Sri Devi Bhagavatam-1    Chapters   

అథ చతుర్థః స్కంధః

అథ ప్రథమో%ధ్యాయః

జనమేజయః: వాసవేయ! మునిశ్రేష్ఠ! సర్వజ్ఞాననిధే%నఘు! ప్రష్ఠుమిచ్ఛామ్యహం స్వామిన్నస్మాకం కులవర్ధన! 1

శూరసేనసుతః శ్రీమాన్వసుదేవః ప్రతాపవాన్‌ | శ్రుతం మయా హరి ర్యస్య పుత్రభావ మవాప్తవాన్‌. 2

దేవానామపి పూజ్యో%భూ న్నామ్నాచా%%నక దుందుభిః | కారాగారే కథం బద్ధః కంసస్య ధర్మతత్పరః. 3

దేవక్యాభార్యయాసార్థం కిమాగః కృతవానసౌ | దేవాక్యా బాలషట్కస్య వినాశశ్చ కృతః పునః. 4

తేన కంసేన కస్మాద్వై యయాతి కులజేన చ | కారాగారే కథం జన్మ వాసుదేవస్య వైహరేః. 5

గోకులే చ కథం నీతో భగవా న్సాత్వతాంపతిః | గతో జన్మాంతరం కస్మాత్పితరౌ నిగడే స్థితౌ. 6

దేవకీవసుదేవౌ చ కృష్ణస్యామితతేజసః | కథం న మోచితౌ వృద్ధౌ పితరౌ హరిణా%మునా. 7

జగత్కర్తుం సమర్థేన స్థితేన జనకోదరే | ప్రాక్తనం కిం తయోః కర్మ దుర్విజ్ఞేయం మహాత్మభిః. 8

జన్మ వై వాసుదేవస్య యత్ర%%సీ త్పరమాత్మనః | కే తే పుత్రాశ్చ కా బాలా యా కంసేన విపోథితా. 9

చతుర్థ స్కంథము - మొదటి అధ్యాయము

జనమేజయుని సంశయములు

జనమేజయు డిట్లనియెను : ఓ మునిముఖ్యా! మత్స్యగంధ పుత్రుడ వగు మిమ్ముల నేను మరికొన్ని ప్రశ్నములడుగ కుతూహల మగుచున్నది. శ్రీ శూరసేనుని కుమారుడు వసుదేవుడు. అతడు మహాప్రతాపవంతుడు. ఆ వసుదేవునకు హరి పుత్త్రుడుగ జన్మించెను అని వింటిని. ఆ వసుదేవ డానక దుందుభి యనుపేర విఖ్యాతుడు. అతడు దేవతలకును పూజనీయుడు. అట్టి ధర్మతత్పరుడు కంసుని కారాగారమున ఏల బంధింప బడెను? ఆ వసుదేవుడు తన భార్యయగు దేవకిని గూడి సుఖముండెను. అత్తఱి వారేమి పాపము చేసినందున వారి యార్గురు కొడుకులు చంపబడిరి? కంసుడు యయాతి వంశజుడు. అట్టి వా డారుగురు శిశువుల నేల చంపెను? ఆ వాసుదేవుడగు శ్రీహరి కారాగారమునం దెట్లవతరించెను? ఆ భగవానుడగు శ్రీహరి జన్మాంతర మేల పొందెను? అతడు గొల్లపల్లె కేల కొనిపోబడెను? అతని తల్లిదండ్రు లినుపసంకెళ్ళచే నేల బంధింపబడిరి? ఆ శ్రీకృష్ణుడు అమిత తేజోవంతుడు గదా! మఱి యట్టి శ్రీహరి తన ముదుసలి తల్లిదండ్రులగు దేవకి వసుదేవులను బంధముక్తులగ నేల చేయలేదు? ఎల్ల లోకములను బుట్టించు దిట్టయగు నతడు తన తల్లి గర్భమందుండియు వారినేల చెఱవిడిపంచ లేకుండెను? వారి వెనుకటి కర్మమెంత బలవత్తరమైనదో మహాత్ములకును తెలియనలవికాదు కదా! పరమాత్ముడగు వాసుదేవు డవతరించు చోట గూడ కర్మ బంధమునకు తావుండునా? కంసుని చేతిలో ప్రాణములు గోలుపోయిన యా యార్గురు బాలు రెవరు?

శిలాయాం నిర్గతా వ్యోమ్ని జాతా త్వష్టభుజా పునః | గార్హస్థ్యం చ హరేర్‌ బ్రూహి బహుభార్యస్య చానఘ. 10

కార్యాణి తత్ర తాన్యేన దేహత్యాగం చ తస్యవై | కింవదంత్యా శ్రుతం యత్త న్మనో మోహయతీవ మే. 11

చరితం వాసుదేవస్య త్వ మాఖ్యాహి యథాతథమ్‌ | నరనారాయణౌ దేవౌ పురాణావృషి సత్తమౌ. 12

ధర్మపుత్త్రౌ మహాత్మానౌ తపశ్చేరతు రుత్తమమ్‌ | ¸°మునీ బహువర్షాణి పుణ్యబదరికాశ్రమే. 13

నిరాహారౌ జితాత్మానౌ నిఃస్పృహౌ జితషడ్గుణౌ | విష్ణోరంశౌ జగత్థ్సే మ్నే తపశ్చేరతు రుత్తమమ్‌. 14

తయో రంశావతారౌ మి జిష్ణుకృష్ణౌ మహాబలౌ | ప్రసిద్ధౌ మునిభిః ప్రోక్తౌ సర్వజ్ఞై ర్నారదాదిభిః. 15

విద్య మానశరీరౌ తౌ కథం దేహాంతరం గతౌ | నరనరనాయణౌ దేవౌ పునః కృష్ణార్జునౌ కథమ్‌. 16

¸° చక్రతు స్తపశ్చోగ్రం ముక్త్యర్థం మునిసత్తమౌ | తౌ కథం ప్రాపతు ర్దేహౌ ప్రాప్తయోగౌ మహాతపౌ. 17

శూద్రః స్వధర్మనిష్ఠ స్తు దేహాంతే క్షత్రియస్తు సః | శుభాచారో మృతో యో వై స శూద్రో బ్రాహ్మణో భ##వేత్‌. 18

కంసుడొక బాలికను నేలకు వేసి కొట్టబోగా నా బాల నింగిపై కెగసి యష్టభుజ యయ్యెను గదా! ఆ బాల యెవరు? ఆ హరి బహు భార్యావంతుడు గదా! మఱి యాతని గృహస్థ జీవిత మెట్టిది? ఆ కృష్ణు డొనరించిన ఆయా కార్యములను ఆ హరి దేహత్యాగమును గూర్చి నేను కింవదంతిగ వినిన విషయములు నన్ను మోహితుని చేయుచున్నవో అన్నట్లున్నవి. నా కా వాసుదేవుని చరిత మున్నదున్నట్లుగ తెలుపుము. పూర్వము నరనారాయణులను పురాణ ఋషి శ్రేష్ఠులుండిరి. వార లిరువురును ధర్ముని కుమారులు. శ్రీ మహావిష్ణు వంశమున జన్మించినవారలగు ఆ మహనీయులు పుణ్యబదరి కాశ్రమ మందు పెక్కేండ్లు విజితేంద్రియులు - నిరాహారులు - నిఃస్పృహులు - జితకామక్రోధులు నగుచు విశ్వ కల్యాణము నుద్దేశించి ఉత్తమ తప మొనరించిరి. ఆ నరనారాయణుల దివ్యాంశముల వలన మహావిక్రము లగు నర్జునుడును కృష్ణుడును జన్మించిరని సర్వజ్ఞులగు నారదాది మహర్షులనిరి. ఆ నరనారాయణ మహర్షులు సశరీరులై యున్నారు గదా! అట్టివారు మరల కృష్ణార్జునులుగ నెట్లు జన్మాంతర మందిరి? వారు బంధముక్తి కొఱకు కుగ్రతప మొనరించి సర్వసిద్ధులును బడసిరి గదా! అంతటి ముని ముఖ్యులు మరల జన్మము లేల దాల్చిరి? స్వధర్మ నిరతుడగు శూద్రుడు వైశ్యుడు క్షత్రియుడుగను నతడు బ్రాహ్మణుడుగను క్రమమున జన్మించునని నేను వింటిని.

బ్రాహ్మణో నిఃస్పృహః శాంతో భవరోగా ద్విముచ్యతే | విపరీత మిదం భాతి నరనారాయణౌ చ తౌ. 19

తపసా శోషితాత్మానౌ క్షత్త్రి¸° తౌ బభూవతుః | కేన తౌ కర్మణా శాంతౌ జాతౌ శాపేన వా పునః. 20

బ్రాహ్మణౌ క్షత్త్రి¸° జాతౌ కారణం తన్మునే వద | యాదవానాం వినాశశ్చ బ్రహ్మశాపాదితి శ్రుతః. 21

కృష్ణస్యా%పి హి గాంధార్యాః శాపేనైన కులక్షయః | ప్రద్యుమ్న హరణం చైవ శంబరేణ కథం కృతమ్‌. 22

వర్తమానే వాసుదేవే దేవదేవే జనార్దానే | పుత్త్రస్య సూతికాగేహా ద్ధరణం చాతి దురటమ్‌. 23

ద్వారకా దుర్గమధ్యాద్వై హరివేశ్మాద్దురత్యయాత్‌ | న జ్ఞాతం వాసుదేవేన తత్కథం దివ్యచక్షుషా. 24

సందేహో%యం మహాబ్రహ్మన్నిస్సందేహం కురు ప్రభో | యత్పత్న్యో వాసుదేవస్య దస్యుభి ర్లుంఠితాహృతా. 25

స్వర్గతే దేవదేవే తు తత్కథం మునిసత్తమః సంశయో జాయతే బ్రహ్మం శ్చిత్తాందోళన కారకః. 26

విష్ణో రంశః సముద్భూతః శౌరిర్భూభార హారకృత్‌ | స కథం మథురారాజ్యం భయాత్త్యక్త్వా జనార్దనః. 27

ద్వారవత్యాం గతః సాధో! ససైన్యః ససుహృద్గణః | అవతారో హరేః ప్రోక్తో భూభార హరణాయ వై. 28

పాపాత్మనాం వినాశాయ ధర్మసంస్థాపనాయచ | తత్కథం వాసుదేవేన చౌరాస్తే న ని పాతితాః. 29

యై ర్హృతా వాసుదేవస్య పత్న్య సంలుంఠితాశ్చతాః | స్తేనాస్తే కిం న విజ్ఞాతాః సర్వజ్ఞేన సతా పునః. 30

ఉత్తమ బ్రాహ్మణుడు విగతరాగుడై శాంతుడైనచో నతడు తప్పక భవబంధముక్తుడగును. ఈ విషయము నరనారాయణులందు తద్విరుద్ధముగ నున్నది. వారు తపమువలన వశ్యాత్ములైరి గద! వా రేకర్మమువలన మరల జన్మమొందిరి? ఆ శాంతచిత్తు లెవరి శాపమున క్షత్రియులై పుట్టిరి? ఆ మహర్షులగు బ్రాహ్మణులు క్షత్రియు లగుటకు గల కారణము తెలుపుము. విప్రశాపమున యాదవ వంశము నశించెనని వింటిని. గాంధారీ శాపమున కృష్ణుని వంశ మంతరించెనట. శంబరాసురుడు ప్రద్యుమ్ను నేల యపహరించెను? దేవదేవుడును జనార్దనుడు నగు వాసుదేవు డుండగా పురిటింటినుండి పుత్త్రహరణము జరుగట వింతగ నున్నది. శ్రీహరి భవనము దుర్గమమైన ద్వారకా దుర్గము నడుమ నున్నది. అందుండి శంబరాసురుడు ప్రద్యుమ్నుని గొనిపోవుచుండగా శ్రీహరి దివ్య నేత్రములతో నేల కనలేదు? వాసుదేవుని భార్యలు దస్యులచే దోచుకొనబడుటగూర్చి నాకు సందేహముగ నున్నది. ఆ సందియమును నివారింపుము. ఆ దేవదేవుడగు వాసుదేవుడు పరమ పదము జెందిన వెంటనే యట్టి దుస్సంఘటన జరుగుటవలన నా చిత్తమందు సంశయమును కలతయు కల్గుచున్నవి. ఆ హరి భూభార మణచుట కవతరించినవాడును విష్ణు నంశమున బుట్టినవాడును గదా! అట్టివాడు భయముతో మథురారాజ్యము వదలి ఏల ఏగెను? ఆ భూభార మడప నవతరించిన హరి తన సేనతో మిత్రులతో నేల ద్వారావతి కేగెను? దుష్టశిక్షణము శిష్టరక్షణము ధర్మసంస్థాపనము చేయుట కవతరించిన హరి యా చోరుల నేల చంపలేదు? ఆ వాసుదేవుడు సర్వజ్ఞుడు గదా! అతడు తన భార్యలను దస్యులు దోచుకొనుట ఎఱుగడా?

భీష్మద్రోణవధః కామం భూభారహరణ మతః | అవితాశ్చ మహాత్మానః పాండవా ధర్మతత్పరాః. 31

కృష్ణభక్తాః సదాచారా యుధిష్ఠిర పురోగమాః | తే కృత్వా రాజసూయం చ యజ్ఞరాజం విధానతః. 32

దక్షిణా వివిధా దత్త్వా బ్రాహ్మణభ్యో%తిభావతః | పాండుపుత్త్రా స్తు దేవాంశా వాసుదేవాశ్రితా మునే! 33

ఘోరం దుఃఖం కథం ప్రాప్త్రాః క్వ గతం సుకృతం చ తత్‌ | కిం తత్పాపం మహారౌద్రం యేన తే పీడితాః సదా. 34

ద్రౌపదీ చ మహాభాగా వేదీమధ్యా త్సముత్థితా | రమాంశజా చ సాధ్వీ చ కృష్ణభక్తి యుతా తథా. 35

సా కథం దుఃఖ మతులం ప్రాప ఘోరం పునః పునః | దుశ్శాసనేన సా కేశే గృహీతా పీడితా భృశమ్‌. 36

రజస్వలా సభాయాం తు నీతా భీతైకాససా | విరాటనగరే దాసీ జాతా మత్స్యస్య సా పునః. 37

ధర్షితా కీచకేనాథ రుదతీ కురరీ యథా హృతా జయద్రథేనాథ క్రందమానా%తి దుఃఃతా. 38

మోచితా పాండవైః పశ్చాద్బలవద్భి ర్మహాత్మభిః | పూర్వజన్మకృతం పాపం కిం తద్యేన చ పీడితాః. 39

దుఃఖాన్యనేకాన్యాప్తాస్తే కథయాద్య మహామతే | రాజసూయం క్రతువరం కృత్వా తే మమ పూర్వజాః. 40

దుఃఖం మహత్తర ప్రాప్తాః పూర్వజన్మకృతేన వై | దేవాంశానాం కథం తేషాం సంశయో%యం మహాన్హిమే. 41

మహామనీషు లైన భీష్మద్రోణాదులు భూమికి భారమని కృష్ణుడు వారిని చంపించెనా? ధర్మారాజాదులు శ్రీకృష్ణుని ప్రియభక్తులు సదాచార సంపన్నులు. వారు యజ్ఞరాజమగు రాజసూయమును యథావిధిగ నాచరించిరి గదా! ఆ యజ్ఞమందు దేవాంశజులును వాసుదేవాశ్రితులు నైన పాండవులు బ్రాహ్మణులకు భూరిగ దానదక్షిణ లొసంగిరి గదా! ఐనను వారేల ఘోర దుఃఖముల పాలైరి? వారి పున్నెమంతయు నేమయ్యెను? వారంతగా దుఃఖములు పొందుటకు తామంతగా చేయరాని దోషమేమి చేసిరి? రమాంశమువలన యజ్ఞవేదికలో నవతరించిన ద్రోపది పరమ సాధ్వియు శ్రీ కృష్ణ భక్తురాలును గదా! అట్టి ద్రౌపది తలవెండ్రుకలు బట్టి దుశ్శాసనుడు లాగుచుండగ నామె మిక్కిలి దుఃఃంచెను ఆమె యేల అట్టి ఘోరదుఃఖములకు గురికావలసి వచ్చెను? ఆ ద్రోపది రజస్వలము ఏకవస్త్రయు భీతయునై యుండగా నామెను నిండుకొలువున కట్లీడ్చిరే! ఆ పతివ్రత విరటు నగరమున మత్స్యపతికి దాసిగ నయ్యెను కదా! ఆమె కీచకునిచేత అవమానింపబడి కురరివలె పలవరించినదిగదా! ఆమె జయద్రథునిచే నపహరింపబడి బిట్టుగ విలపించినదిగదా! ఆమె మరల విక్రమశాలురగు పాండవులచేత విముక్తురాలయ్యెను అక్కటా! పూర్వ జన్మమున నెట్టి ఘోరదురితము లొనర్చి వారిట్టి యిక్కట్టుల పాలయిరో కదా! నా పూర్వజులు మహాయజ్ఞమగు రాజసూయ మొనరించియు నేల యీ కష్టముల పాలయిరో తెలుపుము. పాండవులు దేవాంశజులు గదా! వారి పూర్వకర్మము ననుసరించి ఇట్టి ఘోర దుస్తర దుఃఖములు గల్గుట నాకు సంశయము గలిగించు చున్నది.

సదాచారై స్తు కౌంతే యై ర్భీష్మద్రోణాదయో హతాః | ఛలేన ధనలోభార్థం జానానై ర్నశ్వరం జగత్‌. 42

ప్రేరితా వాసుదేవేన పాపే ఘోరే మహాత్మనా | కులం క్షయిత వంతస్తే హరిణా పరమాత్మనా. 43

వరం భిక్షాటనం సాధో ర్నీవారై ర్జీవనం వరమ్‌ | యోధా న్న హత్వా లోబేన శిల్పేన జీవనం వరమ్‌. 44

విచ్ఛిన్న స్తుత్వయా వంశో రక్షితో మునిసత్తమ | సముత్పాద్య సుతానాశు గోలకాన్‌ శత్రునాశనాన్‌. 45

సో%ల్పేనైవ తు కాలేన విరాటతనయా సుతః | తాపసస్య గలే సర్పం న్యస్తవాన్కథ మద్భుతమ్‌. 46

న కో%పి బ్రాహ్మణం ద్వేష్టి క్షత్రియస్యకులోద్భవః | తాపసం మౌనసంయుక్తం పిత్రా కిం తత్కృతం మునే! 47

ఏతైరన్యైశ్చ సందేహై ర్వికలం మే మనో%ధునా | స్థిరం కురు పితః సాధో! సర్వజ్ఞో%సి దయానిధే! 48

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ చతుర్థస్కంధే జనమేజయప్రశ్నోనామ ప్రథమో%ధ్యాయః.

కుంతీపుత్రులు సదాచారులుగదా! ఈ జగము నశ్వర మని తెలియును గదా? మఱి వారు భీష్మద్రోణులను మోసముతో నేల చంపిరి? వారు పరమాత్ముడును వాసుదేవుడునగు హరిచే ప్రేరితులై యంతటి ఘోరదురితముల కొడిగట్టిరి. దానిచే చివరకు తమ కులక్షయమును తామే కొనితెచ్చుకొనిరి. ఇట్టు లన్యాయముగ లోభముతో యోధులను చంపుటకన్న బిచ్చమెత్తుకొనుటో నీవారజీవనమో శిల్పజీవనమో శ్రేష్ఠతరము గదా! తొల్లి యీ కురువంశమంతరించ బోవుచుండగ నీవు శత్రునాశకులగు గోలకపుత్రులను బుట్టించి యీ వంశమును నిలువబెట్టితివి. తరువాత కొద్దికాలమునకు ఉత్తరాసుతుడగు నా తండ్రియొక పరమతాపసుని మెడలో పామునేల వేసెనో నాకు వింతగనున్నది. ఓ మునివర! క్షత్రియ కులజు డెవ్వడు గూడ నొక బ్రాహ్మణుని ద్వేషింపడు. అట్లు మౌనముగ తపమొనర్చుకొను మునికి నా తండ్రి యట్లేల చేసెనో కదా! నీవు సర్వజ్ఞుడవు. దయానిధివి. నా యీ సంశయములన్నిటిచే నా మనస్సు వికలమై పరిపరి విధములు కలతజెందుచున్నది. వీనిని వారించి నా మదికి శాంతి చేకూర్చుము.

ఇది శ్రీమద్దేవీ భాగవత మందలి చతుర్థస్కంధమందు జనమేజయుని ప్రశ్నమను ప్రథమాధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters