Sri Devi Bhagavatam-1    Chapters   

అథత్రయోవింశో%ధ్యాయః

వ్యాస ఉవాచ : తసై#్మ గౌరవభోజ్యాని విధాయ విధివత్తదా | వాసరాణి చ షడ్రాజా భోజయామాస భక్తితః. 1

ఏవం వివాహకార్యాణి కృత్వా సర్వాణి పార్థివః| పారిబర్హం ప్రదత్వా%థమంత్రయ న్సచివైః సహ. 2

దూతై స్తు కథితం శ్రుత్వా మార్గ సంరోధనం కృతమ్‌ | బభూవ విమనా రాజా సుబాహు రమితద్యుతి. 3

సుదర్శన స్తదోవాచ శ్వశురం సంశిత వ్రతః | అస్మా న్విసర్జయాశు త్వం గమిష్యామో హ్యశంకితాః. 4

భారద్వాజాశ్రమం పుణ్య గత్వా తత్ర సమాహితాః | నివాసాయ విచారో వై కర్తవ్యః సర్వథా నృప. 5

నృపేభ్యశ్చ న కర్తవ్యః భయం కించిత్త్వయ్బానఘు | జగన్మాతా భవానీ మే సాహాయ్యం వై కరిష్యతి. 6

వ్యాస ఉవాచ : తస్యేతి మతమాజ్ఞాయ జామాతు ర్నృపసత్తమః | విససర్జ ధనం దత్త్వా ప్రతస్థే సో%పి సత్వరః. 7

బలేన మహతా%%విష్టో యయా వను నృపోత్తమః | సుదర్శనో వృతస్తత్ర చచాల పథి నిర్భయః. 8

రథైః పరివృతః శూరః సదారో రథ సంస్థితః | గచ్ఛ న్దదర్శ సైన్యాని నృపాణాం రఘునందనః. 9

సుబాహు రపి తాన్వీక్ష్య చింతావిష్టో బభూవహ | విధివ త్స శివాం చిత్తే జగామ శరణం ముదా. 10

ఇరువది మూడవ అధ్యాయము

శ్రీదేవి ప్రాదుర్భవించి సుదర్శనుని గాపాడుట

బాదరాయణి యిట్లనియెను: ఆ విధముగ సుబాహు వల్లునకు యథావిధముగ పలువిధములైన భోజ్యపదార్థములను సమకూర్చి ఆరు దినముల వరకు భక్తి పూర్వకముగ భుజింపచేసెను. అట్లు అమిత ద్యుతియగు సుబాహువు వివాహ కార్యములు జరిపించి యల్లునకు బహుమానము లొసంగి మంత్రులతో మంత్రాలోచన మొనరించుచు రాజులెల్లరు నలుత్రోవలు కాచుకొని యున్న విషయమును దూతల వలన విని దుఃఖమున విమనస్కుడయ్యెను. అపుడు సుదర్శనుడు సుబాహునితో మమ్ము వేగమే సాగనంపుము. మేము నిశ్శంకముగా నేగుదుము. మేము పవిత్ర భారద్వాజాశ్రమ మేగి యచట నన్ని విధముల నిశ్చింతతతో నివసింపగలము'' అని పలికెను. సుబాహు వల్లుని భావ మెఱింగి విపులధనరాసు లొసంగి వారిని సాగనంపెను. సుదర్శనుడును త్వరితగతిని బయలుదేరెను. సుబాహువు పెద్ద సైన్యము సాహాయ్యముగా నతని వెనుక వచ్చుచుండెను. సుదర్శనుడు వెఱపు జెందక మార్గమున ముందునకు సాగుచుండెను. రథములు వెంటరాగా భార్య తోడుగాగా ఆ రఘుకులజుడు నరదంబెక్కి పోవుచు రాజుల సేనలను నొక్కసారి కలయజూచెను. సుబాహువు వైరి రాజులను గని చింతాక్రాంతుడయ్యెను. కాని సుదర్శనుడు విధి పూర్వకముగ నా జగదేక మాతను శరణుబొందెను.

జజాపైకాక్షరం మంత్రం కామరాజ మనుత్తమమ్‌ | నిర్భయో వీతశోకశ్చ పత్న్యాసహ నవోఢయా. 11

తతః సర్వే మహీపాలాః కృత్వా కోలాహలం తదా | ఉత్థితాః సైన్యసంయుక్తా హంతుకామా స్తు కన్యకామ్‌. 12

కాశీరాజ స్తు తాన్దృష్ట్వా హంతుకామో బభూవ హ | నివారితస్త దత్యర్థం రాఘవేణ జిఘాంసయా. 13

తత్రాపి నేదుః శంఖాశ్చ భేర్య శ్చానక దుందుభిః | సుబాహో శ్చ నృపాణాం చ పరస్పరజిఘాంసతామ్‌. 14

శత్రుజిత్తు సుసంవృత్తః స్థితస్తత్ర జిఘాంసయా ! యుధాజి త్త త్సహాయార్థం సన్నద్ధః ప్రబభూవ హ. 15

కేచిచ్చ ప్రేక్షకా స్తస్యా మహానీకైః స్థితాస్తదా |యుధాజి దగ్రతో గత్వా సుదర్శన ముపస్థితః16

శత్రుజిత్తేన సహితో హంతుం భ్రాతర మానుజః | పరస్పరం తా బాణౌఘై స్తతక్షుః క్రోధమూర్ఛితాః. 17

సమ్మర్ధః సుమహాం స్తత్ర సంప్రవృత్తః సుమార్గణౖః | కాశీపతి స్తదా తూర్ణం సైన్యేన బహునా వృతః. 18

సాహాయ్యార్థం జగామాశు జామాతర మనిందితమ్‌ | ఏవం ప్రవృత్తే సంగ్రామే దారుణ లోమహర్షణ. 19

ప్రాదుర్భభూవ సహసా దేవీ సింహో పరిస్థితా | నానాయుధధరా రమ్యా వరాభూషణ భూషితా. 20

దివ్యాంబరపరీధానా మందార స్రక్సుసంయుతా | తాం దృష్ట్వా తే%థ భూపాలా విస్మయం పరమం గతాః. 21

అట్లు సుదర్శనుడు పరమము నేకాక్షరము నైన కామరాజమంత్రమును నిర్విరామముగ జపించుచు నూతన వధువు తోడ విగతశోకుడై యొప్పెసగుచుండెను. వెంటనే రాజులెల్లరు పెల్లుగ కోలాహలము చేసి లేచి సైన్యసమేతులై కన్నియను హరింప నెంచిరి. కాశీరాజు వైరి రాజులగను గని వారి నంత మొందింప బూనుకొనెను. కాని సుదర్శను డతనిని గట్టిగ వారించెను. సుబాహువును మరి ఇతర రాజులును పరస్పరము జయకాంక్షలతో భేరీశంఖము లానక దుందుభులు మ్రోగించిరి. శత్రుజిత్తు సమరసన్నుద్ధుడై నిలుచుండెను. యుధాజిత్తతనికి సాయమొనర్ప సంసిద్ధుడయ్యెను. అందు కొందఱు సేనలను పరికించుచుండిరి. అంతలో యుధాజిత్తు సుదర్శనునిముం దేగి నిలుచుండెను. యుధాజిత్తు వెంట శత్రుజిత్తు గూడ తన యన్నను చంప వచ్చెను. అన్నదమ్ము లిరువురును కోపమున పరస్పర బాణఘాతములతో మూర్ఛితులగు చుండిరి. అట్లు వారికి బాణయుద్ధము సాగుచుండగ సుబాహువు తన సేనలను పురికొలిపి కూడదీసికొని తన యల్లునకు సాయమొనర్ప సంసిద్ధుడయ్యెను. ఇట్టు లచ్చెరువుగదుర దారుణ సంగ్రామము సాగుచుండెను. అంతలో నెక్కడినుండియో వేవేగమే నానా యుధధారిణి వరభూషణభూషిత సంహవాహనాసీనయగు దేవి భగవతి ప్రత్యక్షమయ్యెను. దివ్య మాల్యాంబరములు మందార సుమమాలికలు దాల్చి ఆ తల్లి విరాజిల్లుచుండెను. ఆ లోకమాతను గాంచి యెల్లరాజులును విస్మయచకితులైరి.

కేయం సింహసమారూఢా కుతోవేతి సముత్థితా | సుదర్శన స్తు తాం వీక్ష్య సుబాహు మితి చాబ్రవీత్‌. 22

పశ్య రాజ న్మహాదేవీ మాగతాం దివ్య దర్శనామ్‌| అనుగ్రహాయ మే నూనం ప్రాదుర్భూతా దయాన్వితా. 23

నిర్భయో%హం మహారాజ! జాతో%స్మి నిరయాదపి | సుదర్శనః సుబాహుశ్చ తామలోక్య వరాననామ్‌. 24

ప్రణామం చక్రతు స్తస్యా ముదితౌ దర్శనేన చ | ననాద చ తథా సింహో గజా స్త్రస్తా శ్చ కంపిరే. 25

వవు ర్వాతా మహాఘోరా దిశశ్చాసన్సుదారుణాః | సుదర్శన స్తదా ప్రాహ నిజం సేనాపతిం ప్రతి. 26

మార్గే వ్రజ త్వం తరసా భూపాలా యత్ర సంస్థితాః | కిం కరిష్యంతి రాజానః కుపితా దుష్టచేతనః. 27

శరణార్థం చ సంప్రాప్తా దేవీ భగవతీ హి నః | నిరాంతకైశ్చ గంతవ్యం మార్గ్బేస్మి న్భూపసంకులే. 28

స్మృతా మయా మహాదేవీ రక్షణార్థ ముపాగతా | తచ్ఛ్రుత్వా వచనం సేనాపతిస్తేన పథా%వ్రజత్‌. 29

యుధాజిత్తు సుసంక్రుద్ధస్తానువాచ మహీపతీన్‌ | కిం స్థితా భయ సంత్రస్తా నిఘ్నంతు కన కాన్వితమ్‌. 30

అవమాన్య చ నః సర్వా న్బలీహనో బలాధికాన్‌ | కన్యాం గృహీత్వా సంయాతి నిర్భయ స్తరసా శిశుః 31

కిం భీతాః కామినీం వీక్ష్య సింహోపరి సుసంస్థితామ్‌ | నోపేక్ష్యో హి మహాభాగా హంతవ్యో%త్ర సమాహితైః. 32

హత్వైనం సంగ్రహీష్యామః కన్యాం చారువిభూషణామ్‌ | నాయం కేసరిణా%%దత్తాం ఛేత్తు మర్హతి జంబుకః. 33

ఈ సింహాసనారూఢ యెవ్వరు? ఎక్కడినుండి యేతెంచినది? అని రాజులు తలపోయుచుండిరి. అపుడు సుదర్శను డాజగదంబను సందర్శించి సుబాహువుతో నిట్లు పలికెను. ఓ రాజా! అనురాగమయి యగు తల్లిని దర్శింపుము. ఆ తల్లి మనకు తన దివ్యదర్శనభాగ్య మొసంగ నేతెంచినది. న న్ననుగ్రహింప నా తల్లి దయామృతము చింద నవతరించి నేనిపుడు నిర్భయులలోన నిర్భయుడనైతి'ననెను. వారిరువురు రా భగవతి యగు వరాననను నేత్ర పర్వముగ నవలోకించిరి. వారా దేవి దివ్యదర్శనమునకు హృదయములుప్పొంగ దండవత్‌ ప్రణామము లాచరించిరి. ఆ సింహగర్జనమున కేనుగుల గుంపులు భయకంపితములై చెల్లాచెదరయ్యెను. దెసలు కంపించెను. పెనుగాలులు వీచెను. అపుడు సుదర్శనుడు తన సేనాపతి కిట్లనెను. నీ విపుడు దుష్టచేతస్కులును కుపితులును నైన రాజు లెచట గలరో యేమి చేతురో తెలిసికొనుటకు బయలుదేరుము. నీవీ మహరాజులుండు త్రోవలందు నిర్భయముగ నరుగవచ్చును. మన కా భగవతి తోడునీడయై కరుణ జూపును. మనము ఆమెను స్మరించినంతనే ఈ మహాదేవి మనల గాపాడ నేగుదెంచినది' అను మాటలు విని సేనాపతి బయలుదేరెను. యధాజిత్తు రోషాతిరేకమున రాజుల కిట్లనియెను. మీరు భయకంపితులగుదురేల? ఆ సుదర్శనుని నతని భార్యతో గూడ నంతమొందింపుడు. బలాధికులమైన మనలనవమానించి బలహీనుడైన యితడు జంకుగొంకుతలు లేక కన్నియను గొనిపోవుచున్నాడు. ఈ సింహముపై నున్న యొక కామినిని గని యేల భీతిల్లుదురు! ఈమె నుపేక్షింప దగదు. మనము కలిసికట్టుగ నీమెను చంపుదము. ఈమెను చంపి సుభూషిత యగు ఈ కన్యకను గ్రహింతము. సింహము చేతిలోని వస్తువును నక్క గ్రహించలేనట్లు మనకు తగిన కన్యకను గ్రహించుట కితడు తగినవాడు గాడు.''

ఇత్యుక్త్వా సైన్యసంయుక్తః శత్రుజిత్సహిత స్తదా | యోద్ధుకామః సుసంప్రాప్తో యుధాజిత్క్రోధ సంవృతః. 34

ముమోచ విశిఖాంస్తూర్ణం సమపుంఖాన్‌ శిలాశితాన్‌ | ధనురాకృష్య కర్ణాంతం కర్మార పరిమార్జితాన్‌. 35

హంతుకామః సుదర్మేధాః సుదర్శన మథోపరి | సుదర్శన స్తు తాన్బాణౖ శ్చిచ్ఛేదాపతతః క్షణాత్‌. 36

ఏవం యుద్ధే ప్రవృత్తే%థ చుకోప చండికా భృశమ్‌ | దుర్గాదేవీ ముమోచాథ బాణాన్యుధాజితం ప్రతి. 37

నానారూపా తదా జాతా నానాశస్త్రధరా శివా | సంప్రాప్తా తుములం తత్ర చకార జగదంబికా. 38

శత్రుజి న్నిహత స్తత్ర యుధాజిదపి పార్థివః | పతితౌ రథాభ్యాం తు జయశబ్దస్తదా%భవత్‌. 39

విస్మయం పరమం ప్రాప్తా భూపాః సర్వే విలోక్య తాన్‌ | నిధనం మాతులస్యాపి భాగినేయస్య సంయుగే. 40

సుబాహు రపి తం దృష్ట్వా నిధనం సంయుగే తయోః | తుష్టావ పరమప్రీతో దుర్గాం దుర్గతినాశినీమ్‌. 41

అని యుధాజిత్తు కోపోద్రిక్తుడై పలికి శత్రుజిత్తుని సేన వెంట రాగా పోరుసలుప పూనుకొనెను. పిదప వారు లోహకార నిర్మితములై సానపెట్టబడిన వాడి ములుకులు సంధించి ఎక్కుపెట్టిన ధనువు నాకర్ణాంతము లాగి సుదర్శనునిపై నేసిరి. ఆ దుష్టబుద్ధి సుదర్శునునిపై బాణప్రహారము చేయగ సుదర్శనుడు నతనిని తీవ్ర బాణములతో క్షణములో నేల పడగొట్టెను. ఇట్లు పోరుసాగుచుండగ దుర్గాదేవి యగు చండిక తీవ్రకోపమున యుధాజిత్తుపై దారుణ శరములు ప్రయోగించెను. జగదంబిక యగు శివాదేవి నానా రూపములు దాల్చి నానా శస్త్రాస్త్రములతో సమరము సాగించెను. అంత శత్రుజిత్‌ యుధాజిత్తులు నిహతులై రథము నుండి నేల గూలిరి. వెంటనే జయ జయ దుర్గాదేవీ! యను హర్ష నినాదములు మిన్ను ముట్టెను. వారిరువుర చావు గని రాజులు విస్మయావిష్టులైరి. అట్లు రణమున తమ వైరులు నిహతులు గాగా సుభాహువు దుర్గతినాశని యగు దుర్గను పరమప్రతీతితో నీవిధముగ సంస్తుతించెను:

సుబాహురువాచ: నమో దేవ్యై జగద్ధాత్య్రై శివాయై సతతం నమః |

దుర్గాయై భగవత్యై తే కామదాయై నమోనమః. 42

నమః శివాయై శాంత్యై తే విద్యాయై మోక్షదే! నమః | విశ్వవ్యాపై#్త్య జగన్మాత ర్జగద్దాత్ర్యై నమః శివే! 43

నాహం గతిం తవ ధియా పరిచింతయ న్వై జానామి దేవి! సగుణః కిల నిర్గుణాయాః |

కిం స్తౌమి విశ్వజనని ! ప్రకటప్రభావామ్‌ భక్తార్తినాశనపరాం పరమాం చ శక్తిమ్‌. 44

వాగ్దేవతా త్వమసి సర్వగతైవ బుద్ధి ర్విద్యా మతిశ్చ గతిర ప్యసి సర్వజంతోః |

త్వా స్తౌమి కిం త్వమసి సర్వమనో నియంత్రీ కిం స్తూయతే హి సతతం ఖలు చాత్మరూపమ్‌. 45

బ్రహ్మో హరశ్చ హరిర ప్యనిశం స్తువంతో నాంతంగతాః సురవరాః కిల తే గుణానామ్‌ |

క్వాహం విభేదమతి రంబ గుణౖ ర్వృతో వై వక్తుం క్షమస్తవ చరిత్ర మహో ప్రసిద్ధః. 46

సత్సంగతిః కథమహో న కరోతి కామమ్‌ ప్రాసంగిక్బాపి విహితా ఖలు చిత్తశుద్ధిః |

జామాతు రస్య విహితేన సమాగమేన ప్రాప్తం మయా%ద్భుత మిదం తవ దర్శనం వై. 47

బ్రహ్మా2పి వాంఛతి సదైవ హరో హరిశ్చ సేంద్రాః సురాశ్చ మునయో విదితార్థతత్త్వాః |

యద్దర్శనం జనని | తే%ద్య మయా దురాపమ్‌ ప్రాప్తం వినా దమశమాది సమాధిభిశ్చ. 46

జగద్ధాత్రీ శివా దుర్గా కామదా భగవతి యగు శ్రీదేవికి నేను ప్రణమిల్లుచున్నాను. శ్రీవిద్య శివ శాంత మోక్షద విశ్వవ్యాపిని యగు జగదేకమాత కంజలి ఘటించుచున్నాను. పరమశక్తివగు విశ్వమాతా ! దివ్యదేవీ! ఈ నా యల్పబుద్ధితో సుగుణ నిర్గుణములలోన నీ మార్గమేదియో యెఱుగలేకున్నాను. నీవు భక్తార్తిభంజనివి. నీ దివ్య సత్ప్రభావమును వినుతింప నేనెవ్వడను? ఓ దేవీ! నీవే వాగ్దేవతవు. సర్వజంతువులకు సర్వగతివి - సద్బుద్ధివి - మతివి నీవే. సకల మనోనియంత్రివి నీవే. నిన్ను సర్వాత్మత్వభావముతో నిత్యము నుతించుట కెటు సాధ్యపడును తల్లీ? అమ్మా! హరిహరబ్రహ్మలును సురవరులును నిన్ను విడువక సంస్తుతించుచున్నను నపారసుగుణవారాశివగు నీపారమెఱుగజాలకున్నారు. విషయగుణబద్ధుడను భిన్నమతిని నగు నేను నీ దివ్యసచ్చరితప్రభావ మెట్లెఱుంగగలను? ఈ చపలచిత్త మొకమట్టుకు నీ సచ్చరిత్రను నీ సత్సాంగత్యమును బడయ నేరదు. నీ సత్కథాప్రసంగముల మహిమవలన నవశ్యము చిత్తశుద్ధి యేర్పడును గదా! నా యల్లుని సత్సంగతి వలన నాకు నీ యద్భుత దివ్యసందర్శన భాగ్యమబ్బెను. దేనిని హరిహర బ్రహ్మలును దేవేంద్రాదిసురలును మునులును తత్త్వార్థ విదులును పరికాంక్షింతురో యట్టి నీ సుదర్లభ దివ్యసందర్శనము శమదమసమాధులు లేకయే నేడు నాకు తెలికగ లభ్యమైనది.

క్వాహం సుమందమతి రాశు తవావలోకమ్‌ | క్వేదం భవాని ! భవభేషజ మద్వితీయమ్‌ |

జ్ఞాతా%సి దేవి సతతం కిల భావయుక్తా | భక్తాను కంపన పరా%మరవర్గ పూజ్యా. 49

కిం వర్ణయామి తవ దేవి ! చరిత్ర మేత ద్య ద్రక్షితో%సి విషమే%త్ర సుదర్శనో%యమ్‌ |

శత్రూ హతౌ సుబలినౌ తరసా త్వయా యత్‌ | భక్తాను కంపిచరితం పరమం పవిత్రమ్‌. 50

నాశ్చర్య మేతదితి దేవి ! విచారితే2%ర్థే త్వం పాసి సర్వమఃలం స్థిరజంగమం వై |

త్రాత స్త్వయా చ వినిహత్య రిపు ర్దయాతః సంరక్షితో%య మధునా ధ్రువసంధి సూనుః. 51

భక్తస్య సేవనపరస్య యశో%తి దీప్తమ్‌ కర్తుం భవాని | రచితం చరితం త్వయైతత్‌ |

నో చే త్కథం సుపరి గృహ్య సుతాం మదీయామ్‌ యుద్ధే భ##వే త్కుశల వాననవద్యశీలః. 52

శక్తా%సి జన్మమరణాదిభయాని హంతుమ్‌ కిం చిత్ర మత్ర కిల భక్త జనస్య కామమ్‌ |

త్వం గీయసే జనని! భక్తజనై రపారా త్వం పాపపుణ్యం రహితా సుగుణా%గుణాచ. 53

త్వ ద్దర్శనా దహ మహో సుకృతీ కృతార్థో జాతో%స్మి దేవి భువనేశ్వరి ! భవ్యజన్మా |

బీజం న తే న భజనం కిల వేద్మి మాతు ర్ఞాత స్తవాద్య మహిమా ప్రకటప్రభావః. 54

ఏవం స్తుతా తదా దేవీ ప్రసన్నవదనా శివా | ఉవాచ చ నృపం దేవీ వరం వరయ సువ్రత. 55

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ తృతీయ స్కంధే త్రయోవింశో%ధ్యాయః.

అంబా! మందమతి నగు నేనేడ? అద్వితీయమైన భవభేషజమగు నీ దయామృతవీక్షణము లేడ? భవానీ! దీన భక్తపరాధీనా! నీవు నీ పరమభక్తుల యైకాంతిక ప్రేమభక్తిని గని వారిపై దయామృతము గురిపింతువు. అమర పూజిత పాదపద్మవు నీవు. ఓ పరాదేవీ! నీ యద్భుత మహనీయత నెంతని వర్ణింతును? సుదర్శనుని విషమసంకటస్థితినుండి సముద్ధరించినదానవు. నీ వలన శత్రులు తుదముట్టిరి. భక్తానుకంపనశీల వగు నీ చరిత్రము పరమపవిత్రము. ఈ స్థాపరజంగమాత్మకమైన విశ్వప్రపంచములకు నీవు సర్వాధికారిణివి. పాలనకర్త్రివి. కనుకనే శత్రుల మూకలను చెండాడి ధ్రువసంధి కొడుకును దయతో బ్రోచితివి. ఇం దాశ్చర్య మేమున్నది? నీ సేవాతత్పరులగు నీ భక్తుల కీరితి నీ మూలమున విస్తరిల్లినది. ఇట్లు నీవే నీ మహితచరితను రచించితివి. అట్లు కానిచో ననవద్య శీలుడగు సుదర్శనుడు శత్రులను గెలిచి కుశలమున నా సుతను చేపట్టుట సాధ్య మయ్యెడిదా? పాపపుణ్యరహితవు. సుగుణ నిర్గుణ స్వరూపవు. నీవు పరమ భక్తుల చేత నిచ్చట దివ్యమధురగానమున స్తుతి చేయబడుచుందువు. ఓ త్రిభువనేశ్వరీ! నీ సందర్శనమున నేను ధన్యజీవనుడనైతిని. నిన్ను భజించుటకు తగిన సద్బీజమంత్రము నేనెఱుగను. ఐనను నీ మహిమ నేడు విశ్వవిఖ్యాతి నందినది. ఇట్లు రాజు నుతింపగ పరాశక్తి ప్రసన్నయై రాజు నేదేని వరము గోరుకొను మనెను అని వ్యాసుడు జనమేజయునితో పలికెను.

ఇది శ్రీదేవీభాగవత మందలి తృతీయస్కంధమున నిరువదిమూడవ యధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters