Sri Devi Bhagavatam-1    Chapters   

అథ ద్వాదశో%ధ్యాయః

తన్నిశమ్య వచస్తస్య తామ్రస్య జగదంబికా | మేఘ గంభీరయా వాచా హసంతీ తమువాచ హ. 1

గచ్ఛ తామ్ర పతిం బ్రూహి ముమూర్షుం మందచేతసమ్‌ | మహిషం చాతికామార్తం మూఢం జ్ఞానవివర్జితమ్‌. 2

యథా తే మహిషీ మాతా ప్రౌఢా యవసభక్షిణీ | నాహం తథా శృంగవతీ లంబపుచ్ఛా మహోదరీ. 3

న కామయే%హం దేవేశం నైవ విష్ణుంన శంకరమ్‌ | ధనదం వరుణం నైవ బ్రహ్మాణం న చ పావకమ్‌. 4

ఏతా న్దేవగణా న్హిత్వా పశుం కేన గుణన వై | వృణోమ్యహం వృథా లోకే గర్హణా మే భ##వేదితి. 5

నాహం పతింవరా నారీ వర్తతే మే పతిః ప్రభుః సర్వకర్తా సర్వసాక్షీ హ్యకర్తా నః స్పృహః స్థిరః. 6

నిర్గుణో నిర్మమో%నంతో నిరాలంబో నిరాశ్రయః | సర్వజ్ఞః సర్వగః సాక్షీ పూర్ణః పూర్ణాశ్రయః శివః. 7

సర్వావాసక్షమః శాంతః సర్వదృక్సర్వభావనః | తం త్యక్త్వా మహిషం మందం కథం సేవితు ముత్సహే. 8

ప్రబుధ్య యుధ్యతాం కామం కరోమి యమ వాహనమ్‌ | అథవా మనుజానాం వై కరిష్యే జలవాహకమ్‌. 9

జీవితేచ్ఛా%స్తి చే త్పాప గచ్ఛ పాతాళ మాశువై | సమసై#్త ర్దానవై ర్యుక్త స్త్వన్యథా హన్మి సంగరే. 10

కామం సదృశ యో ర్యోగః సంసారే సుఖదో భ##వేత్‌ | అన్యథా దుఃఖదో భూయా దజ్ఞానాద్యది కల్పితః. 11

మూర్ఖస్త్వమసి యద్బ్రూషే పతిం మే భజ భామిని | క్వాహం క్వ మహిషః శృంగీ సంబంధః కీదృశో ద్వయోః. 12

గచ్ఛ యుధ్యస్వ వా కామం హనిష్యేహం సబాంధవమ్‌ | యజ్ఞభాగం దేవలోకం నో చేత్త్యక్తా సుఖీ భవ. 13

పన్నెండవధ్యాయము

మహిషుని మంత్రాలోచనము

ఆ జగదంబిక తామ్రుని మాటలు విని నవ్వి మేఘగంభీర వాక్కుతో వారి కిట్లనియెను : ''త్రామ్రా ! నీ పతి మూఢుడు-మందమతి-జ్ఞానశూన్యుడు-కామార్తుడు. చావు మూడి నాతో పగ పూనినవాడు. అతని చెంతకేగి యిట్లనుము: నీవు గడ్డి-గాదము-తినువాడవు. తోక-కొమ్ము లాడించువాడవు. బానకడుపు గలవాడవు. నాకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు-వరుణకుబేరులు మొదలుగాగల దేవతలలో నెవరియందును మనసు లేదు. ఇంతటి దేవగనమును త్రోసిరాజని యొక నాలుగుకాళ్ళ పసరము నేమని వరింపగలను? అపుడు లోకము నన్ను నీవు పనికిమాలినదానవని నిందింపదా? నేను వేరొక పతిని వరించుదానను గాను. నాకు పతిగలడు. అతడు సర్వకర్త-సర్వసాక్షి-అకర్త-నిష్కాముడు-విశ్వప్రభుము-సుస్థిరుడు-నిర్గుణుడు-నిరాలంబుడు-నిర్మముడు-నిరాశ్రయుడు-సర్వజ్ఞుడు-సర్వగుడు-సుహృత్తముడు-అనంతుడు-పూర్ణకాముడు-విశ్వరూపుడు-పరమశాంతుడు-విశ్వచక్షువు హృదయాంతరజ్యోతి-దక్షుడు-పశుపతి-విశ్వభావనుడు. అట్టి సదాశివుని విడనాడి యొక మందుని మహిషుని సేవింప నెట్టులుత్స హింతును? నన్నిట్టు లెఱిగియును వాడు నాతో యుద్ధము చేయుచో వానిని యముని వాహనముగ గాని నరులకు నీరు మోయు వాహకముగ గాని యొనరింతును. వానికి బ్రదికి బట్టకట్టవలయుననియున్నచో దానవుల నెల్ల వెంటగొని వెంటనే పాతాళ##మేగుమనుము. కానిచో సంగ్రామమందు వాని యంతు తేల్చుకొందుననుము. ఈ జగమున సమానులకు గలిగిన సుయోగము సుఖప్రదమగును. కాని యజ్ఞానమున వికల్పిమైన యోగము దుఃఖదాయక మగును. నీవు నన్ను నీ పతిని భజించుమంటివి. దీనినిబట్టి నీవును మూర్ఖుడవే. కొమ్ములున్న మహిషుడెక్కడ? పద్మవర్ణనగు నేనెక్కడ? మా యిద్దఱికిని సంబంధ మెట్లు కూడును? నీవు పాతాళము వెళ్ళిన వెళ్ళుము. లేదా నాతో బోరుము. నిన్ను-నీబందుగుల-నిపుడే రూపు మాపెదను. నీవు దేవలోకమును యాగ భాగములను వదలి సుఖముండుట మంచిది.

ఇత్యుక్త్వా సా తదా దేవీ జగర్జ భృశ మద్భుతమ్‌ | కల్పాంతసదృశం నాదం చక్రే దైత్యభయావహమ్‌. 14

చకం పే వసుధా చేలు స్తేన శ##బ్దేన భూధరాః | గర్భాశ్చ దైత్య పత్నీనాం సస్రంసు ర్గర్జితస్వనాత్‌. 15

తామ్రః శ్రుత్వా చ తం శబ్దం భయత్రస్తమనాస్తదా | పలాయనం తతః కృత్వా జగామ మహిషాంతికమ్‌. 16

నగరే తస్య యే దైత్యా స్తే%పి చింతామవాప్నువన్‌ | బధిరీకృతకర్ణా శ్చ పలాయన పరా నృప. 17

తదా క్రోధేన సింహో%పి ననాద భృశ ముత్కటః | తేన నాదేన దైతేయా భయం జగ్ము రపి స్ఫుటమ్‌. 18

తామ్రం సమాగతం దృష్ట్వా హమారి రపి మోహితః | చింతయామాస సచివైః కిం కర్తవ్య మతః పరమ్‌. 19

దుర్గగ్రహో వా కర్తవ్యో యుద్ధం నిర్గత్య వా పునః | పలాయనే కృతే శ్రేయో భ##వేద్వా దానవోత్తమాః. 20

బుద్దిమంతో దురాధర్షాః సర్వేశాస్త్ర విశారదాః | మంత్రః ఖలు ప్రకర్తవ్యః సుగుప్తః కార్యసిద్ధయే. 21

మంత్రమూలం స్మృతం రాజ్యం యది స స్యాత్సురక్షితః మంత్రిభి శ్చ సదాచారై ర్విధేయః సర్వథా బుధైః. 22

మంత్రభేదే వినాశః స్యా ద్రాజ్యస్య భూపతే స్తథా | తస్మా ద్భేదభయా ద్గుప్తః కర్తవ్యో భూతి మిచ్ఛతా. 23

తదిత్ర మంత్రిభి ర్వాచ్యం వచనం హేతుమద్ధితమ్‌ | కాలదేశానుసారేణ విచింత్య నీతి నిర్ణయమ్‌. 24

యా యేషా%త్ర సమాయాతా ప్రబలా దేవనిర్మితా | ఏకాకినీ నిరాలంబా కారణం తద్వి చింత్యతామ్‌. 25

యుద్ధం ప్రార్థయతే బాలా కిమాశ్చర్య మతఃపరమ్‌ | శ్రేయో%త్ర విపరీతం వా కో వేత్తి భువనత్ర యే. 26

న బహూనాం జయో%ప్య స్తి నైకస్య చ పరాజయః | దైవాధీనౌ సదా జ్ఞే¸° యుద్ధే జయపరాజ¸°. 27

ఉపాయవాదినః ప్రాహు ర్దైవం కిం కేన వీక్షితమ్‌ | అదృష్ట మితి యన్నామ ప్రవదంతి మనీషిణః. 28

తత్సత్త్వే%పి ప్రమాణం కిం కాతరాశావలంబనమ్‌ | న సమర్థ జనానాం హి దైవం కుత్రాపి లక్ష్యతే. 29

ఉద్యమో దైవ మేతౌ హి శూరకాతరయోర్మతమ్‌ | విచింత్యా%ద్య ధియో సర్వం కర్తవ్యం కార్యమాదరాత్‌. 30

అని యిట్లు జగదంబ కల్పాంత మహాఘోషమో యన దైత్యులకు భయావహముగ గర్జించెను. ఆ గర్జాధ్వనికి భూమి కంపించెను. గిరులు క్రక్కదలెను. దానవ భార్యలు గర్భములు స్రవించెను. తామ్రుని గుండె దడ దడ కొట్టుకొన నతడు మహిషుని చెంతకు పరుగుదీసెను. దేవి భీకర ధ్వనికి నగరమందలి దైత్యులెల్లరు చెవిటివారై చింతాభీతులై పారిపోయిరి. సింహము కూడ మహాక్రోధముతో మహాభయంకరముగా గర్జించెను. దాని ధ్వనికి దైతేయులు భయకంపితులైరి. అట్లు తామ్రుడు వెనుదిరిగి వచ్చుట గని మహిషు డతిమోహితుడై తన మంత్రులతో కర్తవ్యముగూర్చి మంతనములు జరిపెను. ఇప్పుడు కోటలో దాగుదమా? బయటి కేగి పోరుదమా? కాలికి బుద్ధి చెప్పుదామా? మీరు ధీశాలురు-అజేయులు-శాస్త్ర విదులు కాన కార్యసిద్ధికి రహస్యముగ నాలోచనలు నెఱపుడు. రాజ్యమునకు మంత్ర మాధారము. అది సదాచారముగల తెలిసిన మంత్రులచే నెల్ల భంగుల రక్షింపబడదగినది. మంత్రము గుట్టు బట్టబయలైనచో రాజ్యమునకు రాజునకు చేటు మూడును. కనుక రాజు సేమము గోరువాడు దానిని వెల్లడి సేయక గుప్తముగ నుంచవలయును. దేశ కాలానుసారముగ రాజనీతి నిర్ణయించి సకారణముగ మంత్రు లెల్లరిపుడు హితము పలుకవలయును. ఆమె దేవతా శక్తిసంపన్న. ఏకమూర్తి. తోడులే కొక్కతెయే వచ్చినది. ఆమె యబలగాదు. సబల-ప్రబల. కనుక నామె రాకకు కారణమేమో యెఱుగడు. ఆమె యుద్ధమునే కోరుచున్నది. ఇంతకంటే నాశ్చర్యమేమున్నది? యుద్ధము వలన మేలో-కీడో యేది జరుగునో యెవడెఱుగును? పెక్కుమంది యున్నను జయము కలుగక పోవచ్చును. ఒక్కడున్నను విజయము కలుగవచ్చును. రణమునందు జయాపజయములు దైవాధీనములని యెఱుగవలయును. అదృష్టమనగ దైవము-భాగ్యము. దాని స్వరూపమేమి? దాని నెవరు గాంచిరి మున్నగు నవన్నియు నుపాయము లెఱిగిన పండితు లెఱుగుదురు. అట్టి దైవము పిరికివారి నాశ్రయించుకొని యుండును. ఐనను దాని యునికికి ప్రమాణమేమి? అది సమర్థుల జోలికిపోదు. మహాశూరునకు ప్రయత్న మిష్టము. పిరికివానికి దైవ మిష్టము. కనుక మన మిపుడు బుద్ధితో చక్కగ నాలోచించి కార్యము నడుపవలయును.

ఇతి రాజ్ఞోవచః శ్రుత్వా హేతు గర్భం మహాయశాః | బిడాలాఖ్యో మహారాజ మిత్యువాచ కృతాంజలిః. 31

రాజన్నేషా విశాలాక్షీ జ్ఞాతవ్యా యత్నతః పునః | కిమర్థ మిహ సంప్రాప్తా కుతః కస్య పరిగ్రహః. 32

మరణం తే పరిజ్ఞాయ స్త్రియాః సర్వాత్మనా సురైః | ప్రేషితా పద్మపత్రాక్షి సముత్పాద్య స్వతేజసః. 33

తే%పి చ్ఛన్నాః స్తితాః ఖే%త్ర సర్వే యుద్ధ దిదృక్షవః | సమయే%స్యాః సహాయాస్తే భవిష్యంతి యుయుత్సవః. 34

పురతః కామినీం కృత్వా తే వై విష్ణుపురోగమాః | వధిష్యంతి చ నః సర్వా న్సా త్వాం యుద్ధే హనిష్యతి. 35

ఏత చ్చి కీర్షితం తేషాం మయా జ్ఞాతం నరాధిప | భవితవ్యస్య న జ్ఞానం వర్తతే మమ సర్వథా. 36

యోద్ధవ్యం న త్వయా%ద్యేతి నాహం వక్తుంక్షమః ప్రభో | ప్రమాణం త్వం మహారాజ కార్యే%త్ర దేవనిర్మితే. 37

త్వ దర్థే%స్మాభి రనిశం మర్తవ్యం కార్యగౌరవాత్‌ | విహర్తవ్యం త్వయాసార్థ మేష ధర్మో%ను జీవినామ్‌. 38

విచారో%త్ర మహానస్తి యదేకా కామినీ నృప యుద్ధం ప్రార్థయతే%స్మాభిః ససైన్యైర్బలదర్పితః. 39

దుర్ముఖః: రాజన్యుఏద్ధ జయో నో%ద్య భవితా వేద్మ్యహం కిల | పలాయనం న కర్తవ్యం యశోహానికరం నృణామ్‌. 40

ఇంద్రాదీనాం సంయుగే%పి న కృతం యజ్జుగుప్సితమ్‌ | ఏకాకినీం స్త్రియం ప్రాప్యకోహి కుర్యా త్పలాయనమ్‌. 41

తస్మా ద్యుద్ధం ప్రకర్తవ్యం మరణం వారణ జయః | యద్భావి తద్భవత్యేవ కా%త్ర చింతా విపశ్యతః. 42

మరణ%త్ర యశః ప్రాప్తి ర్జీవనే చ తథా సుఖమ్‌ | ఉభయం మనసా కృత్వా కర్తవ్యం యుద్ధ మద్యవై. 43

పలాయనే యశోహాని ర్మరణం చాయుషః క్షయే | తస్మా చ్ఛోకో న కర్తవ్యో జీవితే మరణ వృథా. 44

అను మహిషుని సహేతుకములగు మాటలు విని బిడాలాఖ్యుడు కైమోడ్చి మహిషున కిట్లనెను : రాజా! ఆ విశాలాక్షి యెవర్తు? ఎటనుండి వచ్చినది? ఎవరి భార్య? మున్నగు విషయములను మొదట తెలసికొనుటకు యత్నింపవలయును. నీకు స్త్రీ చేతిలో చావు గలదని నిఃల సురులకు తెలియును. కనుక వారు తమ తమ తేజముల నుండి యీ కమలదళాక్షిని సృజించి పంపియుందురు. ఇపుడు వారెల్లరును రణము జూచు కౌతుకముతో గగన వీథులందు దాగియున్నారు. తఱియెఱింగి వారామెకు సాయముగ పోరు కొనసాగింతురు. ఆ కామినిని ముందుంచుకొని విష్ణుడు మున్నగు దేవత లెల్లరును మమ్ముల నందఱను వధింపగలరు. ఆమె నిన్ను రణమున చంపితీరును. వారు చేయదలచినదిదే యని నేను ముందే యెఱింగితిని. కాని, భవిష్యత్తును దెల్పు జ్ఞానము మాత్రము నాకు లేదు. ఇత్తఱి యుద్ధము చేయరాదని నేను మాత్రము నీకు చెప్పజాలను. ఇది దైవకృత కార్యము. దెల్పు జ్ఞానము మాత్రము నాకు లేదు. ఇత్తఱి యుద్ధము చేయరాదని నేను మాత్రము నీకు చెప్పజాలను. ఇది దైవకృత కార్యము. ఇందు నీకు దోచినట్లుగ జేయుము. కార్యభారమునుబట్టి మేమును నీతోబాటు చావవలసినదే. విహరించునపుడు నీతో గలిసి మేమును విహరించవలసినదే. ఇది అనుజీవుల ధర్మము. ఒంటరిగ వచ్చి ఆ కామిని మన యింతటి బలదర్పములుగల సేనను సైతము పోరుటకు పురికొల్పుచున్నదను విషయము బాగుగ విచారించదగినది అన దుర్ముఖు డిట్లనెను: రాజా! ఈ యుద్ధములో మనకు గెలుపు గలుగదని నాకు తెలియును. ఐనను లోకమం దపకీర్తి గలుగునట్లు నేడు పారిపోవుటయును తగదు. ఇంద్రాదులతో పోరునప్పుడును మన మిట్టి నిందిత కార్యము చేయలేదు గదా! మఱి యొంటిగ నున్న యొక యాడుదానిని గని యెవ్వడు పిక్కబలము చూపగోరును? రణము వలన విజయమో మరణమో లభించి తీరును. కాన పోరవలసినదే. ఏది కానున్నదో యది జరిగి తీరును. తెలిసినవాడు దీనికింతగ వగవడు. మనము చచ్చితిమా - కీర్తి గలుగును. బ్రతికితిమా - సుఖము గలుగును. ఈ రెంటి నెఱింగి యిపుడు యుద్ధము చేయుట కార్యము. ఆయువు మూడినచో చావు తప్పదు. పరుగెత్తినచో నపకీర్తి తప్పదు కనుక జీవన మరణ విషయమున నింతగ శోకింపబనిలేదు.''

దుర్ముఖస్య వచః శ్రుత్వా బాష్కలో వాక్యమబ్రవీత్‌ | ప్రణతః ప్రాంజలి ర్భూత్వా రాజానం వాక్యకోవిదః. 45

రాజం శ్చింతా న కర్తవ్యా కార్యే%స్మి న్కాతరా%ప్రియే | అహమేకో హనిష్యామి చండీం చంచలలోచనామ్‌. 46

ఉత్సాహ స్తు ప్రకర్తవ్యః స్థాయీభావో రసస్య చ | భయానకో భ##వే ద్వైరీ వీరస్య నృపసత్తమ. 47

తస్మా త్త్యక్త్వా భయం భూప కరిష్యే యుద్ధ మద్భుతమ్‌ | నయిష్యామి నరేంద్రాహం చండికాం యమసాదనమ్‌. 48

న బిభేమి యమాదింద్రా త్కుబేరా ద్వరుణా దపి | వాయో ర్వహ్నే స్తథా విష్ణోః శంకరాచ్ఛశినో రవేః. 49

ఏకాకినీ తథా నారీ కిం పున ర్మదగర్వితా | అహం తాం నిహనిష్యామి విశిఖై శ్చ శిలాశితైః. 50

పశ్య బాహుబలం మే%ద్య విహార స్వ యథాసుఖమ్‌ | భవతా%త్ర న గంతవ్యం సంగ్రామే%ప్యనయా సమమ్‌. 51

ఏవం బ్రువతి రాజేంద్రం బాష్కలే మదగర్వితే | ప్రణమ్య నృపతిం తత్ర దుర్ధరో వాక్య మబ్రవీత్‌. 52

అను దుర్ముఖుని మాటలు విని వాక్యవిశారదుడగు బాష్కలుడు చేతులు జోడించి యిట్లనెను : ఈ కొలది పని నింతకాతర భావముతో చింతింపదగదు. ఇపుడు నేనొక్కడనే వెళ్ళి యాచంచలాక్షియగు చండిక యుక్కడగింతును. ఈ పట్టున నుత్సాహము బూనవలయును. వీరమునకు స్థాయిభావ ముత్సాహము గదా! భయానకము వీరమునకు విరుద్ధరసము. కనుక నేను భయము విడనాడి యద్భుత యుద్ధమొనర్పగలను. ఆ చండికను యమాలయమున కంపుదును. ఇంద్ర-అగ్ని-యమ-వరుణ-వాయు-కుబేరులు-శివకేశవులు-సూర్యచంద్రులు మున్నగువారిలో నెవని వలనను నాకు భయము లేదు. ఆమె మదగర్వితయగు పడతి. ఆమెను నా వాడి బాణములతో దునుమాడగలను. నా భుజబలము నేడు చూతువు గాక! ఆమె నెదుర్కొనుటకు యుద్ధమునకు నీవు వెళ్ళవలదు. నీవు సుఖముగ నుండుము. బాష్కలుడు క్రొవ్వి మదగర్వమున నిట్లు ప్రేలగా దుర్ధరుడు మ్రొక్కి రాజున కిట్లనెను

మహిషా%హం విజేష్యామి దేవీం దేవవినిర్మితామ్‌ | అష్టాదశభుజాం రమ్యాం కారణా చ్చ సమాగతామ్‌. 53

రాజ న్భీషయితుం త్వాం వైమాయైషా నిర్మితా సురైః | బిభీషి కేయం విజ్ఞాయ త్యజ మోహం మనోగతమ్‌. 54

రాజనీతిరియం రాజన్మంత్రి కృత్యం తథా శృణు | సాత్త్వికా రాజసాః కేచి త్తామసా శ్చ తథా పరే. 55

మంత్రిణ స్ర్వివిధా లోకే భవంతి దానవాధిప | సాత్తికాః ప్రభుకార్యాణి సాధయంతి స్వశక్తిభిః. 56

ఆత్మకృత్యం ప్రకుర్వంతి స్యామికార్యావిరోధతః | ఏకచిత్తా ధర్మపరా మంత్రశాస్త్ర విశారదాః. 57

రాజసా భిన్నచిత్తా శ్చ స్వకార్యనిరతాః సదా | కదాచి త్స్వామి కార్యం తే ప్రకుర్వంతి యదృచ్ఛయా. 58

తామసా లోభనిరతాః స్వకార్యనిరతాః సదా | ప్రభుకార్యం వినాశ్యైవ స్యకార్యం సాధయంతి తే. 59

సమయే తే విభిద్యంతే పరై స్తు పరివంచితాః | స్వచ్ఛిద్రం శత్రుపక్షీయా న్నిర్దిశంతి గృహస్థితాః. 60

కార్యభేదకారా నిత్యం కోశగుప్తా%సివత్సదా | సంగ్రామే%థ సముత్పన్నే భీషయంతి ప్రభుం సదా. 61

cలాః కిం కిం న కుర్వంతి విశ్వస్తా లాభతత్పరాః | తామసాః పాపనిరతా బుద్ధిహీనాః శఠాస్తథా. 62

తస్మా త్కార్యం కరిష్యామి గత్వా%హం రణమస్తకే | చింతా త్వయా న కర్తవ్యా సర్వథా నృపసత్తమ. 64

గృహీత్వా తాం దురాచారా మాగమిష్యామి సత్వరః | పశ్య మే%ధ్య బలం ధైర్యం ప్రభుకార్యం స్వశక్తితః. 65

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ పంచమస్కంధే ద్వాదశో%ధ్యాయః.

ఓ మహిషా! ఆ దేవి అష్టాదశ భుజరమ్య-కారనాంతరమున వచ్చినది. ఆమెను నే నోడింపగలను. దేవత లెల్లరు కలిసి నిన్ను బెదరించుట కీ మాయ పన్నిరి. ఇదొక బిభీషికగ నెఱుగుము. నీ మదిలోని మోహమును వదలుము. దీనినే రాజనీతి యందురు. ఇక మంత్రికార్యము వినుము. సాత్త్వికులు-రాజసికులు-తామసికులు అని మంత్రులు ముత్తెఱగులు. సాత్త్విక మంత్రి తన పూర్ణశక్తితో ప్రభు కార్యము సాధింపగలడు. మంత్రశాస్త్రకుశలుడు-ధర్మపరుడు-ఏకాగ్రచిత్తుడు నగు మంత్రి తన స్వామి కార్యమునకు హాని గలుగనీయక తన విధి నెరవేర్చును. రాజసమంత్రి మనస్సు దీనికి భిన్నము. యాదృచ్ఛికముగ అతడు తన సొంతపనిలో మునిగియుండును. ఐనను నప్పుడప్పుడు ప్రభుకార్యము నెరవేర్చును. తామసులు స్వార్థలోభరతులై ప్రభుకార్యము చెడగొట్టి తమ పని సాధించుకొందురు. వీరింటనే యుండి సమయము వచ్చినప్పుడు శత్రులచే వంచన చేయబడి తమ గుంపులనుండి చీలి తమ రహస్యములు వైరులకు వెల్లడింతురు. వీరొఱలో దాచిన కత్తివంటి వారు. రాజకార్యము భేదించువారు. సంగ్రామము సాగునపుడు భయపెట్టువారు. ఇట్టి వారి నే నాడును నమ్మరాదు. నమ్మినచో కార్యహానియు మంత్రహానియు జరుగును. స్వార్థులు-పాపరతులు-శఠులు-బుద్ధిహీనులునగు తామసులు పైకి విశ్వాసము నటించి చేయజాలని అపకార మేమున్నది? కనుక నేనే రణమున దుమికి పోరుదును. నీవిం కెంతమాత్రము వంత జెందకుము. ఆ దురాచార నిప్పుడే పట్టుకొని వత్తును. నేడు చూతువుగాని నా ప్రభుభక్తి నా భుజాశక్తి నా బలము నా ధైర్యము.

ఇది శ్రీమద్దేవీ భాగవతమందలి పంచమ స్కంధమందు మహిషుని మంత్రాలోచనమను ద్వాదశాధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters