Sri Devi Bhagavatam-1    Chapters   

అథ దశమోధ్యాయః

జనమేజయః: కో%సౌ సత్యవ్రతోనామ బ్రాహ్మణో ద్విజసత్తమః | కస్మిన్దేశే సముత్పన్నః కీదృశశ్చ వదస్వమే. 1

కథంతేన శ్రుతఃశబ్దః కథ ముచ్చారితః పునః | సిద్ధిశ్చ కీదృశీజాతా తస్యవిప్రస్య తక్షణాత్‌. 2

కథంతుష్టా భవానీసా సర్వజ్ఞా సర్వసంస్థితా | విస్తరేణ వదస్వాద్య కథామేతాం మనోరమామ్‌. 3

ఇతిపృష్ట స్తదారాజ్ఞా వ్యాసః సత్యవతీసుతః | ఉవాచ పరమోదారం వచనం రసవచ్ఛుచి.

4

శృణు రాజ న్ప్రవక్ష్యామి కథాం పౌరాణికీం శుభామ్‌ | శ్రుతామునిసమాజేషుమయాపూర్వం కురూద్వహ. 5

ఏకదా%హం కురుశ్రేష్ఠ ! కుర్వం స్తీర్థాటనం శుచి | సంప్రాప్తో నైమిశారణ్యం పావనం మునిసేవితమ్‌. 6

ప్రణమ్యాహం మునీన్సర్వాన్‌ స్థితస్తత్ర వరాశ్రమే |విధిపుత్రాస్తుయత్రాసన్‌ జీవన్ముక్తామహావ్రతాః. 7

కథా ప్రసంగ ఏవాసీ త్తత్ర విప్ర సమాగమే | జమదగ్నిస్తు పప్రచ్ఛ మునీనేవం సమాస్థితః.

8

సందేహో%స్తి మహాభాగాః | మమచేతసి తాపసాః |

సమాజేషు మునీనాంవై నిఃసందేహో భవామ్యహమ్‌. 9

బ్రహ్మావిష్ణు స్తథారుద్రో మఘవా వరుణో%నలః | కుబేరః పవన స్త్వష్టా సేనానీశ్చ గణాధిపః. 10

సూర్యో%శ్వినౌ భగఃపూషా నిశానాథో గ్రహాస్తథా | ఆరాధనీయతమఃకో%త్ర వాంఛితార్థఫలప్రదః. 11

సుఖసేవ్యశ్చ సతతం చాశుతోషశ్చ మానదాః | బ్రువంతు మునయఃశీఘ్రం సర్వజ్ఞాః సంశితవ్రతాః. 12

పదవ అధ్యాయము

సత్యవ్రతుని చరితము

జనమేజయు డిట్లనియె : ఆ సత్యవ్రత బ్రాహ్మణు డెవడు? అతడే దేశమందు జన్మించెను? అత డెట్టివాడు? ఇదంతయు నాకు విశదపఱచుము. అతడు ''ఐ'' కారము నెవనివలన వినెను? దాని నతడే విధముగ నుచ్చరించెను? అతనికి వెంటనే కల్గిన సిద్ధి యెట్టిది? ఆతని వలన సర్వాంతర్యామిని పరిపూర్ణ సర్వజ్ఞ యగు భగవతి యెట్లు సంతుష్టి జెందెను? ఆతని చమత్కారజనకమైన గాధను విస్తారముగ తెలుపుము అని రాజు ప్రశ్నింపగ సత్యవతీ సుతుడగు వ్యాసుడు తన రసభరితమైన వాక్కులతో నతని కిట్లనెను: జనమేజయా! ఒకప్పుడు నేనొక ముని సమాజములో నొక పరమ పౌరాణిక దివ్యగాథ వింటిని. దానిని వినపింతును, సావధానుడవై యాలకింపుము. నే నొకప్పుడు పావనతీర్థాటన మొనరించుచు మునిసేవితము పరమపవిత్రమునగు నైమిశారణ్యము జేరితిని. ఆ పుణ్యాశ్రమమునందు మహావ్రతులు జీవన్ముక్తులు మునిసత్తములు విధి పుత్త్రులు నివసించుచుండిరి. నేను వారి కెల్లర కభివందనము లాచరించితిని. అపుడా బ్రాహ్మణ సమాజమున సత్కథా కాలక్షేపము సాగుచుండెను.వారిలో జమదగ్ని ముని తక్కిన మునుల నిట్లు ప్రశ్నించెను: మహాభాగులగు తాపసులారా! నా మదిలో నొక సందియము గలదు. ఆ సందియమును మీరు దీర్పగలరని నమ్ముచున్నాను. బ్రహ్మ విష్ణువు శివుడు సురపతి వహ్ని వరుణుడు ధనపతి సేనాపతి గణపతి మిత్రుడు పవనుడు త్వష్ట అశ్వినీకుమారులు పూషుడు సర్వగ్రహములు చంద్రుడు అను దేవతలు గలరు గద! వీరందఱిలోను గొప్పగ కోరికలన్ని యొకేసారి త్వరలో తీర్చి పూజలందుకొనగల దేవదేవోత్తము లెవరు? సర్వజ్ఞులు సంశితవ్రతులు నగు మునివరులారా! వీరిలో నతిశీఘ్రముగ సుఖముగ సులభముగ సుప్రసన్నుడగు దేవు డెవడు? నిత్యము సేవనీయు డెవడు?

ఏవంప్రశ్నే కృతేతత్ర లోమశో వాక్యమబ్రవీత్‌ | జమదగ్నే! శృణుషై#్వత ద్యత్పృష్టం వైత్వయా%ధునా. 13

సేవనీయతమా శక్తిః సర్వేషాం శుభమిచ్ఛతామ్‌ | పరాప్రకృతి రాద్యాచ సర్వగా సర్వదా శివా. 14

దేవానాం జననీసైవ బ్రహ్మాదీనాం మహాత్మనామ్‌ |ఆదిప్రకృతి ర్మూలంసా సంసారపాదపస్యవై. 15

స్మృతా చోచ్చారితా దేవీ దదాతి కిల వాంఛితమ్‌ | సర్వదైవా%%ర్ద్ర చిత్తా సా వరదానాయ సేవితా. 16

ఇతిహాసం ప్రవక్ష్యామి శృణ్వంతు మునయః శుభమ్‌ | అక్షరోచ్చారణాదేవ యథాప్రాప్తం ద్విజేన వై. 17

అను జమదగ్ని ప్రశ్న విని మునులలో లోమశ ముని యిట్లు పలికెను; ఓ జమదగ్ని మునీ! నీ వడిగిన ప్రశ్నకు సమాధాన మాలకింపుము. శ్రేయము ప్రేయము గోరుకొనువారు ఏకైకతత్త్వమగు పరాభట్టారికను లలితాదేవి నారాధింపవలయును. ఆమె సర్వమూల మూలము. పరాప్రకృతి. ఆద్య-శివ-సర్వద-సర్వగయని ప్రసిద్ధి కెక్కినది. ఆ తల్లి బ్రహ్మాది దేవతల కందఱకు మహాత్ములకు జనని. ఈ సంసార మహావృక్షమునకు మూలబీజము. ఆ శ్రీమాతృదేవీ నామ మమృత మధురము. ఆ మధురాతిమధురనామ ముచ్చిరించినంతనే లోకుల మనోరథము లీడేరును. నిరంతరము వరము లొసంగుట కా వరదాయిని దయార్ద్ర హృదయమున వరదహస్తయై సంసేవింపబడుచుండును. ఈ విషయమున నే నొక సుంద రేతిహాసము వినిపింతును. వినుము. మును పొక బ్రాహ్మణు డొక దివ్యాక్షర ముచ్చరించిన మాత్రన పరమసిద్ధి గాంచెను.

కోసలేషు ద్విజః కశ్చి ద్దేవదత్తేతి విశ్రుతః | అనపత్య శ్చ కారేష్టిం పుత్రాయ విధిపూర్వకమ్‌. 18

తమసా తీర మాస్థాయ కృత్వామండప ముత్తమమ్‌ | ద్విజానాహూయ వేదజ్ఞా న్సత్రకర్మ విశారదాన్‌. 19

కృత్వి వేదిం విధానేన స్థాపయిత్వా విభావసూన్‌ | పుత్రేష్టిం విధివత్తత్ర చకార ద్విజసత్తమః. 20

బ్రహ్మాణం కల్పయామాస సుహోత్రం మునిసత్తమమ్‌ ఆధ్వర్యుం యాజ్ఞవల్క్యంచ హోతారంచ బృహస్పతిమ్‌. 21

ప్రస్తోతారం తథాపైల ముద్గాతారం చ గోభిలమ్‌ | సఖ్యానన్యా న్మునీన్కృత్వా విధివ త్ప్రదదౌ వసు. 22

ఉద్గాతా సామగః శ్రేష్ఠ సప్తస్వర సమన్వితమ్‌ | రథంతర మగాయత్తు స్వరితేన సమన్వితమ్‌. 23

తదా%స్య స్వరభంగో%భూ త్కృతేశ్వాసే ముహుర్ముహుః | దేవదత్త శ్చుకోపా%శుగోభిలం ప్రత్యువాచహ. 24

మూర్ఖో%సి మునిముఖ్యాద్య స్వరభంగ స్త్వయాకృతః | కామ్యకర్మణి సంజాతే పుత్రార్థం యజతశ్చమే. 25

గోభిలస్తు తదోవాచ దేవదత్తం సుకోపితః | మూర్ఖస్తే భవితా పుత్రః శఠః శబ్ద వివర్జితః. 26

సర్వప్రాణి శరీరేతు శ్వాసోచ్ఛ్వాసః సుదుర్గ్రహః | నమే%త్ర దూషణం కించిత్స్వరభంగే మహామతే. 27

పూర్వము కోసలదేశమున దేవదత్తుడను బ్రాహ్మణుడు వాసి కెక్కెను. ఆతడు సంతాన హీను డగుటచే పుత్రార్థము విధిపూర్వకముగ యాగ మొనరించెను. ఆతడు తమసానదీతీరమునం దొక విశాలమండప మేర్పరచెను; వేదవిదులును యాగకర్మ కుశలురునైన బ్రాహ్మణోత్తముల నాహ్వానించెను. ఆత డచట విధి ప్రకారముగ యజ్ఞవేదిక నిర్మించి యందగ్నిని ప్రతిష్టించి యథావిధిగ పుత్రకామేష్టి జరిపెను. ఆ జన్నమునందు సుహోత్రుని బ్రహ్మగ యాజ్ఞవల్క్యు నధ్వర్యునిగ బృహస్పతిని హోతగ-పైలుని ప్రస్తోతగ గోభిలుని నుద్గాతగ నితరమునులను సదస్యులుగ నియమించి యథావిధిగ విస్తారముగ దానదక్షిణ లొసంగెను. అపుడు సామగుడగు నుద్గాత సప్తస్వరములు మేళవింప స్వరిత ప్రధానముగ రథంతర సామగాన మొనరించెను. అతడు మాటామాటికెగశ్వాస పీల్చుకొనుటలో గానమునందు స్వరభంగము జరిగెను. వెంటనే దేవదత్తుడు కుపితుడై గోభిలునితో నేను పుత్రార్థము కామ్యకర్మ చేయుచు జన్న మొనర్చుచుండగ నీవు మూర్ఖుడవై స్వరభంగ మొనర్చి యపశ్రుతి పల్కితివేమి? అనెను. అపుడు గోభిలుడును గినుకబూని దేవదత్తున కిట్లనియెను: 'నన్ను నీవు మూర్ఖుడ వంటివి. కనుక నీకు గల్గు కొడుకు మూర్ఖుడు శఠుడు శబ్దము నుచ్చరింపజాలనివాడుగ నగును గాక! ప్రాణులందఱిలోని యుచ్ఛ్వాస నిఃశ్వాసములు దుర్గ్రాహములై యుండును. కాన నో మహామతీ! స్వరభంగమునకు నన్ను దూషింప బనిలేదు.'

తచ్ఛ్రుత్వా వచనంతస్య గోభిలస్య మహాత్మనః | శాపాద్భీతో దేవదత్త స్తమువాచాతి దుఃఖితః. 28

కథంక్రుద్ధో%సి విప్రేంద్ర! వృథా మయి నిరాగసి| అక్రోదనాహి మునయోః భవంతి సుఖదాః సదా. 29

స్వల్పే%పరాధే విప్రేంద్ర కథంశప్త స్త్వయాహ్యహమ్‌ |అపుత్రో%హం సుతప్తః ప్రాక్తాపయుక్తః పునఃకృతః. 30

మూర్ఖపుత్త్రా దపుత్రత్వం వరం వేదవిదో విదుః | తథా%పి బ్రాహ్మణో మూర్ఖః సర్వేషాం నింద్య ఏవహి. 31

పశువ చ్ఛూద్రవచ్చైవ నయోగ్యః సర్వకర్మసు | కింకరోమీహ మూర్ఖేణ పుత్రేణ ద్విజసత్తమ. 32

యథాశూద్ర స్తథామూర్ఖో బ్రాహ్మణోనాత్రసంశయః | నపూజార్హో నదానార్హోనింద్యశ్చ సర్వకర్మసు. 33

దేశే వై వసమానశ్చ బ్రాహ్మణో వేదవర్జితః | కరదః శూద్రవచ్చైవ మంతవ్యః సచ భూభజా. 34

నాసనే పితృకార్యేషు దేవకార్యేషు సద్విజః | మూర్ఖః సముపవేశ్యశ్చ కార్యస్య ఫలమిచ్ఛతా. 35

అను గోభిలముని వాక్కు వినగనే దేవదత్తుడు శాపభీతిచే దుఃఖితుడై యతనికిట్లనియెను: ఓ విప్రోత్తమ! నిరపరాధుడనైన నాపై నీకింతకోపమేల? మునులు క్రోధరహితులు. పరమశాంతులు. సుఖము కలుగజేయువారు. ఓ బ్రాహ్మణోత్తమ! ఈపాటి కొద్ది తప్పునకే నన్నింతగ శపింపనేల? నేను మొదలే పుత్త్రులులేక దుఃఖించుచుండగ వ్రణములో కారము జల్లినట్లు నన్నింకను సంతాప మొందింపజేసితివేల? మూర్ఖపుత్రునికన్న అపుత్త్రత్వంబు మేలని వేదవిదులు వక్కాణింతురు. అందునను బ్రాహ్మణుడు మూర్ఖుడైనచో నతనిని ప్రతివాడు తెగనిందించును. అట్టి వాడెల్ల కార్యములందు పశువువలె శూద్రునివలె పనికిమాలిన వాడగును. నాకట్టి మూర్ఖ పుత్రునివలన ప్రయోజనమేముండును? మూర్ఖ విప్రుడు శూద్రతుల్యుడు. అతడెల్ల శుభకర్మలందు పూజకు అనర్హుడు. దానమునకు అయోగ్యుడు, నిందాపాత్రుడు అగును. ఇందు నెంతమాత్రము సందేహము లేదు. తన దేశమందు వేదబాహ్యుడై వసించు విప్రుని నుండి శూద్రునినుండివలె రాజు పన్నులు గ్రహింపవచ్చును. ఆ మూర్ఖుడు దేవపితృ కార్యములకు యోగ్యుడుకాడు. శుభములు కాంక్షించువాడు మూర్ఖ విప్రున కాసనాదులొసంగడు.

రాజ్ఞాశూద్ర సమోజ్ఞేయో నయోజ్యః సర్వకర్మసు | కర్షకస్తు ద్విజఃకార్యో బ్రాహ్మణో వేదవర్జితః. 36

వినావిప్రేణ కర్తవ్యం శ్రాద్ధం కుశచటేనవై | నతువిప్రేణ మూర్ఖేణ శ్రాద్ధం కార్యం కదాచన.

37

ఆహారా దధికంచాన్నం నదాతవ్య మపండితే | దాతానరక మాప్నోతి గ్రహీతాతు విశేషతః.

38

ధిగ్రాజ్యం తస్యరాజ్ఞోవై యస్యదేశే%బుధా జనాః | పూజ్యంతే బ్రాహ్మణా మూర్ఖా దానమానాదికైరపి. 39

ఆసనే పూజనే దానే యత్రభేదో నచాణ్వపి | మూర్ఖపండితయో ర్భేదో జ్ఞాతవ్యో విబుధేనవై. 40

మూర్ఖాయత్ర సుగర్విష్ఠా దానమాన పరిగ్రహైః | తస్మిన్దేశే నవస్తవ్యం పండితేన కథంచన.

41

అసతా ముపకారాయ దుర్జనానాం విభూతయః | పిచుమందః ఫలాఢ్యో%పి కాకైరే వోపభుజ్యతే. 42

భుక్త్వా%న్నం వేదవిద్విప్రో వేదాభ్యాసం కరోతివై | క్రీడంతి పూర్వజాస్తస్య స్వర్గే ప్రముదితాః కిల. 43

గోభిలాతః కిముక్తంవై త్వయావేద విదుత్తమ | సంసారే మూర్ఖపుత్రత్వం మరణాదతి గర్హితమ్‌. 44

కృపాంకురు మహాభాగ! శాపస్యాను గ్రహంప్రతి | దీనోద్ధారణ శక్తో% పతామి తవపాదయోః. 45

రాజు వేదమురాని మూర్ఖువిప్రుని శూద్రునిగ భావించి యతనిచేత వ్యవసాయపు పనులు చేయించవచ్చును. శుభ కార్యములందతనిని నియోగింపకూడదు. మూర్ఖవిప్రుని శ్రాద్ధభోక్తగ నిమంత్రణము చేయరాదు. అట్టిస్థితిలో దర్భలపై నన్నముంచి యైన కార్యము జరుపుకొనవలయును. ఆ వేదమునేర్వని మూర్ఖున కతనికివలసిన ఆహారముకంటె నెక్కువ అన్నము నీయరాదు. అట్లిచ్చినచో నిచ్చినవాడును తిన్నవాడును అధికముగ నరకముల పాలగుదురు. ఎచ్చోట వేదవిహీనులైను మూర్ఖద్విజులు దానసత్కారమయులతోడ పూజింపబడుదురో యారాజ్యము వ్యర్థము. ఆ రాజును వ్యర్థుడే. వేద పండితులకు మూర్ఖులకు మధ్య నాసన పూజాదానములందు భేదముండి తీరవలయును. విబుధులు వీరిర్వురియంతరము గుర్తించి వర్తింపవలయును. దానమాన పరిగ్రహముల కారణముగ మూర్ఖుడెచ్చోట గర్విష్ఠుడై యుండునో యాదేశమందు పండితుడు వసింపరాదు. వేపపండ్లను కాకులే తినునుగాని మేలు జాతిపక్షులు తినవు. అటులే దుష్టులసంపదలు దుష్టులకే పనికివచ్చును. వేదపాఠ నిరతులగు విప్రులు న్యాయార్జితమైన యున్నము భుజించి వేధాభ్యాసమొనర్తురు. అట్టివారి పితరులు స్వర్గముల ప్రమోదమందుదురు. కావున నోగోభిల మునీశ! వేదవేత్త! ఇంతకు మిక్కిలిగ నేను నీకేమిచెప్పగలను? ఈ దురిత సంసారమందు మూర్ఖపుత్రత్వము మరణముకంటె గర్హింప దగినది. ఓ మహానుభావా! శాపము నిగ్రహించుము. నన్ననుగ్రహింపుము. నీ నిండుమనసు వెన్నవంటిది. నీవు దీనుల సముద్ధరింప సమర్థుడవు. నీ పాదములమీద నా తల నుంతును.

లోమశః: ఇత్యుక్త్వా దేవదత్తస్తు పతితస్తస్య పాదయోః | స్తువన్దీవ హృదత్యర్ధం కృపణః సాశ్రులోచనః. 46

గోభిలస్తు తదాతత్ర దృష్ట్వాంతం దీనచేతసమ్‌ | క్షణకోపా మహాంతోవై పాపిష్ఠాః కల్పకోపనాః. 47

జలం స్వభావతః శీతం పావకాతప యోగతః | ఉష్ణంభవతి తచ్చీఘ్రం తద్వినా శిశిరంభ##వేత్‌. 48

దయావా న్గోభిలస్త్వాహ దేవదత్తం సుదుఃఖితమ్‌ | మూర్ఖోభూత్వా సుతస్తేవై విద్వానపి భవిష్యతి. 49

ఇతిదత్త వరఃసో%థ ముదితో%భూ ద్ద్విజర్షభః | ఇష్టిం సమాప్య విప్రాన్వై విససర్జ యథా విధి. 50

కాలేన కియతా తస్య భార్యా రూపవతీ సతీ | గర్భం దధార కాలేసా రోహిణీ రోహిణీసమా. 51

గర్భాదానాదికం కర్మ చకార విధివద్ద్విజః | పుంసవన విధానంచ శృంగార కరణం తథా.

52

సీమంతోన్నయనం చైవ కృతం వేదవిధానతః | దదౌదానాని ముదితో మత్వేష్టిం సఫలాంతథా. 53

శుభే%హ్ని సుషువే పుత్రం రోహిణీ రోహిణీయుతే | దినేలగ్నే శుభే%త్యర్థం జాతకర్మ చకారసః. 54

పుత్రదర్శనకం కృత్వా నామకర్మ చకారచ | ఉతథ్య ఇతిపుత్రస్య కృతంనామ పురావిదా.

55

లోముశు డిట్లనియె: అట్లు దేవదత్తుడు గోభిలునికి మ్రొక్కి దీనాశ్రులు కన్నులనిండ నిండగ గుండె దిగులుతో నతనిని సంస్తుతించెను. గోభిలు డా దీనవదనునిగని దయార్ద్రు డయ్యెను. మహాత్ములు క్షణకోపులు, పాపిష్ఠులు కల్పాంత క్రోధనులు గద! జలము సహజముగ చల్లగ నుండును. కాని యది యగ్నితాపమున వేడిగ నుండును. వేడిమిలేనిచో వెంటనే చల్లబడును. అంతట గోభిలుడు దయాళువై దుఃఖితుడగు దేవదత్తుని నీ పుత్త్రుడు మూఢుడయ్యు విధ్వాంసుడై పేరుగాంచును అని యనుగ్రహించెను. ఇట్లు గోభిలునివలన వరము బడసి దేవదత్తుడు ప్రసన్నుడై తన యాగము పూర్ణము గావించి విప్రులను దనిపి యనిపెను. కొన్ని దినములు గడచిన పిదప దేవదత్తుని భార్య రోహిణియను నామె రోహిణి పగిది గర్భవతి యయ్యెను. అంత దేవదత్తు డామెకు గర్భాదాన పుంసవనాది కర్మలు విధివిదానముగ జరిపించెను. వేదవిధానముగ సీమంతోన్నయనము జరిపించెను. యాగము సఫలముగ పరిసమాప్తమందుటవలన దేవదత్తుడు సంతుష్టుడై దానాది సత్క్రియ లొనరించెను. అంత నొక శుభదినము నందు రోహిణి రోహిణీ నక్షత్రమున శుభలగ్న మందొక చక్కని పుత్త్రుని గనెను. దేవదత్తు డా బాలుని జాతకము దైవజ్ఞులకు చూపి జాతకర్మదులు జరిపించెను. ఆ కుమారుని ముఖలక్షణములు వీక్షించి పూర్వ విదు లతనికి 'ఉతథ్యు'డను నామకరణము చేసిరి.

సచాష్టమే తథావర్షే శుభ##వై శుభవాసరే | తస్యోపనయనం కర్మ చకార విధివత్పితా. 56

వేద మధ్యాపయామాస గురుస్తంవై వ్రతేస్థితమ్‌ | నోచ్చచార తథోతథ్యః సంస్థితో ముగ్ధ వత్తదా. 57

బహుధా పాఠితః పిత్రా నదధార మతిం శఠః | మూఢ వత్తిష్ఠతే%త్యర్థం తంశుశోచ పితాతదా. 58

ఏవంకుర్వ న్సదా%భ్యాసం జాతో ద్వాదశవార్షికః | నవేదవిధివ త్కర్తుం సంధ్యావందనకం విధిమ్‌. 59

మూర్ఖో%భూ దితిలోకేషు గతా వార్తా%తి విస్తరమ్‌ | బ్రాహ్మణషు చ సర్వేషు తాపసే ష్వితరేషుచ. 60

జహాస లోకస్తం విప్రం యత్రతత్ర గతంవనే | పితామాతా నినిందాథ మూర్ఖంత మతిభర్త్పయన్‌. 61

నిందితో%థ జనైఃకామం పితృభ్యా మథ బాంధవైః | వైరాగ్య మగమద్విప్రో జగామ వన మప్యసౌ. 62

అంధో వర స్తథా పంగు ర్నమూర్ఖస్తు వరఃసుతః | ఇత్యుక్తో%సౌ పితృభ్యాం వైవివేశ కాననం ప్రతి. 63

గంగాతీరే శుభేస్థానే కృత్వోటజ మనుత్తమమ్‌ | వన్యాంవృత్తించ సంకల్ప్య స్థిత స్తత్ర సమాహితః. 64

నియమంచ వరంకృత్వా నాసత్యం ప్రబ్రవీ మ్యహమ్‌ | స్థిత స్తత్రాశ##మే రమ్యే బ్రహ్మచర్య వ్రతోహి సః. 65

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ తృతీయస్కంధే దశమోధ్యాయః.

దేవదత్తుడు తన కొడుకున కెనిమిదవయేట శుభముహూర్తమున యథావిథిగ నుపనయన సంస్కారమొనరించెను. బ్రహ్మచర్య వ్రతస్థుడగు వటునకు గురువు వేదము పాఠము చెప్పెను. కాని యుతథ్యుడు ముగ్ధునిపగిదినుండి యేమియునుచ్చరింపలేదు. అతని తండ్రియు నతని నెన్నో రీతుల చదివించిచూచెను. కాని యతడు తన మనసులో చదువు నిల్పుకొనలేక మూఢునివలె తెల్లమొగమున నుండెను. తన కొమరుని దుస్థ్సితికతని తండ్రి మిక్కిలి దురపిల్లెను. ఇట్లు పండ్రెండేండ్లు వచ్చునప్పటి కాబాలుడు యథావిధిగ సంధ్యా వందనాది విధులొనర్చు టెఱుగకుండెను. అతడు మహామూర్ఖుడనువార్తబ్రాహ్మణ తాపసులకు లోకమంతటి కెగబ్రాకెను. అతడెచ్చటికేగినను జనమతనినిగని పరిహసించు చుండెను. అతని తలిదండ్రులు నతనిని బెదరించుచు నిందించుచుండిరి. ఈ విధముగ నా మూర్ఖవిప్రుడు తన తల్లిదండ్రులచే బందుగులచే నిందింపబడి 'కుంటి గ్రుడ్డి కొడుకులున్నచో నేదో కొంతమేలే యగును. కాని మూర్ఖ పుత్త్రుడుండుట నిరర్థక మని తన తలిదండ్రులును పలుకగా విని యతడు వైరాగ్యముతో నడవులు పట్టెను. ఆతడు పావనగంగా నదీతారముననొక పవిత్రస్థలమున పర్ణ కుటీరమేర్పరచుకొని వన్యవృత్తితో నిశ్చలమతితో నందు తన కాలము వెళ్ళబుచ్చుచుండెను. 'నే నేవిధముగనైన నెన్నడైన నసత్యమాడ నని ప్రతిని బూని యతడు తన శుభాశ్రమమున బ్రహ్మచర్యమున గడపుచుండెను.

ఇది శ్రీదేవీభాగవత మందలి తృతీయస్కంధమందు దశమాధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters