Sri Devi Bhagavatam-1
Chapters
అథ దశమో%ధ్యాయః జనమేజయః: సందేహో%యం మహానత్ర పారాశర్య! కథానకే | నరనారాయణౌ శాంతౌ వైష్ణవాంశౌ తపోధనౌ.
1 తీర్థాశ్ర¸° సత్తయుక్తౌ వన్యాశనపరౌ సదా | ధర్మపుత్త్రౌ మహాత్మానౌ తాపసౌ సత్యసంస్థితౌ.
2 కథం రాగసమాయుక్తౌ జాతౌ యుద్ధే పరస్పరమ్ | సంగ్రామం చక్రతుః కస్మా త్త్యక్త్వా తప మనుత్తమమ్.
3 ప్రహ్లాదేనసమం పూర్ణం దివ్యవర్షశతం కిల | హిత్వా శాంతి సుఖం యుద్ధం కృతవంతౌ కథం మునీ.
4 కథం తౌ చక్రతు ర్యుద్ధం ప్రహ్లాదేన సమం మునీ | కథయస్వ మహాభాగ! కారణం విగ్రహస్య వై.
5 కామినీ కనకం కార్యం కారణం విగ్రహస్య వై | యుద్ధేబుద్ధిః కథం జాతా తయోశ్చ తద్విరక్తయోః. తథావిధం తపస్తప్తం తాభ్యాం కేన చ హేతునా.
6 మోహార్థం సుఖభోగార్థం స్వర్గార్థం వా పరంతప! కృత మత్యుత్కటం తాభ్యాం తపః సర్వ ఫలప్రదమ్.
7 మునిభ్యాం శాంతచిత్తాభ్యాం ప్రాప్తం కిం ఫలమద్భుతమ్ | తపసా పీడితో దేహః సంగ్రామేణ పునః పునః.
8 దివ్యవర్షశతం పూర్ణం శ్రమేణ పరిపీడితౌ | న రాజ్యార్థే ధనే వా%పి న దారేషు గృహేషు చ.
9 కిమర్థం తు కృతం యుద్ధం తాభ్యాం తేన మహాత్మనా | నిరీహః పురుషః కస్మా త్ర్పకుర్యా ద్యుద్ధ మీదృశమ్. 10 దుఃఖదం సర్వథా దేహే జానన్ధర్మం సనాతనమ్ | సుబుద్ధిః సుఖదానీహ కర్మాణి కురుతే సదా.
11 న దుఃఖదాని ధర్మజ్ఞ! స్థితిరేషా సనాతనీ | ధర్మపుత్రౌ హరేరంశౌ సర్వజ్ఞౌ సర్వభూషితౌ.
12 కృతవంతౌ కథం యుద్ధం దుఃఖం ధర్మ వినాశకం | త్యక్త్వా తతః సమాధీతం సుఖారామం మహాత్ఫలమ్.
13 పదవ అధ్యాయము దేవదానవుల యుద్ధము జనమేజయు డిట్లనెను : పారాశర్యా! మీరు చెప్పిన మాటలు విని నాకు గొప్ప సందియము గలుగుచున్నది. ఏమన, ఆ నరనారాయణులు వైష్ణవాంశ సంజాతులు - తపోధనులు - శాంతులు - తీర్థాశ్రయులు - సాత్త్వికులు - వన్యఫలాశనులు - సత్యసంగరులు - మహామునులు - ధర్మపుత్త్రులు గదా! అట్టివారు రాగయుక్తు లేలయైరి? శుభము లొనగూర్చు తపము నేల మాని సంగరమునకు గడంగిరి? శాంతి సౌఖ్యప్రదమైన యాత్మానందమును వదలి దివ్య సహస్రవర్షము లెట్టు పోరగలిగిరి? ఆ మునులు ప్రహ్లాదునితో నెట్లుపోరిరి? వారికి పరస్పరము విరోధము గలుగుటకు కారణమేమి? నాకిదంతయును విశద పఱచుము. సామాన్యముగ కామినీ కాంచనములగూర్చి వైరము గలుగుచుండును. కాని, అట్టి హేతువు లేకయే వీతరాగులై తీవ్రతప మొనర్చు వారికి యుద్ధబుద్ధి యేల కలిగెను? వారు సర్వఫలప్రదమైన అట్టి తపమేల చేసిరి? సుఖభోగములకా? ఇతరులను మోహములో ముంచుటకా? కాక స్వర్గభోగార్థమా? వారు శాంతచిత్తులు గాద! తుదకు వారికెట్టి ఫలము ప్రాప్తించెను? వారి శరీరములు తపముచే కృశించినవి. రణముచే క్షీణించినవి. వారు దివ్య వర్షములు శ్రమ కోర్చి పోరుటచే పీడ నందిరి. వారు రాజ్యములు కోరికాని ధనముకోరికాని భార్యా పుత్త్రుల గోరికాని సంగర మొనరింప లేదుగదా! మఱి మహాత్ముడగు ప్రహ్లాదునితో కయ్యమునకు కాలు ద్రవ్విరి. నిష్కాముడైన వాడెవ్వడైన శాంతి రహితమైన యుద్ధ మొనర్చునా? వారికి సనాతన ధర్మ తత్త్వము తెలియునుగదా! మఱి వారు మేనులకు దుఃఖకరమైన రణమేల యొనరించిరి? బుద్ధిమంతు డెల్ల వేళల సుఖములు గూర్చు శుభకర్మలే యాచరించును గాని దుఃఖదములగు పనులు చేయడు. ఇది సనాతన ధర్మము. ధర్మజ్ఞా! ఆ ధర్మపుత్రులు విష్ణ్వంశజులు - సర్వకళాకోవిదులు - సర్వగుణవిభూషితులు. అట్టివారు సుఖైక నిలయము శాంతిఫలప్రదమునైన తపము మాని ధర్మనాశకము దుఃఖకరమునైన కదనమున కేల తలపడిరి? సంయుగం దారుణం కృష్ణ! నైన మూర్ఖో%పి వాంఛతి | శ్రుతో మయా యయాతిస్తు చ్యుతః స్వర్గాన్మహీపతిః. 14 అహంకారభావా త్పాపా త్పాతితః పృథివీతలే | యజ్ఞకృద్ధానకర్తా చ ధార్మికః పృథివీ పతిః. 15 శబ్దోచ్చారణ మాత్రేణ పాతితో వజ్ర పాణినా | అహంకార మృతే యుద్ధం న భవత్యేవ నిశ్చయః. 16 కిం ఫలం తస్య యుద్ధస్య మునేః పుణ్యవినాశనమ్ | వ్యాస ఉవాచ : రాజస్సంసార మూలం హి త్రివిధః పరికీర్తితః. 17 అహంకార స్తు సర్వజ్ఞైర్మునిభి ర్ధద్మ నిశ్చయః | స కథం మునినా త్యక్తుం యోగ్యా దేవాభృతా కిల. 18 కారణన వినా కార్యం న భవత్యేవ నిశ్చయః | తపో దానం తథా యజ్ఞాః సాత్త్వికా త్ప్రభవంతి తే. 19 రాజసా ద్వా మహాభాగ! తామసా త్కలహ స్తథా | క్రియా స్వల్పా%పి రాజేంద్ర నాహంకారం వినా క్వచిత్. 20 శుభావా%ప్యశుభా వాపి ప్రభవత్యపి నిశ్చయః | అహంకారా ద్బంధకారీ నాన్యో%స్తి జగతీతలే. 21 తేనేదం రచితం విశ్వం కథం తద్రహితం భ##వేత్ | బ్రహ్మ రుద్ర స్తథా విష్ణు రహంకారయుతా స్త్విమే. 22 అన్యేషాం చైవ కా వార్తా మునీనాం వసుధాధివ ! అహంకారా%%వృతం విశ్వం భ్రమతీదం చరాచరమ్. 23 పునర్జన్మ పునర్మృత్యుః సర్వం కర్మవశా%నుగమ్ | దేవతిర్యఙ్మనుష్యాణాం సంసారే%స్మి న్మహీపతే. 24 రథాంగవ దసర్వార్థం భ్రమణం సర్వదా స్మృతమ్ | విష్ణోరప్యవతారాణాం సంఖ్యాం జానాతి కః పుమాన్. 25 ఇంతటి దారుణ రణము మూర్ఖుడుగూడ చేయడు. తొల్లి యయాతి భూపతి స్వర్గచ్యుతుడయ్యెనని వింటిని. ఆ పుడమిఱడు ఘనముగ దానధర్మములు యాగములు నాచరించెను. కాని, దురహంకారమున గల్గిన పాపఫలితముగ దివినుండి భువిపై పడిపోయెను. నేను పెక్కు జన్నము లొనరించితినని యన్నంతమాత్రమున నింద్రు డతనిని పతితునిగ జేసెను. దురహంకృతి లేనిచో పోరు గలుగదని తలతును. పుణ్య వినాశకమైన యుద్ధము వలన గలుగు ఫలిత మేమి? అనగా మునివరు డిట్లనెను. రాజా! ఈ సంసారమునకు మూలము మువ్విధములుగ నుండునని పెద్దలందురు. ధర్మనిర్ణేతలు సర్వవిధులునైన మును లీ మాయాకృత సంసారమునకు త్రిగుణముల సమ్మేళనమైన యహంకారము కారణమని పేర్కొందురు. దేహధారియగు ముని యట్టి యహంకారము నెట్లు విడిచి యుండజాలును? కారణము లేక కార్యము ఘటిల్లదు. ఇది తిరుగులేని నిజము. సత్త్వముచే తపము - దానము - యాగము గల్గును. అహంకారమున రజస్తమస్సుల తీవ్రతచే కలహ ముత్పన్నమగును. ఎంత కొలది పనియైన చెడుగైన ఈ పుడమిపై నహంకారము లేనిదేదియును కలుగదు. అహంకారము మూలముననే యీ విశ్వసృష్టి సంభవించినది. అది లేనిచో జగమే లేదు. బ్రహ్మ-విష్ణువు-శివుడు సైతము అహంకారయుతులే. మఱి ఇతర మునుల విషయము చెప్పనేల? ఈ సకల చరాచర జగ మహంకారమయమై పరిభ్రమించుచుండును. కర్మము మూలమున మాటి మాటికి పుట్టిగిట్టుటలు సాగుచుండును. దేవ మనుజ తిర్యక్కులు సర్వమును సంసారమందు రథచక్రములవలె నిరంతరాయముగ తిరుగుచుందురు. ఆ శ్రీమన్నారాయణు నవతారముల సంఖ్య నెవడు లెక్కింపగలడు? వితతే%స్మిం స్తు సంసార ఉత్తమాధమ యోనిషు | నారాయణో హరిః సాక్షాన్మాత్స్యం వపు రుపాశ్రితః. 26 కామఠం సౌకరం చైవ నారసింహం చ వామనమ్ | యుగే యుగే జగన్నాథో వాసుదేవో జనార్దనః. 27 అవతారా నసంఖ్యాతా న్కరోతి విధియంత్రితః | వైవస్వతే మహారాజ ! సప్తమే భగవాన్హరిః. 28 మన్వంతరే%వతారాన్వైచక్రే తాన్ శృణు తత్త్వతః | భృగుశాపా న్మహరాజా ! విష్ణుర్దత్తవరః ప్రభుః. 29 అవతారా ననేకాం స్తుకృతవా నఃలేశ్వరః | రాజా: సందేహో%యం మహాభాగ! హృదయే మదుజాయతే. 30 భృగునా భగవాన్విష్ణుః కథం శప్తః పితామహ | హరిణా చ మునేస్తస్య విప్రియం కిం కృతం మునే. 31 యద్రోషా ద్భృగునా శప్తో విష్ణుర్దేవనమస్కృతః | వ్యాసః: శృణు రాజన్ప్రవక్ష్యామి భృగోః శాపస్య కారణమ్. 32 పురా కశ్యప దాయాదో హిరణ్యకశిపుర్నృపః | యదా తవాసురైః సార్థం కృతం సంఖ్యం పరస్పరమ్. 33 కృతే సంఖ్యే జగ్సర్వం వ్యాకులం సమజాయత | హతే తస్మి న్నృపే రాజా ప్రహ్లాదః సమజాయత. 34 దేవాన్స పీడయామాస ప్రహ్లాదః శత్రుకర్షణః | సంగ్రాహో హ్యభవ ద్ఘోరః శక్రప్రహ్లాదయోస్తదా. 35 పూర్ణం వర్షశతం రాజన్ లోకవిస్మయకారకం | దేవైర్యుద్ధం కృతం చోగ్రం ప్రహ్లాదస్తు పరాజితః. 36 నిర్వేదం పరమం ప్రాప్తో జ్ఞాత్వా ధర్మం సనాతనం | విరోచనసుతం రాజ్యే ప్రతిష్టాప్య బలి నృప! 37 జగామ స తపస్తప్తుం పర్వతే గంధమాదనే | ప్రాప్య రాజ్యం బలిః శ్రీమా న్సురై ర్వైరం చకార హ. 38 అ శ్రీహరి జనార్దనుడు జగన్నాథుడు నగు వాసుదేవుడు యుగయుగములందును ఈ విశాల ప్రపంచమందలి యుత్తమాధమ యోనులందు పెక్కుమారులు జన్మములెత్తి కూర్మ వరాహ వామన నరసింహాద్యవతారములు దాల్చెను. ఇట్లే హరి విధిప్రేరితుడై ప్రతి యుగమునందును లెక్కకు మిక్కిలిగ నవతారము లెత్తుచుండును. ఏడవదియగు వైవస్వత మన్వంతరమందును విష్ణువు పెక్కవతారములు దాల్చెను. ఈ యవతారముల తత్త్వము తెలుపుదును, వినుము : తొల్లి భృగు మహర్షి వలన హరి పలుశాపములనుభవించి తత్ఫలితముగ నతడు పెక్కవతారములు దాల్చెను అన విని రాజిట్లనెను : ఒ మహామతీ! నా యెడదలో మరొక్క సందియము గలుగుచున్నది. భృగుమహర్షి శ్రీ విష్ణువు నేల శపించెను? హరి ముని కేమి యప్రియ మాచరించెను? అమరవందితుడైన శ్రీహరిపై భృగు ఋషి యేల కోపించెను? ఏల శపించెను? అన వ్యాసుడిట్లనెను : ఆ భృగుశాపమునకు కారణము వచింతును. వినుము : మున్ను కశ్యపుని దాయాదుడగు హిరణ్య కశిపుడను దానవుడు గలడు. అతడు దానవులంగూడి తలచినపుడెల్ల దేవతలతో పోరుచుండెను. ఇట్టి పోరాటమున జగములు తల్లడమందుచుండెను. అపుడు శ్రీహరి శ్రీనరహరి రూపమున దనుజపతిని దెగటార్చెను. అంత నతని కుమారుడు ప్రహ్లాదుడు దానవరాజయ్యెను. మహావిక్రమి యగు ప్రహ్లాదుడు దేవతలను మిక్కిలిగ బాధించెను. ఇట్లు దేవదానవపతులకు ఘోరసమరము సంఘటిల్లెను. ఇట్లు వారికి నూఱండ్లు యుద్ధము జరిగెను. అందు తుద కమరపతియే గెలుపొందెను. అంత ప్రహ్లాదుడు వైరాగ్యోపరతుల వలన సనాతన ధర్మమందెఱుకగలిగియుండి తుదకు తన రాజ్యమును విరోచనుని తనయుడగు బలి కప్పగించి తాను తపమాచరింప గంధమాదన గిరి కరిగెను. ఇట బలి రాజై సురలతోడ పగపూనెను. తతః పరస్పరం యుద్ధం జాతం పరమదారుణం | తతః సురైర్జితా దైత్యా ఇంద్రేణా%మితతేజసా. 39 విష్ణునా చ సహయేన రాజ్యభ్రష్టాః కృతా నృప | తతః పరాజితా దైత్యా కావ్యస్య శరణంగతాః. 40 కిం త్వం న కురుషే బ్రహ్మ న్సాహయ్యం నః ప్రతాపవాన్ | స్థాతుం న శక్నుమోహ్యత్ర ప్రవిశామో రసాతలమ్. 41 యది త్వం న సహాయో%సి త్రాతుం మంత్రవిదుత్తమ | ఇత్యుక్తః సో%బ్రవీద్దైత్యాన్కావ్యః కారుణికో మునిః. 42 మా భైష్ట ధారయిష్యామి తేజసా స్వేన భో%సురా: | మంత్రై స్తథౌషధీభిశ్చ సాహాయ్యం వః సదైవ హి. 43 కరిష్యామి కృతోత్సాహా భవంతు విగతజ్వరాః | తత స్తే నిర్భయా జాతా దైత్యాః కావ్యస్య సంశ్రయాత్. 44 దేవైః శ్రుతస్తు వత్తాంతః సర్వైశ్చారముఖాత్కిల | తత్ర సమ్మంత్ర్య తే దేవాః శ##క్రేణ చ పరస్పరమ్. 45 మంత్రం చక్రుః సుసంవిగ్నాః కావ్యమంత్రప్రభావతః | యోద్ధుం గచ్ఛామహే తూర్ణం యావన్నచ్యావయంతివై. 46 ప్రసహ్య హత్వా శిష్టాం స్తు పాతాళం ప్రాపయామహే | దైత్యాన్ జగ్ముస్తతో దేవాః సంరుష్టాః శస్త్రపాణయః. 47 జగ్ము స్తా న్విష్ణు సహితా దానవాన్హరిణోదితాః | వధ్యమానా స్తు తే దైత్యాః సంత్రస్తా భయపీడితాః. 48 కావ్యస్య శరణం జుగ్మూ రక్షరక్షేతి చా%బ్రువన్ | తాన్ శుక్రః పీడితా న్దృష్ట్వా దేవైర్దైత్యాన్మహాబలాన్. 49 మాభైష్టేతి వచః ప్రాహ మంత్రౌషధబలాద్విభూః | దృష్ల్వా కావ్యం సురాః సర్వే త్యక్త్వా తాన్ర్పయయుః కిల. 50 ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ చతుర్థస్కంధే దశమో%ధ్యాయః. అంత వారు పరస్పరము ఘోరముగ పోరు సల్పిరి. అం దమిత తేజోవంతుడగు నింద్రుడు రాక్షసుల నోడించెను. ఇంద్రుడు శ్రీ మహావిష్ణుని సాయమున బలిని రాజ్యభ్రష్టు నొనరించెను. ఓడిన దనుజుల శుక్రాచార్యుని శరణుజొచ్చి ఓ మహాభాగా! నీవు తపోబలవంతుడవు. మాకు సాయమొనర్చుము. లేనిచో మేమిట నిలువ నోపము-రసాతల మేగుదుము. సర్వమంత్ర శాస్త్రవేత్తవగు నీవే మాకు సాహాయ్య మొనర్పవలయును' అనిన వారి మాటలకు దయార్ద్ర హృదయుడైన శుక్రాచార్యుడు వారితో నీ రీతిగ బలికెను మీరు భయపడకుడు. నేను నా తేజమున మీకు సాహాయ్య మొనరించి మిమ్ము కాపాడుదును. మీరుత్సాహవంతులై సంతాపరహితులగునట్లు చేయుదును.'' అపుడు దేవతలుగూడ చారుల వలన వృత్తాంతమంతయు నెఱింగిరి. వారింద్రుని గూడి రహస్య మంత్రణములు జరిపిరి. తుదకు వారొక నిర్ణయమునకు వచ్చిరి. ఆ శుక్రుని మంత్ర ప్రభావమున దనుజులు మనలను పదవీభ్రష్టులుగ జేయకమున్నే మనము వారినెదిరింతము. మనము హతశేషులను పాతాళమున కంపుదము అని తలంచి దేవతలు శస్త్రపాణులై రోషాతిరేకమున రాక్షసులపై కురికిరి. వారు హరిప్రేరితులై హరిసాయమున దనుజుల యుక్కడగింప గడంగిరి. దానవులు బాధితులై భయపీడుతు లైకకావికలైరి. దనుజులు వెంటనే శుక్రుని శరణుజొచ్చి త్రాహిత్రాహి అని మొఱపెట్టుకొనిరి. అపుడు శుక్రుడు దేవపీడితులు - బలరహితులునైన రాక్షసులతో మనకు మంత్రౌషధముల బలముగలదు. భీతిల్లవలదు' అని పలికి వారినూరడించెను. దేవతలెల్లరును శుక్రునిగాంచి యసురులను వదలి వెడలిపోయిరి. ఇది శ్రీ మద్దేవీ భాగవతమందలి చతుర్థ స్కంధమందు దేవ దానవుల యుద్ధమును దశమాధ్యాయము.