Sri Devi Bhagavatam-1
Chapters
అథ త్రయోదశోధ్యాయః ఇత్యుక్త్వా తౌ మహాబాహూ దైత్యౌ బాష్కల దుర్ముఖౌ | జగ్మతు ర్మదదిగ్ధాంగౌ సర్వశస్త్రా స్త్ర కోవిదా.
1 తౌ గత్వా సమరే దేవీ మూచతు ర్వచనం తదా | దానవౌ చ మదోన్మత్తౌ మేఘ గంభీరయా గిరా.
2 దేవి! దేవా జితా యేన మహిషేణ మహాత్మనా | వరయ త్వం వరారోహే! సర్వదైత్యాధిపం నృపమ్.
3 స కృత్వా మానుషం రూపం సర్వలక్షణ సంయుతమ్ | భూషితం భూషణౖ ర్దివై స్త్వామేష్యతి రహః కిల.
4 త్రైలోక్య విభవం కామం త్వమేష్యసి శుచిస్మితే | మహిషే పరమం భావం కురు కాంతే ! మనోగతమ్. 5 కృత్వా పతిం మహావీరం సంసారసుఖ మద్భుతమ్ | త్వం ప్రాప్స్యసి పికాలాపే యోషితాం ఖలువాంఛితమ్. 6 శ్రీ దేవ్యువాచ: జాల్మ త్వం కిం విజానాసి నారీయం కామమోహితా. మందబుద్ధి బలా%త్యర్థం భ##జేయం మహిషం శఠమ్. 7 కులశీల గుణౖ స్తుల్యం తం భజంతి కులస్త్రియః | అధికం రూపచాతుర్య బుద్ధిశీలక్షమాదిభిః. 8 కా ను కామాతురా నారీ భ##జే చ్చ వశురూపిణమ్ | పశూనా మధమం నూనం మహిషం దేవరూపిణీ. 9 గచ్ఛ తం మహిషం తూర్ణం భూపం బాష్కలదుర్మదౌ | వదతం మద్వచో దైతం గజతుల్యం విషాణినమ్. 10 పాతాళం గచ్ఛ వాభ్యేత్య సంగ్రామం కురు వా మయా | రణ జాతే సహస్రాక్షో నిర్భయః స్యాదితి ధ్రువమ్. 11 హత్వా%హం త్వాం గమిష్యామి నాన్యథాగమనం మమ | ఇత్థం జ్ఞాత్వా సుదర్బుద్ధే యథేచ్ఛసి తథాకురు. 12 మా మనిర్జిత్య భూభాతే న స్థానం తే కదా చన | భవిష్యతి చతుష్పాదం దివి వా గిరికందరే. 13 పదుమూడవధ్యాయము శ్రీదేవి బాష్కలదుర్ముఖులను దునుమాడుట సకల శస్త్రాస్త్ర నిపుణులు మదమత్తులునగు బాష్కల దుర్ముఖులు ఇట్లు పలికి రణమునకు తరలిరి. ఆ మదోన్మత్తులు మేఘగంభీరవాక్కులతో మహాదేవి కిట్లనిరి: దేవదేవీ! మహిష మహీపతి నిర్జరులను నిర్జించెను: నీ వా దైత్యపతిని వరింపుము. అతడు సర్వలక్షణలక్షితమగు మనుజరూపము దాల్చును. దివ్యభూషలు ధరించును. నీ సన్నిధికి ఏకాంతమున రాగలడు. సుహాసినీ! అతని యందు నీ మనస్సు లగ్నము చేయుము. త్రైలోక్య సంపద లనుభవింపుము. సుమధురభాషిణీ ! ఆ మహావీరుని పతిగ బడయుము. స్త్రీలు సహజముగ వాంఛించు నద్భుత సంసార సుఖము లనుభవింపుము అన శ్రీదేవి యిట్లనియెను : మూఢులారా! నన్ను కామమోహితగ మందమతిగ నెంచుచున్నారా? నే నా దుష్టమహిషు నెట్లు సేవింపగలను? కులాంగనలు తమకంటె బుద్ధి సురూపము శీలము నేర్పు నోర్పు నెక్కువగనుండి తమకన్నివిధాల సదృశ##మైన కులశీలములు గలవానిని సేవింతురు. ఏ దేవరూపిణియైన కామాతురతతో పశువులలో నధముడు పశురూపియగు మహిషాధముని సేవించునా? వాని కేనుగంత మేను గలదు. పొడవైన కొమ్ములు గలవు. కనుక మీరా మహిషుని చెంతకేగి నా మాటలుగ వానితో నిట్లనుడు. నీవిపుడు పాతాళ##మేగుము. లేక నాతో సమరమొనర్పుము. ఇపుడు దేవపతి యుద్ధమున కెంతమాత్రము వెనుకంజ వేయడు. నేనిపుడు నీ యంతు తేల్చుకొనక తిరిగి వెళ్ళను. దుర్మతీ! ఇట్లెఱిగి నీకు దోచినట్లు చేయుము. నన్ను గెల్వుము. పారిపోయినచో నీకు స్వర్గమందుగాని భూమియందుగాని గుహలందుగాని ఎక్కడేని నిలువ తావుండదు. ఇత్యుక్తౌ తౌ తయా దైత్యౌ కోపాకులితలోచనౌ | ధనుర్బాణధరౌ వీరౌ యుద్ధ కామౌ బభూవతుః. 14 కృత్వా సువిపులం నాదం దేవీ సా నిర్భయా స్థితా | ఉభౌ చ చక్రతు స్తీవ్రాం బాణవృష్టిం కురూద్వహ. 15 భగవత్యపి బాణౌఘా న్ముమోచ దానవౌ ప్రతి | కృత్వా%తి మధురం నాదం దేవకార్యార్థ సిద్ధయే. 16 తయో స్తు బాష్కల స్తూర్ణం సమ్ముఖో%%భూద్రణాంగణ | దుర్ముఖః ప్రేక్షక స్తత్ర దేవీ మభిముఖః స్థితః. 17 తయో ర్యుద్ధ మభూ దోరం దేవీబాష్కలయో స్తదా | బాణాసిపరిఘా ఘాతై ర్భయదం మందచేతసామ్. 18 తతః క్రుద్ధా జగన్మాతా దృష్టాంతం యుద్ధదుర్మదమ్ | జఘాన పంచభి ర్బాణౖః శిలా శితైః. 19 దానవో%పి శరాన్దేవ్యా శ్చి చ్ఛేద నిశితైః శ##రైః | సప్తభి స్తాడయామాస దేవీం సింహోపరిస్థితామ్. 20 సా%పి తం దశభి స్తీక్షైః సుపీతైః సాయకైః ఖలమ్ | జఘాన తచ్ఛరాం శ్ఛిత్వా జహాస చ ముహుర్ముహః. 21 అర్ధచంద్రేణ బాణన చిచ్ఛేద చ శరాసనమ్ | బాష్కలో%పి గదాం గృహ్యా దేవీం హంతు ముపాయ¸°. 22 ఆగచ్ఛంతం గదా పాణిం దానవం మదగర్వితమ్ | చండికా స్వగదా పాతైః పాతయామాస భూతలే. 23 బాష్కలః పతితో భూమౌ ముహూర్తా దుత్థితః | పునః | చిక్షేప చ గదాం సో%పి చండికాం చండవిక్రమః. 24 త మాగచ్ఛంత మాలోక్య దేవీ శూలేన వక్షసి | జఘాన బాష్యలం క్రుద్ధా పపాత చ మమార సః. 25 పతితే బాష్కలే సైన్యం భగ్నం తస్య దురాత్మనః | జయేతి చ ముదా దేవా శ్చుక్రుశు ర్గగనే స్థితాః. 26 అను దేవి మాటలు విని దైత్యు లిర్వురును కోపమున కండ్లెఱ్ఱజేసి విల్లమ్ములుదాల్చి యుద్ధమున కాయత్తపడిరి. పరాశక్తి నిర్భయముగ నిలిచి భయంకరమైన ధ్వని చేసెను. దైత్యులాదేవిపై బాణవర్షములు గురిసిరి. అపుడు ప్రజ్వలిత శక్తియగు దేవియును దేవకార్యార్థసిద్ధికై మధురనాద మొనరించుచు దానవులపై శరపరంపరలు ప్రయోగించెను. రణాంగణ మందున మొదట దేవికి సమ్ముఖమున బాష్కలుడుండెను. దుర్ముఖుడు తానును దేవిని చూడగోరి యామెకెదురేగెను. శ్రీదేవికిని బాష్కలునకును బాణ-అసి-పరిఘలతో ఘోర యుద్ధము సంఘటిల్లెను. విజయరూపిణియగు దేవి బాణము లాకర్ణాంతము లాగి క్రోధముతో నా యుద్ధ దుర్మదుని గాయపఱచెను. దానవుడును సింహముపై బాణములను విసరెను. దేవి వానినెల్ల నడుమనే తునకలుచేసి పది వాడి బాణములతో వాని నెదుర్కొని పల్మారు పకపక నవ్వెను. ఆమె మరల నర్ధచంద్ర బాణముతో వాని విల్లు దునిమెను. వాడు గదగొని దేవిపై కురికెను గదగొని తనపైకి వచ్చు మదగర్వితుని చండి తన గదాఘాతముతో నేలపై పడవేసెను. నేలపై పడినవాడు ముహూర్తమాత్రాన లేచి చండవిక్రమముతో చండికపై గద విసరెను. వాడు మరల లేచివచ్చుట గని దేవి క్రోధాతిరేకముతో వాని ఱొమ్మున త్రిశూలము నాటెను. ఆ గట్టి దెబ్బతిని బాష్కలుడు నేలకొరిగి యసువులు పాసెను. అంతట వానిసేన చెల్లాచెదరయ్యెను. సురలు మింట జయజయ ఘోషములు చేసిరి. తస్మిం శ్చ నిహతే దైత్యే దుర్ముఖో2తిబలాన్వితః | ఆజగామ రణ దేవీం క్రోధసంరక్తలోచనః. 27 తిష్ఠ తిష్ఠాబలే సో%పి భాషమాణః పునఃపునః | ధనుర్బాణధరః శ్రీమానథస్థః కవచావృతః. 28 తమాగచ్ఛంత మాలోక్య దేవీ శంఖ మవాదయత్ | కోపయంతీ దానవం తం జ్యాఘోషం చ చకారవై. 29 సోపి బాణా న్ముమోచా%%శు తీక్షానాశీవిషోపమాన్ | స్వబాణౖస్తా న్మహామాయా చిచ్ఛేద చ ననాదచ. 30 తయోః పరస్పరం యుద్ధం బభూవ తుములం నృప | బాణశక్తిగదాఘాత ముసలై స్తోమరై స్తథా. 31 రణభూమౌ తదా జాతా రుధిరౌఘవహా నదీ | పతితాని తదా తీరే శిరాం సి ప్రబభు స్తదా. 32 యథా సంతరణార్థాయ యమకింకర నాయకైః | తుంబీఫలాని నీతాని నవశిక్షా పరై ర్ముదా. 33 రణభూమి స్తదా ఘోరా బభూవా తీవ దుర్గమా | శరీరైః పతితై ర్భూమౌ ఖాద్యమానై ర్వృకాదిభిః. 34 గోమాయు సారమేయాశ్చ కాకాః కంకా అయోముఖాః | గృధ్రాః శ్యేనాశ్చ భాదంతి శరీరాణి దురాత్మనామ్. 35 వవౌ వాయు శ్చ దుర్గంధో మృతానాం దేహసంగతః | అభూ త్కిలకిలాశబ్దః ఖగానాం పల భక్షిణామ్. 36 తదా చుకోప దుష్టాత్మా దుర్ముఖః కాలమోహితః | దేవీ మువాచ గర్వేణ కృత్వా చోర్ధ్వం కరం శుభమ్. 37 బాష్కలుడు నిహతుడు గాగా మహాబలుడగు దుర్ముఖుడు క్రోధకర్త నయనములతో పోరుటకు శ్రీదేవి ముందునకు వచ్చెను. అతడు విల్లమ్ములు దాల్చి కవచము తొడిగి యరదమెక్కి 'నిలునిలు బాలా!' యనుచు పలుమారు గావుకేకలు పెట్టెను. వచ్చువానినిగని దేవి విజయశంఖము పూరించెను. వానికి రోషము గల్గునట్లుగ వింట నారిటంకారమొనరించెను. వాడాశీవిషమువంటి వాడి బాణములు వదలగా మహామాయ వానినెల్ల తన కఱకుటమ్ములతో ఛేదించి ఘోరనినాదమొనర్చెను. అపుడు వారిర్వురకు బాణ-శక్తి-గదా-ముసల-తోమర-ప్రహారములతో అపుడు వారిర్వురకు బాణ-శక్తి-గదా-ముసల-తోమర-ప్రహారములతో ఘోరసంగ్రామము జరిగెను. రణాంగణమున నెత్రుటేర్లు ప్రవహించుచుండెను. వాని తీరములందు తెగిన వీరుల తలలు దొరలియాడు చుండెను. తలలు యమకింకరనాయకులు క్రొత్తగా యమలోకములో శిక్ష ననుభవింప వచ్చినవారిని వైతరణీనది దాటించుటకు సంతసమున తెచ్చిన తుంబీఫలములవలె నుండెను. రణరంగము తెగిపడిన పీనుగుల మొండెములను దిను తోడేళ్లతో భీకర బీభత్సముగ నుండెను. అందొక్కచో తెగిపడిన దుష్టుల శవములను గ్రద్దలు-డేగలు-నక్కలు-కుక్కలు కాకకంకాయోముఖములు పీకికొని తినుచుండెను. ఆ పీనుగు పెంటలనిండ భరిపరాని దుర్గంధము నిండి యుండెను. అపుడు మహాకోపి దుష్టుడు నగు దుర్ముఖుడు కాలమోహితుడై తన కుడిచేయెత్తి సగర్వముగ దేవితో నిట్లనెను : గచ్ఛ చండి! హనిష్యామి త్వా మద్వైవ సుబాలిశే! దైత్యం వా భజ వామోరు! మహిషం మదగర్వితమ్. 38 దేవ్యువాచ: ఆసన్నమరణః కామం ప్రలపస్యద్య మోహితః | అద్యైవ త్వాం హనిష్యామి యథా%యం బాష్కలోహతః. 39 గచ్ఛ వా తిష్ఠ వా మంద మరణం యది రోచతే | హత్వా త్వాంవై వధిష్యామి బాలిశం మహిషీ సుతమ్. 40 తచ్ఛ్రుత్వా వచనం తస్యా దుర్ముఖో మర్తు ముద్యతః | ముమోచ బాణవృష్టిం తు చండికాం ప్రతి దారుణమ్. 41 సా%పి తాం తరసా చ్ఛిత్వా బాణవృష్టిం శితైః శ##రైః | జఘాన దానవం క్రుద్ధా వృత్రం వజ్రధరోయథా. 42 తయోః పరస్పరం యుద్ధం సంజాతం చాతికర్కశమ్ | భయదం కాతరాణాం చ శూరాణాం బలవర్ధనమ్. 43 దేవీ చిచ్ఛేద తరసా ధను స్తస్య కరే స్థితమ్ | తథైవ పంచభి ర్బాణౖ ర్బభంజ రథముత్తమమ్. 44 రథే భ##గ్నే మహాబాహుః పదాతి ర్దుర్ముఖ స్తదా | గదాం గృహీత్వా దుర్ధర్షాం జగామ చండికాంప్రతా. 45 చకార సా గదాఘాతం సింహమౌళౌ మహాబలాత్ | న చచాల హరిః స్థానా త్తాడితో%పి మహాబలః. 46 అంబికా తం సమాలోక్య గదాపాణిం పురఃస్థితమ్ | ఖడ్గేన శితధారేణ శిర శ్చిచ్ఛేద మౌళిమత్. 47 ఛిన్నే చ మస్తకే భూమౌ పపాత దుర్ముఖో మృతః | జయశబ్దం తదా చక్రు ర్ముదితా నిర్జరా భృశమ్. 48 తుష్ణువు స్తాం తదా దేవీం దుర్ముఖే నిహతే%మరాః | పుష్పవృష్టిం తథా చక్రు ర్జయశబ్దం నభః స్థితాః. 49 ఋషయః సిద్ధగంధర్వాః సవిద్యాధర కిన్నరాః | జహృషు స్తం హతం దృష్ట్వా దానవం రణమస్తకే. 50 ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ పంచమస్కంధే త్రయోదశో%ధ్యాయః. చండీ! నీకు దుర్బుద్ధి పుట్టినది. వెళ్ళి పొమ్ము. పోనిచో నిన్ను చంపుదుము. లేక మదగర్వితుడగు మహిషునకు లొంగిపొమ్ము. అని శ్రీదేవి యిట్లనెను: నీకు వినాశకాలము దాపురించినదిరా. కాలమెహితుడవై కాఱుకూతలు కూయుచున్నావు. నిన్ను నిపుడే బాష్కలు నంపిన చోటి కంపుదును. పోరా మందా! నీకు చావు రుచించినచో నిలుము. నిన్ను చంపి పిదప మహిషుని వధింపగలను అను దేవి మాటలు విని దుర్ముఖుడు చావసిద్ధపడి దేవిపై బాణములు కురిసెను. ఆమె సత్వరమే తన బానములతో వాని బాణములను ఛేదించెను. పిదప నామె వృత్రుని మహేంద్రుడు బాధించినట్లు తన వాడి బాణములతో వానిని గాయపఱచెను. ఆ యిర్వురి పోరితము చూపఱలకు భయంకరముగ నుండెను. అది భీరులకు భయమును శూరుల కుత్సాహమును గల్గించెను. రణచండి వెంటనే వాని విల్లువిఱిచి యైదు బాణములతో వాని యరదము నుగ్గునుగ్గొనరించెను. దుర్ముఖుడు దుర్ధరునిగద తీసికొని చండికపై కురికెను. వాడు తన బలముకొలది గదతో సింహము తలపై మోదెను. అది దెబ్బ తినియు నా వంతయును చలింపలేదు. అంబిక తన బెడిదపుటడిదముతో దుర్ముఖుని తల తెగనఱికెను. వాడు నేల గూలెను. నిఃలసురుల హర్షధ్నాములు జయకారములు మిన్నుముట్టెను. వాడు చావగానే దేవతలు మింట నిలిచి శ్రీదేవిని స్తోత్రము చేసిరి. విరివానలు గురిసిరి. జయజయ ఘోషలు పెట్టిరి. సమరతలమున దానవుడు పడిపోవుటగని సిద్ధులు-విద్యాధర-గంధర్వ-కిన్నరులు హర్షామోదములు వెలిపుచ్చిరి. ఇది శ్రీమద్దేవీభాగవతమందలి పంచమ స్కంధమందు శ్రీదేవి బాష్కలదుర్ముఖులను దునుమాడుట యను త్రయోదశాధ్యాయము.