Sri Devi Bhagavatam-1    Chapters   

అథ దశమో%ధ్యాయః

వ్యాసఉవాచ: ఇతి తస్య వచః శ్రుత్వా ప్రహస్య ప్రమదోత్తమా | తమువాచ మహారాజ మేఘ గంభీరయా గిరా. 1

దేవ్యువాచ : మంత్రివర్య సురాణాం వై జననీం విద్ధి మాం కిల | మహాలక్ష్మీ మితిఖ్యాతాం సర్వదైత్యనిషూదినీమ్‌. 2

ప్రార్థితా%హం సురైః సర్వై ర్మహిషస్య వధాయ చ | పీడితై ర్దానవేంద్రేణ యజ్ఞభాగబహిష్కృతైః. 3

తస్మా దిహాగతా%స్మ్యద్య తద్వధార్థం కృతోద్యమా | ఏకాకినీ న సైన్యేన సంయుతా మంత్రిసత్తమ. 4

యత్త్వయా%హం సామపూర్వం కృత్వా స్వాగత మాదరాత్‌ | ఉక్తా మధురయా వాచా తేన తుష్టా%స్మి తే%నఘ. 5

నో చే ద్ధన్మి దృశా త్వాం వై కాలాగ్నిసమయా కిల | కస్య ప్రీతికరం న స్యా న్మాధుర్యవచనం ఖలు. 6

గచ్ఛ తం మహిషం పాపం వద మద్వచనా దిదమ్‌ | గచ్ఛ పాతాళ మధునా జీవితేచ్ఛా యదస్తి తే. 7

నో చే త్కృతాగసం దుష్టం హనిష్యామి రణాంగణ | మద్బాణక్షుణ్ణదేహ స్తం గంతాసి యమసాదనమ్‌. 8

దయాళుత్వం మమేదం త్వం విదిత్వా గచ్ఛ సత్వరమ్‌ | హతే త్వయి సురా మూఢ స్వర్గం ప్రాప్స్యంతి సత్వరమ్‌. 9

తస్మా ద్గచ్ఛస్వ త్యక్వైకో మేదినీం చ ససాగరామ్‌ | పాతాళం తరసా మంద యావద్బాణా న మే%పతన్‌. 10

యుద్ధే చ్ఛా చే న్మనసి తే తర్హ్యేహి త్వరితో%సుర | వీరై ర్మహాబలైః సర్వై ర్నయామి యమసాదనమ్‌. 11

యుగే యుగే మహామూఢ హతా స్త్వత్సదృశాః కిల | అసంఖ్యాతా స్తథా త్వాం వై హనిష్యామి రణాంగణ. 12

సాఫల్యం కురు శస్త్రాణాం ధారణ తు శ్రమో2న్యథా | తద్యుధ్యస్వ మయా సార్ధం సమరే స్మరపీడితః. 13

దశమాధ్యాయము

మహిషునకు శ్రీదేవి హితములు

మహిషుని మంత్రి పలికిన మాటలు విని మహామాయ యగు రమణీమణి విహసించి గంభీర వాక్కుల నతని కిట్లు పలికెను: ఓ మంత్రివర్యా! నన్ను దేవతల తల్లిగ నెఱుగుము. నేను దానవాంతకురాలగు శ్రీ మహాలక్ష్మిని. దైత్యపతి దేవతలను నానా బాధలు పెట్టెను. వారి యాగ భాగములు వారి కందనీయలేదు. అందులకు దేవతలెల్లరు మహిష వధకు నన్ను ప్రార్థించిరి. కనుక నే నిపు డతనిని హతమార్చుటకు వచ్చితిని. నాకు సేనతోడ బనిలేదు. నాకు ముందుగ ప్రయత్నము నక్కరలేదు. నీవు తీయని సామ వచనములతో నాకు స్వాగతము పలికితివి. నన్ను గౌరవించితివి. అందుచేత నేను నీయెడల సంతుష్టి జెందితిని. కానిచో కాలానలము వంటి నా చూడ్కుల మంటలతో నిన్నెప్పుడో దహించియుండెడి దానవే. తీపిమాటల తీపి యెవనికి తీపిగ నుండదు? నీవిపుడు మహిషుని జేరి నా మాటగ వానికిట్లనుము: నీకు బ్రదుకుపై తీపి యున్నచో నీవిపుడే పాతాళ మేగుము. కానిచో దుష్టుడవు పాపాత్ముడవు నగు నిన్నిపుడే రణాంగణమున దునుమాడుదును. నా బాణములచే నీ శరీరము చిల్లులు పడును. నీవు యమునింటి కేగుదువు. నీపై దయపూనితినని యెఱుగుము. నీవు వెంటనే పాతాళ మేగుము. నీవు చచ్చినచో దేవతలు సత్వరమే స్వర్గ మలంకరింప గలరు. కనుక మూఢాత్మా! నా కఱకుటమ్ములు తగులక మునుపే జలనిధితో చుట్టబడిన యీ భూమిని వదలిపెట్టుము. రసాతలమున కేగుము. కాక నీకు యుద్ధకాంక్షయే యున్నచో రమ్ము. మహాబలులైన వీరులను వెంటగొని రమ్ము. అందఱను యమునింటి కతిథులుగ పంపుదును. ఓరీ మహామూఢా! యుగయుగమున నా చేతిలో నీవంటివారు లెక్కకు మిక్కిలిగ నిహతులగుదురు. అట్లె నిన్నిపుడు రణరంగమున నంతమొందింతును. ఓ మన్మధ పీడితా! నాతో బోరుము. నేను శస్త్రములు దాల్చినందులకు నా శ్రమ సఫల మొనరింపుము.

మా గర్వం కురు దుష్టాత్మ న్యన్మే%స్తి బ్రహ్మణోవరః | స్త్రీ వధ్యత్వే త్వయా మూఢ పీడితాః సురసత్తమాః. 14

కర్తవ్యం వచనం ధాతు స్తేనా హం త్వాముపాగతా | స్త్రీరూప మతులం కృత్వా సత్యం హంతుం కృతాగసమ్‌. 15

యథేచ్ఛం గచ్ఛ వా మూఢ పాతాళం పన్నగావృతమ్‌ | హిత్వా భూసుర సద్మా ద్య జీవితేచ్ఛా యదస్తితే. 16

వ్యాస ఉవాచ: ఇత్యుక్తః స తతో దేవ్యా మంత్రిశ్రేష్ఠో బలాన్వితః |

ప్రత్యువాచ నిశమ్యాసౌ వచనం హేతుగర్భితమ్‌. 17

దేవి! స్త్రీసదృశం వాక్యం బ్రూషే త్వం మదగర్వితా | క్వాసౌ క్వ త్వం కథం యుద్ధ మసంభావ్యమిదం కిల. 18

ఏకాకినీ పునర్బాలా ప్రారబ్ధ ¸°వనా మృదుః | మహిషో%సౌ మహాకాయో దుర్విభావ్యం హి సంగతమ్‌. 19

సైన్యం బహువిధం తస్య హస్తశ్వరథ సంకులమ్‌ | పదాతిగణసంవిద్ధం నానా%%యుధ విరాజితమ్‌. 20

కః శ్రమః కరిరాజస్య మాలతీపుష్పమర్దనే | మారణ తవ వామోరు మహిషస్య తథారణ. 21

యది త్వాం పురుషం వాక్యం బ్రవీమి స్వల్పమప్యహమ్‌ | శృంగారే తద్విరుద్ధం హి రసభంగా ద్బిభేమ్యహమ్‌.22

రాజస్మాకం సురరిపు ర్వర్తతే త్వయి భక్తిమాన్‌ | సామమేవ మయా వాచ్యం దానయుక్తం తథా వచః. 23

నో చే ద్ద న్మ్యహమద్యైవ బాణన త్వాం మృషావదాం | మిథ్యాభిమాన చతురాం రూప¸°వన గర్వితామ్‌. 24

స్వామీమే మోహితః శ్రుత్వా రూపం తే భువనాతిగమ్‌ | తత్ప్రియార్థం ప్రియం కామం వక్తవ్యం త్వయి యన్మయా 25

రాజ్యం తవ ధనం సర్వం దానస్తే మహిషః కిల | కురు భావం విశాలాక్షి త్యక్త్వా రోషం మృతి ప్రదమ్‌. 26

పతామి పాదయో స్తే%హం భక్తిభావేన భామిని | పట్టరాజ్ఞీ మహారాజ్ఞో భవ శీఘ్రం శుచిస్మితే. 27

త్రైలోక్యవిభవం సర్వం ప్రాప్స్యసి త్వ మనావిలమ్‌ | సుఖం సంసారజం సర్వం మహిషస్య పరిగ్రహాత్‌. 28

మూర్ఖా! దుష్టా! విధివరము గలదని విఱ్ఱవీగకుమురా! నీవు స్త్రీవధ్యుడవు. అందుచే సురలింతగ పీడితులైరి. బ్రహ్మవాక్కు వ్యర్థము గారాదు. కనుక సాటిలేని మేటి స్త్రీ రూపము దాల్చి పాపివగు నిన్ను చంపవచ్చితిని. మందమతీ! నీకు బ్రతుకు యున్నచో స్వర్గము విడువుము. పన్నగము లుండు పాతాళ మేగుము అను హితములు హేతుగర్భములు నగు పలుకులు విని మంత్రి సత్తముడు దేవి కిట్లనియెను: ఓ దేవీ! నీవు మదగర్వముతో నున్నావు. ఆడుదానికి తగినట్లు పలుకుచున్నావు. అతడెక్కడ? నీవెక్కడ? మీ యిరువురి యుద్ధ మసంభావ్యమని తలతును. నీవొక యబలవు-కోమలవు-ఒంటిదానవు. ఆ మహిషుడు మహాకాయుడు. ఇట్టి మీకు పరస్పరము సమరమెట్లు వొసగును? అతని రథ-గజ-అశ్వ-పదాతి బలములు పెక్కు రీతులతో పెక్కాయుధములతో నెసగుచున్నవి. ఒక మాలతీ సుమమును మర్దించుటకు గజరాజున కెట్టి శ్రమకలుగునో నిన్ను చంపుటకు మహిషున కట్టి శ్రమ గల్గును. నీతో పరుషము లేమాత్రమును బలుకను. అవి శృంగార విరుద్ధములు-రసభంజకములు నగునని భయపడుచున్నాను. మా రాజు సురవైరి. నీకు భక్తుడు. కునుక నేను నీతో సామదాన యుక్త వచనములే పలుకవలయును. కానిచో-మిథ్యాభిమానపు-మృషావాక్కులలో చతురవు-రూప¸°వన గర్వితవునగు నిన్నిపుడే నా బాణములతో చంపియుండెడివాడనే. నా స్వామి లోకాతీతమైన నీ లావణ్యపు సంద్రపుటలలలో మునగి ముగ్ధుడయ్యెను. అతని ప్రియము కొఱకు నేను నీతో ప్రియ వాక్యములే పలుకవలయును. ఓ విశాలక్షీ! ఆ మహిషుని రాజ్యము-ధనము నీ సొత్తు. అతడు నీ చరణదాసుడు. చావును కలిగించు కోప ముడుగుము. రాగ భావములు పూనుము. భామినీ! శుచిస్మితా! నేను నిశ్చల భక్తి భావముతో నీ పాదములు పట్టుకొందును. నీవు వేగమే మహిష మహారాజునకు పట్టమహిషివి కమ్ము. ఆతని చేపట్టినచో నీ వీ త్రైలోక్యమందలి సంసారసుఖసంపదలు పడయగలవు.'

దేవ్యువాచ: శృణు సచివ! వక్ష్యామి వాక్యానాం సారముత్తమమ్‌ | శాస్త్రదృష్టేన మార్గేణ చాతుర్య మనుచింత్య చ. 29

మహిషస్య ప్రధాన స్త్వం మయా జ్ఞాతం ధియా కిల | పశుబుద్ధి స్వభావో%సి వచనాత్తవ సాంప్రతమ్‌. 30

మంత్రిణ స్త్వాదృశా యస్య కథం స బుద్ధిమాన్భవేత్‌ | ఉభయోః సదృశో యోగః కృతో%యం విధినా కిల. 31

యదుక్తం స్త్రీ స్వభావా%సి తద్విచారయ మూఢ కిమ్‌ | పుమాన్నా%హం తత్స్వభావా%భవం స్త్రీవేషధారిణీ. 32

యాచితం మరణం పూర్వం స్త్రీయా త్వత్ప్రభుణా యథా | తస్మా న్మన్యే%తి మూర్ఖో%సౌ న వీరరసవిత్తమః. 33

కా మిన్యా మరణం క్లీ బరతిదం శూరదుఃఖదమ్‌ | ప్రార్థితం ప్రభుణా తేన మహిషేణాత్మబుద్ధినా. 34

తస్మాత్‌ స్త్రీరూప మాధాయ కార్యం కర్తు ముపాగతా | కథం బిభేమి త్వద్వాక్యై ర్దర్మశాస్త్ర విరోధకైః. 35

విపరీతం యదా దైవం తృణం వజ్రసమం భ##వేత్‌ | విధిశ్చే త్సుముఖః కామం కులిశం తూలవత్తదా. 36

కిం సైన్యై రాయుధైః కిం వా ప్రపంచదుర్గ సేవనైః | మరణం సాంప్రతం యస్య తస్య సైన్యై స్తు కిం ఫలమ్‌. 37

యదా%యం దేహ సంబంధో జీవస్య కాలయోగతః | తదైవ లిఃతం సర్వం సుఖం దుఃఖం తథా మృతిః. 38

యస్య యేన ప్రకారేణ మరణం దైవనిర్మితమ్‌ | తస్య తేనైవ జాయేత నా న్యథేతి వినిశ్చయః. 39

బ్రహ్మాదీనాం యథా కాలే నాశోత్పత్తీ వినిర్మితే | తథైవ భవతః కామం కి మన్యేషాం విచార్యతే. 40

దేవి యిట్లనెను : 'మంత్రివరా ! నీవు శాస్త్రమార్గానుసారముగ చతురతతో సారవంతములగు మంచి పలుకులు పలుకుచున్నావు. ఇక నా మాట వినుము. ఇపుడు నీ మాటలబట్టి నా బుద్ధికి తోచునదేమనగ నీవు మహిషుని ప్రధానుడవు. నీవు మహిషబుద్ధి గలవాడవే. అతనికి నీవంటి మంత్రియుండగ నతడు సారమతి యెట్లు గాగలడు? బ్రహ్మ మీ యిరువురిని తగినట్లుగనే తగుల గూర్చినాడు. ఓరీ మూఢా! నన్ను నీవు స్త్రీ స్వభావము గలదానవంటివి. నీవేమి తెలిసియంటివిరా? నేను పురుషుడను గాను. నిజమే. కాని, నేను స్త్రీ రూపము దాల్చిన తత్పురుష స్వభావము గలదానను. మునుపు నీ ప్రభువొక స్త్రీ చేతిలో చచ్చునట్లు వరము బడసెను. దానినిబట్టి యత డతిమూర్ఖుడు - వీర రస మెఱుగనివాడు నని తలతును. ఒక యువతి చేతిలో చచ్చుట వీరులకు దుఃఖము-నపుంసకులు సంతసము గల్గించును. కనుక నీ మహిష ప్రభు విట్టి వరము కోరుకొనెను. అందులకే నేను స్త్రీ రూపము దాల్చి యీ కార్యము సాధింపవచ్చితిని. ఇంక నీ శాస్త్రవిరుద్ధములైన వాక్యములకు నేనేల భయపడుదును? దైవము ప్రతికూలమైనచో వజ్రముగూడ మెత్తని దూదిపింజెగ నగును. చావు దాపురించినవానికి విపుల సైన్యములు-ఆయుధములు-గట్టి దుర్గరక్షణ-యెన్ని యున్ననేమి ఫలము? ఈ జీవకోటికి దేహసంబంధముండునంతవఱకు కాలయోగమున సుఖదుఃఖములు-చావు మున్నగునవన్నియును గలుగుచుండును. ఎవని చావు దైవ నిర్మితమై యెట్టులుండునో యట్టుల జరుగును. కాని, వేరు విధముగ జరుగదు. బ్రహ్మాదులకు సైతము చావుపుట్టుకలు తప్పవు. అట్లే నీకును చావు తప్పదు. ఇంక వేరుగ చింతింప నేటికి?

యే మృత్యుధర్మిణ స్తేషాం వరదానేన దర్పితాః | మరిష్యామో న మన్యంతే తే మూఢా మందచేతసః. 41

తస్మా ద్గచ్ఛ నృపం బ్రూహి వచనం మమ సత్వరమ్‌ | యదాజ్ఞాపయతే భూప స్తత్కర్తవ్యం త్వయా కిల. 42

మఘవా స్వర్గ మాప్నోతు దేవాః సంతు హవిర్భుజః | యూయం ప్రయాత పాతాళం యది జీవితు మిచ్ఛథ. 43

అన్యథా చేన్యతిర్మంద మహిషస్య దురాత్మనః | తద్యుద్యస్వ మయా సార్థం మరణాయ కృతాదరః. 44చ

మన్యసే సంగరే భగ్నా దేవా విష్ణుపురోగమాః | దేవం హి కారణం తత్ర వరదానాం ప్రజాపతేః. 45

వ్యాసః: ఇతి దేవ్యావాచః శ్రుత్వాచింతయామాసదానవః | కిం కర్తవ్యం మయా యుద్ధం గంతవ్యంవానృపంప్రతి. 46

వివాహార్థ మిహాజ్ఞప్తో రాజ్ఞా కామాతురేణవై | తత్కథం విరసం కృత్వా గచ్ఛేయం నృపసన్నిధౌ. 47

ఇయం బుద్ధిః సమీచీనా యద్ర్వజామి కలిం వినా | యథా%గతం తథా శీఘ్రం రాజ్ఞే సంవేదయామ్యహమ్‌. 48

స ప్రమాణం పునః కార్యేరాజా మతిమతాం వరః | కరిష్యతి విచార్యైవ సచివై ర్నిపుణౖః సహ. 49

సహసా న మయా యుద్ధం కర్తవ్య మనయా సహ | జయే పరాజయే వా%పి భూపతే రప్రియం భ##వేత్‌. 50

యది మాం సుందరీ హన్యా దహం వా హన్మితాం పునః | మమ కేనా%ప్యుపాయేన స కుప్యేత్‌ పార్థివః కిల. 51

తస్మాత్తత్రైవ గత్వా%హం బోధయిష్యామి తం నృపమ్‌ | యథా%ధ్యాభిహితం దేవ్యా యథారుచి కరోతు సః. 52

వ్యాసః: ఇతి సంచిత్య మేధావీ జగామ నృపసన్నిధౌ | ప్రణమ్య తమువాచేదం కృతాంజలి రమాత్యజః. 53

మరణశీలురైన ప్రాణులు వరగర్వముతో క్రొవ్వి మేము చావమని తలంతురు. అట్టివారిని మూఢులు మందమతులు ననవలయును. నీవిపుడు నీ రాజు చెంత కేగుము. వేగమే నా మాటలన్నియు నతనికి దెలుపుము. పిదప నీ రాజాజ్ఞాపించినట్లు నీవు చేయవలయును. అతనికి ప్రాణముల తీపి యున్నచో పాతాళ మేగవలెను. ఇంద్రుడు స్వర్గమలంకరించును. సురకోటులు హవిర్భాగములు గొందురు. దురాత్ముడగు మూఢ మహిషుని బుద్ధి దీనికి భిన్నముగ నున్నచో చావునకు నాతో యుద్ధము చేయుమనుము. ఒకవేళ విష్ణువు మున్నగు దేవతలును సంగరమునుండి పారిపోయిరని దలతువేని దానికి కారణము బ్రహ్మవరము-దైవబలము నని యెఱుగుము. శ్రీదేవి హితములు విని దానవుడిట్లు తలపోసెను : నేనిపుడు రణ మొనర్పవలయునా? లేక రాజు చెంత కేగవలయునా? నా రాజు కామాతురుడు - నే నతని పెండ్లి జరిపించుట కాజ్ఞాపింపబడితిని. ఈ రీతిగ రసభంగ మెనర్చి తిరిగి యతని దరికే మొగము పెట్టుకొని వెళ్ళగలను? ఐనను కయ్యమునకు కాలు త్రవ్వక వచ్చిన దారినే వెళ్ళి రాజున కన్నియు నివేదించుట తగిన యాలోచన మని నేను దలతును. నా రాజు కార్యకుశలుడు. ధీమంతులలో శ్రేష్ఠుడు. కనుక నతడు కుశలురగు మంత్రులతో చక్కగ నాలోచించి చేయగలడు. ఆమెతో తొందఱపాటుతో పోరాటము సలుపరాదు. ఈ సమయమున రాజునకు జయాపజయములు ప్రియములుగావు. నే నా సుందరిని చంపినను నామె నన్ను చంపినను నా రాజునకు నా మీదనే కోపము వచ్చును. కావున నే నచ్చటికే వెళ్ళి దేవి పలికన మాటలన్నియును రాజుతో బలుకుదును. అతడు తనకు దోచినట్లుగ చేయగలడు అని యాలోచించుకొని తెలివిగల యా మంత్రి నత రాజు చెంతకేగి చేతులు జోడించి యతని కిట్లనియెను :

మంత్ర్యువాచ : రాజన్దేవీ వరారోహా సింహస్యోపరిసంస్థితా | అష్టాదశ భుజా రమ్యా వరా%యుధధరా పరా. 54

సా మయోక్తా మహారాజ మహిషం భజభామిని | మహిషీ భవ రాజ్ఞ స్త్వం త్రైలోక్యాధిపతేః ప్రియా. 55

పట్టరాజ్ఞీ త్వమేవాస్య భవితా నాత్ర సంశయః | స తే వా%%జ్ఞాకరో జాతో వశవర్తీ భవిష్యతి. 56

త్రైలోక్య విభవం భుక్త్వా చిరకాలం వరాననే | మహిషం పతి మాసాద్య యోషితాం సుభగాభవ. 57

ఇతి మద్వచనం శ్రుత్వాసా స్మయావేశ మోహితా | మా మువాచ విశాలాక్షీ స్మితపూర్వ మిదం వచః. 58

మహిషీగర్భ సంభూతం పశూనామధమం కిల | బలిం దాస్యా మ్యహం దేవ్యై సురాణాం హితకామ్యయా. 59

కా మూఢా కామినీ లోకే మహిషం వై పతిం భ##జేత్‌ | మదృశీ మందబుద్ధే కిం పశుభావం భ##జేదిహ. 60

మహిషీ మహిషం నాథం సశృంగా శృంగసంయుతమ్‌ | కురుతే క్రందమానా వై నాహం తత్సదృశీ శఠా. 61

కరిష్యే%హం మృధే యుద్ధం హనిష్యేత్వాం సురాప్రియమ్‌ | గచ్ఛవా దుష్ట పాతాళం జీవితేచ్ఛా యదస్తి తే. 62

విరుషంతు తయా వాక్య మిత్యుక్తం నృపమత్తయా | తచ్ఛ్రు త్వా%హం సమాయాతః ప్రతిచింత్య పునః పునః. 63

రసభంగం విచింత్యైవ న యుద్ధం తు మయా కృతమ్‌ | ఆజ్ఞాం వినా తవాత్యంతం కథం కుర్యాం వృథోద్యమమ్‌. 64

సా%తీవ చ బలోన్మత్తా వర్తతే భూప భామినీ | భవితవ్యం న జానామి కిం వా భావి భవిష్యతి. 65

కార్యే%స్మిం స్త్వం ప్రమాణం నో మంత్రో%తీవ దురాసదః | యుద్ధం పలాయనం శ్రేయో న జానే%హం వినిశ్చయమ్‌. 66

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ పంచమస్కంధే దశమో%ధ్యాయః.

రాజా! ఆ సుందరాంగి యష్టాదశ భుజములతో దివ్యాయుధములతో సింహవాహనముపై విరాజిల్లుచున్నది. ఆమెతో నేనిట్లంటిని : భామినీ! ఆ మహిషుని సేవింపుము. త్రైలోక్యపతి యగు మా రాజునకు ముద్దులపట్టమహిషిని గమ్ము. నీవు పట్టపుదేవి వగుటలో నెట్టి సందియమును లేదు. అతడు నీ చెప్పుచేతల నుండగలడు. మహిషుని పతిగ బడసి ముల్లోకముల సంపద లనుభవించి స్త్రీలలో సౌభాగ్యవతివి గమ్ము అను నా యీ మాటలు విని యా విశాలాక్షి గర్వమోహమున పెద్దగ నవ్వుచు నాతో నిట్లు పలికెను : వాడు మహిషి కడుపు చెడపుట్టినవాడు. పశువులలో నధమాధముడు. నేను వానిని దేవతల మేలుగోరి ఆ పరాదేవతకు బలిపశువుగ నర్పింతును. ఓరీ మూఢా! మందమతీ! ఏ మానిని మహిషుని పతిగ గోరునురా? నావంటి సాధ్వి పశు భావమెట్లు పొందునురా? ఓరి శఠా! మహిషికి కొమ్ములుండును. అది తనవలె శృంగములు కల మహిషమును పతిగ కామించును. దానితో నా కెక్కడి పోలికరా? నీవు సురవైరివి. నిన్ను రణమున సమూలముగ హతమార్తును. నీకు బ్రదుకుపై నాస యున్నచో నిపుడే పాతాళమున కేగుము అని మదవతియగు ఆ యువతి నాతోపరుషముగ బల్కినది. అది విని నేనెంతయో విచారించి తుదకు నీ దరి చేరితిని. రసభంగ మగునేమో యని నేను పోరునకు దిగలేదు. మీ యానతి లేకూరకేల యుద్ధమునకు యత్నింపవలయును? ఆ భామిని తన మహా తేజో మహిమచే నున్మత్తురాలుగనున్నది. ముందెట్లు జరుగునో కాని భవితవ్యము నర్ణయింపలేము. ఈ విషయము నిర్ణయింప నీవే సమర్థుడవు. ఈ యాలోచనము కఠినమైనది. ఇపుడు యుద్ధమో-పలాయనమో-రెంట నేది మంచిదో నిర్ణయింపలేకున్నాను.

ఇది శ్రీమద్దేవీ భాగవతమందలి పంచమ స్కంధమందు మహిషునకు శ్రీదేవిహితములను దశమాధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters