Sri Devi Bhagavatam-1
Chapters
అథ షష్ఠో%ధ్యాయః వ్యాసః: తామ్రేథ మూర్ఛితే దైత్యే మహిషః క్రోధంసయుతః | సముద్యమ్య గదాం గుర్వీం దేవానుపజగామహ.
1 తిష్ఠంత్వద్య సురాః సర్వే హన్మ్యహం గదయా కిల | సర్వే బలిభుజః కామం బలహీనాః సదైవ హి.
2 ఇత్యుక్త్వా%సౌ గజారూఢం సంప్రాప్య మదగర్వితః | జఘాన గదయా తూర్ణం బాహుమూలే మహాభుజః.
3 సో%పి వజ్రేణ ఘోరేణ చిచ్ఛేదాశు గదాం చ తామ్ | ప్రహర్తుకామ స్త్వరితో జగామ మహిషం ప్రతి. 4 హయారి రపి కోపేన ఖడ్గ మాదాయ సుప్రభమ్ | యయా వింద్రం మహావీర్యం ప్రహరిష్యన్నివాంతకమ్.
5 బభూవ చ తయోర్యుద్ధం సర్వలోకభయావహమ్ | ఆయుధై ర్వివిధై స్తత్ర మునివిస్మయకారకమ్.
6 చకారాశు తదా దైత్యో మాయాం మోహకరీం కిల | శాంబరీం సర్వలోకఘ్నీం మునీనామపి మోహినీమ్.
7 కోటిశో మహిషా స్తత్ర తద్రూపా స్తత్పరాక్రమాః | దదృశ్రే సాయుధాః సర్వే నిఘ్నంతో దేవవాహినీమ్.
8 మఘవా విస్మిత స్తత్ర దృష్ట్వాతాం దైత్యనిర్మితామ్ | బభూవాతిభ యోద్విగ్నో మాయాం మోహకరీం కిల.
9 వరుణో%పి సుసంత్రస్త స్తథైవ ధననాయకః | యమో హుతాశనః సూర్యః శీతరశ్మి ర్భయాతురః.
10 పలాయనపరాః సర్వేబభూవు ర్మోహితాః సురాః | బ్రహ్మ విష్ణు మహేశానాం స్మరణం చక్రు రుద్యతాః.
11 తత్రాజగ్ము శ్చ కాజేశాః స్మృతమాత్రాః సురోత్తమాః | హంసతార్ష్య వృషారూఢా స్త్రాతుకామా వరాయుధాః.
12 శౌరిస్తాం మోహినీం దృష్ట్వా సుదర్శన మథోజ్జ్వలమ్ | ముమోచ తత్తేజసైవ మాయా సా విలయం గతా.
13 ఆరవ అధ్యాయము హరిహరులు మహిషునితో బోరుట తామ్రుడు మూర్ఛపొందిన పిమ్మట మహిషుడు రోషముతో పెద్ద గదగొని దేవతలపై కురికి 'ఓ యమరులారా! మీరు కాకులవలె బలిభుజులు బలహీనులు. మిమ్మిపుడు నా గదతో హతమొనర్తును' అని మదగర్వమున పలికి వెంటనే గజారూఢుడైన యింద్రుని భుజములపై గదతో కొట్టెను. దేవపతియును తన ఘోరవజ్రముతో గదను తుత్తునియలు చేసి త్వరిత గతిని మహిషునిపై దెబ్బ వేయుటకు ముందునకు సాగెను. మహిషుడును కోపమూని తళతళమను ఖడ్గము బూని మరల కొట్టుటకు వీర్యవంగుడగు నింద్రుని సమీపించెను. అపుడు వారిరువురకు వివిధాయుధములతో లోకభీకరముగ మునులకు విస్మయకరముగ యుద్ధము జరిగెను. అందు మహిషుడు మునీశ్వరులను సైతము మోహింపజేయు లోకనాశకరమగు శాంబరీ మాయ పన్నెను. అపుడు మహిషుని వంటి రూప పరాక్రమములు గల కోట్లకొలది సాయుధులుప్పతిల్లి దేవసేనపైబడి కొట్టుటకు పూనుకొనిరి. మోహకరమగు వాని మాయను గని యింద్రుడు భయవిస్మయములతో వ్యాకులు డయ్యెను. సూర్య చంద్రులు అగ్నియమవరుణ కుబేరులును భీతిల్లి పలాయనము చిత్తగించిరి. దనుజ మాయా మోహితులైన దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను హృదయములందు సంస్మరించిరి. స్మరణమాత్రమున త్రిమూర్తులు హంసగరుడ వృషభ వాహనము లెక్కి దివ్యాయుధములతో దేవతలను బ్రోవ నరుగుదెంచిరి. ఆ మోహినీ మాయను గాంచి శౌరి తన చక్రము బంపెను. దాని దివ్యతేజము వలన మాయాజాలము వ్రీలిపోయెను. వీక్ష్యా తా న్మహిషస్తత్ర సృష్టి స్థిత్యంత కారిణః | యోద్ధుకామః సమాదాయ పరిఘం సముపాద్రవత్.
14 మహిషాఖ్యో మహావీర్యః సేనానీ శ్చిక్షుర స్తథా | ఉగ్రాస్య శ్చోగ్రవీర్య శ్చ దుద్రువు ర్యుద్ధ కాముకాః.
15 అసిలోమా త్రినేత్రశ్చ బాష్కలో%ంధక ఏవచ | ఏతే చాన్యే చ బహవో యుద్ధకామా వినిర్యయుః.
16 సన్నద్ధా ధృతచాపా స్తే యథారూఢా మదోద్ధతాః | పరివవ్రుః సురాన్సర్వా న్వృకా ఇవ సువత్సకాన్.
17 బాణవృష్టిం తతశ్చక్రు ర్దానవా మదగర్వితాః | సురా శ్చాపి తథా చక్రుః పరస్పరజిఘాంసవః. 18 అంధకో రిపు మాసాద్య పంచబాణాన్ శిలాశితాన్ | ముమోచ విషసందిగ్ధా న్కర్ణా%%కృష్ణా న్మహాబలాన్. 19 వాసుదేవో%ప్యసం ప్రాప్తా న్విశిఖా నాశుగై స్తదా | చిచ్ఛేద తాన్పునః పంచ ముమోచ రిపునాశకః. 20 తయోః పరస్పరం యుద్ధం బభూవ హరిదైత్యయోః | బాణాసి చక్రముసలై ర్గదాశక్తి పరశ్వథైః. 21 మహేశాంధకయో ర్యుద్ధం తుములం రోమహర్షణమ్ | పంచాశద్దిన పర్యంతం బభూవ చ పరస్పరమ్ 22 ఇంద్రబాష్కలయో స్తద్వ న్మహిషాసుర రుద్రయోః | యమ త్రిణత్రయో స్తద్వ న్మహాహను ధనేశయోః. 23 అసిలోమ వరుణయోర్యుద్ధం పరమదారుణమ్ | గరుడం గదయా దైత్యో జఘాన హరివాహనమ్. 24 స గదాపాతభిన్నాంగో నిఃశ్వసన్నవతిష్ఠతే | శౌరి స్తం దక్షిణనాశు హస్తేన పరిసాంత్వయన్. 25 స్థిరం చకార దేవేశో వైనతేయం మహాబలమ్ | సమాకృష్య ధనుః శార్ఞం ముమోచ విశిఖాన్ బహూన్. 26 అంధకోపరి కోపేన హంతుకామో జనార్దనః | దానవో%పి చ తాన్బాణాం శ్చిచ్ఛేద స్వశ##రైః శితైః. 27 పంచాశ ద్భి ర్హరిం కోపాజ్జఘాన చ శిలాశితైః | వాసుదేవో%పి తాం స్తూర్ణం వంచయిత్వా శరోత్తమాన్. 28 మహిషు డొక పెద్ద పరిఘ చేబూని సృష్టి స్థిత్యంతకారులగు త్రిమూర్తులపై కురిగెను. అతనివెంట చిక్షురసేనాని ఉగ్రాస్యుడు ఉగ్రవీర్యుడు అసిలోముడు త్రినేత్రుడు బాష్పకాంధకులు నితరులు పెక్కురు యుద్ధకాములై నడిచిరి. వారరదములెక్కి విండ్లుబూని చిన్నదూడలపైకురుకు తోడేళ్లవలె దేవతలను చుట్టుముట్టి మద గర్వముతో బాణవర్షము గురిసిరి. దేవతలు నటులే వారిపై బాణములు ప్రయోగించిరి. అంధకుడు హరిపై విషదిగ్ధములు శిలాశితములు నగు నైదు బాణములు చెవిదనుకనారిని లాగి వదలిపెట్టెను. దానవాంతకుడగు త్రివిక్రముడు తనపైకివచ్చు బాణములను నడుమన తునిమి తిరిగి యైదు వాడి బాణములు ప్రయోగించెను. అట్లు వారిరువురును బాణాసిగదా చక్రముసల - శక్తి - పరశువులతో భీకరముగ బోరిరి. వాసుదేవాంధకుల మధ్య గగుర్పాటొదవు తుముల సమర మేబది నాళ్లు ఘటిల్లెను. ఇంద్రబాష్కలులు రుద్రమహిషులు యమత్రినేత్రులు కుబేర మహాహనులు వరుణాసిలోములు పరస్పరము పరమ దారుణరణమొనర్చిరి. అందు దైత్యుడు హరివాహనమగు గరుడుని గదతో గొట్టెను. ఆ దెబ్బతిని గరుత్మంతుడు నిట్టూర్చుచు పడిపోయెను. శౌరి తన దక్షిణహస్తముతో మహాబలుడగు గరుడు నూరార్చి యతనికి బలము గలిగించెను. పిమ్మట హరి శార్జ చాపమునులాగి పెక్కు బాణములు తొడిగి యంధకు నంతమొందింప దలచి వానిపై పెక్కు బాణములు ప్రయోగించెను. దానవుడును వాని నెల్ల తన వాడి యమ్ములతో ఛేదించి కోపముతో నేబది నిశితబాణములేయగ హరివాని నెల్ల వేగమే విఫలమొనరించెను. చక్రం ముమోచ వేగేన సహస్రారం సుదర్శనమ్ | త్యక్తం సుదర్శనం దూరా త్స్వచక్రేణ న్యవారయత్. 29 ననాద చ మహారాజ దేవా న్సమ్మోహయ న్నివ | దృష్ట్వా తు విఫలం జాతం చక్రం దేవస్య శార్ఞిణః. 30 జగ్ముః శోకం సురాః సర్వే జహర్షు ర్దానవా స్తథా | వాసుదేవో%పి తరసా దృష్ట్వా దేవాన్ శుచా%%వృతాన్. 31 గదాం కౌమోదకీం ధృత్వా దానవం సముపాద్రవత్ | తం జఘానాతివేగేన మూర్ధ్ని మాయావినం హరిమ్. 32 స గదాభిహతో భూమౌ నిపపాలాతిమూర్ఛితః | తం తథా పతితం వీక్ష్య హయారి రతి కోపనః. 33 ఆజగామ రమానాథం త్రాసయన్నతి గర్జితైః | వాసుదేవో%పి తం దృష్ట్వా సమాయాంత క్రుధా%న్వితమ్. 34 చాపజ్యానినదం చోగ్రం చకార నందయ న్సురాన్ | శరవృష్టిం చకారాశు భగవాన్మహిషోపరి. 35 సో%పి చిచ్ఛేద బాణౌఘై స్తాన్ శరాన్గగనేరితాన్ | తయోర్యుద్ధ మభూ ద్రాజ న్పరస్పరభయావహమ్. 36 గదయా తాడయామాస కేశవో మస్తకోపరి | స గదాభిహతో మూర్ధ్ని పపాతోర్వ్యాం సుమూర్ఛితః. 37 హాహాకారో మహానాసీ త్సైన్యే తస్య సుదారుణః | స విహాయ వ్యథాం దైత్యో ముహూర్తా దుత్థితః పునః. 38 గృహీత్వా పరిఘం శీర్షే జఘాన మధుసూదనమ్ | పరిఘేణాహతస్తేన మూర్ఛామాప జనార్దనః. 39 మూర్ఛితం తమువా హాశు జగామ గరుడో రణాత్ | పరావృత్తే జగన్నాథే దేవా ఇంద్రపురోగమాః. 40 భయం ప్రాపుః సుదుఃఖార్తా శ్చు క్రుశుశ్చ రణాజిరే | క్రందమానా న్సురా న్వీక్ష్య శంకరః శూలభృత్తదా. 41 మహిషం తరసా%భ్యేత్య ప్రాహరద్రోష సంయుతః | సో%పి శక్తిం ముమోచాథ శంకరస్యోరసి స్ఫుటమ్. 42 జగర్జ స చ దుష్టాత్మా వంచ యిత్వా త్రిశూలకమ్ | శంకరో2పి తదా పీడాం న ప్రాపోరసి తాడితః. 43 చక్రి తన సహస్రారసుదర్శన చక్రము ప్రయోగింపగా దానవుడు తన చక్రముతో దానిని వారించి దేవతలు మోహితు లగునట్లు పెల్లు గర్జించెను. హరి చక్రము విఫలమగుట గని సురముఖ్యులు శోకాకులులైరి. దానవులు ముదమందిరి. దేవతలు శోకించుట చూచి వాసుదేవుడు కౌమోదకీగదగొని సత్వరమే దానవునిపై కురికి యా మాయావి తలపై గదాప్రహార మొనరించెను. ఆ గద దెబ్బకు వాడు మూర్ఛిల్లి నేల కొరిగెను. అతడు పడిపోవుట గనినంతనే మహిషుడు మిక్కిలి కోపమూని గర్జించుచు బెదరించుచు హరిని దాకెను. దానవుడట్లు కోపము వచ్చుట వాసుదేవుడు గ్రహించి భీకరముగ నారి సారించుచు మహిషునిపై తీవ్రబాణవృష్టి గురిసెను. సురులు హర్షము వెలిపుచ్చిరి. వాడును తన బాణములతో హరి శరములన్నిటిని మింట దునిమెను. అట్లు వారిర్వురు భీషణముగ సంగర మొనర్చిరి. అంతలో కేశవుడు మహిషుని తలపై గదాఘాత మొనరించెను. వాడు మూర్ఛితుడై నేలకొరిగెను. దానవసేనలో హాహాకారములు చెలరేగెను. వాడును ముహూర్తమాత్రమున తెప్పరిల్లి లేచెను. పిమ్మట వాడు పరిఘగొని వ్రేయగ హరి మూర్ఛిల్లెను. గరుడు డంత మూర్ఛిల్లిన హరిని గొని రణభూమినుండి వెడలెను. జగన్నాథుడు మూర్ఛితుడుగాగా వాసవాది దేవతలు భయంపడి యార్తనాదమున వగచిరి. విలపించు సురులను గాంచి మహాధన్వియగు శివుడు తన త్రిశూలము చేత దాల్చి పట్టరాని రోషముతో మహిషుని దాకి వానిని శూలమున బొడిచెను. ఆ దుష్టుడును శంకరు నురమున శక్తిని వైచి బిట్టుగ గర్జించి శివుని త్రిశూలమును విఫల మొనర్చెను. తం జఘాన త్రిశూలేన కోపా దరుణలోచనః | సంలగ్నం శంకరం దృష్ట్వా మహిషేణ దురాత్మనా. 44 ఆ జగామ హరి స్తావ త్త్యాక్త్వా మూర్ఛాం ప్రహారజామ్ | మహిష స్తు తదా వీక్ష్య సంప్రాప్తౌ హరిశంకరౌ. 45 యుద్ధకామౌ మహావీర్యౌ చక్రశూలధరౌ వరౌ | కోపయుక్తో బభూ వాసౌ దృష్ట్వా తౌ సముపాగతౌ. 46 జగామ సమ్ముఖ స్తావ త్సం గ్రామార్థం మహాభుజః | మహిషం వపు రాస్థాయ ధన్వున్ఫు చ్ఛం సముత్కటమ్. 47 చకార భైరవం నాదం త్రా సయన్నమరా నపి | ధున్వన్ శృంగే మహాకాయో దారుణో జలదో యథా. 48 శృంగాభ్యాం పార్వతాన్ శృంగాం శ్చిక్షేప భృశ ముత్కటాన్ | దృష్ట్వా తౌ తు మహావీర్యౌ దానవం దేవసత్తమౌ. 49 చక్రతు ర్బాణ వృష్టిం చ దానవోపరి దారుణామ్ | కుర్వాణౌ బాణవృష్టిం తౌ దృష్ట్వా హరాహరౌ హ(యా)రిః. 50 చిక్షేప గిరిశృంగం తు పుచ్ఛేనావృత్య దారుణమ్ | ఆపతంతం గిరిం వీక్ష్య భగవాన్సాత్వతాం పతిః. 51 విశిఖైః శతధా చక్రే చక్రేణాశు జఘానతమ్ | హరి చక్రాహతః సంఖ్యే మూర్ఛామాస సదైత్యరాట్. 52 ఉత్తస్థౌ చ క్షణా న్నూనం మానుషం వపు రాస్థితః | గదాపాణి ర్మహాఘోరో దానవః పర్వతోపమః. 53 మేఘనాదం ననాదోచ్చై ర్భిషయన్నమరా నపి | తచ్ఛ్రుత్వా భగవా న్విష్ణుః పాంచజన్యం సముజ్జ్వలమ్. 54 పూరయామాస తరసా శబ్దం కుర్తు ఖరస్వరమ్ | తేన శ##బ్దేన శంఖస్య భయత్రస్తౌశ్చ దానవాః. 55 బభూవు ర్ముదితా దేవా ఋషయశ్చ తపోధనాః. 56 ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ పంచమస్కంధే షష్టోధ్యాయః. అంత దెబ్బ తాకినను శంకరుడెంతమాత్రము బాధపడక ఉగ్రుడై మహోగ్రుడై కనులవెంట మంటలెగయ త్రిశూలముతో మరల వానిని పొడిచెను. అట్లు శంకరుడు దుష్ట మహిషుతో తలపడెను. అంతలో మూర్ఛనుండి లేచి హరియు నచటి కేగెను. మహిషు డదిగని మరిహరులను సమీపించెను. మహావీర్యులగు హరిహరులు యుద్ధకాములై చక్రశూలములు ధరించి నిలిచియుండుటగని మహిషుడు కుపితుడై మహిషాకృతితో మరల పోరుటకు వారిని దాకి తన తోక యాడించుచు అమరులెల్ల భీతిల్లునట్లుగ తన కొమ్ములు త్రిప్పుచు భీకర దారుణముగ మేఘమట్లు గర్జించెను. తన కొమ్ములతో గిరిశిఖరములు పెల్లగించి చిమ్మెను. మహావీర్యులగు దేవసత్తములు దానిని గాంచి దానవునిపై మరల దారుణ తీవ్ర బాణవర్షము గురిసిరి. వాడు హరిహరులు గురియు శరవర్షమును వారించి మరల తోకతో గిరిశిఖరములు చుట్టి వారిపై చిమ్మెను. విశ్వపతి యగు హరి తనపైకి వచ్చు గిరులను గాంచి వానిని తన చక్రముతో ముక్కలు ముక్కలుగచేసి సత్వరమే వానిపై చక్రము ప్రయోగించెను. మరి చక్రఘాతమునకు మహిషు డక్కడి కక్కడనే మూర్ఛిల్లెను. ఆ దుష్టుడు మరల క్షణములో లేచి పర్వతము వంటి నరుని యాకారము బూని గద చేపట్టి దేవతలు వెఱగంద మేఘగంభీర ధ్వని చేసెను. అది విని విష్ణువు మహోజ్జ్వలమైన పాంచజన్యము గ్రహించి వేగముగ ఆ శంఖము పూరించెను. ఆ ధ్వనికి దానవుల గుండె లవిసెను. తపోధనులగు ఋషులును దేవతలును హర్షించిరి. ఇది శ్రీమద్దేవీ భాగవతమందలి పంచమ స్కంధమందు హరిహరులు మహిషునితో బోరుటయను షష్ఠాధ్యాయము.