Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

శ్రీః

శ్రీ గణశాయనమః

ఓం నమో భగవతే వాసుదేవాయ.

శ్రీమదగ్ని మహాపురాణము

ద్వితీయ సంపుటము

అథ త్రయోదశాధిక ద్విశతతమోధ్యాయః

అథ పృథ్వీదానాని

అగ్ని రువాచ :

పృథ్వీదానం ప్రవక్ష్యామి పృథివీ త్రివిధామతా | శతకోటిర్యోజనానాం సప్తద్వీపా ససాగరా. 1

జంబూద్వీపావధిః సాచహ్యుత్తమా మేదినీరితా | ఉత్తమాం పఙ్చభిర్భారైః కాంచనైశ్చ ప్రకల్పయేత్‌. 2

తదర్ధాంతరజం కూర్మం తథాపద్మం సమాదిశేత్‌ | ఉత్తమాకథితా పృథ్వీద్వ్యంశే నైవతు మధ్యమా. 3

కనీయసీ త్రిభాగేన త్రిహాన్యా కూర్మపఙ్కజే | పలానాంతు సహస్రేణ కల్పయేత్కల్ప పాదపమ్‌. 4

మూలదండం సపత్రంచ ఫలపుష్పసమన్వితమ్‌ | పంచస్కందం తు సంకల్ప్య పంచానాం దాపయేత్సుధీః. 5

ఏతద్దాతా బ్రహ్మలోకే పితృభిర్మోదతే చిరం | విష్ణ్వగ్రే కామధేనుం తు పలానాం పంచభిః శ##తైః. 6

బ్రహ్మ విష్ణు మహేశాద్యా దేవా ధేనౌ వ్యవస్థితాః | ధేను దానం సర్వదానం సర్వదం బ్రహ్మలోకదమ్‌. 7

విష్ణ్వగ్రే కపిలాం దత్త్వా తారయేత్సకలం కులమ్‌ | అలంకృత్యస్త్రియం దద్యాదశ్వమేదఫలం లభేత్‌. 8

భూమిం దత్త్వా సర్వభాక్స్యాత్సర్వ సస్యప్రరోహిణీమ్‌ | గ్రామం వాథ పురం వాపి ఖేటకంచ దదత్సుఖీ. 9

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే పృథ్వీదానాని నామ త్రయోదశాధిక ద్విశతతమో7ధ్యాయః.

అగ్నిదేవుడు చెప్పెను - ఇపుడు పృథివీదానమును గూర్చి చెప్పెదను. పృథివి మూడు విధములైనది. నూరుకోట్ల యోజనముల వైశాల్యముతో, సప్తద్వీపములతో, సముద్రములతో జంబూద్వీపపర్యంతముఉన్న పృథివి ఉత్తమమైనది. ఐదు భారాల సువర్ణముతో ఉత్తమపృథ్విని నిర్మించవలెను. దానిలో సగముతో కూర్మమును, కమలమును నిర్మించవలెను ఇది ''ఉత్తమపృథివి''. దీనిలో సగము ''మధ్యమ పృథివి''. దీనిలో మూడవవంతుతో నిర్మించినది ''కనిష్ఠ పృథివి''. దీనితో పృథివిలోని మూడవభాగమునందు కూర్మమును వరాహమును నిర్మించవలెను. వెయ్యిపలముల సువర్ణముతో మూలము, దండము, ఆకులు, ఫలములు, పుష్పములు, ఐదు శాఖలుగల కల్పవృక్షము నిర్మించవలెను. పండితుడైన బ్రాహ్మణుడు యజమానునిచే సంకల్పము చేయించి దీనిని ఐదుగురు బ్రాహ్మణులకు దానము చేయించవలెను. దీని దానము చేసినవాడు బ్రహ్మలోకమునందు పితృగణములతోకలిసి చాలకాలము ఆనంద మనుభవించును. ఐదువందల పలముల సువర్ణముతో కామధేనువు నిర్మించి విష్ణుసంముఖమున దానము చేయవలెను. బ్రహ్మవిష్ణు శివాదిదేవతలందరును గోవు శరీరమునాశ్రయించి యుందురు. గోదానము చేయుటచే సకలదానములు చేసినట్లే అగును. దీనివల సకలాభీష్టములు సిద్ధించి బ్రహ్మలోక ప్రాప్తి కలుగును. శ్రీమహావిష్ణు సాంనిధ్యమునకపిల గోదానము చేసినవాడు తనకులమున కంతకును ఉద్దారకుడగును. అలంకృత కన్యాదానము చేసినదానికి అశ్వమేధయాగ ఫలము లభించును. సకలసస్యములు పండించుటకు తగిన భూమిని దానము చేసినవాడు సర్వమును పొందగలడు. గ్రామము నగరము, పల్లె దానము చేసినవాడు సుఖవంతుడగును. కార్తికపూర్ణిమాదుందు వృషోత్సర్గము చేయువాడు తనకులమునుద్ధరించును.

అగ్ని మహాపురాణమునందు పృథ్వీదానవర్ణన మను రెండువందలపదమూడవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page