Sri Devi Bhagavatam-1
Chapters
అథై కోనవింశో%ధ్యాయః ఇత్యుక్త్వా భగవాన్విష్ణుః పునరాహ ప్రజాపతిమ్ | యన్మాయామోహితః సర్వ స్తత్త్వం జానాతి నో జనః.
1 వయం మాయావృతాః కామం న స్మరామో జగద్గురుం | పరమం పురుషం శాంతం సచ్చిదానంద మవ్యయమ్.
2 అహం విష్ణు రహం బ్రహ్మ శివో%హమితి మోహితాః | న జానీమో వయం ధాతః పరంవస్తు సనాతనమ్.
3 యన్మాయా మోహితశ్చాహం సదా వర్తే పరాత్మనః | పరవాన్దారుపాంచాలీ మాయికస్య యథా వశే.
4 భవతా%పి తథా దృష్టా విభూతి స్తస్య చాద్భుతా | కల్పాదౌ భవయుక్తేన మాయా%పి చ సుధార్ణవే.
5 మణిద్వీపే%థ మందావిటపే రాసమండలే | సమాజే తత్ర సా దృష్టా శ్రుతా న వచసా%పి చ. 6 తస్మా త్తాం పరమాం శక్తిం స్మరంత్వద్య సురాః శివాం | సర్వకామప్రదాయం మయామాద్యాం శక్తిం పరాత్మనః. 7 ఇత్యుక్తా హరిణా దేవా బ్రహ్మాద్యా భువనేశ్వరీం | సస్మరు ర్మునసా దేవీం యోగమాద్యాం సనాతనీమ్. 8 స్మృతమాత్రా తదా దేవీ ప్రత్యక్షం దర్శనం దదౌ | పాశం కువరాభీతిధరా దేవీ జపారుణా | దృష్ట్వా ప్రముదితా దేవా స్తుషువు స్తాం సుదర్శనామ్. 9 ఊర్ణనాభాద్యథా తంతు ర్విస్ఫులింగా విభావసోః | తథా జగద్యదేతస్యా నిర్గతం తాం నతా వయమ్. 10 యన్మాయాశక్తి సంక్లప్తం జగత్సర్వం చరాచరమ్ | తాం చితం భూవనాధీశా స్మరామః కరుణార్ణవామ్. 11 యదజ్ఞానా ద్భవోత్పత్తి ర్యద్జానాద్భవనాశనం | సంవిద్రూపాం చ తాం దేవీం స్మరామః సాప్రచోదయాత్. 12 పందొమ్మిదవ అధ్యాయము దేవతలు శ్రీ జగదంబను సంస్తుతించుట ఇట్లు పలికి విష్ణువు మరల బ్రహ్మతో నీ ప్రకారముగ వచింపసాగెను. ఈ సృష్టి యందలి ప్రతి వ్యక్తియు మాయా మోహితుడే. అందుచే దీవీతత్త్వ మెవ్వడు నెఱుగలేకున్నాడు. మనమును మాయాశక్తిచే నావరింపబడితిమి. కనుక మనమా జగద్గురువు - పరమ పురుషుడు - అవ్యయుడు - సచ్చిదానంద రూపుడు నైన జగద్గురుని స్వరూప మెఱుగ లేకున్నాము. ఓ విధీ! నేను బ్రహ్మను, నే విష్ణువును, నేను రుద్రుడనను గర్వమున మోహవశులమై సనాతన పరతత్త్వము నెఱుగజాలకున్నాము. ఎట్లు కట్టెబొమ్మ యింద్రజాలికునకు వశ##మై యతని యిచ్చమేరకు నర్తించునో యట్లు నేనును పరమాత్మకు వశుడనై మాయా మోహితుడనై వర్తింతును. ఈ కల్పము మొదట నీవును నేనును రుద్రుడును సుధాసాగరమందొక మహాద్భుతమైన విభూతి విశేషమైన తేజః స్వరూపమును గంటిమి. నేను పూర్వమొక దివ్య మందార వృక్షము గంటిని. దాని క్రింద శోభాయమానమైన రాజక్రీడాస్థలము గలదు. అందు వివిధ మణులతో రాజిల్లు మణిద్వీపము గలదు. ఆ ద్వీపమం దనంతకోటి సూర్యుల కాంతు లీను లలితా మూర్తి గలదు. అంతవఱకు నేనట్టి సుందర స్వరూపమును విన-గనలేదు. కనుక నో సురలారా! మీరలా పరాశక్తిని శివరూపను సర్వకామప్రద-మాయారూప యగు ఆద్యాశక్తిని నెమ్మనములందు చక్కగ సంస్మరింపుడు అను విష్ణుని హితవచనము లాలించి బ్రహ్మాది దేవత లాభువనేశ్వరీ దేవి యగు యోగమాయను మనసారగ సంస్మరించిరి. వారు సంస్మరించినంతనే శ్రీ త్రిపుర సుందరీ దేవి జపాకుసుమముల వలె నరుణమగు తేజమున తేజరిల్లుచు పాశాంకుశములు వరదాభయ ముద్రలు దాల్చి ప్రత్యక్షముగ వారికి దివ్యదర్శన భాగ్యమొసగెను. వారా దేవదేవిని కులపండువుగ గాంచి యిట్లు నుతించిరి. సాలెపురుగు నుండి దారములు వెల్వడునట్లే అగ్నినుండి మిణుగురులు బయలు వెడలునట్లే యెవరి నుండి యీ సకల జగములు పుట్టుచున్నవో యా విశ్వమాతకు మా మనస్సులు. ఏ మహా మాయాశక్తిచే నీ చరాచర జగమంతయును రచింపబడెనో యట్టి యచింత్య లక్షణములుగల చిత్కారణా స్వరూపిణిని మేము స్మరింతుము. ఏ మాయాతత్త్వ మెఱుగినచో సంసారము ఉత్పన్నమై తోచునో యే దివ్య తత్త్వ మెఱిగినచో సంసారము నశించునో యట్టి చిద్రూపను స్మరింతుము. ఆ వరేణ్యమైన చైతన్య జ్యోతి మా బుద్ధులను తచ్చింతనకు ప్రేరించుగాక! మహాలక్ష్మై చ విద్మహే సర్వశ##క్త్యై చ ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్. మాతర్నతాః స్మ భువనార్తి హరే! ప్రసీద శం నో విధేహి కురు కార్యమిదం దయార్ద్రే| 13 భారం హరస్వ వినిహత్య సురారివర్తం మహ్య మహేశ్వరి ! సతాం కురు శం భవాని! యద్యంబుజాక్షి దయసే న సురాన్కదాచి త్కిం తే క్షమా రణముఖే%స్తి శ##రైః ప్రహర్తుమ్! 14 ఏతత్త్వయైవ గదితం నను యక్షరూపం ధృత్వా తృణం దహ హుతాశ పదాభిలాపైః. కంసః కుజో%థ యవనేంద్రసుతశ్చ కేశీ బార్హద్రథో బకబకీ ఖరశాలాకల ముఖ్యాః| 15 యే%న్యే తథా నృపతయో భువి సంతి తాంస్త్వం హత్వా హరస్వజగతో భర మాశు మాతః. మే విష్ణునా న నిహతాః కిల శంకరేణ యే వా విగృహ్య జలజాక్షి! పురందరేణ| 16 తే తే సుఖం సుఖకరం సుసమీక్షమాణా స్సంఖ్యే శ##రైర్వినిహతా నిజలీలాయాతే, శక్తిం వినా హరిహరప్రముఖాః సురాశ్చ నైవేశ్వరా విచలితుం తవ దేవదేవి | 17 కిం ధారణావిరహితః ప్రభురప్యనంతో ధర్తుం ధరాం చ రజనీశకలావతం సే. ఇంద్రః. వాచా వినా విధిరలం భవతీహ విశ్వం కుర్తుం హరిః కిము రమరహితో%థ పాతుమ్ | 18 సంహర్తుమీశ ఉమయోజిత ఈశ్వరః కిం తే తాభిరేవ సహితాః ప్రభవః ప్రజేశాః. విష్ణుః: కర్తు ప్రభుర్న ద్రుహిణో న కదాచనాహం నాపీశ్వరస్తవ కళారహిత స్త్రిలోకాః! 19 కుర్తుం ప్రభుత్వమనఘె%త్ర తథావిహర్తుం త్వం వై సమస్త విభ##వేశ్వరి భాసి నూనమ్. 20 ఏవం స్తుతా తదా దేవీ తానాహ విభుదేశ్వరాన్ | కిం తత్కార్యం వదంత్వద్య కరోమి విగతజ్వరాః! 21 అసాధ్య మపి లోకే%స్మిం స్తత్కరోమి సురేప్సితమ్ | శంసంతు భవతా దుఃఖం ధరాయాశ్చ సురోత్తమాః. 22 దేవా ఊచుః: వసుధేయం భరాక్రాంతా సంప్రాప్తా విభుధాన్ప్రతి | రుదతీ వేపమానా చ పీడితా దుష్టభూభుజై. 23 ఓ జగదేక జననీ! భువనార్తిహారిణీ! మహేశ్వరీ! వివిధ శక్తులతో భాసిల్లు చిద్రూపిణీ! భవానీ! నీకు మా నమస్కారములు. మా యెడల సుప్రసన్నవై మాకు శ్రేయములు గల్గించుచు మా కార్యములు నెరవేర్చుము. రాక్షస వర్గమును నశింపజేసి భూభార ముడిపి శిష్యులకు శ్రేయము కలిగింపుము. ఓ రాజీవలోచనా! నీవు దేవతలపై దయజూపనిచో సమరాంగణమున నస్త్ర శస్త్రములతో శత్రువుల నెదుర్కొనజాలు వాడెవడుండెను? తొల్లి నీవు యక్షరూపము దాల్చి యగ్నితో ఈ గడ్డిపోచ గాల్చుము చూతుము' అని పలికినట్లు చెప్పితిని. ఈ విశాల ధరణిపై కంసుడు - భౌముడు - కాలయవనకేశులు - బక జరాసంధులు - ఖరశాల్వపూతనాదులు - నితర క్రూరరాజులను గలరు. వారి నెల్లర నంతమొందించి ధరాభారము తొలగింపగదే తల్లీ! కమలాక్షీ! ఇంద్ర శివ విష్ణువుల వలన రాక్షసులు కొందఱు చావకుండిరి. వారు మున్ను నీ సుఖకరమైన రూపము చూచుచుండగనే నీ బాణములతో నవలీలలగ మడిసిరి. ఓ చంద్రకళావతంసా! నీ చైతన్యశక్తి తోడులేనిచో బ్రహ్మ విష్ణు దేవులు నడుగు దీసి యడుగిడ నేరరు. అనంతుడును ధారణాశక్తి లేనిచో భూమిని మోయజాలడు. ఇంద్రుడిట్లనెను. వాగ్రూప క్రియాశక్తి యగు సరస్వతి తోడులేనిచో బ్రహ్మయును పద్మ లేనిచో పద్మనాభుడును గిరిజ లేక గిరీశుడును విశ్వమును పుట్టించి పెంచి తుదముట్టింప నోపరు. త్రిశక్తులతో గూడినంతనే త్రిమూర్తులగు ప్రజాపతులును తమ తమ కార్యములందు నిపుణులగుదురు. విష్ణు విట్లు నుడివెను : ఓ విమలజ్ఞానరూపా! నీ కళాశక్తి లేనిచో బ్రహ్మ విశ్వరచనము - నేను విశ్వపాలనము - శర్వుడు విశ్వసంహారము చేయ దక్షులముగాము. నీవొక్కతెవే యీ సమస్తమున కేలికవై విహరింపగలవు. నీవు సకల విభవముల కధీశ్వరివని నిక్కముగ మాకు దోచుచున్నావు. ఈ విధముగ దేవత లెల్లరును స్తోత్రములు సేయగ దేవదేవి యమరపతుల కిట్లు బలికెను. మీరు నిశ్చింతగ నుండుడు. మీకు నావలన కాగల కార్యమేదియో తెలుపుడు. దానిని నేను తప్పక నెరవేర్తును. సురోత్తములారా! మీరు కోరిన కార్యమెంతటి యసాధ్యమైనదైనను సాధించి తీరుదును. మీకు మేలగుత! భూదేవికి గలిగిన దుఃఖమేమో తెలుపుడు. దేవత లిట్లనిరి. తల్లీ! ఈ భూదేవి దుష్టరాజుల బరువుచే పీడితురాలై గడగడలాడుచు వాపోవుచు దేవతల సన్నిధి కేతెంచినది. భారాపహరణం చాస్యాః కర్తవ్యం భువనేశ్వరి ! దేవానామీప్సితం కార్య మేత దేవధునా శివే ! 24 ఘాతితస్తు పురా మతా స్త్వయా మహిషరూపధృత్ | దానవో%తి బలాక్రాంత స్తత్సహాయాశ్చ కోటిశః. 25 తథా శుంభో నిశుంభశ్చ రక్తబీజ స్తథా%పరాః | చండముండౌ మహావీర్యౌ తథైవ ధూమ్రలోచనః. 26 దుర్ముఖో దుఃసహ శ్చైవ కరాళశ్చాతి వీర్యవాన్ | అన్యే చ బ్రహవః క్రూరా స్త్వయైవ చ నిపాతితాః. 27 వ్యాస ఉవాచ: ఇత్యుక్త్వా సా తదా దేవీ దేవా నాహాంబికా శివా. 28 సంప్రహస్యా సితాపాంగీ మేఘ గంభీరయా గిరా ! మయేదంచింతితం పూర్వ మంశావతరణం సురాః. 29 భారావతరణం చైవ యథా స్యా ద్దుష్టభూభుజాం | మయా సర్వే నిహంతవ్యా దైత్యేశా యే మహీభుజః. 30 మాగధాద్యా మహాభాగాః స్వశక్త్యా మందతేజసః | భవద్భిరపి సై#్వరం శై రవతీర్య ధరాతలే. 31 మచ్ఛక్తియుక్తైః కర్తవ్యం భారావతరణం సురాః | కశ్యపో భార్యయా సార్థం దివిజానాం ప్రజాపతిః. 32 యదావానాం కులే పూర్వం భవితా%%నక దుందుభిః | తథైవ భృగుశాపాద్వై భగవాన్విష్ణు రవ్యయః. 33 అంశేన భవితా తత్ర వసుదేవసుతో హరిః | తదా%హం ప్రభవిష్యామి యశోదాయాం చ గోకులే. 34 కార్యం సర్వం కరిష్యామి సురాణాం సురసత్తమాః | కారాగారే గతం విష్ణుం ప్రాపయిష్యామి గోకులే. 35 ఓ భువనేశ్వరీ! శివాత్మికా! ఆమె భారమును తొలగించుట యొక్కటే మా యభీష్టము. ఇదే మా ఇప్పటి కార్యము. మాతా! మునుపు బలశాలియైన మహిషాసురుని నీ వనంత బలముతో తుదముట్టించితివి. అటులే మహావీరులగు శుంభ నిశుంభులను చండముండులను ధూమ్రలోచనుని దుర్ముఖ దుస్సహులను తక్కిన క్రూర రాక్షసుల నెందఱనో నీవు యుద్ధమునందు తెగటార్చితివి. అటులే నీవు దుష్టభూపతులను సంహరింపుము. భూభార ముడుపుము.' అది విని శివరూపయగు జగదంబిక పెద్దగ నవ్వి నల్ల కలువలవంటి కడగంటి చూపుల చూచుచు మేఘ గంభీర వాక్కులతో దేవతలతో నిట్లు పలికెను: దేవతలారా! నేను మునుపే దేవతల యంశావతరణ విషయము నాలోచించితిని. కాన దుష్ట దానవులతో నిండిన భూభారమిక తొలగింతును. దైత్యపతులగు భూపతు లెల్లరును నా చేతిలో చత్తురు. మగధపతి మున్నగు వారిని నా మహాశక్తితో హీనసత్త్వుల నొనరింతును. మీరును భూతలమున మీ మీ యంశములతో నవతరింపుడు. మీకు నా యద్భుతశక్తి తోడుండును. మీరపుడు భూభారము తొలగింప జాలుదురు. దేవతలకు ప్రజాపతి యగు కశ్యపుడు తన భార్యతో జన్మింప గలడు. అతడు యదువంశమం దానకదుందుభి యగు వసుదేవుడుగ నవతరింపగలడు. అటులే భృగు శాపమున విష్ణువును తన యంశముతో వసుదేవునకు నందనుడుగ నవతరింపగలడు. అపుడు నేనును గోకులమున యశోదకు ప్రభవింప గలను. సురసత్తములారా! నేనీ విధముగ దేవకార్య మొనరింపగలను. హరి కారాగారమందు ప్రభవించును. నేనతనిని గోకులమునకు చేర్తును. శేషం చ దేవకీగర్భా త్ప్రాపయిష్యామి రోహీణీమ్ | మచ్ఛక్త్యోపచితౌ చ కర్తారౌ దుష్టసంక్షయమ్. 36 దుష్టానాం భూభుజాం కామం ద్వాపరాంతే సునిశ్చితమ్ | ఇంద్రాంశో%ప్యర్జునః సాక్షాత్కరిష్యతి బలక్షయమ్. 37 ధర్మాంశో%పి మహారాజో భవిష్యతి యుధిష్ఠిరః | వాయ్వంశో భీమసేనశ్చా%శ్వినంశౌ చ యమావపి. 38 వసోరంశో%థ గాంగేయః కరిష్యతి బలక్షయమ్ | వ్రజంతు చ భవంతో%ద్య ధరా భవతు సుస్థిరా. 39 భారావతరణం నూనం కరిష్యామి సురోత్తమాః | కృత్వా నిమిత్త మాత్రాం స్తా న్స్వ శక్త్యాహం న సంశయః. 40 కురుక్షేత్రే కరిష్యామి క్షత్త్రియాణాం చ సంక్షయమ్ | అసూయేర్ష్యా మతి స్తృష్ణా మమతా%భిమతా స్పృహా. 41 జిగీషా మదనో మోహో దోషైర్నంక్ష్యంతి యాదవాః | బ్రాహ్మణస్య చ శాపేన వంశనాశో భవిష్యతి. 42 భగవానపి శాపేన త్యక్ష్యత్యేత త్కలేబరమ్ | భవంతో%పి నిజాంగైశ్చ సహాయాః శారఙ్గన్వనః. 43 ప్రభవంతు సనారీకా మథురాయాం చ గోకులే | ఇత్యుక్త్వాం%తర్దధే దేవీ యోగమాయా పరాత్మనః. 44 సధరావై సురాః సర్వే జగ్ముః స్వాన్యాలయాని చ | ధరా%పి సుస్థిరా జాతా తస్యా వాక్యేన తోషితా. 45 ఓషధీ వీరుధోపేతా బభూవ జనమేజయ! ప్రజాశ్చ సుఃనో జాతా ద్విజాశ్చాపుర్మహోదయమ్. 46 సంతుష్టా మునయః సర్వే బభూవు ర్ధర్మతత్పరాః. ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ చతుర్థస్కంధే ఏకోనవింశో%ధ్యాయః. నేను దేవకీ గర్భము నుండి రోహిణీ గర్భమునకు శేషుని జేర్పగలను. వారు నా దివ్యశక్తివలన వర్ధిల్లుదురు. దుర్మార్గులను చెండాడుదురు. ద్వాపరయుగము చివర తప్పక దుష్టరాజుల యంతమగును. ఇంద్రాంశజుడైన యర్జునుడు దుష్టుల బల మణగింప గలడు. ధర్మాంశముతో ధర్మరాజును మరుదంశమున భీముడును నశ్వినుల యంశములతో నకుల సహదేవులును ప్రభవించిరి. వసునంశమున గాంగేయు డుద్భవించి దుష్టుల బలమును నశింప జేయగలడు. మీరిక వెళ్లవచ్చును. భూదేవి నిశ్చింతగ నుండుగాక! నేను భూభారము తప్పక తొలగింనపగలను. నేను వారి నెల్లరను నిమిత్త మాత్రులుగ జేయగలను. నేనే నిస్సంశయముగ కురుక్షేత్రమునందు దుష్టక్షత్రియులను సంక్షయ మొనర్పగలను. ఈర్ష్య-తృష్ణ-మమత-అభిమానము-కోర్కులు-జిగీష- మదమోహములుమున్నగు దొసగులచే యాదవ నాశము గాగలదు. ఒక విప్రశాపముతో యాదవ వంశ మంతరించును. హరియును శాపవశమున మేను చాలించగలడు. మీరు మీమీ సొంతబలములతో శ్రీహరికి సాయమొనర్పుడు. మీరు మీమీ స్త్రీలతోడ కృష్ణునకు సాయముగ మథురలో గోకులమున జన్మలు దాల్చుడు అని యీ విధముగ బలికి పరాత్ముని యోగ మాయాశక్తి యంతర్ధాన మొందెను. దేవత లెల్లరును నిజవాసముల కరిగిరి. భూదేవియు వెళ్ళెను. ఆ ధరాదేవి జగదంబ మాటలకు సంతసించి సుస్థిర యయ్యెను. భూదేవి పరమౌషధులతో గుల్మలతాదులతో నొప్పెసగెను. అంత నెల్లప్రజలును విప్రులును సుఖముతో మహోదయముతో వర్ధిల్లిరి. మునులు సైతము సంతుష్టులై ధర్మతత్పరులై వర్ధిల్లిరి. ఇది శ్రీమద్దేవీ భాగవతమందలి చతుర్థ స్కంధమందు శ్రీ జగదంబను దేవతలు సంస్తుతించుటయను పందొమ్మిదవ యధ్యాయము.