Sri Devi Bhagavatam-1
Chapters
ఆరవ అధ్యాయము ఋషయ ఊచుః : సౌమ్యయచ్చత్వయా ప్రో క్తంశౌరేర్యుద్ధంమహార్ణవే మధుకైటభయోఃసార్థంపంచవర్ష సహస్రకమ్.
1 కస్మా త్తౌ దానవౌ జాతౌ తస్మి న్నే కార్ణవే జలే | మహావీర్యౌ దురాధర్షౌ దేవౌ రపి సుదుర్జ¸°.
2 కథం తా వసురౌ జాతౌ కథం చ హరిణా హతౌ | త దాచక్ష్వ మహాప్రాజ్ఞ చరితం పరమాద్భుతమ్. 3 శ్రోతుకామా వయం సర్వే త్వం వక్తా చ బహుశ్రుతః | దైవా చ్చైవాత్ర సంజాతఃసంయోగశ్చ తదా%%వయోః. 4 మూర్ఖేణ సహ సంయోగో విషా దపి సుదుర్భరః | విజ్ఞేన సహ సంయోగః సుధారససమః స్మృతః. 5 జీవంతి పశవః సర్వే ఖాదంతి మేహయంతి చ | జానంతి విషయాకారం ప్యవాయ సుఖ మద్భుతమ్. 6 న తేషాం సదసద్జాఞనం వివేకో న చ మోక్షదః | పశుభి స్తే సమా జ్ఞేయా యేషాం న శ్రవణాదరః. 7 మృగాద్యాః పశవః కేచి జ్జానంతి శ్రావణం సుఖమ్ | అశోత్రాః ఫణిన శ్చైవ ముముహు ర్నాదపానతః. 8 పంచానా మింద్రియాణాం వై శుభే శ్రవణదర్శనే | శ్రవణా ద్వస్తువిజ్ఞానం దర్శనా చ్చిత్తరంజనమ్. 9 శ్రవణం త్రివిధం ప్రోక్తం సాత్త్వికం రాజసం తథా తామసం చ మహాభాగ! సుజ్ఞోక్తం నిశ్చయాన్వితమ్. 10 సాత్వికం వేదశాస్త్రాది సాహిత్యం చైవ రాజసమ్ | తామసం యుద్ధవార్తా చ పరదోషప్రకాశనమ్. 11 సాత్వికం త్రివిధం ప్రోక్తం ప్రజ్ఞావద్భిశ్చ పండితైః | ఉత్తమం మధ్యమం చైవ తథైవాధమ మిత్యుత. 12 ఉత్తమం మోక్షఫలదం స్వర్గదం మధ్యమం తథా|అధమం భోగదం ప్రోక్తం నిర్ణీయ విదితం బుధైః. 13 సాహిత్యం చైవ త్రివిధం స్వీయాయాంచో త్తమంస్మృతమ్‌మధ్యమంవారయోషాయాంపరోఢాయాంతథా%ధమమ్. ఆరవ అధ్యాయము మధుకైటభుల యుద్ధ ప్రయత్నములు ఋషులిట్లనిరి : సూతమునివర్యా! శ్రీహరికి మధుకైటభులతో మహావారాశిలో నైదువేలేండ్లు ఘోరముగ పోరాటము జరిగెనంటివి. దేవతల కజేయులై దుర్ధరులగు నాదానవవీరులు సంద్రమున నెట్లు పుట్టిరి. భగవానుడు వారినెట్లు హతమార్చగల్గెను? మా కా పరమాద్భుత చరిత్ర వెల్లడించుము. మేము సత్కథా శ్రవణ కుతూహలులము. మీరు బహుశ్రుతులు. మహా ప్రవక్తలు. మీ బోటి మహా మునులతో మాకు దైవయోగమున నానందకర సంగమము గల్గినది. మొఱటు వానితో కలియుట విషముకన్న దుర్భరము. సహృదయుడగు రసజ్ఞుతోడి సాంగత్యమమృతరససమము. పశువులన్నియును తమకు స్వభావవిహితమగు ఆహారము దినుచు నొండొంటితో గలియుచు బ్రతుకుచుండును. రతి సుఖమును ననుభవించును. కాని వానికి నిత్యానిత్య వస్తువివేకముగాని మోక్షదాయకమగు జ్ఞానము గాని యుండదు. శ్రీ హరి సత్కథలు విననేరని వానినా పశువుకన్న నీచునిగ నెంచవలయును. జింకలు మున్నగు జంతువులు చెవుల కింపు చేకూర్చు మధురనాదము వినగోరును. ఆ చెవులు లేని పాములు మధుర నాదస్వర మాలించినంతన తన్మయత నందును. జ్ఞానేంద్రియములలో కన్నులు చెవులు ఈ రెండే మంచి మేలొన గూర్చునవి. చెవుల వలన వస్తువునెఱుగు తెలివిగల్గును. చూపుల వలన నుల్లము రంజిల్లును. శ్రవణము సాత్త్వికము. సాహిత్య శ్రవణము రాజసము. యుద్ధవార్తలు నిందలు వినుట తామస శ్రవణము. పండితోత్తములు మరల సాత్త్విక శ్రవణమును ముత్తెఱంగుల విభజించిరి. అవి యుత్తమము మధ్యమము నధమమున నబడును. ఉత్తమము ముక్తి నొసంగును. మధ్యమము స్వర్గసీమ జేర్చును. అధమము భోగదాయకము. నవరస భరితమై రాజసమగు సాహిత్య శ్రవణమును మువ్విధములు స్వీయతోడి రతి విషయమును ప్రతిపాదించునది యుత్తమము. వారాంగనా సంగమ విషయకము మధ్యమము. పరస్త్రీగమన విషయక మధమము. తామసం త్రివిధం జ్ఞేయం విద్వద్భిః శాస్త్రదర్శిభిః | ఆతతాయిని యుద్ధం యత్తదుత్తమ ముదాహృతమ్. 15 మధ్యమం చాపి విద్వేషా త్పాండవానాం యథా%రిభిః | అధమం నిర్నిమిత్తం తు వివాదే కలహే తథా. 16 తదత్ర శ్రవణం ముఖ్యం పురాణస్య మహామతే | బుద్ధి ప్రవర్ధనం పుణ్యం తతః పాపప్రణాశనమ్. 17 తదాఖ్యాహి మహాబుద్ధే కథాం పౌరాణికీం శుభామ్ | శ్రుతాం ద్వైపాయనా త్పూర్వం సర్వార్థస్య ప్రసాధినీమ్. 18 సూత ఉవాచ : యూయంధన్యామహాభాగా ధన్యో%హం పృథివీతలే | యేషాంశ్రవణబుద్ధిశ్చమమాపికథనే కిల. 19 పురా చైకార్ణవే జాతే విలీనే భువనత్రయే | శేషపర్యంకసుప్తే చ దేవదేవే జనార్దనే. 20 విష్ణుకర్ణమలోద్భూతౌ దానవౌ మధుకైటభౌ | మహాబలౌ చ తౌ దైత్యౌ వివృద్ధౌ సాగరే జలే. 21 క్రీడమానౌ స్థితౌ తత్ర విచరంతా విత స్తతః | తా వేకదా మహాకా¸° క్రీడాసక్తౌ మహార్ణవే. 22 చింతా మవాపతు శ్చిత్తే భ్రాతరావివ సంస్థితౌ | నాకారణం భ##వే త్కార్యం సర్వత్రైషా పరంపరా. 23 ఆధేయం తు వినా%%ధారం న తిష్ఠతి కథంచన | ఆధారాధేయభావస్తు భాతి నో చిత్తగోచరః. 24 క్వతిష్ఠతి జలం చేదం సుఖరూపం సువిస్తరమ్ | కేన సృష్టం కథం జాతం మగ్నా వావాం జలే స్థితౌ. 25 ఆవాం వా కథ ముత్పన్నౌ కేన వోత్పాదితా వుభౌ | పితరౌ క్వేతి విజ్ఞానం నాస్తి కామం తథా%%వయోః. 26 తామస శ్రవణమును మూడు విధములు. చంపదగిన వారితో బోరుట సాత్త్వికము. పాండవేయుల పగిది విద్వేష కారణముగా పోరుట మధ్యమము. కారణము లేక వివాదములకు కాలుద్రవ్వుట యధమము. ఇన్నిటిలోన నీ పురాణశ్రవణమే ముఖ్యమైనది. అది బుద్ధి వికాసము గల్గించును. పుణ్యప్రదము. పాప ప్రణాశకము. నీవు మున్ను వ్యాసుని వలన సకలార్థ సాధకము శుభకరమునగు పురాణ కథలను వింటివి. వానినే మాకిపుడు వినిపింపుము. సూతుడిట్లనెను : ఓ మహాభాగులారా! మీరు సత్కథలు వినగోరుచున్నారు. నేనును మీకు వానిని ప్రవచింప దలంచితిని. కనుక నీ భూతలమున మీరు ధన్యులరు. నేనును ధన్యుడను. పూర్వము ప్రళయకాలమున ముజ్జగములు లయమంది లోకమేకార్ణవమయ్యెను. అప్పుడు శేషశయ్యపై దేవదేవుడగు విష్ణువు యోగనిద్రలో నుండెను. ఆ విష్ణుని చెవి మలము నుండి మహాబలులగు మధుకైటభులను దానవులు పుట్టిరి. వా రా మున్నీటి నీటిలో పెంపొందిరి. అందాస్థూల కాయు లిటునటు తిరుగాడుచు క్రీడాసక్తులై యుండిరి. ఆ దానవ సోదరులు తమ మనములందిట్లు దలపోసిరి: కారణము లేక కార్యము సంభవించదు అను నానుడి లోకమున సహజము. ఆధారములేనిచో నాధేయమును లేదు. కనుక నాధారాధేయములం గూర్చిన భావము మా మనములందు గల్గుచ్న్నుది. ఈ యనంత జలరాశి సుఖము గొల్పుచు నపారమై యున్నది. దీనికి మూలమేది? దీనినెవ్వరెట్లు సృజించిరి? మేమీ మున్నీటిలోన నేల మునిగి యున్నాము? మేమెట్లు పుట్టితిమి? మమ్ము పుట్టించిన తల్లి తండ్రులెవరు? వారెక్కడ? అను విషయములు మాకు దెలియుట లేదు. సూత ఉవాచ : ఏవంకామయమానౌతౌ జగ్మతు ర్న వినిశ్చయమ్ | ఉవాచకైటభస్తత్రమధుంపార్శ్వే స్థితం జలే. 27 కైటభ ఉవాచ : మధో నా వత్ర సలిలే స్థాతుం శక్తి ర్మహాబలా | వర్తతే భ్రాతరచలా కారణం సా హి మే మతా. 28 తయా తత మిదం తోయం తదాధారం చ తిష్ఠతి | సా ఏవ పరమా దేవీ కారణం చ తథా%వయో. 29 ఏవం విబుధ్యమానౌ తౌ చింతావిష్టౌ యదా%సురౌ | తదా%%కాశే శ్రుతం తాభ్యాం వాగ్బీజం సుమనోహరమ్ 30 గృహీతం చ తత స్తాభ్యాం తస్యాభ్యాసో దృఢః కృతః | తదా సౌదామనీ దృష్టా తాభ్యాం ఖే చోత్థితా శుభా. 31 తాభ్యాం విచారితం తత్ర మంత్రో%యం నాత్ర సంశయః | తథా ధ్యాన మిదందృష్టం గగనే సగుణంకిల. 32 నిరాహారౌ జితాత్మానౌ తన్మనస్కౌ సమాహితౌ | బభూవతు ర్విచింత్యైవం జపధ్యానపరాయణౌ. 33 ఏవం వర్షసహస్రం తు తాభ్యాం తప్తం మహత్తపః | ప్రసన్నా పరమా శక్తి ర్జాతా సా పరమా తయోః. 34 ఖిన్నౌ తౌ దానవౌ దృష్ట్వా తపసే కృతనిశ్చ¸° | తయో రనుగ్రహార్థాయ వా గువాచా%శరీరిణి. 35 వరం వాం వాంఛితం దైత్యౌ బ్రూతౌ పరమసమ్మతమ్ | దదామి పరితుష్టా%స్మి యువయో స్తపసా కిల. 36 సూతు డిట్లనియె : ఇట్లెంతగ నాలోచించినను వారొక నిర్ణయమునకు రాలేకపోయిరి. తుదకు కైటభుడు తన చెంత నున్న మధువును గని యిట్లనియెను : అన్నా ! మన మీ జలమందుండుట కొకానొక మహాశక్తి కారణముగావచ్చును. ఆ శక్తి యచలమైనది. మహాబలముగలదియని నా యభిప్రాయము. మన యునికి కామెయే హేతువుగావచ్చును. ఈ కన్నుచూపు మేరలో నిండి కనిపించు నీ మహాజల మంతటి కామెయే మూలాధారము. ఆమె యాధారముననే జలమంతట నిండియున్నది. ఆ పరమశక్తియే మనకును మూలాధారముగావచ్చును. ఇట్లు చైతన్యవంతులై వారిరువురు తలచుచున్న సమయమున గగన సీమనుండి వాగ్బీజరూపమగు నొక ధ్వని వారి చెవుల బడెను. వారానాదము విని పట్టుదలతో దానినభ్యసింప నారంభించిరి. అంతలో నాకసమున తళుక్కుమను నొక్క మెఱుపు మెఱసి కనబడెను. మనము విన్నది మహామంత్రము. మన ధ్యానమే సగుణమై వెలుగు రూపుదాల్చి పొలిచినది. ఇందు సందియము లేదని వారు తలంచిరి. వారపు డన్నపానీయములు ముట్టక జితేంద్రియులై తన్మయులై వేయేండ్లతిఘోరముగ జపధ్యానములు చేసి తపము సాగించిరి. అంత వారిపై పరమ శక్తికి దయగలిగెను. ఆ క్రూర దానవులింకను పట్టుదలతో తపము సేయ నిశ్చయించుకొనిరి. ఆ రక్కసులు దీనులై యుండుటగని కనికరింపదలచి దేవి యశరీర వాక్కులతో వారితో నిట్లు పలికెను: ఓ దానవులారా! మీ తపమునకు సంతసించితిని. మీ వాంఛితము తెలుపుడు. తప్పక ఈడేర్తును. సూత ఉవాచ : ఇతి శ్రుత్వాతుతాంవాణీందానవావూచతు స్తదా| స్వేచ్ఛయామరణందేవి వరంనోదేహిసువ్రతే. 37 వాణ్యువాచ : వాంఛితం మరణం దైత్యౌ భ##వేద్వాంమత్ప్రసాదతః | అజే¸°దేవదైత్యైశ్చభ్రాతరౌనాత్రసంశయః. 38 సూత ఉవాచ : ఇతిదత్తవరౌ దేవ్యా దానవౌమదదర్పితౌ | చక్రతుః సాగరేక్రీడాం యాదోగణసమన్వితౌ. 39 కాలేన కియతా విప్రాః దానవాభ్యాం యదృచ్ఛయా | దృష్టః ప్రజాపతి ర్బ్రహ్మా పద్మాసనగతః ప్రభుః. 40 దృష్ట్వా తు ముదితా వాస్తాం యుద్ధకామౌ మహాబలౌ | త మూచతు స్తదా తత్ర యుద్ధం నౌ దేహి సువ్రత. 41 నో చే త్పద్మం పరిత్యజ్య యథేష్టం గచ్ఛ మా చిరమ్ | యది త్వం నిర్బల శ్చాసి క్వ యోభ్యాం శుభ మాసనమ్. 42 వీరభోగ్యమిదం స్థానం కాతరో%సి త్యజా%%శువై | తయో రితి వచః శ్రుత్వా చింతామాపప్రజాపతిః. 43 దృష్ట్వా చ బలినౌవీరౌ కిం కరోమితి తాపసః | చింతావిష్ట స్తదా తస్థౌ చింతయ న్మనసా తదా. 44 ఇతి శ్రీ దేవీ భాగవతే మహాపురాణ ప్రథమస్కంధే షష్ఠోధ్యాయః. సూతు డిట్లనియె : ఆ దేవి వాక్కులు విని దానవు లిట్లనిరి : ఓ దేవీ! మాకు స్వచ్ఛంద మరణము వరముగ నిమ్ము. వాణి యిట్లు పలికెను. ఓ దానవులారా! నా దయచే మీకు స్వచ్ఛంద మరణమే గల్గును. దేవదానవులకు మీ రజేయుల గుదురు. సందియము లేదు. సూతు డిట్లనియె : అట్లు దేవి వలన వరములు బడసి యా క్రూరులు మదగర్వితులై నీటిలోని జలచరములతో స్వేచ్ఛగ క్రీడించుచుండిరి. కొంతకాలమునకు తరువాత కమలాసనము నందున్న ప్రజాపతియగు బ్రహ్మ వారి కంటబడెను. ఆ యిరువురు బలశాలురు బ్రహ్మనుగాంచి సంతసించి యుద్ధకాముకులై బ్రహ్మ కిట్లనిరి : మాకు యుద్ధమను గ్రహింపుము. కానిచో నీ వీ కమలము వదలి వేరొక చోటి కేగుము. నీవు కడు దుర్బలుడవు. నీకీ శుభాసనము తగదు. ఇచ్చోటు వీర భోగ్యము. నీవు పిరికివాడవైనచో మమ్ము వదలి యేగుము. దానవుల మాటలు విని బ్రహ్మ చింతాక్రాంతుడయ్యెను. మహాబలవంతులగు వారినిగని నేనిపుడేమి చేయవలయును? అని తాపసుడగు బ్రహ్మ మదిలో చింతింప సాగెను. ఇది శ్రీదేవీభాగవత మహాపురాణమందలి ప్రథమస్కంధమందు షష్ఠాధ్యాయము.