Sri Devi Bhagavatam-1    Chapters   

అథ సప్తమోధ్యాయః

బ్రహ్మా: ఏవంప్రభావా సాదేవీ మయాదృష్టా%థ విష్ణునా | శివేనాపి మహాభాగ! తాస్తాదేవ్యః పృథక్పృథక్‌. 1

వ్యాసః: ఇత్యాకర్ణ్య పత్వురాక్యం నారదో మునిసత్తమః | పప్రచ్ఛ పరమ ప్రీతః ప్రజాపతి మిదంవచః.2

నారదః: పుమానాద్యో%యవినాశో యో నిర్గుణో%చ్యుతి రవ్యయః| దృష్టశ్చై వానుభూతశ్చ తద్వదస్వ పితామహ. 3

త్రిగుణా వీక్షితా శక్తి ర్నిర్గుణా కీదృశీపితః | తస్యాః స్వరూపం మే బ్రూహి పురుషస్య చ పద్మజ! 4

యదర్థం మయాతప్తం శ్వేతద్వీపే మహాతపః | దృష్టాసిద్ధా మహాత్మాన స్తాపసా గతమన్యవః. 5

పరమాత్మా నసంప్రాప్తో మయా%సౌ దృష్టిగోచరః | పునఃపున స్తపస్త్రీవ్రం కృతంతత్ర ప్రజాపతే! 6

భవతా సగుణాశక్తి ర్దృష్టా తాత మనోరమా | నిర్గుణా నిర్గుణశ్చై కీదృశౌ తౌ వదస్వమే. 7

వ్యాసః: ఇతిపృష్టః పితాతేన నారదేన ప్రజాపతిః | ఉవాచ వచనం తథ్యం స్మితపూర్వం పితామహః. 8

బ్రహ్మాః: నిర్గుణస్య మునేరూపం నభ##వే ద్దృష్టిగోచరమ్‌ | దృశ్యంచ నశ్వరం యస్మా దరూపం దృశ్యతే కథమ్‌. 9

నిర్గుణా దుర్గమా శక్తి ర్నిర్గుణశ్చ తథాపుమాన్‌ | జ్ఞానగమ్యౌతా మునీనాంతు భావనీ¸° తథాపునః. 10

అనాదినిధనౌ విద్ధిసదా ప్రకృతిపూరుషౌ | విశ్వాసే నాభిగమ్యౌతౌ నావిశ్వాసేన కర్హిచిత్‌. 11

చైతన్యం సర్వభూతేషు యత్తద్విద్ధి పరాత్మకం | తేజః సర్యత్రగం నిత్యం నానాభావేషు నారద! 12

తంచతాంచ మహాభాగ వ్యాపకౌ విద్ధి పర్వగౌ | తాభ్యాం విహీనం సంసారే నకించి ద్వస్తు విద్యతే. 13

తౌవిచింత్యౌ సదాదేహే మిశ్రీభూతౌ సదా%వ్య¸° | ఏకరూపౌ చిదాత్మనౌ నిర్గుణౌ నిర్మలావుభౌ. 14

ఏడవ అధ్యాయము

నారదా! ఇట్టి విచిత్ర చరిత్రగల శ్రీదేవిని హరిహరులును నేనును వేరువేరుగ సందర్శించితిమి అని బ్రహ్మ పలుకగా విని దేవర్షియగు నారదుడు పరమప్రీతుడై తన తండ్రియగు ప్రజాపతిని మరల నిట్లు ప్రశ్నించెను: ఆద్యుడు-అచ్యుతుడు-అవ్యయుడు- నిర్గుణుడునగు పరమపురుషుని దర్శించి యనుభవించిన నీ స్వానుభవము నాకు తేటతెల్లముగ బలుకుము. నీవు త్రిగుణ మూలశక్తి రూపము గాంచితినంటివి. ఆ స్వరూప మెటువంటిది? మఱి నిర్గుణశక్తి స్వరూపమును పురుష స్వరూపమును కన్నులకు గట్టినట్లు వివరించుము. నే నేప్రణవస్వరూపుని గాంచుటకు శ్వేతద్వీపమున మాటిమాటికి తపమొనర్తునో దేనికై ప్రణవము జపింతునో మహాత్ములు కోపరహితులు తాపసులు నెవరినిగాంతురో ఆ పరమాత్ముడు నాకు గోచరుగడుటలేదు. ఆ విశ్వాత్ముని జెందుటకు మాటిమాటికి నాత్మ విచారమున తపమొనరింతును. నీవు సగుణరూపయగు మహాశక్తిని సందర్శించితివి. నిర్గుణశక్తి నిర్గుణస్వరూప పరమాత్ముడు నెట్టివారలో నాకు తెలియబలుకుము. ఇట్లు నారదుడడుగగా బ్రహ్మ నవ్వుచు నతనితో యథార్థ విషయము నీవిధముగ బలుకదొడంగెను: నారదా! నిర్గుణ స్వరూపమెప్పుడు నెవ్వరికిని గోచరముగాదు. ఏలయన, నాదృశ్యమంతయు మిథ్యయే. నశ్వరమే. నిర్గుణబ్రహ్మమే సత్యము. రూపరహితమెట్లు గోచరమగును? ఆ నిర్గుణశక్తి దుర్గమమైనది. ఆ నిర్గుణపురుషుడు దుర్గముడు. వారు మనోవాక్కులకు గోచరింపరు. పరమమును లహంకార మడచుకొని భావనచే జ్ఞాన జ్యోతితో నిర్గుణతత్త్వము గందురు. ప్రకృతి పురుషు లనాది నిధనులని యెఱుంగుము. వారి నాత్మ విశ్వాసముచేతనే గుర్తింపవలయును. కాని, విశ్వాసము గుదురనివా డెఱుగజాలడు. సర్వభూతములందలి చైతన్యశక్తిని పరమాత్మశక్తిగ భావింపుము. ఆ సత్యతేజము సర్వవ్యాపకము. నిత్యము. అది పెక్కు రూపులు దాల్చును. ఆత్మచైతన్యము-శక్తి- రెండు భిన్నములు. సర్వవ్యాపకములు. వీని యునికిలేక జగమందలి యే పదార్థమును లేదు. ఈ రెండును ప్రతి దేహమునందును కలిసిమెలిసి యుండును. ఆ రెండు నొకేరూపము గలవి; నిర్గుణములు-నిర్మలములు-సచ్చిదానంద స్వరూపములు.

యాశక్తిః పరమాత్మా%సౌ యో%సౌసా పరమామతా | అంతరం నైతయోః కో%పి సూక్ష్మం వేదచ నారద! 15

అధీత్య సర్వశాస్త్రాణి వేదాన్యంగాంశ్చ నారద! నజానంతి తయోఃసూక్ష్మ మంతరం విరతిం వినా. 16

అహంకార కృతం సర్వం విశ్వం స్థావర జంగమమ్‌ | కథంత ద్రహితంపుత్త్ర ! భ##వేత్కల్ప శ##తైరపి. 17

నిర్గుణం సగుణః పుత్ర కథంపశ్యతి చక్షుషా | సగుణంచ మహాబుద్ధే! చేతసా సంవిచారయ.

18

పిత్తేనాచ్ఛాదితా జిహ్వా చక్షుశ్చ మునిసత్తమ | కటుపిత్తం విజానాతి రసంరూపం నత త్తథా.

19

గుణౖః సమావృతం చేతః కథం జానాతి నిర్గుణమ్‌ | అహంకారోద్భవం తచ్చ తద్విహీనం కథంభ##వేత్‌. 20

యావన్న గుణవిచ్ఛేద స్తావత్త ద్దర్శనం కుతః | తంపశ్యతి తదా చిత్తే యదా%హంకార వర్ణితః. 21

నారద ఉవాచ : స్వరూపం దేవదేవేశ ! త్రయాణా మేవ విస్తరాత్‌ |

గుణానాం యత్స్వరూపో%స్తి హ్యహంకార స్త్రిరూపకః. 22

సాత్త్వికో రాజసశ్చైవ తామసశ్చ తథా%పరః | విభేదేన స్వరూపాణి వదస్వ పురుషోత్తమ. 23

యద్‌జ్ఞాత్వా విప్రముచ్యే%హం జ్ఞానం తద్వదమేప్రభో | గుణానాం లక్షణాన్యేవ వితతాని విభాగశః. 24

ఆ శక్తియే పరమాత్మ. పరమాత్మయే శక్తి. వీరి భేదము నెవ్వరు నెఱుగలజాలరు. సాంగవేదములను నిఖిల శాస్త్రములను చదివినప్పటికిని ఆత్మానాత్మవివేకము లేనివాడు ఈ సూక్ష్మభేద మెఱుగజాలడు. ఈ చరాచరజగము లన్నియు సహంకార మమకారమయములు. కాని, వీని ప్రభావమున నరుడు నూఱువేల కల్పములకైన నహంకృతిని బాయలేడు. సగుణమును నిర్గుణమును కన్నులతో జూడజాలదు. కనుక ముమ్మొదట నెమ్మదిగ సగుణరూపముగూర్చి చింతింపవలయును. ఈ నాలుకయు కన్నులును పిత్తముచే నావరింపబడియుండును. నాలుక కారము మున్నగు రసములను తెలిసికొనును. కన్ను రూపములను గాంచును. కాని, నాలుక రూపము నెన్నటికిని తెలిసికొనజాలదు. గుణావృతమగు చిత్తము నిర్గుణమును తెలిసికొనజాలదు. అహంకారములో బుట్టిన మనస్సునుండి యహంకార మెట్లు తొలగగలదు? గుణ వికారములు దొలగిపోనంతవఱకు బ్రహ్మదర్శన మసంభవము. అహంకారము తొలగిన వెంటనే చిత్తవికారము లణగును. అపు డాత్మతేజము నేను నేనని తానుగ వెల్గుచుండును. కనుక నహంకారలయ మావశ్యకము అను బ్రహ్మవాక్కులు విని నారదుడు మరల బ్రహ్మ నిట్లు ప్రశ్నించెను: ఓ దేవేశా! త్రిగుణముల-త్రివిధాహంకారముల-నిజస్వరూపమును నాకు తేటతెల్ల మొనరింపుము. సాత్త్వికము రాజసము తామసమునను వాని భేదములను రూపములను గుఱించి నాకు మరింత వివరించి తెలుపుము. ఏ సత్యదర్శనజ్ఞానమున నేను సంసార వ్యామోహములనుండి విముక్తుడనగుదునో నాకు దానిని దెలుపుము. గుణముల లక్షణములను వాని విభాగములను గూర్చి సవిస్తరముగ నాకు ప్రబోధింపుము అన-

బ్రహ్మోవాచ : త్రయాణాం శక్తయస్తిస్ర స్తద్భ్రవీమి తవానఘ | జ్ఞానశక్తిః క్రియాశక్తి రర్థశక్తి స్తథా%పరా. 25

సాత్త్వికస్య జ్ఞానశక్తీ రాజసస్య క్రియాత్మికా | ద్రవ్యశక్తి స్తామసస్య తిస్రశ్చ కథితా స్తవ. 26

తేషాం కార్యాణి వక్ష్యామి శృణు నారద ! తత్త్వతః | తామస్యా ద్రవ్యశ##క్తేశ్ప శబ్దస్పర్శ సముద్భవః. 27

రూపం రసశ్చ గంధశ్చ తన్మాత్రాణి ప్రచక్షతే | శ##బ్దైకగుణ మాకాశం వాయుఃస్పర్శ గుణస్తథా. 28

సురూపైక గుణో%గ్నిశ్చ జలంరస గుణాత్మకమ్‌ | పృథ్వీగంధ గుణాజ్ఞేయా సూక్ష్మాణస్త్ర్యతాని నారద. 29

దశై తాని మిళిత్వాతు ద్రవ్యశక్తి యుతానివై | తామసాహం కారగఃస్యా త్సర్గస్త దనువృత్తికః. 30

రాజస్యాశ్ఛ క్రియాశ##క్తే రుత్పన్నాని శృణుష్వమే | శ్రోత్రం త్వగ్రసనా చక్షుర్ఘ్రాణం చైవచ పంచమమ్‌. 31

జ్ఞానేంద్రియాణి చైతాని తథా కర్మేంద్రియాణిచ | వాక్పాణి పాదపాయుశ్చ గుహ్యాంతాని చ పంచవై. 32

ప్రాణో%పానశ్చ వ్యానశ్చ సమానోదాన వాయవః | పంచదశ మిళిత్వైవ రాజసః సర్గఉచ్యతే. 33

సాధనాని కిలైతాని క్రియాశక్తి మయానిచ | ఉపాదానం కిలైతేషాం చిదనువృత్తి రుచ్యతే. 34

జ్ఞానశక్తి సమయుక్తాః సాత్త్వికాచ్చ సముద్భవాః | దిశోవాయుశ్చ సూర్యశ్చ వరుణశ్చా శ్వినావపి. 35

జ్ఞానేంద్రియాణాం పంచానాం పంచాధిష్ఠాతృదేవతాః | చంద్రోబ్రహ్మాతథారుద్రః క్షేత్రజ్ఞశ్చ చతుర్థకః. 36

ఇత్యంతః కరణాఖ్యస్య బుద్ధ్యాదేశ్చాధిదైవతమ్‌ | చత్వార్యేవ తథాప్రోక్తాః కిలాధిష్ఠాతృ దేవతాః. 37

మనసాసహచైతాని నూనం పంచదశైవతు | సాత్త్వికస్యతు సర్గో%యం సాత్త్వికాఖ్యః ప్రకీర్తితః. 38

స్థూలసూక్ష్మాది భేదేన ద్వేరూపే పరమాత్మనః | జ్ఞానరూపం నిరాకారం నిదానం తత్ప్రచక్షతే. 39

బ్రహ్మయిట్లనియె: అనఘా! ఈ త్రివిధగుణములకు త్రివిధశక్తు లుండును. అవి జ్ఞానశక్తి క్రియాశక్తి అర్థశక్తి నా బరగును. జ్ఞానశక్తి సత్వగుణమునకు క్రియాశక్తి రజోగుణమునకు అర్థశక్తి తమోగుణమునకును సంబంధించి యుండును. ఈ త్రిగుణముల కార్యములను విపులీకరింతును. వినుము. తమోగుణమగు ద్యవ్యశక్తివలన తన్మాత్రలు గల్గును. శబ్దము-స్పర్శము-రూపము- గంధము ననబడునవి తన్మాత్ర లగును. ఆకాశముయొక్క ధర్మము శబ్దము. వాయు గుణము స్పర్శము. అగ్నిగుణము రూపము. జల గుణము రసము. భూమి గుణము గంధము. ఇవి సూక్ష్మతన్మాత్రలనబడును. ఈ భూతపంచకమును తన్మాత్రలును మొత్తము పదియు ద్రవ్యశక్తితో గలిసియుండును. ఇట్టి తామసాహంకారవృత్తి వలన బ్రహ్మాండసృష్టి జరుగును. ఇక రజోగుణముగల క్రియాశక్తివలన నుత్పన్నమైన వానిని దెలుపుదు నాలింపుము: చర్మము-కన్ను-చెవి-నాలుక-ముక్కు-ఈయైదను జ్ఞానేంద్రియము లనబడును. నోరు-చేయు-కాలు-పాయువు-ఉపస్థయనునవి కర్మేంద్రియములు. ప్రాణము-అపానము-వ్యానము-ఉదానము- సమానము ననునవి పంచవాయువులు. ఈ పదునైదును గలసిరజోగుణమువలన నుత్పన్నమగు నని చెప్పబడును. వీని సాధనము లన్నియును క్రియాశక్తికి సంబంధించి యుండును. వీని కన్నిటికిని చిద్వృత్తి యుపాదానకారణ మగును. వాయువు సూర్యుడు దిశలు వరుణుడు అశ్వినులు అను దేవతలు సత్త్వగుణ సంభూతులు జ్ఞానశక్తియుక్తులు. వీరు పంజ్ఞానేంద్రియములకు వరుసగ నధిష్ఠానదేవతలు. చంద్రుడు - బ్రహ్మ - క్షేత్రజ్ఞుడు - రుద్రుడు - ననువారు మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అనువాని కధిష్ఠాతృదేవతలు. ఇవన్నియు మనస్సుతో గలిసి పదునైదగును. వీరందఱును సత్వగుణప్రధాను లగుటవలన నిది సాత్త్వికసృష్టి యనంబరగును. ఆ పరమాత్మకు స్థూలము సూక్ష్మము నను భేదుములతో రెండు రూపములు గలవు. మొదటిది నిరాకారము. జ్ఞానరూపము. వివర్తముల కన్నిటికిని కారణము. రెండవది సాకారము సగుణము.

సాధకస్యతు ధ్యానాదౌ స్థూలరూపం ప్రచక్షతే | శరీరంసూక్ష్మ మేవేదం పురుషస్య ప్రకీర్తితమ్‌. 40

మమచైవశరీరం వై సూత్రమి త్యభిధీయతే | స్థూలంశరీరం వక్ష్యామి బ్రహ్మణః పరమాత్మనః. 41

శృణునారద ! యత్నేన యచ్ఛ్రుత్వా విప్రముచ్యతే | తన్మాత్రాణి పురోక్తాని భూతసూక్ష్మాణి యానివై. 42

పంచీకృత్యతు తాన్యేవ పంచభూత సముద్భవః | పంచీకరణ భేదో%యం శృణు సంవదతః కిల. 43

ప్రథమం రసతన్మాత్రా ముపాదాయ మనస్యపి | కల్పయేచ్చ తథాతద్వై యథాభవతి చో దకమ్‌. 44

శిష్టానాం చైవ భూతానా మంశా న్కత్వా పృథక్‌ పృథక్‌ | ఉదకే మిశ్రయేచ్చాంశా న్కృతే రసమయే తతః. 45

తదాభూత విభాగేచ చైతన్యేచ ప్రకాశితే | చైతన్యస్య ప్రవేశాచ్చ తదా%హమితి సంశయః.

46

ప్రతీయమానే తేనైవ విశేషేణా భిమానతః | ఆదినారాయణో దేవో భగవానితి చోచ్యతే. 47

పరాధ్యాన సమయమునందు దేవియొక్క దయామూర్తి నుపాసించవలయును. అది దేవి స్థూలరూపము. ఆ పరమాత్మునిలోని స్వరూపమును సూక్షముగ నెఱుంగవలయును. ఆ సూక్ష్మ శరీరమునే సూత్రాత్మకమనియు విబుధులు నుడువుదురు. ఆ పరమాత్మయగు బ్రహ్మయొక్క రెండవరూపము స్థూలశరీరము. దానిని గూర్చి తెల్పుదును: దేనిని వినుట వలన బంధవిముక్తి గలుగునో దానిని వక్కాణింతును. భూత సూక్ష్మములగు తన్మాత్రలను మొదటనే వివరించితిని. వీని పంచీకరణమువలన పంచభూతములు సముద్భూతము లయ్యెను. ఆ పంచీకరణ రహస్య మెఱింగింతును. మొదట రస తన్మాత్రను తీసికొనవలయును. దానిని రెండుగ విభజించవలయును. అందొక భాగము వేరగును గద! ఇటులనే తక్కిన నాలుగు భూతములను రెండు రెండుగ వేరువేరుగ విభజింపవలయును. ప్రతి రెండవ భూతాంశమున తక్కిన నాల్గింటి భాగములను గలుపవలయును. అనగ నొక సగము నీటి భాగమునకు తక్కిన ప్రతి సగము భూతాంశముయొక్క నాల్గవ భాగము గలుపవలయును. అపు డొక్క జలభూత మేర్పడును. ఇట్లు భూత పంచీకరణము జరుగును. పిదప ప్రతి భూతాంశమందును చైత్యశక్తి ప్రతిబింబించును. అపు డందుండి మనోమయమైన యహంవృత్తి ప్రకటితమగును. ఆ వృత్తి విశేష మభిమానముతో ప్రద్యోతిత మగును. అపు డా శక్తి యాదినారాయణుడగు వైశ్వానర భగవానుడుగ బిలువబడును.

ఘనీభూతే%థ భూతానాం విభాగే స్పష్టతాంగతే | వృద్ధింప్రాప్య గుణౖశ్చేత్థ మేకైకగుణ వృద్ధితః. 48

ఆకాశస్య గుణశ్చైకః శబ్దఏవ నచాపరః | శబ్దస్పర్శౌ చ వాయో

శ్చ ద్వౌగుణౌ పరికీర్తితౌ. 49

అగ్నేఃశబ్దశ్చ స్పర్శశ్చ రూపమేతే త్రయోగుణాః | శబ్దస్పర్శ రూపరసా శ్చత్వారోవై జలస్యచ. 50

స్పర్శశబ్ద రసారూపం గంధశ్చ పృథివీగుణాః | ఏవంమిళిత యోగైశ్చ బ్రహాండోత్పత్తి రుచ్యతే. 51

సర్వే జీవా మిళిత్వైవ బ్రహ్మాండాంగ సముద్భవాః | చతురశీతి లక్షాశ్చ ప్రోక్తావై జీవజాయతః. 52

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ తృతీయస్కంధే సప్తమో%ధ్యాయః.

ఈ విధమగు పంచీకరణముచే ఆకాశాది భూతపంచకము సుస్పష్టముగ ప్రద్యోతితమగును. ఏకైక గుణవృద్ధిచే నొక్కొక్క భూతస్వభావము స్థూలతరమగు చుండును. ఎట్లన నాకాశమునకొకే శబ్దగుణము, వాయువునకు శబ్దస్పర్శములను రెండు గుణములు, అగ్నికి శబ్దస్పర్శ రూపములనబడు మూడు- జలమునకు శబ్దస్పర్శ రూపరసములను నాలుగు- భూమికి శబ్దస్పర్శ రూపరస గంధములను నైదుగుణములుగలవు. వీని పరస్పర సమ్మేళమున బ్రహ్మాండము సముత్పన్నమైనది కనుక సకల జీవులు బ్రహ్మాండాంశ సంభూతులు. ఈ జీవజాతు లెనుబదినాల్గు లక్షలని పేర్కొనబడుచున్నవి.

ఇతి శ్రీదేవీ భాగవతమందలి తృతీయస్కంధమందు సప్తమాధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters