Sri Devi Bhagavatam-1
Chapters
అథ పంచమా%ధ్యాయః ఇతి శ్రుత్వాసహస్రాక్షః పునరాహ బృహస్పతిమ్ | యుద్ధోద్యోగం కరిష్యామి హయారేర్నాశనాయవై.
1 నోద్యమేన వినా రాజ్యం న సుఖం న చ వై యశః | నిరుద్యమం న శంసంతి కాతరా న చ సోద్యమాః.
2 యతీనాం భూషణం జ్ఞానం సంతోషో హి ద్విజన్మనామ్ | ఉద్యమః శత్రుహననం భూషణం భూతిమిచ్ఛతామ్.
3 ఉద్యమేన హత స్త్వాష్ట్రో నముచి ర్బల ఏవ చ | తథైనం నిహనిష్యామి మహిషం మునిసత్తమ.
4 బలం దేవగురు స్త్వం మే వజ్ర మాయుధ ముత్తమమ్ | సహాయస్తు హరి ర్నూనం తథోమాపతి రవ్యయః.
5 రక్షోఘ్నాన్పఠ మే సాధో కరోమ్యద్య సముద్యమమ్ | స్వసైన్యాభినివేశం చ మహిషం ప్రతి మానద.
6 వ్యాసః : ఇత్యుక్తో దేవరాజేన వాచస్పతి రువాచహ | సురేంద్రం యుద్ధసంనద్ధం స్మితపూర్వం వచస్తదా. 7 ప్రేరయామి న చాహం త్వాం న చ నివారయామ్యహమ్ | సందిగ్ధే%త్ర జయే కామం యుధ్యతశ్చ పరాజయే. 8 నతే%త్ర దూషణం కించి ద్భవితవ్యే శచీపతే | సుఖం వా యది వా దుఃఖం విహితం చ భవిష్యతి. 9 న మయా తత్పరిజ్ఞాతం భావి దుఃఖం సుఖం తథా | యధ్బార్యాహరణ ప్రాప్తం పురా వాసవ వేత్సిహి. 10 శశినా మే హృతా భార్యా మిత్రేణామిత్రకర్శన | స్వాశ్రమస్ధేన సంప్రాప్తం దుఃఖం సర్వ సుఖాపహమ్. 11 బుద్ధిమా న్సర్వలోకేషు విదితో2హం సురాధిప | క్వ మే గతా తదా బుద్ధి ర్యదా భార్యా హృతా బలాత్. 12 తస్మాదుపాయః కర్తవ్యో బుద్ధిమద్భిః సదా నరైః | కార్యసిద్ధిః సదా నూనం దైవాధీనా సురాధిప. 13 అయిదవ అధ్యాయము ఇంద్రుడు మహిషుని సేనలతో బోరుట గురుని మాటలు విని యింద్రు డతనికి మరల నిట్లనెను : ''నేనా మహిషు నాశనమునకు యుద్ధప్రయత్న మొనర్తును. ప్రయత్నము చేయనిచో రాజ్యముగాని సుఖముగాని యశముగాని యేదియు లభింపదు. పిరికివారు ప్రయత్నము లేకుండుటే మంచిదని తలతురు. కాని ప్రయత్నశీలు రట్లు దలపరు. యతులకు జ్ఞానమును ద్విజులకు సంతోషమును సంపదలు గోరువారికి శత్రు హనన ప్రయత్నమును భూషణములు. మునీశా! మునుపు ప్రయత్నించి వృత్ర నముచి బలాసురులను వధించినట్టు లిపుడే మహిషుని అంతమొందింతును. నాకు దేవగురువగు నీవు బలము; వజ్రాయుధము బలము. హరిహరులు నాకు గొప్ప సహాయకులు. నా పరువు దక్కించుము. రక్షోఘ్న మంత్రములు పఠించుము. నే నిపుడే నా సేన గూర్చుకొని మహిషునితో బోర నుద్యమింతును. అను నింద్రుని మాటలు విని చిరునగవుతో బృహస్పతి యుద్ధకాంక్షియగు నింద్రున కిట్లనియెను : పోరుచున్న వాని జయాపజయములు నిర్ణయింపలేము. కనుక నిన్నిపుడు యుద్ధమునకు బొమ్మనను; వద్దనను. జరుగవలసినది జరిగితీరును. దానిలో నీ దోషము లేదు. సుఖమో దుఃఖమో తప్పక సంభవించును. ముందు జరుగబోవు సుఖదుఃఖముల పరిజ్ఞానము నాకు లేదు. మునుపు నా భార్య యపహరింపబడగా నేను పడిన పాట్లెన్నియో నీ వెఱుగుదువుగదా! పూర్వము చంద్రుడు నా పత్ని నపహరించెను. అపుడు నేనెంతయో శ్రమపడితిని; వెతలపాలయితిని. సుఖములు కోల్పోతిని. లోకములందు బృహస్పతి బుద్ధిశాలి యన వాసికెక్కితిని. నా భార్యను మరొకడు బలిమిమీర హరించినపుడు నా బుద్ధి యేమయ్యెను? కనుక ప్రజ్ఞావంతు డుపాయమునకు యత్నింపవలయును. కార్యసిద్ధి యొప్పుడేని దైవాధీనమే. వ్యాసః: తుచ్ఛ్రుత్వా వచనం సత్యం గురోః సార్థం శతీపతిః | బ్రహ్మాణం శరణం గత్వా నత్వా వచన మబ్రవీత్. 14 పితామహ! సురాధ్యక్ష! దైత్యో మహిషసంజ్ఞకః | గ్రహీతుకామః స్వర్గం మే బలోద్యోగం కరోమ్యలమ్. 15 అన్యే చ దానవాః సర్వే తత్పైన్యం సముపస్తితాః | యోద్ధుకామో మహావీర్యాః సర్వే యుద్ధవిశారదాః. 16 తేనాహం భీతభీతో%స్మి త్వత్సకాశ మిహాగతః | సర్వజ్ఞో%సి మహాప్రాజ్ఞ సాహాయ్యం కర్తుమర్హసి. 17 బ్రహ్మా: గచ్ఛామః సర్వ ఏవాద్యకైలాసం త్వరితావయమ్ | శంకరం పురతః కృత్వా విష్ణుం చ బలినాం వరమ్. 18 తతో యుద్ధం ప్రకర్తవ్యం సర్వైః సురగణౖః సహ | మిళిత్వా మంత్ర మాధాయ దేశం కాలం విచింత్య చ. 19 బలాబల మవిజ్ఞాయ వివేక మపహాయ చ | సాహసం తు ప్రకుర్వాణో నరః పతన మృచ్ఛతి. 20 వ్యాసః: తన్నిశమ్య సహస్రాక్షః కైలాసం నిర్జగా మ హ | బ్రహ్మాణం పురతః కృత్వా లోకపాలసమన్వితః. 21 తుష్టావ శంకరం గత్వా వేదమంత్రై ర్మహేశ్వరమ్ | ప్రసన్నం పురతః కృత్వా య¸° విష్ణుపురం ప్రతి. 22 స్తుత్వా తం దేవేదేవేశం కార్యం ప్రోవాచ చాత్మనః | మహిషాత్తద్భయం చోగ్రం వరదానమదోద్ధతాత్. 23 తదాకర్ణ్య భయం తస్య విష్ణుర్దేవా నువాచ హ | కరిష్యామో వయం యుద్ధం హనిష్యామస్తు దుర్జయమ్. 24 వ్యాసః : ఇతి తే నిశ్చయం కృత్వా బ్రహ్మవిష్ణు హరీశ్వరాః | స్వాని స్వాని సమారుహ్య వాహనాని యయుఃసురాః. 25 బ్రహ్మా హంసమారూఢో విష్ణు ర్గరుడవాహనః | శంకరో వృషభారూఢో వృత్రహా గజసంస్థితః. 26 మయూరవాహనః స్కందో యమో మహిషవామనః | కృత్వాసైన్య సమాయోగం యావత్తే నిర్యయుః సురాః. 27 గురుని సత్యవచనము లాలకించి యింద్రుడు బ్రహ్మను శరణు చొచ్చి యతని కిట్లనియెను: 'పితామహా! మహిషాసురుడు స్వర్గకామి. అతడు స్వర్గము బొందుటకు తగిన ప్రయత్నములు చేయుచున్నాడు. రణకోవిదులును వీర్యవంతులు నగు దానవులు రణమున నతని కండగ నున్నారు. అందువలన నేను జంకి మీ సన్నిధి కేతెంచితిని. మీరు సర్వజ్ఞులు - ప్రాజ్ఞులు. సాహాయ్య మొనరింప దక్షులు' అన బ్రహ్మ యిట్లనెను: 'ఇపుడు మన మందఱమును కైలాస మేగుదము. అటనుండి శివుని సైతము వెంటగొని మహాసత్త్వుడగు హరి సన్నిధి కేగుదము. అచట దేవతలను గూడి దేశకాల పరిస్థితులాలోచించి పిమ్మట యుద్ధము చేయుట మంచిది. ఎదుటి బలాబలము లెఱుగక వివేకము గోల్పోయి దుస్సాహసముతో కార్యము చేయువాడు పతనము జెందును.'' అపుడింద్రుడు లోకపాలురతోకూడి బ్రహ్మ ముందు నడుపగ కైలాసగిరి కేగెను. అట వారు మహేశ్వరుడగు శంకరుని వేదమంత్రములతో ప్రస్తుతించి వరగర్వితుడగు మహిషుని భయమున నిచటికి వచ్చితిమనిరి. హరి దేవతల భయకారణము విని యిపుడు యుద్ధము చేయుదము, ఆ దుర్జయుని హతమార్చుదము అని వారితో ననెను. ఇట్లు నిశ్చయించుకొని బ్రహ్మ విష్ణువు శివుడు సురలు తమ తమ వాహనము లెక్కి తరలిరి. బ్రహ్మ రాయంచ నెక్కెను. విష్ణువు గరుడు నెక్కెను. శంభుడు వృషభ మెక్కెను. ఇంద్రు డైరావతము నెక్కెను. కుమారస్వామి మయూరవాహనుడయ్యెను. యముడు మహిషముపై నెక్కెను. సురసైన్యముతోడు నడువ ఇట్లు వారు రణమునకు తరలిరి. తావద్దైత్యబలం ప్రాప్తం దృప్తం మహిషపాలితమ్ | తత్రాభూ త్తుములం యుద్ధం దేవదానవసైన్యయోః. 28 బాణౖః ఖడ్గై స్తథా ప్రాసై ర్ముసలై శ్చ పరశ్వథైః | గదాభిః పట్టిశైః శూలైశ్చక్రైశ్చ శక్తితోమరైః. 29 ముద్గరై ర్భిందిపాలైశ్చ హలైశ్చైవాతిదారుణౖః | అన్యైశ్చ వివిధై రసై#్త్ర ర్నిజఘ్ను స్తే పరస్పరమ్. 30 సేనానీ శ్చిక్షుర స్తస్య గజారూఢో మహాబలః | మఘవంతం పంచభిసై#్తః సాయకైః సమాతాడయత్. 31 తురాషాడపి తాం శ్ఛిత్వా బాణౖర్బాణాంస్త్వరాన్వితః | హృదయే చార్ధచంద్రేణ తాడయామాస తం కృతీ. 32 బాణా హతస్తు సేనానీః ప్రాప మూర్ఛాం గజోపరి | కరిణం వజ్ర ఘాతేన స జఘాన కరే తతః. 33 తద్వజ్రాభిహతో నాగో భగ్నః సైన్యం జగామ హ | దృష్ట్వా తం దైత్యరాట్ క్రుద్ధో బిడాలాఖ్యమథాబ్రవీత్. 34 గచ్ఛ వీర మహాబాహో జహీంద్రం మదగర్వితమ్ | వరుణాదీ న్పరాన్దేవా న్హత్వా%%గచ్ఛ మమాంతికమ్. 35 వ్యాసః : తచ్ఛ్రుత్వా వచనం తస్య బిడాలా %%ఖ్యో మహాబలః | ఆరుహ్య వారణం మత్తం జగామ త్రిదశాధిపమ్. 36 వాసన స్తం సమాయాంతం దృష్ట్వా క్రోధసమన్వితః | జఘాన విశిఖై స్తీక్ణై రాశీవిషసమప్రభైః. 37 సతుచ్ఛిత్వా శరాం స్తూర్ణం స్వశ##రై శ్చాపనిః సృతైః | పంచాశద్భి ర్జఘానాశు వాసవం చ శిలీముఖైః. 38 తథేంద్రో%పి చ తాన్బాణాం శ్ఛిత్వా కోపసమన్వితః | జఘాన విశిఖై స్తీక్ణై రాశీవిషసమప్రభైః. 39 స తు చ్ఛిత్వా శరాం స్తూర్ణం స్వశ##రై శ్చాప నిఃసృతైః | గదయా తాడయామాస గజం తస్య కరోపరి. 40 స్వకరే నిహతో నాగశ్చకారార్త స్వరం ముహుః | పరివృత్య జఘానాశు దైత్యసైన్యం భయాతురమ్. 41 దానవస్తు గజం వీక్ష్య పరావృత్య గతం రణాత్ | సమావిశ్య రథే రమ్యే జగామాశు సురాన్రథే. 42 అపుడు మహిషుని వశమందున్న దానవబలము గర్వించి వారి నెదుర్కొనెను. అంత దేవదానవులకు ఘోర సంగ్రామము జరిగెను. వారు బాణ-ఖడ్గ-ప్రాస-ముసల-పరశు-గదా-పట్టిస-శూల-చక్ర-శక్తి-తోమర-ముద్గర-భిందిపాల హలములతో నితర వివిధాస్త్రములతో పరస్పరము దారుణముగ రణ మొనర్చిరి. అందు మహిషుని సేనాని చిక్షురుడు గజమెక్కి యైదు బాణములతో నింద్రుని ప్రహరించెను. ఇంద్రుడును త్వరితగతితో వానిని ఛేదించి యర్ధచంద్ర బాణముతో నతని ఱొమ్ముపై ప్రహరించెను. చిక్షురుడు బాణాహతుడై గజముపై మూర్ఛిల్లెను. అపుడింద్రుడు దానవు నేనుగు తొండముపై వజ్రఘాత మొనర్చెను. ఆ వజ్రఘాతమునకు గజము భగ్నమయ్యెను. సైన్యము పారిపోయెను. అదిగని దానవపతి బిడాలుడను వానిని గని యతనితో నీవు వరుడవు. బలశాలివి. నీవు వెళ్లి మదగర్వితుడగు నింద్రుని చంపుము. పిదప వరుణాది దేవతలను తుదముట్టించి నా చెంతకురమ్ము' అనెను. ఆ మాటలు విని బిడాల దానవుడొక మత్త గజమునెక్కి యింద్రుని సమీపించెను. ఇంద్రుడు బిడాలుని గాంచి రోషముతో విషమువంటి విశిఖము లతనిపై బఱపెను. అతడు వానినెల్ల తన ములుకులతో దునిమి మరల నైదువందల వాడి బాణములతో నింద్రుని నొప్పించెను. ఇంద్రుడు సైతము వానినెల్ల నడుమన దునుమాడి వానిపై కోపాతిరేకమున నాశీ విషసమంబులగు బాణములు ప్రయోగించెను. ఇంద్రుడు తనపైకి వచ్చు శరములను త్వరత్వరగ ఖండించి గదతో వాని గజము తుండమును మోదెను. తన తుండము పై దెబ్బ తగులగనే మార్తనాదమున గీపెట్టుచు నటునిటు గ్రుమ్మరుచు నడ్డువచ్చిన దానవ సేనలనెల్ల చంపివేసెను. అట్లు తన గజము రణభూమి వదలి వెళ్ళుట గని బిడాలుడొక చక్కని తేరెక్కి యమరుల ముందు నిలువబడెను. తురాషాడపి తం వీక్ష్య రథస్థం పునరాగతమ్ | అహన ద్విశిఖై స్తీక్ణై రాశీవిషసమప్రభైః. 43 సో%పి క్రుద్ధశ్చకారోగ్రాం బాణవృష్టిం మహాబలః | బభూవ తుములం యుద్ధం తయో స్తత్ర జయైషిణోః. 44 ఇంద్ర స్తు బలినం దృష్ట్వా కోపేనాకులితేంద్రియః | జయంత మగ్రతః కృత్వా యుయుధే తేన సంయుతః. 45 జయంతస్తు శితైర్బాణౖ స్తం జఘాన స్త నాంతరే | పంచభిః ప్రబలాకృష్టై రసురం మదగర్వితమ్. 46 స బాణాభిహత స్తావ న్నిపపాత రథోపరి | అతివాహ్య రథం సూతో నిర్జగామ రణాజిరాత్. 47 తస్మిన్వినిర్గతే దైత్యే బిడాలాఖ్యే%థ మూర్ఛితే | జయశబ్దో మహానాసీ ద్దుందుభీనాం చ నిఃస్వనః. 48 సురాః ప్రముదితాః సర్వే తుష్టువుస్తం శచీపతిమ్ | జగు ర్గందర్వపతయో ననృతు శ్చాప్సరోగణాః. 49 చుకోప మహిషః శ్రుత్వా జయశబ్దం సురైః కృతమ్ | ప్రేషయామాస తత్రైవ తామ్రం పరమదాపహమ్. 50 తామ్ర స్తు బహుభిః సార్ధం సమాగమ్య రణాజిరే | శరవృష్టిం చకారాశు తడిత్వానివ సాగరే. 51 వరుణః పాశముద్యమ్య జగామ త్వరిత స్తదా | యమ శ్చ మహిషారూఢో దండ మాదాయ నిర్య¸°. 52 తత్ర యుద్ధ మభూ దోరం దేవదానవయోర్మిథః | బాణౖః ఖడ్గై శ్చ ముసలైః శక్తిభిశ్చ పరశ్వథైః. 53 దండేన నిహత స్తామ్రో యమహస్తోద్యతేన చ | న చచాల మహాబాహుః సంగ్రామాంగణ తస్తదా. 54 చాప మాకృష్య వేగేన ముక్త్వా తీవ్రాన్ శిలీముఖాన్ | ఇంద్రాదీనహన త్తూర్ణం తామ్రస్తస్మి న్రణాజిరే. 55 తే%పి దేవాః శ##రై ర్దివ్యై ర్నిశితైశ్చ శిలాశితైః | నిజఘ్న ర్దానవాన్ క్రుద్ధా స్తిష్ఠ తిష్టేతి చుక్రుశుః. 56 నిహతసై#్తః సురై ర్దైత్యో మూర్ఛామాప రణాంగణ | హాహాకారో మహానాసీ ద్దైత్యసైన్యే భయా%తురే. 57 ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ పంచమస్కంధే పంచమో%ధ్యాయః. వాడు తిరిగి యరదమెక్కి వచ్చుటగని యింద్రుడాశీ విష ప్రభావముగల వాడి బాణపరంపరలు వానిపై గురిసెను. బిడాలుడును క్రోధముతో బాణములు ఇంద్రునిపై ఏసెను. అపుడు జయకాములగు వారిరువురికి పోరు ఘోరముగ జరిగెను. తన వైరి మహాబలుడగు టెఱిగి యింద్రుడు వ్యాకుల చిత్తుడయ్యెను. అపు డింద్రుడు తన తనయుడగు జయంతుని తోడుగ గొని వానితో మరల బోరదొడగెను. జయంతుడు మదగర్వితుడగు దానవుని ఱొమ్ముపై నైదు ప్రబల శితశిలీముఖములు గాటముగ నాటెను. వాడు బాణాహతుడై రథముపై కూలబడెను. సారథి రథముతోలుకొని రణభూమి వెలువడెను. బిడాలుడు మూర్ఛితుడై వెడలిపోగా దేవతల జయజయ కారములు దుందుభి స్వనములు మిన్నుముట్టెను. అమరులెల్లరును ప్రమోదభరితులై యింద్రుని గొనియాడిరి. గంధర్వులు పాడిరి. అచ్చరలాడిరి. ఆ దేవతల జయనినాదములు విని మహిషుడు కోపముతో పరుల మదమడంచు తామ్రుడను వానిని పంపెను. అతడును పెక్కు సేనలతో వచ్చి సముద్రమున మేఘము వర్షము గురియునట్లు రణస్థలమున రిపులపై బాణములు గురిసెను. అపుడు పాశము చేతబట్టి వరుణుడును మహిషమెక్కి దండధారియై యముడును రణమునకు తరలిరి. దేవదానవులకు బాణఖడ్గ ముసలశక్తి పరశువులతో ఘోరసంగ్రామము సంఘటిల్లెను. తామ్రుడు యముని చేత దండతాడితు డయ్యెను. అయ్యునతడు రణమునుండి వెనుకంజ వేయలేదు. అతడు వెంటనే ధనువెక్కిడి నారిలాగి యింద్రాదులను బాణములతో గట్టిగ గొట్టెను. దేవతలును తీవ్రరోషమున వాడియగు దివ్యశరముల పెక్కింటిని దానవసైన్యముపై గురియుచు నిలునిలుడను కేకలు వేయుచు ముందునకు సాగిరి. తుదకు దేవతల చేతిలో తామ్రాసురుడు రణరంగమున మూర్ఛితుడై పడిపోయెను. దైత్యసేన భయమున హాహాకారము లొనర్చెను. ఇది శ్రీమద్దేవీ భాగవతమందలి పంచమ స్కంధమందు ఇంద్రుడు మహిష సేనలతో బోరుటయను పంచమాధ్యాయము.