Sri Devi Bhagavatam-1
Chapters
అథ సప్తమో%ధ్యాయః వ్యాసః : ఇత్యాకర్ణ్య వచస్తాసాం ధర్మపుత్రః ప్రతాపవాన్ | విమర్శ మకరోచ్చిత్తే కిం కర్తవ్యం మయాధునా.
1 హాస్యా%హం మునిబృందేషుభవిష్యామ్యద్యసంగమాత్ అహంకారాదిదం ప్రాప్తం దుఃఖం నా%త్ర విచారణా.
2 మూలం సంసారవృక్షస్య యతః ప్రోక్తో మహాత్మభిః | దృష్ట్వా మౌనం సమాధాయ న స్థితో%హం సమాగతమ్. 3 వారాంగనాగణం జుష్టం తేనా%%సం దుఃఖభాజనమ్ | ఉత్పాదితా స్తథా నార్యో మయా ధర్మవ్యయేన వై. 4 తా స్తు మాం బాధితుం వృత్తాః కామార్తాః ప్రమదోత్తమాః | ఊర్ణనాభి రివాద్యాహం జాలేన స్వకృతేన వై. 5 బద్ధో%స్మి సుదృఢేనా%త్ర కిం కర్తవ్యమితః పరమ్ | యది చింతాం సముత్సృజ్య సంత్యజా మ్యబలా ఇమాః. 6 శప్త్వా భ్రష్టా వ్రజిష్యంతి సర్వా భగ్న మనోరథాః | ముక్తో%హం సంచరిష్యామి విజనే పరమం తపః. 7 తస్మా త్క్రోధం సముత్పాద్య త్యక్షా మి సుందరీగణమ్ | ఇతి సంచింత్య మనసా మునిర్నారాయణస్తదా. 8 విమర్శ మకరో చ్చిత్తే సుఖత్పాదనసాధనే | ద్వితీయో%యం మహాశత్రుః క్రోధః సంతాపకారకః. 9 కామాదప్యధికో లోకే లోభాదపి చ దారుణః | క్రోధాభిభూతః కురుతే హింసాం ప్రాణ విఘాతినీమ్. 10 దుఃఖదాం సర్వభూతానాం నరకారామ దీరి కామ్ | యథాగ్నిరర్షణాజ్జాతః పాదపం ప్రదహే త్తథా. 11 దేహోత్పన్న స్తథా క్రోధో దేహం దహతి దారుణః | ఇతి సంచింతయానం తం భ్రాతరం దీనమానసమ్. 12 ఉవాచ వచనం తథ్యం నరో ధర్మసుతో%నుజః | నారాయణ మహాభాగ కోపం యచ్చ మహామతే | 13 శాంతం భావం సమాశ్రిత్య నాశయా%హంకృతిం పరామ్ | పురా%హంకారదోషేణ తపో నష్టం కిలా%%వయో. 14 ఏడవ అధ్యాయము అహంకార ప్రభావము అ యచ్చరల తీయని పలుకు లాకర్ణించి ప్రతాపవంతుడగు ధర్మపుత్రుడిపుడు నేనేమి చేయవలయునని విమర్శించుకొనుచుండెను. నేను వీరిని గూడినచో నీ మునులలోన నవ్వుల పాలగుదును. నాకీదుఃఖ మహంకారమున కల్గినది. ఇపుడింక విచారించి లాభములేదు. ధర్మవినాశమునకు మూలకారణ మహంకారమే గదా! ఈ సంసార మహావృక్షమున కహంకారమే మూలమని మహాత్ములు సైతము వచింతురు. ఈ వలపుకత్తెలను గాంచిన వెంటనే నేను మౌనముగ నేలయుండకుంటిని! ఆ వార్త కామినులతోడ మర్మభాషణములు సలుపుట వలన నేనిన్ని వెతలకు గురియైతిని. అంతేకాక నా తపోధనము వ్యయించి ఈ ఉత్తమ సుందరులను బుట్టించితిని. ఈ ప్రమదోత్తమలు కామాతురలై నన్ను వదలకేదో బాధపెట్టుచున్నారు. నేనిపుడు సాలెపురుగు పగిది స్వయంకృతాపరాథమున జిక్కుకొంటిని. వీరి తీరని వలపుపాశములచేత కట్టివేయబడితిని. ఇపుడు నా కర్తవ్యమేమి? నేనొకవేళ యీ వన్నెల చిన్నెల మిటారులను వదలుతుననుకొందము. అపుడు వారు భగ్న హృదయలగుదురు. నన్ను శపించి మఱి యేగుదురు. అపుడు నేను వీరివలన ముక్తుడవై యొంటరిగ తిరుగుచు తపమొనర్తును. కనుక నేనిపుడు నింపాదిగ కోపము తెచ్చుకొని యీ సుందరాంగులను విడనాడుదును ఆనుచు ఆ నారాయణ ఋషి యిట్లు తన మదిలో తలపోసెను. ఆ నారాయణుఢాత్మసుఖము బడయగోరి తనలోతా నిట్లాత్మ విమర్శము చేసికొనెను: ఈ క్రోధము మిక్కిలి సంతాపకారకమైనది. ఇది రెండవ శత్రువు. ఈ లోకములందు క్రోధము కామము కంటె చెడ్డది. లోభము కంటే నతిదారుణమైనది. కోపిష్ఠుడైన నరుడు ప్రాణవినాశకమైన హింస చేయును. ఈ కోప మెల్లభూతముల యెడదలందును దుఃఖాగ్నిని రగుల్కొల్పును. ఇది నరక మనెడు తోటలోని దిగుడు బావి వంటిది. రెండు చెట్ల రాపిడి వలన బుట్టిన యగ్ని యా చెట్లనే కాల్చివేయును. అటులే యీ శరీరమునందలి యెదలో బుట్టిన దారుణమైన కోపాగ్ని యీ శరీరమంతయు గాల్చివేయును అని యిట్లు దీనముగ చింతించుచున్న నారాయణుని నరుడు గాంచెను. ధర్మపుత్రుని తమ్ముడగు నరుడు తన యన్నకిట్లని వాస్తవము తెలిపెను: ఓ నారాయణా! ఓ మహానుభావా! కోప ముడుగుము. గర్వమును మొదలంట నడచివేయుము. శాంతభావ మాశ్రయించుము. తొల్లి యహంకార దోషముననే గదా మన తపమున కాటంకము వాటిల్లినది. సంగ్రామశ్చాభవత్తాభ్యాం భావాభ్యా మసురేణ హ | దివ్యవర్షసహస్రం తు ప్రహ్లాదేన మహాద్భుతమ్. 15 దుఃఖం బహుతరం ప్రాప్తం తత్రా%%వాభ్యాం సురోత్తమ | తస్తాత్ర్కోధం పరిత్యజ్యశాంతో భవ మునీశ్వర ! 16 ''శాంతత్వం తపసో మూలం మునిభి పరికీర్తితమ్'' | ఇతి తస్య వచః శ్రుత్వా శాంతో%భూద్ధర్మనందనః. జనమేజయః సంశయో%యం మునిశ్రేష్ఠః ప్రహ్లాదేన మహాత్మనా. 17 విష్ణుభ##క్తేన శాంతేన కథం యుద్ధం కృతం పురా | కృతవంతై కథం యుద్ధం నరనరాయణావృషీ. 18 తాపసౌ ధర్మపుత్త్రౌ ద్వౌ సుశాంతమనసా వుభౌ | సమాగమః కథం జాతస్తయోర్దైత్యసుతస్య చ. 19 సంగ్రామస్తు కథం తాభ్యాం కృతస్తేన మహాత్మనా | ప్రహ్లాదో%ప్యతి ధర్మాత్మా జ్ఞానవాన్విష్ణుతత్పరః. 20 నరనారాయణౌ తద్వత్తాపసౌ సత్త్వసంస్థితౌ | తేన తాభ్యాం సముద్భూతం వైరం యది పరస్పరమ్. 21 తదా తపసి ధర్మేచ శ్రమ ఏవ హి కేవలమ్ | క్వ జపః? క్వ తపశ్చర్యా? పురా సత్యయుగే%పి చ. 22 తాదృశై ర్న జితం చిత్తం క్రోధా%హంకార సంవృత్తమ్ | న క్రోధో నచ మాత్సర్య మహంకారాంకురం వినా. 23 అహంకారాత్సముత్పన్నాః కామక్రోధాదయః కిల | వర్షకోటిసహస్రం తు తపః కృత్వా%తి దారుణమ్. 24 అహంకరాంకురే జాతే వ్యర్థం భవతి సర్వథా | యథా సూర్యోదయే జాతే తమోరూపం న తిష్ఠతి. 25 అహంకారాంకురస్యా%గ్రే తథా పుణ్యం న తిష్ఠతి | ప్రహ్లాదో%పి మహాభాగ! హరిణా సమయుధ్యత. 26 తదా వ్యర్థం కృతం సర్వం సుకృతం కిల భూపతే | నరనారాయణౌ శాంతౌ విహాయ పరమం తపః. 27 ఈ దురహంకారాది భావముల చేతనే కదా తొల్లి మనము దానవుడగు ప్రహ్లాదునితో దివ్యసహస్ర వర్షములు ఘోరముగ పోరాటమొనరించితిమి. సురోత్తమా! ఇట్లు మనము మునుపు దుర్భర దుఃఖము లనుభవింతిమి. మునివరా ! కనుక కినుక వదలుము. ఆత్మశాంతి బొందుము. శాంతమే తపమునకు మూలబీజమని మునులు వక్కాణింతురు. వ్యాసు డిట్లనెను : ఆ నరుని వచనములు విని ధర్మనందనుడు పరమ శాంతుడయ్యెను. జనమేజయు డిట్లనెను. ఓ మునివర్యా! నాకొక శంకగల్గుచున్నది. ఏమన - ఆ ప్రహ్లాదుడు మహా భాగవతోత్తముడు గదా! ఆతడు శ్రీవిష్ణు భక్తుడు గదా? పరమ శాంతుడు గదా? అంతటి మహాత్ముడు నరనారాయణ మహర్షులతోడ నేల పోరు సలిపెను? ఆ ధర్మపుత్రులు తాపసోత్తములు - శాంతమనస్కులు. అట్టివారితో ప్రహ్లాదునకెట్లు సమాగమము గలిగెను? ఆ ప్రహ్లాదుడు గూడ ధర్మాత్ముడు గదా! అట్టివాడు వారితో నేల బవర మొనర్చెను? తాపసులు - సత్వ సంస్థితులు - నైన ఆ నరనారాయణులకు ప్రహ్లాదునితో వైరమేల వైరమేల సంభవించెను? ఇంకిటులే జరుగుచో తపము - ధర్మము శ్రమ మాత్రముగ మిగులును గదా! ఏలయన, తొల్లిటి సత్యయుగమునందు తపము లేదు. జపము లేదు. ఇంటి తపోనిరతులు సైతము వట్టి యహంకార మయమగు కోపమును జయింపలేకుండిరి. అహంకారపు మొలక లేనిచో కోపమునకు తావేది? అసూయకు నిలుకడయేది? ఈ యహంకారము వలననే కామక్రోధాది భావములు కల్గుచుండును. కోటి వేల ఏండ్లు తపించ వచ్చును. కాని, యొక్క యహంకారపు మొలకెత్తగనే యాతపఃఫలమంతయును సూర్యుడుదయింపగనే చీకటి వ్రీలిపోవునట్లు నశించును. ఒక్క గరువపు మొలక చిగుర్చగనే తపః పుణ్య మంతయును వమ్మగును. ఆ మహనీయుడగు ప్రహ్లాదుడును హరితో రణమొనరించెను. ఓ రాజ! ఆ ప్రహ్లాదుని పున్నెమంతయు వ్యర్థమయ్యెను. శాంతిపరాయణులైన నరనారాయణులు తమ తపఃఫలమును చెడగొట్టుకొనిరి. కృతవంతౌ యదా యుద్ధం క్వ శమః సుకృతం పునః | ఈ దృగ్భ్యాం సత్త్వయుక్తాభ్యామజేయాయద్యహంకృతిః. 28 మాదృశానాం చ కా వార్తా మునే%హంకార సంక్షయే | అహంకారపరిత్యక్తః కో%ప్యస్తి భువనత్రయే. 29 న భూతో భవితానైవ యస్త్యక్తస్తేన సర్వథా | ముచ్యతే లోహనిగడై ర్బద్ధః కాష్టమయై స్తథా. 30 అహంకారనిబద్ధస్తు న కదాచి ద్విముచ్యతే | అహంకారా%%వృతం సర్వం జగత్థ్సావర జంగమమ్. 31 భ్రమత్యేమహి సంసారే విష్ఠాముత్రప్రదూషితే | బ్రహ్మజ్ఞానం కుతస్తావ త్సంసారే మోహసంవృతే. 32 మతం మీమాంసకానాం వై సమ్మతం భాతి సువ్రత | మహాంతో%పి సదా యుక్తాః కామక్రోధాదిభిర్మునే! 33 మాదృశానాం కలా వస్మి న్కాకథా మునిసత్తమ | వ్యాసః: కార్యం వై కారణాద్భిన్నం కథం భవతి భారత! 34 కటకం కుండలం చైవ సువర్ణసదృశం భ##వేత్ | అహంకారోద్భవం సర్వం బ్రహ్మాండం సచరాచరమ్. 35 పటస్తంతువశః ప్రోక్త స్తద్వియుక్తః కథం భ##వేత్ | మాయాగుణౖ స్త్రిభిః సర్వం రచితం స్థిరజంగమమ్. 36 సతృణస్తంబపర్యంతం కా తత్ర పరిదేవనా | బ్రహ్మ విష్ణు స్తథా రుద్రస్తే చాహంకారమోహితాః. 37 భ్రమంత్యస్మి న్మహా%గాధే సంసారే నృపసత్తమ | వసిష్ఠనారదాద్యాశ్చ మునయో జ్ఞానినః పరమ్ ! 38 తే%భిభూతాః సంసరంతి సంసారే%స్మి న్పునఃపునః | న కో%ప్యస్తి నృపశ్రేష్ఠ ! త్రిషు లోకేషు దేహభృత్. 39 ఏభిర్మాయాగుణౖర్ముక్తః శాంత ఆత్మసుఖే స్థితః | కామక్రోధౌ తథా లోభో మోహో%హంకార సంభవః. 40 న ముంచంతి నరం సర్వం దేహవంతం నృపోత్తమ | అధీత్య వేదశాస్త్రాణి పురాణాని విచింత్య చ. 41 వారెప్పుడు పోరాటమునకు దిగిరో అపుడే వారి సుకృతము-శాంతి-మంటగలిసెను. ఏలయన నంతటి సత్త్వ సంపన్నులు గూడ అహంకారమును జయింపలేకపోయిరి గదా! ఇంక నా బోటివాడు గర్వము నెట్టణచుకొనగలడు? ఈ త్రిభువనములందెవ్వడో యొక్కడహంకారము లేనివాడు మున్ను లేడు. ముందుండబోడు. ఇనుప సంకెళ్ళచే బంధింపబడినవా డొకవేళ ముక్తుడు గావచ్చును. కాని, పనికి మాలిన యహంకారముచే బద్ధుడైనవాడెన్నడు విముక్తుడు గాజాలడు. ఈ చరాచర జగమంతయు నహంకారమయము. జీవుడు మలమూత్రములతో కంపుగొట్టు సంసారమందు పరిశ్రమించుచుండును. ఇట్టి మోహమయమైన సంసారమునందింక బ్రహ్మజ్ఞానమెట్లు గల్గును? ఓ సువ్రతా! మునివ్రతా! కావున అన్నిటికన్న కర్మ ప్రధానులగు మీమాంసకుల మతము యుక్తమైనదని నాకు దోచుచున్నది. మహాత్ములు గూడ నిరంతరము కామక్రోధములచే నిబద్ధులయి యుందురు. ఇక నీకలియుగమున మా బొంట్లకు గతి ఏమి? ఓ భారతా! కారణము కంటె కార్యము భిన్నముగ నుండదు. గుండ్రని చెవి కుండలములు స్వర్ణమయములైనట్లు చరాచర బ్రహ్మాండమంతయు నహంకార మయమై యొప్పెసగుచుండును. వస్త్రమునకు కారణము దారములు. దారముల వలననే వస్త్ర మేర్పడును. అటులే యీ స్థావరజంగమాత్మకమైన జగములెల్ల గుణత్రయముతో రచింపబడి యుండును. అవన్నియు మిథ్యలే. లేనివానివంటివే. అట్టి వానిని గూర్చి వంతజెంద నేల? బ్రహ్మ-విష్ణువు-రుద్రుడు సైతము అహంకార సమ్మోహితులై యుందురు. ఆ త్రిమూర్తులు నీయగాధమైన నిస్సార సంసారములో బడి కొట్టుమిట్టాడు చుందురు. నారదుడు-వసిష్ఠుడు మున్నగు మునివరులు పరమజ్ఞానులు. వారు సయిత మీసంసారమందు మాటి మాటికి జన్మము దాల్చుచుందురు. కాన ఓ రాజా! ఈ జగములం దహంకృతి లేనివాడు లేడు. ఈ మాయాత్రిగుణముల వలన ముక్తుడై శాంతుడై ఆత్మ సుఃయైనవాడొక్కడుగూడ లేడు. ఈ కామక్రోధలోభాదులన్నియు నహంకారము నుండి పుట్టినవే. ఇవి దేహధారిని క్షణమైన విడిచి యుండజాలవు. వేదశాస్త్రములెల్ల చదివి పురాణములు విమర్శించువాడు గలడు. కృత్వా తీర్థా%టనం దానం ధ్యానం చైవ సురా%ర్చనమ్ | కరోతి విషయాసక్తః సర్వం కర్మచచౌరవత్. 42 విచారయితి నో పూర్వం కామమోహమదాన్వితః | కృతే యుగే%పి త్రేతాయాం ద్వాపరే కురునందన! 43 విద్దో2త్రాస్తి చ ధర్మో%పి కా కథా%ద్య కలౌ పునః | స్పర్థా సదైవ సద్రోహా లోభామర్షౌ చ సర్వదా. 44 ఏవం విధో%స్తి సంసారో నాత్ర కార్యా విచారణా | సాధవో విరళా లోకే భవంతి గతమత్సరాః 45 జితక్రోధా జితామర్షా దృష్టాంతార్థం వ్యవస్థితాః | రాజోవాచ: తే ధన్యాః కృతపుణ్యాస్తే మదమోహ వివర్జితాః. 46 జితేంద్రియా: సదాచారా జితం తైర్భువనత్రయమ్ | దునోమి పాతకం స్మృత్వా పితుర్మమ మహాత్మనః. 47 కృత స్తపస్వినః కంఠే మృతసర్పో హ్యఘం వినా ! అత స్తస్య మునిశ్రేష్ఠ ! భవితా కిం మమాగ్రతః. 48 న జానే బుద్ధిసమ్మోహ త్కిం వా కార్యం భవిష్యతి | మధు పశ్యతి మూఢాత్మా ప్రపాతం నైవ పశ్యతి. 49 కరోతి నిందితం కర్మ నరకా న్న బిభేతి చ | కథం యుద్ధం పురావృత్తం విస్తరాత్తద్వదస్వమే. 50 ప్రహ్లాదేన యథా చోగ్రం నరనరాయణస్య వై | ప్రహ్లాదస్తు కథం యాతః పాతాళాత్తద్వదస్వ మే. 51 సారస్వతే మహాతీర్థే పుణ్య బదరికాశ్రమే | నరనారాయణౌ శాంతౌ తాపసౌ మునిసత్తమౌ. 52 కృతవంతౌ తథా యుద్ధం హేతునా కేన మానద | వైరం భవతి విత్తార్థం దారార్థం వా పరస్పరమ్. 53 ఏషణారహితౌ కస్మా చ్చక్రతుః ప్రథనం మహత్ | ప్రహ్లాదో%పి చ ధర్మాత్మా జ్ఞాత్వా దేవౌ సనాతనౌ. 54 కృతవా న్స కథం యుద్ధం నరనారాయణౌ మునీ | ఏత ద్విస్తరతో బ్రహ్మన్ శ్రోతు మిచ్ఛామి కారణమ్. 55 ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ చతుర్థస్కంధే సప్తమో%ధ్యాయః దానము ధ్యానము దేవతార్చనము తీర్థాటగనము చేయువాడును గలడు. ఐన నతడు అహంకారముతో విషయలంపటుడై యెల్లపనులను దొంగవలె నాచరించు చుండును. కామము-మోహము-మదముతో నిండిన గుండెగలవాడు మొదట నేదియు వాస్తవ మెఱుగనేరడు. కృతత్రేతాద్వాపర యుగములందు గూడ ధర్మముండెను. కాని, ఆ యుగములందును ధర్మమునకు హాని గలిగెను. ఇంక నీ కలికాలము సంగతి చెప్పనేల? ఈ కలియుగమున మనస్స్పర్థలు లోభ రోషములు గల్గుచుండును. ఈ కలియుగమందిట్టి చెడుతలపులు పెక్కులు గల్గుచుండును. ఇట్టి కలిని గూర్చి యిక చెప్పెడి దేమి యుండును? ఈ కలికాలమున మత్సరము లేనివారు - సాధువులు లేరు. ఈ కలిలో కామక్రోధములు గెలిచినవారు లేదు. రాజిట్లనెను. మద మోహములు విడిచినవారే పుణ్యాత్ములు - వారే ధన్యజీవులు. ఈ త్రైలోక్యము జితేంద్రియులు - సదాచార సంపన్నులు నైన వారిచే జయింపబడినది. నా తండ్రి మహాత్ముడు. ఐన నత డొనరించిన పాతకమును నేనెంతయో బాధపడుచున్నాను. ఏ పాపములేని యొక తపసి మెడలో నా తండ్రి యొక చచ్చిన పామును తెచ్చివేసెను. ఆ దొసగు తొలంగుటకు నాకర్తవ్యమేమో తెలుపుము. నేను మోహవిభ్రాంతుడను. నా కర్తవ్య మేమో నాకు తెలియుటలేదు. మూఢాత్ముడు తేనె త్రాగజూచునే కాని తన యెదుట నున్న పర్వత ప్రపాతమును గాంచలేడు. ప్రతి నరుడును పనికిమాలిన పనికి బూనుకొనునే కాని ముందు రాబోవు నరకమునకు వెఱగొందడు. ఓ మునివరా! పూర్వము నరనారాయణులతో ప్రహ్లాదున కేల పోరు ఘటిల్లెనో తెల్పుము. వారేల పోరిరో నాకు దెలుపుము. మొదలా ప్రహ్లాదుడు పాతాళము విడిచి భూమి మీద కేల వచ్చెను? అతడు సారస్వత మహాతీర్థము-పుణ్యప్రదము నైన బదరికాశ్రమము నేల చేరెను? ఆ నరనారాయణులు పరమశాంతులు - తాపసోత్తములు - గదా. వారకారణముగ నేల రణమొనరించిరి? భార్యా ధనములు గుఱించి సహజముగ పరస్పరవైరము గులుగుచుండును. ఆ మును లీషణత్రయములు లేనివారు గదా! సనాతనులు గదా! ప్రహ్లాదుడును కడు ధర్మాత్ముడు గదా! వారి ఘోర సంగ్రామ మేల సంఘటిల్లెనో తెలుపుము. బ్రాహ్మణ దేవతా! వారన్నియు తెలిసిన వారయ్యు నేల పోరాడిరో తత్కారణ మంతయును సవిస్తరముగ విన గోరిక యగుచున్నది. దయతో నాకు వినిపింపుము అని జనమేజయుడు వ్యాసుని ప్రశ్నించెను. ఇది శ్రీమద్దేవీ భాగవత మందలి చతుర్థస్కంధమందలి అహంకార ప్రభావమను సప్తమాధ్యాయము.