Sri Devi Bhagavatam-1    Chapters   

అథ నవమో%ధ్యాయః

సూత ఉవాచ : ¸R…Vµy„s¬sLæRi»y ¬súµy ®µ…[¥¦¦¦ »R½ò xqsù ÇÁgRiµæR…VL][M e ®ƒs[ú»yxqsùƒyzqsNSËØx¤¦¦¦§ x¤¦¦¦XµR…¹¸…[V˳ÏÁù xqsò´][LRixqsM. 1

నిస్సృత్య గగనే తస్థౌ తామసీ శక్తి రుత్తమా | ఉదతిష్ఠ జ్జగన్నాథో జృంభమాణః పునఃపునః. 2

తదా%పశ్య త్థ్సితం తత్ర భయత్రస్తం ప్రజాపతిమ్‌ | ఉవాచ చ మహాతేజా మేఘగంభీరయా గిరా. 3

కి మాగతో%సి భగవం స్తవ స్తక్త్య్వా%త్ర పద్మజ|కస్మా చ్చింతాతురో%సి త్వంభయాకులితమానసః. 4

బ్రహ్మోవాచ : త్వత్కర్ణమలజౌదేవ దైత్యౌచమధుకైటభౌ | హంతుంమాంసముపాయాతౌఘోరరూపౌమహాబలౌ 5

భయా త్తయోః సమాయాత స్త్వత్సమీపం జగత్పతే | త్రాహి మాం వాసుదేవాద్య భయత్రస్తం విచేతనమ్‌. 6

విష్ణు రువాచ : తిష్ఠాద్యనిర్భయోజాతస్తౌహనిష్యా మ్యహింకిల | యుద్ధాయాజగ్మతుర్మూఢౌమత్సమీపంగతాయుషౌ. 7

ఏవం వదతి దేవేశే దానవౌ తౌ మహాబలౌ | విచిన్వానా వజంచోభౌ సంప్రాప్తౌ మదగర్వితౌ. 8

నిరాధారౌ జలే తత్ర సంస్థితౌ విగత జ్వరౌ | తా వూచతు ర్మదోన్మత్తౌ బ్రహ్మాణం మునిసత్తమాః. 9

పలాయిత్వా సమాయాతః సన్నిధా వస్య కిం తతః | యుద్ధం కురు హనిష్యావః పశ్యతో%సై#్యవ సన్నిధౌ. 10

పశ్చాదేనం హనిష్యావః సర్పయోగోపరి స్థితమ్‌ | త్వమద్య కురు సంగ్రామం దాసో%స్మీతి చ వా వద. 11

తొమ్మిదవ అధ్యాయము

శ్రీదేవి దయచే విష్ణువు మధుకైటభుల పరిమార్చుట

సూతు డిట్లనియెను : జగద్గురుడగు విష్ణుని దేహమందలి కన్నులు ముక్కు నోరు గుండె ఱొమ్ములనుండి నిద్ర తొలగిపోయెను. అపుడా తామసశక్తి హరి మేను విడనాడి గగనసీమపై నొప్పుచుండెను. ఆ హరియు మాటి మాటి కావులించుచు మేలుకాంచెను. మహాతేజుడు శ్రీహరి భయపీడితుడైన బ్రహ్మను గనుంగొని మేఘగంభీర భాషలతో నతని కిట్లు పలికెను: ఓ భగవానుడా! కమలజా! నీ తపము వదలి యిటకేల యరుగుదెంచితివి? మఱియు చింతా తరుడవై భయభీతుడవై వైక్లబ్యమున నేలయుంటివి? బ్రహ్మ యిట్లనియెను: ఓ దేవా! నీ చెవుల మలమునుండి భీకరాకారులు బలవంతులు మధుకైటభులను దనుజులను పుట్టిరి. జగత్పతీ! దేవా! వారివలన భయమున నేను నీ సన్నిధి చేరితిని. నేను భయగ్రస్తుడను-విచేతనుడను. నన్ను త్వరగా కాపాడుము. విష్ణు విట్లనియెను: నీ విచటనే యుండుము. నేనేగి వారి యంతు తేల్చుకొందును. ఆ మూఢుల కాయువు మూడినది. లేనిచో నాతోడ నేల బోరవత్తురు? సూతు డిట్లనియెను: ఆ దేవేశుడట్లు పలికినంతనే యా మదమత్తులు విక్రమవంతులు నగు రక్కసులు వేల్పు పెద్దను వెదకుచు నచటి కేతెంచిరి. ఓ మునులారా! ఆ సంద్రమునందు నిరాధారులై విగతజ్వరులై మదగర్వమున విఱ్ఱవీగు దైతేయులు బ్రహ్మతో నిట్లనిరి: మానుండి పరుగెత్తి నీ వితని చెంత కెల వచ్చితివి? మాతో రణము సల్పుము. ఈ పురుషుడు చూచుచుండగనే యిపుడే నిన్ను బరిమార్తుము. ఆ పిదప పాపసెజ్జపై పరున్న యితనిని హతమార్తుము కాన నీవు మాతో బోరుము. లేక మీకు దాసుడనైతి ననుము.

సూత ఉవాచ : »R½¿RÁVèéQû»y* ª«s¿RÁƒ«sLi„sxtñsvryòª«soªy¿RÁÇÁƒyLôRiƒ«sM e NRPVLRiV»R½Li xqsª«sVLRiLi NSª«sVLi ª«sV¸R…Wµyƒ«sª«sxmsoLigRiª_. 12

హరిష్యామి మదం చాహం యువయో ర్మత్తయోః కిల | ఆగచ్ఛతం మహాభాగౌ శ్రద్ధాచే ద్వాం మహాబలౌ. 13

సూత ఉవాచ : úaRPV»y* »R½µR…*¿RÁƒ«sLi¿][Ë³Ý úN][µ³R…ªyùNRPVÌÁ ÍÜ[¿RÁƒ_ e ¬sLSµ³yL_ ÇÁÌÁ ró¢¿RÁ¸R…VVµôð][µR…VùQQN_ò ‡Á˳ÏÁWª«s»R½VM. 14

మధుశ్చ కుపిత స్తత్ర హరిణా సహ సంయుగమ్‌ | కర్తుం ప్రచలిత స్తూర్ణం కైటభస్తు యథా స్థితః. 15

బాహుయుద్ధం తయో రాసీ న్మల్లయోరివ మత్తయోః | శ్రాంతే మధౌ కైటభస్తు సంగ్రామ మకరో త్తదా. 16

పున ర్మధుః కైటభశ్చ యుయుధాతే పునఃపునః | బాహుయుద్ధేన రాగాంధౌ విష్ణువా ప్రభవిష్ణువా. 17

ప్రేక్షకస్తు తదా బ్రహ్మా దేవీ చైవాంతరిక్షగా | న మవ్లుతు స్తదా తౌ తు విష్ణుస్తు వ్లూని మాప్తవాన్‌. 18

పంచవర్షసహస్రాణి యదా జాతాని యుధ్యతా | హరిణా చింతితం యత్ర కారణం మరణ తయోః. 19

పంచవర్షసహస్రాణి మయా యుద్ధం కృతం కిల | న శ్రాంతౌ దానవౌ ఘోరౌ శ్రాంతో%హం చైత దద్భుతమ్‌. 20

క్వ గతం మే బలం శౌర్యం కస్మా చ్చేమా వనామ¸° | కిమత్ర కారణం చింత్యం విచార్య మనసా త్విహ. 21

ఇతి చింతాపరం దృష్ట్వా హరిం హర్షపరా వుభౌ | ఊచతుస్తౌ మదోన్మత్తౌ మేఘగంభీరని స్వనౌ. 22

తవ నో చే ద్బలం విష్ణో యది శ్రాంతో%సి యుద్ధతంః| బ్రూహి దాసో%స్మి వాం నూనం కృత్యా శిరసిచాంజలిమ్‌. 23

నచే ద్యుద్ధం కురుష్వాద్య సమర్థో%సి మహామతే | హత్వా త్వాం నిహనిష్యావః పురుషం చ చతుర్ముఖమ్‌. 24

సూతు డిట్లనియెను : వారి పలుకులు విని జనార్దనుడు వారి కిట్లనియెను: ఓ దైత్యులారా! మీరు నాతో సంగర మొనరింపుడు. మహాబలులారా! మదయుతులగు మీ కండకావరమంతయు నిపుడే యంతమొందింతును. మీ కిష్టమైనచో నాతో సంగర మొనరింపుడు. సూతు డిట్లనియెను : హరి మాటలు విని వారు క్రోధమున నెఱ్ఱబారిన గుండెలతో నిరాధారమైన నీటిలోనే యుండి యుద్ధము సేయ దలపెట్టిరి. అంత మధువు శ్రీహరితో రణ మొనర్ప నాయత్తమయ్యెను. కైటభుడూరుకుండెను. వారు మత్తమల్లవీరులవలె పోరదొడగిరి. మధు వలసట జెందగనే కైటభుడు హరితో నాలము సల్పుచుండెను. ఆ మధుకైటభు లొకరి తరువాత నొకరు రాగాంధులై ప్రభవిష్ణువగు విష్ణునితో బాహుయుద్ధమునకు దలపడిరి. ఆకసమునుండి శ్రీదేవియు బ్రహ్మయు నిరువురును వారి పోరితము తిలకించుచుండిరి. దురము సలుపు దానవు లెంతకు నలయుటలేదు. కాని హరి డస్సిపోయెను. ఈ రీతిగ నాలము జరుగుచుండగ నైదు వేలేండ్లు గడచినవి. భగవంతు డంతట వారి వధోపాయమునుగూర్చి తన మదిలో నీ రీతి విచారించదొడగెను: నేను వీరితో నైదు వేలేండ్లుగ బోరితిని. ఐనను వీరికి శ్రమ గలుగుటలేదు. కాని నేనలసితిని. ఇదంతయు జూడగ నాకచ్చెరువు గలుగుచున్నది. నా బలవీర్యములు నేడేమైనవి? వీరింకను కుశలముగనే యున్నారు. ఇందులకేమి కారణమో? ఇట్లు హరిని గని మదోన్మత్తులగు దనుజులు సంతసమున మేఘగంభీర నిస్వనమున హరితో నిట్లనిరి: విష్ణూ! నీలో బలముడిగినచో రణములో నలసట చెందినచో నేను మీ దాసుడనైతినని తలపై దోయిలించుము. కాక నీకు లావే యున్నచో తిరిగి మాతో గయ్యము సేయుము. మొదట నిన్ను జంపి పిదప నలుమోములుగల యీ మహాపురుషుని నంతమొందింతుము.

సూత ఉవాచ : úaRPV»y*»R½µy÷éztsQ»R½Li„sxtñsvxqsò¹¸…W xqsòzqsøƒ«søx¤¦Ü[µR…µ³_ e Dªy¿RÁª«s¿RÁƒ«sLiaýRPORPQßáLiryª«sVxmspLRi*Liª«sV¥¦¦¦ª«sVƒyM. 25

శ్రాంతే భీతే త్యక్తశ##స్త్రే పతితే బాలకే తథా | ప్రహరంతి న వీరాస్తే ధర్మఏష సనాతనః 26

పంచవర్షసహస్రాణి కృతం యుద్ధం మయా త్విహ | ఏకో%హం భ్రాతరౌ వాం చ బలినౌ సదృశౌ తథా. 27

కృతం విశ్రమణం మద్యే యువాభ్యాం చ పునః పునః | తథా విశ్రమణం కృత్వా యుధ్యే%హం నాత్రసంశయః 28

తిష్ఠతం హి యువాం తావ ద్బలవంతౌ మదోత్కటౌ | విశ్రమ్యాహం కరిష్యామి యుద్ధంవా న్యాయమార్గతః 29

ఇతి శ్రుత్వా వచ స్తస్య విశ్ర బ్ధౌ దానవోత్తమౌ | సంస్థితౌ దూరత స్తత్ర సంగ్రామేకృతనిశ్చ¸°. 30

అతిదూరే చ తౌ దృష్ట్వా వాసుదేవ శ్చతుర్భుజః | దధ్యౌ చ మనసా తత్ర కారణం మరణ తయోః 31

చింతనా ద్జాన ముత్పన్నం దేవీ దత్తవరా వుభౌ | కామం వాంఛితమరణౌ న మవ్లుతు రత స్త్విమౌ. 32

వృథా మయా కృతం యుద్ధం శ్రమో2యం మే వృథా గతః | కరోమి చ కథం యుద్ధ మేనం జ్ఞాత్వా వినిశ్చయమ్‌. 33

ఆకృతే చ తథా యుద్ధే కథ మేతౌ గమిష్యతః | వినాశం దుఃఖదౌ నిత్యం దానవౌ వరదర్పితౌ. 34

భగవత్యా వరో దత్త స్తయా సో%పి సుదర్ఘటః | మరణం చేచ్ఛయా కామం దుఃఖితో%పి న వాంఛతి. 35

రోగగ్రస్తో%పి దీనో %పి న ముమూర్షతి కశ్చన | కథం చేమౌ మదోన్మత్తౌ మర్తుకామౌ భవిష్యతః 36

నన్వద్య శరణం యామి విద్యాం శక్తిం సుకామదామ్‌ | వినా తయా న సిధ్యంతికామాః సమ్యక్ప్రసన్నయా. 37

సూతు డిట్లనియెను : వారి మాటలు విని భగవంతుడు సామపూర్వకముగ నింపుసొంపు దనరు పలుకులతో సాగర మందున్న దానవులకిట్లనియెను : మహావీరులు జంకిన - యలసిన - శస్త్రము వదలినవానిపైగాని బాలునిపైగాని దెబ్బకొట్టరు. ఇది సనాతన ధర్మము. మీతో నే నైదు వేలేండ్లు బోరితిని. మీరిరువురును సమబలులు, సోదరులు. ఎడతెరపి లేక బోరువారు. నేను మాత్ర మొక్కడనే! మీరు నట్ట నడుమ సేద దీర్చుకొని కయ్య మొనర్చుచున్నారు. ఇక మీదట నేను సైత మలసట దీర్చుకొని పిమ్మట మీతో తప్పక పోరు సల్పుదును. కనుక నేను విశ్రమించి వచ్చి న్యాయమార్గమున రణము సలుపు దనుక బలశాలురు మదోత్కటులు నగు మీరు తాలిమి బూనుడు. సూతు డిట్లనియెను : ఆ హరి వాక్కులు విని రాక్షసులు అతనిపై విశ్వాసముంచి విష్ణుడు విశ్రాంతినొందిన పిమ్మట మరల సమరము కొనసాగించదలచి దూరముగ తొలగియుండిరి. చతుర్భుజుడగు వాసుదేవుడు రక్కసులను దూరమందే కాంచి వారి చావు కారణమును తన మనస్సులో నిట్లు విచారించుచుండెను. అంతలో హరి కీ విధముగ జ్ఞానోదయమయ్యెను. శ్రీదేవీ వరము నుసరించి వీరు స్వచ్ఛందమరణులు. వీరు నశింపరు. నేను వీరితో వ్యర్థముగ రణమొనర్చితిని. నా పడిన శ్రమయంతయు వమ్మైనది. ఇక ముందెట్లు వీరిని గెలువగలనో తెలియుట లేదు. నేనెదిరించినచో వరమదగర్వితులగు వీరిచ్చోటు వీడి కదలరు. చావకున్నచో వీరు మరింత దుఃఖకారకులగుదురు. భగవతి వీరి కొసగిన వరమతి దుర్భరమైనది. ఎంత దుఃఖితుడైనను తాను స్వయముగ చావగోరుకొనడు గదా! రోగియై యుండియు దీనుడైయున్నను నెవ్వడును చావగోరడు. ఇంక నీ బలమదోన్మత్తులు తమ చావు తామే యేల కోరి తెచ్చుకొందురు? కనుక నిత్తఱి కామప్రదాయినియగు శ్రీ విద్యాశక్తిని నేను శరణు వేడుదును. ఆమె సుప్రసన్న కానిదే కోరికలు సిద్ధింపవు.

ఏవం సంచింత్య మానస్తు గగనే సంస్థితాం శివామ్‌ | అవశ్య ద్భగవా న్విష్ణు ర్యోగనిద్రాం మనోహరామ్‌. 38

కృతాంజలి రమేయాత్మా తాం చ తుష్టావ యోగవిత్‌ | వినాశార్థం తయో స్తత్ర వరదాం భువనేశ్వరీమ్‌. 39

నమో దేవి! మహామాయే! సృష్టి సంహార కారిణిః | అనాదినిధనేః చండిః భుక్తి ముక్తి ప్రదేః శివేః 40

నతే రూపం విజానామి సగుణం నిర్గుణం తథా | చరితాని కుతో దేవి సంఖ్యాతీతాని యాని తే. 41

అనుభూతో మయా తేద్య ప్రభావ శ్పాతిదుర్ఘటః | యదహం నిద్రయా లీనః సంజాతో%స్మి విచేతనః. 42

బ్రహ్మణా చాతియత్నేన బోధితో%పి పునఃపునః | న ప్రబుద్ధః సర్వథా%హం సంకోచిత షడింద్రియ. 43

అచేతనత్వం సంప్రాప్తః ప్రభావా త్తవ చాంబికే | త్వయా ముక్తః ప్రబుద్ధో%హం యుద్ధం చ బహుధా కృతమ్‌. 44

శ్రాంతో %హం న చ తౌ శ్రాంతౌ త్వయా దత్తవరౌ | బ్రహ్మాణం హంతు మాయాతౌ దానవౌ మదగర్వితౌ. 45

ఆహుతౌ చ మాయా కామం ద్వంద్వయుద్ధాయ మానదే | కృతం యుద్ధం మహాఘోరం మయా తాభ్యాం మహార్ణవే. 46

మరణ వరదానం తే తతో జ్ఞాతం మహాద్భుతమ్‌ | జ్ఞాత్వా%హం శరణం ప్రాప్త స్త్వా మద్య శరణ ప్రదామ్‌. 47

సాహాయ్యం కురు మే మాతః ఖిన్నో %హం యుద్ధ కర్మణా | దృప్తౌ తౌ వరదానేన తవ దేవార్తినాశ##నే. 48

హంతుం మా ముద్యతౌ పాపౌ కిం కిరోమి క్వ యామి చ | ఇత్యుక్తా సా తదా దేవీ స్మిత పూర్వము వాచహ. 49

ప్రణమంతం జగన్నాథం వాసుదేవం సనాతనమ్‌ | దేవదవ హరే విష్ణో కురు యుద్ధం పునః స్వయమ్‌. 50

వంచయిత్వా త్వి మౌ శూరౌ హంతవ్యౌ చ విమోహితౌ | మోహయిష్యా మ్యహం నూనం దానవౌ వక్రయా దృశా, 51

ఇట్లు తలంచి హరి నింగిపై నున్న మనోహర శివ స్వరూపిణియగు యోగనిద్రను దర్శించెను. అమేయాత్ముడు యోగవిదుడునగు హరి ఆ రాక్షసులను చంపుటకై వరదాయినియు త్రిభువనేశ్వరియు నగు యోగనిద్రను దోయిలించి ఇట్లు సంస్తుతించెను : దేవీ! మహామాయా! సృష్టి సంహారకారిణీ! అనాదినిధనా! చండీ! భుక్తి ముక్తి ప్రదాయినీ! నీకు నా వందనములు. దేవీ! నీ సగుణ నిర్గుణ స్వరూపములు నే నెఱుంగజాలను. నీ విచిత్ర చరిత్రము లనంతములు. వాని నన్నిటి నెవ్వడు పేర్కొనగలడు? నీ దుర్ఘటమైన ప్రభావ విశేషము లెఱింగితిని. నేను నిద్రయందుండగ చేష్టలు దక్కియుంటిని. అపుడు బ్రహ్మ నన్ను మేలుకొలుపుటకు పలుమారు యత్నములు జరిపెను. కాని నా యింద్రియములు చేతలుడిగియుండుటచే మేల్కొనజాలకుంటిని. నీ ప్రభావముననే నిద్రించితిని. మరల నీ మూలముననే మేలుకొంటిని. ఈ ఘోర సంగర మొనర్చితిని. ఇందు నేనే యలసితిని గాని నీ వర మహిమ గల యీ దానవుల లయలేదు. ఇంతేకాక వారు బ్రహ్మను చంపుటకు బూనుకొనిరి. నేను వారిని ద్వంద్వ యుద్ధమునకు బురికొల్పితిని. వారితో మహాసాగరమునం దతి ఘోరముగ బోరు సల్పితిని. కాని వారి చావునకు నీ వరమడ్డుగ గలదని తెలిసికొంటిని. ఇపుడు సర్వశరణ్యవగు నిన్నే నే శరణుగోరుచున్నాను. ఓ దేవార్తి వినాశినీ! ఈ దానవులు వరదాన దర్పితులు. నేను యుద్ధముచే ఖిన్నుడనైతిని. కాన నాకిపుడు సాయపడుము. ఆ పాపులు నన్ను జంపన సమకట్టి యున్నారు. నేనేమి చేతును? ఎక్కడి కేగుదును? ఇట్లు హరి వాక్కులు విని అతి దీనముగ ప్రణమిల్లుతున్న దేవదేవుడు వాసుదేవుడు సనాతనుడునగు హరిని గని దేవి నగి యిట్లనియెను : దేవదేవా! నీవు మరల స్వయముగ యుద్ధ మొనరించుము. వీరిని మోసముతో జంపుము. నేను నా మాయాశక్తిచే వీరి బుద్ధులను మోహింపజేయుదును. అపుడా శూరులు మాయా మోహితులగుదురు. నీవు వెంటనే వారిని చంపుము.

జమినారాయణాశుత్వంమమమాయావిమోహితౌ | తచ్ఛ్రుత్వావచనం విష్ణుస్తస్యాః ప్రీతిరసాన్వితమ్‌ 52

సంగ్రామస్థల మాసాద్య తస్థౌ తత్ర మహార్ణవే | తదా%%యాతౌ చ తౌ ధీరౌ యుద్ధకామౌ మహాబలౌ. 53

వీక్ష్య విష్ణుం తత్ర హర్షయుక్తౌ బభూవతుః | తిష్ఠ తిష్ఠ మహాకామ కురు యుద్ధం చతుర్భుజ 54

దైవాధీనౌ విదిత్వా%ద్య నూనం జయపరాజ¸° | సబలో జయ మాప్నోతి దైవా జ్జయతి దుర్బలః 55

సర్వథైవ న కర్తవ్యౌ హర్షశోకౌ మహాత్మనా | పురా వై బహవో దైత్యా జితా దానవవైరిణా. 56

అధునాచానయోఃసార్థంయుద్యమానఃపరాజితః | ఇత్యుక్త్వాతౌమహాబాహూయుద్ధాయసముపస్థితౌ. 57

వీక్ష్య విష్ణు ర్జఘానాశు ముష్టినా%ద్భుత కర్మణా తా వప్యతిబలోన్మత్తౌ జఘ్నతు ర్ముష్టినా హరిమ్‌, 58

ఏవం పరస్పరం జాతం యుద్ధం పరమదారుణమ్‌ | యుద్ధమానౌ మహవీర్యౌ దృష్ట్యా నారాయణ స్తదా. 59

అపశ్యత్సమ్ముఖందేవ్యాఃకృత్వాదీనాందృశంహరిః | తంవీక్ష్యతాదృశంవిష్ణుంకరుణారససంయుతమ్‌. 60

జహసాతీవ తామ్రాక్షీ వీక్షమాణా తదా%సురౌ | తౌ జఘాన కటాక్షైశ్చ కామబాణౖ రివాపరైః. 61

మందస్మితయతైః కామ ప్రేమభావ యుతైః రను | దృష్ట్యా ముముదతుః పాపౌ దేవ్యా వక్రవిలోకనమ్‌. 62

విశేషమితి మన్వానౌ కామబాణాతిపీడితౌ| వీక్షమాణౌ స్థితౌ తత్ర తాం దేవీం విశదప్రభామ్‌. 63

హరిణా%పి చ తత్‌ దృష్టం దేవ్యా స్తత్ర చికీర్షితమ్‌ | మోహితౌ తౌ పరిజ్ఞాయ భగవా న్కార్యవిత్తమః. 64

ఉవాచ తౌ హసన్‌ శ్లక్షణం మేఘ గంభీరయా గిరా | వరం వరయతం వీరౌ యువయో ర్యో%భివాంఛితః 65

దదామి పరమ ప్రీతో యుద్ధేన యువయోః కిల | దానవా బహవో దృష్టా యుధ్య మానా మయా పురా. 66

యువయోః సదృశః కో%పి న దృష్టో న చ వై శ్రుతః | తస్మా త్తుష్టో త్తుష్టో%స్మి కామం వై నిస్తులేన బలేన చ. 67

భ్రాత్రోశ్చ వాంఛితం కామం ప్రయచ్ఛామి మహాబలౌ | తచ్ఛ్రుత్వా వచనం విష్ణోః సాభిమానౌ స్మరాతురౌ. 68

ప్రీతి పూర్వకములగు శ్రీదేవి పలుకులు హరి వినెను. అంతలో ఆ మహావీరులగు దానవులు యుద్ధకాములై మహాసాగరమందలి సమరస్థలము జేరిరి. వారట విష్ణుని గని సంతసిల్లి ఓ మహాకామా!చతుర్భుజా! నిలునిలుము. మాతో యుద్ధ మొనరింపుము. నిజముగ జయాపజయములు దైవాధీనములు. బలవంతుడే సాజముగ గెలుపొందును. కాని యొకొక్కప్పుడు దుర్బలుడును దైవబలమున జయమందును. కనుక మహాత్ము డెప్పుట్టునను హర్షశోకములందరాదు. తొలుత పెక్కురు రక్కసులు దేవతల చేతులలో మడిసిరి గదా! ఇప్పడు నీవు మాత్రము మాతో బోరుచు పరాజయమొందితివి అనిరి. ఇట్లు పలికి మహాబలులగు దైత్యులు సమరమునకు తలపడిరి. అద్భుతకర్ముడగు హరి వారిని గాంచి తన బలముకొలది పిడికిట వారిని పోటు పొడిచెను. అపుడా పోటు మొనగాండ్రు హరిని మరల పిడికిళుతో పొడిచిరి. ఇట్లు వారికి పరస్పరము దారుణ రణము సంఘటిల్లెను. నారాయణుడా వీర్యవంతుల యుద్ధ నైపుణ్యము గాంచి దీనదృక్కులతో తన సమక్షమునందున్న భగవతిని దర్శించుచుండెను. సూతుడిట్లనియె : అపుడు దేవి కరుణ భావమున కందుచున్న హరిని పరికించి వెంటనే మరులు రేకెత్తించు వాడితూపులవంటి చూపులతో దానవులను జూచెను. ఒకేసారి పెద్దగ నవ్వెను. చిరునగవు నెయ్యము చిందులాడు దేవి నెమ్మొగముగాంచి యాపాపాత్ములు మోహమాదాంధులైరి. వారు నిర్మలకాంతులీను దేవీ రూపమునే మాటి మాటికి మనసుందు దలంచుచు మదనబాణహతులై యామెనే చూడ దొడగిరి. ఆ మహాదేవి మహిమవలన వారు మోహితులైరని కార్యకుశలుడగు భగవాను డూహించెను. అతడు నవ్వుచు మేఘగంభీర ఘోషముతో వారికిట్లనియెను; మీరలు మహావీరులు. పరమడుగుడు. మీ యుద్ధమునకు సంతుష్టుడనైతిని. మీకు వరమీయదలచితిని. నాతో తొలి పెక్కురు రక్కసులు బోరిరి. కాని మిమ్ముబోలు వీరాధివీరులను నేను గనలేదు, వినలేదు. అందుచే మీ మేటిబలమునకు సంతసించితిని. మీరు సమబలులు, సోదరులు, మీకోరిన వరమిత్తును. విష్ణువు వచనములు వినగనే వారికభిమానము మెండయ్యెను. వారు మదనపరవశులునైరి.

వీక్షమా ణౌ మహమాయాం జగదానందకారిణీమ్‌ | తమూచతుశ్చ కామార్తౌ విష్ణుం కమలలోచనౌ. 69

హరే! న యాచకా వావాం త్వం కిం దాతు మిహేచ్ఛసి | దదావ తుభ్యం దేవేశ దాతారౌ నౌ న యాచకౌ. 70

ప్రార్థయ త్వం హృషీకేశ మనోభిలషితం పరమ్‌ | తుష్టా స్వస్తవ యుద్ధేన వాసుదేవాద్భుతేన చ. 71

తయో స్తద్వచనం శ్రుత్వా ప్రత్యువాచ జనార్దనః భ##వేతా మద్య మే తుష్టౌ మమ వధ్యా వుభావపి. 72

సూత ఉవాచ: తచ్ఛ్రుత్వావచనం విష్ణో ర్దానవౌ చాతివిస్మితౌ | వంచితావితిమన్వానౌ తస్థతుః శోకసంయుతౌ. 73

విచార్య మనసా తౌతు దానవౌ విష్ణు మూచతుః | ప్రేక్ష్య సర్వ జలమయం భూమి స్థల వివర్జితమ్‌. 74

హరే యో %యం వరో దత్త స్త్వయా పూర్వం జనార్దన | సత్యవాగసి దేవేశ దేహి తం వాంఛితం వరమ్‌. 75

నిర్జలే విపులే దేశే హనస్వ మధుసూదన | వధ్యా వావాం తు భవతః సత్యవా గ్భవ మాధవ. 76

ఆ జగదానంద కారిణియగు మహామాయను కామపరవశులై చూచుచు వారు విష్ణువుతో నిట్లనిరి: ''ఓ హరీ! మేము యాచకులము గాము. నీకే మేము వరమీయగలము, మేమే దాతలము. కోరుకొమ్ము. నీకే మేము వరమిత్తుము. హృషీకేశా! వాసుదేవా! నీ మనస్సులోని కోరిక దెలుపుము. నీ విచిత్ర యుద్ధమునకు మేమెంతయు సంతసించితిమి.'' అను దానవుల మాటలు విని హరి వారికిట్లు మారు పలికెను: 'మీరు నా యెడల ప్రసన్నులైనచో మీరు నా వధ్యులుగండు.'' సూతుడిట్లనియె: ఆ హరి వచనములు విని వారు విస్మితులై మనము వంచింపబడితిమని శోకమున వ్యాకులచిత్తులైరి. అది అంతయును నీటిమయమే. నేలయెచ్చోటను లేదు. అది యెఱింగి దనుజులు హరికిట్లనిరి: దేవా! జనార్దనా! మొదట నీవే మాకు వరమిత్తునంటివి. కనుక సత్యపరాక్రముడనేని నీవే మాకు ముందుగ వరమొసంగుము. నీరు లేనిచోట నీవు మమ్ము వధించుము. అపుడు మేము వధ్యులమగుదుము, ఆ రీతిగ చేసి నీ సత్య ప్రతిజ్ఞను నిలువబెట్టుకొనుము.

స్మృత్వా చక్రం తదా విష్ణు స్తా నువాచ హసన్‌ హరిః | హన్మ్యద్య వాం మహాభాగౌ నిర్జలే విపులే స్థలే. 77

ఇత్వుక్త్వా దేపదేవేశ ఊరూ కృత్వాతివి స్తరౌ | దర్శయామాస తౌ తత్ర నిర్జలం చ జలోపరి. 78

నా స్త్యత్ర దానవౌ వారి శిరసీ ముంచతా మిహ | సత్యవా గహ మద్యైవ భవిష్యామి చ వాం తథా. 79

తదాకర్ణ్య వచ స్తథ్యం విచింత్య మనసా చతౌ | వర్ధయామాసతు ర్దేహం యోజనానాం సహస్రకమ్‌. 80

భగవా న్ద్విగుణం చక్రే జఘనం విస్మితౌ తదా | శీర్షే సందధతాం తత్ర జఘనే పరమాద్భుతే. 81

రథాంగేన తదా భిన్నే విష్ణునా ప్రభవిష్ణునా | జఘనోపరి వేగేన ప్రకృష్టే శిరసీ తయోః. 82

గతప్రాణౌ తదా జాతౌ దానవౌ మధుకైటభౌ | సాగరః సకలో వ్యాప్త స్తదావై మేదసా తయోః. 83

మేదినీతి తతో జాతం నామ పృథ్వాః సమంతతః | అభక్ష్యా మృత్తికా తేన కారణన మునీశ్వరాః 84

ఇతి వః కథితం సర్వం యత్పృష్టో%స్మి సునిశ్చతమ్‌ | మహావిద్యా మహామాయా సేవనీయా సదా బుధైః 85

ఆరాధ్యా పరమాశక్తి ః సర్వైరపి సురాసురైః | నాతః పరతరం కించి దధికం భువనత్రయే. 86

సత్యం సత్యం పునః సత్యం వేదశాస్త్రార్థనిర్ణయః | పూజనీయా పరాశక్తి ర్నిర్గుణా సగుణా%థవా. 87

ఇతి శ్రీ దేవీ భాగవతే మహాపురాణ ప్రథమ స్కంధే నవమో%ధ్యాయః

అంత చక్రియగు హరి తన చక్రమును మది దలంచి వారితో నవ్వుచు నిట్లు పలికెను : మహాభాగులారా! నీరులేని చోటుననే మిమ్ము హతమార్చగలను. దేవదేవేశుడట్లు పలికి తన పెందొడలను మరింత వెడల్పు చేసి యిదే నీరు లేనిచోటని చూపి వారికిట్లనియెను: ఓ దనుజులారా! నా తొడలపై మీ తలలు విడిచెదరుగాక! అపుడు మీరును నేనును సత్య ప్రతిజ్ఞల మగుదుము. అదివిని మది విచారించి దనుజులు తమ మేనులు వేయి యోజనములంత పెంచిరి. దాని కచ్చెరుమంది భగవంతుడును తన పెందొడలు దానికి రెండింతలు పెంచెను. అపుడు వా రా పరమాద్భుతమైన పెందొడలపై తమ తలలుంచిరి. ప్రభ విష్ణువు తన చక్రముచే వారి తలలు ద్రుంచెను. ఇట్లు మధుకైటభులు ప్రాణములు గోల్పోయిరి. వారి మేదస్సుచే సాగరమంతయు నిండినది. ఆనాటి నుండి భూమికి మేదినియను మరొక పేరు గలిగెను. మునులారా! ఆ కారణముననే మన్ను తినదగనిదైనది. ఈ ప్రకారముగ మీరడగినదంతయును వివరించితిని. కనుక బుధులు నిరంతరము శ్రీ మహామాయా రూపయగు శ్రీ విద్యను సముపాసించ వలయును. ఎల్లసురాసురులు నాపరమ కళ్యాణ శక్తిని సమారాధించవలయును. ఇంతకు మించిన భాగ్యమీముల్లోకములందును మరేదియును లేదు. కనుక సగుణనిర్గుణాత్మిక యగు పరాశక్తి సతతము పూజనీయ అని యెల్ల వేదశాస్త్రార్థములందును వచింప బడినది. ఇది ముమ్మాటికి నిజము నిజము.

ఇది శ్రీదేవి భాగవత మహాపురాణ మందలి ప్రథమ స్కంధమందలి నవమాధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters