Sri Devi Bhagavatam-1
Chapters
అథ షోడశో%ధ్యాయః వ్యాసః: యుధాజిత్త్వథ సంగ్రామాద్గత్వా %యోధ్యాం మహాబలః | మనోరమాంచ పవ్రచ్ఛ సుదర్శన జిఘాంసయా.
1 సేకా న్ప్రేషయామాస క్వ గతితే ముహుర్వదన్ | శుభే దినే%థ దౌహిత్రం స్థాపయామాస చావసనే.
2 మంత్రిభిశ్చ వసిష్ఠేన మంత్రై రాథర్వణౖః శుభైః | అభిషిక్తశ్చ సంపూర్ణైః కల శైర్జలపూరితైః. 3 భేరీశంఖనినాదైశ్చ తూర్యాణాం చాథ నిఃస్వనైః | ఉత్సవస్తు నగర్యాం వై సంబభూవ కురూద్వహః. 4 విప్రాణాం వేదవాదైశ్చ వందినాం స్తుతిభి స్తథా | అయోధ్యా ముదితేవాసీ జ్జయశ##బ్దైః సుమంగళైః. 5 హృష్టపుష్టజనాకీర్ణా స్తుతివాదిత్ర నిఃస్వనా | నవే తస్మి నహీ పాలే పూర్బ భౌ నూ తనేవ సా. 6 కేచిత్సాధుజనా యే వై చక్రుః శోకం గృహే స్థితాః | సుదర్శనం విచింత్యాద్య క్వ గతో %సౌ నృపాత్మజః. 7 మనోరమా%తి సాధ్వీ సా క్వ గతా సుతసంయుతా | పితా%స్యా నిహతః సంఖ్యే రాజ్యలోభేన వైరిణా. 8 ఇత్యేవం చింతయానా స్తే సాధవః సమబుద్ధయః | అతిష్ఠ న్దుఃఖితా స్తత్ర శత్రుజిద్దశవర్తినః. 9 యుధాజిదపి దౌహిత్రం స్థాపయిత్వా విధానతః | రాజ్యం చ మంత్రిసాత్కృత్వా చలితః స్వా పురీం ప్రతి. 10 పదునాఱవ అధ్యాయము యుధాజిత్తు సుదర్శనుని జంపదలచుట వ్యాసు డిట్లనియెను: మహాబలుడగు యుధాజిత్తు యుద్ధము చాలించి యయోధ్య కేగి సుదర్శనుని చంపు నుద్దేశ్యముతో మనోరను యెచ్చటనెచ్చటనని యడుగ సాగెను. సుదర్శనుని జాడ దెలియుటకు సేవకుల నంపెను. కాని, యతడు గనబడలేదు. పిదప నతడొక శుభదినమున తన మనుమనికి పట్టము గట్టెను. వసిష్ఠాదులును మంత్రులును నాథర్వణ మంత్రములతో జలపూర్ణ కలశములతో శత్రుజిత్తు నభిషేకించిరి. ఆ నగరమంతయు భేరీశంఖనినాదములతో తూర్యవాద్య ఘోషములతో నుత్సవములతో గనులపండువగ నుండెను. విప్రుల వేదపఠనములతో హర్షధ్వానములతో వందిగాయక సంస్తుతులతో జయ మంగళ ఘోషములతో నయోధ్యాపురి ముదితవలె శోభిల్లెను. రాజు క్రొత్త వాడగుటవలన నగరము హృష్టపుష్టజనులతో స్తోత్రవాద్యధ్వనులతో కొంగ్రొత్తతనము సంతరించుకొని యెప్పుచుండెను. కొందఱు సజ్జనులు మాత్రము సుదర్శన రాజకుమారు డెచ్చటికేగెనోయని తమ ఇండ్లలో పలవరించుచుండిరి. ఆ మనోరమ మహాసాధ్వి. ఆమె తన కొడుకును వెంటబెట్టుకొని యెచ్చటికేగెనోగద! ఆమె తండ్రి రాజ్యలుబ్ధుడగు యుధాజిత్తు చేతిలో మడిసెనుగద! అని ఈరీతిగ సమబుద్ధులగు వృద్ధులు విచారము బొరయుచు శత్రుజిత్తునకు వశవర్తులై దుఃఃంచుచుండిరి. యుధాజిత్తు అట్లు తన మనుమని రాజుగజేసి రాజ్యభారము మంత్రుల కప్పగించి తన నగరము మొగముపట్టి పోవుచు - శ్రుత్వా సుదర్శనం తత్ర మునీనామాశ్రమే స్థితం | హంతు కామో జగామా%%శు చిత్రకూటం స పర్వతమ్. 11 నిషాదాధిపతిం శూరం పురస్కృత్య బలాభిధం | దుర్దర్శాఖ్య మగాదాశు శృంగబేర పురాధిపమ్. 12 శ్రుత్వా మనోరమా తత్ర బభూవాతి సుదుఃఃతా | ఆగచ్ఛంతం బాలపుత్రా భయార్తా సైన్యసంయుతమ్. 13 తమువాచాతి శోకార్తా మునిం సాశ్రు విలోచనా | కింకరోమి క్వ గచ్ఛామి యుధాజి త్సముపస్థితః. 14 పితా మే నిహతో%నేన దౌహిత్రో భూపతిః కృతః | సుతం మే హంతుకామో%త్ర సమాయాతి బలాన్వితః. 15 త్రోవలో నొక మున్యాశ్రమమున సుదర్శనుడు తలదాచుకొను టెఱిగి యతనిని రూపుమాపదలచి వెంటనే చిత్ర కూటగిరి కేగి బలుడను పేరుగలవాడును శూరుడునగు నిషాదరాజును మున్నిడికొని శృంగవేరపురాధిపుడగు దుర్దర్శుడను వానిని శీఘ్రుముగ కలిసెను. వీరిని అట్లు సేనాసహితముగ వచ్చుచున్నట్లు విని మనోరమ భయార్తయై తన చిన్నారి కొడుకునకు గల్గిన యాపదకు దుఃఃతమతియై కన్నులనిండ కన్నీరు నింపుకొని రోదించుచు మునితిలకున కిట్లనియెను : మునీశా! ఇపుడు యుధాజిత్తు మా ప్రాణములు బలిగొనుటకు వచ్చుచున్నాడు. నే నిపుడేమి చేతును? ఎక్కడికేగుదును? ఇతడు నా తండ్రిని పొట్టబెట్టుకొనెను. తన దౌహిత్రుని రాజుగ జేసెను. ఇపుడు నా చిన్ని కుమారుని చంప సైన్యముతో వచ్చుచున్నాడు. పురా శ్రుతం మయా స్వామి న్పాండవా వై వనే స్థితాః | మునీనా మాశ్రమే పుణ్య పాంచాల్యా సహితాస్తదా. 16 గతాస్తే మృగయాం పార్థా భ్రాతరః పంచ ఏవతే | ద్రౌపదీ సంస్థితా తత్ర మునీనా మాశ్రమే శుభే. 17 ధౌమ్యో%త్రి ర్గాలవః పైలో జాబాలి ర్గౌతమో భృగుః | చ్యవన శ్చాత్రిగోత్రశ్చ కణ్వశ్చైవ జతుః క్రతుః 18 వీతిహోత్రః సుమంతుశ్చ యజ్ఞదత్తో%థ వత్సలః | రాశాసనః కహోడశ్చ యవక్రీ ర్యజ్ఞకృత్క్రుతుః. 19 ఏతే చాన్యే చ మునయో భారద్వాజాదయఃశుభాః | వేదపాఠ యుతాః సర్వే సంస్థితా శ్చాశ్రమే స్థితాః. 20 దాసీభిః సమితా తత్ర యాజ్ఞసేనీ స్థితా మునే | ఆశ్రమే చారు సర్వాంగీ నిర్భయా మునిసంవృతే. 21 పార్థా మృగానుగా స్తావ త్ప్రయాతాశ్చ వనాద్వనం | ధనుర్బాణధరా వీరాః పంచైవ శత్రుతాపనాః. 22 పూర్వము పాండవులు పాంచాలీసమేతులై మున్యాశ్రమములందు వసించిరని నేను వింటిని. అపుడొకసారి పాండవులు వేట కేగగ ద్రోవది పావన మున్యాశ్రమమం దుండెను. ఆ యాశ్రమమందు ధౌమ్యుడు అత్రి గాలవుడు పైలుడు జాబాలి గౌతముడు భృగువు చ్యవనుడు కణ్వుడు జతువు వీతిహోత్రుడు సుమంతుడు యజ్ఞదత్తుడు వత్సలుడు రాశాసనుడు కహోడుడు యవక్రీతుడు యజ్ఞకృత్తుక్రతువు మొదలుగాగల మునులు భారద్వాజాదులును వేదపఠనములు సలుపుచుండిరి. శోభనాంగియగు ద్రౌపది తన చెలికత్తెయలంగూడి మునుల యాశ్రమమున నిర్భయముగ నుండెను. పరంతపులును వీరవరులును అగు పంచపాండవులు ధనుర్బాణధరులై మృగములను వేటాడుచు వనమునందు గ్రుమ్మరుచుండిరి. తావత్సింధుపతిః శ్రీమాన్మార్గస్థో బలసంయుతః | ఆగత శ్చాశ్రమాభ్యాశే శ్రుత్వా తునిగమధ్వనిమ్. 23 శ్రుత్వా వేదధ్వని రాజా మునీనాం భావితాత్మనాం | ఉత్తతార రథాత్తూర్ణం దర్శనాకాంక్షయా నృనః. 24 యదా నిరగమత్తత్ర భృత్యద్వయ సమన్వితః | వేదపాఠయుతా న్వీక్ష్య మునీ నుద్యమ సంస్థితః. 25 కృతాంజలిపుటః స్వామిన్సంస్థితో%థ జయద్రథః | ఆశ్రమే మునిభిర్జుష్టే భూపతిః సంవివేశ హ. 26 తత్రోపవిష్టం రాజానం ద్రష్టుకామాః స్త్రియస్తదా| ఆయయు ర్మునిభార్యాశ్చ కో%యమిత్యబ్రు వన్నృపమ్. 27 తాసాం మధ్యేచ వరారోహా యజ్ఞాసేనీ సమాగతా | జయద్రథేన దృష్టా సా రూపేణ శ్రీరివాపరా. 28 తాం విలోక్యాసితాపాంగీం దేవకన్యా మివాపరాం| పప్రచ్ఛ నృపతి ర్ధౌమ్యం కేయం శ్యామా వరాననా. 29 భార్యా కస్య సుతా కన్య నామ్నా కా వరవర్ణినీ | రూపలావణ్య సంయుక్తా శచీవ వసుధాంగతా. 30 బర్బూలవనమధ్యస్థా లవంగలతికా యథా| రాక్షసీబృందగా నూనం రంభే వా%%భాతి భామినీ. 31 సత్యం వద మహాభాగ! కస్యేయం వల్లభా%బలా| రాజపత్నీవ చాభాతి నైషా మునివధూ ర్ద్విజ| 32 ధౌమ్యః : పాండవానాం ప్రియా భార్యా ద్రౌపదీ శుభలక్షణా| పాంచాలీ సింధురాజేంద్ర| వసత్యత్ర వరాశ్రమే. 33 అంతలో సింధుపతియగు జయద్రథుడు సేనతో మార్గమున పయనించుచు వేదఘోషము విని యిది మునిజనాశ్రమమనుకొని ఆ యాశ్రమముచేరి సర్వ విదులగు మునుల వేదఘోషము వినగనే వారిని దర్శించు నాకాంక్షతో తన రథము దిగెను. ఇరువురు భృత్యులను వెంటగొని వేదపఠనమున మునిగియున్న మునుల చూచి చేతులు కట్టుకొని తాపసోత్తముల యాశ్రమములో బ్రవేశించెను. పిమ్మట నతడు కూర్చుండగనే మునిభార్యలత డెవరని యడుగుచు అతనిని చూడవచ్చిరి. వారి నడుమ రెండవలక్ష్మి వలెను దేవకన్యవలెను శోభిల్లు వరారోహయగు యాజ్ఞసేనిని ద్రౌపదినిగని జయద్రథుడా ప్రమద యగు వరానన యెవతెయో తెలియగోరి ధౌమ్యు నిట్లడిగెను: ఈమె యెవని భార్య? ఎవని కూతురు? ఈమె పేరేమి? ఈ వరవర్ణిని రూపలావణ్యవతియగు నింద్రాణి భూమికి దిగివచ్చెనో యన నలరుచున్నది. ఈ భామిని ముళ్ళచెట్ల నడిమి లవంగపు తీవియబోలి రక్కసుల మధ్యనుండు రంభవలె నిచట భాసిల్లుచున్నది. మహాభాగా! ఈ యబల యెవ్వని భార్యయో నిక్కువముగ బలుకుము. ఈమె రాజపత్నియే యగును గాని ముని భార్య కాదు అన విని ధౌమ్యుడు ఓ సింధురాజా! సర్వశుభలక్షణయుతయగు నీమె పాంచాలి - పాండవుల ప్రియసతి - ద్రోవది. ఈమె ఇపు డీ ఆశ్రమమందు నివసించుచున్నది. జయద్రథః: క్వ గతాః పాండవాః పంచ శూరాః సంప్రతివిశ్రుతాః | వసంత్యత్ర వనే వీరా వీత శోకా మహాబలాః. 34 ధౌమ్యః : మృగయార్థం గతాః పంచపాండవారథసంస్థితాః | ఆగమిష్యంతి మధ్యాహ్నే మృగానాదాయపార్థివాః. 35 తచ్ఛ్రుత్వా వచనం తస్య ఉదతిష్ఠ దసౌ నృపః | ద్రౌపదీ సన్నిధౌ గత్వా ప్రణమ్యేద మువాచ హ. 36 కుశలం తే వరారోహే:! క్వ గతాః పతయశ్చ తే | ఏకాదశ గతాన్యద్య వర్షాణి చ వనే కిల. 37 ద్రౌపదీ తు తదోవాచ స్వస్తి తే%స్తు నృపాత్మజ! విశ్రమ స్వాశ్రమాభ్యాశే క్షణాదాయాంతి పాండవాః. 38 ఏవం బ్రువంత్యాం తస్యాం తు లోభావిష్టః స భూపతిః | జహార ద్రౌపదీం వీరో%నాదృత్య మునిసత్తమాన్. 39 వీర్యశౌర్యబలయుతులగు పాండవులు శోకముడిగియున్నారా? వారెచ్చటి కేగిరని జయద్రథుడన వారు రథ మెక్కి వేటకేగిరి. వారు మృగములను గొని మధ్యాహ్నమునకు గాని రార'ని ధౌమ్యుడనియెను. ఆ మాటలు విని జయద్రథుడు లేచి ద్రౌపది చెంతకేగి ప్రణమిల్లి యామెతో ఓ వరారోహో! నీకు సేమంబేనా? నీ పతులెచ్చటి కరిగిరి? మీకు వనవాసమున పదునొక్కండేండ్లు గడచెనుగదా! అని యడిగెను. అది విని ఓ నృపా! నీకు శుభమగుత! ఈ యాశ్రమమున విశ్రమింపుము. క్షణములోన పాండవులేతేర గలరు' అని యామె పల్కుచుండగనే యతడు కామలుబ్ధుడై మునిసత్తముల ననాదరించి యామెను పట్టుకొనెను. కస్యచిన్నైవ విశ్వాసః కర్తవ్య స్సర్వథా బుధైః | కుర్వన్దుఃఖ మవాప్నోతి దృష్టాంత న్తత్రవైబలిః. 40 వైరోచన సుతః శ్రీమాన్ధర్మిష్ఠః సత్యసంగరః | యజ్ఞకర్తా చ దాతా చ శరణ్యః సాధుసమ్మతః. 41 నా ధర్మే నిరతః క్వాపి ప్రహ్లాదస్య చ పౌత్రకః | ఏకోనశతయజ్ఞాన్వై స చకార సదక్షిణాన్. 42 సత్త్వమూర్తిః సదావిష్ణుః సేవ్యః సయోగినామపి | నిర్వికారో%పి భగవాన్దేవకార్యార్థ సిద్ధయే. 43 కశ్యపాశ్చ సముద్భూతో విష్ణుః కపటవామనః | రాజ్యం ఛలేన హృతవాన్మహీం చైవ ససాగరామ్. 44 సో%భవత్సత్యవాగ్రాజా బలిర్వైరోచని స్తదా | కపటం కృతవాన్విష్ణు రింద్రార్థే తు మయా శ్రుతమ్. 45 అన్యః కిం న కరోత్యేవం కృతం వై సత్త్వమూర్తి నా | వామనం రూప మాస్థాయ యజ్ఞపాతం చికీర్షతా. 46 న చ విశ్వసితవ్యం వై కదాచిత్కేనచి త్తథా | లోభ శ్చేతసి చేత్స్వామి న్కీదృ క్పాపకృతం భయమ్. 47 కనుక బుధులెప్పుడే నెవ్వరినేని విశ్వసించి యుండరాదు. అట్లొనరించిన వగలబొగులవలసివచ్చును. ఇందులకు బలి తార్కాణము. ఆ బలి శ్రీమంతుడు; విరోచనుని సుతుడు; సత్యసంగరుడు; ధర్మపరుడు; సాధుసమ్మతుడు; మహా దాత; శరణాగత రక్షకుడు; యజ్ఞకర్త. ఎప్పుడేని అధర్మము చేసి యెఱుగడు. ప్రహ్లాదుని మనుమడు. భూరి దక్షిణలతో తొంబది తొమ్మిది జన్నములొనరించినవాడు. సకలయోగిసేవ్యుడు - సత్యమూర్తి - నిర్వికారుడునగు విష్ణుభగవానుడు దేవ హితము చేయదలంచి కశ్యప మహర్షికి పుత్రుడై పుట్టెను. అతడు కపట వామన రూపమున సాగర పరివృతమైన మహీమండల మంతయును బలినుండి వంచనతో హరించెను. ఐనను వైరోచని యగు బలి సత్యవాదియై పేరొందెను. అట్లు హరి యింద్రునికై బలిని వంచించి సర్వము హరించెనని వింటిని. యజ్ఞపాలకుడు - సత్యస్వరూపుడునగు నచ్యుతుడే యిట్లొనరింపగ నన్యుడెవడు మోసము చేయకుండును? కావున నెప్పుడును నెవ్వరును నెవ్వరిని విశ్వసింపరాదు. చిత్తములోభాయత్తమైన వానికి పాపభీతి యెక్కడిది? లోభాహతాః ప్రకుర్వంతి పాపాని ప్రాణినః కిల | పరలోకా ద్భయం నాస్తి కస్యచి త్కర్హిచిన్మునే: 48 మనసా కర్మణా వాచా పరస్వాదాన హేతుతః | ప్రపతంతి నరాః గ్లోభోపహత చేతసః. 49 దేవానారాధ్య సతతం వాంఛంతి చ ధనం నరాః | న దేవా స్తత్కరే కృత్వా సమర్థా దాతు మంజసా. 50 అన్యస్యానీయ తే విత్తం ప్రయచ్ఛంతి మనీషితం | వాణిజ్యేనాథ దానేన చౌర్యేణాపి బలేన వా. 51 విక్రయార్థం గృహీత్వా చ ధాన్యవస్త్రాదికం బహు | దేవా నర్చయతే వైశ్యో మహర్ధి ర్మే భ##వేదితి. 52 నాత్ర కిం పరవిత్తేచ్ఛా వాణిజ్యేన పరంతప | గ్రహణ కాలే తు సంప్రాప్తే మహోరం చాపి కాంక్షతి. 53 ఏవం హి ప్రాణినః సర్వే పరస్వాదానతత్పరాః | వర్తంతే సతతం బ్రహ్మ న్విశ్వాసః కీదృశః పునః. 54 వృథా తీర్థం వృథా దానం వృథా%ధ్యయనమేవ చ | లోభమోహ వృతానాం వై కృతం తదకృతం భ##వేత్. 55 తస్మాదేనం మహాభాగః విసర్జయ గృహంప్రతి | సపుత్రా%హం వసిష్యామి జానకీవ ద్ద్విజోత్తమః. 56 ఇత్యుక్తో%సౌ ముని స్తావద్గత్వా యుధాజితం నృపమ్ | ఉవాచ వచనం రాజ్ఞే భారద్వాజః ప్రతాపవాన్. 57 గచ్ఛ రాజ న్యథాకామం స్వపురం నృపసత్తమ | నేయం మనోరమా%భ్యేతి బాలపుత్రా సుదుఃఃతా. 58 యుధాజిదువాచ : మునే ముంచ హఠం సౌమ్య! విసర్జయ మనోరమామ్ | న చ యాస్యామ్యహం ముక్త్వా నేష్యామ్యద్య బలాత్పునః. 59 ఋషిరువాచ: నయస్వయది శక్తిస్తే బలేనాద్య మమాశ్రమాత్ | విశ్వామిత్రో యథాధేనుం వసిష్ఠస్య మునేః పురా. 60 ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ తృతీయస్కంధే షోడశో%ధ్యాయః మునీశ! లోభోపహతులగు ప్రాణులు దురితములొనరింతురు. అట్టివారికెప్పుడేని ఎచ్చటనేని పరలోకభీతియుండదు. లోభాయత్తచిత్తులు మనోవాక్కాయ కర్మలతో పరుల విత్తమపహరించి నరకమున గూలుదురు. నరులు సురల నారాధించి ధనము బడయజూతురు. కాని, దేవత లెవరిచేతికి ప్రత్యక్షముగ నెప్పుడేని ధనము తెచ్చి యీయరు. వారితరుల నుండి గ్రహించి తెచ్చి యిత్తురు. వ్యాపారముతో - దానముతో - బలముతో - దొంగతనముతో వైశ్యులు ధనవస్త్రాదులు గడించి తనియక తమకింకను ధనము రావలయునని దేవతల నర్చింతురు. వర్తకము చేయునపుడిది పరవిత్తహరణమనుభావ మతనికి గలుగదు. దానిని గ్రహించునప్పుడది వృద్ధిగావలయుననియు దానికెక్కువ వెల రావలయుననియు వర్తకుడు గోరుచుండును. ఇట్లు ప్రతివారును పరద్రవ్య హరణము చేయజూతురు. ఇంక నెవ్వనినని విశ్వసింపవలయును? కనుక లోభమోహములు గలవారి తీర్థ సంసేవనము వృథ! వారియధ్యయనము వ్యర్థము; వారి దానము నిరర్థకము; వారి కృతము లకృతములగును. కావుననో ద్విజవరా! ఈ నా వైరిరాజును వాని యింటికి పంపుము. అపుడు నేనిట జానకివలె సపుత్త్రనై వసింగలనను అనునామె పలుకులు విని తపోవీర్యశాలియగు భారద్వాజ మహర్షి యుధాజిత్తును జేరి, రాజా! స్వేచ్ఛగ నీపురమున కరుగుము. దుఃఃత బాలపుత్త్రయగు మనోరమ నీకు లభించదు అని పలుకగా యుధాజిత్తు ఓ మునీ! హఠము మానుము. మనోరమను వదలుము. ఆమెను గొనిపోక నేను పోను. నా బలము ప్రయోగించియైన నామెను పట్టుకొని పోదును అనెను. ఋషి ఇట్లనియెను. ''నీకు శక్తియున్న నీ బలము చూపి యీమెను మున్ను వసిష్ఠమమహర్షి నుండి విశ్వామిత్రుడెట్లు ధేనువున పహరించెనో అట్లు నా యాశ్రమమునుండి గొనిపోమ్ము చూతము. (తుదకతడేమయ్యెనో తెలియదా)'' ఇది శ్రీదేవీ భాగవతమందలి తృతీయస్కంధమున పదునారవ యధ్యాయము.