Sri Devi Bhagavatam-1
Chapters
అథ త్రయోవిం%శోధ్యాయః వ్యాసః : హతేషు షట్సు పుత్రేషు దేవక్యా ఔగ్రసేనినా | సప్తమే పతితే గర్భే వచనా న్నారదస్య చ.
1 అష్టమస్య చ గర్భస్య రక్షణార్థ మతంద్రితః | ప్రయత్న మకరో ద్రాజా మరణం స్వం విచింతయన్.
2 సమయే దేవకీగర్భే ప్రవేశ మకరో ద్ధరః | అంశేన వసుదేవే తు సమాగత్య యథాక్రమమ్.
3 తదేయం యోగమాయా చ యశోదాయాం యథేచ్ఛయా | ప్రవేశ మకరో ద్దేవీ దేవకార్యార్థ సిద్ధయే.
4 రోహిణ్యాస్తనయో రామో గోకులే సమజాయత | యతః కంసభయోద్విగ్నా సంస్థితా సా చ కామినీ.
5 కారాగారే తతః కంసో దేవకీం దేవసంస్తుతాం | పుత్త్రోత్పత్తిం చ సంచింత్య ప్రవిష్ఠః సహభార్యయా.
6 దేవకీ గర్భగో విష్ణు ర్దేవకార్యార్థ సిద్ధయే | సంస్తుతో%మరసంఘైశ్చ వ్యవర్ధత యథాక్రమమ్.
7 సంజాతే దశ##మే తత్ర మాసే%థ శ్రవణ శుభమ్ | ప్రాజాపత్యర%సంయుక్తే కృష్ణపక్షే%ష్టమీదినే.
9 కంసస్తు దానవా న్సర్వా నువాచ భయవిహ్వలః | రక్షణీయా భవద్భిశ్చ దేవకీ గర్భమందిరే.
10 అష్టమో దేవకీ గర్భః శత్రు ర్మే ప్రభవిష్యతి | రక్షణీయః ప్రయత్నేన మృత్యురూపః స బాలకః 11 హత్వైనం బాలకం దైత్యాః సుఖం స్వప్స్యామి మందిరే | నివృత్తివర్జితే దుఃఖే నాశితే చాష్టమే సుతే. 12 ఖడ్గప్రాసధరాః సర్వే తిష్ఠంతు ధృతకార్ముకాః | నిద్రాతంద్రావిహీనాశ్చ సర్వత్ర నిహితేక్షణాః. 12 ఇరువది మూడవ యధ్యాయము శ్రీరామకృష్ణుల యవతార వర్ణనము అట్లు దేవకి యారుగురు కొడుకులు కంసునిచేత చంపబడిరి. సప్తమ గర్భము పతన మందెను. అపుడు కంసునకు నారద వచనము జ్ఞప్తికి వచ్చి తన చావు దేవకి యెనిమిదవ గర్భము వలన గలుగునని యెఱిగి యా గర్భమును జాగ్రత్తగ రక్షించెను. ఇట శ్రీ విష్ణుని మహాంశము వసుదేవు నాశ్రయించెను. ఆ తేజోంశ మతనినుండి యథాక్రమముగ దేవకి గర్భము జొచ్చెను. అదే సమయమున యోగమాయాశక్తి దేవకార్యార్థము స్వేచ్ఛగా యశోదాగర్భము ప్రవేశించెను. వసుదేవుని రెండవ భార్య రోహిణి. ఆమె కంసు భయముతో విచారమున మునిగెను. ఆమె గోకులమందు బలరాముని ప్రసవించెను. కంసుడు దేవసన్నుతయగు దేవకిని కారాగారమందుంచి యామె సంరక్షణకు తన సేవకులను నియోగించెను. వసుదేవుడు తన ప్రియురాలి గాఢ ప్రేమ పాశములచే బద్ధుడు. కాన నతడును పుత్రోత్పత్తిచే సంతోషమున భార్యతోపాటు చెఱసాలయం దుండెను. అట్లు శ్రీహరి దేవకార్యార్థము దేవకీ గర్భము ప్రవేశించి దేవతలచే నన్నుతింపబడుచు క్రమక్రమము వర్ధిల్లుచుండెను. కొన్ని నాళ్ళకు పదియవ నెల రానే వచ్చెను. శ్రావణ కృష్ణ పక్షమందు రోహిణీ నక్షత్రమున నష్టమినాడు హరి యవతరించెను. అపుడు కంసుని గుండె దడదడలాడెను. అతడు దానవులతో నిట్లు పలికెను: ఇపుడు మీరెల్లరు దేవకీ గర్భము గాపాడుడు. దేవకి కష్టమ గర్భమున నా శత్రు వుద్భవించును. కనుక నా పాలిటి మృత్యువైన బాలకుని జాగరూకతో రక్షింపుడు. నాకు సుఖశాంతులు గలిగించని యామె యష్టమ సుతుని చంపిననే కాని నాకు సుఖశాంతులు గలుగవు. అపుడు గాని నా కంటి నిండ నిద్దుర పట్టదు. మీ రెల్లరు నిదురమాని యేమరక విల్లు ఖడ్గము ప్రాసము ధరించి యెల్ల దిక్కు మొగముల చూచుచుండుడు. వ్యాసః : ఇత్యాదిశ్యాసురగణా న్కృశో%తిభయవిహ్వలః | మందిరం స్వం జగామా%%శు నలేభే దానవః సుఖమ్. 14 నిశీథే దేవకీ తత్ర వసుదేవ మువాచ హ | కిం కరోమి మహారాజ! ప్రసవావసరో మమ. 15 బహవో రక్షపాలాశ్చ తిష్టంత్యత్ర భయానకాః | నందపత్న్యా మయా సార్ధం కృతో%స్తి సమయః పురా. 16 ప్రేషితవ్య స్త్వయా పుత్రో మందిరే మమ మానిని | పాలయిష్యా మ్యహం తత్ర తవాతి మనసా కిల. 17 అపత్యం తే ప్రదాస్యామి కంసస్య ప్రత్యయాయ వై | కిం కర్తవ్యం ప్రభోచా%ద్య విషమే సముపస్థితే. 18 వ్యత్యయం సంతతేః శౌరే | కథం కర్తుం క్షమో భ##వేః | దూరే తిష్ఠస్వకాంతాద్య లజ్జా మే%తి దురత్యయా. 19 పరావృత్య సుఖం స్వామి న్నన్యథా కిం కరోమ్యహం | ఇత్యుక్త్వాం తం మహాభాగం దేవకీ దేవసమ్మతమ్. 20 బాలకం సుషువే తత్ర నిశీథే పరమాద్భుతం | తం దృష్ట్వా విస్మయం ప్రాప దేవకీ బాలకం శుభమ్. 21 పతిం ప్రాహ మహాభాగ హర్షోత్ఫుల్లకళేబరా | పశ్య పుత్త్ర ముఖం కాంత! దుర్లభం హి తవ ప్రభో. 22 అద్యైనం కాలరూపో%సౌ ఘాతయిష్యతి భ్రాతృజః| వసుదేవ స్తథేత్యుక్త్వా తమాదాయ కరే సుతమ్. 23 అపశ్చ చ్చాననం తస్య సుతస్యాద్భుతకర్మణః | వీక్ష్య పుత్త్రముఖం శౌరి శ్చింతివిష్టో బభూవహ. 24 కిం కరోమి కథం నస్యా ద్దుఃఖమస్య కృతే మమ | ఏవం చింతాతురే తస్మి న్వాగువాచాశరీరిణీ. 25 వసుదేవం సమాభాష్య గగనే విశదాక్షరా | వసుదేవ గృహీత్వైనం గోకులం నయ సత్వరః. 26 రక్షపాలా స్తథా సర్వే మయా నిద్రావిమోహితాః | వివృతాని కృతాన్యష్ట కపాటాని చ శృంఖలాః. 27 ముక్త్వైనం నందగేహే త్వం యోగమాయాం సమానయ | శ్రుత్వైవం వసుదేవస్తు తస్మి న్కారాగృహే గతః. 28 అట్లు భయవిహ్వలుడు క్షీణాత్ముడు నగు కంసుడు రాక్షసగణము నాదేశించి తన మందిరమున కేగెను. కాని యతని మది కట సుఖము లేకుండెను. ఇచట నడికిరేయి దేవకి వసుదేవునితో నిట్లు పలికెను: మహారాజా! నాకు ప్రసవ సమయము సమీపించినది. ఇపు డేమి చేయుదు? ఇచట భయంకరులైన ఆరక్షులు కాపు గలరు. మున్నొకప్పుడు నందుని భార్య నాతో నిట్లొక ఒప్పందము చేసినది. ఓ మానినీ! నీ మనసు పరిపరి విధముల వికలమైనది. కాన నీ పుత్రుని నా యింటికి బంపుము. నే నతని నిట చక్కగ లాలించి పాలింతును. కంసునకు నమ్మిక గలుగుటకు నేను నీకు నా సంతాన మిత్తును అని యామె యనెను. ప్రభూ! ఇట్టి విషమస్థితిలో మన కర్తవ్య మేమి? అట్లు మనము మన సంతానము మార్చుకొందము. నా కిపుడు మిక్కుటముగ సిగ్గు ముంచుకొని వచ్చుచున్నది. నీవు కొంచెము దూరముగ నుండుము. నీవు కొంచెము మొగము త్రిప్పుకొని యుండుము. ఇంతకు మిక్కిలి నేనేమి చేయుదు? అని దేవకి దేవసన్నుతుడు మహాత్ముడు నగు వసుదేవునితో ననియెను. ఆ పిదప దేవకి నడిరేయి పరమాద్భుత దివ్యకాంతులు విరజిమ్ము సుందరబాలుని ప్రసవించెను. ఆ శుభంకరుడగు బాలకుని గని యామె పరమాశ్చర్యమందెను. ఆమె మేనెల్ల హర్షమున పులకించెను. ఆమె తన పతికిట్లు పలికెను : ప్రభూ! ఈ సుపుత్రుడు కడు దుర్లభుడు. ఇతని యందములు చిందులాడు నెమ్మొగమును కనులార గనుమా! అక్కటా! కాలరూపుడగు కంసు డీ బాలుని యిపుడే వధించునేమో కదా! వసుదేవుడును నిజమేయని ముద్దు లొలుకు బాలు నెత్తుకొనెను. ఆ యద్భుత సుందరమూర్తి యగు తన తనయుని మోము దమ్మి కన్నుల కరవు దీర తిలకించి వసుదేవుడిట్లు చింతించెను : నే నిపు డేమి చేయుదు? నా కీ పుత్రనాశ దుఃఖ మెట్లు తొలగును? అని యిట్లు వసుదేవుడు చింతించు నంతలో గగనవాణి వసుదేవునితో స్ఫుటాక్షరముతో నీ విధముగ పలికెను : ఓ వసుదేవా! నీవు త్వరత్వరగా నీ బాలుని గోకులము చేర్చుము. నా మాయచే ఆరక్షు లెల్లరును నిద్రామోహితులైరి. ఎనిమిది వాకిళ్ళు తెరువబడినవి. ఈ బాలుని నందు నింటికి జేర్చుము. అచటి నుండి యోగమాయను దెమ్ము' అను నింగి పలుకులు కారాబద్దుడగు వసుదేవుడు వినెను. వివృతం ద్వార మాలోక్య బభూవ తరసా నృప | తమాదాయ యాయావాశు ద్వారపాలై రలక్షితః. 29 కాళిందీతట మాసాద్య పూరం దృష్ట్వా సునిశ్చితమ్ | తదైవ కటిదఘ్నీసా బభూవాశు సరిద్వరా. 30 యోగమాయా ప్రభావేణ తతారానకదుందుభిః | గత్వాతు గోకులం శౌరి ర్నిశీథే నిర్జనే పథి. 31 నందద్వారే స్థితః పశ్యన్విభూతిం పశుసంజ్ఞితామ్ | తదైవ తత్ర సంజాతా యశోదాగర్భసంభవా. 32 యోగమాయాంశజా దేవీ త్రిగుణా దివ్యరూపిణీ | జాతాం తాం బాలికాం దివ్యాం గృహీత్వా కరపంకజే. 33 తత్రాగత్య దదౌ దేవీ సైరంధ్రీరూపధారిణీ | వసుదేవః సుతం దత్వా సైరంధ్రీ కరపంకజే. 34 తామాదాయ య¸° శీఘ్రం బాలికాం ముదితాశయః | కారాగారే తతో గత్వా దేవక్యాః శయనే సుతామ్. 35 నిక్షిప్యసస్థితః పార్శ్వే చింతావిష్టో భయా%%తురః | రురోద సుస్వరం కన్యా తదైవాగత సంజ్ఞకాః. 36 ఉత్తస్థుః సేవకా రాజ్ఞః శ్రుత్వా తద్రుదితం నిశి | తమూచు ర్భూపతిం గత్వా త్వరితాస్తే%తి విహ్వలాః. 37 దేవక్యా శ్చసుతో జాతః శీఘ్ర మేహి మహామతే | తదాకర్ణ్య వచస్తేషాం శీఘ్రం భోజపతి ర్య¸°. 38 ప్రావృతం ద్వార మాలోక్య వసుదేవ మథాహ్వయయత్ | కంసః : సుత మానయ దేవక్యా వసుదేవ మహామతే! 39 మృత్యుర్మే చా%ష్టమో గర్భ స్తన్నిహన్మి రిపుం హరిమ్ | వ్యాసః: శ్రుత్వాం కంసవచః శౌరి ర్భయత్ర స్తవిలోచనః 40 అతడు చూడగా తలుపులు తెరవుబడియుండెను. వసుదేవుడు వేగిరమే బాలకు నెత్తుకొని ద్వారపాలకుల కంట బడక బయటికేగెను. అతడు యమునా తటము చేరి ప్రవాహ వేగము గని చింతితుడయ్యెను. కాని, నది మొలబంటి లోతు గలదయ్యెను. అతడు యోగమాయా ప్రభావమున నది దాటి కాఱు చీకటిలో విజనమార్గమున గోకులము జేరెను. అతడు నందుని ద్వారము జేరి యచటి పశుసంపద చూచుచుండు సమయమందు యశోదాగర్భమున నొక శిశువుదయ మందెను. ఆ శిశువు త్రిగుణముల రాశి. దివ్య స్వరూపిణి యగు యోగమాయాంశమున జనియించిన దివ్య బాలిక. అపుడొక దేవి యా ముద్దులు మూట గట్టు బంగారు పాపను తన కైదమ్ముల నుంచుకొని సైరంధ్రి వేషమున వచ్చి వసుదేవుని కిచ్చినది. వసుదేవుడును తన నందనుని సైరంధ్రి కయిదమ్ముల నుంచెను. వసుదేవుడు సంతోషముతో బాలనుగొని శీఘ్రముగ కారాగారమందున్న దేవకి పురిటిసెజ్జపై నుంచెను. అతడు భయచింతాగ్రస్తుడై యచ్చోట కూర్చుండియుండెను. అంతలో వెంటనే యా బాలిక పెద్ద యెలుంగున నేడ్చెను. ఆ రోదనము విని రాజభటులు మేల్కాంచి వ్యాకుల చిత్తముతో నపుడే నరపతిని జేరి యిట్లు విన్నవించిరి. మహామతీ! దేవకికి కొడుకు గలిగెను. వేగమే యేగుము' అను వారి మాటలు విని కంసుడు వడివడిగ పురిటింటి మొగ మేగెను. కారాద్వారములు తెరువబడెను. కంసుడు వసుదేవుని బిలిచి యిట్లనెను : మహామతీ! వసుదేవా! నీ నందునుని దెమ్ము. దేవకి కష్టమ గర్భమున గలిగిన హరి నా పాలిటి మృత్యువు. కాన నేతని నిపుడే సంహరింతును' అను కంసుని మాటలు విని వసుదేవుడు భయగ్రస్తుడయ్యెను. తామాదాయ సుతాం పాణౌ దదౌ చా%%శు రుదన్నివ | దృష్ట్వా%థ దారికాం రాజా విస్మయం పరమం గతః. 41 దేవవాణీ వృథా జాతా నారదస్య చ భాషితమ్ | వసుదేవః కథం కుర్యా దనృతం సంకటే స్థితః. 42 రక్షపాలాశ్చ మే సర్వే సావధానా న సంశయః | కుతో%త్ర కన్యకా కామం క్వగతః స సుతః కిల. 43 సందేహో2త్ర న కర్తవ్యః కాలస్య విషమా గతిః | ఇతి సంచిత్య తాం బాలాం గృహీత్వా పాదయోః ఖలః. 44 పోథయామాస పాషాణ నిరృణః కులపాంసనః | సా కరాన్నిః సృతా బాలా యయావాకాశమండలమ్. 45 దివ్య రూపా తదా భూత్వా తమువాచ మృదుస్వనా | కిం మయా హతయా పాప | జాతస్తే బలవాన్రిపుః. 46 హనిష్యతి దురారాధ్యః సర్వథా త్వాం నరాధమమ్ | ఇత్యుక్త్వా సా గతా కన్యా గగనం కామగా శివా. 47 కంసస్తు విస్మయావిష్టో గతో నిజ గృహం తదా | ఆనాయ్య దానవా న్సర్వా నిదం వచన మబ్రవీత్. 48 బకధేనుకవత్సాదీ న్క్రోధావిష్టో భయా%%తురః | గచ్ఛంతు దానవాః సర్వే మమ కార్యార్థ సిద్ధయే. 49 జాతమాత్రా శ్చ హంతవ్యా బాలకా యత్రకుత్రచిత్ | పూతనైషా వ్రజత్వద్య బాలఘ్నీ నందగోకులమ్. 50 జాతమాత్రా న్వినిఘ్నంతీ శిశూంస్తత్ర మమా%%జ్ఞయా | ధేనుకో వత్సకః కేశీ ప్రలంబో బక ఏవ చ 51 సర్వే తిష్టంతు తత్రైవ మమకార్యచికీర్షయా | ఇత్యాజ్ఞాప్యాసురాన్క య¸° నిజగృహం ఖలః 52 చింతా విష్టో%తి దీనాత్మా చింతయిత్వైవ తం పునః. 53 ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ చతుర్థస్కంధే త్రయోవింశో%ధ్యాయః. వసుదేవుడు పరితపించుచు వణకుచు పసిపాపను కంసుని చేతిలో బెట్టెను. కంసు డా కన్నియను గని పరమ విస్మయ మందెను. దేవవాణి కల్లయైనది. నారదభాషితము వ్యర్థమైనది. ఎట్టి సంకటస్థితిలోను వసుదేవుడు మాత్ర మెట్టు లసత్యమాడును? నా ఆ రక్షులు కడు జాగరూకులై యున్నారనుటలో నెట్టి సందియము లేదు. ఇట్టిచో నీ కన్నియ యెట్టుల వచ్చెను? బాలు డేమయ్యెను? ఇందు సంశయము లేశమును లేదు. అంతయు కాల వైపరీత్యము అని తలచి కంసుడా పసిబాల పదములు పట్టుకొనెను. కఠినాత్ముడు ఖలుడు కులపాంసనుడు నైన కంసు డా చిన్నారి పాపను బండపై వేయ నుంకించెను. అంతలో నాబాల యతని చేతి నుండి వెడలి గగన మండలము చేరినది. ఆ దివ్య బాలిక తేజోరూపమున మృదు వచనములతో నతని కిట్టు లనియెను : ఓరీ పాపీ! నన్ను చంపిన నీకేమి లాభమురా? నీకు బలవంతుడైన శత్రువెపుడో పుట్టెనురా! ఓరీ నరాధమా! బండగుండెవాడా! దురారాధ్యుడగు ఆ లీలామానుస విగ్రహుడు నిన్ను వధించి తీరును అని శివరూపిణియైన దివ్యబాల పలికి గగన తలమున అదృశ్యయయ్యెను. కంసుడాశ్చర్య చకితుడై యింటికేగి దానవుల నందరను పిలిచెను. అతడు క్రోధభయాతురుడై బక ధేనుకవత్సాది దానవుల కిట్లనెను : ఇపుడు మీరెల్లరును నా కార్యసిద్ధికి పూనుకొనుడు. మీరిపు డెక్కడ పుట్టిన బాలు నక్కడ మట్టు పెట్టుడు. బాలఘాతిని యగు పూతన యిపుడే నంద గోకులమున కేగ గలదు. ఆమె పుట్టిన ప్రతి శిశువును వెంటనే చంపగలదు. కేశి - వత్సక - బక - ధేనుక - ప్రలంబాది దానవులును నా కార్యము నెఱవేర్చుట కచటనే యుందురు గాక! అని యసురుల నాజ్ఞాపించి దుష్టకంసుడు తన యాలయమున కేగెను. ఈ రీతిగ కంసుడు చింత్రాకాంత్రుడై మాటిమాటికి తన చావును దలపోయుచు దీనాతిదీను డయ్యెను. ఇది శ్రీ మద్దేవి భాగవతమందలి చతుర్థ స్కంధమందు శ్రీరామకృష్ణుల యవతార వర్ణనమను నిరువదిమూడవ యధ్యాయము.