Sri Devi Bhagavatam-1
Chapters
అథ నవమో%ధ్యాయః నారదః: గుణానాం లక్షణం తాత! భవతా కథితంకిల | నతృప్తో%స్మి పిబన్మిష్టంత్వన్ముఖా త్ప్రచ్యుతంరసమ్
1 గుణానాంతు పరిజ్ఞానం యథావదనువర్ణయ | యేనాహం పరమాం శాంతి మధిగచ్ఛామి చేతసి.
2 వ్యాస ఉవాచ : ఇతిపృష్టస్తు పుత్రేణ నారదేన మహాత్మనా | ఉవాచన జగత్కర్తా రజోగుణ సముద్భవః.
3 బ్రహ్మోవాచ: శృణు నారద! వక్ష్యామి గుణానాం పరివర్ణనమ్ | సమ్యగ్నాహం విజానామి యథామతి వదామితే.
4 సత్త్వంగు కేవలంనైవ కుత్రాపి పరిలక్ష్యతే | విశ్రీభావస్తు తేషాంవై మిశ్రత్వం ప్రతిభాతివై. 5 యథాకాచి ద్వరానారీ సర్వాభూషణభూషితా | హీవభావయుతా కామ భర్తుః ప్రీతికరీ భ##వేత్.
6 మాతాపిత్రో స్తథాసైవ బంధువర్గస్య ప్రీతిదా | దుఃఖంమోహం సపత్నీషు జనయత్యపి సైవహి.
7 ఏవంసత్త్వేన తేనైవ స్త్రీత్వ మాపాదితేనచ | రజస స్త మసశ్చైవ జనితా వృత్తి రన్యథా. 8 రజసా స్త్రీకృతేనైవ తమసా చ తథాపునః | అన్యోన్యస్య సమాయోగా దన్యథా ప్రతిభాతివై. 9 అవస్థానా త్స్వభావేషు నవై జాత్యంతరాణిచ | లక్ష్యంతే విపరీతాని యోగా న్నారద! కుత్రచిత్.
10 తొమ్మిదవ అధ్యాయము బ్రహ్మ నారదునకు త్రిగుణ స్వరూపము వివరించుట నారదు డిట్లనియెను: నీవు గుణముల లక్షణములను విస్తరించి చెప్పితివి. నీ ముఖనిర్గతమైన దేవీ వాక్యకథా సుధారస మెంత క్రోలినను నాకు తృప్తి గులగుటలేదు. ఆ త్రిగుణముల స్వరూపములనుగూర్చి నా కింకను కొంచెము తేటగ వివరింపుము. వాని నన్నిటిని సమగ్రముగ వినినగాని నా మదికి శాంతి చేకూరదు. ఇట్లు నారదుడు తన తండ్రి నడుగ రజోగుణ సముద్భూతుడు విశ్వకర్తయు నగు బ్రహ్మ తన కొడుకున కిట్లు పలికెను: నారదా! నీ కా త్రిగుణముల గుఱించి వర్ణింతును. వినుము: వానిని గూర్చి నాకును పెద్దగ తెలియదు. ఐన నేదో నా మదికి తోచినంతగ దెలుపగలను. కేవల మొకే సత్త్వగుణ మెచటను నిలువజాలదు. అది తక్కిన గుణములతో చేతులు కలిపి మిశ్రభావమున ద్యోతిత మగుచుండును. ఎట్లన నొక చక్కని యువతి పెక్కుసొమ్ములుదాల్చి హావభావ విలాసములతో తన భర్తకు సంతృప్తి గల్గించును. ఆమెయే తన తల్లిదండ్రులకును బంధువులకును ప్రీతి నొడగూర్చును. కాని యామెయే తన సవతుల దుఃఖమోహములకు కారణభూతురాలగును. ఈ రీతిగ నా స్త్రీ సత్త్వరూపమున నున్నప్పటికిని ఆమెలో రజస్తమనస్సుల భిన్నవృత్తులు పెల్లుబుకుచుండును. ఇట్లా స్త్రీలోని రజోగుణముతో తమము జేరి యా రెంటి కూడిక వలననే వేరొక వృత్తి ప్రతిభాసించును. సహజస్వభావమందు నెలకొనియున్నప్పు డితర వృత్తులు తలలెత్తవు. ఒకప్పుడు భిన్నములైన గుణవృత్తులు జేరి విపరీత ప్రవృత్తులుగ పొడసూపును. యథా రూపవతీనారీ ¸°వనేన విభూషితా | లజ్జామాధుర్య యుక్తాచ తథా వినయ సంయుతా. 11 కామశాస్త్ర విధిజ్ఞాచ ధర్మశాస్త్రే%పి సమ్మతా | భర్తుః ప్రీతికరీభూత్వాసపత్నీనాం చ దుఃఖదా. 12 మోహదుఃఖ స్వభావస్థా సత్వస్థే త్యుచ్యతేజనైః | తథాసత్త్వం వికుర్వాణ మన్యభావం విభాతివై. 13 చోరై రుప ద్రుతానాంహి సాధూనాం సుఖదాభ##వేత్ | దుఃకామూఢాచ దస్యూనాం సైవ సేనా తథాగుణా. 14 విపరీతప్రతీతింవై జనయంతి స్వభావతః | యథాచ దుర్దినం జాతం మహామేఘఘనావృతమ్. 15 విద్యుత్త్పనిత సంయుక్తం తిమిరే ణావగుంఠితమ్ | సించద్భూమిం ప్రవర్షద్వై తమోరూప ముదాహృతమ్. 16 యదేత త్కర్షకాణాంవై తదేవాతీన దుర్దినమ్ | బీజోపస్కర యుక్తానాం సుఖదం ప్రభవత్యుత. 17 అప్రచ్ఛన్న గృహాణాంచ దుర్భగానాం విశేషతః | తృణకాష్ఠగృహీతానాం దుఃఖదం గృహమేధినామ్. 18 ఎట్లనగ, నొక స్త్రీ రూపవతి యువతి లజ్జా మధురిమలు గలది-వినయవతి - ధర్మశాస్త్ర కామశాస్త్ర విధిజ్ఞ. ఆమె తన పతి హృదయమును నలరించును. కాని యామెయే తన సవతులకు దుఃఖమోహములు గల్గించును. ఇట్లే తీరని దుఃఖములో తెలియని మోహము సత్త్వమందు సైతముండునని జను లందురు. అట్లే సత్త్వము నం దితర భావములును ప్రకటమగుచుండును. సేన యొక్కటియ చోరులవలని యుపద్రవము నొందిన సాధు జనులకు సుఖకరముగను దొంగలకును దోపిడిగాండ్రకును దుఃఖమోహములను కలిగించుచు దోష సహితముగాను తోచును. ఒక్కొక్కప్పు డీ గుణములవలన సాజముగ విపరీత భావములు వెలువడుచుండును. ఎట్లన పెద్దగ మబ్బులు క్రమ్మిన దుర్దినమున ఉఱుములు మెఱుపులు భయంకరముగ నుండును. చిమ్మచీకట్లు గ్రమ్మును. వర్షములు కురియును. ఆ స్థితిని లోకులు తమోరూపమందురు. ఈ పరిస్థితి పండినపంటగల కృషకులకు దుర్దినమగును. విత్తనములు నాటిన కర్షకునకు సుదినముగ నుండును. ఇదే పై కప్పులేని యింట నివసించుచు తృణకాష్ఠములపై బ్రతుకు గృహస్థుల కతిదుఃఖదాయక మగును. ప్రోషిత భర్తృకాణాం వై మోహదం ప్రవదంత్యపి | స్వభావస్థా గుణాః సర్వే విపరీతా విభాంతివై. 19 లక్షణాని పునస్తేషాం శృణుపుత్ర బ్రవీమ్యహమ్ | లఘ ప్రకాశకం సత్త్వం నిర్మలం విశదం సదా. 20 యదా%ంగాని లఘాన్యేవ నేత్రాదీ నీంద్రియాణిచ | నిర్మలంచ తథాచేతో గృహ్ణాతి విషయాన్నతాన్. 21 తదాసత్త్వం శరీరేవై మంతవ్యంచ సముత్కటమ్ | జృంభాం స్తంభంచ తంద్రాంచ చలంచైవ రజఃపునః 22 యదాత దుత్కటంజాతం దేహేయస్యచ కస్యచిత్ | కలిం మృగయతే కర్తుం గంతుం గ్రామాంతరం యథా. 23 చలచి త్తశ్చ సో%త్యర్థం వివాదే చోద్యత స్తథా | గురుమావరణం కామం తమో భవతి తద్యథా. 24 తదా%ంగాని గురుణ్యాశు ప్రభవం త్యావృతానిచ | ఇంద్రియాణి మనఃశూన్యం నిద్రాం నైవాభివాంచతి. 25 తన పతి విదేశమందున్న ప్రమద కీ దుర్దినము భరింపరాని మోహమునకు కారణమగును. ఆమె స్వభావములోని గుణవికారములెల్ల విపరీతమై మాటలు చెలరేగుచుండును. వీని లక్షణము లింకను విశదముగ వెల్లడింతును. ఆలింపుము. సత్త్వగుణము నిర్మలమై స్వచ్ఛమై నిత్యమై లఘుప్రకాశముగలదై స్వచ్ఛమగు వెలుగులు జిమ్ముచుండును. కన్ను ముఖము మున్నగు నింద్రియములు సకలాంగము లెప్పుడు స్వచ్ఛముగ వికాసము జెందునో చిత్తము గంగవలె నిర్మలముగ కోర్కులు లేకుండునో యప్పుడు సత్త్వతేజము వెలుగుచున్నదని యెఱుంగవలయును. అట్టి సత్వము విషయములజోలికి పోదు. అప్పుడు శరీరమందు లోనను బైటను నొకే సత్వము తేజరిల్లుచున్నదని భావింపవలయును. చంచలత ఆవులింత స్తంభము తంద్ర యనునవి రజోగుణలక్షణములు. ఇట్టి క్లేశకారకములైన లక్షణము లెవనిలో మూర్తీభవించునో వానిలో రజోగుణము రాజిల్లుచున్నదని యెఱుగవలయును. గ్రామాంతర మేగుట చిత్తచాంచల్యము వివాదములందు దగుల్కొనుట దేహము బద్ధకించుట మున్నగు లక్షణములు దోచినపుడు తమోగుణము నిండియున్నదని యెఱుగవలయును. అపు డొడలంతయు బరువెక్కును. తమము దట్టమై పేరుకొనును. చిత్తము ఇంద్రియములు క్రియాశూన్యము లగును. నిద్ర పట్టకుండును. గుణానాం లక్షణాన్యేవం విజ్ఞేయానీహ నారద | విభిన్న లక్షణాః ప్రోక్తాః పితామహ గుణా స్త్రయః. 26 నారదః: కథమేకత్ర సంస్థానే కార్యం కుర్వంతి శాశ్వతమ్ | పరస్పరం మిళిత్వాహి విభిన్నాః శత్రవఃకిల. 27 ఏకత్రస్థాః కథంకార్యం కుర్వంతీతి వదస్వమే | శృణుపుత్ర! వ్రవక్ష్యామి గుణాస్తే దీపవృత్తయః. 28 బ్రహ్మోవాచ: ప్రదీపశ్చ యథా కార్యం ప్రక్షరో త్యర్థదర్శనమ్ | వర్తిసై#్తలం యథార్చిశ్చ విరుద్ధాశ్చ పరస్పరమ్. 29 విరుద్ధంహి తథాతైల మగ్నినా సహ సంగతమ్ | తైలం వర్తివిరోధ్యేవ పావకో%పి పరస్పరమ్. 30 ఏకత్రస్థాః పదార్థానాం ప్రకుర్వంతి ప్రదర్శనమ్ | ఏవం ప్రకృతిజాః ప్రోక్తా గుణాః సత్యవతీసుత! 31 నారద: విశ్వస్యకారణం తేవై మయాపూర్వం యథాశ్రుతమ్ | ఇత్యుక్తం నారదేనాథ మమసర్వం సవిస్తరమ్. 32 గుణానాం లక్షణంసర్వం కార్యంచైవ విభాగశః | ఆరాధ్యా పరమాశక్తి ర్యయా సర్వమిదం తతమ్. 33 సగుణా నిర్గుణాచైవ కార్యభేదే సదైవహి | అకర్తా పురుషఃపూర్ణో నిరీహః పరమో%వ్యయః. 34 కరోత్యేషా మహామాయా విశ్వం సదసదాత్మకమ్ | బహ్రావిష్ణు స్తథారుద్రః సూర్యశ్చంద్రః శచీపతిః. 35 ఈ విధముగ గుణముల లక్షణము లెఱుంగవలయును అనగా నారదు డిట్లనియె: పితామహా! నీవు త్రిగుణలక్షణములను వేరువేరుగ వివరించితివి. ఇవన్నియు నొకేచోటజేరి పనులన్నిటి నెట్లొనరింపగలవు? ఇవి పరస్పరము శత్రువులయ్యు నెట్లు కూడాయుండును? ఈ విషయము కొంచెము విడదీసి చెప్పుము. బ్రహ్మయిట్లనె: పుత్త్రా! విపులముగ వాక్రుత్తును. చెవి యొగ్గి వినుము. ఆ గుణములు దీపకాంతి లక్షణము గలవి. అది మనము వస్తువులను చూచునట్లు చేయును. వత్తి తైలము జ్వాల - యివి పరస్పర విరుద్ధములు. వత్తి తైలములు-తైలాగ్నులు-వర్త్యగ్నులు పరస్పరము విరుద్ధములు. కాని యివన్నియు నొక్కచోజేరి పదార్థములను దర్శింపజేయును. వ్యాసా! ఇట్లు గుణములన్నియు మూలసహజప్రకృతినుండి కల్గుచుండును. ఇవన్నియును సంసారకారణములు అని తొల్లి నేను బ్రహ్మవలన వింటిని. అని ఇట్లు నేను నారదునివలన నెఱింగిన గుణముల లక్షణములును వాని కార్యములును నీకు విడమరచి చెప్పితిని. గుణములన్నిటిని కల్పించి విభజించి జగన్నాటక మాడించు ప్రకృతి మహాశక్తి యెల్లవారికి నారాధ్యదేవత. ఆ దేవీ గుణకార్యభేదములవలన నిర్గుణయు సగుణయునై విలసిల్లుచుండును. ఆమెయే పూర్ణపురుషుడు-అన్యయుడు నిరీహుడు - అచ్యుతుడునగు పరమపావనుడు. అశ్వినౌ వసవస్త్వష్టా కుబేరో యాదసాంపతిః | వహ్నిర్వాయు స్తథాపూషా సేనానీశ్చ వినాయకః. 36 సర్వేశక్తి యుతాఃశక్తాః కర్తుంకార్యాణి స్వానిచ | అన్యథా తే%ప్యశక్తావై ప్రస్పందితు మునీశ్వరాః. 37 సాచైవ కారణం రాజన్ ! జగతః పరమేశ్వరీ | సమారాధయ తాంభూప! కురుయజ్ఞం జనాధిప! 38 పూజనం పరయా భక్త్యా తస్యాఏవ విధానతః| మహాలక్ష్మీ ర్మహాకాళీ తథామహా సరస్వతీ. 39 ఈశ్వరీ సర్వభూతానాం సర్వభూతానాం సర్వకారణ కారణమ్ | సర్వకామార్థదా శాంతా సుఖసేవ్యా దయాన్వితా. 40 నామోచ్చారణ మాత్రేణ వాంఛితార్థ ఫలప్రదా | దేవైరాధితా పూర్వం బ్రహ్మవిష్ణు మహేశ్వరైః. 41 మోక్షకామైశ్చ వివిధై స్తాపసై ర్విజితాత్మభిః | అస్పష్టమపి యన్నాను ప్రసంగేనాపి భాషితమ్. 42 దదాతి వాంఛితా నార్థ న్దుర్లభానపి సర్వథా | ఐఐఇతి భయార్తేన దృష్ట్వా వ్యాఘ్రాదికం వనే. 43 బిందుహీన మపీత్యుక్తం వాంఛితం ప్రదదాతివై | తత్రసత్య వ్రతసై#్యవ దృష్టాంతో నృపసత్తమ! 44 ప్రత్యక్షఏవ చాస్మాకం మునీనాం భావితాత్మనామ్ | బ్రాహ్మణానాం సమాజేషు తస్యోదాహరణం బుధైః. 45 కథ్యమానం మయారాజన్ శ్రుతం సర్వం సవిస్తరమ్ | అనక్షరో మహామూర్ఖో నామ్నా సత్యవ్రతో ద్విజః. 46 శ్రుత్వా%క్షరం కోలముఖా త్సముచ్చార్య స్వయంతతః | బిందుహీన ప్రసంగేన జాతో%సౌ విబుధోత్తమః. 47 ఏకారోచ్చారణా ద్దేవీ తుష్టా భగవతీ తదా | చకార కవిరాజం తం దయార్ద్రా పరమేశ్వరీ. 48 ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ తృతీయస్కంధే నవమో%ధ్యాయః. ఆ మహా మాయాశక్తియే యీ సదసదాత్మకమైన బ్రహ్మాండములందు బ్రహ్మ విష్ణువు రుద్రుడు రవి శశి ఇంద్రుడు వసువులు అశ్వినులు వరుణుడు కుబేరుడు వహ్ని ఆయువు పూషుడు సేనాపతి వినాయకుడు మున్నగు దేవతలను గుణకర్మ విభాగమున సృజించును. వీరెల్ల రా శక్తితో యుక్తులగుటవలననే కార్యకరణదక్షు లగుచున్నారు. ఆ శక్తి తోడు లేనిచో వారు నెంతమాత్రము చలింపజాలరు. ఓ రాజా! ఆ పరమేశ్వరి విశ్వజగత్కారణురాలు. కాన జనమేజయా! దేవీ యజ్ఞ మొనరించి యా తల్లి నారాధించుము. ఆ దేవిని భక్తితో బూజింపవలయును. ఆ తల్లియే శ్రీమహాలక్ష్మీ మహాకాళి మహాసరస్వతి రూపములతో నిత్యపూజలందు కొనుచుండును. ఆమెయే సర్వభూతేశ్వరి సర్వకారణకారణ సర్వకామార్థద శాంత దయామయి సుఖసంసేవ్య. తన పవిత్రశుభనామ ముచ్చరించి నంతమాత్రముననే యా తల్లి తన భక్తుల వాంఛితార్థము లీడేర్చును. ఆ శ్రీమాతృదేవి పూర్వము హరిహరబ్రహ్మలచేత నారాధింపబడినది. ముముక్షులు జితాత్ములు తాపసులునగువా రామెను బూజించి తరించిరి. ఎవ్వడైన ప్రసంగవశముననైన నా దేవతనామ మొకేయొకసారి యుచ్చరించిన చాలును. దేవిదయదలచి వాని కోర్కులెంత దుర్లభములైనను తీర్చివేయును. ఎవడేని భయార్తుడై కాఱడవిలో క్రూరమృగములను గాంచి ''ఐ-ఐ'' యని దలంచినచో ''ఐ-ఐ'' వర్ణములందు బిందువు లేనప్పటికి దయామయియగు దేవి వాని భయముబాపి కోర్కులు కురియును. దీనికి సత్యవ్రతుని చరిత్ర తార్కాణము. అతని చరిత్ర నాకును ప్రత్యక్ష ప్రమాణమే. ఆ సత్యవ్రతుడు మహితాత్ములగు స్వాత్మవిచారులకు బాగుగ తెలియును. బ్రాహ్మణ సమాజమందా సత్యవ్రతుని చరిత్ర కీర్తింపబడుచుండును. నే నాతని చరిత్రయంతయు చక్కగ వింటిని. అదేమన- పూర్వము మహామూర్ఖుడు నిరక్షరకుక్షి యగు సత్యవ్రతుడను బ్రాహ్మణు డుండెను. అత డొకనా డొక కోలము (వరాహము) నోటినుండి ''ఐ'' కారము విని దానినే యుచ్చరించి మహా పండితు డయ్యెను. దయామృత తరంగిణియగు పరమేశ్వరి 'ఐ' కార ముచ్చరించినతనే యతనియెడ సంతుష్టయై యతని నొక కవిరాజుగ నొనరించెను. ఇది శ్రీదేవీ భాగవతమందలి తృతీయ స్కంధమందు నవమాధ్యాయము.