Sri Devi Bhagavatam-1    Chapters   

అథ ఏకోదశో%ధ్యాయః

వ్యాస ఉవాచ : ఇతి తస్య వచః శ్రుత్వా మహిషో మద విహ్వలః | మంత్రి వృద్ధా న్సమాహూయ రాజా వచన మబ్రవీత్‌. 1

రాజోవాచ : మంత్రిణః కించ కర్తవ్యం విశ్రబ్ధం బ్రూతమాచిరమ్‌ | ఆగతా దేవవిహితా మాయేయం శాంబరీవకిమ్‌. 2

కార్యే%స్మి న్నిపుణా యూయ ముపాయేషు విచక్షణాః | సామాదిషు చ కర్తవ్యః కో%త్ర మహ్యం బ్రువంతు చ. 3

మంత్రిణః ఊచుః: సత్యం సదైవ వక్తవ్యం ప్రియం చ నృపసత్తమ | కార్యం హితకరం నూనం విచార్య విబుధైః కిల. 4

సత్యం చ హితకృ ద్రాజన్‌ ప్రియం చాహితకృద్భవేత్‌ | యథౌషధం నృణాం లోకే హ్యప్రియం రోగనాశనమ్‌. 5

సత్యస్య శ్రోతా మంతా చ దుర్లభః పృథివీపతే | వక్తా%పి దుర్లభః కామం బహవశ్చాటుభాషకాః. 6

కథం బ్రూమో%త్ర నృపతే విచారే గహనే త్విహా | శుభం వా%ప్య శుభం వా%పి కో వేత్తి భువనత్రయే. 7

రాజోవాచ : స్వ స్వమత్యనుసారేన బ్రువం త్వద్య పృథక్పృథక్‌ | యేషాం హి యాదృశో భావ స్త చ్ఛ్రుత్వా చింతయామ్యహమ్‌. 8

బహూనాం మత మాజ్ఞాయ విచార్య చ పునః పునః | యచ్ఛ్రేయ స్తద్ధి కర్తవ్యం కార్యం కార్యవిచక్షణౖః. 9

వ్యాస ఉవాచ : తసై#్యవం వచనం శ్రుత్వా విరూపాక్షో మహాబలః | ఉవాచ తరసా వాక్యం రంజయ న్పృథివీ పతిమ్‌. 10

రాజన్నారీ వరాకీయం సాబ్రూతే మదగర్వితా | బిభీషికామాత్ర మిదం జ్ఞాతవ్యం వచనం త్వయా. 11

కో బిభేతి స్త్రీయో వాక్యై ర్దురుక్తై రణదుర్మ దైః | అనృతం సాహసం చేతి జానన్నారీ విచేష్టితమ్‌. 12

జిత్వా త్రిభువనం రాజ న్న ద్య కాంతాభయం నవై | దీనత్వే%వ్యయశో నూనం వీరస్య భువనే భ##వేత్‌. 13

తస్మా ద్యామ్యహ మేకాకీ యుద్ధాయ చండికాం ప్రతి | హనిష్యే తాం మహారజ నిర్భయో భవ సాంప్రతమ్‌. 14

పదకొండవధ్యాయము

మహిషుడు దేవికడకు రాయబారులను పంపుట

దూత పలుకులన్నియును విని మహిషుడు వృద్ధామాత్యులను పిలిపించి వారితో నిట్లనెను : మంత్రులారా! మీరాలసింపక విచారించి యిపుడేమి చేయవలయునో తెలుపుడు - ఆ వచ్చిన దేవి దేవతలచే పంపబడిన శాంబరీమాయయా యేమి? మీరాలోచన చేయుటలోను సామాద్యుపాయములు నెఱపుటలోను కడు నిపుణులు. నాకిపుడు కర్తవ్య మెఱిగింపుడు. మంత్రులిట్లనిరి : రాజా! పండితులెప్పుడును సత్యము ప్రియము హితకరమునగు పలుకులు పలుకుదురు. ఇష్టము లేకున్నను మందు త్రాగవలయును. అది తుదకు రోగమును పోగొట్టును. అట్లే సత్యము ప్రియముగాకున్నను తుదకు మేలే చేయును. రాజా! నిజము నిప్పువంటిది. ఈ లోకమున నిజము పలుకువాడు వినువాడు దాని నంగీకరించువాడు కంటికే కనిపించరు. ఏలన చాలమంది పై తీయగ పలుకువారే యుందురు. ఇపుడీ గహనమగు విచారము విషయమున ఏమని మేమెట్లు చెప్పగలము? ఈ ముజ్జగములందును శుభ##మేదో అశుభ##మేదో నిర్ణయించగలవాడెవ్వడు గలడు?' అన రాజు ఇట్లనెను : ఇపుడు మీరు మీమీ బుద్ధులకు తోచినట్లు వేరువేరుగ చెప్పుడు. ప్రతివాని భావమును విని తుదకు నేనొక నిర్ణయమునకు వత్తును. కార్యకుశలుడందఱి యభిప్రాయములును వినవలయును. వానిని మాటిమాటి కాలోచింప వలయును. తుదకు వానిలో తనకు మేలని తోచిన దాని నాచరింపవలయును అను నతని మాటలు విని విరూపాక్షుడను నొక బలశాలి వేగమే రాజునకిష్టము గులుగునట్టు లిట్టులనియెను : ఆ వచ్చిన తరుణీమణి సామాన్యురాలు - మదగర్వితురాలు. ఆమె మాటలు బెదరింపులుగ నెఱుగుము. ఒక నెలతుక చేతులు-తెంపు-పనికిమాలినవని ఎఱిగిన వాడామె యుద్ధమదమున పలికిన దుర్భాషల కేల జంకును? నీవు ముజ్జగములు గెలిచిన మహావీరుడవు. నేడొక కాంతకు నీవు భయపడినచో నీకింకేమైనా పరువు దక్కునా? నేనిపుడొంటరిగ నేగుదును. ఆ చండితో బోరి యామెను దెగటార్తును. నీవు గుండె నిబ్బరమున నుండుము.

సేనా వృతో%హం గత్వా తాం శస్త్రాస్త్రె ర్వి విధైః కిల | 15

నిషూదయామి దుర్మర్షాం చండికాం చండవిక్రమామ్‌. 16

బద్ధ్వా సర్పమయైః పాశైరానయిష్యే తవాంతికమ్‌ | వశగా తు తదా తే స్యా త్పశ్య రాజన్బలం మమ. 16

విరూపాక్ష వచః శ్రుత్వా దుర్ధరో వాక్యమబ్రవీత్‌ | సత్య ముక్తం వచో రాజ న్విరూపాక్షేణ ధీమతా. 17

మమాపి వచనం శ్లక్షం శ్రోతవ్యం ధీమతా త్వయా | కామాతురైషా సుదతీ లక్ష్యతే%ప్యను మానతః. 18

భవత్యేవం విధా కామం నాయికా రూపగర్వితా | భీషయిత్వా వరారోహ త్వాం వశే కర్తు మిచ్ఛతి. 19

హావో%యం మానినీనాం వె తం వేత్తి రసవిత్తమః | వక్రోక్తి రేషా కామిన్యాః ప్రియం ప్రతి పరాయణమ్‌. 20

వే త్తి కో%పి నరః కామం కామశాస్త్రవిచక్షణః | యదుక్తం నామ బాణౖ స్త్వాం వధిష్యే రణమూర్ధని. 21

హేతుగర్భ మిదం వాక్యం జ్ఞాతవ్యం హేతువిత్తమైః | బాణా స్తు మానినీనాం వై కటాక్షా ఏవ విశ్రుతాః. 22

పుష్పాంజలిమయా శ్చాన్యే వ్యంగ్యాని వచనాని చ | కా శక్తి రన్యబాణానాం ప్రేరణ త్వయి పార్థివ. 23

తాదృశీనాం న సా శక్తి ర్ప్రహ్మవిష్ణుహరాదిషు | యయోక్తం నేత్రబాణౖస్తావం హనిష్యే మందపార్థివమ్‌. 24

విపరీతం పరిజ్ఞాతం తేన%రసవిదా కిల | పాతయిష్యామి శయ్యాయాం రణమయ్యాం పతిం తవ. 25

విపరీతరతి క్రీడా భాషణం జ్ఞేయ మేవ తత్‌ | కరిష్యే విగతప్రాణం యదుక్తం వచనం తయా. 26

వీర్యం ప్రాణా ఇతి ప్రోక్తం తద్విహీనం న చాన్యథా | వ్యంగ్యాధిక్యేన వాక్యేన వరయ త్యుత్తమా నృప. 27

తద్వై విచారతో జ్ఞేయం రసగ్రంథ విచక్షణౖః | ఇతి జ్ఞాత్వా మహారాజ! కర్తవ్యం రససంయుతమ్‌. 28

లేదా - సేనతో గూడి యేగి ఆ చండవిక్రమరూపిణిని వివిధ శస్త్రాస్త్రములతో దునుమాడుదును. లేదా సర్పములవంటి పాశములతో బంధించి యామెను నీ చెంతకు దెత్తును. అప్పుడుగాని యామె నీకు వశవర్తిని గాదు - నా బలము నీ కవగతము గాదు అను నతని మాటలు విని దుర్ధరుడను వాడిట్లనెను : ధీశాలి యగు విరూపాక్షుడు నిజము పలికెను. ఇపుడు నా చక్కని పలుకును గూడ ధీమంతుడవగు నీవు వినవలయును. నే నా వరారోహను కామాతురనుగ నూహించుచున్నాను. తన రూపముపై విఱ్ఱవీగు నాయిక యిట్లే యుండును. మొదట నిన్నా వరారోహ బెదరించి తన వశము చేసికొన చూచు చున్నది. ఒక శృంగార నాయికలోని హావభావములు ఆమెకు తన ప్రియుని యెడ గల వక్రోక్తి భావములు నిటులే యుండును. వానిని రసవిదులలో నుత్తముడగు నాయకుడే గ్రహించగలడు. దీనిని కళాశాస్త్ర కోవిదుడు మాత్రమే యెఱుగును. ఆమె యుద్ధ మధ్యస్థితయై నిన్ను తన వాడి తూపులతో నెదుర్కొందుననెను. ఆమె యీ మాటలు నర్మగర్భితములని హేతువాదు లెఱుంగుదురు. ఇంతి కడగంటి చూపులు తూపులుగ నతిశయిల్లును గదా! ఆమె యితర వ్యంగ్య వాక్కులు పూలదోసిళ్ళ వంటివి. కానిచో నీ మీద బాణములు వేసి బ్రదుకు శక్తి హరిమర బ్రహ్మలకుగూడ లేదే! ఆమె పలుకుల సార మేమనగ, నామె తన వాడి చూపుతూపులతో మందుడగు మహిషుని బాధింతుననెను. ఆ వెళ్ళిన దూత సరసుడు గానందున విపరీతముగ భావించెను. ఆమె నీ పతిని రణశయ్యపై పడవైతుననెను గద! ఇట ప్రాణమనగ వీర్యము. దానిని హరించివేయుదునని భావము. అంతేకాని, వేరేమియుగాదు. ఉత్తములగు యువిదలు నరుల నిట్టి వ్యంగ్యములతో నలరింతురు. రసశాస్త్ర వివారదులిట్లు విచారించి తెలిసికొనిరి. ఇంక నామె నిట్టిదానిగ నెఱిగి రసికుడవై వ్యవహరింపుము.

సామదాన ద్వయం తస్యా నాన్యోపాయో%స్తి భూపతే | రూషావా గర్వితా వా%పి వశగా మాననీ భ##వేత్‌. 29

తదృశై ర్మధురై ర్వాక్యై రానయిష్యే తవాంతికమ్‌ | కిం బహూక్తేన మే రాజన్‌ కర్తవ్యా వశవర్తినీ. 30

గత్వా మయా%ధు నైవేయం కింకరీవ సదైవతే | ఇత్థం నిశమ్య తద్వాక్యం తామ్ర స్త త్వ విచక్షణః. 31

ఉవాచ వచనం రాజ న్నిశామయ మయోదితమ్‌ | హేతుమద్ధర్మ సహితం రసయుక్తం నయాన్వితమ్‌. 32

నైషా కామాతురాబాలా నానురక్తా విచక్షణా | వ్యంగ్యాని నైవవాక్యాని తయోక్తాని తు మానద. 33

చిత్రమత్ర మహాబాహో యదేకా వరవర్ణినీ | నిరాలంబా సమాయాతి చిత్రరూపా మనోహరా. 34

అష్టాదశ భుజా నారీ న శ్రుతా న చ వీక్షితా | కేనాపి త్రిషు లోకేషు పరాక్రమవతీ శుభా. 35

ఆయుధాన్యపి తావంతి ధృతాని బలవంతి చ | విపరీత మిదం మన్యే సర్వం కాలకృతం నృప 36

స్వప్నాని దుర్నిమిత్తాని మయా దృష్టాని వై నిశి | తేన జానామ్యహం నూనం వైశసం సముపాగతమ్‌. 37

కృష్ణాంబరధర నారీ రుదతీ చ గృమాంగణ | దృష్ట్వా స్వప్నే% పుష్యఃకాలే చింతితవ్య స్తదత్యయః. 38

వికృతాః పక్షిణో రాత్రౌ రోరువంతి గృహే గృహే | ఉత్పాతా వివిధా రాజన్‌ ప్రభవంతి గృహే గృహే. 39

తేన జానా మ్యహం నూనం కారణం కించిదేవ హి | యత్త్వాం ప్రార్థయతే బాల యుద్ధాయ కృతనిశ్చయా. 40

నైషా%స్తి మానుషీ నో వా గాంధర్వీ న తథా%%సురీ | దేవైః కృతేయం జ్ఞాతవ్యా మాయామోహకరీ విభో. 41

కాతరత్వం న కర్తవ్యం మమైత న్మత మిత్యలమ్‌ | కర్తవ్యం సర్వథా యుద్ధం య ద్భావ్యం తద్భవిష్యతి. 42

కో వేద దేవ ! కర్తవ్యం శుభం వా%ప్య శుభం తథా | అవలంబ్య ధియో ధైర్యం స్థాతవ్యం వై విచక్షణౖః. 43

జీవితం మరణం పుంసాం దైవా ధీనం నరాధిప | కో%పి నైవాన్యథా కర్తుం సమర్థో భువనత్రయే. 44

ఆమె యెంతకోపము గలదైనను గర్వము గలదైనను సామదానముల రెంటిచేతనే నీ చేజిక్కును. మఱి దేని వలనను గాదు. నేను నా యీ తీయని మాటలతో నామెను నీ చెంతకు తేగలను. ఆమెను నీ దానిగ జేతును. నే నిపుడే వెళ్ళి యామెను నీ దాసిగ జేతును అను నతని మాటలు విని తత్వ వివేకియగు తామ్రుడిట్లనియెను : రాజా ! నయము-ధర్మము-కారణము-రసము గల నా మాటలు వినుము. ఆమె కామపీడితురాలు గాదు. నీయం దనురక్త గాదు. ఆమె పలుకులు వ్యంగ్యములును గావు. ఆ విచిత్రాంగియగు మనోరమ నిరాశ్రయగ నొంటరిగ వచ్చుట చూడగ చిత్రముగ నున్నది. అష్టాదశభుజములు గలిగిన పరాక్రమముగల చండరూప నీ ముల్లోకములలో నెవరును కనివిని యెఱుగరు. ఆమె శక్తిగల దివ్యాయుధములు ధరించినది. ఇదంతయు నేదో కాలవైపరీత్యమని తోచుచున్నది. ఈ రేయి నాకు దుర్నిమిత్తములైన కలలు వచ్చినవి. దానిబట్టి నేదో యాపద మూడినదని తోచుచున్నది. ఈ తెల్లవారుజామున నొక యాడుది నల్లచీరకట్టి యింటి ముంగిట నేడ్చుట కలగంటిని. దీన నేదో యశుభము మనకు వాటిల్లునని తెలియుచున్నది. రేతిరి ప్రతి యింట పక్షులు వికృతముగ నరచుచున్నవి. ఇంటింట పెక్కులుపద్రవములు పొడసూపినవి. దీనికి వెనుక నేదో కారణమున్నదని తెలియుచున్నది. కనుకనే యామె ముందుగ నన్నియు నిశ్చయించుకొని నిన్ను యుద్ధమునకు పురికొలుపుచున్నది. ఈమె మనుజ-రాక్షస-గంధర్వ కామినులలో నే యొక్కతెయు గాదు. దేవత లెల్లరును మనకు మోహము గల్గించుట కీ రూపు దాల్చిన మాయాశక్తిని పంపిరని యెఱుగవలయును. కనుక మనము పిరికితనము వదలి రణమొనర్పవలయును. కానున్నది కాక మానదని నా యభిప్రాయము. దేవతలు గలిగించు శుభాశుభము లెవని కర్థమగును? కనుక పండితులు నిశ్చలబుద్ధితో ధైర్యమూని యుండవలయును. ఈ త్రిభువనములందు ప్రాణుల చావుపుట్టువులు దైవాధీనములు. వాని నెంతటివాడును మార్పజాలడు.

మహిషః గచ్ఛ తామ్ర మహాభాగ యుద్ధాయ కృతనిశ్చయః | తామానయ వరారోహాం జిత్వా ధర్మేణ మానినీమ్‌. 45

న భ##వే ద్వశగా నారీ సంగ్రామే యది సా తవ | హంతవ్యా నాన్య థా కామ మాననీయా ప్రయత్నతః. 46

వీర స్త్వమసి సర్వజ్ఞ కామశాస్త్ర విశారదః | యేన కేనా ప్యుపాయేన జేతవ్యా వరవర్ణినీ. 47

త్వర న్వీర మహాబాహో సైన్యేన మహతా వృతః | తత్ర గత్వా త్వయా జ్ఞేయా విచార్య చ పునః పునః. 48

కి మర్థ మాగతా చేయం జ్ఞాతవ్యం తద్ది కారణమ్‌ | కామాద్వా వైరభావాచ్చ మాయా కస్యేయ మిత్యుత. 49

ఆదౌ తన్నిశ్చయం కృత్వా జ్ఞాతవ్యం తచ్చికీర్షితమ్‌ | పశ్చాద్యుద్ధం ప్రకర్తవ్యం యథాయోగ్యం యథాబలమ్‌. 50

కాతరత్వం న కర్తవ్యం నిర్దయత్వం తథా న చ | యాదృశం హి మనస్తస్యాః కర్తవ్యం తాదృశం త్వయా. 51

ఇతి తద్భాషితం శ్రుత్వా తామ్రః కాలవశం గతః | నిర్గతః సైన్యసంయుక్తః ప్రణమ్య మహిషం నృపమ్‌. 52

గచ్ఛ న్మార్గే దురాత్మా%సౌ శకునా న్వీక్ష్య దారుణాన్‌ | విస్మయం చ భయం ప్రాప యమమార్గ ప్రదర్శకాన్‌. 53

స గత్వా తాం సమాలోక్య దేవీం సింహోపరి స్థితామ్‌ | స్తూ యమానాం సురైః సర్వాయుధ విభూషితామ్‌. 54

తామువాచ వినీతః సన్వాక్యం మధురయా గిరా సామభావం సమాశ్రిత్య వినయావనతః స్థితః. 55

అన విని మహిషు డిట్లనెను : తామ్రా ! నీవు పట్టుదలతో రణమునకేగి యామానవతిని ధర్మయుద్ధమున గెలిచి పట్టి తెమ్ము. యుద్ధముచే లొంగనిచో నామెను చంపివేయుము. వశ##మైనచో చక్కగ నామెతో మర్యాద నెఱపుము. నీవు వీరుడవు. కామశాస్త్ర విశారదుడవు. ఏదోయొక యుపాయమున నామెను లొంగదీయుము. మహావీరా! నీ వటకు సేనా సమేతముగ వెడలుము. ఆమె భావమును చక్కగ విచారించి తెలిసికొనుము. ఆమె కామముతో వచ్చెనో వైరముతో వచ్చెనో యెందులకు వచ్చెనో యెవరేని మాయచేసి ప్రయోగించిరో యంతయును నీవెఱుంగుము. మొదట వీనినన్నిటిని నిశ్చయించు కొనుము. ఆమె కోరిక తెలిసికొనుము. ఆ పిదప నీ బలమునకు యోగ్యతకు తగినట్లు యుద్ధము గూర్పుము. అప్రమత్తతతోగాని నిర్దయుడవై కాని యుండకుము. ఆమె మన యెడల నెట్లుండునో నీవు నట్లే యామెతో వ్యవహరింపుము అను మహిషుని మాటలు విని తామ్రుడు కాలవశుడై మహిషునకు నమస్కరించి సైన్యముతో తరలెను. అతడు త్రోవలో చావు సూచించు దారుణ దుర్నిమిత్తములుగని భయవిస్మితుడయ్యెను. అతడచ్చటికేగి శ్రీదేవిని గాంచెను. ఆమె దివ్యాయుధములు దాల్చి సింహవాహనయై నిఃల సురులచే నుతింపబడుచుండెను. అతడు వినయముతో తలవంచి తీయని మాటలతో నామెకిట్లు పలికెను :

దేవి! దైత్యేశ్వరః శృంగీ త్వద్రూపగణమోహితః | స్పృహాం కరోతి మహిషసత్త్వత్పాణి గ్రహణాయ చ. 56

భావం కురు విశాలాక్షి తస్మి న్నమరదుర్జయే | పతిం తం ప్రాప్య మృద్వంగి ! నందనే విహరాద్భుతే. 57

సర్వాంగ సుందరం దేహం ప్రాప్య సర్వసుఖాస్పదమ్‌ | సుఖం సర్వాత్మనా గ్రాహ్యం దుఃఖం హేయమితిస్థితిః. 58

కరబోరు కిమర్థం తే గృహీతాన్యాయుథా న్యలమ్‌ | పుష్పకందుక యోగ్యా స్తే కరాః కమలకోమలాః 59

భ్రూ చాపే విద్యమానే%పి ధనుషా కిం ప్రయోజనమ్‌ | కటాక్ష విశిఖాః సంతి కిం బాణౖ ర్నిష్ప్రయోజనైః. 60

సంసారే దుఃఖదం యుద్ధం న కర్తవ్యం విజానతా | లోభాసక్తాః ప్రకుర్వంతి సంగ్రామం చ పరస్పరమ్‌. 61

పుషై#్పరపి న యోద్ధవ్యం కిం పునర్నిశితైః శ##రైః | భేదనం నిజగాత్రాణాం కస్య తజ్జాయతే ముదే. 62

తస్మా త్త్వమపి తన్వంగి ప్రసాదం కర్తు మర్హసి | భర్తారం భజ మే నాథం దేవదానవ పూజితమ్‌. 63

సతే%త్ర వాంఛితం సర్వం కరిష్యతి మనోరథమ్‌ | త్వం పట్టమహిషీ రాజ్ఞః సర్వథా నాత్ర సంశయః. 64

వచనం కురు మే దేవి ప్రాప్స్యసే సుఖముత్తమమ్‌ | సంగ్రామే జయసందేహః కష్టం ప్రాప్య న సంశయః. 65

జనాసి రాజనీతిం త్వం యథావ ద్వరవర్ణిని | భుంక్ష్వ రాజ్యసుఖం పూర్ణం వర్షాణా మయుతాయుతమ్‌. 66

పుత్రస్తే భవితా కాంతః సో%పి రాజా భవిష్యతి | ¸°వనే క్రీడయిత్వాంతే వార్ధక్యే సుఖమాప్స్యసి. 67

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ పంచమస్కంధే దేవీ మహాత్మ్యే ఏకాదశో%ధ్యాయః.

ఓ స్వామినీ ! మా మహిష దైత్యపతి నీ రూప¸°వన గుణములకు పరవశుడై నిన్ను చేపట్టుట కుత్సహించుచున్నాడు. రూపాధికా! విశాలాక్షీ! మహిషు డమర దుర్జయుడు. అతనిని నీ మది నిల్పుము. నందనవనమున నతనితో విహరింపుము. సర్వాంగ సౌందర్యముగల మేను పడసితివి. కనుక నెల్ల విధములు నెల్ల సుఖములకు నెలవైన శాంతి సౌఖ్యము పడయుము. దుఃఖము వీడుము. నీ చేతులు కమలకోమలములు అవి పూబంతులు పట్టతగినవి. వానితో నాయుధము లేల దాల్చితివి? నీ కనుబొమలు మరుని వింటివంటివి. ఇంక నీ చేత ధనువేల? నీ కడగంటి వాడిచూపులుండగ తూపులతో ప్రయోజనమేమి? ఈ లోకములో తెలిసినవాడెవ్వడును దుఃఖప్రదమగు యుద్ధ మొనర్పడు. లోభము గలవారే పరస్పరము పోరుదురు. వాడి బాణములతోనే కాదు మెత్తని పూలు తీసికొనియు నెవనితోను పోరు సల్పరాదు. ఏలన, తన మేనునకు బాధ గలుగచుండగ నెవని మది ముదము గల్గును? కనుక నో విచిత్రాంగీ! సుప్రసాదినివి గమ్ము. దేవ దానవ పూజితుడగు మా నాథుని నాథునిగ భజింపుము. అట్లు జరిగిననాడు నీ కోరికలెల్ల నీడేరును. నీవతని పట్టమహిషివి కాగలవు. ఇందు సందేహ మెంతమాత్రమును లేదు. వరవర్ణినీ ! నా మాట నమ్ముము. నీకు మంచి సుఖము గలుగును. ఎంత కష్టించినను రణమున జయ మొందుట సంశయింపదగినదే. నీవు రాజనీతి తెలిసినదానవు. అతనితో నీవు పెక్కేండ్లు పూర్ణరాజ్యభోగము లనుభవింపుము. మీకొక చక్కని కొడుకు పుట్టును. వాడు రాజు గాగలడు. దీనివలన మీరు ¸°వన మందు సుఖక్రీడల దేలియాడి ముదుసలితనమందును సుఖములందగలరు.

ఇది శ్రీమద్దేవీ భాగవత మందలి పంచమ స్కంధమందు మహిషుడు దేవికడకు రాయబారులను పంపుట యను నేకాదశాధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters