Sri Madagni Mahapuranamu-2 Chapters Last Page
అథ పఞ్చదశాధిక ద్విశతతమో7ధ్యాయః
అథ సన్ధ్యావిధిః
అగ్ని రువాచ :
ఓఙ్కారం యో విజానాతి సయోగీ సహరిః పుమాన్ |
ఓఙ్కారమభ్యస్తేత్తస్మాన్మంత్రసారం తు సర్వదమ్. 1
సర్వమంత్ర ప్రయోగేషు ప్రణవః ప్రథమః స్మృతః | తేన సమ్పరిపూర్ణం యత్తత్పూర్ణం కర్మనేతరత్. 2
ఓఙ్కారపూర్వికాస్తిస్రో మహావ్యాహృతయో7వ్యయాః | త్రిపదా చైవసావిత్రీ విజ్ఞేయం బ్రహ్మణోముఖమ్.
యో7ధీతే7హన్యహన్యేతాస్త్రీణి వర్షాణ్యతంద్రితః | సబ్రహ్మ పరమభ్యేతి వాయుభూతః ఖమూర్తిమాన్. 4
ఏకాక్షరం పరం బ్రహ్మ ప్రాణాయామాత్పరన్తపః | సావిత్ర్యాస్తు పరం నాస్తి మౌనాత్సత్యం విశిష్యతే. 5
సప్తావర్తా పాపహరా దశభిః ప్రాపయేద్దివమ్ | వింశావర్తాతు సాదేవీ నయతే హీశ్వరాలయమ్. 6
అష్టోత్తరశతం జప్త్వా తీర్ణఃసంసారసాగరాత్ | రుద్రకూష్మాణ్డ జప్యేభ్యో గాయత్రీతు విశిష్యతే. 7
న గాయత్ర్యాః పరంజప్యం న వ్యాహృతిసమంహుతమ్ | గాయత్ర్యాః పాదమ ప్యర్ధమృగర్ధమృచమేవవా. 8
బ్రహ్మహత్యా సురాపానం సువర్ణస్తేయమేవచ | గురుదారాగమశ్చైవ జప్యేనైవపునాతిసా. 9
అగ్నిదేవుడు చెప్పెను : ఓంకారము నెరిగినవాడే యోగి. ఆతడే విష్ణుస్వరూపుడు. అందు వలన సకలమంత్ర సారభూతము, సర్వప్రదము అగు ఓంకారమును అభ్యసించవలెను. సమస్తమంత్రప్రయోగ ప్రారంభము నందును ఓం కారముచ్చరింపబడును. ఓంకార యుక్తమగు కర్మయే పరిపూర్ణము; ఆది లేనిది పూర్ణము కాజాలదు. మొదట ఓంకారము తోడను, మూడుశాశ్వత వ్యాహృతులతోడను కూడిన మూడుపదముల గాయత్రి వేదమునకు ముఖము. మూడు సంవత్సరముల పాటు నిత్యము గాయత్రీజపము చేయువాడు వాయువై, ఆకాశస్వరూపుడై, పరబ్రహ్మను పొందును. ఏకాక్షరమగు ఓంకారమే పర బ్రహ్మము. ప్రాణాయామమే పరమతపస్సు. గాయత్రిని మించినది ఏదియు లేదు. మౌనముగానుండుట కంటె సత్యభాషణము శ్రేష్ఠము. ఏడుపర్యాయములు గాయత్రి ఆవృత్తిచేసినచో సర్వపాపములును తొలగును. పది ఆవృత్తులు చేయువాడు స్వర్గము పొందును. ఇరువది ఆవృత్తులు చేయువానిని గాయత్రి స్వయముగా ఈశ్వరలోకమునకు తీసికొని పోవును. నూటఎనిమిది పర్యాయములు గాయత్రీ జపము చేసినవాడు సంసారసాగరమును తరించును. రుద్ర మంత్ర జపముకంటెను, కూష్మాండ మంత్ర జపముకంటెను గాయత్రీమంత్ర జపము శ్రేష్ఠము. గాయత్రికంటే శ్రేష్ఠమైన జపించ దగిన మంత్రమేమియును లేదు. వ్యాహృతి హోమ తుల్యమగు హోమమేమియును లేదు. గాయత్రీమంత్రము లోని ఒకపాదమునుగాని, సగము పాదమును గాని, సంపూర్ణఋక్కునుగాని, సగము ఋక్కును గాని జపించినంత మాత్రమున గాయత్రి బ్రహ్మహత్యా - సురాపాన - సువర్ణస్తేయ, గురుపత్నీగమనాది మహాపాతకముల నుండి విముక్తుని చేయును.
పాపేకృతే తిలైర్హోమో గాయత్రీ జప ఈరితః | జప్త్వాసహస్రం గాయత్ర్యా ఉపవాసీ సపాపహా. 10
గోఘ్నః పితృఘ్నో మాతృఘ్నో బ్రహ్మహాగురుతల్పగః | బ్రహ్మఘ్నః స్వర్ణహారీచ సురాపోలక్షజప్యతః.
శుధ్యతే వా7థ వాస్నాత్వా శతమంతర్జలే జపేత్ | జపః శ##తేన పీత్వాతు గాయత్ర్యాః పాపహాభ##వేత్. 12
శతం జప్తాతు గాయత్రీ పాపోపశమనీ స్మృతా | సహస్రజప్తా సాదేవీ హ్యూపపాతకనాశినీ. 13
అభీష్టదా కోటిజప్తా దేవత్వం రాజతామియత్ | ఓఙ్కారం పూర్వముచ్చార్య భూర్భవః స్వస్తథైవచ. 14
గాయత్రీ వ్రణవాశ్చాన్తే జపే చైవముదాహృతమ్ | విశ్వామిత్ర ఋషిశ్చందో గాయత్రం సవితాతథా. 15
దేవతోపనయే జప్యే వినియోగో హుతే తథా | అగ్నిర్వాయూరవిర్విద్యుద్యమో జలపతిర్గురుః. 16
పర్జన్య ఇంద్రో గంధర్వః పూషాచ తదనంతరమ్ | మిత్రో7థ వరుణ స్త్వష్టా వసవో మరుతఃశశీ. 17
అఙ్గిరా విశ్వనాసత్యౌ కస్తథా సర్వదేవతాః | రుద్రో బ్రహ్మాచ విష్ణుశ్చ క్రమశో7క్షర దేవతాః. 18
గాయత్ర్యా జపకాలేతు కథితాః పాపనాశనాః.
ఏ పాపమునకైనను తిలహోమము, గాయత్రి జపము ప్రాయశ్చిత్తములు. ఉపవాసపూర్వకముగా సహస్ర గాయత్రీ జపము చేయువాడు తన పాపములను నశింప చేసుకొనును. గోవధ-పితృవధ-మాతృవధ-బ్రహ్మహత్యా- గురుపత్నీగమన-బ్రాహ్మణజీవికాపహరణ-సువర్ణస్తేయ-సురాపానాది మహాపాపములు చేసినవాడు కూడ ఒకలక్ష గాయత్రీ జపము చేయుటచే శుద్ధుడగును. లేదా స్నానానంతరము నీటిలో ఉండి నూరు పర్యాయములు గాయత్రీ జపము చేయవలెను. పిదప గాయత్ర్యభిమంత్రితమగు జలముతో నూరు ఆచమనములు చేయవలెను. అట్లు చేసినవాడు కూడ పాపరహితుడగును. నూరు పర్యాయములు గాయత్రీ జపము సమస్త పాపములను శమింపచేయును. సహస్ర జపము ఉప పాతకములను కూడ నశింపచేయును. కోటి జపము చేసిన వానికి గాయత్రీదేవి అభీష్టఫలము నొసగును. జపము చేయువాడు దేవత్వమును, దేవరాజత్వమును కూడ పొందును. మొదట ''ఓం'' కారమును, పిదప ''భూర్భవఃస్వః''ను ఉచ్చరించి పిదప గాయత్రి ఉచ్చరించిరి, చివర 'ఓం' చేర్చవలెను. జపమున ఈ విధముగా గాయత్రీ మంత్రము విహితమైనది. గాయత్రికి ఋషి విశ్వామిత్రుడు. గాయత్రి ఛందస్సు. దేవత సవిత. ఉపనయన-జప-హోమములందు దీనిని వినియోగించవలెను. గాయత్రీమంత్రమునందలి ఇరువది నాలుగు అక్షరములకు వరుసగా-అగ్ని-వాయు-రవి-విద్యుత్-యమ-జలపతి-గురు-పర్జన్య-ఇంద్ర-గంధర్వ-పూషన్-మిత్ర-వరుణ-త్వష్టృ-వసుగణ-మరుద్గణ-చంద్ర-అంగిరస్-విశ్వేదేవ - అశ్వీనీ కుమార-ప్రజాపతిసహిత సమస్తదేవగణ-రుద్ర-బ్రహ్మవిష్ణువులు అధిష్టాతృదేవతలు. గాయత్రీజప సమయమున పైదేవతలను ఉచ్చరించినచో వారు జపము చేయువాని పాపములను తొలగింతురు.
పాదాఙ్గుష్ఠౌ చ గుల్ఫౌచ నలకౌ జానునీతథా. 19
జంఘే శిశ్నశ్చ వృషణౌ కటిర్నాభిస్తథోదరమ్ | స్తనౌ చ హృదయం గ్రీవా ముఖంతాలుచనాసికే. 20
చక్షుషీచ భ్రువోర్మధ్యం లలాటం పూర్వమాననమ్ | దక్షిణోత్తరపార్శ్వే ద్వే శిర అస్యమనుక్రమాత్. 21
పీతః శ్యామశ్చకపిలో మరకతో7గ్ని సన్నిభః | రుక్మవిద్యుద్దూమ్ర కృష్ణరక్తగౌరేంద్రనీలభాః. 22
స్ఫాటిక స్వర్ణపాండ్యాభాః పద్మరాగో7ఖిలద్యుతిః | హేమద్ధూమ్ర రక్తనీల రక్తకృష్ణసువర్ణభాః. 23
శుక్లకృష్ణ పలాశాభా గాయత్ర్యా వర్ణకాః క్రమాత్ | ధ్యానకాలే పాపహరా హుతైషా సర్వకామదా. 24
గాయత్ర్యాతు తిలైర్హోమః సర్వపాపప్రణాశనః | శాంతికామో యవైః కుర్యాదాయుష్కామోఘృతేనచ. 25
సిద్ధార్థకైః కర్మసిద్ధ్యై పయసా బ్రహ్మవర్చసే | పుత్రకామస్తథా దధ్నా ధ్యానకామస్తు శాలిభిః. 26
క్షీరివృక్షసమిద్భిస్తు గ్రహపీడోపశాంతయే | ధనకామస్తథా బిల్వైః శ్రీకామః కమలైస్తథా. 27
ఆరోగ్యకామో దూర్వాభిర్ గురూత్పాతే సఏవహి | సౌభాగ్యేచ్ఛుర్గులునా విద్యార్థీ పాయసేవ చ. 28
అయుతే నోక్తసిర్ధిః స్యాల్లక్షేణ మనసేప్సితమ్ | కోట్యా బ్రహ్మవధాన్యుక్తః కులోద్ధారీ హరిర్భవేత్. 29
గ్రహయజ్ఞముఖోవాపి హోమో7యుతముఖో7ర్ధకృత్ |
ఆవాహనం చ గాయత్ర్యాస్తత ఓంకారమభ్యసేత్. 30
గాయత్రీమంత్రమునంరలి ఒక్కొక్క అక్షరమును క్రింద చెప్పిన అవయవములపై వరుసగా న్యాసము చేయవలెను-రెండు పాదాంగుష్ఠములు, రెండు మడమలు, రెండుపిక్కలు, మోకాళ్లు, తొడలు, ఉపస్థ, వృషణములు, కటిభాగము, నాభి. ఉదరము, స్తన మండలము, హృదయము, కంఠము, అధరోష్ఠము, తాలు, నాసిక, నేత్రములు, కనుబొమ్మల మధ్య భాగము, లలాటము, ఉత్తరోష్ఠము, దక్షిణపార్శ్వము, ఉత్తరపార్శ్వము, శిరస్సు, సంపూర్ణముఖ మండలము. ఇరువదినాలుగు గాయత్ర్యక్షరముల రంగులు వరుసగా -పీత-శ్యామ-కపిల-మరకతమణిసదృశ - అగ్నితుల్య, స్వర్ణతుల్య - విద్యుత్ర్పభ -ధూమ్ర - కృష్ణ - రక్త - గౌర - ఇంద్రనీల మణిసదృశ - స్ఫటికమణితుల్య - స్వర్ణతుల్య - పాండు -పుష్పరాగతుల్య - అఖిలద్యుతి - హేమాభధూమ్ర - రక్తనీల - రక్తకృష్ణ - సువర్ణాభ - శుక్ల - కృష్ణ - పలాశవర్ణములై యుండును. గాయత్రిని ధ్యానము చేసినచో ఆ దేవి ధ్యానించు వానిపాపములను తొలగించును. హోమము చేసినచో అభీష్టముల నిచ్చును. గాయత్రీ మంత్రముతో తిలహోమము చేసినచో సకలపాపములు నశించును. శాంతికోరువాడు యవలను, దీర్ఘాయుర్దాయము కోరువాడు ఘృతమును హోమము చేయవలెను. కర్మసిద్ధి కోరువాడు ఆవాలను, బ్రహ్మతేజస్సు కోరువాడు క్షీరమును, పుత్రులను కోరువాడు పెరుగును అధికధాన్యము కోరువాడు శాలితండులములు హోమము చేయవలెను. గ్రహపీడాశాంతికై ఖదిరవృక్ష సమిధలను, ధనముకొరకు బిల్వపత్రములను, లక్ష్మి కొరకు కమలములను, ఆరోగ్యముకొరకు మహోత్పాత శాంతి కొరకును దూర్వలను, సౌభాగ్యముకొరకు గుగ్గులును, విద్యకొరకు పాయసమును హోమము చేయవలెను. పదివేల హోముమలచే పూర్వోక్త ఫలములు లభించును. ఒక లక్ష హోమములచే మనోభిలషితములగు వస్తువు లన్నియు లభించును. ఒకకోటి ఆహుతులు చేసినవాడు బ్రహ్మహత్యాపాపవిముక్తుడై, తన కులము నుద్ధరించి, శ్రీ మహావిష్ణు స్వరూపుడగును. గ్రహశాంతికై చేయు యజ్ఞములలో కూడ గాయత్రీ మంత్రముచే పదివేల హోమములు చేసినచో అభీష్టసిద్ధి కలుగును.
స్మృత్వౌఙ్కారం తు గాయత్ర్యా నిబధ్నీయాచ్ఛిఖాంతతః |
పునరాచమ్య హృదయం నాభిం, స్కంధౌచ సంస్ఫృశేత్. 31
ప్రణవస్య ఋషిర్బ్రహ్మా గాయత్రీచ్ఛందఏవచ | దేవో7గ్నిః పరమాత్మా స్యాద్యోగోవై సర్వకర్మసు. 32
శుక్లా చాగ్నిముఖీ దివ్యా కాత్యాయన సగోత్రజా | త్రైలోక్యవరదా దివ్యా పృథివ్యాధార సంయుతా.
అక్షసూత్రధరా దేవీ పద్మాసన గతాశుభా. 33
ఓం తేజో7సి మహో7సి, బలమసి, భ్రాజో7సి, దేవానాం ధామనామాసి, విశ్వమసి, విశ్వాయుః, సర్వమసి, సర్వాయుః ఓం అభిభూః.
ఆగచ్ఛ వరదే దేవి జప్యేమే సన్నిధౌభవ. 34
వ్యాహృతీనాంతు సర్వాసామృషిరేవ ప్రజాపతిః | వ్యస్తాశ్చైవ సమస్తాశ్చ బ్రాహ్మమక్షరమామితి. 35
విశ్వామిత్రో జమదగ్నిర్భరద్వాజో7థ గౌతమః | ఋషిరత్రిర్వశిష్ఠశ్చ కాశ్యపశ్చయథాక్రమమ్. 36
అగ్నిర్వాయూ రవిశ్చైవ వాక్పతిర్వరుణస్తథా | ఇంద్రో విష్ణుర్‌వ్యాహృతీనాం దైవతాని యథాక్రమమ్. 37
గాయత్ర్యుష్ణిగనుష్టుప్ చ బృహతీపఙ్తిరేవచ | త్రిష్టుప్ చ జగతీచేతి ఛందాంస్యాహురనుక్రమాత్. 38
వినియోగో వ్యాహృతీనాం ప్రాణాయామేచ హోమకే | అపోహిష్ఠేత్యృచా చాపాం ద్రుపదాదీతివాస్మ్భతా. 39
తథా హిరణ్యవర్ణాభిః పావమానీభిరన్తతః | విప్రుషోష్టౌ క్షిపేదూర్ధ్వమాజన్మకృతపాపజిత్. 40
అంతర్జలే ఋతఞ్చేతి జపేత్త్రిరఘమర్షణమ్ | ఆపోహిష్ఠేతిత్యృచన్య సింధుద్వీపృషిస్మృతః. 41
బ్రాహ్మస్నానాయ ఛందో7స్య గాయత్రీదేవతా జలమ్ | మార్జనే వినియోగో7స్య హయావభృథకే క్రతోః.
అఘమర్షణ సూక్తస్య ఋషిరేవాఘమర్షణః | అనుష్టుప్ చ భ##వేచ్ఛందో భావవృత్తస్తు దైవతమ్. 43
ఆపోజ్యోతీ రస ఇతి గాయత్ర్యాస్తు శిరః స్మృతమ్ | ఋషిః ప్రజాపతిస్తన్య ఛందోహీనం యజుర్యతః. 44
బ్రహ్మాగ్నివాయుసూర్యాశ్చ దేవతాః పరికీర్తితాః | ప్రాణరోధాత్తు వాయుః స్యాద్వాయోరగ్నిశ్చ జాయతే. 45
ఆగ్నేరావస్తతః శుద్ధిస్తతశ్చాచమనం చరేత్ | అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు. 46
తపోయజ్ఞవషట్‌కార ఆపోజ్యోతి రసో7మృతమ్ | ఉదుత్యం జాతవేదసమృషిః ప్రష్కణ్వ ఉచ్యతే. 46
గాయత్రీచ్ఛంద ఆఖ్యాతం సూర్యశ్చైవ తు దైవతమ్ | అతిరాత్రేనియోగః స్యాదగ్నీషోమో నియోగకః. 48
చిత్రం దేవేతి ఋచి చ ఋషిః కౌత్స ఉదాహృతః | త్రిష్టుప్ ఛందో దైవతం చ సూర్యో7స్యాః పరికీర్తితమ్.
ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే సంధ్యావిధిర్నామ పంచదశా7ధిక ద్విశతతమోధ్యాయః.
గాయత్రిని ఆవాహనము చేసి ఓంకారమును ఉచ్చరించవలెను. గాయత్రీ మంత్ర సహితమగు ఓంకార ముచ్చరించుచు శిఖనుబంధించి, ఆచమనము చేసి హృదయ-నాభి-భుజద్వయములను స్పృశించవలెను. ప్రణవమునకు ఋషి బ్రహ్మ. గాయత్రి ఛందస్సు. అగ్ని లేదా పరమాత్మదేవత. సర్వకర్మ ప్రారంభమునందును దీనిని ప్రయోగించవలెను ''శుక్లా-శుభా'' అను (మూలోక్త) మంత్రముచే గాయత్రిని ధ్యానించి-''ఓంతేజో7సి....... తతః స్మృతా'' అను (మూలోక్త) మంత్రముచే ఆవాహన చేయవలెను. సమస్తవ్యాహృతులకును ఋషి ప్రజాపతి. అవన్నియు వ్యష్టిసమష్టి రూపములతో పరబ్రహ్మరూపమగు ఓంకారములో ఉన్నవి. సప్తవ్యాహృతులకు వరుసగా -విశ్వామిత్ర-జమదగ్ని-భరద్వాజ-గౌతమ-అత్రి- వసిష్ఠ - కశ్యపులు ఋషులు, అగ్ని - వాయు - సూర్య - బృహస్పతి - వరుణ - ఇంద్ర - విశ్వదేవులు దేవతలు. గాయత్రీ - ఉష్ణిక్ - అనుష్టుప్ - బృహతీ - పంక్తి- త్రిష్టుప్. జగతీ అనునవి ఛందస్సులు. ఈ వ్యాహృతులు ప్రాణాపాయ హోమములందు వినియోగింపబడును. ''అపోషిష్ఠామయోభువః..... జనయథాచనః '' అను మూడు ఋక్కులను, ''ద్రుపదాదివ ...... ముముచానః'' ''హిరణ్యవర్ణాఃశుచయః'' ఇత్యాది పవమాన ఋక్కులను పఠించుచు ఎనిమిది పర్యాయములు జపించవలెను. ''అపోహిష్ఠా'' ఇత్యాది ఋక్త్రయమునకు ఋషి సింధుద్వీపుడు. ఛందస్సు గాయత్రి. దేవత జలము. బ్రాహ్మస్నానమునకై మార్జనమునందు ఇది వినియోగింపబడును. అఘమర్షణసూక్తమునకు ఋషి అఘమర్షణుడు. ఛందస్సు అనుష్టుప్. దేవత భావవృత్తుడు. పాపనిస్సారణమునందు వినియోగము. ''ఓం అపోజ్యోతీరసో7మృతం బ్రహ్మభూర్భువఃసువరోమ్'' -ఇది గాయత్రీ మంత్ర శిరోభాగము. దానిఋషి ప్రజాపతి. ఇది ఛందోరహితమైన యజుర్వేద మంత్రము. ఏలననగా యజుర్వేదము ఛందోబద్ధము కాదు. శిరోమంత్రమునకు దేవతలు బ్రహ్మ - అగ్ని- వాయు - సూర్యులు. ప్రాణాయామము నుండి వాయువు. వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము ఉత్పన్నమైనవి. ఈ జలమువలన శుద్ధి కలుగును. అందుచే ''అన్తశ్చరసిభూతుషు.......రసో7మృతమ్'' అను (మూలోక్త) మంత్రముతో ఆచమనము చేయవలెను. ''ఉదుత్యం జాతవేదసమ్'' అను మంత్రమునకు ప్రస్కణ్వఋషి. ఛందస్సు గాయత్రి. దేవత సూర్యుడు. దీనికి అతిరాత్ర - అగ్నిష్టోమములందు వినియోగము. ''చిత్రందేవానామ్'' అను మంత్రమునకు ఋషికౌత్సుడు. ఛందస్సుత్రిష్టువ్. ధేవతసూర్యుడు. సూర్యోపస్థానమునందు వినియోగము.
అగ్ని మహాపురాణమునందు సంధ్యావిధి వర్ణన మను రెండు వందల పదునైదవ అధ్యాయము సమాప్తము.