84 ఆసాద్య తస్విన్వితతే విమానే ప్రాప్తా వయం పంకజసన్నిధౌచ | మహార్ణవే యత్రహతౌ దురత్య¸° మురారిణా తౌ మధుకైటభభాభ్యౌ. 85 ఇతి శ్రీదేవీభాగవతేమహాపురాణ తృతీయస్కంధే షష్ఠో%ధ్యాయః. అహంకారము నాకు కార్యము. అది త్రిగుణములను గూడియుండును. అహంకృతినుండి మహత్తత్వము గల్గును. అది బుద్ధి సమష్టి యనబరగును. అహంకారము కారణము. మహత్తత్వము కార్యము. ఆ యహంకృతినుండి పంచతన్మాత్రలు గల్గును. వాని నుండి పంచమహాభూతముల యుత్పత్తి జరుగును. పంచజ్ఞానేంద్రియములు-పంచకర్మేంద్రియంబులు-పంచమహాభూతములు-ఇవన్ని గలిసి పదారగును. ఇది కార్యములును కారణములు నగు షోడశాత్మక స్వరూపము. పరమాత్ముడు పురుషోత్తముడు-ఆద్యుడు-కార్యకారణ రహితుడు. ఈ విధముగ సృష్టి మొదట నా వలన నీ వికారములన్నియు క్రమముగ గలుగుచుండును. ఇట్లు మీకు సంక్షేపముగ సృష్టి క్రమమును వెల్లడించితిని. ఇంక మీదట మీరలు మీ మీ విమానములమీద మీ మీ స్థానములకేగి యాత్మకార్యములు నిర్వహింపుడు. మి మ్మాపద లనెడి పెంజీకట్లు ముసరినప్పుడెల్ల నన్ను మదిలో సంస్మరింపుడు. నేను మీ బాధలు కూకటివేళ్లతో బెకలించి మీకు శుభోదయము గల్గింతును. దేవతలారా! నన్ను పరాత్మనుగ సనాతననుగ నిత్యము సంస్మరింపుడు. సర్వశక్తులమగు మాలో నెవరిని తలంచినప్పటికిని నిక్కువముగ మీకు కార్యసిద్ధి చేకూరును. మీరు మా మీదనే విశ్వాసము ప్రేమ ఉంచుడు. బాహ్యవస్తులను నమ్ముకొని మోసపోకుడు. అవి నురుగుల వంటివి. బ్రహ్మ యిట్లనియె: ఈ ప్రకారముగ నా మహాశక్తి మాతో బలికి మా యాత్మలు సంస్కరించి శ్రీమహాలక్ష్మిని శ్రీవిష్ణునకు శ్రీమహాకాళిని శివునకు శ్రీమహాసరస్వతిని నాకు నప్పగించి యా జగదంబ మమ్ము వీడ్కొనెను. ఆ చోటు వదలిన వెంటనే మేము పురుషరూపములతో వెలుగొందితిమి. అపుడిదంతయును శ్రీదేవియొక్క యతిమానుషమతి లౌకిక మత్యద్భుతమైన ప్రభావమని మేము గ్రహించితిమి. మేము మరల నాదివ్యవిమాన మధిరోహించితిమి. అపుడు మాకాదేవికాని ద్వీపముగాని సుధాసింధువుగాని కనబడలేదు. ఆ విమానమున మేము మాత్రమే మిగిలితిమి. అట్లు మేమా విమానమునెక్కి మురారి చేతిలో దుర్దాంతులైన మధుకైటభులు హతులైన సాగరమందలి మహాపద్మము చెంతకేగితిమి. ఇది శ్రీదేవీభాగవత మందలి తృతీయస్కంధమందు షష్ఠాధ్యాయము.