Sri Devi Bhagavatam-1    Chapters   

అథ షష్ఠో%ధ్యాయః

ప్రథమం తత్ర సంప్రాప్తో వసంతః పర్వతోత్తమే | పుష్పితాః పాదపాః సర్వే ద్విరేఫాళివిరాజితాః. 1

ఆమ్రాశ్చ వకుళా రమ్యా స్తిలకాః కింశుకాః శుభాః | సాలాస్తాలా స్తమాలాశ్చ మధూకాః పుష్పితా బభుః. 2

బభూవుః కోకిలాలాపా వృక్షాగ్రేషు మనోహరాః | వల్ల్యో%పి పుష్పితాః సర్వా ఆలిలింగు న్నగోత్తమాన్‌. 3

ప్రాణినః స్వాసు భార్యాసు ప్రేమయుక్తాః స్మరా%%తురాః | బభూవుశ్చాయతిమత్తాశ్చ క్రీడాసక్తాః పరస్పరమ్‌. 4

వవు ర్మందాః సుగంధాశ్చ సుశ్పర్శా దక్షిణా%నిలాః | ఇంద్రియాణి ప్రమాథీని మునీనామపి చాభవన్‌. 5

రతియుక్త స్తతః కామః పూరయ న్పంచమార్గణాన్‌ | చకార త్వరితస్తత్ర వాసం బదరికా%%శ్రమే. 6

రంభాతిలోత్తమాద్యాశ్చ గత్వా తత్ర వరా%%శ్రమే | గానం చక్రుః సుగీతజ్ఞాః స్వరతాన సమన్వితమ్‌. 7

తచ్ఛ్రుత్వా మధురోద్గీతం కోకిలానాం చ కూజితమ్‌ | భ్రమరాళి విరావం చ ప్రబుద్ధౌ తౌ మునీశ్వరౌ. 8

ఋతురాజ మకాలే తు దృష్ట్వా తౌ పుష్పితం వనమ్‌ | జాతౌ చింతా పరౌ తత్ర నరనారాయణా వృషీ. 9

కిమద్య శిశిరాపాయః సంవృత్తః సమయం వినా | ప్రాణితో విహ్వలాః సర్వే లక్ష్యంతే%తిస్మరాతురాః. 10

కాలధర్మ విపర్యాసః కథమద్య దురాసదః | నరం నారాయణః ప్రాహ విస్మయోత్ఫుల్లలోచనః. 11

పశ్య భ్రాతరిమే వృక్షాః పుష్పితాః ప్రతిభాంతివై | కోకిలా%%లాపసంఘుష్టా భ్రమరాళివిరాజితాః. 12

ఆరవ అధ్యాయము

నరనారాయణుల తపఃప్రభావము

శ్రీవ్యాసభగవాను డిట్లనెను : అంత ముమ్మెదట వసంతు డా గిరిరాజము మీదికి జేరెను. అట వెంటనే చెట్లన్నియును విరియబూచెను. తుమ్మెదల గుంపులతో విరాజిల్లెను. ఆ వనమునందలి మామిడి వకులము తిలకము మోదుగు సాల తమాల తాలములు మధూకము మున్నగు వృక్షములు చక్కగ పుష్పించి శోభిల్లెను. చెట్ల చివరికొమ్మలపై మనోహరమైన కోకిలారావములు చెవుల పండువులు సేసెను. కొనలు దేరిన తీవియలు చెట్లను పెనవేసికొనెను. అత్తఱి దంపతుల తలపులు రేకులు విప్పెను. స్త్రీ పురుషులు పరస్పరము మదనాతురులై బద్ధానురాగులై ప్రమత్తులై క్రీడాసక్తులైరి. అంత నెదలను చల్లపఱచుచు మెల్లని కమ్మని మలయ మారుతము లొలసెను. మునులకు సైతము ఇంద్రియములు వశముతప్పి చెలరేగెను. పూవిలుకాడును రతినిగూడి త్వరితగతితో బదరికాశ్రమము జేరెను. ఆతడు తన యైదు పూబాణములను వింట సంధించి పొంచి యుండెను. రంభ తిలోత్తమ మున్నగు నచ్చరలేమలు నాయాశ్రమముజేరి స్వరతాల లయలతో రాగభావ మధురగానము లొనర్చిరి. వారి మధుర గీతాలాపములు తుమ్మెదల ఝుంకారములు కోయిలల కలకూజనములు ఆలకించి పులకించి ఆ నరనారాయణులు ఎచ్చరికపడిరి. ఆ మహర్షులు మాత్రము కాలముగాని కాలమున వసంతశ్రీతో బూచిన వనరాజిని గని యిట్లు చింతాపరులైరి. ఇది సమయము గాని సమయము. ఇపుడీ వసంతర్తువెట్లు గలిగెను? ఎల్ల ప్రాణులును మన్మథాతురులై వశము తప్పి కనబడుచున్నారు. కాల ప్రకృతికి విరుద్ధమైన ఈ సంఘటన మెట్లు ఘటిల్లెనని నారాయణుడు విస్మయముతో తన కనులు దెఱచి నరున కిట్లు పలికెను: ఓ సోదరా! ఈ విరియబూచిన చెట్లు గనుము. ఆ చెట్లపైగల కోయిలల కలరావములు తుమ్మెదల రొదలు వినుము.

శిశిరం భీతమాతంగం దారయన్ను ఖరై ర్నఖైః | వసంతకేసరీ ప్రాప్తః పలాశకుసుమై ర్మునే! 13

రక్తా శోకకరా తన్వీ దేవర్షే! కింశుకాంఘ్రికా| నీలా%శోకకచా శ్యామా వికాసి కమలాననా. 14

నీలేందీవరనేత్రా సా బిల్వవృక్ష ఫలస్త నీ | ప్రోత్ఫుల్ల కుందరదనా మంజరీ కర్ణశోభితా. 15

బంధుజీవాధరా శుభ్రా సిందువారనఖాద్భుతా | పుంస్కోకిలస్వరా పుణ్యా కదంబ వసనా శుభా. 16

బర్హిర్వృంద కలాపా చ సారసస్వననూపురా | వాసంతీ బద్ధరశనా మత్తహంసగతిస్తథా ! 17

పుత్త్రంజీవాంశుకన్యస్త రోమరాజి విరాజితా | వసంతలక్ష్మీః సంప్రాప్తా బ్రహ్మ న్బదరికాశ్రమే. 18

అకాలే కిమియం ప్రాప్తా విస్మయో% యం మమా ధునా | తపోవిఘ్నకరా నూనం దేవర్షే! పరిచింతయ. 19

శ్రూయతే సురనారీణాం గానం ధ్యానవినాశనమ్‌ | ఆవయో స్త పభంగాయ కృతం మఘవతా కిల. 20

ఋతురాడన్యథా%కాలే ప్రీతిం సంజనయే త్కథమ్‌ | విఘ్నే%యం విహితో

భాతి భీతేనా2సురశత్రుణా. 21

వాతాః సుగంధాః శీతాశ్చ సమాయాంతి మనోహరాః | నాన్యత్కారణ మస్తీహ శతక్రతుకృతిం వినా. 22

ఇతి బ్రువతి విప్రా%గ్ర్యే దేవే నారాయణ విభౌ | సర్వే దృష్టిపథం ప్రాప్తా మన్మథప్రముఖాస్తదా. 23

దదర్శ భగవాన్సర్వా న్నరో నారాయణ స్తథా | విస్మయావిష్టమనసౌ బభూవతు రుభావపి. 24

ఓ మునీ! మృగరాజు తన వాడి గోళ్ళతో గజరాజును చీల్చివేయును. అటులే ఋతురాజగు వసంతుడు నెఱ్ఱనిమోదుగుపూలతో శిశిరర్తువును చీల్చుచున్నాడు. అల్లదిగో! రక్తాశోకము చేతులై మోదుగుపూలు పాదములై నీలాశోకములు కేశములై విప్పారిన కమలము ముఖమై నల్ల కలువలు కన్నులై మారేడుపండ్లు స్తనములై విరిసిన కుందకుసుమములు పలువరుసలై తిలకపుష్పములు కర్ణావతంసములై మంకెన పూవులు పెదవులై ప్రేంకరణపు పూవులు గోరులై పుంస్కోకిలల రవములు కంఠస్వరములై కడిమిపూలు నునుపైన చక్కనివస్త్రములై నెమళుల పించెములు మేలిమిసొమ్ములై సారసస్వనములు అందెల రవళులై జాజిమొగ్గలు మొలనూలై మత్త హంసగతులు నడలై గారపూలు నూగారులై విలసిల్లుచు వసంతలక్ష్మి శ్యామయై నా బదరికాశ్రమమున కేతెంచినది. మునీ! ఈ యకాలమున వసంతశ్రీ వచ్చుటకు కారణమేమై యుండును? నాకిది వింతగ నున్నది. దీనిని మన తపోవిఘ్నకారిణిగ నెఱుగుము. వేల్పుకన్నెలు మనకు ధ్యానభంగమగునట్లు మధురగానము వినిపించుచున్నారు. ఇదంతయును మన తపోభంగమునకు పన్నిన యింద్రుని పన్నుగడయేసుమా ఈ యదనుగాని తఱిలో వసంతు డిట్టి ప్రీతి యెట్టు గల్గించును? అ యింద్రుడే మనకు వెఱగొంది యీ విఘ్నమునకు తలపడెనని తోచును. సుగంధులు శీతములు మనోహరములునగు గాలులు వీచుచున్నవి. దీనికి కారణ మింద్రుని పన్నాగము కాక మరేదియుగాదు అని యీ విధముగా భూదేవశ్రేష్ఠుడగు నారాయణుడు పలుకుచుండగానే మదనుడు మున్నగువారు వారికి కంటబడిరి. నరనారాయణ భగవాను లాదేవగణమును గని విస్మితచేతస్కులైరి.

మన్మథం మేనకాం చైవ రంభాంచైవ తిలోత్తమామ్‌ | పుష్పగంధాం సుకేశీం చ మహేశ్వేతాం మనోరమామ్‌. 25

ప్రమద్వరాం ఘృతాచీం చ గీతజ్ఞాం చారుహాసినీమ్‌ | చంద్రప్రభాం చ సోమాం చ కోకిలాలాపమండితామ్‌. 26

విద్యున్మాలాంబుజాక్షీం చ తథా కాంచనమాలినీమ్‌ | ఏతా శ్చాన్యా వరారోహా దృష్టా స్తాభ్యాం తదా%ంతికే. 27

తాసాం ద్వ్యష్టసహస్రాణి పంచాశదధికాని చ | వీక్ష్య తౌ జాతౌ కామసైన్యం సువిస్తరమ్‌. 28

ప్రణమ్యాగ్రే స్థితాః సర్వా దేవవారాంగనా స్తదా | దివ్య%%భరణభూషాఢ్యా దివ్యమాల్యోపశోభితాః. 29

జగు శ్ఛలేన తాః సర్వాః పృథివ్యా మతి దుర్లభమ్‌ | తత్తథా%వస్థితం దివ్యం మన్మథాదివివర్ధనమ్‌. 30

శుశ్రావ భగవాన్విష్ణు ర్నరో నారాయణ స్తదా | శ్రుత్వా ప్రోవాచ తాస్తత్ర ప్రీత్యా నారాయణో మునిః. 31

ఆస్యతాం సుఖ మత్రైవ కరోమ్యాతిథ్య మద్భుతమ్‌ | భవత్యో%తిథి ధర్మేణ ప్రాప్తాః స్వర్గా త్సుమధ్యమాః. 32

సాభిమానస్తు సంజాత స్తదా నారాయణో మునిః | ఇంద్రేణ ప్రేషితా నూనం తథా విఘ్న చికీర్షయా. 33

వరాక్యః కా ఇమాః సర్వాః సృజామ్యద్య నవాః కిల | ఏతాభ్యో దివ్యరూపాశ్చదర్శయామి తపోబలమ్‌. 34

ఇతి సంచింత్య మనసా కరేణోరుం ప్రతాడ్య వై | తరసోత్పాదయామాస నారీం సర్వాంగంసుందరీమ్‌. 35

నారాయణోరుసంభూతా హ్యుర్వశీతి తతః శుభా | దదృశు స్తాః స్థితాస్తత్ర విస్మయం పరమం యయుః. 36

మన్మథుడు-మేనక-రంభ-తిలోత్తమ-పుష్పగంధ-సుకేళి-మహాశ్వేత-మనోరమ-ప్రమద్వర-చారుహాసిని-సంగీతజ్ఞ ఘృతాచి-చంద్రప్రభ-కోకిల భాషిణి-సోమ - అంబుజాక్షి - విద్యున్మాల - కాంచనమాలిని మఱియు వరారోహ లెందరో యా మునుల ముందట ప్రత్యక్షమైరి. అట్లు వచ్చిన కామసేనయగు పదునారు వేల యైదువందల మంది యచ్చరలను గాంచి పరమ మునులు పరమ విస్మయ మందిరి. ఆ దివ్యాభరణ మాల్యములతో మచ్చిక మీఱు దేవకాంతలు మునివరుల కంజలులు ఘటించి వారి యెదుట నిలువబడిరి. వారు భూమిపై దుర్లభము-మదనోద్దీపకమునైన దివ్య మధురగాన మాలపించిరి. నరనారాయణు లా గానములను వినిరి. పిదప నారాయణుడు వారితో నీ రీతిగ బలికెను. ఓ శోభన మధ్యమలారా! మీరు నాకము నుండి వచ్చి నా కతిథులైతిరి. నేను మీ కాతిథేయుడను. నా యాతిథ్యము స్వీకరింపుడు. మీ రెల్ల రిచటనే సుఖముండుడు.' వ్యాసు డిట్లనియెను: ఆ దేవతలు తమకు విఘ్న మొనరింప నింద్రునిచేత బంపబడియుందురని యభిమానవంతుడగు నారాయణుడు తలచెను. వీరి యందచందము లేమాత్రములు? వీరిని తలదన్ను దివ్యవిలాసరూప సంపన్నులను సృష్టింతును. నా తపోబలము చూపగలను' అని యిట్లు నారాయణుడు దలచి తన చేతితో తన తొడ చఱచుకొని వెంటనే యొక్క సర్వాంగ సుందరిని సృజించెను. నారాయణుని ఊరువులనుండి పుట్టుటచే నామె యూర్వశి యనబరగెను. అచ్చర లా సుందరిని గని యొకరి మొగమొకరు వెలవెలపోయి చూచుకొనిరి.

తాసాం చ పరిచర్యార్థం తావతీ శ్చాతిసుందరీః | ప్రాదుశ్చకార తరసా తదా ముని రసంభ్రమః. 37

గాయంత్యశ్చ హసంత్యశ్చ నానోపాయనపాణయః | ప్రణము స్తా మునీన్‌ సర్వాః స్థితాః కృత్వాం%జలిం పురః. 38

తాం వీక్ష్య విభ్రమకరీం తపసో విభూతిం దేవాంగనా హి ముముహుః ప్రవిమోహయంత్యః 39

ఊచుశ్చ తౌ ప్రముదితాననపద్మశోభా రోమోద్గమోల్లసిత చారునిజాంగవల్ల్య|.

కుర్యుః కథం స్తుతిమహో తపసో మహత్త్వం ధైర్యం తథైవ భవతా మభివీక్ష్య బాలా|

అస్మత్కటాక్షవిషదిగ్ధశ##రేణ దగ్ధః కోవా న తత్ర భవతాం మనసో వ్యథా న. 40

జ్ఞాతౌ యువాం నరహరేః పరమాంశ##భైతౌ | దేవౌ మునీ శమదమాదినిధీ సదైవ |

సేవానిమిత్త మిహ నో గమనం న కామం | కార్యం హరేః శతమఖస్య విధాతుమేవ! 41

భాగ్యేన కేన యువయోః కిల దర్శనం నః సంపాదితం న విదితం ఖలు సంచితం తత్‌.

చిత్తం క్షమం నిజజనే విహితం యువాభ్యా మస్మద్విధే కిల కృతాగసి తాపముక్తమ్‌. 42

కుర్వంతి నైవ విబుధా స్తపసో వ్యయం వై | శాపేన తుచ్ఛఫలదేన మహానుభావాః !

ఇత్థం నిశమ్య వచనం సురకామినీనాం తా పూచతు ర్మునివరౌ వినయానతానామ్‌. 43

ప్రీతౌ ప్రసన్నవదనౌ జితకామలోభో ధర్మాత్మజౌ నిజతపోరుచిశోభితాంగౌ |

బ్రువంతు వాంఛితాన్కామాన్దదావ స్తుష్టమానసౌ. 44

యాంతు స్వర్గం గృహీత్వేమా ముర్వశీం చారులోచనామ్‌ | ఉపాయన మియం బాలా గచ్ఛత్వద్య మనోహరా. 45

దత్తా%%వాభ్యాం మఘవతః ప్రీణనామోరుసంభవా | స్వస్త్యస్తు సర్వదేవేభ్యో యథేష్టం ప్రవ్రజంతు చ. 46

న కస్యాపి తపోవిఘ్నం ప్రకర్తవ్య మతః పరమ్‌.

దేవ్యఊచుః: క్వగచ్ఛామో మహాభాగ! ప్రాప్తాస్తే పాదపంకజమ్‌| నారాయణ సురశ్రేష్ఠ భక్త్యాపరమయా ముదా. 47

వాంఛితం చే ద్వరం నాథ! దదాసి మధుసూదన| తుష్టః కమలపత్రాక్ష! బ్రవీమో మనసేప్సితమ్‌. 48

ఆ పిదప నారాయణు డింద్రు డంపిన దేవకామినులకు సేవలు సేయుటకై సోయగమున వారికన్న మిన్నలగు నన్నులమిన్నలను పుట్టించెను. అట్లు పుట్టిన పడుచుకన్నెలు నగుచు పాడుచు పలువిధములగు నుపహారములు చేతులగొని వారి యెట్టయెదుట నిలువబడిరి. ఆ తపోవిభవమున జనించి విభ్రమము గొల్పు నూర్వశిని కన్నార గాంచి దేవాంగనలు మోహితలైరి. వారి మేనులు గగుర్పొడిచెను. వారి మోముతమ్ములు ముదమున విప్పారెను. వా రపుడు నారాయణున కిట్లనిరి: మేము కడు బాలలము. మీ తపో మాహాత్మ్యమును ఆత్మ స్థిరతను తిలకించితిమి. మిమ్మెట్లు నుతింపవలయునో తెలియకున్నది. మా క్రీగంటి విసపు ములుకులకు దగ్ధుడుగాని వాడు లేడు. కాని, మీ మనస్సులు మాత్ర మేమాత్రమును గంపింపకున్నవి. మీరలు వినివృత్తకాములు-శమదమనిధులు-దైవాంశ సంభూతులు-మునివరులునైన నరహరులని మే మెఱుంగుదుము. మే మింద్రుని పనుపున నతని కార్యసాధన కేతెంచితిమి కాని, మీ సేవకు రాలేదు. మే మెంతటి సంచిత పుణ్యభాగ్యమున మీ దివ్య సందర్శన భాగ్యము బడయగల్గితిమో యెఱుగకున్నాము. మేము పాపులము. ఐనను మీరు మమ్ము మీ వారిగ భావించితిరి. మమ్ము శపింపక వదలితిరి. దీన మీ క్షమా గుణము వెల్లడి యగుచున్నది. మహాశయులగు పండితులు తుచ్ఛమైన శాపము లిచ్చి తమ తపస్సును వ్యయము చేసికొనరు అని సురకామినులు సవినయముగ తలలువంచి పలికిరి. వ్యాసుడిట్లనెను: కామినుల ఈ పలుకులు విని పరమప్రీతులు ప్రసన్నవదనులు సంతుష్టాంతరంగులు తపోదీప్తాంగులు విజిత కామలోభులు ధర్మాత్మజులునైన నరనారాయణులు మీ వాంఛితములు దెలుపుడు. మేము దీర్తు'మని దేవ కామినులతో నిట్లనిరి. మీ రీ సొగసుకత్తె చారునయన యైన ఊర్వశిని స్వర్గమునకు గొనిపొండు. ఈమెను మేము సురపతికి కానుకగ నిచ్చితిమనుడు. ఆ యింద్రుని సంతృప్తికి తొడలనుండి పుట్టిన యూర్వశి నతనికి సమర్పించితిమి. ఎల్ల దేవతలకు మేలగుత! మీరిక స్వేచ్ఛగ నరుగుడు. మీ రీనాటి నుండి యెవరి తపమునకుగాని విఘ్న మొనరింపకుడు.' అప్సర లిట్లనిరి. ఓ నారాయణా! సురశ్రేష్ఠా! మహాభాగా! మేము మీ చరణకమలములను మనసార పరమభక్తితో నమ్మితిమి. మే మింకెక్కడికిని వెళ్ళజాలము. ఓ నాథా! మధుసూదనా! కమలపత్రాక్షా! నీవు మా యెడల సంతుష్టిజెంది మా వాంఛితార్థము లీడేర్ప దలచితివి. వరము లీయదలచితివి. మాలో రగుల్కొను కోర్కి కోరుచున్నాము. వినుము:

పతి స్త్వం భవ దేవేశ! వరమేనం పరంతప! భవామః ప్రీతియుక్తా స్త్వాం సేవితుం జగదీశ్వర! 49

త్వయా చోత్పాదితా నార్యః సంత్యన్యాశ్చారులోచనాః | ఊర్వశ్యాద్యా స్తథా యాంతు స్వర్గం వై భవదాజ్ఞయా. 50

స్త్రీణాం షోడశసాహస్రం తిష్ఠత్వత్ర శతార్ధకమ్‌ | సేవా న్తే%త్ర కరిష్యామో యువయో స్తాపసోత్తమౌ | 51

వాంఛితం దేహి దేవేశ! సత్యవాగ్భవ మాధవ | ఆశాభంగో హి నారీణాం హింసనం పరీకీర్తితమ్‌. 52

కామార్తానాం చ మునిభి ర్ధర్మజ్ఞె స్తత్త్వ దర్శిభిః | భాగ్యయోగా దిహ ప్రాప్తాః స్వర్గా త్ర్పేమపరిప్లుతాః. 53

త్యక్తుం నార్హసి దేవేశ! సమర్థో%సి జగత్పతే | నారాయణః: పూర్ణం వర్షసహస్రం తు తప స్తప్తం మయా%త్రవై. 54

జితేంద్రియేణ చార్వంగ్యః | కథం భంగం కరోమ్యతః | నేచ్ఛా కామే సుఖే కాచి త్సుఖ ధర్మవినాశ##కే. 55

పశూనామపి సాధర్మ్యే రమేత మతిమా న్కథమ్‌ | అప్సరసః: శబ్దాదీనిం చ పంచానాంమధ్యేస్పర్శసుఖంపరమ్‌. 56

ఆనందరసమూలం వై నాన్యదస్తి సుఖం కిల | అతో%స్మాకం మహారాజా! వచనం కురు సర్వథా. 57

నిర్భరం సుఖమాసాద్య చరస్వ గంధమాదనే | యది వాంఛసి నాకం త్వం నా%ధికో గంధమాదనాత్‌. 58

రమస్వా%త్ర శుభే స్థానే ప్రాప్య సర్వాః సురాంగనాః.

ఇతి శ్రీ దేవిభాగవతే మహాపురాణ చతుర్థస్కంధే షష్ఠో%ధ్యాయః.

ఓ జగత్పతీ ! దేవేశా ! పరంతపా ! నీవు మాకు పతివి గమ్ము. మేము నెయ్యము తియ్యము దోప నిన్నే నిచ్చలు సంసేవింతుము. నీవు పుట్టించిన చారులోచన లిచ్చటనే యుండగలరు. ఊర్వశి మున్నగువారు స్వర్గమేగగలరు. మేము మొత్తము పదారువేల యేబది మంది యువతులము. మే మిచ్చటనే యుండి తాపసోత్తములగు మీ పరిచర్య చేతుము. మాధవా! దేవేశా! మాలోని కోర్కి సఫలమొనరించి సత్యవాదివి గమ్ము. చెలువలు కాశాభంగ మొనరించిన నది హింస యనంబడును అని యిట్లు ధర్మతత్వజ్ఞులగు మునులు వచింతురు. మే మేదో భాగ్యవశమున స్వర్గమునుండి యిచటి కేగుదెంచితిమి. నీ ప్రేమలో బడితిమి. ఓ లోకనాథా! దేవేశా! నీవు మమ్ము వదలవలదు. నీవు సర్వసమర్థుడవు.' నారాయణు డిట్లనెను: ఇట మేము వేయేండ్లింద్రియములు గెల్చి ఘోర తప మొనర్చితిమి. ఓ సొగసుకత్తెలాలా! అట్టి తపమును మే మిపుడెట్లు భంగ మొనరింతుము? నాకు ధర్మనాశకమైన కామమం దిచ్ఛలేదు. బుద్ధిగలాడెవ్వడును పశువు పగిది విషయము లనుభవింపడు. అచ్చర లిట్లనిరి : శబ్దము మున్నగు పంచతన్మాత్రల సుఖములందు స్పర్శసుఖము కడు దొడ్డది. అది యానందరస మూలము. దాని సాటి సుఖము మరేదియును లేదు. మహారాజా! కాన నెల్లరీతుల మా మాట పాటింపుము. ఈ గంధమాదన గిరిపై మాతోడ సుఖముగ విహరింపుము. ఇక స్వర్గము గోరుదేని యీ పర్వతము కన్నవేరే స్వర్గము లేనేలేదు. ఈ శోభన స్థములందు శోభనసురాంగనలమగు మమ్ముగూడి ఆనందింపుము.

ఇది శ్రీమద్దేవీ భాగవతమందలి చతుర్థ స్కంధమందు నరనారాయణుల తపః ప్రభావమను షష్ఠాధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters