Sri Devi Bhagavatam-1
Chapters
అథ పంచవింశో%ధ్యాయః రాజోవాచ : సందేహో మే మునిశ్రేష్ఠ ! జాయతే వచనాత్తవ | వైష్ణవాంశే ! భగవతి ! దుఃఖోత్పత్తిం విలోక్య చ.
1 నారాయణాంశసంభూతో వాసుదేవః ప్రతాపవాన్ | కథం స సూతికాగారా ద్ధృతో బాలో హరేరపి.
2 సుగుప్తనగరే రమ్యే గుప్తే%థ సూతికాగృహే | ప్రవిశ్య తేన దైత్యేన గృహీతో%సౌ కథం శిశుః.
3 నజ్ఞాతో వాసుదేవేన చిత్రమేతన్మమాద్భుతమ్ | జాయతే మహదాశ్చర్యం చిత్తే సత్యవతీ సుత!
4 బ్రూహి తత్కారణం బ్రహ్మన్న జ్ఞాతం కేశ##వేన యత్ | హరణం తత్ర సంస్థేన శిశోర్వా సూతికాగృహాత్.
5 వ్యాసః : మాయా బలవతీ రాజ న్నరాణాం బుద్ధిమోహినీ | శాంభవీ విశ్రుతా లోకే కో వా మోహం న గచ్ఛతి.
6 మానుషం జన్మ సంప్రాప్య గుణాః సర్వే%పి మానుషాః | భవంతి దేహజాః కామం న దేవా నాసురాస్తదా.
7 క్షుత్తృణ్నిద్రా భయం తంద్రా వ్యామోహః శోసంచయః | హర్షశ్చై వాభిమానశ్చ జరా మరణ మేవచ. 8 అజ్ఞానం గ్లాని రప్రీతి రీర్ష్యా%సూయా మదః శ్రమః | ఏతే దేహభవా భావాః ప్రభవంతి నరాధిప. 9 యథా హేమమృగం రామో న బుబోధ పురోగతం | జానక్యా హరణం చైవ జటాయుమరణం తథా. 10 అభిషేకదినే రామో వనవాసం న వేద చ | తథా న జ్ఞాతవాన్రామః స్వశోకాన్మరణం పితుః. 11 అజ్ఞవ ద్విచచారాసౌ పశ్యమానో వనే వనే | జానకీం న వివేదాథ రావణన హృతాం బలాత్. 12 సహాయా న్వానరా న్కృత్వా హత్వా శక్రసుతం బలాత్ | సాగరే సేతుబంధం చ కృత్వోత్తీర్య సరిత్పతిమ్. 13 ప్రేషయామాస సర్వాసు దిక్షు తాన్కపికుంజరాన్ | సంగ్రామం కృతవాన్ ఘోరం దుఃఖం ప్రాప రణాజిరే. 14 ఇరువది యైదవ యధ్యాయము శ్రీకృష్ణుడు పుత్రప్రాప్తికి తపమొనరించుట జనమేజయు డిట్లనియెను : ఓ మునివరేణ్యా! శ్రీకృష్ణ భగవానుడు వైష్ణవాంశ సంజాతుడు గదా! ఆతనికిని దుఃఖము గల్గుట యనునది నాకు సందియము గొల్పుచున్నది. వాసుదేవుడు నారాయణాంశ సంభూతుడు - మహావిక్రముడు. అంతటి కృష్ణుని కుమారుడు పురిటింట నెటుల నపమరింపబడెను? ద్వారకానగరము మనోహరమైనది. సురక్షితమైనది. దాని నడుమ సూతికాగృహ మతి రహస్యముగ గలదు. అసురు డందు ప్రవేశించి శిశువు నెటుల నపహరింపగలిగెను? సత్యవతీ తనయా! శ్రీవాసుదేవున కీ విషయము తెలియదనుట విచిత్రముగను నద్భుతముగను నున్నది. బ్రాహ్మణవర్యా! మాధవుడుండగనే యతనికి తెలియని రీతిగా పురిటింటినుండి శిశువె ట్లపహరింపబడెనో దాని కారణము తెల్పుము అన వ్యాసు డిట్లనెను : రాజా! లోకమున శాంభవీవిద్య యొకటి గలదు. అదెంత వారినైనా మోహములో ముంచును. అది నరుల బుద్ధులను మోహింపచేయును. ఆ మాయ చాల బలవత్తరమైనది. మానవజన్మ మెత్తిన జీవులకు మానవ గుణములే కలుగును గాని దేవాసురభావములు గలుగవు. ఆకలిదప్పులు -నిద్ర-తంద్ర-భయము-శోకమోహ-సంశయములు-హర్షము-దేహాభిమానము-జరామరణములు-అజ్ఞానము-అప్రియము-గ్లాని-ఈసు-అసూయ-మదము-శ్రమము-మున్నగున వన్నియును దేహమున గల్గు భావములు. ఇవి దేహులకు గల్గుచుండును. గుణధాముడగు శ్రీరాముడు తనముందేయున్న బంగారు జింకనుగని సీతాపహరణము జటాయుమరణము జరుగుననికాని-యెరుగ కుండెను. పట్టాభిరాముడు తన పట్టాభిషేకమునాడే తన వనగమనమును పుత్రశోకము కారణముగ తన తండ్రి మరణము నెంతమాత్రము తెలిసికొనలేకుండెను. సీత రావణునిచేత బలిమితో నపహరింపబడెను. అపుడు రాము డొక యజ్ఞానివలె వనము వనము తిరుగుచు సీతను వెదకుచు నేమియు గ్రహింపకుండెను. రఘురాముడు వాలిని వధించెను. వానరుల సాయముతో సాగరముపై వంతెన గట్టెను. సముద్రము దాటెను. సీతారాముడు తన సీతను వెదకుటకు కపివరుల నెల్లదెసల కంపెను. ఆ కోదండరాముడు ఘోర సంగర మొనరించి రణమున దుఃఖములు పొందెను. బంధనం నాగపాశేన ప్రాప రామో మహాబలః | గరుడా న్మోక్షణం పశ్చా దన్వభూ ద్రఘునందనః. 15 అహన ద్రావణం సంఖ్యే కుంభకర్ణం మహాబలం | మేఘనాదం నికుంభం చ కుపితో రఘునందనః. 16 అదూష్యత్వం చ జానక్యా న వివేద జనార్దనః | దివ్యం చ కారయామాస జ్వలితాగ్నౌ ప్రవేశనమ్. 17 లోకాపవాదా చ్చ పరం తత స్తత్యాజ తాం ప్రియామ్ | అదూష్యాం దూషితాం మత్వాసీతాం దశరథాత్మజః. 18 న జ్ఞాతౌ స్వసుతౌ తేన రామేణ చ కుశీలవౌ | మునినా కథితౌ | తౌ తు తస్య పుత్రౌ మహాబలౌ. 19 పాతాళగమనం చైవ జానక్యా జ్ఞాతవా న్న చ | రాఘవః కోపసంయుక్తో భ్రాతరం హంతు ముద్యతః. 20 కాలస్యాగమనం చైవ న వివేద ఖరాంతకః | మానుషం దేహ మాశ్రిత్య చక్రే మానుషచేష్టితమ్. 21 తథైవ మానుషా న్భావా న్నాత్ర కార్యా విచారణా | పూర్వం కంసభయా త్ప్రాప్తో గోకులే యదునందనః. 22 జరాసంధభయా త్పశ్చా ద్ద్వారవత్యాం గతో హరిః | అధర్మం కృతవా న్కృష్ణో రుక్మిణ్యాహరణం చ యత్. 23 శిశుపాలహృతాయాశ్చ జానన్ధర్మం సనాతనమ్ | శుశోచ బాలకం కృష్ణః శంబరేణ హృతం బలాత్. 24 ముమోద జానన్పుత్త్రం తం హర్షశోకయుత స్తతః | సత్యభామాజ్ఞయా యత్తు యుయుధే స్వర్గతః కిల. 25 ఇంద్రేణ పాదపార్థం తు స్త్రీజితత్వం ప్రకాశయన్ | జహార కల్పవృక్షం యః పరాభూయ శతక్రతుమ్. 26 మానినీమాన రక్షార్థం హరిశ్చక్ర ధరః ప్రభుః | బధ్వా వృక్షే హరిం సత్యా నారదాయ దదౌ పతిమ్. 27 దత్త్వా%థ కనకం కృష్ణం మోచయామాస భామినీ | దృష్ట్వా పుత్రా న్పురుగుణాన్ప్రద్యుమ్నప్రముఖా నథ. 28 మహావిక్రముడగు రాఘవుడు నాగపాశమున బద్ధుడై పిదప గరుడుని వలన విముక్తి జెందెను. భండన భీముడగు రాముడు మహాబలులగు రావణకుంభకర్ణులను మేఘనాదనికుంభులను నుగ్రుడై సంహరించెను. శ్యామలకోమలాంగుడగు రాముడు జానకి నిర్దోషత్వ మెఱుగలేక యామెను పవిత్రురాలిగ నిరూపించుట కామె నగ్నిలో ప్రవేశింపజేసెను. అందు సీత పావని నిర్దోషురాలని తేలినది. పిదప మరల నామె దూషితురాలను లోకాపవాదము బయలుదేరెను. రాము డా భయమున జానకిని మరల కాననముల కంపెను. ఆమెకు వనములందు లవకుశులు జన్మించిరి. రాముడు వారిని తన సుతులని యెఱుగకుండెను. వాల్మీకి ముని చెప్పిన మీదట వారు తన పుత్త్రులని రాము డెఱుగగల్గెను. మఱి సీత పాతాళము జొచ్చుటయు రాము డెఱుగడు. ఒకప్పుడు రామభద్రుడు కోపావేశమున తన తమ్ముని చంప నుంకించెను. ఖరాంతకుడైన రాముడు తన్ను కాల పురుషుడు సమీపించుటయును తెలిసికొనలేకపోయెను. ఈ విధముగ శ్రీరామచంద్రుడు మనుజ శరీరము దాల్చి మానవ కృత్యము లొనరించెను. రామునకు వలెనే శ్రీకృష్ణు నందును మానవ భావములు గలవనుటలో నెట్టి సందియమును లేదు. తొల్లి కృష్ణుడు కంస భీతిచే గొల్లపల్లె కేగెను. కృష్ణుడు జరాసంధుని భయమున ద్వారక జొచ్చెను. కృష్ణుని రుక్మిణీహరణము పూర్తిగ ధర్మరహితమైనదే. శిశుపాలుడు తొలుత రుక్మిణిని మనసార వరించెను. హరికి సనాతన ధర్మము తెలియును. ఐన నత డట్లేల రుక్మిణిని హరించెను. తన కుమారుని శంబరుడు హరింపగ కృష్ణుడు బోరుబోరున విలపించెను. అపుడు శ్రీదేవి దయవలన హరి తన పుత్త్రుని సమాచార మెఱిగి సంతసించెను. ఇట్లు కృష్ణునంతటి వాడును హర్ష శోకములనుభవించెను. అటుపిమ్మట సత్యభామ యానతి మేరకు కృష్ణుడు స్వర్గమున కేగెను. అచట నతడింద్రునితో పారిజాతము కొఱకు పోరు సల్పెను. దీనిబట్టి కృష్ణుడు స్త్రీ పరతంత్రుడని తేటతెల్లమగుచున్నది. కృష్ణు డింద్రు నోడించి పారిజాతము హరించి తెచ్చెను. ఇదంతయు ఆ చిత్రవిచిత్ర చరిత్రుడైన ప్రభువు మానినీ మాన సంరక్షణ కొనరించెను. ఒకప్పుడు సత్యభామ తన పతి నొక చెట్టునకు గట్టి నారదునకు దానమొసంగెను. ఆమె తనపతి యెత్తు బంగారము తూచి యిచ్చి తన పతిని విడిపించుకొనెను. ప్రద్యుమ్నుడు మున్నగు తనయులను రుక్మిణి కనెను. వారు సుగుణవంతులు. కృష్ణం జాంబవతీ దీనా యయాచే సంతతిం శుభాం | స య¸° పర్వతం కృష్ణ స్తవస్యాకృతనిశ్చయః. 29 ఉపమన్యు ర్ముని ర్యత్ర శివభక్తః పరంతపః | ఉపమన్యుం గురుం కృత్వా దీక్షాం పాశుపతీం హరిః. 30 జగ్రామ పుత్రకామ స్తు ముండీ దండీ బభూవ హ | ఉగ్రం తత్ర తపస్తేపే మాసమేకం ఫలాశనః. 31 జజాప శివమంత్రంతు శివధ్యానపరో హరిః | ద్వితీయే తు జలాహార స్తిష్ఠన్నేకపదా హరిః. 32 తృతీయ వాయుభక్ష స్తు పాదాంగుష్ఠాగ్ర సంస్థితః | షష్ఠే తు భగవాన్రుద్రః ప్రసన్నో భక్తిభావతః. 33 దర్శనం చ దదౌ తత్ర సోమః సోమకళాధరః | ఆజగామ వృషారూఢః సురైరింద్రాభి ర్వృతః. 34 బ్రహ్మావిష్ణుయుతః సాక్షా ద్యక్షగంధర్వసేవితః | సంబోధయ న్వాసుదేవం శంకర స్తమువాచ హ. 35 తుష్టో%స్మి కృష్ణ | తపసా తవోగ్రేణ మహామతే | దదామి వాంఛితా న్కామాన్ బ్రూహి యాదవనందనః 36 మయిదృష్టే కామపూరే కామశేషో న సంభ##వేత్ | వ్యాసః: తం దృష్ట్వా శంకరం తుష్టం భగవాన్దేవకీ సుతః. 37 పపాత పాదయో స్తస్య దండవత్ప్రేమసంయుతః | స్తుతిం చకార దేవేశో మేఘగంభీరయా గిరా. 38 తనకు నట్టి సంతతి గలిగించుమని జాంబవతి దీనయై కృష్ణుని గోరెను. అంత కృష్ణుడు పుత్త్రార్థము తపమొనర్ప నొక పర్వతమున కేగెను. అచట శివభక్తు డగు నుపమన్యువు గలడు. కృష్ణు డతనియెడ కరిగి యతనిని తన గురునిగ భావించి పరమ దీక్షతో నియమ నిష్ఠలతో పాశుపత మంత్రము జపించెను. అపుడు కృష్ణుడు త్రిదండియై ముండియై యుగ్రతప మాచరించెను. అతడొక నెల ఫలములు మాత్రము తిని యుండెను. రెండవ నెలలో నీరుగ్రోలుచు శివధ్యాన పరాయణుడై సదాశివ మంత్రము జపించుచు నొంటికాలిపై నుండెను. మూడవ నెలలో వాయు భక్షణముతో బొటన వ్రేలిపై నిలిచి తప మొనర్చుచుండెను. ఆరవ నెలలో సోముడు కరుణా సముద్రుడు నగు రుద్రు డతని భక్తికి ప్రసన్నుడయ్యెను. నెలపూదాలుపగు పశుపతి శివుడు కృష్ణునకు దర్శనభాగ్య మొసగె. వృషభవాహనుడై యింద్రాది దేవతలతో గూడి బ్రహ్మ-విష్ణువు-యక్ష గంధర్వులు తన్ను సేవింపగ నేగుదెంచి వాసుదేవుని సంభావించి యిట్లు పలికెను : ఓ యదునందనా ! కృష్ణా! నీ యుగ్రతపమునకు సంతుష్టి నందితిని. నీ కామితములు దెలుపుము. తీర్పగలను. నేను పూర్ణకాముడను. నా దర్శన భాగ్యమున నా భక్తుని కోర్కులు పూర్తికాక మిగులవు. శంకరుడు తనపట్ల ప్రసన్నుడైనందులకు కృష్ణుడు ముదమందె. భక్తిమీర శివుని పాదపద్మములు పట్టి దండ ప్రణామము లాచరించెను. సనాతనుడగు హరి శింభుని సమ్ముఖమున నిలుచుండి మేఘగంభీర వాక్కులతో హరు నీ విధముగ సంస్తుతించెను: స్థితస్తు పురతః శంభో ర్వాసుదేవః సనాతనః | కృష్ణః: దేవదేవ! జగన్నాథ! సర్వభూతా ర్తినాశన. 39 విశ్వయోనే! సురారిఘ్న! నమసై#్త్రలోక్యకారక! నీలకంఠ నమస్తుభ్యం శూలినే తే నమోనమః. 40 శైలజావల్లభాయాథ యజ్ఞఘ్నాయ నమో%స్తుతే | ధన్యో%హం కృతకృత్యో2హం దర్శనాత్తవ సువ్రత. 41 జన్మ మే సఫలం జాతం నత్వా తే పాదపంకజం | బద్ధో%హం శ్రీమయైః పాశైః సంసారే%స్మిన్ జగద్గురో! 42 శరణం తే%ద్య సంప్రాప్తో రక్షణార్థం త్రిలోచన! | సంప్రాప్య మానుషం జన్మ cన్నో%హం దుఃఖనాశన. 43 త్రాహి మా శరణం ప్రాప్తం భవభీతం భవాధునా | గర్భవాసే మహద్దుఃఖం ప్రాప్తం మదనదాహక. 44 జన్మతః కంసజభయ మనుభూతం చ గోకులే | జాతో%హం నందగోపాలో వల్లవాజ్ఞాకర స్తథా. 45 జన్మతః కీర్ణ కేశస్తు భ్రమన్వృందావనే ఘనే | వ్లుెచ్ఛరాజభయత్రస్తో గతో ద్వారవతీం పునః. 46 త్యక్తా పిత్య్రం శుభం దేశం మాథురం దుర్లభం విభో | యయాతిశాపబద్ధేన తసై#్మ దత్తం భయా ద్విభో. 47 రాజ్యం సుపుష్టమపి చ ధర్మరక్షాపరేణ చ | ఉగ్రసేనస్య దాసత్వం కృతం వై సర్వదా మయా. 48 రాజా%సౌ యాదవానాం వై కృతో నః పూర్వజైః కిల | గార్హస్థ్యం దుఃఖదం శంభో స్త్రీవశ్యం ధర్మఖండనమ్. 49 పారతంత్ర్యం సదా బంధో మోక్షవార్తా%త్ర దుర్లభా | రుక్మిణ్మా స్తనయా న్దృష్ట్వా భార్యా జాంబవతీ మమ. 50 ప్రేరయామాస పుత్త్రార్థం తపసే మదనాంతక | సకామేన మయా తప్తం తపః పుత్రార్థ మద్య వై. 51 లజ్జా భవతి దేవేశ ప్రార్థనాయాం జగద్గురో | కస్త్వా మారాధ్య దేవేశం ముక్తిదం భక్తవత్సలమ్. 52 ప్రసన్నం యాచతే మూఢః ఫలం తుచ్ఛం వినాశి యత్ | సో%యం మాయావిమూఢా%%త్మా యాచే పుత్రసుఖం విభో! 'దేవ దేవా జగన్నాథా! సర్వభూతార్తి నాశన! నీల కంధరా! మహాదేవా! శూలీ! సురపతీ! నీ కివే నమస్సులు. గిరిజారమణా! యాగ విధ్వంసకా! సువ్రత! నీకు నా మనస్సు. నీ దివ్య దర్శనముచే ధన్యుడనైతిని. కృతకృత్యుడనైతిని. జగద్గురూ! నీ పదపద్మములకు మ్రొక్కుటచే నా బ్రతుకు సార్థకమైనది. ఈ సంసారమునందు కామినీ మోహపాశములకు బద్ధుడనైతిని. దుఃఖనాశకా! రుద్రా! ముక్కంటీ! నిన్ను శరణు వేడుచున్నాను. ఈ నరజన్మము పడసి నేను మిక్కిలి దుఃఖముల పాలైతిని. భవా! మదనాంతకా! నేను భవభీతుడను. నీకు శరణాగతుడను. నన్ను బ్రోవుము. గర్భవాసమపుడు నేను మిక్కిలి దుఃఖమందితిని. నేను పుట్టిన నాటినుండి కంసుభయమున గోకులమున నుంటిని. అచట గొల్లవారి కోరిక ప్రకారము నందగోపాలకుడ నైతిని. నా తల వెండ్రుకలు గోధూళి ధూసరితములై యొప్పుచుండగ నేను ప్రాకృతిక శోభల తనరు బృందావమున గ్రుమ్మరితిని. వ్లుెచ్ఛుడగు కాలయవనునకు జడిసి ద్వారక కేగితిని. విభూ! మధురానగరము దుర్లభ##మైనది. శుభప్రదమైనది. అది నా అభిజనము. అట్టి మాతృభూమిని యయాతి శాపబద్ధుడనై వదలిపెట్టితిని. మధురా రాజ్యము సిరిసంపదలకు నెలవైనది. నేను దానిని ధర్మరక్షణకు వదలి యుగ్రసేనున కొసంగి అతనికి దాస్య మొనర్చితిని. పూర్వజులగు యాదవు లతనినే రాజు నొనర్చిరి. శంభూ! గార్హస్థ్యము దుఃఖకరము - ధర్మమును చెఱచునది. స్త్రీ ప్రాధాన్యము గలది. సంసారము పరతంత్రమైనది. ఇట్టి దుస్తర సంసారబంధము నుండి తరించుటతి దుర్లభము. మదనాంతకా! నా భార్య జాంబవతి! ఆమె రుక్మిణీ తనయులను గాంచి తనకు నట్టి సుపుత్రులు వలయునని తప మొనర్ప నన్ను ప్రేరించినది. నేనిపుడు పుత్రార్థమయి సకామముగ తపమొనరించితిని. మహాదేవా! శంకరా! జగద్గురూ! నిన్ను పుత్త్రునిమ్మని గోరుటకు నాకు సిగ్గగుచున్నది. నీవు భక్తుల యిలవేల్పవు. ముక్తిప్రదుడవు, దేవేశ్వరుడవు. సుప్రసన్నుడవు. నిన్ను మనసార నారాధించితిని. నశ్వరమగు తుచ్ఛఫలమును మూఢు డాశించును. ఇపుడు నేను నట్టి మాయా మూఢాత్ముడనైతిని. కామిన్యా ప్రేరితః శంభో ముక్తిదం త్వాం జగత్పతే | జానామి దుఃఖదం శంభో సంసారం దుఃఖసాధనమ్. 54 అనిత్యం నాశధర్మాణం తథా%పి విరతి ర్నమే | శాపాన్నారాయణాంశో%హం జాతో%స్మిన్ క్షితిమండలే. 55 భోక్తుం బహుతరం దుఃఖం మాయాపాశేన యంత్రితః | వ్యాస ఉవాచ : ఇత్యుక్త వంతం గోవిందం ప్రత్యువాచ మహేశ్వరః. 56 బహవస్తే భవిష్యంతి పుత్త్రాః శత్రునిఘాదన | స్త్రీణాం షోడశ సాహస్రం భవిష్యతి శతార్థకమ్. 57 తాసు పుత్రా దశ దశ భవిష్యంతి మమాబలాః | ఇత్యుక్త్వో పరరామాశు శంకరః ప్రిదర్శనః 58 ఉవాచ గిరిజా దేవీ ప్రణతం మధుసూదనం | కృష్ణ కృష్ణ మమాబాహో సంసారే%స్మి న్నరాధిప ! 59 గృహస్థప్రవరో లోకే భవిష్యతి భవానిహ | తతో వర్షశతాంతే తు ద్విజశాపా జ్జనార్దన. 60 గాంధార్యా శ్చ తథా శాపా ద్భవితా తే కులక్షయః | పరస్పరం నిహత్యాజౌ పుత్రాస్తే శాపమోహితాః. 61 గమిష్యంతి క్షయం సర్వే యాదవాశ్చ తథా%పరే సానుజ స్త్వం తథా దేహం త్యక్త్వా యాస్యసి వై దినమ్. 62 శోక స్తత్ర న కర్తవ్యో భవితవ్యం ప్రతి ప్రభో | అష్టావక్రస్య శాపేన భార్యా స్తే మధుసూదన 64 చోరేభ్యో గ్రహణం కృష్ణ గమిష్యంతి మృతేత్వయి | ఇత్యుక్త్వా%ంతర్దధేశంభుః సోమః ససురమండలః. 65 ఉపమన్యుం ప్రణమ్యా%థ కృష్ణో%పి ద్వారకాం య¸° | తస్మాద్బ్రహ్మాదయో రాజన్సంతి యద్యప్యధీశ్వరాః. 66 తథా%పి మాయాకల్లోలయోగ సంక్షుభితాంతరాః | తదధీనాః స్థితాః సర్వే కాష్ఠపుత్తలికోపమాః. 67 యథా యథా పూర్వభవం కర్మ తేషాం తథా తథా | ప్రేరయత్యనిశం మాయా పరబ్రహ్మస్వరూపిణీ. 68 కామినీ ప్రేరితుడ నైతిని. నీవు ముక్తిదాయకుడవు. శంభుడవు. జగత్పతివి. అట్టి నీ దర్శనము కాగా నేను పుత్త్ర సుఖము గోరుచున్నాను. సంసారము నశ్వరము. క్షణికము. దుఃఖమూలము. సారములేని ఈ సంసారము దుఃఖదాయకమని తెలిసియును దానిని వదలి పెట్టజాలకున్నాను. నారాయణాంశజుడనయ్యు భూమిపై నవతరించితిని. మోహ మాయాపాశములకు బద్ధుడనైతిని. పెక్కు దుఃఖము లనుభవించుటకు జన్మమెత్తితిని. ఇట్లు గోవిందుడు పలుకగా మహేశ్వరుడు కృష్ణుని కిట్లు పలికెను : శత్రునిషూదనా! నీకు పెక్కురు పుత్రులు గలుగుదురు గాక! నీకు పదారువేల మంది స్త్రీలుందురు. ప్రతి యొక్కతెకు పదిమంది చొప్పున మహాబలశాలురు జన్మింపగలరు అని ప్రియదర్శనుడగు శంకరుడు పలికి ముగించెను. అంత మధుసూదనుడు గిరిజాదేవికి మ్రొక్కెను. ఈశ్వరి కృష్ణున కిట్లనెను : 'కృష్ణా! మహాబాహు! నరాధిపా! నీవీ ప్రపంచమందు వాసిగాంతువు. నీవు గృహస్థ శ్రేష్ఠుడవగుదువు. నూఱండ్లు పిదప నీకు విప్రశాపము తగులును. గాంధారీ శాపమున నీ కులక్షయమగును. నీ సుతులు శాపవశమున తమలోదాము పోరి చత్తురు. పిమ్మట యాదవు లెల్లరు నశింతురు. బలరాముడు నీవును తనువులు చాలించి దివి కేగుదురు కాన భవితవ్యమునకు వగవ వలదు. జరుగవలసిన దానికి ప్రతీకారము సాధ్యమే కాదు. ఈ నా వాక్కులకు శోకింపకుము. మధుసూదనా! నీ కష్టావక్రుని శాపము తగులును. దాని మూలమున నీవు దేహము చాలించిన పిదప నా భార్యలు దొంగలచేత నపహరింపబడుదురు అని గిరిజ పలికెను. పిదప పార్వతి పరమేశ్వరులు దేవతలను గూడి యంతర్ధాన మొందిరి. అంత కృష్ణుడుపమన్యునకు నమస్కరించి ద్వారక కరిగెను. కావున బ్రహ్మాదులగు నధీశ్వరులును మాయకు వశులగుదురు. వారును మాయా కల్లోలమున కొట్టుమిట్టాడుదురు. ఎల్లరును కొయ్యబొమ్మలవలె మాయాశక్తికి వశులగుదురు. ఎవరెవరి పూర్వజన్మ కర్మము లెట్లుండునో వారివారినట్లు చిద్రూపిణియగు మాయాశక్తి ప్రేరించును. న వైషమ్యం న నైర్గృణ్యం భగవత్యాం కదాచన | కేవలం జీవమోక్షార్థం యతతే భువనేశ్వరీ. 69 యది సా నైవ సృజ్యేత జగదేతచ్చరాచరం | తదా మాయావినా భూతం జడం స్యాదేవ నిత్యశః. 70 తస్మాత్కారుణ్య మాశ్రిత్య జగజ్జీవాదికం చ యత్ | కరోతి సతతం దేవీ ప్రేరయత్యనిశం చ తత్. 71 తస్మా ద్బ్రమ్మాదిమోహే%స్మిన్కర్తవ్యః సంశయో న హి | మాయాంతః పాతినః సర్వే మాయాధీనాః సురా%సురాః. 72 స్వతంత్రా నైవ దేవేశీ స్వేచ్ఛాచార విహారిణీ | తస్మాత్సర్వాత్మనా రాజ న్సేవనీయా మహేశ్వరీ. 73 నాతః పరతరం కించి దధికం భువనత్రయే | ఏతద్ధి జన్మసాఫల్యం పరాశ##క్తేః పదస్మృతిః. 74 మా భూ త్తత్ర కులే జన్మ యత్ర దేవీ నదైవతం | అహం దేవీ న చాన్యో%స్మి బ్రహ్మైవాహం న శోకభాక్. 75 ఇత్యభేదేన తాం నిత్యాం చింతయే జ్జగదంబికాం | జ్ఞాత్వా గురుముఖాదేనాం వేదాంత శ్రవణాదిభిః. 76 నిత్య మేకాగ్రమనసా భావయే దాత్మరూపిణీమ్ | ముక్తో భవతి తేనాశు నాన్యథా కర్మకోటిభిః. 77 శ్వేతాశ్వతరాదయః సర్వే ఋషయో నిర్మలాశయాః | ఆత్మరూపాం హృదా జ్ఞాత్వా విముక్తా భవబంధనాత్. 78 బ్రహ్మ విష్ణ్వాదయ స్తద్వ ద్గౌరీ లక్ష్మ్యాదయ స్తథా | తామేవ సముపాసంతే సచ్చిదానంద రూపిణీమ్. 79 ఇతి తే కథితం రాజ న్యద్యత్పృష్టం త్వయా%నఘు | ప్రపంచ తాపత్రస్తేన కిం భూయః శ్రోతు మిచ్ఛసి. 80 ఏతత్తే కథితం రాజన్మాయాఖ్యాన మనుత్తమం | సర్వపాపాహరం పుణ్యం పురాణం పరమాద్భుతమ్. 81 య ఇదం శృణుయా న్నిత్యం పురాణం వేదసమ్మితం | సర్వపాపవినిర్ముక్తో దేవీలోకే మహీయతే. 82 పురాణం పంచమం నూనం శ్రీ మద్భాగవతాభిధమ్. 83 ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ%ష్టా దశసాహస్ర్యాం సంహితాయాం చతుర్థస్కంధే పంచవింశో%ధ్యాయః స్కంధశ్చాయం సమాప్తః. అర్ధాధికై ర్వసువిధుయుగ విశ్వంభరా (1418) భిథైః | పద్యై శ్చతుర్థస్కంధో%యం కథితో వ్యాసనిర్మితైః. త్రిభునేశ్వరికి జీవుల యెడల నిర్దయత గాని వైషమ్యము గాని లేదు. ఆ తల్లి జీవుల ముక్తికి ప్రయత్నించును. ఆ త్రిభునేశ్వరీదేవి యీ చరా చర బ్రహ్మాండములను విశ్వ చైతన్య జ్యోతియై సృజింపనిచో నీ జగము జడమాత్రమైయుండెడిదే. ప్రాణులకు జీవనాధారము చిచ్ఛక్తియగు జనని ఆమె. ఆమె కనికరముతో జగజ్జీవులను సృజించి వారి వారి కర్మానుసారము ప్రవర్తింపజేయును. బ్రహ్మాదులు సైతము మాయామోహితులు - మాయా పరతంత్రులు. వివిధ శక్తులు గల మాయకు పరతంత్రులనుటలో నెట్టి సందియమును లేదు. విశ్వమాత-దేవదేవేశ్వరి-సర్వస్వతంత్రురాలు. స్వేచ్ఛా విహారిణి. కనుక నా మహేశ్వరి నెల్ల విధములు భజింపవలయును. ఈ ముజ్జగములం దా లోకమాతను మించినదేదియును లేదు. పరాశక్తి పదకమల చింతనము వలన జన్మము తరించును. చరితార్థమగును. ఎవరి కాదేవత కులదేవత కాదో యతని కులమున నెన్నడును నాకు జన్మము గలుగకుండుగాత! నేనే పరబ్రహ్మమను. నేనే శ్రీదేవిని. నేనే శోకరహితుడను. ఇతరముగాదు అను నభేదభావమున తన్మయత్వమున నిత్యము జగన్మాతను సంస్మరింపవలయును. అచింత్య లక్షణములుగల మాతను వేదాంత శ్రవణముల వలన సద్గురు ముఖమున నెరుగవలయును. ఆ సన్మాత్రయగు చిన్మాత్ర పరమాత్మ స్వరూపిణి. ఆమె నేకాగ్ర చిత్తముతో భావింపవలయును. అపుడు జీవు డిక్కడనే ముక్తిజెందును. అంతేకాని. కర్మకోటులవలన గూడకైవల్యముక్తి లభింపదు. శ్వేతాశ్వతరాది ఋషులు నిర్మల చిత్తముతో నాత్మానంద స్వరూపిణి నెరింగి భవబంధ ముక్తులయిరి. బ్రహ్మ-విష్ణువు-గౌరి-లక్ష్మి మున్నగు దేవతలా సచ్చిదానంద స్వరూపిణిని నిత్యయుక్తులై సముపాసింతురు. రాజా! ఈ ప్రకారముగ నీవడిగిన వన్నియును వివరించి చెప్పితిని. ఇంకేమి వినగోరుదువు? ఓ రాజా! ఇట్లు పుణ్యప్రదము పాపహరము అత్యద్భుతమునగు శ్రీమద్దేవీ పురాణమును నీకు తెలిపితిని. ఈ దేవీ పురాణము వేదసమ్మితము. దీని నాత్యంతిక భక్తితో వినువాడు సర్వ పాపముక్తుడై శ్రీ దేవీ లోకమందు మహిమాన్వితుడగును. ఈ ప్రకారముగ పంచమ పురాణమగు దేవీ భాగవతమును నేను పూర్వము వ్యాసమహర్షి వలన వింటిని. ఇది పదునెనిమిదివేల శ్లోకములుగల శ్రీమద్దేవీ భాగవత మహాపురాణమందలి చతుర్థ స్కంధమందు శ్రీకృష్ణుడు పుత్ర ప్రాప్తికి తపమొనర్చుటయను నిరువదియైదవ యధ్యాయము. ఇది 1418 శ్లోకములతో వ్యాసరచితమైన చతుర్థ స్కంధము. l l l