Sri Devi Bhagavatam-1
Chapters
అథ షడ్వింశో%ధ్యాయః జనమేజయః : నవరాత్రే తు సంప్రాప్తే కిం కర్తవ్యం ద్విజోత్తమ | విధానం విధి వద్ర్బూహి శరత్కాలే విశేషతః.
1 కిం ఫలం ఖలు కస్తత్ర విధిః కార్యో మహామతే | ఏత ద్విస్తరతో బ్రూహి కృపయా ద్విజసత్తమ: 2 వ్యాసః : శృణుః రాజః న్ప్రవక్ష్యామి నవరాత్రవ్రతం శుభమ్ | శరత్కాలే విశేషేణ కర్తవ్యం విధిపూర్వకమ్ 3 వసంతే చ ప్రకర్తవ్యం తథైవ ప్రేమపూర్వకమ్ | ద్వావృతూ యమదంష్ట్రాఖ్యౌ నూనం సర్వజనేషు వై. 4 శరద్వసంత నామానౌ దుర్గమౌ ప్రాణినా మిహ | తస్మా ద్యత్నాదికం కార్యం సర్వత్ర శుభ మిచ్ఛతా. 5 ద్యానేవ సుమహాఘోరా వృతూ రోగకరౌ నృణామ్ | వసంతశరదా వేవ జననాశకరా వుభౌ. 6 తస్మా త్తత్ర ప్రకర్తవ్యం చండికాపూజనం బుధైః | చైత్రే%శ్వినే శుభే మాసే భక్తిపూర్వం నరాధిపః. 7 అమావాస్యాం చ సంప్రాప్య సంభారం కల్పయే చ్ఛుభమ్ | హవిష్యం చాశనం కార్య మేకభుక్తం తు తద్దినే. 8 మండపస్తు ప్రకర్తవ్యః సమే దేశే శుభే స్థలే | హస్తషోడశ మానేన స్తంభధ్వజ సమన్వితః 9 గౌరమృ ద్గోమయాభ్యాం చ లేపనం కారయే త్తతః | తన్మధ్యే వేదికా శుభ్రా కర్తవ్యా చ సమా స్థిరా. 10 చతుర్హస్తా చ హస్తోచ్ఛ్రా పీఠార్థం స్థాన ముత్తమమ్ | తోరణాని విచిత్రాణి వితానం చ ప్రకల్పయేత్. 11 ఇరువది ఆఱవ అధ్యాయము శ్రీదేవీ నవరాత్ర పూజా విధానము జనమేజయు డిట్లు వ్యాసుని ప్రశ్నించెను : ఓ ద్విజోత్తమా! నవరాత్రములందు - విశేషించి శరన్నవరాత్రములందు - విధి విధానమున నాచరింపదగిన విధాన మేది? దేవీ నవరాత్రము లాచరించు విధమేది? దాని ఫలితమేమి? నాకు దయతో నంతయు వివరింపుము. వ్యాసభగవాను డిట్లనెను : రాజేంద్రా! శ్రీ దేవీ శరన్నవ రాత్రములను గుఱించి విధి పూర్వకముగ వివరింతును. వినుము. శ్రీదేవీ నవరాత్రములు వసంతకాలమున శరత్కాలమున నాచరింపవలయును. ఈ రెండు ఋతువులు జనులకు యముని దంష్ట్రల వంటివి. ఎల్ల ప్రాణులకును వసంత శరదృతువులు రెండును రోగకరములు. నరులకు ఘోర రోగములు గల్గించి ప్రాణనాశనమునకు కారణము లగును. కనుక మేలు వెలుగు గోరు బుధులు ప్రయత్నించి చైత్రాశ్వ యుజమాసములందు భక్తి యుక్తులై నవరాత్ర వ్రతము లాచరించి విదిగ శ్రీ చండీ పూజలు సలుపవయును. అమావాస్యనాడే సకల సంభారములు సమకూర్చుకొని యేకభుక్తముగ హవిష్యాన్నము భుజింపవలయును. ఒక మంచి సమతల ప్రదేశమున పదారు చేతుల ప్రమాణము గల స్తంభములు కల్గి పతాకములతో నలరారు చక్కని దేవీ మండపము. నిర్మింపవలయును. అచ్చోటున నెఱ్ఱమట్టితో గోమయముతో చక్కగ నలుకవలయును. అందు రంగవల్లికలు తీర్చి దిద్దవలయును. దాని మధ్య భాగమందు స్థిరమై యున్నతమైన వేదిక సమర్పింవలయును. ఆ వేదికపై నాల్గుమూరల పొడవు నంతియ వెడల్పును మూరయెత్తును గల్గి యలంకరింపబడిన పీఠము నమర్చవలయును. దాని చుట్టును మామిడి తోరణములును విచిత్రములైన పూలమాలలను గట్టవలయును. రాత్రౌ ద్విజా నథా మంత్ర్య దేవీతత్త్వవిశారదాన్ | ఆచారనిరతా న్దాంతా న్వేదవేదాంగ పారగాన్. 12 ప్రతిపద్ది వసే కార్యం ప్రాతః స్నానం విధానతః | నద్యాం నదే తడాకే వా వాప్యాం కూపే గృహే%థవా. 13 ప్రాతర్నిత్యం పురఃకృత్వా ద్విజానాం వరణం తతః | అర్య పాద్యాదికం సర్వం కర్తవ్యం మధుపూర్వకమ్. 14 వస్త్రాలంకరణాదీని దేయాని చ స్వశక్తితః | విత్తశాఠ్యం న కర్తవ్యం విభ##వే సతి కర్హిచిత్. 15 విపై#్రః సంతోషితైః కార్యం సంపూర్ణం సర్వథా భ##వేత్ | నవ పంచ త్రయశ్చైకో దేవ్యాః పాఠే ద్విజాః స్మృతాః 16 వరయే ద్ర్బాహ్మణం శాంతం పారాయణ కృతే తదా | స్వస్తి వాచనకం కార్యం వేదమంత్ర విధానతః. 17 వేద్యాం సింహాసనం స్థాప్య క్షౌమవస్త్ర సమన్వితమ్ | తత్ర స్థాప్యా%ంబికా దేవీ చతుర్హస్తా%%యుధాన్వితా. 18 రత్నభూషణ సంయుక్తా ముక్తాహారవిరాజితా | దివ్యాంబరధరా సౌమ్యా సర్వలక్షణ సంయుతా. 19 శంఖచక్రగదాపద్మధరో సింహే స్థితా శివా | అష్టాదశభుజా వా%పి ప్రతిష్ఠాప్యా సనాతనీ. 20 అర్చా%భావే తథా యంత్రం నవార్ణ మంత్రసంయుతమ్ | స్థాపయే త్పీఠ పూజార్థం కలశం తత్ర పార్శ్వతః. 21 పంచవల్లవ సంయుక్తం వేదమంత్రైః సుసంస్కృతమ్ | సుతీర్థజల సంపూర్ణం హేమరత్నైః సమన్వితమ్. 22 పార్శ్వే పూజార్థ సంభారా న్పరికల్ప్య సమంతతః | గీత వాదిత్రనిరోషా న్కారయే న్మంగళాయ వై. 23 ఆ ముందు రాత్రియే దేవీతత్త్వ విశారదులు సదాచార సంపన్నులు దాంతులు వేదవేదాంగ పారగులు నగు బ్రాహ్మణులను పిలువ వలయును. పాడ్యమి నాడు విధివిధానమున నదీ నదములందుగాని వాపీకూప తటాకములందుగాని గృహమందుగాని ప్రాతఃస్నాన మొనరింపవలయును. మరునాడు ప్రభాత వేళయందు నిత్యకృత్యము లాచరించి విప్రవరణ మొనరించి వారికి మధుపర్క పూర్వకముగ నర్ఘ్యపాద్యాది విధు లాచరింప వలయును. బ్రాహ్మణోత్తములకు యథాశక్తిగ వస్త్రాలంకరణము లీయవలయును. సంపన్నుడు దానమొసంగుటలో ద్రవ్యలోప మెంతమాత్రమును జేయగూడదు. బ్రాహ్మణులు సంతృప్తి జెందినచో కార్యము సంపూర్ణ ఫలప్రద మగును. బ్రాహ్మణులు తొమ్మిదిమందిగాని యేవురుగాని మువ్వురుగాని తుదకొక్కడుగాని శ్రీ మద్దేవీ భాగవతాది పారాయణ మొనరింపవలయును. శాంతుడగు ఒక విప్రుని దేవీభాగవత పారాయణమునకు వరింపవలయును. వేదఘోషలతో స్వస్తివాచనము జరుపవలయును. ఆ వేదికపై సింహాసనము స్థాపించవలయును. దానిపై తెల్లని వస్త్రము పరచవలయును. దానిపై దివ్యాంబర ధారిణి చతుర్భుజ దివ్యాయుధ ధారిణి యగు జగదంబికను ప్రతిష్ఠింపవలయును. నానారత్న భూషణ భూషిత - ముక్తాహార విరాజిత - దివ్యాంబర ధర - సౌమ్య - సర్వ లక్షణ సంయుత - శంఖచక్రగదాపద్మధర - సింహోపరిసంస్థిత - శివ - అష్ఠాదశభుజ - సనాతని యగు దేవిని ప్రతిష్ఠింపవలయును. అట్టి దేవీ విగ్రహము లేనిచో నచట నవార్ణ మహామంత్రయుమగు యంత్ర ముంచవలయును. దాని ప్రక్కను కలశస్థాపన మొనరింపవలయును. సుసంస్కృతమై పంచ పల్లవములు (మామిడి - రావి - మఱ్ఱి - మేడి - జువ్వి చిగురులు) బంగారము గల కలశమునందు వేదమంత్రములతో తీర్థ జలము నుంచవలయును. అచట పూజకు శోభన ద్రవ్యములు సమకూర్చుకొనవలయును. తొలుదొలుత మంగళ సూచకముగ గీతవాదిత్రాది మంగళ వాద్యములు మ్రోగింపవలయును. తిథౌ హస్తాన్వితాయాం చ నందాయాం పూజనం వరమ్ | ప్రథమే దివసే రాజ న్విధివత్కామదం నృణామ్. 24 నియమం ప్రథమం కృత్వా పశ్చాత్పూజాం సమాచరేత్ | ఉపవాసేన నక్తేన చైకభుక్తేన వా పునః 25 కరిష్యామి వ్రతం మాత ర్నవరాత్ర మనుత్తమమ్ | సాహాయ్యం కురు మే దేవి! జగదంబ! మమాఃలమ్. 26 యథాశక్తి ప్రకర్తవ్యో నియమో వ్రతహేతవే! పశ్చాత్పూజా ప్రకర్తవ్యా విధివ న్మంత్ర పూర్వకమ్. 27 చందనాగురు కర్పూరైః కుసుమైశ్చ సుగంధిభిః | మందారకరజాశోకచంపకైః కరవీరకైః 28 మాలతీ బ్రహ్మకాపుషై#్ప స్తథా బిల్వదళైః శుభైః | పూజయే జ్జగతాం ధాత్రీం ధూపైర్దీపై ర్విధానతః. 29 ఫలై ర్నానావిధైర్యం ప్రదాతవ్యం చ తత్ర వై | నారికేళై ర్మాతులుంగై ర్దడిమీ కదళీఫలైః 30 నారంగైః పనసైశ్చవ తథా పూర్ణఫలైః శుభైః | అన్నదానం ప్రకర్తవ్యం భక్తిపూర్వం నరాధిప! 31 మాంసాశనం యే కుర్వంతి తైః కార్యం పశుహింసనమ్ | మహిషాజ వరాహాణాం బలిదానం విశిష్యతే. 32 దేవ్యగ్రే నిహతా యాంతి పశవః స్వర్గ మవ్యయమ్ | న హింసా పశుజా తత్ర నిఘ్నతాం తత్కృతే%నఘ! 33 అహింసా యాజ్ఞికీ ప్రోక్తా సర్వశాస్త్రవినిర్ణయే | దేవతార్థే విసృష్ఠానాం పశూనాం స్వర్గతిర్ ద్రువా. 34 హోమార్థం చైవ కర్తవ్యం ఉండం చైవ త్రికోణమ్ | స్థండిలం వా ప్రకర్తవ్యం త్రికోణం మానతః శుభమ్. 35 శ్రీదేవిని హస్తానక్షత్రముతో గూడియున్న నందా (ప్రతిపత్) తిథియందు పూజించుట ఉత్తమము. మొదటినాడు చేసిన దేవీపూజ లోకులకు సర్వకామము లీడేర్చును. మొదట సంకల్పము చేసి పిదప దేవీపూజ ప్రారంభించవలయును. దేవి నుపవాసమున గాని నక్తవ్రతమునగాని ఒక్కపూట భోజనముతోగాని భక్తిశ్రద్ధలతో బూజింపవలయును. జగదంబా! మదంబా! నేను నీ యుత్తమ నవరాత్ర వ్రత మాచరింతును. అందులకు వలయు నీ సాహాయ్యము - చేయూత నాకందిమ్మని దేవిని వేడుకొన వలయును. దేవీవ్రత సమాచరణకు యథాశక్తి నియమనిష్ఠలతో నుండవలయును. పిమ్మట మంత్రపూర్వకముగ విధిగ పూజలు సలుపవలయును. శ్రీదేవిని చందనాగురు కర్పూరములతో పరిమళములు గుబాళించు పూలదండలతో మందారము - కరజము - అశోకము - చంపకము - కరవీరము - మాలతి - బిల్వదళములు - బ్రాహ్మీసుమములతో ధూపదీపములతో దేవి నర్చించి ఆమె కర్ఘ్య మొసంగవలయును. నారికేళము - కదళి - మాతులుంగము - దానిమ్మ - పనస - నారింజ మున్నగు మధుర రసములు గల ఫలములు నైవేద్యము చేయవలయును. ఆ పిదప ఘనముగ బ్రాహ్మణ సమారాధనము జరుపవలయును. మాంసాశనులగు వారు మహిషము - మేక - వరాహములను బలిదాన మొనరింపవలయును. శ్రీదేవీ సమక్షమున బలిపీఠముపై బలియైన పశువులు అవ్యయ స్వర్గమేగును. ఓ యనఘా! యాగమున పశుహింస హింస యనబడదు. యజ్ఞమున సలుపు హింస యహింసయని సర్వ శాస్త్రముల నిర్ణయము. దేవతలకై బలియైన పశువులకు స్వర్గతి నిశ్చయము. హోమమునకు త్రికోణాకారముగ కుండ మేర్పరుప వలయును. కానిచో త్రికోణాకృతిగ స్థండిల మేర్పరుప వలయును. త్రికాలం పూజనం నిత్యం నానాద్రవ్యై ర్మనోహరైః | గీతవాది త్రనృతైశ్చ కర్తవ్యశ్చ మహోత్సవః. 36 నిత్యం భూమౌ చ శయనం కుమారీణాం చ పూజనమ్ | వస్త్రాలంకరణౖ ర్దివ్యై ర్భోజనైశ్చ సుధామయైః. 37 ఏకైకాం పూజయే న్నిత్య మేకవృద్ధ్యా తథా పునః | ద్విగుణం త్రిగుణం వా%పి ప్రత్యేకం నవకం చ వా. 38 విభవస్యానుసారేణ కర్తవ్యం పూజనం కిల | విత్తశాఠ్యం న కర్తవ్యం రాజన్! శక్తిమఖే సదా. 39 ఏకవర్షా న కర్తవ్యా కన్యా పూజావిధౌ నృప | పరమజ్ఞాతు భోగానాం గంధాదీనాం చ బాలికా. 40 కుమారికా తు సా ప్రోక్తా ద్వివర్షా యా భ##వేదిహ | త్రిమూర్తిశ్చ త్రివర్షా చ కల్యాణీ చతురబ్దికా. 41 రోహిణీ పంచవర్షా చ షడ్వర్షా కాళికా స్మృతా | చండికా సప్తవర్షా స్యా దష్టవర్షా చ శాంభవీ. 42 నవవర్షా భ##వే ద్దుర్గా సుభద్రా దశవార్షికీ | అత ఊర్థ్వం న కర్తవ్యా సర్వకార్య విగర్హితా. 43 ఏభిశ్చ నామభిః పూజా కర్తవ్యా విధిసంయుతా | తాసాం ఫలాని వక్ష్యామి నవానాం పూజనే సదా. 43 కుమారీ పూజితా కుర్యా ద్దుఃఖ దారిద్ర్య నాశనమ్ | శత్రుక్షయం ధనాయుష్యం బలవృద్ధిం కరోతివై. 44 త్రిమూర్తి పూజనా దాయు స్త్రీ వర్గస్య ఫలం భ##వేత్ | ధనధాన్యాగమశ్చైవ పుత్రపౌత్రాదివృద్ధయః. 46 మూడు వేళల పెక్కు సుందర పదార్థములతో నిత్యము దేవిపూజ లొనరింపవలయును. గీతవాద్యములతో దేవీ మహోత్సవములు జరుపవలయును. నిత్యము నేలపై పరుండవలయును. కుమారికలను శుభ్ర వస్త్రాలంకరణములతో నమృతాన్నములతో నర్చింపవలయును. ప్రతిదిన మొక కన్యనుగాని యేకవృద్ధిగ గాని ద్విగుణవృద్ధితోగాని త్రిగుణవృద్ధితోగాని ప్రతిదినము తొమ్మండుగురిని గాని కుమారికలను బూజింపవలయును. తన శక్తికి తగినట్లుగ శక్తియాగ మొనరింపవలయును. రాజా! శక్తి యాగమున నెప్పుడును ధనలోపము చేయరాదు. కన్నెలను బూజింపు నపు డేడాది పిల్లను బూజింపరాదు. ఏలన, నా శిశువు భోగములను సుగంధములను గ్రహింపజాలదు. రెండేండ్లు గలది కుమారిక. మూడేండ్లు గలది త్రిమూర్తి. నాలుగేండ్లు గలది కళ్యాణి. ఐదేండ్లు గలది కాళిక. ఏడేండ్లు గలది చండిక. ఎనిమిదేండ్లు గలది శాంభవి. తొమ్మిదేండ్లు గలది దుర్గ. పదేండ్లు గలది సుభద్ర అనబడును. ఇంతకన్న నెక్కువ యేండ్లు గల దానిని బూజింపరాదు. అట్టిది సర్వకార్యములందు నింద్య యగును. దేవి నీ తొమ్మిది నామములతో విధిగ బూజింపవలయును. ఈ తొమ్మిది విధముల పూజల ఫలితమును వివరింతును : కుమారికను బూజించినచో దుఃఖ దారిద్ర్య నాశము - శత్రుక్షయము - ఆయుర్బల ధనముల వృద్ధియు నగును. త్రిమూర్తి పూజ వలన పుత్త్రపౌత్రాభివృద్ధి - యాయుర్వద్ధి - ధనధాన్య సమృద్ధి - త్రివర్గఫల ప్రాప్తియు జరుగును. విద్యార్థీ విజయార్థీ చ రాజ్యార్థీ యశ్చ పార్థివః | సుఖార్థీ పూజయే న్నిత్యం కళ్యాణీం సర్వకామదామ్. 47 కాళికాం శత్రునాశార్థం పూజయే ద్భక్తిపూర్వకమ్ | ఐశ్వర్య ధనకామశ్చ చండికాం పరిపూజయేత్. 48 పూజయే చ్ఛాంభవీం నిత్యం నృపసమ్మోహనాయ చ | దుఃఖదారిద్ర్యనాశాయ సంగ్రామే విజయాయ చ. 49 క్రూరశత్రువినాశార్థం తథో గ్రకర్మసాధనే | దుర్గాం చ పూజయే ద్భక్త్యా పరలోకసుఖాయ చ. 50 వాంఛితార్థస్య సిద్ధ్యర్థం సుభద్రాం పూజయే త్సదా | రోహీణీం రోగనాశాయ పూజయే ద్విధివన్నరః. 51 శ్రీరస్త్వితి మంత్రేణ పూజయే ద్భక్తి తత్పరః | శ్రీ యుక్తమంత్రై రథవా బీజమంత్రై రథాపి వా. 52 కుమారస్య చ తత్త్వాని యా సృజత్యపి లీలయా | కాదీ నపి చ దేవాం స్తాం కుమారీం పూజయా మ్యహమ్. 53 కళ్యాణిని విద్యార్థి - విజయార్థి - రాజ్యసుఖార్థి - పూజింపవలయును. కళ్యాణి సకల కామప్రదాయిని. శత్రునాశమునకు కాళికను పూజింపవలయును. ఐశ్వర్య ధనకామనకేకభక్తితో చండికను పరిపూజింపవలయును. శోకదారిద్ర్య నాశమునకు సమర విజయమునకు రాజసమ్మోహమునకు నిత్యమును శాంభవిని గొలువవలయును. క్రూర శత్రువినాశమునకు ఉగ్రకర్మ సాధనమునకు పరలోక సుఖములకు సంతతభక్తితో శ్రీ దుర్గాదేవి నారాధింపవలయును. వాంఛితార్థ సిద్ధికి సుభద్రను - రోగనాశమునకు రోహిణి నర్చింపవలయును. ''శ్రీరస్తు'' అను మంత్రముతోగాని శ్రీయుక్తమైన మంత్రమునగాని బీజమంత్రమునగాని నరుడు భక్తితో దేవిని పూజింపవలయును. ఎవరు లీలామాత్రమున కుమారుని (షణ్ముఖుని) తత్త్వములను (రహస్యములను) బ్రహ్మాది దేవతలను సృజించునో అట్టి కుమారిని నేను పూజించుచున్నాను. సత్వాదిభి స్త్రీమూర్తి ర్యా తైర్హి నానా స్వరూపిణీ| త్రికాలవ్యాపినీ శక్తి స్త్రీమూర్తిం పూజయామ్యహమ్. 54 కళ్యాణకారిణీ నిత్యం భక్తానాం పూజితా%నిశమ్| పూజయామి చ తాం భక్త్యా కళ్యాణీం సర్వకామదామ్. 55 రోహయంతీ చ బీజాని ప్రాగ్జన్మ సంచితాని వై| యాదేవీ సర్వభూతానాం రోహిణీం పూజయామ్యహమ్. 56 కాళీ కాలయతే సర్వం బ్రహ్మాండం సచరాచరమ్| కల్పాంతసమయే యా తాం కాళికాం పూజయామ్యహమ్. 57 చండికాం చండరూపాం చ చండముండ వినాశినీమ్ | తాం చండపాపహారిణీం చండికాం పూజయామ్యహమ్. 58 అకారణా త్సముత్పత్తి ర్యన్మయైః పరికీర్తితా| యస్యా స్తాం సుఖదాం దేవీం శాంభవీం పూజయామ్యహమ్. 59 దుర్గా త్రాయతి భక్తం యా సదా దుర్గార్తినాశినీ| దుర్జే యా సర్వదేవానాం తాం దుర్గాం పూజయామ్యహమ్. 60 సుభద్రాణి చ భక్తానాం కురుతే పూజితా సదా | అభద్రనాశినీం దేవీం సుభద్రాం పూజయామ్యహమ్. 61 ఏభిర్మంత్రైః పూజనీయాః కన్యకాః సర్వదా బుధైః | వస్త్రాలంకణౖర్మాల్యై ర్గంధై రుచ్ఛావచైరపి. 62 ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ తృతీయ స్కంధే షడ్వింశో%ధ్యాయః ఏ తల్లి సత్త్వాది గుణములచే నానా స్వరూపిణి మహాలక్ష్మీ మహా సరస్వతీ మహా కళ్యాది త్రిమూర్తియై త్రికాల వ్యాపిని యైనదో యట్టి శక్టియగు త్రిమూర్తిని నేనారాధింతును. నిత్యము నెల్లపుడు పూజింపబడినదై భక్తులకు కళ్యాణి కారిణియగు నా సర్వకామ ప్రదాయిని యగునట్టి కళ్యాణిని నేను దృఢభక్తితో నిత్య మర్చింతును. ఏ దేవి సర్వప్రాణుల జన్మార్జిత (సంచిత)ములగు కర్మబీజముల నంకురింపజేయునో యట్టి రోహిణీ దేవతను నే నర్చింతును. ఈ చరాచర ప్రపంచమును కల్పాంతమున నేకాళి యంతమొందించునో యట్టి కాళికను నేను గొల్తును. చండముండ దైత్య ఖండినియు చండ(భయంకర) రూపిణియు చండపాతకనావనియునగు చండికను నేను పూజింతును. ఏ తల్లి యొక్క సముత్పత్తి తద్రూపములేయగు వేదములచే నకారణముగ కలుగుచున్నట్లు చెప్పబడుచున్నదో సుఖములొసగు నా శాంభవీదేవిని నేనర్చింతును. భక్తుని దుర్గము నుండి రక్షించునదియు వాని దుర్గతి నశింపజేయునదియు సకల దేవతలకును తెలియరానిదియునగు శ్రీ దుర్గాదేవిని నేనారాధింతును. పూజలుగొన్న మాత్రమున భక్తులకు సుభద్రము లొడగూర్చి యభద్రములు తొలగించి విలసిల్లు సుభద్రా దేవిని నేను నిత్యము పూజింతును. ఇట్టి మంత్రములతో బుధులు అనేక వస్త్రాలంకరణ మాల్య సుగంధములతో సంతతము పరాభక్తితో కన్యకలను పూజింపవలయును అని శ్రీ వ్యాసముని శ్రీదేవి నవరాత్ర పూజవిధానమును జనమేజయునకు ప్రవచించుటయందు నిరతుడయ్యెను. ఇది శ్రీదేవీ భాగవతమందలి తృతీయ స్కంధమున నిరువదియారవ యధ్యాయము.