Sri Devi Bhagavatam-1
Chapters
అథాష్టమోధ్యాయః ఋషయఊచుః: సందేహో%త్రమహాభాగకథాయాంతుమహాద్భుతః!వేదశాస్త్రపురాణౖశ్చనిశ్చితం తు సదాబుధైః.
1 బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చ త్రయో దేవాః సనాతనాః | నాతః పరతరం కించి ద్బ్రహ్మాండే%స్మి న్మహామతే.
2 బ్రహ్మా సృజతి లోకాన్ వై విష్ణుః పాత్యఖిలం జగత్ | రుద్రః సంహరతే కాలే త్రయ ఏతే%త్ర కారణమ్. 3 ఏకా మూర్తి స్త్రయో దేవా బ్రహ్మవిష్ణుమహేశ్వరాః | రజస్సత్త్వతమోభిశ్చ సంయుతాః కార్యకారకాః.
4 తేషాం మధ్యే హరిః శ్రేష్ఠో మాధవః పురుషోత్తమః | ఆదిదేవో జగన్నాథః సమర్థః సర్వకర్మసు.
5 నాన్యః కో%పి సమర్థో%స్తి విష్ణో రతులతేజసః | స కథం స్వాపితః స్వామీ వివశో యోగమాయయా.
6 క్వ గతం తస్య విజ్ఞానం జీవత శ్చేష్టితం కుతః | సందేహో%యం మహాభాగ కథయస్వ యథాశుభమ్.
7 కా సా శక్తిః పురా ప్రోక్తా యయా విష్ణు ర్జితః ప్రభుః | కుతో జాతా కథం శక్తా కా శక్తి ర్వద సువ్రత!
8 యస్తు సర్వేశ్వరో విష్ణు ర్వాసుదేవో జగద్గురుః | పరమాత్మా పరానందః సచ్చిదానందవిగ్రహః.
9 సర్వకృ త్సర్వభృ త్స్రష్టా విరజాః సర్వగః శుచిః | స కథం నిద్రాయా నీతః పరతంత్రః పరాత్పరః.
10 ఏత దాశ్చర్యభూతో హి సందేహో నః పరంతప | ఛింధి జ్ఞానాసినా సూత వ్యాసశిష్య మహామతే!
11 ఎనిమిదవ అధ్యాయము సర్వశక్తి స్వరూపిణి యారాధ్య దేవతయనుట ఋషులిట్లనిరి : మహానుభావా! వేదశాస్త్ర పురాణములను పండితుల వచనములను వినుటవలన మా హృదయము లందొక నిశ్చయమై యున్నది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మువ్వురే సనాతనదేవతలు. ఈ బ్రహ్మాండములందు వీరిని మించిన దెద్దియును లేదని మా నిశ్చయము. కాల పాకవశమున తమ్మిచూలి లోకములు నిర్మించును. తమ్మికంటి బ్రోచును. ముక్కంటి లయింపజేయును. వీరే యన్నిటికి కారణభూతులు. పూర్వమొకటే సద్రూపముండెను. అదే మువ్వురు దేవతలుగ మారెను. ఆ ముగ్గురును సత్త్వము రజస్సు తమస్సను గుణములుగలవారు. వారే బ్రహ్మ హరి హరులు. సకల కార్యకరణ దక్షులు. ఆ మువ్వురిలోన శ్రీ విష్ణుభగవానుడు శ్రేష్ఠతముడు. ఆతడే యాదిదేవుడు - పురుషోత్తముడు - మాధవుడు - జగన్నాథుడు - కార్యదక్షుడు అని పేరొందెను. ఆ మహాతేజస్వియగు హరి యెదుట నిలువబడి యతనిని కాదని యెవ్వడు నేదియు జేయనోపడు. అంతటి లోకైకనాథుని సైతము వివశునిగజేసి యోగమాయ నిద్రపుచ్చినది. ఆ విష్ణుని యద్భుతమైన లీలలును విజ్ఞానమును కార్యాచరణసమర్థతయు నేడేమైనవి? మాకీ విషయమై సందియము గలుగుచున్నది. కనుక మా మనస్సులకు నచ్చునట్టు ఈ సందియమును తీర్చుము. భగవంతుడగు హరిని గూడ జయించిన మా మహాశక్తి యెవరు? ఆమె యెవరి మూలమున నంతగొప్పది యైనది? ఆమెకు అంత సామర్థ్యమెక్కడిది? ఆమెను మహాశక్తియని యేల పిలుతురు? సర్వేశ్వరుడు సచ్చిదానంద విగ్రహుడు పరమాత్మ పరానందుడు వాసుదేవుడు జగద్గురువు శ్రీ విష్ణువు. సకల కర్త - సర్వవ్యాప్తి - పరాత్పరుడు - విరజుడు - పావనుడునగు శ్రీ హరి నిద్రకెట్లు లొంగిపోయెను? మాకిదంతయును మిగుల నాశ్చర్యమును సందేహమును గొల్పుచున్నది. నీ తెలివియను కత్తితో మా యీ సందియమును ఛేదించుము. సూత ఉవాచ : NRPM ƒ«sLi®µ…[x¤¦¦¦Li À³Áƒ«s¾»½[òQùƒ«s \¾»½QûÍÜ[ZNP[ù xqs¿RÁLS¿RÁlLi[ e
ముహ్యంతి మునయః కామం బ్రహ్మపుత్రాః సనాతనాః. 12
నారదః కపిలశ్చైవ ప్రశ్నే %స్మి న్మునిసత్తమాః | కిం బ్రవీమి మహాభాగా దుర్ఘటే%స్మి న్విమర్శనే. 13
వేదేషు విష్ణుః కథితః సర్వగ స్సర్వపాలకః | యతో విరాడిదం సర్వ ముత్పన్నం సచరాచరమ్. 14
తే సర్వే సముపాసంతే నత్వా దేవం పరాత్పరమ్ | నారాయణం హృషీకేశం వాసుదేవం జనార్దనమ్. 15
తథా కేచి న్మహాదేవం శంకరం శశిశేఖరమ్ | త్రిణత్రం పంచవక్త్రం చ శూలపాణిం వృషధ్వజమ్. 16
తథా వేదేషు సర్వేషు గీతం నామ్నా త్రియంబక్ | కపర్దినం పంచవక్త్రం గౌరీదేహార్ధధారిణమ్. 17
కైలాసవాసనిరతం సర్వశక్తి సమన్వితమ్ | భూతబృందయుతం దేవం దక్షయజ్ఞవిఘాతకమ్. 18
తథా సూర్యం వేదవిదః సాయం ప్రాత ర్దినేదినే | మధ్యాహ్నే తు మహాభాగాః స్తువంతి వివిధైఃస్తవైః. 19
తథా వేదేషు సర్వేషు సూర్యోపాసనముత్తమమ్ | పరమాత్మేతి విఖ్యాతం నామ తస్య మహాత్మనః. 20
అగ్ని ః సర్వత్ర వేదేషు సంస్తుతో వేదవిత్తమైః ఇంద్రశ్చాపి త్రిలోకేశో వరుణశ్చ తథా%పరః. 21
యథా గంగా ప్రవాహైశ్చ బహుభిః పరివర్తతే | తథైవ సర్వదేవేషు విష్ణుః ప్రోక్తో మహర్షిభిః. 22
త్రీణ్యవ హి ప్రమాణాని పఠితాని సుపండితై ః | ప్రత్యక్షం చానుమానం చ శాబ్దంచైవ తృతీయకమ్. 23
చత్వార్యేవేతం ప్రాహు రుపమానయుతాని చ | అర్థాపత్తి యుతాన్యన్యే పంచ ప్రాహ్యు ర్మ హాదియః. 24
సప్త పౌరాణికాశ్చైవ ప్రవదంతి మనీషిణః | ఏతైః ప్రమాణౖ ర్దుర్జేయం య ద్బ్రహ్మ పరమం చ తత్. 25
సూతు డిట్లనియె : ఈ చరా చర ప్రపంచములందీ సందియమును దీర్పగలవాడొక్కడునులేడు. బ్రహ్మతనయులగు సనాతనమునులే దీనికి ముగ్ధులైరి. నారదుడు కపిలుడు మున్నగువారలే యీ ప్రశ్నను సమాధానించలేక పోయిరి. ఇక దీనిని విమర్శించుటకు నే నెవడను? ఆ విష్ణువే సర్వగుడు సర్వపాలకుడునని వేదములందు గలదు. ఆతని వలననే యీ చరా చర విరాడ్రూపము పుట్టినదని యందు వర్ణింప బడెను. వేలుపు లెల్లరును శ్రీ మన్నారాయణుడు విశ్వాకారుడు హృషీకేశుడు జనార్దనుడు మేఘవర్ణుడునగు విష్ణునకు దోసిలియొగ్గి యుపాసింతురు. కొందఱు చంద్రమౌళి ముక్కంటి పంచవక్త్రుడు వృషవాహనుడు మహాదేవుడు వామదేవుడు సకల నిగమసన్నుతుడు కపర్ది గౌరీదేహార్ధధారి సర్వశక్తి యుక్తుడు దక్షయాగ విధ్వంసకుడునగు శ్రీ సాంబసదా శివుని నిచ్చలు నభిషేకాదులతో సేవించుచుందురు. మఱి కొందఱు వేదవేత్తలు మూడు సంధ్యలందును పెక్కు స్తోత్రములతో పరమసత్య స్వరూపుడగు సవితృదేవుని ధ్యానించి జపింతురు. వేదములన్నియును సూర్యోపాసనమే యుత్తమమనియు సూర్యనారాయణుడే పరమాత్మయనియు నొక్కి వక్కాణించినవి. ఇంకను కొందఱు బ్రహ్మ విదులు నిగమములు పలికిన విధముగ నగ్నిని లోకపాలకుడగు నింద్రుని వరుణుని సంస్తుతింతురు. ఎల్ల ప్రవాహములతో గలిసి ప్రవహించు పావనగంగ నదులలో నుత్తమోత్తమమై యలరును. అఖిల దేవగణములందు పద్మనాభుడు పురుషోత్తముడై తనరును అని మహర్షులు వచింతురు. ఇక ప్రమాణములు ముత్తెఱంగులని పండితులు వాక్రుత్తురు. అవి ప్రత్యక్షము-అనుమానము-శబ్దముననబడును. కొందఱు వానిలో నుపమానమును జేర్చి నాలుగందురు. మఱి కొందఱు వానిలో నర్థాపత్తిని గలిపి ప్రమాణము లైదని పలుకుదురు. మనీషులు వానితో నితిహాసమును పురాణమును గలిపి సప్త ప్రమాణములు గలవందురు. ఇన్ని ప్రమాణములచే గూడ నా పరబ్రహ్మము పరాశక్తి వారికెంతమాత్రమును తెలియబడదు.
వితర్క శ్చాత్ర కర్తవ్యో బుద్ధ్యా చైవాగమేన చ | నిశ్చయాత్మికయా యుక్త్యా వాచార్య చ పునః పునః. 26
ప్రత్యక్షతస్తు విజ్ఞానం చింత్యం మతిమతా సదా | దృష్టాంతేనాపి సతతం శిష్టమార్గానుసారిణా. 27
విద్వాంసో%పి వదంత్యేవం పురాణౖః పరిగీయతే | ద్రుహిణ సృష్టిశక్తిశ్చ హరౌ పాలనశక్తితా. 28
హరే సంహారశక్తిశ్చ సూర్యే శక్తిః ప్రకాశికా | ధరాధరణశక్తిశ్చ శేషే కూర్మే తథైవ చ. 29
సా%%ద్యా శక్తి ః పరిణతా సర్వస్మి న్యా ప్రతిష్ఠితా | దాహశక్తి స్తథా వహ్నౌసమీరే ప్రేరణాత్మికా. 30
శివో%పి శవతాం యాతి కుండలిన్యా వివర్జితః | శక్తి హీనస్తు యః కశ్చి దసమర్థః స్మృతో బుధైః. 31
ఏవం సర్వత్ర భూతేషు స్థావరేషు చరేషు చ | బ్రహ్మాదిస్తంబపర్యంతం బ్రహ్మాండే%స్మి న్మహాతపాః. 32
శక్తి హీనం తు నింద్యం స్యా ద్వస్తుమాత్రం చాచరమ్ | అశక్తః శత్రువిజయే గమనే భోజనే తథా. 33
ఏవం సర్వగతా శక్తి ః సా బ్రహ్మేతి వివిచ్యతే | యోపాస్యా వివిధైః సమ్య గ్విచార్యా సుధియా సదా. 34
విష్ణౌ చ సాత్వికీ శక్తి స్తయా హీనో%ప్యకర్మకృత్ | ద్రుహిణ రాజసీ శక్తి ర్యయా హీనో హ్యసృష్టికృత్. 35
శివే చ తామసీ శ క్తి స్త యా సంహారకారకః | ఇత్యూహ్య మనసా సర్వం విచార్య చపునఃపునః. 36
స్థితప్రజ్ఞుడు తన నిశ్చయాత్మక బుద్ధిచే వేదాంతార్థములచే నాత్మతత్త్వమును గూర్చి తనయందే స్వాత్మతత్త్వం విచారణ చేయుచుండవలయును. ప్రత్యక్షవస్తు విజ్ఞానముచే బుద్ధిమంతుడు మాటి మాటికిని విత్కరించుచు ఆత్మ చింతన చేయవలయును. తాను దృష్టాంతములతో తన నిజ స్వరూపమును విమర్శించుకొన వలయును. ఆప్తులుదెలుపు సత్య మార్గమున నడువవలయును. ఈ విధముగ స్వాత్మదర్శనము విషయమున పండితులు నుడుపుదురు ఎల్లపురాణములందు నిట్లే కలదు. బ్రహ్మయందు సృజనశక్తి శ్రీ విష్ణువునందు పరిపాలన శక్తి గలదు. రుద్రునియందు సంహారక శక్తి సూర్యునిలోన ప్రకాశన శక్తి శేషునందు కూర్మమునందు భూభరణ శక్తి అగ్నియందు దహనశక్తి వాయువునందు ప్రేరణశక్తి మున్నగు నీ శక్తులన్నియు నా మహాశక్తి పరిణామ స్వరూపములే. కుండలినీ శక్తికి దూరమైనచో శివుడును శవత్వమందును. శక్తి రహితుని పండితులు వీడు చేతకాని వాడని దెప్పుదురు. కాన నీ స్థావర జంగమాత్మకమైన బ్రహ్మాండ మందు గడ్డి మొదలు బ్రహ్మ వఱకుగల భూతములన్నిటి యందు నిటులే శక్తి నిండి యిమిడి వెలుగొందును. అట్టి శక్తిలేని చరాచర వస్తువులు పనికిమాలినవే. శక్తిహీనుడు నడచుటకును తినుటకును పరుల గెలుచుటకును పనికిరాడు. అట్టి సర్వగత మగు శక్తినే పరబ్రహ్మమందురు. ఆ విశ్వశక్తి నాత్మరతితో తెలివివెలుగుతో విచారించి పెక్కుగతుల నిత్యము నుపాసింప వలయును. విష్ణునందు సాత్విక శక్తి గలదు. దానినతడు గోల్పోయినచో నతని యాట కట్టినట్లే. బ్రహ్మయందు రాజస శక్తి గలదు. అది లోపించినచో నతని రచన యాగినట్టే. శివునియందు తామస శక్తి గలదు. దానిచే నతడు సంహారమొనర్పగల్గును అని యిట్లు చక్కగ నెఱింగి వ్యక్తి తన శక్తిని దాను తెలిసి కొనవలయును.
శక్తిః కరోతి బ్రహ్మాండ సా వై పాలయతే%ఖిలమ్ | ఇచ్ఛయా సంహరత్యేషా జగ దేత చ్చరాచరమ్. 37
న విష్ణు ర్న హరః శక్రో న బ్రహ్మాన చ పావకః | న సూర్యో వరుణః శక్తః స్వే స్వే కార్యే కథంచన. 38
తయా యుక్తా హి కుర్వంతి స్వాని కార్యాణి తే సురాః | సైవ కారణకార్యేషు ప్రత్యక్షే ణావగమ్యతే. 39
సగుణా నిర్గుణా సా తు ద్విధా ప్రోక్తా మనీషిభిః | సగుణా రాగిభిః సేవ్యా నిర్గుణా తు విరాగిభిః. 40
ధర్మార్థకామమోక్షాణాం స్వామినీ సా నిరాకులా | దదాతి వాంఛితా న్కామా న్పూజితా విధిపూర్వకమ్. 41
న జానంతి జనా మూఢా స్తాం సదా మాయయా వృతాః | జానంతో%పి నరాః కేచి న్మోహయంతి పరానపి. 42
పండితాః స్వోదరార్ధం వై పాఖండాని పృథక్‌పృథక్ | ప్రవర్తయంతి కలినా ప్రేరితా మందచేతసః. 43
కలా వస్మి న్మహాభాగ నానాభేదసముత్థితాః | నాన్యే యుగే తథా ధర్మో వేదబాహ్యాః కథంచన. 44
విష్ణు శ్చరత్య సావుగ్రం తపో వర్షా ణ్యనేకశః | బ్రహ్మా హర స్త్రయో దేవా ధ్యాయంతః కమపి ధ్రువమ్. 45
కామయానాః సదా కామం తే త్రయః సర్వదైవహి | యజంతి యజ్ఞా న్వివిధాన్ బ్రహ్మవిష్ణుమహేశ్వరాః. 46
తే వై శక్తిం పరాం దేవీం బ్రహ్మాఖ్యాం పరమాత్మికామ్ | ధ్యాయంతి మనసా నిత్యం నిత్వాం మత్వాసనాతనీమ్. 47
తస్మా చ్ఛక్తిః సదా సేవ్యా విద్వద్భిః కృతనిశ్చయైః | నిశ్చయంః సర్వశాస్త్రాణాం జ్ఞాతవ్యో మునిసత్తమాః. 48
కృష్ణా చ్ఛ్రుతం మయా చైత త్తేన జ్ఞాతం తు నారదాత్ | పితుః సకాశా త్తేనాపి బ్రహ్మణా విష్ణువాక్యతః. 49
న శ్రోతవ్యం న మంతవ్య మన్యేషాం వచనం బుధైః | శక్తిరేవ సదా సేవ్యా విద్వద్భిః కృతనిశ్చయైః. 50
ప్రత్యక్షమపి ద్రష్టవ్య మశ క్తస్య విచేష్టితమ్ | అతః సర్వేషు భూతేషు జ్ఞాతవ్యా శక్తి రేవ హి. 51
ఇతి శ్రీదేవీభాగవతే మహాభాగవతే మహాపురాణ ప్రథమస్కంధే%ష్టమోధ్యాయః.
ఆ మూలాధార శక్తియే యీ చరాచర బ్రహ్మాండములను నిర్మించును - పోషించును - సంహరించును. ఆ శక్తి బలమే లేనిచో బ్రహ్మ హరి శివుడు రవి వహ్ని వరుణుడు మున్నగు దేవతలు శక్తిహినులగుదురు. దాన వారి పనులు కుంటుపడినట్లే. దేవత లెల్లరును శక్తియుక్తులైననే తమ తమ పనులు చక్కగ నెరవేర్చుకొందురు. ఆ శక్తియే యన్ని కార్య కారణములందును ప్రత్యక్షముగ వెల్లడి యగుచుండును. ఆ శక్తినే మనీషులు సగుణయనియు నిర్గుణయనియు రెండుగ దెల్పిరి. రాగవంతులు సగుణశక్తిని విరాగులు నిర్గుణశక్తిని గొలుతురు. ఆ శక్తియే ధర్మార్థ కామ మోక్షము లీజాలు స్వామిని. ఆ దేవిని విధి విధానమున నారాధించినచో నామె మనయెల్ల కామితార్థము లీడేర్చగలదు. జడమతులు మాయకు లొంగుటచే నా శక్తి మహిమ నెఱుగ జాలరు. కొందఱాశక్తినే కొలదిగ తెలిసికొందురు. కాని, వారితరులకు దానిని తెలుపనేరక వారిని భ్రమలో ముంతురు. మందమతులగు పండితులు కొందఱు కలిప్రేరితులై పొట్టకూటికై చేయరాని పనులుచేసి పాషండులగుదురు. ఈ కలికాలమున ననేక విపరీతములు తలలెత్తును. కాని యితర యగములం దధర్మములు లేనేలేవు. విష్ణువు దేవి దయకై పెక్కేండ్లు తీవ్ర తపమాచరించు చుండును. స్వయంభువు శంభువు నాధ్రువ శక్తి దయ సంపాదింప నిరంతరముగ ధ్యానింతురు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లోననేమేమో కోరికల పుట్టలు పెంచుకొని యనేక యజ్ఞములు సలుపుదురు. వారా పరశక్తిని పరబ్రహ్మమునుగా సనాతనగా పరాత్మికగ నిత్యగా నిత్యము తమ చేతములందు ధ్యానింతురు. కనుక నన్నియు తెలిసిన విద్వాంసులా పరమశక్తినే నిత్యము సంసేవింప వలయును. ఇదే సకల శాస్త్రముల సారమని తెలియవలయును. నిజముగ సకలశాస్త్రము లందును దెలిసికొనదగిన దాశక్తియే. ఇదంతయును నేను శ్రీ వ్యాసుని వలన వ్యాసుడు నారదుని వలన దేవర్షి తన తండ్రి బ్రహ్మ వలన విష్ణుని వలన నెఱింగితిమి. పండితు లితరుల మాటలు వినరాదు - తలంపరాదు. కృతనిశ్చయులగు ధీరులా సత్యశక్తినే సంసేవింప వలయును. అశక్తుని యందలి సత్తువ యెంతటిదో కన్నులార చూచిన గాని తెలియదు. కావుననే సకల భూతము లాపరశక్తినే యెఱగి నిత్యము సమారాధించవలయును.
ఇది శ్రీ దేవీ భాగవత మహాపురాణమందలి ప్రథమ స్కంధమందలి అష్టమాధ్యాయము.