Sri Madagni Mahapuranamu-2 Chapters Last Page
అథ షోడశాధిక ద్విశతతమో7ధ్యాయః
అథ గాయత్రీ నిర్వాణమ్
అగ్ని రువాచ :
ఏవం సంధ్యావిధింకృత్వా గాయత్రీం చ జపేత్స్మరేత్|
గాయత్ర్ఛిష్యాన్యతస్త్రాయేద్భార్యాం ప్రాణాంస్తథైవ చ. 1
తతః స్మృతేయం గాయత్రీ సావిత్రీయం తతోయతః | ప్రకాశనాత్సా సవితుర్వాగ్రూపత్వాత్సరస్వతీ. 2
తజ్జ్యోతిః పరమం బ్రహ్మ భర్గస్తేజోయతఃస్మృతమ్ | భా దీప్తావితి రూపం హి భ్రస్జ పాకే7థ తత్స్మృతమ్.
ఓషధ్యాదికం పచతి భ్రాజృ దీప్తౌ తథా భ##వేత్ | భర్గః స్యాద్బ్రాజత ఇతి బహులం ఛంద ఈరితమ్. 4
వరేణ్యం సర్వతేజోభ్యః శ్రేష్ఠం వై పరమం పదమ్ | స్వర్గాపవర్గకామైర్వా వరణీయం సదైవ హి. 5
వృణోతేర్వరణార్థత్వాజ్జాగ్రత్స్వప్నాది వర్జితమ్ | నిత్యశుద్ధ బుద్ధమేకం సత్యం తం ధీమహీశ్వరమ్. 6
ఆహం బ్రహ్మపరం జ్యోతిర్ధ్యాయేమహి విముక్తయే | తజ్జ్యోతిర్భగవాన్విష్ణుర్జగజ్జన్మాది కారణమ్. 7
శివం కేచిత్పఠంతిస్మ శక్తిరూపం పఠంతి చ | కేచిత్సూర్యం కేచిదగ్నిం వేదగా అగ్నిహోత్రిణః. 8
ఆగ్న్యాదిరూపే విష్ణుర్హి వేదాదౌబ్రహ్మగీయతే | తత్పదం పరం విష్ణోర్దేవస్య సవితుః స్మృతమ్. 9
మహదాజ్యం సూయతే హి స్వయం జ్యోతిర్హరిః ప్రభుః |
పర్జన్యో వాయురాదిత్యః శీతోష్ణాద్యైశ్చ పాచయేత్. 10
అగ్నౌ ప్రాస్తాహుతిః సమ్యగాదిత్యముపతిష్ఠతే | ఆదిత్యాజ్జాయతే వృష్టిర్‌వృష్ణేరన్నం తతః ప్రజాః. 11
దధాతేర్వా ధీమహీతి మనసా ధారయేమహి | నో7స్మాకం యశ్చభర్గశ్చ సర్వేషాం ప్రాణినాంధియః. 12
చోదయాత్ర్పేరయేద్బుద్ధీర్భోక్తౄణాం సర్వకర్మసు | దృష్టాదృష్టవిపాకేషు విష్ణు సూర్యాగ్ని రూపవాన్. 13
ఈశ్వర ప్రేరితో గచ్ఛేత్స్వర్గం వా శ్వభ్రమేవ వా | ఈశావాస్యమిదం సర్వం మహదాది జగద్ధరిః. 14
స్వర్గాద్యైః క్రీడతే దేవో యో7హం స పురుషః ప్రభుః |
ఆదిత్యాన్తర్గతం యచ్చ భర్గాఖ్యం వై ముముక్షుభిః. 15
జన్మమృత్యు వినాశాయ దుఃఖస్య త్రివిధస్యచ | ధ్యానేన పురుషో7యంచ ద్రష్టవ్యః సూర్యమండలే. 16
తత్త్వం సదపి చిద్ర్బహ్మ విష్ణోర్యత్పరమం పదమ్ | దేవస్య సవితుర్భర్గో వరేణ్యం హి తురీయకమ్. 17
దేహాది జాగ్రదాబ్రహ్మ అహం బ్రహ్మేతి ధీమహి | యో7సావాదిత్యపురుషః సో7సావహమనన్త ఓమ్.
జ్ఞానాని శుభకర్మాదీన్ర్పవర్తయతి యః సదా. 18
ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే గాయత్రీ నిర్వాణం నామ షోడశాధిక ద్విశతతమోధ్యాయః.
అగ్నిదేవుడు చెప్పెను : ఈ విధముగ సంధ్యావందనమాచరించి గాయత్రీధ్యాన జపములు చేయవలెను. తనను గానముచేయు సాధకుని శరీరప్రాణములను రక్షించునదిగాన 'గాయత్రి' అను పేర వచ్చనది. ఆది సవిత (సూర్యుడు) నుండి ఆవిర్భవించినది గాన ''సావిత్రి'' యైనది. వాక్స్వరూపమగుటచే ''సరస్వతి'' అని ప్రసిద్ధి కూడ వచ్చినది. ''తత్'' అనగా జ్యోతిఃస్వరూపమగు పరబ్రహ్మ. ''భర్గః'' అనగా తేజస్సు. దీప్తి అను అర్థముగల ''భా'' ధాతువునుండి ''భర్గః'' శబ్దము నిష్పన్న మైనది. ''భాతీతిభర్గ'' అని దీని వ్యుత్పత్త్యర్థము. లేదా ''భ్రస్జ-పాకే'' అను పాకముచేయుట అను అర్థముకల భ్రస్జధాతువునుండి కూడ ''భర్గః'' శబ్దము నిష్పన్నమగును. ఏలనన సూర్యుడు ఓషధ్యాదులను పక్వము చేయునుగదా? ''భ్రాజృ'' అను ధాతువునకు కూడ ప్రకాశించుట అని అర్థము. కావున ''భ్రాజతే ఇతిభర్గః'' అను వ్యుత్పత్తి ననుసరించి భ్రాజధాతువునుండి గూడ ''భర్గః'' శబ్దము నిష్నన్నమగును. ''బహులం ఛన్దసి'' అను వ్యాకరణ సూత్రానుసారము ఈ పదము పైన చెప్పిన ఏ ధాతువునుండి యైనను నిష్పన్నము కావచ్చును. ''వరేణ్య'' శబ్దమునకు ''సంపూర్ణతేజస్సుతో శ్రేష్ఠమైన పరమపద స్వరూపము'' అని అర్థము. లేదా స్వర్గమోక్షములను కోరువారిచే సర్వదా వరింపబడుటచే ''వరేణ్యము''. ''వృఞ్'' ధాతువునకు వరించుట అని అర్థము. ''ధీమహి'' అనుపదమునకు- ''జాగ్రత్స్వప్న సుషుప్త్యాద్యవస్థాతీతము, నిత్యము, శుద్ధము, బుద్ధము, ఏకమాత్రము, సత్యము, జ్యోతిఃస్వరూపము అగు పరబ్రహ్మను ముక్తికొరకై ధ్యానించుచున్నాము'' అని అర్థము. జగత్సృష్ట్యాది కారణభూతుడగు శ్రీమహావిష్ణువే అపరజ్యోతి. అపరజ్యోతి శివుడని కొందరు, శక్తిఅని కొందరు, సూర్యుడని కొందరు, అగ్నియని వేదజ్ఞులైన అగ్నిహోత్రులు చెప్పుదురు. వాస్తవమున అగ్న్యాదిరూపమున నున్న విష్ణువే వేదవేదాంగములందు బ్రహ్మయని చెప్పబడినాడు. అందుచే ''దేవస్య సవితుః'' అనగా జగదుత్పాదకుడగు శ్రీమహావిష్ణువే. అతడే పరమపదము. స్వయంజ్యోతిఃస్వరూపుడగు శ్రీమహావిష్ణువు మహత్తత్త్వాదికములను సృష్టించుచున్నాడు. పర్జన్య - వాయు - ఆదిత్యులద్వారా, శీతగ్రీష్మాది ఋతువులద్వారా అన్నము పోషించుచున్నాడు. యథావిధిగ అగ్నిలో సమర్పింపబడిన ఆహుతి సూర్యునివలన వర్షము వర్షమువలన అన్నము కలుగును. అన్నమువలన ప్రజలు ఉత్పన్నులగుదురు. ''ధీమహి'' అను పదము ''డు-ధాఞ్'' అను ధాతువునుండి కూడ నిష్పన్నమగును. అందుచే ''మేము ఆతేజస్సును మనస్సుతో ధారణ చేయుచున్నాము'' అని కూడ అర్థము చెప్పవచ్చును. యః = పరమాత్ముడైన యే విష్ణువు యొక్క తేజము, నః = మనల అందరియొక్క, ధియః = బుద్ధివృత్తులను, ప్రచోదయాత్ = ప్రేరేపించునో, కర్మఫలములను అనుభవించు సకల ప్రాణుల ప్రత్యక్ష - అప్రత్యక్ష పరిణామహేతువులగు సమస్త కర్మలందును విష్ణు- సూర్య- అగ్నిరూపమున ఉనాడు. ఈశ్వర ప్రేరణానుసారమే ప్రాణులు శుభాశుభ కర్మలను చేసి స్వర్గనరకములకు పోవుచున్నారు. మహత్తత్త్వాది రూపములతో శ్రీమహావిష్ణువుచే నిర్మిత మగు ఈ జగత్తు అంతయు ఈశ్వరుని నివాసస్థానము. సర్వసమర్థుడు, హంసస్వరూపుడు అగు ఆ పరమపుషుడు స్వర్గాదిలోకముల క్రీడించుచుండును గాన ''దేవుడు'' అని చెప్పబడుచున్నాడు. భర్గమను పేరుతో ప్రసిద్ధమైన ఆదిత్యగతమగు దివ్యతేజమే ఆతని స్వరూపము మోక్షము కోరువారు జన్మ మరణములనుండియు, అధ్యాత్మిక - ఆధిదైవిక - ఆదిభౌతికములను త్రివిధదుఃఖములనుండియు విముక్తిపొందుటకై ధ్యానముచే, సూర్యమండలమునందున్న ఈ పరమపురుషునే చూడవలెను. ''తత్త్వమసి '' మొదలగు మహావాక్యములచే ప్రతిపాదింపబడిన సచ్చిత్స్వరూప పరబ్రహ్మము అదియే. సర్వలోకనిర్మాతమైన సవితృదేవుని సర్వవరణీయ మైన భర్గమే శ్రీమహావిష్ణుపదము. అదియే గాయత్రియొక్క బ్రహ్మ రూపమగు చతుర్థపాదము. ''జాగ్రదవస్థకు సంబంధించిన దేహాదిబ్రహ్మపర్యంతము నేనే''అని ధ్యానింతుము. ఆదిత్యునిలో ఉన్న పరమపురుషుడు నేనే. అనంతరూపమగు ఓంకారము నేనే. ఈ ఆదిత్యపురుషుడే జ్ఞానములను శుభకర్మాదులను సర్వదా ప్రవర్తింపచేయుచున్నాడు.
శ్రీమదగ్నిమహాపురాణమునందు గాయత్రీనిర్వాణ మను రెండువందలపదునారవ అధ్యాయము సమాప్తము.