Sri Devi Bhagavatam-1
Chapters
అథ పంచమోధ్యాయః వ్యాసః. అథ కిం బహునో క్తేన సంసారే%స్మి న్నృపోత్తమ | ధర్మాత్మా%ద్రోహబుద్ధిస్తు కశ్చిద్భవతి కర్హిచిత్.
1 రాగద్వేషావృతం విశ్వం సర్వం స్థావరజంగమమ్ | ఆద్యే యుగే%పి రాజేంద్రా! కిమద్య కలిదూషితే.
2 దేవాః సేర్ష్యా శ్చ సద్రోహా శ్ఛలకర్మరతాః సదా | మానుషాణాం తిరశ్చాం చ కా వార్తా నృప! గణ్యతే.
3 ద్రోహపరే ద్రోహపరో భ##వేదితి సమానతా | అద్రోహిణి తథా శాంతే విద్వేషః ఖలతా స్మృతా.
4 యః కశ్చి త్తాపసః శాంతో జపధ్యానపరాయణః | భ##వేత్తస్య జపే విఘ్నకర్తావై మఘవా పరమ్.
5 సతాం సత్యయుగం సాక్షా త్సర్వదైవాసతాం కలిః | మధ్యమో మధ్యమానాం తు క్రియాయోగౌ యుగేస్మృతౌ.
6 కశ్చిత్కదాచిద్భవతి సత్యధర్మానువర్తకః | అన్యథా%న్యయుగానాం వై సర్వ ధర్మపరాయణాః.
7 వాసనా కారణం రాజ న్సర్వత్ర ధర్మ సంస్థితౌ | తస్యాం వై మలినాయాం తు ధర్మో%పి మలినోభ##వేత్. 8 మలినా వాసనా సత్యం వినాశయతి సర్వథా | బ్రహ్మణో హృదయా జ్ఞాతః పుత్త్రో ధర్మ ఇతిస్మృతః. 9 బ్రాహ్మణః సత్య సంపన్నో వేదధర్మరతః సదా | దక్షస్య దుహితారో హి వృతా మహాత్మనా. 10 వివాహవిధినా సమ్యక్ మునినా గృహధర్మిణా | తాస్వజీజనయత్పుత్రా న్ధర్మః సత్యవతాంవరః. 11 హరిం కృష్ణం నరం చైవ తథా నారాయణం నృప | యోగాభ్యాసరతో నిత్యం హరిః కృష్ణో బభూవ హ. 12 నరనారాయణౌ చైవ చేరతు స్తవ ఉత్తమమ్ | ప్రాలేయాద్రిం సమాగత్య తీర్థే బదరికాశ్రమే. 13 అయిదవ అధ్యాయము నరనారాయణుల తపఃప్రభావము నృపవర్యా! వేయేల? ఈ ప్రపంచ మంతయు గాలించినను ద్రోహబుద్ధిలేని ధర్మాత్ముడు నూటికి కోటి కెక్కడనో యెవ్వడో లభించును. సృష్టికి ఆరంభమందుకూడ నీ చరాచరవిశ్వము రాగద్వేషమయమై యున్నది. ఇక కలి దూషితమైన యీ కాలమున దాని సంగతి చెప్పనేల? ఓ నృపా! దేవతలలోనే యీర్ష్య ద్రోహము కపటము గలవారు గలరు. ఇంక నర తిర్యక్కులను గూర్చి చెప్పనేల? ద్రోహ మొనర్చిన వానికి ద్రోహము మరల చేసిన నది సరిసమానముగ నుండును. కాని, ద్రోహము ద్వేషము లేని శాంతునకు ద్రోహము చేయుట దుష్టత్వ మనిపించుకొనను. ఎవ్వ డేని తాపసుడు శాంతుడై జపధ్యాన పరాయణు డైనచో నింద్రు డోర్వలేక యతని తపమునకు విఘ్నములు గలిగించుచుండును. సత్పురుషులకు సత్యయుగము మధ్యములకు క్రియాయోగాత్మకములైన త్రేతా ద్వాపర రూప మధ్య యుగములు దుష్టులకు కలియుగము నిర్దేశింప బడినవి. రాజా! ఎప్పుడో యెక్కడో యెవ్వడో యొకడు సత్యధర్మము లనుసరించును. కాని, భిన్న భిన్న యుగములందు భిన్న భిన్న జీపులు దానికి వ్యతిరేకముగ నా యా యుగధర్మముల బట్టి వర్తింతురు. సర్వధర్మ సంస్థితికి వాసనలే ముఖ్యకారణము లందురు. అవి మలినములైనచో ధర్మముగూడ చెడిపోవును. మలిన వాసనలు ఎల్ల విధములుగ సత్యమును చెఱచును. పూర్వము బ్రహ్మ హృదయమునుండి ధర్ముడను కుమారు డుండెనని విందుము. ఆ బ్రాహ్మణోత్తముడు సత్యసంపన్నుడు-వేదనిరతుడు. ఆతడు దక్షుని పదిమంది కుమార్తెలను వరించెను. ధర్ముడు వారిని క్రమముగ పాణిగ్రహణము చేసికొనెను. సత్యస్వరూపుడగు ఆతడు వారియందు పుత్త్రులను బడసెను. వారు హరి కృష్ణుడు నరుడు నారాయణుడు నను నలుగురు కుమారులు. వారిలో హరి కృష్ణులు నిరంతరము యోగనిరతులైరి. నర నారాయణులు మహిమాలయమైన హిమాలయము జేరి బదరికాశ్రమ తీర్థమున నుత్తమ తప మాచరించిరి. తపస్విషు ధురీణౌ తౌ పురాణౌ మునిసత్తమౌ | గృహంతౌతత్పరం బ్రహ్మ గంగాయా విపులే తటే. 14 హరే రంశౌ స్థితౌ తత్ర వరనారాయణా వృషీ | పూర్ణం వర్షసహస్రం తు చక్రాతే తప ఉత్తమమ్. 15 తాపితం చ జగత్సర్వం తపసా సచరాచరమ్ | నరనారాయణాఖ్యాం చ శక్రః క్షోభం తదా య¸°. 16 చింతావిష్టః సహస్రాక్షో మనసా సమకల్పయత్ | కిం కర్తవ్యం ధర్మపుత్రౌ తాపసౌ ధ్యానసంయుతౌ. 17 సిద్ధార్థౌ సుభృశం శ్రేష్ఠమాసనం న గ్రహీష్యతః | విఘ్నః కథం ప్రకర్తవ్య స్తపో యేన భ##వే న్నహి. 18 ఉత్పాద్య కామం క్రోధం చ లోభం వా ప్యతిదారుణమ్ | ఇత్యుద్దిశ్య సహస్రాక్షః సమారుహ్య గజోత్తమమ్. 19 విఘ్న కామస్తు తరసా జగామ గంధమాదనమ్ | గత్వా తత్రా%%శ్రమే పుణ్య తాపపశ్యచ్ఛతక్రతుః. 20 తపసా దీప్తదేహౌ తు భాసరా వివ చోదితౌ | బ్రహ్మవిష్ణూ కిమేతౌ వైప్రకటౌ వా విభావసూ. 21 ధర్మపుత్త్రా వృషీ ఏతౌ తపసా కిం కిరిష్యతః | ఇతి సంచింత్య తౌ దృష్ట్వా తదోవాచ శచీపతిః. 22 కిం వాం కార్యం మహభాగౌ బ్రూతం ధర్మసుతౌ కిల | దదామి వాం వరం శ్రేష్ఠం దాతుం యాతో%స్మ్యహమృషీ. 23 అదేయమపి దాస్యామి తుష్టో%స్మి తపసా కిల | ఏతం పునఃపునః శక్ర స్తావువాచ పురః స్థితః. 24 నోచతు స్తావృషీ ధ్యాన సంస్థితౌ దృఢచేతసౌ | తతో వై మోహినీం మాయాం చకార భయదాం వృషః. 25 ఆ తాపసోత్తములగు పురాణ మునిసత్తములు పావనగంగా విశాల తీరమున సవితృ పరబ్రహ్మమును జపింప దొడంగిరి. ఆ విష్ట్వంశ సంభూతులగు నరనారాయణ పరమర్షులు సంపూర్ణముగా వేయి సంవత్సరముల వఱకు భవ్య తప మాచరించిరి. వారి తపము వేడిమి కీ చరాచర జగము తపించినది. ఆ ధర్మ తనయులు ధ్యాననిష్ఠులైరి. నే నిపుడేమి సేతునని యింద్రుడు సైతము చింతాపరవశుడై యిట్లు కలతను వెతను జెందెను. తాము సిద్ధార్థులైనచో వీరు నా యింద్రాసనము గ్రహింపక యుందురా? కనుక వీరి తపమునకు విఘ్న మొనరింపవలయును. దారుణమైన కామక్రోధ లోభములను వీరి చిత్తములందు కలిగించి ఈ మునుల తపస్సునకు విఘ్నము చేయవలయును అని కోరి ఇంద్రుడు గజమధిరోహించి వేగముగ గంధమాదనగిరి కరిగి పుణ్యాశ్రమమున ఆ పరమర్షులను సందర్శించెను. ఆహా! వీరి శరీరములనుండి తపఃకాంతులు విరజిమ్మబడుచున్నవి. వీరు సూర్యులో బ్రహ్మలో విష్ణులో రూపుదాల్చిన యగ్నులో యన నొప్పుచున్నారు. వీరు నిజముగ ధర్మపుత్త్రులు-మహర్షులు. ఈరింత మహోగ్రతపము చేసి యేమి చేయుదరో యని తలపోయుచు నింద్రుడు వారితో నిట్లనెను: ధర్మసుతులగు మహానుభావులారా! మీ తపః ప్రయోజన మేమో తెలుపుడు. నేను మీకు శ్రేష్ఠమైన వర మీయ నేనెంచితిని. మీ తపమునకు సంతసించితిని. మీ కోరిక యెంత యీరానిదైన నిత్తును.' ఇట్లు పలికి యింద్రుడు వారి యెదుట నిలిచెను. కాని, ఋషులు మాత్రము ధ్యాననిష్ఠులై యాత్మచింతనతో అతనితో నేమియును బలుకక మిన్నకుండిరి. అంత నింద్రుడు భయంకరమైన మోహినీమాయను కల్పించి - వృకాన్సింహాంశ్చ వ్యాఘ్రాంశ్చ సముత్పాద్యాబిభీషయత్ | వర్షం వాతం తథా వహ్నిం సముత్పాద్య పునఃపునః. 26 భీషయామాస తౌ శక్రో మాయాం కృత్వా విమోహినీమ్ | భయతో%పి వశం నీతౌ ధర్మసుతౌ మునీ. 27 నరనారాయణౌ దృష్ట్వా శక్రంః స్వభవనం గతః | వరదానే ప్రలుబ్ధౌ న న భీతౌ వహ్నివాయుతః. 28 వ్యాఘ్ర సింహాదిభిః క్రాంతౌ చలితౌ నాశ్రమాత్స్వకాత్ | న తయోర్ధ్యానభంగం వైకర్తుం కో%పి క్షమో%భవత్. 29 ఇంద్రో%పి సదనం గత్వా చింతయామాస దుఃఃతః | చలితౌ భయలోభాభ్యాం నేమౌ మునివరోత్తమౌ. 30 చింతయంతౌ మహావిద్యా మాదిశక్తిం సనాతనీమ్ | ఈశ్వరీం సర్వలోకానాం పరాం ప్రకృతిమద్భుతామ్. 31 ధ్యాయతాం కః క్షమో లోకే బహుమాయావిదప్యుత | యన్మూలాః సకలా మాయా దేవాసురకృతాః కిల. 32 తే కథం బాధితుం శక్తా ధ్యాయంతి గతకల్మషాం | వాగ్బీజం కామబీజం తథైవ చ. 33 చిత్తే యస్య భ##వేత్తం తు బాధితుం కో%పి న క్షమః | మాయయా మోహితః శక్రో భూయస్తస్య ప్రతిక్రియామ్. 34 కర్తుం కామవసంతౌ తు సమాహూయాబ్రవీ ద్వచః | మనోభవః వసంతేన రత్యా యుక్తో వ్రజాధునా. 35 అప్సరోభిః సమాయుక్త స్తరసా గంధమాదనమ్ | నరనారాయణౌ తత్ర పురాణా వృషిసత్తమౌ. 36 కురుతస్తవ ఏకాంతే స్థితౌ బదరికాశ్రమే | గత్వా తత్ర సమీపే తు తయో ర్మన్మథః మార్గణౖః. 37 చిత్తం కామాతురం కార్యం కురు కార్యం మామాధునా | మోహయిత్వోచ్చాటయిత్వా విశిఖై స్తాడయా%%శుచ. 38 సింహములు వ్యాఘ్రములు తోడేళ్లు మున్నగు క్రూర జంతువుల నుత్పన్న మొనర్చెను. వాన గాలి నిప్పులను కల్పించెను. ఇట్లు పలు మారు వారిని భయ పెట్టజూచెను. కాని, యతని బెదరింపులకు ధర్మసుతు లేమాత్రమును జంకలేదు. ఆ తాపసు లింద్రు డిచ్చు వరముల కాస పడకుండిరి. గాలినిప్పుల భయమునకు వెనుకంజ వేయలేదు. అది కని యమరపతి నిజ నివాసమున కేగెను. ఆ తాపసులను సింహవ్యాఘ్రములు చుట్టుముట్టెను. ఐనను వారు తమ యాశ్రమము నుండి యెంతమాత్రమును చలింపలేదు. వారి ధ్యాననిష్ఠకు భంగ మొనరించు వాడెవ్వడును లేకుండెను. అట్లా మునివరులు తన భయలోభములకు లొంగిపోలేదని దుఃఃంచుచు నింద్రుడు తన యమరావతిలో చింతింపసాగెను. ఆ మును లద్భుత పరాప్రకృతిని-సకల లోకేశ్వరేశ్వరిని-సనాతనిని ఆదిశక్తిని మహావిద్య నుపాసించుచున్నారు. అట్లు ధ్యానించువారి నిష్ఠను మహామాయావి సైతము భంగ మొనర్పజాలడు. ఏలయన - ఆ పరాశక్తి సకల దేవాసుర మాయలకు మహామాయ గదా! ఆ ఋషులు వాక్-మాయా-కామ బీజ మంత్రములను ధ్యానించుచు దురితదూరులై యున్నారు. వారి నింకెవ్వరు బాధింపగలరు? ఎవ్వాని చిత్తఫలకమునందు శ్రీత్రిభువనేశ్వరీ బీజము ప్రకట మగుచుండునో వానికి విఘ్న మొనరింపగలవాడెవ్వడు? ఆ యింద్రుడును మాయమోహితు డగుట వలననే వారికి ప్రతిక్రియ చేయదలచెను. అపు డింద్రుడు కామవసంతులను బిలిపించి కామునితో నిట్లనియెను: మదనా! నీవు రతిని వసంతుని అచ్చరలను తోడుగగొని గంధమాదన గిరిపై బదరి కాశ్రమమున తప మొనరించుచున్న పురాణ పురుషులు ఋషి సత్తములు నైన నరనారాయణుల చెంత కేగుము. అట నొంటరిగ తపించు ఋషులకు తపోభంగము గల్గించుము. వారి చిత్తములు కామాయత్తము లగునట్లు చేయుము. నీ కమ్మని పూములుకుల దెబ్బలతో వారినపి మోహపఱచి యుచ్చాటన మొనరించి మదిలో నోపలేని తాపము రేకెత్తించుము. నా కార్యము చక్కబెట్టుము. వశీకురు మహాభాగ! మునీ ధర్మసుతావపి | కోహ్యస్మి న్సర్వ సంసారే దేవో దైత్యో%థ మానవః. 39 యస్తే బాణవశం ప్రాప్తో న యాతి భృశతాడితః | బ్రహ్మా%హం గిరిజానాథ శ్చంద్రో వహ్నిర్విమోహితః. 40 గణనా కా%నయోః కామ త్వద్బాణానాం పరాక్రమే | వారాంగనాగణో%యం తే సహాయార్థం మయేరితః. 41 ఆగమిష్యతి తత్రైవ రంభాదీనాం మనోరమా | ఏకా తిలోత్తమా రంభా కార్యం సాధయితుం క్షమా. 42 త్వమేవైకః క్షమః కామం మిళితైః కస్తు సంశయః | కురు కార్యం మహాభాగః దదామి తవ వాంఛితమ్. 43 ప్రలోభితౌ మయా%త్యర్థం వరదానై స్తపస్వినౌ | స్థానాన్న చలితౌ శాంతౌ వృథా%యం మే గతః శ్రమః. 44 తథా వై మాయయా కృత్వా భీషితౌ తాపసా భృశమ్ | తథా%పి నోత్థితౌ స్థానా ద్దేహరక్షాపరౌ నతౌ. 45 ఇతి తస్య వచః శ్రుత్వాశక్రం ప్రాహ మనోభవః | వాసవాద్య కరిష్యామి కార్యం తే మనసేప్సితమ్. 46 యది విష్ణుం మహేశం వా బ్రహ్మాణం వా దివాకరమ్ | ధ్యాయంతౌ తౌ తదా%స్మాకం భవితారౌ వశౌ మునీ. 47 దేవీభక్తం వశీకర్తుం నాహం శక్తః కథంచన! కామరాజం మహాబీజం చింతయంతం మనస్యలమ్. 48 తాం దేవీం చే న్మహాశక్తిం సంశ్రితౌ భక్తిభావతః | న తదా మమ బాణానాం గోచరా తాపసౌకిల. 49 ఇంద్రః : గచ్ఛ త్వం చ మహాభాగ సర్వైస్తత్ర సముద్యతైః | కార్యం మమాతి దుఃసాధం కర్తా హిత మనుత్తమమ్. 50 ఇతి తేన సమాదిష్టా యయుః సర్వే సముద్యతాః యత్ర తౌ ధర్మపుత్రౌ ద్వౌతేపాతే దుష్కరం తపః. 51 ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ చతుర్థస్కంధే పంచమోధ్యాయః సమాప్తః. మహానుభావా! ఆ మునులైన ధర్మసుతులను నీ వశము చేసికొనుము. ఈ విశాల ప్రపంచమందలి దేవదానవ మానవులందు నిన్నెదిరించువాడులేడు. నీ బాణపు దెబ్బలు తిని నీకు వశము గానివాడెవ్వడు? నీ ప్రభావమున బ్రహ్మనగు నేను శివుడు చంద్రుడు అగ్ని ఇందరము కామమోహితుల మైనవారమేగదా. ఓ పూవిల్తుడా! పరాక్రమముగల నీ పూలబాణాలకు వారొక లెక్కయా? ఈ దేవవారకాంతలను నీకు తోడుగ పంపుచున్నాను. వీరు నీ వెంట రాగలరు. అచటికి రంభ మున్నగు నచ్చరలును రాగలరు. రంభకాని తిలోత్తమకాని కార్యసాధనమున నెఱజాణలు. ఈ శుభకార్యమునకు నీ వొక్కడవే చాలుదువు. ఇంక వీరందఱు నీవెంట నున్న కార్యసాధనమున సంశయమేల యుండును? కాన ఓ మహాశయా! నా కార్యము చక్కపెట్టుము. నీ వాంఛితార్థ మీడేర్తును. ఆ తాపసోత్తములను వరదానములతో నా యోపినంత ప్రలోభింపజేసి చూచితిని. ఐనను వారు శాంతముగ నుండి తమ చోటులనుండి చలింపలేదు. నా పడిన శ్రమ యంతయు బూడిదలో బోసిన పన్నీరయ్యెను. అటు పిమ్మట నా మాయను పన్ని యా తపస్వులను భయపెట్ట జూచితిని. ఐనను వారు తమ నెలవులనుండి చలింపలేదు. వారికి తమ మేనులు గాపాడుకొను కోరికి యున్నట్లును లేదు. ఆ మాటలు విని మదను డింద్రున కిట్లనెను: వాసవా! నీ మదిలోని కార్యము నిపుడే యొనరింతును. ఆ మునులొకవేళ బ్రహ్మ-విష్ణు-శివుడు-సూర్యుడునను వారిలో నెవరినిగూర్చి ధ్యానించుచున్నను వారిని వశము చేసికొందును. కానీ శ్రీకామ రాజబీజమును శ్రీమహాదేవీ బీజమును నెమ్మదిలో పరమభక్తితో వారు ధ్యానించుచున్నచో నట్టి దేవీభక్తులను వశము చేసికొనుట నా వశముగాదు. ఆ మహాశక్తిని పరమభక్తి భావమున వారు ధ్యానించుచు నా దేవి నాశ్రయించినచో నా పూములుకులు వారిముందు పనిచేయవు అన ఇంద్రు డిట్లనియెను: మహానుభావా! నీవు ఈ సర్వులతో సన్నద్ధుడవై తరలుము. నీవు నాకు హితకరుడవు. ఎంత దుస్సాధమైన పనినైనను చేయగలవాడవు. నీవు దక్క నా కితరుడు సహాయము లేదు. ఈ విధముగ నింద్రు డాదేశింపగ మన్మథుడు మొదలుగా నెల్లరును సిద్ధమై ధర్మపుత్రులు దుస్తరతపమొనర్చు చోటి కరిగిరి అని వ్యాసుడు జనమేజయునకు తెలిపెను. ఇది శ్రీమద్దేవీభాగవత మందలి చతుర్థస్కంధమందు నరనారాయణుల తపఃప్రభావ మను పంచమాధ్యాయము.