Sri Devi Bhagavatam-1
Chapters
అథ త్రయోదశో%ధ్యాయః రాజోవాచ : కిం కృతం గురుణా వశ్చాద్భృగురూపేణ వర్తతా | ఛలేనైవ హి దైత్యానాం పౌరోహిత్యేన ధీమతా.
1 గురుః సురాణా మనిశం సర్వవిద్యానిధి స్తథా | సుతో%ంగిరస ఏవా%సౌ సకథం ఛలకృన్మునిః
2 ధర్మశాస్త్రేషు సర్వేషు సత్యం ధర్మస్య కారణమ్ | కథితం మునిభి ర్యేన పరమాత్మా%పి లభ్యతే.
3 వాచస్పతి స్తథా మిథ్యా వక్తా చే ద్దానవాన్ప్రతి | కః సత్యవక్తా సంసారే భవిష్యతి గృహాశ్రమీ. 4 ఆహారాదధికం భోజ్యం బ్రహ్మాండ విభ##వే%పి న | తదర్థం మునయో మిథ్యా ప్రవర్తంతే కథం మునే. 5 శబ్దప్రమాణ ముచ్ఛేదం శిష్ఠాభావే గతం న కిమ్ | ఛలకర్మ ప్రవృత్తే వా%విగీతత్వం గురౌ కథమ్. 6 దేవాః సత్త్వసముద్భూతా రాజసా మానవాః న్మృతాః | తిర్యంచ స్తామసాః ప్రోక్తా ఉత్పత్తౌ మునిభిః కిల 7 అమరాణాం గురుః సాక్షా న్మిథ్యావాదీ స్వయం యది | తదా కః సత్యవక్తా స్యా ద్రాజసస్తామసః పునః. 8 క్వ స్థితి స్తస్య ధర్మస్య సందేహో%యం మమా%%త్మనః కా గతిః సర్వజంతూనాం మిథ్యాభూతే జగత్త్రయే. 9 హరి ర్ర్బమ్మా శచీకాంత స్తథా%న్యే సురస్తమాః | సర్వే ఛలవిధౌ దక్షా మనుష్యాణాం చ కా కథా. 10 కామక్రోధాభిసంతప్తా లోభోపహత చేతసః | ఛలే దక్షాః సురాః సర్వే మునయశ్చ తపోధనాః 11 వసిష్ఠో వామదేవశ్చ విశ్వామిత్రో గురుస్తథా | ఏతే పాపరతాః కా%త్ర గతిర్ధర్మస్య మానదః. 12 ఇంద్రో%గ్ని శ్ఛంద్రమా వేధాః పరదారాభిలంపటాః | ఆర్యత్వం భువనేష్వేవ స్థితం కుత్ర మునేః వద. 13 పదుమూడవ అధ్యాయము దేవగురువు దానవులను వంచించుట అట్లు ధీశాలియైన బృహస్పతి మోసముతో శుక్రరూపము దాల్చి దైత్యులకు పురోహితుడయ్యెను గదా! ఆ పిదప నతడేమి చేసెను? ఆ దేవగురువు సర్వ విద్యానిధి - అంగిరుని తనయుడు - అంతటి మహాముని యింతటి కపటమునకేల తలపడెను? సత్యము ధర్మమూలమని సకల ధర్మశాస్త్రములు వక్కాణించును. ఆ పరమ సత్యము వలన పరమాత్మ లభ్యమగునని మునులు వక్కాణింతురు. ఆ బృహస్పతి యంతటివాడును దానవులతో మిథ్యావచనములు పలికెను గదా! ఇంక నేలోకములో నేగృహస్థుడు సత్యవాది కాగలడు? ఈ యఖండ బ్రహ్మాండములోని విభవములందు భోజ్యమైన యాహారమును బొందుట కంటె మరేదియును లేదు. అట్టి తిండికొఱకు మునులు సైతము వంకర నడకలు నడతురు. శిష్టులు కొఱవడుట వలన శబ్దము విషయమున ప్రామాణికత్వ భావన తగ్గిపోయినది. ఆ గురునిలోనే నింద్యవర్తన మున్నదే! ఇంక నతనిలో శిష్ట గుణ మెట్లుండును? దేవతలు సత్త్వసంభూతులనియు మనుజులు రజోగుణజనితులనియును జంతువులు తమోగుణజాతము లనియును మునులు వచింతురు. అమరగురు నంతటివాడు తానే మిథ్యావాది యయ్యెనే : ఇంక రజస్తమోగుణములు గల నరులలో సత్యమెవడు పలుకును? ఈ జగత్త్రయము మిథ్యయందు - మాయయను పెంజీకటియందు మునిగి యున్నది. ఇంక సాధారణ జంతువుల కేదిగతి? ధర్మమునకు స్థానమేది? అను సందేహము నాకు గల్గుచున్నది. హరి - బ్రహ్మ - ఇంద్రుడు - ఇతర దేవతలును కపట వర్తనములందు చతురులై యున్నచో ఇంక నల్పబుద్ధులగు నరులమాట చెప్పనేల? ఎల్లదేవతలును తపోధనులగు మునులును కామక్రోధకలుషితులు - లోభోపహత చిత్తులు - కపట రచనా నిపుణులునై వర్తింతురు. వసిష్ఠ వామదేవ విశ్వామిత్రాది మునులును గురువును పాపరతులుగదా! ఇక ధర్మాభ్యుదయమునకు గతియేది? బ్రహ్మ ఇంద్రుడు అగ్ని చంద్రుడు మున్నగు దేవతలును పరస్త్రీ లంపటులు గదా! ఇంక భువనములం దార్యత్వ మెక్కడ నుండును? వచనం కస్య మంతవ్య ముపదేశధియా%నఘ | సర్వే లోభా%భిభూతాస్తే దేవాశ్చ మునయస్తథా. 14 వ్యాసః : కిం విష్ణుః కిం శివో బ్రహ్మా మఘవా కిం బృహస్పతిః | దేహవా న్ప్రభవత్యేవ వికారైః సంయుత స్తదా. 15 రాగీ విష్ణుః శివో రాగీ బ్రహ్మా%పి రాగసం యుతః | ంరాగవాన్కి మకృత్యం వై న కరోతి నరాధిప'' రాగవానపి చాతుర్యా ద్విదేహ ఇవ లక్ష్యతే. 16 సంప్రాప్తౌ సంకటే పో%పి గుణౖః సంబాధ్యతే కిల | కారణా ద్రహితం కార్యం కథం భవితు మర్హతి. 17 బ్రహ్మాదీనాం చ సర్వేషాం గుణా ఏవ హి కారణమ్ | పంచవింశ త్సము ద్భూతా దేహా స్తేషాం న చాన్యథా. 18 కాలే మరణ ధర్మాస్తే సందేహః కో%త్ర తే నృప | పరోపదేశే విస్పష్టం శిష్టాః సర్వే భవంతి చ. 19 విప్లుతి ర్హ్యవిశేషేణ స్వకార్యే సముపస్థితే | కామః క్రోధో స్తథా లోభద్రోహా2హంకారమత్సరాః. 20 దేహవాన్కః పరిత్యక్తు మీశో భవతి తాన్పునః | సంసారో%యం మహారాజ సదైవైనం విధః స్మృతః 21 నా%న్యథా ప్రభవత్యేవ శుభాశుభమయః కిల | కదాచిగ్భగవాన్విష్ణు స్తపశ్చరతి దారుణమ్. 22 కదాచి ద్వివిధా న్యజ్ఞా న్వితనోతి సురాధిపః | కదాచిత్తు రమారంగరంజితః పరమేశ్వరః 23 రమతే కిల వైకుంఠే తద్వశ స్తరుణో విభుః | కదాచి ద్దానవైః సార్థం యుద్ధం పరమదారుణమ్. 24 కరోతి కరుణాసింధు స్తద్బాణా%%పీడితో భృశమ్ | కదాచి జ్జయ మాప్నోతి దైవాత్సో%పి పరాజయమ్. 25 సుఖ దుఃఖాభిభూతో%సౌ భవత్యేవ న సంశయః | శేషే శేతే కదాచిద్వై యోగనిద్రాసమావృతః. 26 ఎల్ల సురలును మునులను లోభముచే అభిభూతులై యున్నారు. ఇంకెవరి వాక్కుల నుపదేశ రూపమున మననము చేయవలయును? అని జనమేజయుడు ప్రశ్నింపగా వ్యాసమహర్షి యిట్లనెను : బ్రహ్మయేమి? విష్ణువేమి? శివుడేమి? ఇంద్రుడేమి? దేహధారియైన ప్రతివాడును ప్రకృతి వికారములతో బుట్టుచుండును. బ్రహ్మయును విష్ణువును శివుడును నెల్లరును రాగవంతులే. రాగవంతుడు చేయని యకృత్య మేముండును? రాగి తన నేర్పుచే పైకి ముక్తుని పగిది గనబడును. కాని, కష్టములు కలిగిన తఱి ప్రతి రాగవంతుడును గుణములచేత బద్దుడగును. కారణము లేక కార్యమెట్లుండును? బ్రహ్మాది దేవతలకును విడదీయ రాని త్రిగుణములే కారణభూతములు. వారి దేహములు సైతము పంచవింశతి తత్త్వముల వలన బుట్టుచుండును. కాని, మరొక విధముగ గావు. ఎల్లరును కాలము సమీపించగనే మరణించవలసినదే. ఇందు రవంతయును సందియము లేదు. అందఱు నితరుల కుపదేశించుటలో శిష్టులే. ఏదైన పని జరుగవలసి వచ్చినచో మొదట స్వభావమున కలత బయలుదేరును. ఆ పిదప కామక్రోధ లోభములును ద్రోహమత్సరములును అహంకారమును బుట్టును. తరువాత పని సాధ్యమగును. వీనినన్నిటి నేదేహియును వదలజాలడు. ఈ ప్రపంచ మెల్లప్పుడు నిదేవిధముగ సాగుచుండునని పెద్దలందురు. ఈ ప్రపంచము మంచి చెడ్డల కలయిక. కనుక నీ భావ పరంపరలకు భిన్నముగ ప్రపంచ ముద్భవించును. ఒకప్పుడు విష్ణుభగవాను డంతటివాడే ఘోరతరముగ తపమాచరించును. ఒకప్పుడు సురపతియును పెక్కు జన్నము లాచరించును. అతడే వేరొకప్పుడు రమణీ విలాసములకు రంజితుడగును. విష్ణువు వైకుంఠ ధామ మందు లక్ష్మీపరవశుడై యామెతో లీలావినోదము లందును. అతడే యింకొకప్పుడు ఘోరదానవులతో దారుణ రణ మొనరించును. విష్ణువు సహజముగ దయాసముద్రుడే! ఐనను నతడును పోరు సల్పును. తీవ్రమగు వైరిబాణములచే బాధింపబడును. ఒకప్పుడు దైవయోగమున జయమో పరాజయమో పొందుచుండును. ఇట్లు శ్రీనాథుడైన హరియు సుఖ దుఃఖములలో పరిభ్రమించు చుండును. ఇందు శంక రవంతయును లేదు. ఒకప్పుడా విష్ణువే శేషశయ్యపై యోగనిద్రా ముద్రితుడగును. కాలే జాగర్తి విశ్వాత్మా స్వభావప్రతిబోధితః | శర్వో బ్రహ్మా హరిశ్చేత ఇంద్రాద్యా యే సురాస్తథా. 27 మునయశ్చ వినిర్మాణౖః స్వాయుషో విచరంతి హి | నిశా%వసానే సంజాతే జగత్థ్సావరజంగమమ్. 28 మ్రియతే నాత్ర సందేహో నృప కించిత్కదా%పి చ | స్వాయుషో%ంతే పద్మజాద్యాః క్షయమృచ్ఛంతి పార్థివ. 29 ప్రభవంతి పునర్విష్ణు హరిశకాద్రయః సురాః | తస్మా త్కా మాదికా న్భావా న్దేహవా న్ప్రతిపద్యతే. 30 నాత్ర తే విస్మయః కార్యః కదాచిదపి పార్థివ | సంసారో%యం తు సందిగ్ధః కామక్రోధాదిభిర్నృప. 31 దుర్లభ స్తద్వినిర్ముక్తః పురుషః పరమార్థవిత్ | యో భిభర్తీహ సంసారే స దారా న్నకరోత్యపి. 32 విముక్తః సర్వసంగేభ్యో విచర త్యవిశంకితః | తస్మా ద్బృహస్పతే ర్భార్యా శశినా లంభితా పునః. 33 గురుణా లంభితా భార్య తథా భ్రాతుర్యవీయసః | ఏవం సంసారచక్రే%స్మి న్రాగలోభాదిభి ర్వృతః. 34 గార్హస్థ్యం చ సమాస్తాయ కథం ముక్తోభ##వేన్నరః | తస్మా త్సర్వప్రయత్నేన హిత్వా సంసారసాగరాత్. 35 ఆరాధయే న్మహేశానీం సచ్చిదానందరూపిణీమ్ | తస్యా యా గుణత శ్ఛన్నం జగదేత చ్చరాచరమ్. 36 భ్రమత్యున్మ త్తవత్సర్వం మదిరామత్తవ న్నృప | తస్యా ఆరాధనేనైవ గుణా న్సర్వా న్విమృద్వ చ. 37 ముక్తిం భ##జేత మతిమా న్నాన్యః పంథాస్త్వితః పరః | ఆరాధితా మహేశానీ న యావత్కురుతే కృపామ్. 38 ఆ విష్ణువు యథా సమయమున స్వభావముచే ప్రతిబోధితుడై మేల్కొనును. బ్రహ్మ - హరి - శివుడు - ఎల్లదేవతలును ఎల్ల మునులును తమకాయు వున్నంత కాలముచు సంచరింతురు. రాత్రి తొలగిపోగా స్థావర జంగమాత్మకమైన జగములు తిరిగి సంభవించును. రాత్రి రాగా నంతయును మరల మహాప్రళయమందు కలియును. ఇందు సందేహము లేదు. బ్రహ్మాదులును తమ తమ యాయువులు తీరగనే సంక్షయ మొందుదురు. మరల బ్రహ్మ విష్ణువు శివుడు ఇంద్రాది దేవతలు తేజో దేహములతో సముద్భవింతురు. వారు మరల తమ తమ కామాది స్వభావములను పూర్వశక్తులను బొందుచుందురు. ఈ ప్రపంచము కామక్రోధాదుల కలయికలో నిరంతరముగ సాగుచుండును. ఇట్టి జగము గూర్చి నీవు విస్మయమంద బనిలేదు. ఈ విశ్వమున పరమార్థ విదుడును సంసార నిర్ముక్తుడైన యుత్తమ పురుషుడు లభించుట కడు కష్టము. ఈ సంసార బాధలకు భయపడువాడు పెండ్లి చేసికొనడు. అట్టివాడు సర్వసంగ పరిత్యాగముతో నిశ్చింతుడై చరించును. తొల్లి చంద్రుడు తన గురుని భార్యతో సంగమించెను. ఆ గురుడు తన తమ్ముని భార్యను గూడెను. ఈ రీతిగ నీ సంసార చక్రము రాగలోభాదులతో కలిసి నిరంతరము తిరుగుచుండును. గృహస్థ జీవనయాత్ర సాగించు నరుడే వైరాగ్యముతో సంసారము నిస్సారమని కర్మములు వదలవలయును. ఆ విరాగి సచ్చిదానంద స్వరూపిణియైన శ్రీ రాజరాజేశ్వరి నారాధింప వలయును. ఈ చరాచర జగములా త్రిభునేశ్వరి మాయాశక్తిచే నావరింపబడి యుండును. ఈ జగములు మదిరామత్తునివలె పిచ్చివానిరీతి నెడతెగక పరిభ్రమించుచుండును. ఆ జగన్మాత నారాధించినవాడు మాయాగుణముల నుండి విడివడును. మతిమంతుడు. ముక్తి నందవలయును. దీనిని మించిన సన్మార్గము మరొకటి లేదు. బుద్ధిమంతుడు జగదేక మాతను సేవించి దయామృతమునకు పాత్రుడు గావలయును. తావ ద్భవేత్సుఖం కస్మాత్కో%న్యో%స్తి దయయా యుతః | కరునాసాగరా మేతాం భ##జే త్తస్మా దమాయయా. 39 యస్యా స్తు భజనేనైవ జీవన్ముకత్త్వ మశ్నుతే | మానుష్యం దుర్లభం ప్రాప్య సేవితా న మహేశ్వరీ. 40 నిః శ్రేణికాగ్రా త్పతితా అధ ఇత్యేవ విద్మహే | అహంకారావృతం విశ్వం గుణత్రయ సమన్వితమ్. 41 అసత్యేనాపి సంబద్ధం ముచ్యతే కథ మన్యథా | హిత్వా సర్వం తతః సర్వైః సంసేవ్యా భువనేశ్వరీ. 42 రాజా: కిం కృతం గురుణా తత్ర కావ్య రూపధరేణ చ | కదా శుక్రః సమాయాత స్తన్యే బ్రూహి పితామహ. 43 వ్యాసః : శృణు రాజ న్ప్రపక్ష్యామి యత్కృతం గురుణా తదా | కృత్వాకావ్యస్వరూపంచ ప్రచ్ఛన్నే నమహాత్మనా. 44 గురుణా బోధితా దైత్యా మత్వా కావ్యం స్వకం గురుమ్ | విశ్వాసం పరమం కృత్వా బభూవు స్తన్మయాస్త దా. 46 దశ వర్షాత్మకే కాలే సంపూర్ణసమయే తదా | జయంత్యా సహ క్రీడిత్వా కావ్యో యాజ్యానచింతయత్. 47 ఆశయా మమ మార్గం తే పశ్యంతః సంస్థితాః కిల | గత్వా తాన్వై ప్రపశ్యే%హం యాజ్యానతి భయాతురాన్. 48 మా దేవేభ్యో భయం తేషాం మద్భక్తానాం భ##వేదితి | సంచిత్య బుద్ధి మాస్థాయ జయంతీం ప్రత్యువాచ హ. 49 దేవానేనోపసంయాంతి పుత్రా మే చారులోనే | సమయస్తే%ద్య సంపూర్ణో జాతో%యం దశవార్షికః. 50 అట్లు పాత్రుడు గానంతవరకు అమృతానంద మెట్లు గల్గును? ఆ దయావతీమతల్లి యగు తల్లికి గాక మనపై నితరుల కెవ్వరికి దయ కలుగును? కనుక విశుద్ధ చిత్తముతో నా దయామృతనిధిని భజింపవలయును. ఏ యమ్మలయమ్మను సేవించిన నరుడు జీవన్ ముక్తుడగునో అట్టి దేవిని దుర్లభమగు మనుజ జన్మ నెత్తియు ప్రాణి సేవించనిచో అట్లు మాతను గొలువనివాడు నిచ్చెనపై నుండి క్రిందపడినవాని వంటివాడు. ఈ త్రిగుణమయమైన విశ్వ మహంకారమయము. ఈ జగము సత్యముచే బద్ధమైనది. ఆమెను సేవింపక నరుడు ముక్తుడెట్లు కాగలడు? కనుక మానవుడు సకలమును పరిత్యజించి శ్రీ త్రిభువనేశ్వరీ దేవిని సంసేవింపవలయును. జనమేజయు డిట్లనియెను : ఓ పితామహా! అట్లు గురుడు శుక్ర రూపము దాల్చి యేమి చేసెను? శుక్రుడెన్నడు తిరిగి రాగల్గెను? నాకంతయు దెలుపుము' అన వ్యాసు డిట్లు పలికెను. రాజా! అట్లు శుక్ర రూపమున దాగియున్న మహాత్ముడు బృహస్పతి పిదప నేమి చేసెనో తెలుపుదు నాలింపుము. దైత్యులు గురువును తమ గురునిగ భావించి యతని పట్ల విశ్వాసము గల్గి తన్మయులై యతని యానమేర మీఱకుండిరి. దైత్యులు బహుకాలము శుక్రుని వియోగమున మ్రగ్గిరి. కాన వారు గురు మాయామోహితులైరి. వారు విద్యకై శుక్రరూపుని శరణు జొచ్చిరి. ఈ లోకమందెంతటివాడును లోభమునకు వశుడగును గదా! అట నటుల శుక్రుడు జయంతిని గూడి పదేండ్లు నిండుగ క్రీడించెను. ఆ పిదప శుక్రునకు తన యాజ్యులగు దానవజనము జ్ఞప్తికి వచ్చెను. దైత్యులు నా మీద కొండంత యాస పెట్టుకొని నాకై యెదురుతెన్నులు చూచుచుందురు. నేనిపుడే వెళ్ళి వారిని గందును. వారు భయాతురులు, నా భక్తులు, వారికి దేవతల భయము గలుగకుండుత! అని మదినెంచి శుక్రుడు జయంతితో ఇటుల పలికెను: చారునేత్రీ! నా పుత్రులు దేవతలకు లొంగిపోయిరి. నీ పదేండ్ల గడువు పూర్తియైనది. తస్మా ద్గచ్ఛామ్యహం దేవి ద్రష్టుం యాజ్యాన్సుమధ్యమే | పునరేవా22గమిష్యామి తవాంతిక మనుద్రుతః. 51 తథేది తమువాచ%థ జయంతీ ధర్మ విత్తమా | యథేష్టం గచ్ఛ దర్మజ్ఞ న తే ధర్మం విలోపయే. 52 తచ్ఛ్రుత్వా వచనం కావ్యో జగామ త్వరిత స్తతః | అపశ్యద్దానవానాం స పార్మ్వే వాచస్పతిం తదా. 53 ఛద్మరూపధరం సౌమ్యం బోధయంతం ఛలేన తాన్ | జైనం ధర్మం కృతం స్వేన యజ్ఞనిందాపరం తథా. 54 భో దేవరిపవః సత్యం బ్రవీమి భవతాం హితమ్ | అహింసా పరమో ధర్మో హంతవ్యా హ్యాతతాయినః. 55 ద్విజై ర్భోగరతై ర్వేదే దర్శితం హింసనం పశోః | జిహ్వాస్వాదపరైః కామ మహింసైవ పరా మతా. 56 ఏవం విధాని వాక్యాని వేదశాస్త్ర పరాణిచ | బ్రువాణం గురు మాకర్ణ్య విస్మితో%సౌభృగోఃసుతం. 57 చింతయామాస మనసా మమ ద్వేష్యో గురుః కిల | వంచితాః కిల ధూర్తేన యాజ్యా మే నాత్ర సంశయః. 58 ధిగ్లోభం పాపబీజం వై నరకద్వార మూర్జితమ్ | గురు రప్యనృతం బ్రూతే ప్రేరితో యేన పాప్మనా. 59 ప్రమాణ వచనం యస్య సో%పి పాఖండ ధారకః | గురుః సురూణాం సర్వేషాం ధర్మశాస్త్ర ప్రవర్తకః. 60 కిం కిం న లభ##తే లోభా న్మలినీకృత మానసః | అన్యో%పి గురు రప్యేవం జాతః పాఖండపండితః. 61 శైలూషచేష్టితం సర్వం పరిగృహ్య ద్విజోత్తమః | వంచయత్యతి సంమూఢా న్దైత్యాన్యాజ్యాన్మమాప్యసౌ. 62 ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ చతుర్థ స్కంధే త్రయోదశో%ధ్యాయః. కనుక నో సుమధ్యమా! నే నిపుడే వెళ్ళి నావారిని గని తిరిగి వేగిరమే నీ ముంగిటికి చేరుకొందును అనగా ధర్మవిత్తమురాలగు జయంతో ఓ ధర్మజ్ఞ! సరి. నీ యిష్టానుసారము గానిమ్ము. నేను నీకు ధర్మలోపము గలిగింప'నని శుక్రునితో ననెను. ఆ మాటలు విని శుక్రుడు త్వరితగతి నరిగి దానవుల చెంత నున్న బృహస్పతిని గనెను. బృహస్పతి కపట వృత్తితో యజ్ఞములు నిందించు జైన ధర్మమును దానవులకు బోధించుచుండెను. ఓ యమరవైరులారా! మీ మేలుగోరి నేను నిజము పలుకుచున్నాను. అహింస పరమధర్మము. కాన దుష్టులనుగూడ చంపరాదు. బ్రాహ్మణులు జిహ్వాచాపల్యముతో భోగాసక్తితో వేదములందు పశుహింస తగిన దనిరి. కాని, యహింసయే పరమధర్మము సుమా! అని యిట్లు గురుడు వేదశాస్త్రములు నిందించుచు బలుకుచున్న మాటలు శుక్రుడు విని ఆశ్చర్యమందెను. అపుడు శుక్రుడు మదిలో నిట్లు తలపోసెను: ఈ గురువు నాకు పరమశత్రువు. ఈ ధూర్తుని మూలమున నావారు వంచింపబడిరి. లోభము కడుంగడు చెడ్డది. ఇది పాపబీజము. నరకద్వారము. ఆ లోభమునకు లొంగి గురుడంతటివాడు నబద్ధములు ప్రచారము చేయుచున్నాడు. దేవతలందఱకు గురువు గురువు, అతడు ధర్మశాస్త్ర ప్రవర్తకుడు. ఎల్లరకు గురువాక్యము ప్రమాణము గద! నేడట్టి గురువే పాఖండమతము బూనెను గదా! ఇట్లు గురువే పాఖండ పండితడయ్యెననిన ఇంక కలుషచిత్తులైన యితరులు లోభవశమున నేమేమి చేయుదురో కదా! నా యాజ్యులు దానవులు మిక్కిలి మూఢాత్ములు. వీరిని నే డీ ద్విజోత్తముడు నటుని వేసము దాల్చి మిక్కిలి మోసగించుచున్నాడు. ఇది శ్రీ మద్దేవీ భాగవత చతుర్థ స్కంధమందు దేవగురువు దానవులను వంచించుటయను త్రయోదశాధ్యాయము.