Sri Devi Bhagavatam-1
Chapters
అథ సప్తమో%ధ్యాయః వ్యాసః: అసురాన్మహిషో దృష్ట్వా విషణ్ణమనస స్తదా ! తక్త్వా తన్మాహిషం రూపం బభూవ మృగరాడసౌ.
1 కృత్వా నాదం మహాఘోరం విస్తార్య చ మహాసటామ్ | పపాత సురసేనాయాం త్రాసయ న్నఖదంశ##నైః.
2 గరుడం చ నఖా%%ఘాతైః కృత్వారుధిర విప్లుతమ్ | జఘాన చ భుజే విష్ణుం నఖాఘాతేన కేసరీ.
3 వాసుదేవో%పి తం దృష్ట్వా చక్ర ముద్యమ్య వేగవాన్ | హంతుకామో హరిః కామమవాపా%%శు క్రుధా%న్వితః. 4 యావద్ధయరిపుం వేగాచ్చక్రేణాభిజఘాన తమ్ | తావత్సో%తిబలః శృంగీ శృంగాభ్యాం న్యహనద్ధరిమ్. 5 వాసుదేవో విషాణాభ్యా తాడితోరసి విహ్వలః | పలాయనపరో వేగా జ్జగామ భువనం నిజమ్. 6 గతం దృష్టావ హరి కామం శంకరో%పి భయాన్వితః | అవధ్యం తం పరం మత్వా య¸° కైలాసపర్వతమ్. 7 బ్రహ్మ%పి చ నిజం ధామ త్వరితః ప్రయ¸° భయాత్ | మఘవా వజ్ర మాలంబ్య తస్థావాజౌ మహాబలః. 8 వరుణః శక్తి మాలంబ్య ధైర్య మాలంబ్య సంస్థితః | యయో%పి దండ మాదాయ యత్తః సమరతత్పరః. 9 తతో యక్షాధిపః కామం బభూవ రణతత్పరః | పావకః శక్తి మాదాయ తత్రా%భూద్యుద్ధ మానసః. 10 నక్షత్రాధిపతిః సూర్యః సమవేతౌ స్థితావుభౌ | వీక్ష్య తం దానవశ్రేష్టం యుద్ధాయ కృతనిశ్చ¸°. 11 ఏతస్వి న్నంతరే క్రుద్ధం దైత్యసైన్యం సమభ్యగాత్ | విసృజ న్బాణజాలాని క్రూరాహిసదృశాని చ. 12 ఏడవ అధ్యాయము దేవతలు త్రిమూర్తుల శరణు చొచ్చుట దానవులు వ్యాకులు చిత్తులగుట గని మహిషుడు మహిషరూపము వీడి సింహరూపము దాల్చెను. అది తన జూలు విదలించుచు భీకరముగ గర్జించుచు వాడిగోళ్ళతో గీకుచు దేవసేనలోనికి దుమికెను. ఆ సింహము తన వాడిగోళ్ళ దెబ్బలచే గరుడుని చీల్చి యతనిని నెత్తుట ముంచెను. విష్ణుబాహువులను గోళ్ళచే గాయపఱచెను. అదిగని హరియును కోపాతిరేకమున దానిని చంపదలచి చక్రము చేబూని వేగమే దానిమీద కురికి దానిని చక్రముతో గొట్టెను. అంతలో నది మహిషమై తన వక్షమునకు దగిలిన దాని కొమ్ముల దెబ్బలకు తాళ##లేక హరియు వేగమే వైకుంఠమున కరిగెను. అట్లు విష్ణువేగుట గని మహిషుడు చంపబడడని శంకరు డెఱిగి తానును కైలాస మేగెను. బ్రహ్మయును భీతిల్లి త్వరగ బ్రహ్మలోక మేగెను. ఇంద్రుడు మాత్రము వజ్రము ధరించి యచ్చోటనే యుండెను. యముడు దండమును వరుణుడు శక్తిని దాల్చి ధైర్యము చిక్కబట్టుకొని వానినెదిరి నిలిచిరి. కుబేరుడును రణమునకు మోహరిల్లెను. అగ్నియును శక్తిగొని సమరమున కుద్యుక్తుడయ్యెను. సూర్యచంద్రులొక్కటిగజేరి యా దానవునితో బోరదలచిరి. అంతలో దానవ బలములు తీవ్ర క్రోధముతో క్రూర విషము వంటి బాణములు గురియుచు ముందునకు నడచెను. కృత్వా హి మాహిషం రూపం భూపతిః సంస్థిత స్తదా | దేవదానవ యోధానాం నినాద స్తుములో%భవత్. 13 జ్యాఘాతశ్చ తలాఘాతో మేఘనాదసమో%భవత్ | సంగ్రామే సమహాఘోరే దేవదానవసేనయోః. 14 శృంగాభ్యాం పార్వతాన్ శృంగాం శ్చిక్షేప చ మహాబలః | జఘాన సురసంఘాంశ్చ దానవో మదగర్వితః. 15 ఖురఘాతై స్తథా దేవా న్పుచ్ఛస్య భ్రమణన చ | స జఘాన రుషా%విష్టో మహిషః పరమాద్భుతః. 16 తతో దేవాః సగంధర్వా భయామాజగ్ము రుద్యతాః | మఘవా మహిషం దృష్ట్వా పలాయనపరో%భవత్. 17 సంగరం సంపరిత్యజ్య గతే శ##క్రే శచీపతౌ | యమో ధనాధిపః పాశీ జగ్ముః సర్వే భయా%తురాః. 18 మహిషో%తిజయం మత్వా జగామ స్వగృహం తతః | ఐరావతం గజం ప్రాప్య త్యక్త మింద్రేణ గచ్చతా. 19 తథోచ్ఛైః శ్రవసం భానోః కామధేనుం పయస్వినీమ్ | స్వసైన్య సంవృత స్తూర్ణం స్వర్గం గంతుం మనో దధే. 20 తరసా దేవసదనం గత్వా స మహిషాసురః | జగ్రాహ సురరాజ్యం వై త్యక్తం దేవైర్భయా%%తురైః. 21 ఇంద్రా%%సనే తథా రమ్యే దానవః సముపావిశత్ | దానవా న్ధ్సపయామాస దేవానాం స్థానకేషుసః. 22 ఏవం వర్షశతం పూర్ణం కృత్వా యుద్ధం సుదారుణమ్ | అవాపైంద్రపంద కామం దానవో మదగర్వితః. 23 నిర్జరా నిర్గతా నాకాత్తేన సర్వే%తి పీడితాః | ఏవం బహూని వర్షాణి బభ్రము ర్గిరిగహ్మరే. 24 దానవపతి తిరిగి మహిషరూపము దాల్చెను. అంత దేవదానవ యోధుల నడుమ చెలరేగిన తుముల నాదము మింట పిక్కటిల్లెను. వారి ఘోరసంగ్రామ మందు మేఘధ్వనులో యన వారి విండ్ల నారులు మ్రోతలును కరతాళ ధ్వనులును పెల్లు చెలరేగెను. ఆ మదమత్త దానవుడు తన శృంగములతో గిరి శృంగములు పెకలించుచు చిమ్ముచు సురసంఘమును బాధ పెట్టుచుండెను. ఆ మహిషు డద్భుతకరుడై రోషావేశమున గొందఱిని గిట్టల తావుల చేత మఱికొందఱిని తోకతో జుట్టి త్రిప్పుచు హింసించుచుండెను. అది కని దేవగంధర్వులు వెఱగందిరి. ఇంద్రుడు నతనిని గాంచి యట నిలువలేక వెన్నుచూపెను. ఇంద్రుడేగిన వెంటనే యమ - వరుణ - కుబేరులును భీతులై పరుగుదీసిరి. మహిషుడు స్వవిజయము ప్రకటించుటేకాక ఇంద్రుడు వదలిన యైరావతమును ఉచ్చైశ్శ్రవమును సూర్యుని కామధేనువును గ్రహించి సైన్యసమేతముగ వెంటనే స్వర్గమేగి భయాతురులగు దేవతలు విడిచి పెట్టిన స్వర్గ రాజ్యమును గ్రహించెను. ఇంద్రాసనమెక్కి దేవతల స్థానములలో నాయా దానవులను నియమించెను. అట్లు మహిషుడు మదగర్వముతో నూఱండ్లు పోర యింద్ర పదవి బడసెను. దేవతలు స్వర్గము నిర్గమించి భయపీడితులై పెక్కేండ్లు గిరి గుహలందు తలదాచుకొనిరి. శ్రాంతాః సర్వే తదా రాజన్ బ్రహ్మాణం శరణం యయుః | ప్రజాపతిం జగన్నాథం రజోరూపం చతుర్ముఖమ్. 25 పద్మాసనం వేదగర్భం సేవితం మునిభిః స్వజైః | మరీచి ప్రముఖైః శాంతై ర్వేదవేదాంగ పారగైః. 26 కిన్నరైః సిద్ధ గంధర్వై శ్చారణోరగ పన్నగై | తుష్టువు ర్భయభీతా స్తే దేవదేవం జగద్గురుమ్. 27 దేవాఊచుః ధాతః కిమేదతఃలా%ర్తి హరాంబుజన్మ జన్మా%భి వీక్ష్య న దయాం కురుషే సురాన్యత్ | సంపీడితా న్రణజితా నసురాధిపేన స్థానచ్యుతా న్గిరి గుహకృత సన్నివాసాన్. 28 పుత్రాన్పితా కిమపరాధశ##తై సమేతాన్ సంత్యజ్య లోభరహితః కురతే%తి దుఃస్థాన్ | యస్త్వం సురాం స్తవ పదాంబుజభక్తియుక్తాన్ దైత్యార్దితాం శ్చ కృపాణా న్యదుపేక్షసే%ద్య. 29 అమరభువనరాజ్యం తేన భుక్తం నితాంతం మఖహవిరపి యోగ్యం బ్రాహ్మణౖ రాదదాతి | సురతరువరపుష్పం సేవతే%సౌ దురాత్మా జలనిధి నిధిభూతాం గామసౌ సేవతే తామ్. 30 కిం వా గృణీమః సురకార్య మద్భుతం జానాసి దేవేశ సురారి చేష్టితమ్ | జ్ఞానేన సర్వం త్వ మశేష కార్యవిత్ తస్మాత్ప్రభో తే ప్రణతాః స్మపాదయోః. 31 యత్రాపి కుత్రాపి గతాన్సురానసౌ నానాచరిత్రైః ఖలు పాపమానసః | పీడాం కరోత్యేవ స దుష్ట చేష్టిత స్త్రాతా%సి దేవేశ విదేహి శం విభో. 32 నోచేద్వయం దావ మహా%గ్ని పీడితాః కం శాంతి కర్తారమనంతతేజసమ్ | యామః ప్రజేశం శరణం సురేష్టం | ధాతారమాద్యం పరిముచ్యకం శివమ్. 33 ఇతి స్తుత్వా సురాః సర్వే ప్రణము స్తం ప్రజాపతిమ్ | బద్ధాంజలిపుటాః సర్వే విషణ్ణవదనా భృశమ్. 34 తాం స్తథా పీడితా న్దృష్ట్వా తదా లోక పితామహః | ఉవాచ శ్లక్ణయా వాచా సుఖం సంజనయన్నివ. 35 వారలసి సొలసి రజోరూపుడు చతుర్ముఖుడు నగు బ్రహ్మను శరణు వేడిరి. వేదగర్భులు వేదవేదాంగ పారగులు శాంతులు నగు మరీచి ముఖులగు మునుల చేతను కిన్నర - సిద్ధ - గంధర్వ - చారణ - పన్నగ గణముల చేతను సేవింపబడుచున్న వేద గర్భుడును జగద్గురువునగు పద్మగర్భుని భీతులగు దేవతలీ తీరుగ నుతింపదొడంగిరి. ఓ ధాతా! జలజసంభవా! అఃలార్తిహరా! మేము మహిషునిచేత వోటుపడి పీడితులమై పదభ్రష్టులమై గిరిగుహ లందిడుమలు గుడుచుచున్నాము. ఇట్టి సురలపై దయపూనవేమి? ఈ వింత ఏమి? తన కొడుకులు నూఱు తప్పులు చేసినను తండ్రి మమత చంపుకొని వారి నిడుమల పాలు చేయునా? ఇక నీ పరభక్తులు దైత్యభీతులు దిక్కులేనివారు నగు సురలను నీవుపేక్షించుకున్నావేమి? ఆ దుష్టుడు సర్వభోగము లనుభవించుచు యాగహవిర్భాగములు గైకొనుచు పారిజాత పరీమళములతో జలనిధి వంటి కామధేను సౌఖ్యము లనుభవించుచున్నాడు. దేవేశా! ఆ దానవుల యద్భుత చేష్టలెన్నియని చెప్పుదుము. నీవఃల కార్యవిదుడవు. జ్ఞానమున సర్వ మెఱుగుదువు - కనుక మేము నీ పదపద్మములకు ప్రణమిల్లుచున్నాము. మేమెక్కడి కేగిన నక్కడనెల్ల నానాచరణములతో ఆ పాపమానసుడు మాకు పెక్కు బాధలు గల్గించుచున్నాడు. మాకు నీవే రక్షకుడవు. మాకు మేలు చేకూర్పగదవయ్యా! మేము దుఃఖ దావాగ్ని పీడితులము; నీవు సృష్టికర్తవు; ధాతవు; శరణ్యము. ఇట్టి నిన్ను కాదని మరెవ్వడో మేలుచేయగలడని మేమింకొకని నెవని నాశ్రయింతుము?'' అని యీ తీరున సురలు దోయిలించి విషణ్ణ వదనులై మాటిమాటికి ప్రజాపతిని సన్నుతించిరి. అంతటి బాధలోనున్న సురలనుగని లోకపితామహుడు మధురవాక్కులతో వారికి సుఖము గలిగించుచు నిట్లనెను : కిం కరోమి సురాః కామం దానవో వరదర్పితః | స్త్రీవద్యో%సౌ న పుంవధ్యో విధేయం తత్ర కిం పునః. 36 వ్రజామో%ద్య సురాః సర్వే కైలాసం పర్వతోత్తమమ్ | శంకరం పురతః కృత్వా సర్వకార్యవిశారదమ్. 37 తతో వ్రజామ వైకుంఠం యాత్రదేవో జనార్దనః | మిళిత్వా దేవకార్యం చ విమృశాయో విశేషతః. 38 ఇత్యుక్త్వా హంసమారుహ్య బ్రహ్మ కార్యసముచ్చయే | దేవం శ్చ పృష్ఠతః కృత్వా కైలాసాభిముఖో యమౌ. 39 తావచ్ఛివో%పి తరసా జ్ఞాత్వా ధ్యానేన పద్మజమ్ | ఆ గచ్ఛంతం సురైః సార్థం నిర్గతః స్వగృహాద్భహిః. 40 దృష్ట్వా పరస్పరం తౌ తు కృతా%భివాదనౌ భృశమ్ | ప్రణతౌ చ సురైః సర్వైః సంతుష్టౌ సంబభూవతుః. 41 ఆసనాని పృథగ్దత్వా దేవేభ్యో గిరిజాపతిః | ఉపవిష్టేషు తేష్వేవ నిషసాదాసనే స్వకే. 42 కృత్వా తు కుశలప్రశ్నం బ్రహ్మాణం వృషభధ్వజః | పప్రచ్ఛ కారణం దేవానైల్కాసా%గమనే విభుః. 43 శివః కిమత్రా%గమనం బ్రహ్మన్కృతం దేవైః సవాసవైః | భవతా చ మహాభాగ! బ్రూహి తత్కారణం కిల. 44 బ్రహ్మోవాచ : మహిషేణ సురేశాన! పీడితాః స్వర్నివాసినః | భ్రమంతి గిరిదుర్గేషు భయత్రస్తాః సవాసవాః. 45 యజ్ఞభుగ్మహిషో జాత స్తథా%న్యే సురశత్రవః | పీడితా లోకపాలా శ్చ త్వా మద్య శరణం గతాః. 46 మయా తే భవనం శంభో ప్రాపితాః కార్యగౌరవాత్ | యద్యుక్తం తద్విధ త్స్వాద్య సురకార్యం సురేశ్వర. 47 త్వయి భారో%స్తి సర్వేషాం దేవానాం భూతభావన | ఇతితద్వచనం శ్రుత్వా శంకరః ప్రహసన్నివ. 48 సురలారా! నా చేత నేమున్నది? నేనేమి చేయగలను? వాడు వరగర్వితుడు, వాడు స్త్రీవధ్యుడుగాని - పురుష వధ్యుడుకాడు. మనమిపుడు సర్వతోత్తమ మగు కైలాసమేగుదము. కార్యవిశారదుడగు శంకరుని సన్నిధికేగి అచట నుండి సర్వ కార్య విశారదుడగు శంకరుని మున్నిడుకొని మనము జనార్దనుని నివాసమగు వైకుంఠధామ మేగుదము. అచ్చట నందఱమును గలిసి దేవకార్యము గూర్చి విశేషముగ చర్చించుదము అని పలికి కార్యసిద్ధికై బ్రహ్మ రాయంచనెక్కి సురలను తోడుకొని కైలాసగిరికి పయనమయ్యెను. అంతలో శివుడును ధ్యానమున బ్రహ్మరాక నంతయు నెఱిగి కైలాసము నుండి వారి కెదురు వచ్చెను. శివబ్రహ్మ లొకరినొకరు చూచుకొని పరస్పరము నమస్కరించుకొని యానంద భరితులైరి. దేవతలును పరమశివున కంజలి ఘటించిరి. శివుడు వారి వారి కుచితములగు నాసనములందు వారివారి నాసీనులుగ జేసి తానును తన యాసన మధిష్ఠించెను. వృషభ వాహనుడు వారి కుశలమడిగి కైలాసమునకు వారి రాకకు కారణము నెఱుగ నిట్లనియెను : ఓ విధీ! నీవు సురపతిని సురులను వెంటగొని రా కారణమేమి? తెలుపుము. బ్రహ్మ యిట్లనెను : మహాదేవా! సురేశానా! ఇంద్రునితోడి దేవతలెల్లరును మహిషునిచేత పీడితులై భయత్రస్తులై గిరి గుహలందు వసించు చున్నారు. మహిషుడును తదితరసురులును యజ్ఞభాగభోక్తలైనారు. వారిచేత పీడితులై లోకపాలురును నిన్ను శరణుజొచ్చియున్నారు. సర్వభూతేశ్వరా! వారిని నేనే ఈ కార్యభార వశమున తోకొని వచ్చితిని. ఈ దేవకార్యమునకేది తగునో దానిని చేయుము. భూతభావనా! సకల దేవతల భారము నీవొక్కడవే వహింప దక్షుడవు అను బ్రహ్మవాక్కులు విని శివుడు చిరునగవు నగియెను. వచనం శ్లక్షయా వాచా ప్రోవాచ పద్మజం ప్రతి | శివ ఉవాచ: భవతైవ కృతం కార్యం వరదానాత్పురావిభో. 49 అనర్థం చ దేవానాం కిం కర్తవ్య మతం పరమ్ | ఈ దృశో బలవాంఛూరః సర్వదేవభయప్రదః. 50 కా సమర్థా వరా నారీ తం హన్తుం మదదర్పితమ్ | నమే భార్యా న తే భార్యా సంగ్రామం గంతు మర్హతి. 51 గత్వైవతే మహోభాగే యయుధాతే కథం పునః | ఇంద్రాణీ చ మహాభాగ న యుద్ధకుశలా%స్తి హి. 52 కా%న్యా హంతుం సమర్థా%స్తి తం పాపం మదదర్పితమ్ | మమేదం మత మద్యైవ గత్వా దేవం జనార్దనమ్. 53 స్తుత్వా తం దేవకార్యార్థం ప్రేరయామః సుసత్వరమ్ | సో%తిబుద్ధిమతాం | శ్రేష్ఠో విష్ణుః సర్వార్థ సాధనే. 54 మిళిత్వా వాసుదేవం వై కర్తవ్యం కార్య చింతనమ్ | ప్రపంచేనచ బుద్ధ్యా స సంవిధ్యాస్యతి సాధనమ్. 55 వ్యాస ఉవాచ : ఇతి రుద్రవచః శ్రుత్వా బ్రహ్మాద్యాః సురసత్తమాః | ఉత్థితాస్తే తథేత్యుక్త్వా శివేన సహసత్వరాః. 56 స్వకీయై ర్వాహనైః సర్వే యయు ర్విష్ణుపురం ప్రతి | ముదితాః శకునా న్దృష్ట్వా కార్యసిద్ధికరాన్ శుభాన్. 57 వపుర్వాతాః శుభాః శాంతాః సుగంధాః శుభశం సినః | పక్షిణ శ్చ శివా వాచ స్త త్రోచుః పథి సర్వశః. 58 నిర్మలం చా%భవ ద్వ్యోమ దిశశ్చ విమలాస్త థా | గమనే తత్ర దేవానాం సర్వం శుభ మివాభవత్. 59 ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ పంచమ స్కంధే సప్తమోధ్యాయః. శివుడు తీయని మాటలతో బ్రహ్మతో నిట్లు పలికెను : విభూ ! మున్నతనికి నీవే వరమొసగితివి. దాని మూలమున దేవతలకు చేటు మూడినది. వాడు బలవంతుడు; భీకరుడు; దేవాంతకుడు. ఇపుడేమి చేయగలము? ఆ మదగర్వితుని చంపుటకు తగిన వీరనారీమణి యెవర్తుక గలదు. నీ భార్యయు నా భార్యయు యుద్ధము చేయదగరు గదా! వారొకవేళ యుద్ధమునకు బోయినను యుద్ధమెట్లు చేయగలరు? ఇంద్రాణికిని యుద్ధమందు నేర్పులేదే! వాడు మదదర్పితుడు; పాపి. వాని నింకెవరు చంపజాలుదురు? మనము జనార్దనుని చెంత కేగుట మంచిదని నా యభిప్రాయము. మనము విష్ణుని ప్రస్తుతించి యతనిని కార్యార్థము ప్రేరింతము. అతడు సత్వరముగ కార్యసిద్ధి గలిగించు బుద్ధిమంతుల లోపల మేటి సారమతి. మఱి మన మా వాసుదేవుని గూడి కార్య మాలోచింతము. అతడు తన మహాబుద్ధితో మన కార్యము చక్కబఱచగలడు అను రుద్రుని వచనము లాలకించి బ్రహ్మాదిదేవత లెల్లరు నట్లే యగుతమని లేచి శివుడు తోడురాగా కార్యసిద్ధిని సూచించు శుభశకునముల గనుచు విష్ణుధామమున కేగిరి. అపుడు శుభసూచకముగ చల్లని మెల్లని పిల్లగాలులు వీచెను. పక్షులు మంగళరావము లొనరించెను. ఆకాశము దిక్కులు నిర్మలములయి తోచెను. అట్లు దేవతల ప్రయాణమున నెల్లెడల నంతయు శుభ సూచకమయి కనిపించెను. ఇది శ్రీమద్దేవీ భాగవతమందలి పంచమ స్కంధమందు దేవతలు త్రిమూర్తులను శరణు జొచ్చుటయను సప్తమాధ్యాయము.