Sri Devi Bhagavatam-1
Chapters
అథ చతుర్వింశో%ధ్యాయః వ్యాసఉవాచ: తస్యాస్త ద్వచనం శ్రుత్వా భవాన్యాః స నృపోత్తమః |
ప్రోవాచ వచనం తత్ర సుబాహు ర్భక్తి సంయుతః.
1 ఏకతో దేవలోకస్య రాజ్యం భూమండలస్య చ | ఏకతో దర్శనం తేవైన చ తుల్యం కదాచన. 2 దర్శనా త్సదృశం కించి త్త్రిషు లోకేషు నాస్తిమే | కం వరం దేవి యాచే%హం కృత్థారో%స్మి ధరాతలే. 3 ఏత దిచ్ఛా మ్యహం మాత ర్యాచితుం వాంఛితంవరమ్ | తవ భక్తిః సదా మే%స్తు నిశ్చలా హ్యనపాయినీ. 4 నగరే%త్ర త్వయా మాతః స్థాతవ్యం మమ సర్వదా | దుర్గాదేవీతి నామ్నా వై త్వం శక్తి రిహ సంస్థితా. 5 రక్షా త్వయా చ కర్తవ్యా సర్వదా నగరస్య హ | యథా సుదర్శన స్త్రాతో రిపు సంఘా దనామయ. 6 తథా%త్ర రక్షా కర్తవ్యా వారణాస్యాస్త్వయా%ంబికే | యావత్పురీ భ##వే ద్భూమౌ సుప్రతిష్ఠా సుసంస్థితా. 7 తావత్త్వయా%త్ర స్థాతవ్యం దుర్గే! దేవి! కృపానిధే | వరో%యం మమ తేదేయః కిమన్య త్ర్పార్థయామ్యహమ్. 8 వివిధా న్స కలా న్కామా న్దేహి మే విద్వి షో జహి | అభద్రాణాం వినాశం చ కురు లోకస్య సర్వదా. 9 ఇతి సంప్రార్థితా దేవీ దుర్గా దుర్గార్తి నాశినీ | తమువాచ నృపం తత్ర స్తుత్వా వై సంస్థితం పరమ్. 10 రాజ న్సదా నివాసో మే ముక్తిపుర్యాం భవిష్యతి రక్షార్థం సర్వలోకానాం యావత్తిష్ఠతి మేదినీ. 11 అథో సుదర్శన స్తత్ర సమాగమ్య ముద్బాన్వితః | ప్రణమ్య పరయా భక్త్యా తుష్టావ జగదంబికామ్. 12 ఇరువది నాలుగవ యధ్యాయము శ్రీదేవి కాశిలో నివసించుట వ్యాసు డిట్లనెను : ఆ భవానీదేవి హితవు నాలకించి సుబాహువు భక్తి యుక్తితో శ్రీదేవి కిట్లనియెను. ఒకవంక దేవలోక భూలోకముల విశాల రాజ్యసంపదలు, మరొకవంక నెనలేని నీ దివ్య సందర్శన భాగ్యము. ఓ బ్రహ్మాండ జననీ! ఈ ముల్లోకములందును నీ దివ్య సందర్శనమునకు సాటివచ్చున దేదియును లేదు. నీ దర్శనముచే నేనీభూమిపై ధన్యుడనైతిని. నేనింకేమి కోరుదును? ఐనను నేనొక వరము గోరుచున్నాను. నీ పాద పద్మములందు నా కైకాంతిక ప్రేమభక్తి కుదురుగ నుండుగాక. ఓ మాతా! ఈ పవిత్ర కాశీనగరిలో నీ శక్తిరూపము దుర్గాదేవి నామమున నెల్లకాలము నెలకొని యుండునుగాక! సుదర్శనుని శత్రు సంఘములనుండి మమ్ము సురక్షితముగ రక్షించితివి. అటులే నీ వీ నగరమును నిత్యము బ్రోచుచుండుము. ఓ జగజ్జననీ! ఈ భూమిపై నెంతకాలము కాశీపురి సుస్థిరమై ప్రసిద్ధినంది యలరారుచుండునో యంతకాలము నీవిట నెలకొనియుండి దానిని నీవు ప్రోచుచుండుము. నాకీయొకేయొక వరమిమ్ము. నేనింతకు మించి యేమియును గోరను. అమ్మా! నాకు సకలవిధకామము లొడగూర్పుము. నా వైరులను దునుమాడుము. లోకమందలి యమంగళమును ప్రతిహత మొనరింపుము. ఈ విధముగ తన్ను సంస్తుతించి వరములు పొంది తన సమక్షమున కేలుమోడ్చి నిలుచున్న సుబాహుని గని దుర్గతినివారిణి యగు దుర్గ సుప్రసన్నయై యతని కిట్లనియెను: రాజా! ఈ భూమి నిలుచునందాక నేనీ యవిముక్త క్షేత్రమునందు విశ్వసంరక్షణకై నివసింతును.' ఆపిమ్మట సుదర్శనుడు ప్రమోదసంభరితుడై వచ్చి పరమ భక్తితో మోకరిల్లి జగదంబిక నీ విధముగ కొండాడెను. అహో కృపాతే కథయామ్యహం కిం త్రాత స్తయా యత్కిల భక్తిహీనః | భక్తానుకంపీ సకలో జనో%స్తి విముక్తభ##క్తే రవనం వ్రతం తే. 13 త్వం దేవీ! సర్వం సృజసి ప్రపంచం శ్రుతం మయా పాలయసి స్వసృష్టమ్ | త్వ మత్సి సంహారపరే చ కాలే న తే%త్ర చిత్రం మమ రక్షణం వై. 14 కరోమి కిం తే వద దేవి ! కార్యమ్ క్వ వా వ్రజామీత్యనుమోదయాశు | కార్యే విమూఢో%స్మి తవాజ్ఞయా %హమ్ గచ్ఛామి తిష్ఠే విహరామి మాతః. 15 తం తథా భాషమాణుం తు దేవీ ప్రాహ దయాన్వితా | గచ్ఛాయోధ్యాం మహాభాగ : కురు రాజ్యం కులోచితమ్. 16 స్మరణీయా సదా%హం తే పూజనీయా ప్రయత్నతః | శం విధ్యాస్యామ్యహం నిత్యం రాజ్యే తే నృపసత్తమః 17 అష్టమ్యాం చ చతుర్దశ్యాం నవమ్యాం చ విశేషతః | మమ పూజా ప్రకర్తవ్యా బలిదాన విదానతః. 18 అర్చా మదీయా నగరే స్థాపనీయా త్వయా%నమ : పూజనీయా ప్రయత్నేన త్రికాలం భక్తి పూర్వకమ్. 19 శరత్కాలే మహాపూజా కర్తవ్యా మమ సర్వదా | నవరాత్రవిధానేన భక్తిభావయుతేన చ. 20 చైత్రే%శ్వినే తథా%%షాఢే మాఘే కార్యో మహోత్సవః | నవరాత్రే మహారాజ: పూజా కార్యా విశేషతః. 21 కృష్ణపక్షే చతుర్దశ్యాం మమ భక్తి సమన్వితైః | కర్తవ్యా నృపశార్దూల తథా%ష్టమ్యాం సదా బుధైః. 22 ఓహో దేవీ ! నీ దయ నెంతని వర్ణింతును? నేను భక్తి హీనుడనైనను నీచేత గాపాడబడితిని. ఎల్ల దేవతలు భక్తులపై దయజూపుదురు. కాని, నీవు మాత్రము భక్తి లేనివారిపైగూడ దయ జూపుదువు. ఇది నీ ముఖ్యవ్రతము. మహాదేవీ! నీ వీ బ్రహ్మాండము లన్నిటిని పుట్టించి పెంచి తుదకు సంహారమొనర్తు పని నేను వింటిని. అట్టి నీవు నన్నొక్కని బ్రోచుట వింతగాదు. అమ్మా భవానీ! నేను కార్యమూఢుడను. నేనిపుడేమి చేయవలయును? ఎచటి కేగ వలయును? నన్నాదేశింపుమమ్మా! నీయాన తలదాల్చి వెళ్ళుదును. విహరింతును, మనుదును. అపుడు దేవి దయాంతరంగయై యతని కిట్లనియెను. ఓ మహాభాగా! నీ వయోధ్య కేగి నీ కులోచితముగ రాజ్యమేలుము. నన్ను నియతముగ భక్తితోడ సంస్మరించుచు బూజించుచుండుము. నేను నీ రాజ్యమందు నిత్య సుఖశాంతులు నెలకొలుప గలను. నీవష్టమీ నవమీ చతుర్దశులందు నన్ను గుఱించి ప్రత్యేకముగ బలివిధానముతో నా పూజ లొనర్పవలయును. ఓ యనఘా! నా దుర్గా విగ్రహమును నీ నగరమున సుప్రతిష్ఠితము గావించి నన్ను శ్రద్ధాభక్తులతో మూడువేళల నర్చించు చుండుము. ప్రతి శరత్కాలమున నవరాత్ర విధానముగ పరాభక్తి భావముతో నాకు నిత్యము మహాశక్తిపూజ లొనర్పుము. చైత్రము-ఆషాఢము-ఆశ్వయుజము-మాఘము- ఈ మాసములందు నన్ను గూర్చి ప్రేమమీర శ్రీదేవీ మహోత్సవములు జరుపవలయును. విశేషించి నవరాత్రములందు హృదయపూర్వకములగు నివాళులతో నిత్యపూజ లొనరింప వలయును. బుధులు విశేషించి కృష్ణపక్షమందలి యష్టమీ చతుర్దశులందు నిశ్చలభక్తి యుక్తులై న న్నారాధింప వలయును. ఇత్యుక్త్వాంతర్హితా దేవీ దుర్గా దుర్గార్తినాశినీ | నతా సుదర్శనేనాథ స్తుతా చ బహువిస్తరమ్. 23 అంతర్హితాం తు తాం దృష్ట్వా రాజానః సర్వ ఏవ తే | ప్రణము స్తం సమాగమ్య యథా శక్రం సురాస్తథా. 24 సుబాహు రపి తం నత్వా స్థిత శ్చాగ్రే ముదా%న్వితః | ఊచుః సర్వే మహీపాలా అయోధ్యాధిపతిం తదా. 25 త్వ మస్మాకం ప్రభుః శాస్తా సేవకాస్తే వయం సదా | కురు రాజ్య మయోధ్యాయాం పాలయాస్మా న్నృపోత్తమః. 26 త్వత్ప్రసాదా న్మహారాజా: దృష్టా విశ్వేశ్వరీ శివా | ఆదిశక్తి ర్భవానీ సా చతుర్వర్గఫలప్రదా. 27 ధన్య స్త్వం కృతకృతో%సి బహుపుణ్యో దరాతలే | యస్మాచ్చ త్వత్కృతే దేవీ ప్రాదుర్భూతా సనాతనీ. 28 న జానీమో వయం సర్వే ప్రభావం నృప సత్తమ | చండికాయా స్తమోయుక్తా మాయయా మోహితాః సదా. 29 ధనదారసుతానాం చ చింతనే%భిరతాః సదా | మగ్నా మహార్ణవే ఘోరే కామక్రోధఝషాకులే. 30 పృచ్ఛామ స్త్వాం మహాభాగ: సర్వజ్ఞో%సి మహామతే | కేయం శక్తిః కుతో జాతా కిం ప్రభావా వదస్వ తత్. 31 భవ త్వాం నౌశ్చ సంసారే సాధవో%తిదయాపరాః | తస్మా న్నో వద కాకుత్థ్స : దేవీమాహాత్మ్య ముత్తమమ్. 32 యత్ర్పభావా చ సా దేవీ యత్స్వరూపా యదుద్భవా | తత్సర్వం శ్రోతుమిచ్ఛామ స్త్వం బ్రూహి నృవరోత్తమ. 33 ఇతి పృష్ట స్తదా తైస్తు ధ్రువసంధిసుతో నృపః | విచింత్య మనసా దేవీం తానువాచ ముదా%న్వితః. 34 ఇట్లు దుర్గతి నాశని శ్రీదేవి దుర్గ పలికి సుదర్శనునిచేత సన్నుతింపబడి అదృశ్యయైన పిమ్మట దేవత లింద్రుని జేరునట్లు రాజులు సుదర్శనుని జేరి ప్రణమిల్లిరి. సుబాహువు సైతమతనికి వందన మాచరించి నిలుచుండెను. రాజులందఱును సుదర్శునితో నిట్లనిరో. నీ వయోధ్యాపతివి కమ్ము. మేము నీ సేవకులము. నీవు మా ప్రభుడవు. శాసకుడవు. నీవయోధ్యారాజ్య మేలుము. మమ్ము బాలింపుము. మహారాజా! ఆదిశక్తి - మహాదేవి - చతుర్వర్గఫలప్రదాయిని-విశ్వేశ్వరి-శివ యగు పరాదేవి నీ మూలమున మాకు గోచరయైనది. ఈ భూమిపై నీవు మిక్కిలి ధన్యుడవు-కృతకృత్యుడవు-పుణ్యతముడవు-కావుననే నీ నిమిత్తమున సనాతని యగు జగదంబిక దర్శనభాగ్య మొసంగినది. నృపసత్తమా ! మేము మాయామోహితులము. తామసులము. కాన మేము శ్రీ చండికాప్రభావ మెఱుగ జాలకుంటిమి. మేము ధన దార సుతుల చింతలం దగిలి యుంటిమి. కామక్రోధములను మొసళ్ళుగల ఘోర సంసార సాగరమందు నిర్మగ్నుల మైతిమి. నీవు సర్వజ్ఞుడవు-మహామనీషివి. కనుక ఆ పరమశక్తి యెవరో ఎచ్చటి నుండి వచ్చెనో ఆమె మహా ప్రతిభా ప్రభావ మెట్టిదో నీవు చక్కగ నెఱుగుదువు. కాన నిన్నడుగుచున్నాము-దయతో సెలవిమ్ము. కాకుత్థ్స ! సాధులు సర్వభూతహితులును దయామతులును. కనుక నీవు మా దుస్తర సంసార సాగరము దాటించు నావికుడవుగమ్ము. మాకు శ్రీమద్దేవీమాహాత్మ్యము తెలియ బలుకుము. నరవరోత్తమా! ఆ మాయాదేవీ నిజస్వరూపమేది? ఆమె యెట్లవతరించినది? ఆమె విమల ప్రభావ మేతీరుది? ఇవన్నియును మాకు వినవేడుకగుచున్నవి. వినిపింపుము'' అని యిట్లు రాజులడుగగా సుదర్శనుడు ప్రమోద మలర నెమ్మదిలో శ్రీదేవిని సంభావించి వారికిట్లనియెను: సుదర్శనః కిం బ్రవీమి మహీపాలా స్తస్యాశ్చరిత ముత్తమమ్ | బ్రహ్మాదయో నజానంతి సేశాఃసురగణాస్తథా. 35 సర్వస్యా%%ద్యా మహాలక్ష్మీ ర్వరేణా శక్తి రుత్తమా | సాత్త్వికీయం మహీపాలా జగత్పాలనతత్పరా. 36 సృజతే యా రజోరూపా సత్త్వరూపా చ పాలనే | సంహారే చ తమోరూపా త్రిగుణా సా సదా మతా. 37 నిర్గుణా పరమా శక్తిః సర్వకామఫలప్రదా | సర్వేషాం కారణం సా హి బ్రహ్మాదీనాం నృపోత్తమాః. 38 నిర్గుణా సర్వథా జ్ఞాతు మశక్యా యోగిభి ర్నృపాః | సగుణా సుఖసేవ్యా యా చింతనీయా సదా బుధైః. 39 రాజానః : బాల ఏవ వనం ప్రాప్త స్త్వంతు నూనం భయాతురః | కథం జ్ఞాతా త్వయా దేవీ పరమాశక్తి రుత్తమా. 40 ఉపాసితా కథం చైవ పూజితా చ కథం నృప | యా ప్రసన్నా తు సాహాయ్యం చకార త్వరయా%న్వితా. 41 సుదర్శనః : భాలభావాన్మయాప్రాప్తం బీజం తస్యాః సుసమ్మతమ్ | స్మరామిప్రజపన్నిత్యం కామబీజాభిధం నృపాః. 42 ఋషిభిః కథ్యమానా సా మయా జ్ఞాతా%ంబికా శివా | స్మరామి తాం దివారాత్రం భక్త్యా పరమయా పరామ్. 43 వ్యాసః: తన్నిశమ్య వచస్తస్య రాజానో భక్తితత్పరాః | తాం మత్వా పమరాం శక్తిం నిర్యయుః స్వగృహాన్ప్రతి. 44 సుబాహు రగమ త్కాశ్యాం తమాపృచ్ఛ్య సుదర్శనమ్ | సుదర్శనో%పి ధర్మాత్మా నిర్జగామ సుకోసలాన్. 45 మంత్రిణ స్తు నృపం శ్రుత్వా హతం శత్రుజితం మృధే | జితం సుదర్శనం చైవ బభూవుః ప్రేమసంయుతాః. 46 ఆగచ్ఛంతం నృపం శ్రుత్వా తం సాకేతనివాసినః | ఉపాయనాన్యుపాదాయ ప్రయయుః సమ్ముఖే జనాః. 47 తథా ప్రకృతయః సర్వే నానోపాయన పాణయః | ధ్రువసంధిసుతం మత్వా ముదితాః ప్రయయుః ప్రజాః. 48 స్త్రీయోపసంయుతః సో%థ ప్రాప్యాయోధ్యాం సుదర్శనః | సమ్మాన్య సర్వలోకాం శ్చ య¸° రాజా నివేశనమ్. 49 వందిభిః స్తూయమానస్తు వంద్యమానశ్చ మంత్రిభిః | కన్యాభిః కీర్యమాణశ్చ లాజైః సుమనసై స్తథా. 50 ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ తృతీయస్కంధే చతుర్వింశో%ధ్యాయః ఓ భూపతులారా! ఏమని చెప్పుదును? ఎంతని చెప్పుదును? బ్రహ్మ రుద్రుడు దేవతలు సైత మా దేవీతత్త్వము తుదముట్ట నెఱుగజాలరు. అట్టి జగదంబిక దివ్యచరిత్రము వర్ణింప నేనెవడను? ఆ శ్రీదేవి యీ సకలమున కాద్య-పరాశక్తి-వరేణ్య-మహాలక్ష్మి-సత్త్వప్రకాశమూర్తి-జగత్పరిపాలన చతుర. ఆ యంబిక యీరేడు లోకాలను రజోరూపమున పుట్టించి సత్త్వరూపమున పాలించి తమోరూపమున సంహరించి త్రిగుణమయియై విరాజిల్లు చుండును. ఆ నిర్గుణ పరమశక్తి బ్రహ్మ మొదలుగాగల దేవతలకు కారణభూతురాలు. సర్వకామఫలప్రదాయిని. ఆ నిర్గుణశక్తి పరమయోగులకును తెలియరాదు. కావున బహురూపములుగల సగుణశక్తిని విబుధులు సేవించి చింతించి తరింతురు. రాజు లిట్లనిరి. నీవు బాల్యము నుండియు భయముతో మనములందు తలదాచుకొంటివిగదా! నీవా యుత్తమ పరమశక్తి నె ట్లుఱుగ గల్గితివి? నీవా తల్లి నేతీరున పూజించి యుపాసించితివో కాని యాదేవి దయను త్వరలోనే సంపాదింప గల్గితివి' అన సుదర్శను డిట్లనెను: ఓ నరేశులారా! నాకు చిఱుత ప్రాయమందే శ్రీ భగవతియొక్క కామరాజ బీజమంత్రము లభించినది. నేను దానిని రేయింబవళ్ళదే పనిగ జపించు చుంటిని. పరమర్షులు నాకంబికా శివతత్త్వ మెఱింగించిరి. నాటినుండి నేనా దేవి నైకాంతిక భక్తితో నిరంతరముగ స్మరించితిని అనెను. అంత రాజులెల్లరు శ్రీదేవీభక్తి తత్పరులై పరమశక్తిని తమ డెందములందు దలంచుచు నిజనివాసముల కరిగిరి. సుబాహువు సుదర్శనుని వీడ్కొని కాశి కేగెను. ధర్మాత్ముడైన సుదర్శనుడును కోసలపురికి వెళ్ళెను. రణమున శత్రుజిత్తు మరణించుట సుదర్శనుడు గెలుపొందుట విని మంత్రులెల్లరును సంపూర్ణహర్షము వెలిపుచ్చిరి. సుదర్శనమహారాజేతెంచుట గాంచి సాకేతనివాసులు విలువైన కానుకలు గొని సాదర సమ్మానములతో నతనికెదురేగిరి. ఇట్లు ప్రజలెల్లరును భూరిగ కానుకలు తీసికొని ధ్రువసంధిసుతుని సన్నిధి కరిగిరి. ఈ విధముగ సుదర్శనుడు తనపత్నితో గూడ నయోధ్య కేగి యెల్లరిని గారవించి రాజమందిరమున కరిగెను. అపుడు వందిమాగధులు సుదర్శనుని సన్నుతించిరి. మంత్రులు చేతులు జోడించిరి. కన్నెపడుచులు లాజసుమములు గురిపిరి అని వ్యాసమహాముని జనమేజయునితో పలికెను. ఇది శ్రీమద్దేవీభాగవత మందలి తృతీయస్కంధమం దిరువది నాల్గవ యధ్యాయము.